వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥పంచసప్తతితమః సర్గః॥ [75 - వైష్ణవధనుస్సు ఎక్కుపెట్టమనుట]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“రామ! దాశరథే రామ!
 వీర్యం తే శ్రూయతేఽద్భుతమ్‌।
ధనుషో భేదనం చైవ
 నిఖిలేన మయా శ్రుతమ్‌॥

టీకా:

రామ = ఓ రామా!; దాశరథే రామ = దశరథుని కుమారుడైనా ఓ రామా!; వీర్యమ్‌ = పరాక్రమము; తే = నీయొక్క; శ్రూయతే = వినబడుచున్నది; అద్భుతమ్‌ = విశిష్ఠమైనదిగ; ధనుషః = ధనుస్సుయొక్క; భేదనం చ ఏవ = విరుచుట కూడ; చైవ = కూడ; నిఖిలేన = సకల జనులచేత; మయా = నా చేత; శ్రుతమ్‌ = వినబడినది.

భావము:

“రామా! దశరథుని కుమారుడా! నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని. శివధనుర్భంగము గురించి కూడా వినియుంటిని. ఇది చాలా ఆశ్చర్యకరము.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదద్భుతమచింత్యం చ
 భేదనం ధనుషస్త్వయా।
తచ్ఛ్రుత్వాఽహమనుప్రాప్తో
 ధనుర్గృహ్యాపరం శుభమ్‌॥

టీకా:

తత్ = ఆ; అద్భుతమ్‌ = అద్భుతము; అచింత్యమ్‌ = ఊహించరానిది; చ = మరియు; భేదనం = విరుచుట; ధనుషః = ధనుస్సుయొక్క; త్వయా = నీ చేత; తత్‌ = అది; శ్రుత్వా = విని; అహమ్‌ = నేను; అనుప్రాప్తః = వచ్చితిని; ధనుః = ధనుస్సు; గృహ్యా = గ్రహించి; అపరమ్‌ = వేరొక; శుభమ్‌ = శుభకరమైన.

భావము:

నీవు శివుని విల్లు ఎక్కుపెట్టి విరిచిన శుభవార్త వినియుంటిని. అది చాలా అద్భుతము, ఊహింపశక్యము కానిది. ఇప్పుడు మరియొక శుభప్రదమైన విల్లు తీసుకొని వచ్చితిని.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదిదం ఘోరసంకాశమ్‌
 జామదగ్న్యం మహద్ధనుః ।
పూరయస్వ శరేణైవ
 స్వబలం దర్శయస్వ చ॥

టీకా:

తత్‌ = అది; ఇదమ్‌ = ఇది; ఘోరమ్‌ = భయంకరమైన, శివునిది, వావిళ్ళవారి నిఘంటువు; సంకాశమ్‌ = వంటిది, సదృశమైనది; జామదగ్న్యమ్‌ = జమదగ్నినుండి వచ్చినది; మహత్ = గొప్పది; ధనుః = ధనుస్సు; పూరయస్వ = సంధించుము; శరేణ = బాణముతో; ఏవ = ఈ విధముగ; స్వ = సొంత; బలమ్‌ = శక్తిని; దర్శయస్వ = ప్రదర్శించగలవు; చ = మరియు;

భావము:

అది శివుని విల్లు వంటి, మిక్కిలి భయంకరమైనది. జమదగ్ని ద్వారా లభించినది. ఈ మహాధనుస్సునకు బాణము సంధించి నీ బలమును ప్రదర్శించు.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదహం తే బలం దృష్ట్వా
 ధనుషషోఽస్య ప్రపూరణే।
ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి
 వీర్యశ్లాఘ్యస్య రాఘవ!”॥

టీకా:

