వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥చతుస్సప్తతితమః సర్గః॥ [74 - పరశురామ దర్శనం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ రాత్ర్యాం వ్యతీతాయాం
 విశ్వామిత్రో మహామునిః ।
ఆపృష్ట్వా తౌ చ రాజానౌ
 జగామోత్తరపర్వతమ్।
ఆశీర్భిః పూరయిత్వా చ
 కుమారాంశ్చ సరాఘవాన్ ॥

టీకా:

అథ = తరువాత; రాత్ర్యాం = రాత్రి; వ్యతీతాయాం = గడిచినది అగుచుండ; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని ; ఆపృష్ట్వా = అడిగి; తౌ = ఆ; రాజానౌ = ఇరువురు రాజులను; జగామ = వెళ్ళెను; ఉత్తరపర్వతమ్ = ఉత్తరదిక్కున ఉన్న పర్వతము గుఱించి; ఆశీర్భిః = ఆశీస్సులతో; పూరయిత్వా = నింపి; చ = మఱియు; కుమారాన్ = కుమారులను,చ = మరియు; సః =అ తడు; రాఘవాన్ = రఘువంశజులను.

భావము:

  రాత్రి గడిచిన తరువాత, విశ్వామిత్రమహాముని జనకమహారాజు దశరథమహారాజుల వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు బయలుదేరెను. విశ్వామిత్రమహాముని రఘువంశజులైన రాకుమారులు శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు అనేక ఆశీస్సులనిచ్చెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రే గతే రాజా
 వైదేహం మిథిలాధిపమ్ ।
ఆపృష్ట్వాఽ థ జగామాశు
 రాజా దశరథః పురీమ్ ॥

టీకా:

విశ్వామిత్రే = విశ్వామిత్రుడు; గతే = వెళ్ళినవాడగుచుండగా; రాజా = రాజు; వైదేహం = వైదేహును; మిథిలాధిపమ్ = మిథిలాపుర ప్రభువును. ఆపృష్ట్వా = అడిగి; అథ = తరువాత; జగామ = వెళ్ళెను; ఆశు = శీఘ్రముగా; రాజా = రాజు; దశరథః = దశరథుడు; పురీమ్ = పట్టణముగూర్చి;

భావము:

విశ్వామిత్రుడు వెడలిన పిమ్మట దశరథమహారాజుజనకమహారాజు వద్ద సెలవు గైకొని దశరథమహారాజు అయోధ్యకు బయలుదేఱెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గచ్ఛంతం తం తు రాజానమ్
 అన్వగచ్ఛన్నరాధిపః ॥

టీకా:

గచ్ఛంతం = వెళ్ళుచున్న; తమ్ = ఆ; తు రాజానమ్ = రాజును; అన్వగచ్ఛత్ = అనుసరించి వెళ్ళెను; నరాధిపః = రాజు.

భావము:

బయలుదేఱిన దశరథమహారాజును జనకమహారాజు అనుసరించెను.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ రాజా విదేహానాం
 దదౌ కన్యాధనం బహు ।
గవాం శతసహస్రాణి
 బహూని మిథిలేశ్వరః ॥

టీకా:

అథ = తరువాత; రాజా = రాజు; విదేహానాం = విదేహరాకుమార్తెలకు; దదౌ = ఇచ్చెను; కన్యాధనం = అరణము (తల్లితండ్రులు తమ పుత్రిక వివాహానంతరము ఆ నవవధువును సాగనంపుచు ఇచ్చెడి ధనము); బహు = ఎక్కువగా; గవాం = ఆవుల యొక్క; శతసహస్రాణి = లక్షలకొలది; బహూని = అనేకమైన; మిథిలేశ్వరః = జనకమహారాజు.

భావము:

జనకమహారాజు ఆ నవవధువులను సాగనంపుచు వారికి చాల ధనమును అరణముగా ఇచ్చెను. అనేక లక్షల గోవులను ఇచ్చెను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కమ్బళానాం చ ముఖ్యానాం
 క్షౌమకోట్యంబరాణి చ ।
హస్త్యశ్వరథపాదాతం
 దివ్యరూపం స్వలంకృతమ్ ॥

టీకా:

కమ్బళానాం = కంబళ్ళను; ముఖ్యానామ్ = ముఖ్యమైనవి; క్షౌమ = వెలి పట్టువి, దుకూలములను; కోటిః = కోట్లకొలది; అంబరాణి = వస్త్రములను; హస్త్యిః = ఏనుగులను; అశ్వః = గుఱ్ఱములను; పాదాతమ్ = కాలిబంటులను; దివ్యరూపం = దివ్యమైన రూపముగల; స్వలంకృతమ్ = బాగుగాఅలంకరింపబడిన.

