వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥చతుర్థః సర్గః॥ [4 - కుశలవుల రామాయణ గానము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాప్తరాజ్యస్య రామస్య
  వాల్మీకి ర్భగవానృషిః ।
చకార చరితం కృత్స్నం
  విచిత్రపద మాత్మవాన్ ॥

టీకా:

ప్రాప్త = ప్రాప్తించిన; రాజ్య = రాజ్యము; అస్య = కల; రామ = రాముని; అస్య = యొక్క; వాల్మీకిః = వాల్మీకి; భగవాన్ = మహత్మ్యము కలవాడును; ఋషిః = జ్ఞానాధికుడు, విద్వాంసుడు, శాస్త్ర కావ్యాదులు సృష్టించువాడు, మంత్రద్రష్ట; చకార = రచించెను; చరితం = చరిత్రమును; కృత్స్నమ్ = సమస్తమైన; విచిత్ర = ఆశ్చర్య జనకము లైన, బాగుగా చిత్రించిన, అందమైన; పదమ్ = పదములతో; ఆత్మ వాన్ = బుద్ధి శాలి అయిన

భావము:

భగవంతుడు, కావ్యరచన చేయు ఋషియు, బహుబుద్ధిశాలియు నైన వాల్మీకి, శ్రీరాముడు రాజ్యము పొందిన పిదప ఆయన రాముని చరితము మొత్తము చక్కటి పదములతో రచించెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చతుర్వింశ త్సహస్రాణి
  శ్లోకానాముక్తవా నృషిః ।
తథా సర్గశతాన్ పంచ
  షట్కాండాని తథోత్తరమ్ ॥

టీకా:

చతుర్వింశత్ సహస్రాణి = ఇరవై నాలుగు వేల; శ్లోకానామ్ = శ్లోకములను; ఉక్తవాన్ = చెప్పెను; ఋషిః = వాల్మీకి మహర్షి; తథా = మఱియు; సర్గ = సర్గల; శతాన్ = వందలు; పంచ = ఐదు; షట్ = ఆరు; కాండాని = కాండలను; తథా = మరియు; ఉత్తరమ్ = ఉత్తర కాండను.

భావము:

వాల్మీకి మహర్షి రామాయణమును ఇరువది నాలుగు వేల శ్లోకములతో ‘ఐదువందల సర్గలుగా’, ఆరు కాండములు మఱియు ఉత్తర కాండము మొత్తము ఏడు కాండలలో రచించెను.
*గమనిక:-   ప్రస్తుతం లభ్యమగుచున్న పాఠ్యములలో సర్గల సంఖ్య 647 {బాల కాండ: 77; అయోధ్య కాండ: 119; అరణ్య కాండ: 75; కిష్కింధ కాండ: 67; సుందర కాండ: 68; యుద్ధ కాండ: 131; ఉత్తర కాండ: 110; మొత్తం ఏడు కాండలు: 647.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృత్వాపి తన్మహాప్రాజ్ఞః
  సభవిష్యం సహోత్తరమ్ ।
చింతయామాస "కో న్వేతత్
  ప్రయుంజీయాదితి ప్రభుః" ॥

టీకా:

కృత్వ = రచించి; అపి = కూడా; తత్ = ఆ; మహా = గొప్ప; ప్రాఙ్ఞః = జ్ఞాని అయిన; స = కూడి ఉన్న; భవిష్యమ్ = భవిష్యత్తుకలది; సహ = సహితమైన; ఉత్తరం = ఉత్తర కాండ, పట్టాభిషేక అనంతర కథ; చింతయామాస = ఆలోచించెను; కః = ఎవడు; ను = నిజముగా; ఏతత్ = దీనిని; ప్రయుంగియాత్ = ప్రయోగించును; ఇతి = అని; ప్రభుః = సమర్థుడైన వాల్మీకి.

భావము:

గొప్ప ప్రజ్ఞాశాలి; సమర్థుడు అయిన వాల్మీకి పట్టాభిషేకానంతరకథ ఐన ఉత్తరాకాండ రచించిన పిమ్మట దీనిని యుక్తమైన రీతిలో పఠించగలవారు ఎవరు ఉన్నారని యోచించెను.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య చింతయమానస్య
  మహర్షే ర్భావితాత్మనః ।
అగృహ్ణీతాం తతః పాదౌ
  మునివేషౌ కుశీలవౌ ॥

టీకా:

తస్య = ఆ; చింతయమానస్య = ఆలోచించుచున్న; మహర్షేః = మహర్షి; భావిత = భావించుచున్న; ఆత్మనః = మనసున; అగృహ్ణీతాం = గ్రహించిరి; తతః = అటుపిమ్మట; పాదౌ = పాదద్వయములను; ముని = మునుల; వేషౌ = వేషధారులిద్దరు; కుశీలవౌ = కుశలవులు ఇద్దరు.

భావము:

అంతట మనసులో ఆలోచించుకుంటున్న వాల్మీకి పాదములకు ముని వేషధారులైన కుశలవులు ప్రణామములు చేసిరి.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుశీలవౌ తు ధర్మజ్ఞౌ
  రాజపుత్రౌ యశస్వినౌ ।
భ్రాతరౌ స్వరసంపన్నౌ
  దద ర్శాశ్రమవాసినౌ ॥

టీకా:

కుశీలవౌ = కుశలవులు ఇద్దరను; తు; ధర్మజ్ఞౌ = ధర్మము తెలిసినవారును; రాజపుత్రౌ = రాకుమారులును; యశస్వినౌ = కీర్తిమంతులను; భ్రాతరౌ = అన్నదమ్ములిద్దరిని; స్వర = సుస్వరము; సంపన్నౌ = బాగా ఉన్నవారిని; దదర్శః = చూచెను; ఆశ్రమవాసినౌ = ఆశ్రమములో నివసించువారిని.

