బాలకాండమ్ : ॥సప్తవింశః సర్గః॥ [27 వివిధ దివ్యాస్త్రములను ఒసగుట]
- ఉపకరణాలు:
అథ తాం రజనీముష్య
విశ్వామిత్రో మహాయశాః ।
ప్రహస్య రాఘవం వాక్యం
ఉవాచ మధురాక్షరమ్ ॥
టీకా:
అథ = పిమ్మట; తాం = ఆ; రజనీమ్ = రాత్రికి; ఉష్య = ఉండెను; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాయశాః = గొప్ప కీర్తిగలవాడు; ప్రహస్య = నవ్యుతూ; రాఘవమ్ = రామునితో; వాక్యమ్ = మాటలను; మధురాక్షరమ్ = మధురమైన అక్షరములు కలిగినదానిని; ఉవాచ = పలికెను.
భావము:
మహాయశస్సుగల విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట నివసించెను. మరునాడు చిరునవ్వు నవ్వుతో రామునితో మధురముగా ఇట్లనెను.
- ఉపకరణాలు:
“పరితుష్టోఽ స్మి భద్రం తే
రాజపుత్ర! మహాయశః! ।
ప్రీత్యా పరమయా యుక్తో
దదామ్యస్త్రాణి సర్వశః ॥
టీకా:
పరితుష్టః = సంతోషించినవాడను; అస్మి = అయినాను; భద్రమ్ = క్షేమము అగుగాక; తే = నీకు; రాజపుత్ర = రాకుమార; మహా = గొప్ప; యశః = కీర్తిగలవాడ; ప్రీత్యా = ప్రేమతో; పరమయా = ఉత్కృష్టమైన; యుక్తః = అర్హత కలవాడ; దదామి = ఇచ్చెదను; అస్త్రాణి = అస్త్రములను; సర్వశః = అన్నింటినీ.
భావము:
“రాకుమార! గొప్ప కీర్తిగలవాడ! ఉత్కృష్టమైన అర్తతకల రామా! నాకు చాలా సంతోషము కలిగినది. నీకు క్షేమమగుగాక. నీకు ప్రేమపూర్వకముగా అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను.
- ఉపకరణాలు:
దేవాసురగణాన్ వాపి
సగంధర్వోరగానపి ।
యైరమిత్రాన్ ప్రసహ్యాజౌ
వశీకృత్య జయిష్యసి ।
తాని దివ్యాని భద్రం తే।
దదామ్యస్త్రాణి సర్వశః॥
టీకా:
దేవ = దేవతల; అసుర = రాక్షసుల; గణాన్ = సమూహములు; అపి = అయిననూ; సః = ఆ; గంధర్వా = గంధర్వులు; ఉరగాన్ = నాగులు; అపి = అయిననూ; యైః = ఏ అస్త్రములచేత; అమిత్రాన్ = శత్రువులను; ప్రసహ్య = బలాత్కారముగా; అజౌ = మొత్తం అందరినీ; వశీకృత్య = వశము చేసుకొని; జయిష్యసి = జయింపగలవో; ని = అట్టి; దివ్యాని = దివ్యములైనవి; భద్రమ్ = క్షేమకరమైనవి; తే = నీకు; దదామి = ఇచ్చెదను; అస్త్రాణి = అస్త్రములను; సర్వశః = అన్నింటిని.
భావము:
దేవ, సుర, గంధర్వ ఉరగాదులు ఎవరు శత్రువులుగా వచ్చిననూ యుద్ధరంగమునందు, వేటిచే వారిని బలాత్కారముగా వశము చేసుకొని జయింపగలవో ఆ అస్త్రములను, ఓ రామా! అట్టి క్షేమకరమైన, దివ్యాస్త్రములను పరిపూర్ణముగా నీకిచ్చెదను. గొప్పదివ్యమైన దండచక్రమును నీకు ఇచ్చెదను.