భావము:

ముఖ్యంగా అనేకమైన మంచికంబళీలను, అనేకానేకమైన పట్టు వస్త్రములను మఱియు అద్భుతమైన రూపములు కలిగి బాగుగా అలంకరించబడిన ఏనుగులు, గుఱ్ఱములు, బంటులు కలిగియున్న చతురంగ బలమును ఇంకా....

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దదౌ కన్యాపితా తాసాం
 దాసీదాసమనుత్తమమ్ ।
హిరణ్యస్య సువర్ణస్య
 ముక్తానాం విద్రుమస్య చ ॥

టీకా:

దదౌ = ఇచ్చెను; కన్యాః = కన్యయొక్క; పితా = తండ్రి; తాసామ్ = వారికి; దాసీమ్ = పనికత్తెలను; దాసమ్ = పనివారిని; అనుత్తమమ్ = శ్రేష్ఠమైన; హిరణ్యస్య = వెండి యొక్క; సువర్ణస్య = బంగారము యొక్క; ముక్తానాం = ముత్యముల యొక్క; విద్రుమస్య = పగడముల యొక్క; చ = కూడ.

భావము:

జనకమహారాజు ఆ నూతన వధువులకు ఉత్తములైన దాసదాసీ జనమును ఇచ్చెను. ఇంకా వెండి, బంగారము, ముత్యములు, పగడములు రూపమైనట్టి.....

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దదౌ పరమసంహృష్టః
 కన్యాధనమనుత్తమమ్ ।
దత్త్వా బహు ధనం రాజా
 సమనుజ్ఞాప్య పార్థివమ్ ॥

టీకా:

దదౌ = ఇచ్చెను; పరమ సంహృష్టః = చాల సంతోషించినవాడు; కన్యాధనమ్ = అరణమును; అనుత్తమమ్ = శ్రేష్ఠమైనదానిని; దత్త్వా = ఇచ్చి; బహు = అనేక రకములైన; ధనం = విత్తములను; రాజా = రాజు; సమ = చక్కగ; అనుజ్ఞాప్య = అనుజ్ఞ పొంది; పార్థివమ్ = మహారాజును.

భావము:

చాలా మంచి అరణములు జనకమహారాజు మిక్కిలి సంతోషముగా కుమార్తెల కిచ్చెను. అనేకరకముల విత్తములను బహూకరించి, దశరథమహారాజు వద్ద చక్కగా సెలవు గైకొనెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రవివేశ స్వనిలయమ్
 మిథిలాం మిథిలేశ్వరః ।
రాజాఽ ప్యయోధ్యాధిపతిం
 సహ పుత్రైర్మహాత్మభిః ॥

టీకా:

ప్రవివేశ = ప్రవేశించెను; స్వనిలయం = తన నివాసమును; మిథిలాం = మిథిలానగరమును; మిథిలేశ్వరః = మిథిలమహారాజు; రాజా = రాజు; అపి = కూడ; అయోధ్యాపతిః = అయోధ్యమహారాజు; సహ = కూడి; పుత్రైః = పుత్రులతో; మహాత్మభిః = మహాత్ములతో.

భావము:

జనకమహారాజు తన నివాసము మిథిలానగరమునకు చేరుకొనెను. దశరథమహారాజు కూడ మహాత్ములైన తన కుమారులతో కలసి బయలుదేరెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషీన్ సర్వాన్ పురస్కృత్య
 జగామ సబలానుగః ।
గచ్ఛంతం తం నరవ్యాఘ్రం
 సర్షిసంఘం సరాఘవమ్ ॥

టీకా:

ఋషీన్ = ఋషులను; సర్వాన్ = అందరిని; పురస్కృత్య = ముందు ఉంచుకొని; జగామ = వెళ్ళెను; సబలానుగః = సైన్యము; అనుచరులతో కూడి; గచ్ఛంతం = వెళ్ళుచున్న; తం = అతని గుఱించి నరవ్యాఘ్రమ్ = పురుషశ్రేష్ఠుని గూర్చి; సర్షిసఙ్ఘం = ఋషుల సమూహముతో కూడి; సరాఘవమ్ = రఘువంశజులతో కూడి

