వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥ద్విసప్తతితమః సర్గః ॥ [72 - వివాహనిశ్చితార్థములు]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తముక్తవంతం వైదేహం
 విశ్వామిత్రో మహామునిః ।
ఉవాచ వచనం వీరం
 వసిష్ఠసహితో నృపమ్ ॥

టీకా:

తమ్ = అతని గూర్చి; ఉక్తవంతం = ఇట్లు పలికిన; వైదేహమ్ = విదేహాధిపత; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = గొప్ప ముని అయిన; ఉవాచ = నుడివెను; వచనం = వాక్యమును; వీరమ్ = వీరుడైన; వసిష్ఠసహితః = వసిష్ట మహర్షితోకూడి; నృపమ్ = రాజునిగూర్చి ॥

భావము:

వీరుడైన జనకమహారాజు ఆ విధముగా పలుకగా, పిమ్మట విశ్వామిత్ర వసిష్ఠ మహామునులు ఆ మహారాజుతో ఇట్లు పలికిరి.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అచింత్యాన్యప్రమేయాని
 కులాని నరపుంగవ! ।
ఇక్ష్వాకూణాం విదేహానాం
 నైషాం తుల్యోఽ స్తి కశ్చన ॥

టీకా:

అచింత్యాని = ఊహలకు అందనివి, సాటిలేనివి; అప్రమేయాని = కొలతకు అందనివి, అపరిమితమైనవి; కులాని = కులములు; నరపుఙ్గవ = ఓ నరులలో శ్రేష్ఠుడా; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకుల యొక్కయు; విదేహానామ్ = విదేహ రాజుల యొక్కయు; న = లేదు; ఏషాం = వీరికి; తుల్యః = సమానమైన; అస్తి = ఉండుట; కశ్చన = ఎవ్వడు.

భావము:

ఓ జనక నరశ్రేష్ఠ! ఇక్ష్వాకు, విదేహ మహారాజుల వంశములు సాటిలేనివి, వాటి వైభవములు అపరిమితమైనవి. ఆ వంశరాజులతో సమానమైన రాజన్యుడెవ్వడును లేడు.

1-73-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సదృశో ధర్మసమ్బన్ధః సదృశో రూపసమ్పదా|
రామలక్ష్మణయో రాజన్! సీతా చోర్మిలయా సహ||

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వక్తవ్యం చ నరశ్రేష్ఠ!
 శ్రూయతాం వచనం మమ ।
భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ!
 ఏష రాజా కుశధ్వజః ॥

టీకా:

వక్తవ్యం = చెప్పవలయునది; చ = మఱియు; నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా!; శ్రూయతాం = ఆలకింపబడుగాక; వచనం = వాక్యము; మమ = నాయొక్క; భ్రాతా = సోదరుడు; యవీయాన్ = నీయొక్క; ధర్మజ్ఞ = ధర్మము లెఱిగినవాడు; ఏషః = ఈ; రాజా = రాజు; కుశధ్వజః = కుశధ్వజుడు.

భావము:

ఓ నరశ్రేష్ఠుడా! నేను చెప్పదలిచిన వచనములను ఆలకింపుడు... నీ సోదరు డయిన కుశధ్వజుడు ధర్మము లెఱిగినవాడు.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అస్య ధర్మాత్మనో రాజన్!
 రూపేణాప్రతిమం భువి ।
సుతాద్వయం నరశ్రేష్ఠ!
 పత్న్యర్థం వరయామహే ॥

టీకా:

అస్య = ఈ; ధర్మాత్మనః = ధర్మాత్ముడు; రాజన్ = రాజా; రూపేణ = సౌందర్యము నందు; అప్రతిమం = సాటిలేని; భువి = భూమి యందు; సుతాద్వయం = కుమార్తెలు ఇద్దరును; నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా!; పత్ని = భార్యలు; అర్థం = అగుటకు; వరయామహే = వరించుచున్నాము.

భావము:

ఈ ధర్మాత్ముని (కుశధ్వజుని) కుమార్తెలు నిరుపమాన సౌదర్యవతులు. ఓ రాజా! ఆ కన్య లిఱువురిని ఈ రాకుమారులకు ఇవ్వవలసిన దని కోరుతున్నాము.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భరతస్య కుమారస్య
 శత్రుఘ్నస్య చ ధీమతః ।
వరయామస్సుతే రాజన్
 తయోరర్థే మహాత్మనోః ॥

టీకా:

భరతస్య = భరతునికి; కుమారస్య = కుమారునికి; శత్రుఘ్నస్య = శత్రుఘ్నునికి; చ = మఱియు; ధీమతః = బుద్ధిశాలులు అయిన; వరయామః = వరించుచున్నాము; సుతే = కుమార్తెలను; రాజన్ = ఓరాజా!; తయః = వారిఱువురి; అర్థే = కొఱకు; మహాత్మనోః = మహాత్ములైన.