- ఉపకరణాలు:
దండచక్రం మహద్దివ్యమ్
తవ దాస్యామి రాఘవ! ।
ధర్మచక్రం తతో వీర
కాలచక్రం తథైవ చ ।
టీకా:
దండచక్రమ్ = దండచక్రము; మహత్ = గొప్పది; దివ్యమ్ = దివ్యమైనది; తవ = నీకు; దాస్యామి = ఇచ్చెదను; రాఘవ = రామా; ధర్మచక్రమ్ = ధర్మచక్రమును; తతః = పిమ్మట; వీర = ఓ వీరుడా; కాల చక్రమ్ = కాలచక్రమును; తథైవ = దానిపిమ్మట; చ.
భావము:
గొప్పదివ్యమైన దండచక్రమును నీకు ఇచ్చెదను. వీరుడవైన ఓ రామా! ధర్మచక్రమును, పిమ్మట కాలచక్రమును, ఆ తరువాత
- ఉపకరణాలు:
ధర్మచక్రం తతో వీర! కాలచక్రం తథైవ చ|
విష్ణుచక్రం తథాత్యుగ్రమైన్ద్రమస్త్రం తథైవ చ||
- ఉపకరణాలు:
వజ్రమస్త్రం నరశ్రేష్ఠ!
శైవం శూలవరం తథా ।
అస్త్రం బ్రహ్మశిరశ్చైవ
ఐషీకమపి రాఘవ! ॥
టీకా:
వజ్రం = వజ్రము అను; అస్త్రమ్ = అస్త్రమును; నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా; శైవమ్ = శివుని సంబంధమైన; శూల = శూలములలో; వరమ్ = శ్రేష్ఠమైనదానిని; తథా = ఆ పిమ్మట; అస్త్రమ్ = అస్త్రమును; బ్రహ్మశిరః = బ్రహ్మశిరస్సు అనెడు దానిని; చ = ఇంకా; ఇవ = కూడ; ఐషీకమ్ = ఐషీకాస్త్రమును; అపి = ఇంకనూ; రాఘవ = రామా.
భావము:
నరశ్రేష్ఠుడ! రాఘవరామా1 వజ్రాస్త్రమును, శివుని అస్త్రమగు శ్రేష్ఠమైన శైవశూలమును, ఇంకనూ బ్రహ్మశిరోనామాస్త్రమును, పిమ్మట ఐషీకాస్త్రమును, ఇంకను.
- ఉపకరణాలు:
దదామి తే మహాబాహో!
బ్రాహ్మమస్త్రమనుత్తమం ।
గదే ద్వే చైవ కాకుత్స్థ!
మోదకీ శిఖరీ ఉభే ॥
టీకా:
దదామి = ఇచ్చెదను; తే = నీకు; మహాబాహో = గొప్ప బాహువులు గలవాడా; బ్రాహ్మం = బ్రహ్మాము అను; అస్త్రమ్ = అస్త్రమును; అనుత్తమమ్ = మిక్కిలి శ్రేష్ఠమైనదానిని; గదే = గదలను; ద్వే = రెండింటిని; చ; ఇవ = కూడ; కాకుత్స్థ = కకుత్స్థ వంశమునందు జన్మించిన రామా; మోదకీ = మోదకీ అనెడు; శిఖరీ = శిఖరి అనెడు; ఉభే = రెండింటినీ.
భావము:
బాహుబలసంపన్నా! కాకుత్స్థ రామా! మిక్కిలి శ్రేష్ఠమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. మోదకి, శిఖరి అనెడు రెండు గదలను కూడా ఇచ్చెదను.
- ఉపకరణాలు:
ప్రదీప్తే నరశార్దూల!
ప్రయచ్ఛామి నృపాత్మజ! ।
ధర్మపాశమహం రామ!
కాలపాశం తథైవ చ ॥
టీకా:
ప్రదీప్తే = ప్రకాశించుచున్న; నరశార్దూల = నరశ్రేష్ఠుడైన రామా; ప్రయచ్ఛామి = ఇచ్చెదను; నృపాత్మజః = రాకుమార రామా; ధర్మపాశమ్ = ధర్మపాశమును; అహమ్ = నేను; రామ = రామా; కాలపాశమ్ = కాలపాశమును; తథైవ = మఱింకా; చ.