భావము:

ఋషిల వెంట దశరథుడు, అనుచరులు వెంటరాగా తన సైన్యముతో బయలుదేరెను. ఋషులతోను కుమారులతోను అట్లు వెళ్ళుచున్న దశరథునకు

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘోరాః స్మ పక్షిణో వాచో
 వ్యాహరంతి తతస్తతః ।
భౌమాశ్చైవ మృగా స్సర్వే
 గచ్ఛంతి స్మ ప్రదక్షిణమ్ ॥

టీకా:

ఘోరాః = భయంకరమైన; స్మ = ఉండిన; పక్షిణః = పక్షులు; వాచః = పలుకులు; వ్యాహరంతి = పలికెను; తతః తతః = అక్కడక్కడ; భౌమాః = భూమికి సంబంధించిన; చ = మరియు; మృగాః = మృగములు; సర్వే = అన్నియు; గచ్ఛంతి స్మ = వెళ్ళెను; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణముగా.

భావము:

అచ్చటచ్చట ఉన్న పక్షులు భీకరముగా అరచుచుండెను. మృగములు అన్నియు ప్రదక్షిణము చేయుచున్నట్లు భూమిపై తిరుగుచుండెను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాన్ దృష్ట్వా రాజశార్దూలో
 వసిష్ఠం పర్యపృచ్ఛత ।
“అసౌమ్యాః పక్షిణో ఘోరా
 మృగాశ్చాపి ప్రదక్షిణాః ॥

టీకా:

తాన్ = వాటిని; దృష్ట్వా = చూచి; రాజశార్దూలః = రాజశ్రేష్ఠుడు; వసిష్ఠం = వసిష్ఠుని; పర్యపృచ్ఛత = ప్రశ్నించెను; అసౌమ్యాః = వికృతంగా ఉన్నట్టి; పక్షిణః = పక్షులు; ఘోరా = భయంకరమైన; మృగాః = మృగములు; అపి = కూడ; ప్రదక్షిణాః = ప్రదక్షిణము చేయుచున్నవి

భావము:

“ఆ దృశ్యము చూసి, దశరథుడు వసిష్ఠునితో "భయంకరమైన పక్షులు ఘోరముగా ప్రతికూలముగా అరచుచున్నవి, మృగములు ప్రదక్షిణముగా తిరుగుచున్నవి.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కిమిదం హృదయోత్కంపి
 మనో మమ విషీదతి"।
రాజ్ఞో దశరథస్యైతః
 శ్రుత్వా వాక్యం మహానృషిః ॥

టీకా:

కిమ్ = ఏమిటి; ఇదం = ఇది; హృదయోత్కంపి = గుండెదడలాడుచున్నది; మనః = మనస్సు; మమ = నా యొక్క; విషీదతి = క్రుంగిపోవుచున్నది; రాజ్ఞః = రాజైన; దశరథస్య = దశరథునియొక్క; ఏతః = ఈ; శ్రుత్వా = విని; వాక్యం = మాటను; మహాన్ = గొప్ప; ఋషిః = ఋషి.

భావము:

నా హృదయము కంపించున్నది, నా మనస్సు క్రుంగిపోవుచున్నది. ఇదంతా ఏమిటి?" అని అడిగెను. దశరథుని ఈ మాటలు వినిన వసిష్ఠమహర్షి,

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉవాచ మధురాం వాణీం
 శ్రూయతామస్య యత్ఫలమ్ ।
ఉపస్థితం భయం ఘోరం
 దివ్యం పక్షిముఖాచ్చ్యుతమ్ ॥

టీకా:

ఉవాచ = పలికెను; మధురాం = మధురమైన; వాణీమ్ = పలుకును; శ్రూయతామ్ = వినబడుగాక; అస్య = దీనికి; యత్ = ఏది; ఫలమ్ = ఫలమో; ఉపస్థితం = సమీపించిన; భయం = భయము; ఘోరమ్ = ఘోరమైన; దివ్యం = దైవికమైనది; పక్షిముఖాత్ = పక్షుల ముఖమునుండి; చ్యుతమ్ = జారినది.