భావము:

ఆ వాల్మీకి మహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు,తన ఆశ్రమవాసులు, సుస్వర సంపన్నత కలవారు ఐన కుశలవులను చూసెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స తు మేధావినౌ దృష్ట్వా
  వేదేషు పరినిష్ఠితౌ ।
వేదోపబృంహ ణార్థాయ
  తావగ్రాహయత ప్రభుః ॥

టీకా:

సః = ఆ వాల్మీకి; తు = వారిని; మేధావినౌ = మేధావులను; దృష్ట్వా = చూచి; వేదేషు = వేదములలో; పరినిష్ఠితౌ = దృఢజ్ఞానము కలవారిని; వేదః = వేదములను; ఉపబృంహణ = పరిపుష్టము; అర్థాయ = చేయుటకై; తౌ = వారిచే; అగ్రాహయత = గ్రహింపజేసెను రామాయణమును; ప్రభుః = ప్రభావశాలి యైన వాల్మీకి.

భావము:

ప్రభావశాలి ఐన వాల్మీకి సాంగోపాంగంగా వేదాధ్యయనము చేసిన ఆ కుశలవులకు వేదార్థము పరిపుష్ఠము ఒనరించుటకు రామాయణమును ఉపదేశించెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావ్యం రామాయణం కృత్స్నం
  సీతాయాశ్చరితం మహత్ ।
పౌలస్త్యవధ మిత్యేవ
  చకార చరితవ్రతః ॥

టీకా:

కావ్యం = కావ్యమును; రామాః = రాముని; అయణమ్ = పోక; కృత్స్నమ్ = సమస్త మైన; సీతాయాః = సీత యొక్క; చరితం = చరితము; మహత్ = గొప్పదైన; పౌలస్త్య = పులస్యబ్రహ్మ వంశస్థుడు, రావణుని యొక్క; వధం = సంహారము; ఇత్యేవ = అనునట్టి పేర్లతో; చకార = రచించెను; చరిత = ఆచరించిన; వ్రతః = ఉత్తమ వ్రతములు కల వాడు.

భావము:

ఉత్తమ వ్రతధారి ఐనట్టి వాల్మీకి ఆ మొత్తం కావ్యమును ‘రామాయణము’, ‘సీతాయాశ్చరితము’, ‘పౌలస్త్యవధము’ అను పేర్లతో రచించెను.
*గమనిక:-  *- 1. బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు- పులస్త్యుఁడు / పులస్త్యబ్రహ్మ, భార్య కర్దమ ప్రజాపతి కూతురు అగు హవిర్భుక్కు నందు కొడుకులు ఇద్దరు- అగస్త్యుఁడును విశ్రవస్సును. 2. విశ్రవసుఁడు- భార్యలు నలుగురు. మొదటిభార్య తృణబిందువు కూఁతురు అగు ఇలబిల యందు కుబేరుఁడు పుట్టెను. రెండవభార్య సుమాలి కూఁతురు అగు కైకసి యందు కొడుకులు ముగ్గురు- రావణ కుంభకర్ణ విభీషణులు పుట్టిరి. మూఁడవ భార్య కైకసిచెల్లెలు అగు పుష్పోత్కట. దానియందు మహోదరమహాపార్శ్వాదులు జనించిరి. నాలవభార్య కైకసి రెండవచెల్లెలు అగు రాక. ఆపె ఖర దూషణ త్రిశిరులను కనెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాఠ్యే గేయే చ మధురం
  ప్రమాణైస్త్రిభి రన్వితమ్ ।
జాతిభిః సప్తభిర్బద్ధం
  తంత్రీలయ సమన్వితమ్ ॥

టీకా:

పాఠ్యే = పఠించుటకును; గేయే = గానము చేయుటకును; చ = కూడా; మధురమ్ = మధురమైనదై; ప్రమాణైః = సంగీతంలోని ప్రమాణములు / కాలములు; త్రి = మూటితో; భి = సహితంగా; అన్వితమ్ = కూడినదై; జాతిభిః = స్వరజాతులతో; భి = సహితము, కూడ; బద్ధమ్ = కూర్చబడినదై; తంత్రీ = తంత్రీ వాయిద్యముల; లయ = లయబద్దత; సమన్వితమ్ = కూడినదై {తంత్రీలయ సమన్వితము అంటే శృతితో కలపగలది}.

భావము:

ఆ రామాయణ కావ్యము పఠించుటకు, గానము చేయుటకు ఎంతో మధురముగా ఉంన్నది. అంతే కాక సంగీత విశేషములైన దృత, మధ్యమ, విలంబిత మూడు ప్రమాణములు కలది. ఇంకా సరిగమపనిస అను సప్త స్వరములకు అనుగుణమైనది. మఱియు తంత్రీ వాయిద్యములపై లయ బద్ధముగా పాడుటకు అనువుగా కూడ ఉన్నది.
*గమనిక:-   సంగీత శాస్త్రములో 1) ప్రమాణములు / మూడు కాలములు : త్రికాలము : ప్రథమ, ద్వితీయ, తృతీయ / విళంబిత, మధ్య, దృత; 2) మూడు స్థాయిలు : స్థాయి : త్రిస్థాయిలు : మంద్ర, మధ్య, తార; 3) మూడు తాళాంగములు : తాళాంగములు : : అనుద్రుతము (అరసున్న ‘ఁ’), ద్రుతము (సున్న ‘ం), లఘువు (నిలువు గీత ‘।’); ఇందు లఘువునందు మాత్రము జాతి భేదములు ఉన్నవి, అవి త్రిశ్ర జాతి 13; చతురశ్ర జాతి 14; ఖండజాతి 15; మిశ్రజాతి 17; సంకీర్ణ 19;

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రసైః శృంగారకారుణ్య
  హాస్య వీర భయానకైః ।
రౌద్రాదిభిశ్చ సంయుక్తం
  కావ్యమే తదగాయతామ్ ॥

టీకా:

రసైః = రసములతోడను; శృంగార = శృంగారము; కారుణ్య = కరుణ; హాస్య = హాస్యము; వీర = వీర; భయానకైః = భయానకములు; రౌద్రాదిభిః = రౌద్రము; భిః = తో కూడా; చ; సంయుక్తమ్ = కూడిన; కావ్యమ్ = కావ్యమును; ఏతత్ = ఈ; అగాయతామ్ = గానము చేసిరి.