తత్‌ = అప్పుడు; అహం = నేను; తే = నీ; బలమ్‌ = బలమును; దృష్ట్వా = చూచి; ధనుషస్య = ధనుస్సుయొక్క; ప్రపూరణే = సంధించుట యందు; ద్వంద్వ = ఇరువురి మధ్య; యుద్ధం = యుద్ధమును; ప్రదాస్యామి = ఇచ్చెదను, ప్రదాన- వ్యుత్పత్తి. ప్ర- దా- భావే ల్యూట్, వాచస్పతము, గొప్పఈవి; వీర్య శ్లాఘ్యస్య = పరాక్రమముచే పొగడదగినవానికి; రాఘవ = ఓ రఘువంశీయుడా;

భావము:

ఈ ధనుస్సును ఎక్కుబెట్టి బాణమును సంధించుము. అప్పుడు నీ బలము చూచి, పరాక్రమముచే శ్లాఘింపదగిన నీకు నాతో ద్వంద్వయుద్ధము అనుగ్రహించెదను.”

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య తద్వచనం శ్రుత్వా
 రాజా దశరథస్తదా।
విషణ్ణవదనో దీనః
 ప్రాంజలిర్వాక్యమబ్రవీత్‌ ॥

టీకా:

తస్య = అతనియొక్క; తత్‌ = ఆ; వచనం = మాటను; శ్రుత్వా = విని; రాజా దశరథః = దశరథ మహారాజు; తదా = అప్పుడు; విషణ్ణ = విచారముతో కూడిన; వదనః = ముఖము గలవాడు; దీనః = దీనుడు; ప్రాంజలిః = చేతులు జోడించినవాడు; వాక్యమ్‌ = మాటను; అబ్రవీత్‌ = పలికెను;

భావము:

దశరథమహారాజు భార్గవరాముని మాటలు విని, వాడిపోయిన ముఖముతో దీనుడై చేతులు జోడించి ఈ విధముగా పలికెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“క్షత్రరోషాత్ప్రశాంతస్త్వం
 బ్రాహ్మణశ్చ మహాయశాః!।
బాలానాం మమ పుత్రాణామ్
 అభయం దాతుమర్హసి॥

టీకా:

క్షత్ర = క్షత్రియులపై; రోషాత్‌ = కోపము నుండి; ప్రశాంతః = శాంతించినవాడు; త్వమ్‌ = నీవు; బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; చ = మరియు; మహాయశాః = గొప్ప పేరు కలిగినవాడు; బాలానాం = పిల్లలకు; మమ = నా యొక్క; పుత్రాణాం = కుమారులకు; అభయం = భయహీనతను, రక్షణను; దాతుమ్‌ = ఇచ్చుటకు; అర్హసి = అర్హుడవు;

భావము:

“ఓ పరశురామ మహామునీ! నీవు బ్రాహ్మణుడవు. గొప్ప యశస్సు కలవాడవు. క్షత్రియులపై ఉన్న కోపము తొలగి శాంతించినవాడవు. ఇప్పుడు బాలురైన నా కుమారులకు అభయమిమ్ము.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భార్గవాణాం కులే జాతః
 స్వాధ్యాయవ్రతశాలినామ్‌।
సహస్రాక్షే ప్రతిజ్ఞాయ
 శస్త్రం నిక్షిప్తవానసి॥

టీకా:

భార్గవాణామ్‌ = భృగుమహర్షి వంశీయుల; కులే = వంశములో; జాతః = పుట్టినవాడు; స్వాధ్యాయ = స్వయముగా వేదాధ్యయనమను; వ్రత = దీక్షను; శాలినామ్‌ = చేపట్టినవాడవు; సహస్రాక్షే = వేయికన్నుల ఇంద్రునియందు; ప్రతిజ్ఞాయ = ప్రమాణము చేసి; శస్త్రం = ఆయుధమును; నిక్షిప్తవాన్‌ = విడిచిపెట్టిన వాడవు; అసి = నీవు.