భావము:

మధురమైన వచనము ఇట్లు పలికెను. "ఈ శకునముల ఫలమిది. పక్షులు అరుపులచే దైవికముగా రానున్న ఘోరమైన భయమును సూచించుచున్నవి.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృగాః ప్రశమయంత్యేతే”
 సంతాపస్త్యజ్యతామయమ్ ।
తేషాం సంవదతాం తత్ర
 వాయుః ప్రాదుర్బభూవ హ ॥

టీకా:

మృగాః = మృగములు; ప్రశమయంతి = ఉపశమింపజేయుచున్నవి; ఏతే = దీనిని; సంతాపః = మనస్తాపము; త్యజ్యతామ్ = విడువబడుగాక; అయమ్ = ఈ; తేషాం = వారి; సంవదతాం = మాటలలో; తత్ర = అక్కడ; వాయుః = గాలి; ప్రాదుర్బభూవః = పుట్టెను; హ.

భావము:

మృగములు ఆ భయమును ఉపశమింపజేయుచున్నవి. అందుచే నీవు మనస్తాపము వీడుము.” వారిట్లు మాటలాడుకొనుచుండ పెద్ద గాలి వీచెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంపయన్ పృథివీం సర్వాం
 పాతయంశ్చ ద్రుమాంచ్ఛుభాన్ ।
తమసా సంవృతస్సూర్య
 స్సర్వా న ప్రబభుర్దిశ ॥

టీకా:

కంపయన్ = కంపింపజేయుచు; పృథివీం = భూమిని; సర్వాం = అంతటిని; పాతయన్ = కూల్చుచు; చ = మరియు; ద్రుమాన్ = వృక్షములను; శుభాన్ = మంగళకరమైన; తమసా = చీకటిచే; సంవృతః = ఆవరింపబడెను; సూర్యః = సూర్యుడు; సర్వాః = అన్ని; న ప్రబభుః = ప్రకాశించలేదు; దిశః = దిక్కులు.

భావము:

ఆ గాలి భూమిని కంపింపజేయుచు, శుభకరమైన వృక్షములను నేల గూల్చెను. పెనుచీకటి సూర్యుని ఆవరించెను. దిక్కులు కాంతివిహీనమై ఉండెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భస్మనా చావృతం సర్వం
 సంమూఢమివ తద్బలమ్ ।
వసిష్ఠశ్చర్షయశ్చాన్యే
 రాజా చ ససుతస్తదా ॥

టీకా:

భస్మనా = ధూళిచేత; చ; ఆవృతం = కప్పివేయబడెను; సర్వం = అంతయు; సమ్మూఢం = మందబుద్దికమ్మినవారు; ఇవ = వలె; తత్ = ఆ; బలమ్ = సైన్యము; వసిష్ఠః = వసిష్ఠుడు; చ = మరియు; ఋషయః చ = ఋషులు; అన్యే = ఇతరులు; రాజా = రాజు; చ = మరియు; ససుతః = పుత్రులతో కూడి; తదా = అప్పుడు.

భావము:

అప్పుడు దశరథుని సైన్యమంతయు ధూళిచే కప్పబడి మందబుద్ధి కలవారైరి. వసిష్ఠుడు, ఇతర ఋషులు, పుత్రులతో కూడి దశరథమహారాజు మాత్రము,

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంసజ్ఞా ఇవ తత్రాసన్
 సర్వమన్యద్విచేతనమ్ ।
తస్మింస్తమసి ఘోరే తు
 భస్మచ్ఛన్నేవ సా చమూః ॥

టీకా:

సంసజ్ఞాః = స్పృహలో ఉన్నట్లు; ఇవ = వలె; తత్ర = అక్కడ; ఆసన్ = ఉండిరి; సర్వమ్ = అందరును; అన్యత్ = ఇతరులు; విచేతనమ్ = కదలిక లేక ఉండిరి; తస్మిన్ = ఆ; తమసి = అంధకారమునందు; ఘోరే = ఘోరమైన; తు; భస్మత్ = ధూళివలన; ఛన్న = కప్పబడిన; ఇవ = వలె; సా = ఆ; చమూః = సైన్యము.

భావము:

అక్కడ స్పృహలో ఉన్నట్లు ఉండిరి. తదితరులందరు స్పృహ లేరు. అతని సైన్యము మొత్తము ధూళితో కప్పబడి ఘోరమైన అంధకారములో ఉండెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దదర్శ భీమసంకాశం
 జటామండలధారిణమ్ ।
భార్గవం జామదగ్న్యం తం
 రాజరాజవిమర్దినమ్ ॥

టీకా:

దదర్శ = దర్శనమిచ్చెను; భీమ = భీకరుని; సంకాశమ్ = వలె ఉన్నవానిని; జటామండల = జడలుగట్టిన జుట్టంతయు ముడిచిన ముడి; ధారిణమ్ = ధరించిన వానిని; భార్గవం = భృగు వంశీయుడిని; జామదగ్న్యం = జమదగ్ని మహర్షి కుమారుని; తమ్ = ఆ; రాజ = రాజుల యొక్క; రాజః = రాజిన్ / సమూహమును; విమర్దినమ్ = సంహరించినవానిని.