భావము:

1. శృంగార, 2. కారుణ్య, 3. హాస్య, 4. వీర, 5. భయానక, 6. రౌద్రరసములతో కూడినదియును అగు ఆ రామాయణము అనే కావ్యమును లవకుశులు గానము చేసిరి.
*గమనిక:-   ఈ శ్లోకములో నవరసములు తొమ్మిదిలోని అద్భుతం. భీభత్సం, శాంతం చెప్పబడలేదు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తౌ తు గాంధర్వతత్త్వజ్ఞౌ
  మూర్చ నాస్థానకోవిదౌ ।
భ్రాతరౌ స్వరసంపన్నౌ
  గంధర్వావివ రూపిణౌ ॥

టీకా:

తౌ = వారు లవకుశులు; తు = విశేషముగ; గాంధర్వ = గాంధర్వ విద్య, సంగీతము; తత్త్వజ్ఞౌ = శాస్త్రము తెలిసిన వారు; మూర్చనా = స్వర మూర్ఛనల యొక్క; స్థాన = స్థానములు {స్వరముల ఉనికి}; కోవిదౌ = తెలిసిన వారును; భ్రాతరౌ = ఆ సోదరులు ఇరువుకు; స్వర = స్వరజ్ఞానము; సంపన్నౌ = సమృద్ధిగా కలవారు; గంధర్వః = గంధర్వులు; ఇవ = వలె; రూపిణౌ = నిరూపణ చేయగలవారు.

భావము:

ఆ లవకుశులు చక్కని సంగీత శాస్త్రజ్ఞానము, స్వరసంపన్నత, మూర్ఛనా స్వర స్థానముల వంటి సంగీత విశేష సామర్ధ్యములు దండిగా కలిగినవారు; వాటిని గంధర్వుల వలె కనబరచు నేర్పు కలవారు.
*గమనిక:-   మూర్చన - క్రమముగ సప్తస్వరముల ఆరోహణ అవరోహణములు; స్వరజ్ఞానము - పాడిన రాగమము స్వరపరచగలుగుట, వ్రాసిన రాగము పాడగలుగుట; రూపణ - నిరూపించుట, కనబరచుట.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూపలక్షణ సంపన్నౌ
  మధురస్వర భాషిణౌ ।
బింబాదివోత్థితౌ బింబౌ
  రామదేహా త్తథా పరౌ ॥

టీకా:

రూప = ఉత్తమ రూప; లక్షణ = ఉత్తమ లక్షణములు; సంపన్నౌ = సమృద్ధిగా కలిగిన వారు; మధుర = తీయని; స్వర = కంఠరస్వరముతో; భాషిణౌ = సంభాషించువారు; బింబాత్ = ప్రతిబింబమునుండి; ఇవ = వలె; ఉత్థితౌ = ఉత్పన్న మైన; బింబౌ = బింబములు; రామ = రాముని; దేహాత్ = శరీరము నుండి; తథా = అలా; అపరౌ = ఇతరము కానివారు,

భావము:

ఉత్తమ రూపలక్షణ సంపన్నులును; మధురస్వరముతో సంభాషించెడివారును అగు ఆ కుశలవులు ‘ఒక బింబము నుంచి విడివడిన వేఱు రెండు ప్రతిబింబములా’ అన్నట్లు శ్రీరాముని శరీరమునకు అభిన్నులై తోచుచున్నారు. *గమనిక :- {తండ్రి తానై పుత్రునిగా జన్మిస్తాడు అన్న సూత్రం ప్రకారం పుత్రుడు తండ్రి నుండి భిన్నమైన వాడు కాదు కనుక అపరుడు. పైగా కుశలవులిద్దరూ కవలలు}.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన
  ధర్మ్యమాఖ్యాన ముత్తమమ్ ।
వాచోవిధేయం తత్సర్వం
  కృత్వా కావ్యమనిందితౌ ॥

టీకా:

తౌ = వారు; రాజపుత్రౌ = రాకుమారులు; కార్త్స్న్యేన = సంపూర్ణంముగా; ధర్మ్యమ్ = ధర్మ ప్రతిపాదకమైన; ఆఖ్యానమ్ = ఇతిహాసము; ఉత్తమమ్ = ఉత్తమము మైన దానిని; వాచః విధేయమ్ = కంఠస్థముచేసి; తత్ = దానిని; సర్వమ్ = అంతా; కృత్వా = గానము చేసిరి; కావ్యమ్ = కావ్యమును; అనిందితౌ = తప్పు పట్టుటకు వీలులేనివిధముగా.

భావము:

ఆ రాజకుమారులైన కుశలవులు ధర్మ ప్రతిపాదకమైన ఆ ఉత్తమ కావ్యమును సంపూర్ణముగా కంఠస్థము చేసికొని, దోషరహితముగా గానము చేసిరి.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషీణాం చ ద్విజాతీనామ్
  సాధూనాం చ సమాగమే ।
యథోపదేశం తత్త్వజ్ఞౌ
  జగతుస్తౌ సమాహితౌ ॥

టీకా:

ఋషీణాం = ఋషుల యొక్కయు; చ = మరియు; ద్విజాతీనామ్ = ద్విజుల యొక్కయు; సాధూనాం = సజ్జనుల యొక్కయు; చ; సమాగమే = సమావేశములందు; యథః = యథావిధముగా; ఉపదేశం = ఉపదేశించ బడినది; తత్త్వజ్ఞౌ = తత్వమును బాగుగా తెలుసుకొనిన వారై; జగతుః = గానము చేసిరి; సు = మంచి; సమాహితౌ = సావధాన చిత్తులై.