భావము:

పరశురామ! నీవు భృగువంశములో జన్మించితివి, వేదాధ్యాయమను వ్రతము సలుపుచుంటివి. దేవేంద్రుని వేయికన్నుల సాక్షిగా ప్రతిజ్ఞచేసి, ఆయుధములను త్యజించిన వాడవు.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స త్వం ధర్మపరో భూత్వా
 కాశ్యపాయ వసుంధరామ్‌।
దత్త్వా వనముపాగమ్య
 మహేంద్రకృతకేతనః॥

టీకా:

సః = అట్టి; త్వమ్‌ = నీవు; ధర్మపరః = ధర్మపరుడవు; భూత్వా = అయి; కాశ్యపాయ = కశ్యపుని కొఱకు; వసున్థరామ్‌ = రాజ్యమును; దత్త్వా = ఇచ్చి; వనమ్‌ = వనమును; ఉపాగమ్య = పొంది; మహేంద్ర = మహేంద్రపర్వతమున; కృతకేతనః = నిలిపిన పతాకము కలవాడు;

భావము:

నీవు ధర్మపరుడవై రాజ్యం అంతయును కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతము మీది అడవికి పోయి నివాసము ఏర్పరచుకుంటివి.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మమ సర్వవినాశాయ
 సంప్రాప్తస్త్వం మహామునే!।
న చైకస్మిన్‌ హతే రామే
 సర్వే జీవామహే వయమ్‌”॥

టీకా:

మమ = నా యొక్క; సర్వ = సకల; వినాశాయ = వినాశముకొఱకు; సంప్రాప్తః = పొందబడితివి; త్వమ్ = నీవు; మహామునే = ఓ మహామునీ; న = కాదు; చ; ఏకః + అస్మిన్‌ = ఒక్కడు; హతే = చంపబడినచో; రామే = రాముడు; సర్వే = అందరు; జీవామహే = జీవించము; వయమ్‌ = మేము;

భావము:

ఈనాడు నీవు మా అందరి వినాశనము కొరకు వచ్చితివా మహామునీ! ఒక్క రాముడు మరణించినచోమేమందరము మరణించెదము కదా?” అనెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రువత్యేవం దశరథే
 జామదగ్న్యః ప్రతాపవాన్‌।
అనాదృత్యతు తద్వాక్యమ్‌
 రామమేవాఽభ్యభాషత॥

టీకా:

బ్రువతి = పలికిన; ఇవమ్‌ = ఇట్లు; దశరథే = దశరథుని యందు; జామదగ్న్యః = జమదగ్ని కుమారుడు, పరశురాముడు; ప్రతాపవాన్‌ = పరాక్రమవంతుడు; అనాదృత్యతు = లక్ష్యపెట్టక; తత్‌ = ఆ; వాక్యమ్‌ = మాటలను; రామమ్‌ = రాముని గురించి; ఏవ = మాత్రమే; అభిభాషత = అభి + అభాషత, సంభాషించెను.

భావము:

దశరథుడు ఈ విధముగా మాటలాడుచుండగా ప్రతాపవంతుడైన పరశురాముడు అతని మాటలు లెక్కచేయక, రామునితో మాత్రము ఇట్లు పలికెను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇమే ద్వే ధనుషీ శ్రేష్ఠే
 దివ్యే లోకాభివిశ్రుతే।
దృఢే బలవతీ ముఖ్యే
 సుకృతే విశ్వకర్మణా॥

టీకా:

ఇమే = ఇవి; ద్వే = రెండు; ధనుషీ = విల్లులు; శ్రేష్ఠే = గొప్పవి; దివ్యే = మేలైనవి, లోకాతీతమైనవిగా; లోకాః = లోకములలో; అభివిశ్రుతే = ప్రసిద్ధిగాంచినవి; దృఢే = దృఢమైనవి; బలవతీ = బలమైనవి; ముఖ్యే = ప్రధానమైనవి; సుకృతే = బాగుగా చేయబడినవి; విశ్వకర్మణా = విశ్వకర్మ చేత;

భావము:

“రామా! ఈ రెండు ధనుస్సులు కూడా శ్రేష్ఠమైనవే. లోకాతీతమైనవి. సకలలోకములలో ప్రసిద్ధిచెందినవి. దృఢమైనవి. బలమైనవి. ప్రధానమైనవి. విశ్వకర్మ వీటిని బహు చక్కగా నిర్మించెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిసృష్టం సురైరేకమ్‌
 త్య్రమ్బకాయ యుయుత్సవే।
త్రిపురఘ్నం నరశ్రేష్ఠ!
 భగ్నం కాకుత్థ్స యత్త్వయా॥