భావము:
మానవోత్తమా! రాకుమార! రామా| నేను ధర్మపాశము; కాలపాశము అస్త్రములను కూడ ఇచ్చెదను.
- ఉపకరణాలు:
పాశం వారుణమస్త్రం చ
దదామ్యహమనుత్తమమ్ ।
అశనీ ద్వే ప్రయచ్ఛామి
శుష్కార్ద్రే రఘునందన! ॥
టీకా:
పాశమ్ = పాశమును; వారుణమ్ = వారుణము అనుదానిని; అస్త్రం = అస్త్రమును; చ = కూడ; దదామి = ఇచ్చెదను; అనుత్తమమ్ = అత్యుత్తమమైనవానిని; అశనీ = పిడుగులను ఉల్కను పోలిన అస్త్రములు; ద్వే = రెండింటిని; శుష్కార్ద్రే = శుష్కము (ఎండుది); ఆర్ద్రము(తడిది) అయినట్టివి; రఘునందన = రామా.
భావము:
రాఘవరామా! వారుణ పాశమును అను అత్యుత్తమమైన అస్త్రమును ఇచ్చెదను. శుష్కాశని; ఆర్ద్రాశని అను (మెఱుపులు / నిప్పురవ్వలు వెదజల్లు) రెండు అస్త్రములను ఇచ్చెదను.
- ఉపకరణాలు:
దదామి చాస్త్రం పైనాకమ్
అస్త్రం నారాయణం తథా ।
ఆగ్నేయమస్త్రం దయితం
శిఖరం నామ నామతః ॥
టీకా:
దదామి = కూడ; చ = కూడ; అస్త్రం = కూడ; పైనాకమ్ = పినాకము అను; అస్త్రం = కూడ; నారాయణం = నారాయణము; తథా = కూడ; ఆగ్నేయమ్ = అగ్నిదేవాత్మకమైన; అస్త్రమ్ = అస్త్రమును; దయితమ్ = ఇష్టమైనదానిని; శిఖరం = శిఖరమను; నామ = పేరుచేత; నామతః = ప్రసిద్ధమైనదానిని.
భావము:
ఇంకా పినాకాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. అగ్నిదేవునికి ఇష్టమైన శిఖరమని ప్రసిద్ధమైన అస్త్రమును ఇచ్చెదను.
- ఉపకరణాలు:
వాయవ్యం ప్రథనం నామ
దదామి చ తవానఘ! ।
అస్త్రం హయశిరో నామ
క్రౌంచమస్త్రం తథైవ చ ॥
టీకా:
వాయవ్యమ్ = వాయవ్యాస్త్రమును; ప్రథనం = ప్రథనమను; నామ = పేరు గలదానిని; దదామి = ఇచ్చెదను; తవ = నీకు; చ; అనఘ = దోషరహితుడా; అస్త్రమ్ = అస్త్రమును; హయశిరః = హయశిరస్సు అను; నామ = పేరు గలదానిని; క్రౌంచమ్ = క్రౌంచమ అను; అస్త్రమ్ = అస్త్రమును; తథైవ = మఱియు; చ = ఇంకా.
భావము:
అనఘ! ప్రథనమను పేరు గల వాయదేవునికి ఇష్టమైన అస్త్రమును, హయశిరస్సు అను అస్త్రమును, క్రౌంచాస్త్రమును కూడ ఇచ్చెదను.
- ఉపకరణాలు:
శక్తిద్వయం చ కాకుత్స్థ
దదామి తవ రాఘవ! ।
కంకాలం ముసలం ఘోరం
కాపాలమథ కంకణమ్ ॥
టీకా:
శక్తి = శక్తి అను; ద్వయం = రెంటిని; చ; కాక్కుత్స్థ = కకుత్స్థ వంశోద్భవుడవైన రామ; దదామి = ఇచ్చెదను; తవ = నీకు; రాఘవ్ = రఘురామా; కంకాళం = కంకాళము; ముసలం = రోకలిని; ఘోరమ్ = భయంకరమైన; కాపాలమ్ = కాపాలమనెడు ముసలమును; అథ = మఱియు; కంకణమ్ = కంకణమనెడు ముసలమును.