భావము:

ఆ కుశలవులు సావధాన చిత్తులై, ఆ కావ్యము యొక్క తత్వమును బాగుగా తెలిసికొని, వాల్మీకిచేత తమకు ఉపదేశింపబడిన రీతిలో ఋషులు, ద్విజులు, ఇతర సత్పురుషులు ఉన్న సమావేశములలో గానము చేసిరి.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహాత్మానౌ మహాభాగౌ
  సర్వలక్షణ లక్షితౌ ।
తౌ కదాచి త్సమేతానాం
  ఋషీణాం భావితాత్మనామ్ ॥

టీకా:

మహాత్మానౌ = మహాత్ములైన; మహా = గొప్ప; భాగౌ = భాగ్యవంతులైన; సర్వ = సమస్తమైన; లక్షణ = ఉత్తమ లక్షణములతో; లక్షితౌ = గుర్తింబడువారు; తౌ = వారు ఇద్దరు; కదాచిత్ = ఒకసారి; సమేతానాం = ఒక చోట కూడియున్న; ఋషీణాం = ఋషుల యొక్క; భావిత = పవిత్రమైన; ఆత్మనామ్ = హృదయములు గల వారిని.

భావము:

మహాబుద్ధిశాలురు; మహాభాగ్యవంతులు; సర్వ సులక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు పవిత్రహృదయులైన కొందరు మునీశ్వరులుతో ఒకనాడు సమావేశమైనారు.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆసీనానాం సమీపస్థౌ
  ఇదం కావ్యమగాయతామ్ ।
తచ్ఛ్రుత్వా మునయః సర్వే
  బాష్పపర్యాకులేక్షణాః ॥

టీకా:

ఆసీనానాం = కూర్చుని ఉన్న; సమీప = సమీపము నందు; అస్థౌ = ఉన్న వారై; ఇదం = ఈ; కావ్యమ్ = కావ్యమును; అగాయతామ్ = గానము చేసిరి; తత్ = ఆకావ్యమును; శ్రుత్వా = విని మునయః = మునులు; సర్వే = అందరు; బాష్ప = కన్నీరు; పర్యాకుల = పూర్తిగా నిండిన; ఈక్షణాః = కన్నులతో.

భావము:

వారు ఒకచోట కూర్చుని ఉండగా వారి ఎదుట కుశలవులు ఈ రామాయణ కావ్యమును గానము చేసిరి. ఆ కుశలవుల గానము విన్న మును లందరును ఆనంద బాష్పములు నిండిన కన్నులతో.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాధు సాధ్వితి తావూచుః
  పరం విస్మయమాగతాః ।
తే ప్రీతమనసః సర్వే
  మునయో ధర్మవత్సలాః ॥

టీకా:

సాధు సాధు = బాగు బాగు; ఇతి = అని; తా = వారిని; ఊచుః = పలికిరి; పరం = గొప్ప; విస్మయమ్ = ఆశ్చర్యము; ఆగతాః = కలుగుట వలన; తే = ఆ; ప్రీత = సంతసము చెందిన; మనసః = మనసుకలవారు; సర్వే = అందరు; మునయః = మునులును; ధర్మ = ధర్మమును; వత్సలాః = ఆపేక్ష కలవారు.

భావము:

కుశలవులను ‘బాగు బాగ’ని ప్రశంసించిరి, ధర్మమునందు ఆపేక్ష కలిగిన ఆ మునులందరు సంతోషించిరి.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రశశంసుః ప్రశస్తవ్యౌ
  గాయమానౌ కుశీలవౌ ।
“అహో గీతస్య మాధుర్యం
  శ్లోకానాం చ విశేషతః॥

టీకా:

ప్రశశంసుః = ప్రశంసించిరి; ప్రశస్తవ్యౌ = ప్రశంసార్హులైన; గాయమానౌ = గానము చేయుచున్న; కుశీలవౌ = కుశలవులను; అహో = ఆహా; గీతస్య = గానము యొక్క; మాధుర్యమ్ = మాధుర్యము; శ్లోకానాం = శ్లోకములను; చ; విశేషతః = విశేషమైనవి.

భావము:

ఆ కావ్యగానము చేయుచున్న ప్రశంసార్హులైన ఆ కుశలవులను పొగిడిరి. “ఆహా ! గానము మధురము. శ్లోకములు అంతకంటె విశేషమైనవి.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిరనిర్వృత్తమప్యేతత్
  ప్రత్యక్షమివ దర్శితమ్ ।
ప్రవిశ్య తావుభౌ సుష్ఠు
  తదా భావమగాయతామ్”॥

టీకా:

చిర = చాలా కాలము క్రితము; నిర్వృత్తం = జరిగినది; అపి = ఐనను; ఏతత్ = ఇది; ప్రత్యక్షం = కన్నుల కెదురుగా జరుగుచున్నది; ఇవ = అన్నట్లు; దర్శితమ్ = చూపబడినది; ప్రవిశ్య = ప్రవేశించి; తా = ఆ; ఉభౌ = ఉభయులు; సుష్ఠు = బాగుగా; తదా = ఆ; భావమ్ = భావమును; అగాయతామ్ = గానము చేసిరి.

భావము:

చాలాకాలము క్రితము జరిగినదైను ఈ గాథ కళ్ళకు కట్టినట్లుగా చూపబడినది అని మునులు కుశలవులను ప్రశంసించిరి. ఆ కుశలవులు ఇరువురును సభలో ప్రవేశించి బాగుగా భావపరి పుష్టముగా గానము చేసిరి.”