టీకా:

అనిసృష్టం = నిర్మింపబడినది; సురైః = దేవతలచేత; ఏకమ్‌ = ఒకటి; త్య్రమ్బకాయ = త్య్రయంబకుడైన శివుని కొరకు; యుయుత్సవే = యుద్ధోత్సాహునికి; త్రిపురఘ్నం = త్రిపురములను నాశనము చేసిన; నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా; భగ్నమ్‌ = విరువబడినది; కాకుత్స్థ = కాకుత్స్థుడా; యత్‌ = ఏది; త్వయా = నీచే;

భావము:

వీటిలో ఒక ధనుస్సును యుద్ధము చేయగోరుచున్న ఈశ్వరునికొరకు, దేవతలు నిర్మింపజేసిరి. త్రిపుర వినాశకరమగు ఆ ధనుస్సునే నీవు విరిచితివి.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇదం ద్వితీయం దుర్ధర్షమ్‌
 విష్ణోర్దత్తం సురోత్తమైః।
తదిదం వైష్ణవం రామ!
 ధనుః పరమభాస్వరమ్‌॥

టీకా:

ఇదమ్‌ = ఇది; ద్వితీయమ్‌ = రెండవది; దుర్ధర్షమ్‌ = ఎదిరింపశక్యము కానిది; విష్ణోః = విష్ణువునకు; దత్తమ్‌ = ఇవ్వబడినది; సుర = దేవతలలో; ఉత్తమైః = శ్రేష్ఠులచేత; తత్‌ = ఆ; ఇదమ్‌ = ఇది; వైష్ణవమ్‌ = విష్ణుమూర్తిది; రామః = ఓ! రామా; ధనుః = ధనుస్సు; పరమ = మిక్కిలి; భాస్వరమ్‌ = తేజోవంతమైనది, ప్రకాశవంతమైనది;

భావము:

ఎదిరింపరాని ఈ రెండవ ధనుస్సును దేవతలు విష్ణువునకు ఇచ్చిరి. ఈ విష్ణువిల్లు తేజస్సు ఎంతో గొప్పది.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమానసారం కాకుత్థ్స!
 రౌద్రేణ ధనుషా త్విదమ్‌।
తదా తు దేవతాస్సర్వాః
 పృచ్ఛంతి స్మ పితామహమ్‌॥

టీకా:

సమాన = సమానమైన; సారం = సత్తువ, చేవ కలిగినది; కాకుత్స్థ = కాకుత్స్థుడా; రౌద్రేణ = శివుని యొక్క; ధనుషా = ధనుస్సుతో; తు; ఇదమ్‌ = ఇది; తదా = ఆ విధముగా; తు = ఇంకను; దేవతాః = దేవతలు; సర్వాః = సకల; పృచ్ఛంతి = అడుగుచున్నారు; స్మః పితామహమ్‌ = మా యొక్క పితామహుని (బ్రహ్మదేవుని);

భావము:

ఈ విష్ణువిల్లు చేవ శివధనుస్సుతో సమానమైనది. అపుడు దేవతలందరు శివవిష్ణువుల బలాబలములను తెలిసికొను కోరికతో బ్రహ్మను అడిగిరి.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శితికణ్ఠస్య విష్ణోశ్చ
 బలాబలనిరీక్షయా।
అభిప్రాయం తు విజ్ఞాయ
 దేవతానాం పితామహః॥

టీకా:

శితికణ్ఠస్య = గరళకంఠుడైన శివునియొక్క; విష్ణోః = విష్ణుమూర్తి యొక్క,; చ - మరియు; బలాబల = బలాబలములను; నిరీక్షయా = చూచుట కొరకు; అభిప్రాయమ్‌ = అభిప్రాయమును; తు = మరియు; విజ్ఞాయ = తెలిసికొని; దేవతానామ్‌ = దేవతలయొక్క; పితామహః = పితామహుడు;