భావము:
రఘురామ! రెండు శక్తి అను అస్త్రములను నీకు ఇచ్చెదను. కంకాళము, ముసలము, కాపాలము, కంకణము అను అస్త్రములను కూడ ఇచ్చెదను.
- ఉపకరణాలు:
ధారయంత్యసురా యాని
దదామ్యేతాని సర్వశః ।
వైద్యాధరం మహాస్త్రం చ
నందనం నామ నామతః ॥
టీకా:
ధారయంతి = ధరింతురో; అసురాః = అసురులు; యాని = వేటిని; దదామి = ఇచ్చెదను; ఏతాని = అటువంటి; సర్వశః = అన్నింటిని; వైద్యాధరమ్ = విద్యాధరులు ధరించెడి; మహాస్త్రం = మహాస్త్రమును; చ = ఇంకా; నందనం = నందనమను; నామ = పేరుతో; నామతః = పేరుపొందిన దానిని.
భావము:
అసురులు ధరించు వాటిని అన్నింటినీ ఇచ్చెదను. విద్యాధరులు ధరించు మహాస్త్రము అయిన నందన మని పేరుతో ప్రసిద్ధమైనదానిని....
- ఉపకరణాలు:
అసిరత్నం మహాబాహో!
దదామి నృవరాత్మజ! ।
గాంధర్వమస్త్రం దయితం
మానవం నామ నామతః ॥
టీకా:
అసి = ఖడ్గములలో; రత్నమ్ = శ్రేష్ఠమైనదానిని; మహాబాహో = గొప్ప బాహువులు గల రామ; దదామి = ఇచ్చెదను; నృపాత్మజ = రాజకుమారా; గాంధర్వమ్ = గాంధర్వమనెడు; అస్త్రమ్ = అస్త్రమును; దయితమ్ = ఇష్టమైనదానిని; మానవం = మానవము; నామ = అనెడు; నామతః = ప్రసిద్ధమైనదానిని.
భావము:
మహాభుజబలశాలి! రామ రాకుమార! శ్రేష్ఠమైన ఖడ్గమును ఇచ్చెదను. గాంధర్వులకు ఇష్టమైన మానవాస్త్రమును ఇచ్చెదను.
- ఉపకరణాలు:
ప్రస్వాపనప్రశమనే
దద్మి సౌరం చ రాఘవ! ।
దర్పణం శోషణం చైవ
సంతాపనవిలాపనే ॥
టీకా:
ప్రస్వాపన = ప్రస్వాపన అను నిద్రమత్తు కలిగించెడి; ప్రశమనే = ప్రశ్రమనే అను నిద్రమత్తు తొలగిండెడిది; దద్మి = అనెడు; సౌరం = అనెడు; చ = అనెడు; రాఘవ = రామ; దర్పణమ్ = దర్పణము (పాఠ్యంతరంగా వర్షణం)అను అస్త్రమును; శోషణం = ఎండింపజేయు అస్త్రమును; చైవ = మరింకా; సంతాపన = తాపమును కలిగించు సంతాపనాస్త్రమును; విలాపనే = విలపింపజేయు విలాపనాస్త్రమును.
భావము:
ప్రస్వాపన అను నిద్రకలిగించునట్టి అస్త్రమును; ప్రశ్రమనే అను నిద్ర తొలగించునట్టి అస్త్రమును; ఇంకా దర్పణము (పాఠ్యంతరంగా వర్షణం); శోషణము; సంతాపనము; విలాపనము అను సౌరాస్త్రములను కూడా ఇచ్చెదను. .
- ఉపకరణాలు:
మదనం చైవ దుర్దర్షం
కందర్పదయితం తథా ।
పైశాచమస్త్రం దయితం
మోహనం నామ నామతః ॥
టీకా:
మదనం = మదనాస్త్రమును; చ = ఇంకా; దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యముకాని; కందర్ప = మన్మథునికి; దయితమ్ = ఇష్టమైనదానిని; తథా = ఇంకనూ; పైశాచమ్ = పైశాచము అను; అస్త్రమ్ = అస్త్రమును; దయితమ్ = ఇష్టమైనది; మోహనం = మోహనమను; నామ = ప్రసిద్ధికెక్కిన; నామతః = పేరుగలది.