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సహితౌ మధురం రక్తం
  సంపన్నం స్వరసంపదా।
ఏవం ప్రశస్యమానౌ తౌ
  తపఃశ్లాఘ్యైర్మహాత్మభిః ॥

టీకా:

సహితౌ = ఇద్దరుకలిసి; మధురం = మధురముగా; రక్తమ్ = మనోరంజకముగా; సంపన్నం = సంపన్నముగా; స్వరసంపదా = స్వరజ్ఞతతో; ఏవమ్ = ఆవిధముగా; ప్రశస్యమానౌ = ప్రశంసించ బడుచున్నవారై; తౌ = వారు; తపః = తపస్సుచేత; శ్లాఘ్యైః = కొనియాడదగిన; మహాత్మభిః = ఆ మహాత్ములైన వారిచేత.

భావము:

కలిసిన గొంతుకలతో మధురముగా; సుస్వర సంపన్నముగా; మనోరంజకముగా మహాతపస్సుచే కొనియాడదగిన మహాత్ములు తమను అట్లు కొనియాడుచుండ కుశలవులు ఇద్దరూ ఆ కావ్యమును గానము చేసిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంరక్తతర మత్యర్థం
  మధురం తావగాయతామ్ ।
ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం
  సంస్థితః కలశం దదౌ॥

టీకా:

సంరక్తతరమ్ = అత్యంత మనోహరముగా; అత్యర్థమ్ = అతిశయించిన,; మధురం = మధురముగా; అగాయతామ్ = గానము చేసిరి; ప్రీతః = సంతసించిన వాడైన; కశ్చిత్ = ఒకానొక; మునిః = ముని పుంగవుడు; తాభ్యామ్ = వారికి; సంస్థితః = లేచినవాడై; కలశం = కలశమును; దదౌ = ఇచ్చెను.

భావము:

కలిసి అర్థాతిశయముగా మధురముగా గానము చేసిన ఆ కుశలవుల గానము విన్న ఒకానొక ముని సంతసించిన వాడై వారికి ఒక కలశమును బహుమతిగా ఇచ్చెను.
*గమనిక:-   (1) సంరక్తమ్- సంరక్తతరమ్- సంరక్తతమమ్; (2) అత్యర్థ- వ్యు. అతి+అర్థ, అతిక్రాంతం అర్థం, మించిన అర్థము; అనురూపం స్వరూపమ్, అతిశయము; కలశ- వ్యుత్పత్తి- శు = గతౌ, కల+శు+డ, కృ.ప్ర., నీటిచే ఇంపుగా ధ్వనించునది.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రసన్నో వల్కలే కశ్చిత్
  దదౌ తాభ్యాం మహాయశాః।;
అన్యః కృష్ణాజినం ప్రాదాత్
  మౌంజీమన్యో మహామునిః ॥;

టీకా:

ప్రసన్నః = ప్రసన్నుడైన; వల్కలమ్ = నారచీరలను; కశ్చిత్ = ఒకానొక; ముని; దదౌ = ఇచ్చెను; తాభ్యాం = వారికి; మహాయశాః = గొప్ప కీర్తి గలిగిన; అన్యః = మరొకరు; కృష్మాజినం = కృష్ణాజినం, నల్లజింకచర్మం; ప్రాదాత్ = ప్రసాదించారు; మౌంజీమ్ = మౌజిలను; అన్యః = ఇతర; మహామునిః = గొప్పముని;

భావము:

ప్రసన్నుడైన మరియొక ముని వారిద్దరికి నారచీరలను బహూకరించెను. మఱొకరు కృష్ణాజినం, మఱొక మహాముని మౌంజీలు ప్రసాదించారు.
*గమనిక:-   మౌంజి - ముంజ (తాటి) గడ్డితో ముప్పేటగా నేసిన నడికట్టు.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కశ్చిత్ కమండలుం ప్రాదాత్
  యజ్ఞసూత్రం తథాపరః।
ఔదంబరీం బ్రుసీమన్యో
  జపమాలామ్ అభాపరః॥

టీకా:

కశ్చిత్ = ఒకానొకరు; కమండలుం = కమండలమును; ప్రాదాత్ = ప్రసాదించెను; యజ్ఞసూత్రం = యజ్ఞోపవీతము; తథా = మఱియు; అపరః = ఇతరులు; ఔదంబరీం = మేడి పీఠమును; బ్రుసీమ్ = తపస్సుకైన ఆసనమును; అన్యః = ఇంకొకరు; జపమాలామ్ = జపమాలను; అభా = అలాగే; పరః = మఱొకరు.

భావము:

ఒకరు కమండలమును; మరొకరు యజ్ఞోపవీతమును; ఇకొకరు మేడి పీఠమును, తపస్సు చేసుకొను ఆసనమును; మరొకొకరు జపమాలను ఇచ్చారు.
*గమనిక:-   కమండలము- క-నీరు+ మండమ్- శోభ+ పొందునది, ఋషులు, బ్రహ్మచారులు వాడు జలపాత్ర; బ్రుసీ- వ్యుత్పత్తి. బృ+సర+డ-జీష్, కృ.ప్ర., మంత్రానుష్ఠానముచేయ కూర్చుండునది.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రుసీమన్యత్ తదా ప్రాదాత్
  కౌపీనం అపరోముని।
తాభ్యాం దదౌ తదాహృష్టః
  కుఠారమపరో మునిః ॥

టీకా:

బ్రుసీమ్ = ఆసనము; అన్యత్ = ఇంకొకటి; తదా = అలాగే; ప్రాదాత్ = ఇచ్చెను; కౌపీనం = గోచీగుడ్డ; అపరః = ఇతర; ముని = ముని; తాభ్యాం = వారిద్దరికి; దదౌ = ఇచ్చారు; తదా = అలాగే; హృష్టః = సంతోషించినవారు; కుఠారమ్ = గొడ్డలిని; అపరః = వేరే; మునిః = ముని.