భావము:

శివుడు, విష్ణుమూర్తి... ఇరువురి బలాబలములను చూడవలెనను దేవతల అభిప్రాయము తెలుసుకొని... పితామహుడైన బ్రహ్మ

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరోధం జనయామాస
 తయో స్సత్యవతాం వరః।
విరోధే తు మహద్యుద్ధం
 అభవద్రోమహర్షణమ్‌॥

టీకా:

విరోధమ్‌ = శత్రుత్వము; జనయామాస = పుట్టించెను. తయోః = వారిలో; సత్యవతామ్‌ = సత్యవంతులలో; వరః = సశ్రేష్ఠుడు; విరోధే = శత్రుత్వము; తు = వలన; మహత్‌ = గొప్ప; యుద్ధమ్‌ = యుద్ధము; అభవత్‌ = సంభవించినది; రోమహర్షణమ్‌ = గగుర్పాటు కలిగించు;

భావము:

సత్యవంతులలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు దేవతల అభిప్రాయము తెలిసికొని, శివునకు విష్ణువునకు విరోధము కల్పించెను. వారిరువురి మధ్య గగుర్పాటు కలిగించు భయంకరమైన యుద్ధము జరిగెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శితికణ్ఠస్య విష్ణోశ్చ
 పరస్పరజిగీషుణోః।
తదా తు జృమ్భితం శైవం
 ధనుర్భీమ పరాక్రమమ్‌॥

టీకా:

శితికణ్ఠస్య = గరళకంఠుడైన శివుని యొక్క; విష్ణోః = విష్ణుని యొక్క; చ = మరియు; పరస్పర = ఒకరి నొకరు; జిగీషుణోః = గెలుచు కోరికతో; తదా తు = అప్పుడు; జృమ్భితమ్‌ = ఆవులించెను. శైవమ్‌ = శివుని; ధనుః = ధనుస్సు; భీమ = భయంకరమైన; పరాక్రమమ్‌ = పరాక్రమము కలిగినది;

భావము:

అట్లు విరోధము కలుగగా, ఒకరినొకరు జయింపగోరుచున్న శివుడు విష్ణువుల మధ్య భయంకరమైన యుద్ధము జరిగెను. అప్పుడు భయంకర ప్రతాపము గల శివధనుస్సు ఆవులించెను (చైతన్యము కోల్పోయెను).

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హుఙ్కారేణ మహాదేవ
 స్తమ్భితోఽథ త్రిలోచనః।
దేవైస్తదా సమాగమ్య
 సర్షిసంఘై స్సచారణైః॥

టీకా:

హుఙ్కారేణ = హుంకారము చేత (విష్ణువు యొక్క ధ్వని); మహాదేవః = మహాదేవుడైన పరమశివుడు; స్తమ్భితః = స్తంభింపబడెను. అథః = అటుపిమ్మట; త్రిలోచనః = ముక్కంటి; దేవైః = దేవతలచేత; తదా = అప్పుడు; సమాగమ్య = ఒకచోట చేరి; స = కూడా ఉన్న; ఋషిః = మునుల; సంఘైః = సమూహముతో; స = సహితంగా; చారణైః = చారణులతో.

భావము:

విష్ణువు హుంకారము చేయగా భయంకర పరాక్రమము గల శివధనుస్సు జడమైపోయెను. త్రిలోచనుడు కూడా కదలలేకపోయెను. అప్పుడు దేవతలు, ఋషులు, చారణులుతో కలిసి;

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యాచితౌ ప్రశమం తత్ర
 జగ్మతుస్తౌ సురోత్తమౌ।
జృమ్భితం తద్ధనుర్దృష్ట్వా
 శైవం విష్ణుపరాక్రమైః॥

టీకా:

యాచితౌ = ప్రార్థింపబడినవారై; ప్రశమం = శాంతిని; తత్ర = అచట; జగ్మతుః = పొందిరి; తౌ = వారిరువురు; సురోత్తమౌ = దేవతాశ్రేష్ఠులు ఇరువురు; జృమ్భితం = ఆవులించబడిన (జడము చేయబడిన); తత్ = ఆ; ధనుః = ధనుస్సు; దృష్ట్వా = చూసి; శైవమ్‌ = శివుని; విష్ణు పరాక్రమైః = శ్రీమహావిష్ణువుయొక్క పరాక్రమముచే.