భావము:
మన్మథునికి ఇష్టమైన ఎదిరింప సాధ్యంకాని మదనాస్త్రమును ఇంకా పైశాచాస్త్రం పిశాచములకు ఇష్టమైన మోహనాస్త్రమను పేర ప్రసిద్ధమైనదానిని ఇచ్చెదను.
- ఉపకరణాలు:
ప్రతీచ్ఛ నరశార్దూల!
రాజపుత్ర! మహాయశః! ।
తామసం నృపశార్దూల!
సౌమనం చ మహాబల! ॥
టీకా:
ప్రతీచ్ఛ = తీసుకొనుము; నరశార్దూల = నరశ్రేష్ఠుడా; రాజపుత్ర = రాకుమారా; మహాయశః = గొప్ప యశస్సు కలవాడా; రామా; తామసమ్ = తామసాస్త్రమును; నృపశార్దూల = రాజశ్రేష్ఠుడా; సౌమనం = సౌమనాస్త్రమును; చ = కూడా; మహాబల = గొప్ప బలము కలవాడా.
భావము:
నరశ్రేష్ఠుడా! మహాకీర్తిశాలీ! రామరాకుమార! తామసాస్త్రమును; సౌమనాస్త్రమును గ్రహింపుము.
- ఉపకరణాలు:
సంవర్ధం చైవ దుర్ధర్షం
మౌసలం చ నృపాత్మజ! ।
సత్యమస్త్రం మహాబాహో
తథా మాయాధరం పరమ్ ॥
టీకా:
సంవర్ధం = సంవర్ధాస్త్రమును; చైవ = మఱియు; దుర్ధర్షమ్ = ఎదిరింపశక్యము కాని; మౌసలమ్ = మౌసలాస్త్రమును; చ = కూడా; నృపాత్మజ = రాజా; సత్యమ్ = సత్యామను; అస్త్రమ్ = అస్త్రమును; మహాబాహో = గొప్ప బాహు బలము గల రామా; తథా = ఇంకనూ; మాయాధరమ్ = మాయాధరాస్త్రమును; పరమ్ = శ్రేష్ఠమైనదానిని.
భావము:
మహాబలశాలీ! రామా! సంవర్థాస్త్రమును, ఎదిరింప శక్యము కాని మౌసలాస్త్రమును. సత్యాస్త్రమును; ఇంకా శ్రేష్ఠమైనట్టి మాయాధరాస్త్రమును;
- ఉపకరణాలు:
ఘోరం తేజఃప్రభం నామ
పరతేజో౭పకర్షణమ్।
సౌమ్యాస్త్రం శిశిరం నామ
త్వష్టురస్త్రం సుదామనమ్ ।
దారుణం చ భగస్యాపి
శీతేషుమథ మానవమ్ ॥
టీకా:
ఘోరమ్ = భీకరమైన; తేజఃప్రభమ్ = సౌరతేజఃప్రభమనెడి; నామ = ప్రసిద్ధమైన; పర = పరుల; శత్రువుల; తేజః = తేజస్సును; ఉపకర్షణమ్ = లాగివేయుదానిని; సౌమ్యాస్త్రమ్ = సోమదేవతాత్మకమైన అస్త్రమును; శిశిరం = శిశిరమని; నామ = పేరు గలది; త్వష్టుః = త్వష్ట అను విశ్వకర్మ యొక్క; అస్త్రమ్ = అస్త్రమును; సుదామనమ్ = సుదామనాస్త్రమును; దారుణమ్ = భయంకరమైన దానిని; చ = మఱియు; భగస్య = భగునియొక్క; అపి = నిశ్చయంగా; శితేషుమ్ = వాడియైన బాణరూపములో ఉన్న శితేష్వస్త్రమును; అథ = మఱియు; మానవమ్ = మానవాస్త్రమును; ప్రతీచ్ఛస్వ = గ్రహింపుము; 17; 18; 19 శ్లోకాలకు అనుసంధానము).