భావము:

ఇంకొక ఆసనమును వేరేవారు; అలాగే; గోచీగుడ్డ ఇతర ముని; సంతోషించిన మరో ముని గొడ్డలిని వారిద్దరికి ఇచ్చారు,
*గమనిక:-   కౌపీనము- వ్యు. కూపే పతనమ్ అర్హసి- కూప+ ఖణ్, త.ప్ర., గోచీ.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాషాయమపరో వస్త్రం
  చీరమన్యో దదౌ మునిః।
జటాబంధన మవ్యస్తు
  కాష్ఠరజ్జుమ్ ముదాన్వితః ॥

టీకా:

కాషాయమ్ = కాషాయము, కావిరంగు బట్ట; అపరః = ఇంకొకరు; వస్త్రం = బట్టను; చీరమ్ = అంగవస్త్రమును; అన్యమ్ = మరొటి; దదౌ = ఇచ్చారు; మునిః = ముని; జటాబంధనమ్ = జటాబంధనమును, రిబ్బను?; అవ్యస్తు = అపరిమితమైన; కాష్ఠరజ్జుమ్ = సమిధలు కట్టుకొను త్రాడు; ముదాన్వితః = సంతోషించినవారు.

భావము:

ఒకరు కాషాయము బట్టను; అంగవస్త్రమును మరొక ముని; జటాబంధనమును, సమిధలు కట్టుకొను పెద్ద త్రాడు సంతోషించిన ముని ఒకరు ఇచ్చారు.
*గమనిక:-   కౌపీనము- వ్యు. కూపే పతనమ్ అర్హసి- కూప+ ఖణ్, త.ప్ర., గోచీ.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యజ్ఞభాండమ్ ఋషి కశ్యిత్
  కాష్ఠభారం తథాపరః।
ఆయుష్య మపరే స్రాహుః
  ముదా తత్రమహర్షయః ॥

టీకా:

యజ్ఞభాండమ్ = యజ్ఞపాత్రను; ఋషి = ఋషి; కశ్యిత్ = ఒకరు; కాష్ఠభారం = సమిధలను; తథ = అలాగే; అపరః = ఇంకొకరు; ఆయుష్యమ్ = ఆశీర్వాదము; అపరే = మరొకరు; స్రాహుః = సమర్పించిరి; ముదాత్ = ఇష్టంగా; అత్రమ్ = అక్కడ ఉన్నవారు; హర్షయః = సంతోషముతో.

భావము:

యజ్ఞపాత్రను ఒక ఋషి; సమిధలను ఇంకొకరు; ఆశీర్వాదము మరొకరు; ఇష్టంగా అక్కడ ఉన్నవారు అందరు సంతోషముతో ఇచ్చారు.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దదుశ్చైవ వరాన్ సర్వే
  మునయః సత్యవాదినః।
ఆశ్చర్య మిదం గీతం
  సర్వగీతేషు కోవిదౌః ॥

టీకా:

దదౌ = ఇచ్చిరి; చైవ; వరాన్ = వరములను; సర్వే = అందరు; మునయః = మునులు; సత్యవాదినః = సత్యసంధులు; ఆశ్చర్యమ్ = అద్భుతము; ఇదం = ఈ యొక్క; గీతం = పాడబడినది; సర్వ = సకల; గీతేషు = గానరీతులలోను; కోవిదౌః = ఇద్దరు పండితులు.

భావము:

సత్యసంధులు మునులు అందరు వరములను ఇచ్చిరి. గానరీతులు అన్నింటిలోను నిష్ణాతులైన వీరిద్దరు పండితులు. వీరు పాడిన ఈ గీతం అద్భుతము అనిరి.
*గమనిక:-   1) గీతమనగా గానమని తాత్పర్యము సప్తతాళములు 2) ధ్రువము అంగములు 1011, మిగతావి మధ్య, రూపక, ఝంప, త్రిపుట, అట, ఏక. సంగీతశాస్త్ర వాచకములు. (అ) ధ్రువాది బద్ద సంగీతము నకు గీతము అని పేరు. (ఆ) ధ్రువము పద్నాలుగు అక్షరములు గల తాళ విశేషము. ఆంధ్రవాచస్పతము.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆశ్చర్యమిదమాఖ్యానం
  మునినా సంప్రకీర్తితమ్ ।
పరం కవీనామాధారం
  సమాప్తం చ యథాక్రమమ్ ॥

టీకా:

ఆశ్చర్యమ్ = అద్భుతము; ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = గ్రంథము; మునినా = వాల్మీకి మునిచేత; సమ్ = చక్కగా; ప్రకీర్తితమ్ = బాగుగా గానము చేయబడినది; పరం = భవిష్యత్తు; కవీనామ్ = కవులకు; ఆధారమ్ = ఆధారమై; సమాప్తం = పూర్తి కావించబడినది; చ = కూడా; యథాక్రమమ్ = పద్దతిప్రకారము.

భావము:

వాల్మీకి మహామునిచే రచింపబడిన ఈ రామాయణ కావ్యము భవిష్యత్తు కవులకు అందరికీ ఆదర్శప్రాయమైనది అగునట్లు పద్దతిగా సుసంపూర్ణం చేయబడినది.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభిగీతమిదం గీతం
  సర్వగీతేషు కోవిదౌ ।
ఆయుష్యం పుష్టిజనకం
  సర్వశ్రుతిమనోహరమ్ ॥

టీకా:

అభిగీతమ్ = చక్కగా పాడబడినదైన; ఇదం = ఈ; గీతమ్ = గీతము; సర్వ = అన్ని విధములైన; గీతేషు = గానరీతు లందును; కోవిదౌ = ప్రావీణ్యము కలవారైన; ఆయుష్యం = ఆయుష్యమును వృద్ధి చేయునది; పుష్టి = పుష్టిని; జనకమ్ = కలిగించునది; సర్వ = అందరి; శ్రుతి = చెవులకు; మనోహరమ్ = వినసొంపయినది.