భావము:

విష్ణు పరాక్రమముచే శివధనుస్సు జడమైపోవుట చూచిన దేవతలు, ఋషి గణములు విష్ణువే అధికుడని తెలుసుకొనిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అధికం మేనిరే విష్ణుం
 దేవాస్సర్షిగణాస్తదా ।
ధనూ రుద్రస్తు సంకృద్ధో
 విదేహేషు మహాయశాః॥

టీకా:

అధికమ్‌ = గొప్పవానిగా; మేనిరే = తలచిరి; విష్ణుమ్‌ = విష్ణువును; దేవాః = దేవతలు; స = కలిసి ఉన్న; ఋషి = ఋషుల; గణాః = సమూహములతో; తదా = అప్పుడు; ధనూః = ధనుస్సు; రుద్రః = శివుడు; తు = మరి; సంకృద్ధః = ఆగ్రహించిన; విదేహేషు = విదేహ రాజ్యమునందు; మహా = గొప్ప; యశాః = కీర్తివంతుడు.

భావము:

దేవతలు ఋషిగణములతో కూడి విష్ణువును గొప్పవాడిగా భావించిరి. మహా యశస్సు గల రుద్రుడు కోపించి, ఆ ధనుస్సును, విదేహ దేశములో దేవరాతుడను రాజర్షికి ఇచ్చివేసెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవరాతస్య రాజర్షేః
 దదౌ హస్తే ససాయకమ్‌।
ఇదం చ వైష్ణవం రామ!
 ధనుః పరపురంజయమ్‌॥

టీకా:

దేవరాతస్య = దేవరాతునియొక్క; రాజర్షేః = రాజులలో ఋషి అయిన; దదౌ = ఇచ్చెను; హస్తే = చేతియందు; ససాయకమ్‌ = బాణముతో కూడిన; ఇదం = ఇది; చ = మరియు; వైష్ణవం = విష్ణుసంబంధమైన; రామ = ఓ రామా; ధనుః = ధనుస్సు; పర = శత్రువుల; పురః = నగరములు; జయమ్‌ = జయించుశీలముకలది.

భావము:

రామా! అపుడు కోపముతో రుద్రుడు శరముతో కూడిన తన ధనుస్సును విదేహరాజ్యములో రాజర్షి దేవరాతుని చేతికి ఇచ్చెను. ఓ రామా ! ఇది శత్రుపురములను జయించు వైష్ణవధనుస్సు

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋచీకే భార్గవే ప్రాదాత్‌
 విష్ణుః స న్యాసముత్తమమ్‌।
ఋచీకస్తు మహాతేజాః
 పుత్రస్యాప్రతికర్మణః॥

టీకా:

ఋచీకే = ఋచీకుని యందు; భార్గవే = భృగువంశీయుడు; ప్రాదాత్‌ = ఇచ్చెను; విష్ణుః = విష్ణుమూర్తి; సః = అతడు; న్యాసమ్‌ = ఇల్లడగా, పదిలపరచకొనునది; ఉత్తమమ్‌ = ఉత్తమమైనదానిని; ఋచీకః = ఋచీకుడు; తు; మహాతేజాః = గొప్ప తేజోసంపన్నుడు; పుత్రస్యా = కుమారునికి; అప్రతికర్మణః = సాటిలేని కార్యములు గలవాడు;

భావము:

విష్ణువు ఆ శ్రేష్ఠమైన ధనుస్సును భృగు వంశమునకుచెందిన ఋచీకుని వద్ద పదిలపరచుకొమని ఇచ్చెను. మహాతేజఃశాలియగు ఋచీకుడు, ఆ వైష్ణవ ధనుస్సును తన పుత్రుడు, సాటిలేని కర్మలు కలవాడును...