భావము:

ఆ సైన్యము భయంకరుని, జటాజూటధారిని, భార్గవ వంశీయుడు జమదగ్నిమహర్షి పుత్రుడైన పరశురాముని, రాజుల సమూహమును సంహరించినవాని దర్శనము ఆయెను.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కైలాసమివ దుర్ధర్షం
 కాలాగ్నిమివ దుస్సహమ్ ।
జ్వలంతమివ తేజోభిః
 దుర్నిరీక్ష్యం పృథగ్జనైః ॥

టీకా:

కైలాసమ్ = కైలాసము {కైలాసము-వ్యుత్పత్తి. కేలాసః- స్పటికః- కేలాస ఇవ శుభ్రం- కేలాస + ఇణ్ స్పటిక శివ వలె తెల్లగా ఉండునది,శివుని లోకము, కుబేరుని ఆవాసము,; ఇవ = వలె; దుర్ధర్షమ్ = ఎదురింప శక్యముకాని వానిని; కాలాగ్నిమ్ = ప్రళయ కాలాగ్ని; ఇవ = వలె; దుస్సహమ్ = సహింపనలవికాని వానిని; జ్వలంతమ్ = ప్రజ్వలించుచున్నవానిని; ఇవ = వలె; తేజోభిః = తేజస్సుచే; దుర్నిరీక్ష్యం = చూచుటకు వీలుకానివానిని; పృథగ్జనైః = పాపులకు, వావిళ్ళవారి నిఘంటువు, ఆంధ్రవాచస్పతము.

భావము:

కైలాసపర్వతమువలె ఎదిరింపశక్యముకానివానిని, ప్రళయాగ్నివలె సహింపగరానివానిని, గొప్ప తేజస్సుతో ప్రజ్వరిల్లుచున్నను, పాపులకులకు కనబడని వానిని, వారు చూచిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్కంధే చాసజ్య పరశుం
 ధనుర్వి ద్యుద్గణోపమమ్ ।
ప్రగృహ్య శరముఖ్యం చ
 త్రిపురఘ్నం యథా శివమ్ ॥

టీకా:

స్కంధే = భుజమునందు; చ = మరియు; ఆసజ్య = వ్రేలాడదీసుకొని; పరశుమ్ = గండ్రగొడ్డలిని; ధనుః = విల్లు; విద్యుత్ = మెఱుపు; గణః = తీగలతో; ఉపమమ్ = సమానమైనదానిని; ప్రగృహ్య = ధరించి; శరః = బాణములు; ముఖ్యం = శ్రేష్ఠమైనవి; త్రిపురఘ్నం = త్రిపురములను ధ్వంసము చేసిన; యథా = వలె; శివమ్ = శివుని.

భావము:

అతడు, గండ్రగొడ్డలిని భుజమునకు తగుల్చుకొని, మెఱుపుతీగలవలె మిక్కిలిగా మెరయుచున్న విల్లును, శ్రేష్ఠమైన బాణమును చేబూని, త్రిపురాసురుల పురములు మూడు ధ్వంసం చేయు శివునివలె నుండెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తం దృష్ట్వా భీమసంకాశం
 జ్వలంతమివ పావకమ్ ।
వసిష్ఠప్రముఖా విప్రా
 జపహోమ పరాయణాః ॥

టీకా:

తం = అతనిని; దృష్ట్వా = చూసి; భీమ = భయంకరుని; సంకాసమ్ = వలె ఉన్నవాని; జ్వలంతమ్ = ప్రజ్వలించుచున్నవాని; ఇవ = వలె; పావకమ్ = అగ్ని; వసిష్ఠ ప్రముఖా = వసిష్ఠుడు మొదలగు; విప్రా = బ్రాహ్మణులు; జపః = జపములు; హోమః = హోమములు; పరాయణాః = లగ్నమై ఉండు వారు.