భావము:

ఆయుస్సును వృద్ధి చేయునది; పుష్టిని కలిగించునది అందరి వీనులకు వినసొంపైనది అగు ఈ గీతమును ఇద్దరు నిష్ణాతులు అద్భుతముగా గానము చేసిరి.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రశస్యమానౌ సర్వత్ర
  కదాచిత్తత్ర గాయకౌ ।
రథ్యాసు రాజమార్గేషు
  దదర్శ భరతాగ్రజః ॥

టీకా:

ప్రశస్యమానౌ = ప్రశంసించబడుతున్న వారైన; సర్వత్ర = అంతటను; కదాచిత్ = ఒకానొక సందర్భములో; తత్ర = అక్కడ; గాయకౌ = గాయకులను; రథ్యాసు = వీధు కూడళ్ళ యందు, వావిళ్ళ నిఘంటువు; రాజమార్గేషు = రాజమార్గములందు; దదర్శ = చూసెను; భరతాగ్రజః = భరతుని అన్నగారు రాముడు.

భావము:

పెక్కు వీధులు కలియు కూడళ్ళ యందు. రాజ మార్గములందును, సర్వత్రా మధురముగా గానము చేయుచు అందరిచే ప్రశంసించబడుచున్న ఆ కుశలవులను భరతాగ్రజుడైన రాముడు అక్కడ చూసెను.
*గమనిక:-   భరతాగ్రజుడు అనగా భరతుని అన్నగారు అనే కాకుండా, భరత బాధ్యతవహించువాడు, అగ్రజుడు అనగా ముందున్నవాడు, సిద్ధపడువాడు అని గ్రహించిన, రాబోవుకాలమున లవకుశుల బాధ్యత వహించుటకు రాముడు సిద్దపడుచున్నాడని స్పురించును.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వవేశ్మ చానీయ తతో
  భ్రాతరౌ చ కుశీలవౌ ।
పూజయామాస పూజార్హౌ
  రామః శత్రునిబర్హణః ॥

టీకా:

స్వృ = తన; వేశ్మ = గృహమునకు; చ, ఆనీయ = కూడ తీసుకుని వచ్చెను. తతః = అప్పుడు; భ్రాతరౌ = సోదరులైన; చ, కుశీలవౌ = కుశలవులను; పూజయామాస = గౌరవించెను; పూజార్హౌ = గౌరవించతగిన వారైన; రామః = రాముడు; శత్రునిబర్హణః = శత్రువులను సంహరించు వాడు.

భావము:

శత్రుసంహరము చేయు మహనీయుడు రాముడు గౌరవించదగిన సోదరులైన ఆ కుశలవులను తన గృహమునకు తీసుకుని వచ్చి గౌరవించెను.

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆసీనః కాంచనే దివ్యే
  స చ సింహాసనే ప్రభుః ।
ఉపోపవిష్టః సచివైః
  భ్రాతృభిశ్చ పరంతపః ॥

టీకా:

ఆసీనః = ఆసీనుడైన; కాంచనే = బంగారముతో చేయబడిన; దివ్యే = దివ్యమైన; సః = ఆ; చ = సింహాసనే = సింహాసనము పైన; ప్రభుః = రాజు; ఉపోపవిష్టః = చుట్టూ పరివేష్టింపబడినవాడై; సచివైః = మంత్రులు చేతను; భ్రాతృభిశ్చ = సోదరులచేతను; పరంతపః = శత్రువులను పీడించెడి.

భావము:

శత్రుతపనుడు అగు ఆ రామచంద్ర ప్రభువు సోదరులు; సచివులు పరివేష్టించి ఉండగా బంగారముతో చేయబడిన తన దివ్య సింహాసనముపై ఆసీనుడై ఉండెను.
*గమనిక:-   సచివ- వ్యు. సచి+వా+క, సచి- సమవాయః తథా సన్ వాతి, మంత్రి

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దృష్ట్వా తు రూపసంపన్నౌ
  తావుభౌ నియతస్తదా ।
ఉవాచ లక్ష్మణం రామః
  శత్రుఘ్నం భరతం తథా ॥
1.4.33.అనుష్టుప్.
"శ్రూయతామిదమాఖ్యానమ్
 అనయోః దేవవర్చసోః ।
విచిత్రార్ధ పదం సమ్యక్"
 గాయికౌ తావచోదయత్" ॥
1.4.34.అనుష్టుప్.
తౌచాపి మధురం రక్తమ్
 స్వంచితాయతనిస్వనమ్ ।
తంత్రీలయవదత్యర్థమ్
 విశ్రుతార్థమగాయతామ్ ॥
1.4.35.అనుష్టుప్.
హ్లాదయత్ సర్వగాత్రాణి
 మనాంసి హృదయాని చ ।
శ్రోత్రాశ్రయసుఖం గేయమ్
 తద్బభౌ జనసంసది ॥
1.4.36.జగతి.*
"ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ
 కుశీలవౌ చైవ మహాతపస్వినౌ ।
మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే
 మహానుభావం చరితం నిబోధత" ॥
1.4.37.జగతి.
తతస్తు తౌ రామవచః ప్రచోదితౌ
 అగాయతాం మార్గవిధానసంపదా ।
స చాపి రామః పరిషద్గతః శనై
 ర్బుభూషయా సక్తమనా బభూవ హ ॥
1.4.38.గద్యము.
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 చతుర్థః సర్గః

టీకా:

దృష్ట్వా = చూచి; తు = చూచి; రూపసంపన్నౌ = బహుసుందరులైన; తౌ = ఆ; ఉభౌ = ఇరువురినీ; నియత = నియమవంతులైన; తదా = అప్పడు; ఉవాచ = పలికెను; లక్ష్మణం = లక్ష్మణుని గురించి; రామః = రాముడు; శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుడిని గురించి; భరతం = భరతుని గురించి; తథా = మఱియు.
  శ్రూయతామ్ = వినబడుగాక; ఇదమ్ = ఈ; ఆఖ్యానమ్ = కథనము; అనయోః = వీరి యొక్క; దేవవర్చసోః = దేవతల వంటి వర్చస్సు కలిగిన; విచిత్ర = చిత్రమైన; అర్థ = అర్థములు; పదం = పదములు; సమ్యక్ = బాగుగా; గాయికౌ = పాడువారిని; తౌ = వారిరువురను; వచోదయత్ = ప్రేరేపించెను.
  తౌ చ = వారిరువురును; అపి = కూడా; మధురం = మధురముగను; రక్తమ్ = రాగయుక్తముగాను; స్వంచ్ = కలిసిన; ఇత = పొదికగా, ఒప్పైన; ఆయత = దీర్ఘమైన, విస్తారమైన; నిస్వనమ్ = ధ్వనితోను; తంత్రీ = వాయిద్యముల తంత్రుల; లయవత్ = లయకు అనుగుణముగను; అత్యర్థమ్ = మిక్కిలి; విశ్రుత = విస్తృతమైన; అర్థమ్ = అర్ధము కలుగునట్లుగను; అగాయతామ్ = గానము చేసిరి.
  హ్లాదయత్ = ఆహ్లాదము కలిగించేది; సర్వ = సమస్తమైన; గాత్రాణి = మానవుల, జీవుల; మనాంసి = మనస్సులకు; హృదయాని = హృదయములకు; చ = కూడ; శ్రోత్రా = వీనులకు; ఆశ్రయ = కలిగించునదై; సుఖం = సుఖానుభూతి; గేయమ్ = గీతము; తత్ = ఆ; బభౌ = భాసించినది; జనృ = ప్రజా; సంసది = సభ యందలి.
  "ఇమౌ = వీరిద్దఱును; మునీ = మునులు; పార్థివలక్షణ = క్షత్రియలక్షణములు; ఆన్వితౌ = కలిగిన వారై; కుశీలవౌ = కుశలవులని నామములు కలవారు / గాయకులు ఇద్దఱు; చైవ = మఱియు; మహా = గొప్ప; తపస్వినౌ = తపస్వులు; మమాపి = నాతో కూడ; తత్ = ఆ; భూతికరం = అనుభూతి కలిగించెడి; ప్రవక్ష్యతే = చెప్పెడిది; మహ = గొప్ప; అనుభావమ్ = ప్రభావవంతమైన; చరితం = ఆ చరిత్రము; నిబోధత = శ్రద్ధగా ఆలకింపుడు.
 ప్రతిపదార్థము :- తతః = అటు పిమ్మట; తౌ = వారిద్దరు; రామ = శ్రీరాముని; వచః = ఆజ్ఞ చేత; ప్రచోదితౌ = నిర్దేశింపబడినవారై; అగాయతామ్ = గానము చేసిరి; మార్గవిధాన = సంగీతంలోని మార్గవిధానము; సంపదా = సమృద్దిగ; సః = ఆ‌; చాపి = కూడ; రామః = రాముడు; పరిషత్ = సభలో; గతః = ఉన్నవారు; శనైః = శాంత చిత్తులు; బుభూషయా = అభిలాషతో; సక్త = ఆసక్తి గల / లగ్నమైన; మనాః = మనస్సుకలవారు; బభూవ = ఆయెను; హ.
  ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్థ [4] = నాలుగవ; సర్గః = సర్గ.

భావము:

తాత్పర్యము:- రూపసంపన్నులు నియమవంతులైన ఆ కుశలవులను చూచి అప్పుడు రాముడు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో ఇట్లు పలికెను.
 తాత్పర్యము:- "దివ్యమైన వర్చస్సు కలిగిన ఈ కుశ లవులు గానము చేయు చిత్ర విచిత్ర పదములతో చక్కని భావముతో కూడిన ఈ కథనమును వినుడు" అని తన సోదరులతో పలికి రాముడు ఆ గాయకులను పాడుటకు ప్రేరేపించెను.
 తాత్పర్యము:- ఆ కుశలవులు మధురముగను, తంత్రీ వాయిద్యముల శ్రుతి లయలకు అనుగుణముగా రాగయుక్తమైన చక్కని విస్తారమైన స్వరంతో చక్కగా ఒప్పిన కంఠము కలియునట్లు గానము చేసిరి. వారి గానము నందు అర్ధము విస్త్రుతముగ స్పురించు చుండెను.
 తాత్పర్యము:- ఆ కుశలవుల గానము సకల సభాసదుల వీనులకు విందుగా ఉండి సుఖానుభూతిని కలిగించుచు, మనస్సులను, హృదయములను రంజింపజేసెను.
 తాత్పర్యము:-"గొప్ప తపశ్శాలులు, క్షత్రియలక్షణాన్వితులు ఐన ఈ మునికుమారులు కుశలవులు అని గాయకులు. అనుభూతి కలిగేలా వీరు చెప్పెడి ఈ గొప్ప ప్రభావవంతమైన చరిత్రము నాతోపాటు శ్రద్ధగా ఆలకింపుడు" అని రాముడు సోదరులకు చెప్పెను.
 తాత్పర్యము:- అటుపిమ్మట రాముని ఆజ్ఞ ప్రకారము ఆ కుశలవులు మార్గ, దేశీ గాన విధానములలో స్వచ్ఛమైన మార్గ విధైనములో గానము చేసిరి. రామునితో సహితంగా సభాసదులు అందఱు కూడ. ప్రీతితో లగ్నమైన మనసులతో, శాంతచిత్తులైరి.
*గమనిక:-   మార్గవిధానము- సంగీతము మార్గము, దేశ్యము అని రెండు విధములు. మార్గము- ఈశ్వర ప్రణీతమై భరతఋషితే ప్రకటింపబడినది. దేశ్యము ఆయా దేశాముల యందు వాడుక గలిగి మనోహరమైనది ఆంధ్రశబ్దరత్నాకరము. 2) షణ్మార్గములు- 1. దక్షిణము, 2. వార్తికము, 3. చిత్రము, 4. చిత్రతరము, 5. చిత్రతమము, 6. అతిచిత్రతమము. సంకేతపదకోశము, రవ్వాశ్రీహరి
  ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [3] నాలుగవ సర్గ సుసంపూర్ణము.