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితుర్మమ దదౌ దివ్యం
 జమదగ్నేర్మహాత్మనః।
న్యస్తశస్త్రే పితరి మే
 తపోబలసమన్వితే॥

టీకా:

పితుః = తండ్రి; మమ = నా యొక్క; దదౌ = ఇచ్చెను; దివ్యమ్‌ = దేవతా సంబంధమైన; జమదగ్నేః = జమదగ్నికి; మహాత్మనః = గొప్ప ఆత్మకలిగినవాడు; న్యస్త = విడువబడిన; శస్త్రే = శస్త్రములు కలవాడు; పితరి = తండ్రి; మే = నా యొక్క; తపోబల = తపస్సుయొక్క బలము; సమన్వితే = కూడిన;

భావము:

ఋచీకుడు మహాత్ముడు నా తండ్రియగు జమదగ్నునకు ఆ దివ్యధనుస్సును ఇచ్చెను. తపోబలసంపన్నుడైన నా తండ్రి ఆయుధములను విడిచిపెట్టియుండగా

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అర్జునో విదధే మృత్యుం
 ప్రాకృతాం బుద్ధిమాస్థితః।
వధమప్రతిరూపం తు
 పితు శ్శృత్వా సుదారుణమ్‌॥

టీకా:

అర్జునః = కార్తవీర్యార్జునుడు; విదధే = కావించెను. మృత్యుమ్‌ = మరణమును; ప్రాకృతాం = నీచమైన, వావిళ్ళ వారి నిఘంటువు; బుద్ధిమ్ = బుద్ధిని , ఆలోచనను; అస్థితః = అవలంబించినవాడై; వధమ్‌ = వధను; అప్రతిరూపం = యుక్తముకానిది, తగనిది; తు = మరియు; పితుః = తండ్రి; శ్రుత్వా = విని; సుదారుణమ్‌ = అత్యంత భయంకరమైన.

భావము:

కార్తవీర్యార్జునుడు నీచ బుద్ధికలవాడై నా తండ్రిని చంపెను. నా తండ్రి వధ అను ఆ అత్యంత భయంకరమైన తగనిపని గూర్చి వినిన నేను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షత్రముత్సాదయన్రోషాత్‌
 జాతం జాతమనేకశః।
పృథివీం చాఖిలాం ప్రాప్య
 కాశ్యపాయ మహాత్మనే॥

టీకా:

క్షత్రమ్‌ = క్షత్రియుని; ఉత్సాదయన్‌ = తొలగించుచు, నాశనముచేయుచు; రోషాత్‌ = కోపమువలన; జాతం జాతమ్‌ = పుట్టినవానిని పుట్టినట్లు; అనేకశః = పలుమారులు; పృథివీం = భూమండలమును; చ; అఖిలామ్ = సమస్తమైన; ప్రాప్య = పొంది; కాశ్యపాయ = కశ్యపుని కొరకు; మహాత్మనే = గొప్పవాడు;

భావము:

కోపముతో అనేక పర్యాయములు క్షత్రియజాతికి చెందిన ప్రతి ఒక్కనిని, పుట్టినవానిని పుట్టినట్లుగనే సంహరించితిని. ఈ భూమండలమునంతను జయించి, దానిని యజ్ఞము పూర్తియగు సమయములో మహాత్ముడు, పుణ్యకర్మ కలవాడు అయిన కశ్యపునకు దానము చేసితిని.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యజ్ఞస్యాంతే తదా రామ!
 దక్షిణాం పుణ్యకర్మణే।
దత్త్వా మహేంద్రనిలయః
 తపోబలసమన్వితః॥

టీకా:

యజ్ఞస్య = యజ్ఞముయొక్క; అంతే = యజ్ఞము పూర్తియగు సమయములో; తదా = అప్పుడు; రామ = ఓ రామా; దక్షిణాం = దక్షిణగా; పుణ్యకర్మణే = సత్కారముగా, ఆంధ్రశబ్ధరత్నాకరము; దత్త్వా = ఇచ్చి; మహేంద్ర = మహేంద్రపర్వతమును; నిలయః = నివాసముగా కలవాడు; తపోబల = తపోబలము; సమన్వితః = కూడినవాడు;

భావము:

యజ్ఞాంతమునందు ఆ భూమండలమును మహాత్ముడు, పుణ్యాత్ముడునగు కశ్యపునికి సత్కరించు సమయమున దక్షిణగా దానమిచ్చి, పిదప తపోబలసమన్వితుడనై, మహేంద్రపర్వతముపై నివసించుచున్నాను,

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అద్యతూత్తమవీర్యేణ
 త్వయా రామ! మహాబల।
శ్రుతవాన్‌ ధనుషో భేదం
 తత్రోఽహం ద్రుతమాగతః॥

టీకా:

అద్య = ఇప్పుడు; తు; ఉత్తమ = శ్రేష్ఠమైన; వీర్యేణ = పరాక్రమము గల; త్వయా = నీ చేత; రామ = ఓ రామా; మహాబల = గొప్ప బలము గల; శ్రుతవాన్‌ = విన్నవాడను; ధనుషః = ధనుస్సుయొక్క; భేదమ్‌ = విరుచుటను; తత్ర = అచటకు; అహమ్‌ = నేను; ద్రుతమ్‌ = వేగముగ; ఆగతః = వచ్చితిని;

భావము:

మహాబలుడా! ఓ రామా! ఇప్పుడు ఉత్తమ పరాక్రమవంతుడవైన నీవు శివధనుస్సు విరిచితివని విని నేను శీఘ్రముగా వచ్చితిని.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదిదం వైష్ణవం రామ!
 పితృ పైతామహం మహత్‌।
క్షత్రధర్మం పురస్కృత్య
 గృహ్ణీష్వ ధనురుత్తమమ్‌॥

టీకా:

తత్‌ = ఆ; ఇదమ్‌ = ఈ; వైష్ణవమ్‌ = విష్ణువిల్లు; రామ = ఓ రామా; పితృపైతామహమ్‌ = వంశపారంపర్యంగా వచ్చినది; మహత్‌ = గొప్పదైన; క్షత్రధర్మం = క్షత్రియ ధర్మమును; పురస్కృత్య = గౌరవించి; గృహ్ణీష్వ = స్వీకరించుము; ధనుః = ధనుస్సును; ఉత్తమమ్‌ = శ్రేష్ఠమైన;

భావము:

ఓ రామా ! ఇదిగో ఆ విష్ణువిల్లు. మీ గొప్పదైన వంశపారంపర్యమైన క్షత్రియధర్మమును గౌరవించి యీ శ్రేష్ఠమైన ధనుస్సును గ్రహింపుము.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోజయస్వ ధనుశ్శ్రేష్ఠే
 శరం పరపురంజయమ్‌।
యది శక్నోషి కాకుత్స్థ!
 ద్వంద్వం దాస్యామి తే తతః॥

టీకా:

యోజయస్వ = సంధింపుము; ధనుః = ధనుస్సు; శ్రేష్ఠే = శ్రేష్ఠమైనదానియందు; శరం = బాణమును; పర = శత్రువుల; పురం = పురములను; జయమ్‌ = జయించు శీలము గలది; యది = ఐనచో; శక్నోషి = సమర్థుడవు; కాకుత్స్థ = ఓ కాకుత్స్థా !; ద్వంద్వం = ద్వంద్వయుద్ధమును; దాస్యామి = ఇచ్చెదను; తే = నీకు; తతః = ఆ పిదప;

భావము:

ఓ కాకుత్థ్స కులతిలక రాఘవరామా! నీవు యీ శ్రేష్ఠమైన ధనుస్సునందు శత్రుపురములను జయించెడి బాణమును సంధించగలిగితే, అప్పుడు నీకు నాతో ద్వంద్వయుద్ధము అవకాశము ఇచ్చెదను.