భావము:

అగ్నివలె భయంకరముగా వెలుగుచున్న అతనిని చూచి, జపాలు హోమాలు చేస్తుండేవారైన వసిష్ఠాది బ్రాహ్మణులు.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంగతా మునయస్సర్వే
 సంజజల్పురథో మిథః ।
“కచ్చిత్పితృవధామర్షీ
 క్షత్రం నోత్సాదయిష్యతి ॥

టీకా:

సంగతాః = కలసి; మునయః = మునులు; సర్వే = అందఱు; సంజజల్పుః = గుసగుసలాడుకొనిరి; అథః = తరువాత; మిథః = పరస్పరము; కచ్చిత్ = కదా; పితృ = తండ్రి; వధ = సంహారము; అమర్షీ = కోపోద్రిక్తుడైనవాడు; క్షత్రం = క్షత్రియులను; న = లేదు; ఉత్సాదయిష్యతి = నశింపజేయట.

భావము:

మునిముఖ్యులందరు కలసి వారిలోవారు ఇట్లు గుసగుసలాడుకొనిరి. "కార్తవీర్యార్జునిచే తన తండ్రి సంహరింపబడుటవలన కోపోద్రిక్తుడైన ఇతడు క్షత్రియులనందరిని సంహరించడు కదా!

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్వం క్షత్రవధం కృత్వా
 గతమన్యు ర్గతజ్వరః ।
క్షత్రస్యోత్సాదనం భూయో
 న ఖల్వస్య చికీర్షితమ్" ॥

టీకా:

పూర్వం = పూర్వము; క్షత్రవధం = క్షత్రియ సంహారమును; కృత్వా = చేసి; గత = తగ్గిన; మన్యుః = కోపము కల వాడు; గత = తగ్గిన; జ్వరః = మనస్తాపము కల వాడు; క్షత్రస్య = క్షత్రియుల యొక్క; ఉత్సాదనం = వినాశమును; భూయః = మరల; న ఖలు = కాదుకదా; అస్య = ఇతనియొక్క; చికీర్షితమ్ = అభిలాష.

భావము:

పూర్వము క్షత్రియసంహారము చేసిన తరువాత కోపము మనస్తాపము తగ్గి శాంతించిన ఇతడు మరల క్షత్రియుల వినాశనమునకు ఉద్యుక్తుడగుట లేదు కదా!"

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వాఽ ర్ఘ్య మాదాయ
 భార్గవం భీమదర్శనమ్ ।
ఋషయో రామ రామేతి
 వచో మధురమబ్రువన్ ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = మాటలాడుకొని; అర్ఘ్యమ్ = పూజార్థ జలమును; ఆదాయ = తీసుకొని; భార్గవం = పరశురాముని గూర్చి; భీమదర్శనమ్ = భయంకరముగా కనిపించువానిని; ఋషయః = ఋషులు; రామ రామ = రామా రామా; ఇతి = ఈ విధమైన; వచః = మాటను; మధురమ్ = మధురముగా; అబ్రువన్ = పలికిరి.

భావము:

ఋషులు తమలో తామిట్లు సంభాషించుకొని, భీకరముగా కనిపించుచున్న భార్గవరామునికై అర్ఘ్యము గైకొని, అతనిని మధురముగా "రామా! రామా!" అని పిలిచి పూజించిరి.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతిగృహ్య తు తాం పూజాం
 ఋషిదత్తాం ప్రతాపవాన్ ।
రామం దాశరథిం రామో
 జామదగ్న్యోఽ భ్యభాషత ॥

టీకా:

ప్రతిగృహ్య = స్వీకరించి; తు; తాం = వారి; పూజాం = పూజను; ఋషిః = ఋషులచే; దత్తామ్ = ఇవ్వబడిన; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడైన; రామం = రామునిగూర్చి; దాశరథిం = దశరథుని పుత్రునిగూర్చి; రామః = రాముడు; జామదగ్న్యః = జమదగ్నిమహర్షి పుత్రుడు; అభ్యభాషత = పలికెను.

భావము:

జమదగ్ని కుమారుడైన భార్గవరాముడు ఋషులు సమర్పించినఅర్ఘ్యమును పూజను స్వీకరించి, ప్రతాపవంతుడైన, దశరథుని పుత్రుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.

1-26-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 చతుస్సప్తతితమః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుస్సప్తతితమః [74] = డెబ్బైనాలుగవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథములోని డబ్బైనాలుగవ [74] సర్గ సంపూర్ణము