భావము:
శత్రువుల తేజస్సును లాగివేసి నిర్వీర్యంచేసే సూర్యదేవతాత్మక మైన సౌరతేజఃప్రభాస్త్రమును, సోమదేవతాత్మక మైన శిశిరాస్త్రమును (చలిని పుట్టించునది); విశ్వకర్మ త్వష్ట నిర్మితమైన సుదామనాస్త్రమును; భగునిచే విర్మితమైన దారుణమైన శితేషువు అను వాడిబాణమును; మఱియు మానవాస్త్రమును గ్రహింపుము.
- ఉపకరణాలు:
ఏతాన్ రామ మహాబాహో
కామరూపాన్ మహాబలాన్ ।
గృహాణ పరమోదారాన్
క్షిప్రమేవ నృపాత్మజ!" ॥
టీకా:
ఏతాన్ = వీటిని అన్నింటిని; రామ = రామా; మహాబాహో = గొప్ప బాహుబలము కలవాడా; కామరూపాన్ = కోరిన రూపములు ధరించ గలవి; మహాబలాన్ = గొప్పబలము గలవి; గృహాణ = తీసుకొనుము; పరమోదారాన్ = చాలా గొప్పవైనవీటిని; క్షిప్రమ్ = శీఘ్రము; ఏవ = ఐనవిధముగా; నృపాత్మజ = రాజకుమారా.
భావము:
మహాశక్తిశాలి| రాజకుమారా| రామా| కామరూపం ధరించు శక్తి గలవి, చాలా గొప్పవి, గొప్ప బలిష్ఠమైనవి అగు ఈ అస్త్రములను అన్నింటినీ వెంటనే గ్రహింపుము.”
- ఉపకరణాలు:
స్థితస్తు ప్రాంముఖో భూత్వా
శుచిర్మునివరస్తదా ।
దదౌ రామాయ సుప్రీతో
మంత్రగ్రామమనుత్తమమ్ ॥
టీకా:
స్థితః = స్థిరచిత్తుడు; అస్తు = అయినవాడు; ప్రాంముఖః = తూర్పువైపు తిరిగినవాడు; భూత్వా = అయి; శుచిః = పరిశుద్ధుడైన; ముని = మునులలో; వర = శ్రేష్ఠుడు; తదా = అప్పుడు; దదౌ = ఇచ్చెను; రామాయ = రామునకు; సుప్రీతః = చాలా ప్రసన్నుడై; మంత్ర = మంత్రముల; గ్రామమ్ = సముదాయమును; అనుత్తమమ్ = చాలా ఉత్తమమైనవానిని.
భావము:
అప్పుడు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు స్థిరచిత్తుడై, శుచియై, ప్రసన్నచిత్తుడై, తూర్పు వైపునకు తిరిగి ఆ అత్యుత్తమమగు అస్త్రసముదాయమును రామున కిచ్చెను.
- ఉపకరణాలు:
సర్వసంగ్రహణం యేషాం
దైవతైరపి దుర్లభమ్ ।
తాన్యస్త్రాణి తదా విప్రో
రాఘవాయ న్యవేదయత్ ॥
టీకా:
సర్వ = అన్నింటిని; సంగ్రహణమ్ = పరిపూర్ణంగా స్వీకరించుట; ఏతేషామ్ = ఏ అస్త్రములను; దైవతైః = దేవతలకు; అపి = కూడా; దుర్లభమ్ = లభించుట కష్టమో; తాని = అట్టి; అస్త్రాణి = అస్త్రములను; తదా = అప్పుడు; విప్రః = విప్రుడైన విశ్వామిత్రుడు; రాఘవాయ = రఘురామునకు; న్యవేదయత్ = తెలిపెను.
భావము:
దేవతలకు కూడా సాంగోపాంగములుగా పరిపూర్ణముగా స్వీకరించుట దుర్లభమైనట్టి అస్త్రములను, విశ్వామిత్రుడు రామునకు సాంగోపాంములుగా ఇచ్చెను.
- ఉపకరణాలు:
జపతస్తు మునేస్తస్య
విశ్వామిత్రస్య ధీమతః ।
ఉపతస్థుర్మహార్హాణి
సర్వాణ్యస్త్రాణి రాఘవమ్ ॥
టీకా:
జపతః = జపము చేయుచు; అస్తు = ఉండగా; మునే = ముని; అస్తు = శ్రేష్ఠుడు; అస్య = అయిన; విశ్వామిత్ర = విశ్వామిత్రుడు; అస్య = ఐన; ధీమతః = బుద్ధిశాలి; ఉపత = (చేరినవి) సేవించినవి; అస్థుః = అయినవి; మహా = మిక్కిలి; అర్హాణి = యోగ్యము లైన; అస్త్రాణి = అస్త్రములు; సర్వాణి = అన్నియు; రాఘవమ్ = రాముని.
భావము:
ధీమంతుడైన ఆ మునీశ్వరుడు విశ్వామిత్రుడు ఆ అస్త్రాధిష్టాన దేవతల రామునికి వశమగుటకు జపించుచుండగా, మిక్కిలి యోగ్యములైన అస్త్రములన్నియు రాముని సేవించినవి.
- ఉపకరణాలు:
ఊచుశ్చ ముదితాః సర్వే
రామం ప్రాంజలయస్తదా ।
ఇమే స్మ పరమోదారాః
కింకరాస్తవ రాఘవ!" ॥
టీకా:
ఊచుః = చెప్పిరి; చ = కూడ; ముదితాః = సంతోషించినవైన; సర్వే = ఆ అస్త్ర దేవతలందరును; రామం = రామునితో; ప్రాంజలయః = దోసిలి కట్టినవారై; తదా = అప్పుడు; ఇమే = ఈ మేము; స్మః = అయి ఉన్నాము; పరమ = మిక్కిలి; ఉదారాః = సరళస్వభావులమై; కింకరాః = కింకరులముగా; తవ = నీయొక్క; రాఘవ = రామా.
భావము:
రాముని చేరినందుకు సంతోషించిన ఆ అస్త్రదేవతలందరును అప్పుడు నమస్కరించుచు; “రామా| మేమందరమూ నీ పరమోదారులైన కింకరులము” అని పలికిరి.
- ఉపకరణాలు:
ప్రతిగృహ్య చ కాకుత్స్థః
సమాలభ్య చ పాణినా ।
మానసా మే భవిష్యధ్వమ్
ఇతి తానభ్యచోదయత్" ॥
టీకా:
ప్రతిగృహ్య = స్వీకరించి; చ; కాకుత్స్థః = రాముడు; సమాలభ్య = స్పృశించి; చ; పాణినా = హస్తముతో; మానసా = మనస్సునందు సంచరించువారుగా; మే = నాయొక్క; భవిష్యధ్వమ్ = అగుదురుగాక; ఇతి = అని; తాన్ = వారిని; అభ్యచోదయత్ = ఆజ్ఞాపించెను.
భావము:
రాముడు ఆ అస్త్రములను స్వీకరించి, చేతితో ఆస్త్రదేవతలను స్పృశించి “నా మనస్సులో సంచరించుచుందురుగాక” అని ఆ దేవతలను ఆజ్ఞాపించెను.
- ఉపకరణాలు:
తతః ప్రీతమనా రామో
విశ్వామిత్రం మహామునిమ్ ।
అభివాద్య మహాతేజా
గమనాయోపచక్రమే ॥
టీకా:
తతః = పిమ్మట; ప్రీత = సంతోషించిన; మనాః = మనస్సు కలవాడై; రామః = రాముడు; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; మహామునిమ్ = మహర్షిని; అభివాద్య = నమస్కరించి; మహాతేజా = గొప్ప తేజస్సు గలవాడైన; గమనాయ = ప్రయాణము చేయుటకు; ఉపచక్రమే = ప్రారంభించెను.
భావము:
అటుపిమ్మట మహాతేజఃశాలియగు రాముడు సంతోషించిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ప్రయాణమయ్యెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
సప్తవింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తవింశ [27] = ఇరవై ఏడవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [27] ఇరవై ఏడవ సర్గ సుసంపూర్ణము