భావము:

భరతకుమారునకు, బుద్ధిశాలి అయిన శత్రుఘ్నులు ఇద్దరికి ఇచ్చి వివాహము జరిపించవలెనని ఆకాంక్షించుచుంటిమి.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుత్రా దశరథస్యేమే
 రూపయౌవనశాలినః ।
లోకపాలోపమాస్సర్వే
 దేవతుల్యపరాక్రమాః ॥

టీకా:

పుత్రాః = పుత్రులు; దశరథస్య = దశరథుని యొక్క; ఇమే = ఈ; రూప = రూపము, అందము; యౌవన = యౌవనము; శాలినః = సమృద్ధిగా కలవారు; లోకపాల = లోకపాలురతో; ఉపమాః = సరిపోలువారు; సర్వే = అందఱు; దేవ = దేవతలతో; తుల్య = సమానమైన; పరాక్రమాః = ప్రరాక్రమవంతులు.

భావము:

ఈ దశరథపుత్రులు అందఱు అపూర్వ రూపయౌవన సంపన్నులు. లోకపాలురతో సమానులు. దేవతలను పోలు పరాక్రమవంతులు.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉభయోరపి రాజేంద్ర
 సమ్బంధేనానుబధ్యతామ్ ।
ఇక్ష్వాకోః కులమవ్యగ్రం
 భవతఃపుణ్యకర్మణః" ॥

టీకా:

ఉభయోః = ఇరువుఱికి; అపి = కూడ; రాజేంద్ర = మహారాజా!; సమ్బంధేన = వివాహసంబంధముచే; అనుబధ్యతామ్ = బంధింపబడును; ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువుయొక్క; కులమ్ = కులము; అవ్యగ్రమ్ = దృఢముగా; భవతః = నీయొక్క; పుణ్యకర్మణః = పుణ్యకర్మచే.

భావము:

ఓ మహారాజా! పుణ్యకర్మచే పునీతమైన నీ వంశమునకు, ఇక్ష్వాకుల వంశమునకు ఈ వివాహసంబంధము దృఢమైన బంధమును ఏర్పరచును.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రవచ శ్శృత్వా
 వసిష్ఠస్య మతే తదా ।
జనకః ప్రాంజలిర్వాక్యమ్
 ఉవాచ మునిపుంగవౌ ॥

టీకా:

విశ్వామిత్రః = వచనములు; వచః = మాటలు; శ్రుత్వా = విని; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మతే = అనుజ్ఞ ప్రకారము; తదా = అప్పుడు జనకః = జనకుడు; ప్రాంజలిః = అంజలి ఘటించినవాడై; వాక్యమ్ = వచనమును; ఉవాచ = పలికెను; మునిపుఙ్గవౌ = ఇద్దరు మునిశ్రేష్ఠుల గూర్చి.

భావము:

వసిష్ఠుని సమ్మతితో విశ్వామిత్రుని మాటలు విన్న జనక మహీపతి అంజలి ఘటించి వారిరువుఱితో ఇట్లు నుడివెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులం ధన్యమిదం మన్యే
 యేషాం నో మునిపుంగవౌ! ।
సదృశం కులసమ్బంధం
 యదాజ్ఞాపయథః స్వయమ్ ॥

టీకా:

కులం = కులము; ధన్యమ్ = ధన్యమైనది; ఇదం = ఈ; మన్యే = తలచెదను; యేషాం = ఏ; నః = మాకు; మునిపుఙ్గవౌ = మునిశ్రేష్ఠులిరువురు; సదృశం = తగినది; కులసమ్బంధమ్ = కులసంబంధమును; యత్ = అది; ఆజ్ఞాపయథః = ఆజ్ఞాపించుచున్నయట్టి; స్వయమ్ = స్వయముగా.

భావము:

మునిశ్రేష్ఠులు మీరిరువురు స్వయముగా మాకు తగిన వివాహ సంబంధమును ఆజ్ఞాపించుచుంటిరి. ఆహా! మీ ఆనతిచే మా వంశము ధన్యమైనది.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం భవతు భద్రం వః
 కుశధ్వజసుతే ఇమే ।
పత్న్యౌ భజేతాం సహితౌ
 శత్రుఘ్న భరతా వుభౌ ॥

టీకా:

ఏవం = ఈ విధముగా; భవతు = అగుగాక; భద్రం = కుశలము; వః = మీకు; కుశధ్వజ = కుశధ్వజుని; సుతే = కుమార్తెలు; ఇమే = ఈ; పత్న్యౌ = భార్యలు; భజేతాం = సేవించెదరు గాక; సహితౌ = కలసి; శత్రుఘ్న = శత్రుఘ్నుని; భరతౌ = భరతుని; ఉభౌ = ఉభయులను.

భావము:

అట్లే అగుగాక, మీకు క్షేమమగుగాక. ఈ కుశధ్వజుని కుమార్తెలు ఎల్లవేళల కలసిమెలసి మెసలు భరత శత్రుఘ్నులకు భార్యలై వారిని సేవించెదరుగాక...

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏకాహ్నా రాజపుత్రీణామ్
 చతసృణాం మహామునే ।
పాణీన్ గృహ్ణంతు చత్వారో
 రాజపుత్రా మహాబలాః ॥

టీకా:

ఏకాహ్నా = ఒకే దినమున; రాజపుత్రీణామ్ = రాకుమార్తెలయొక్క; చతసౄణాం = నలుగురు; మహామునే = ఓ మహాముని; పాణీన్ = చేతులను; గృహ్ణంతు = పట్టుదురుగాక; చత్వారః = నలుగురు; రాజపుత్రాః = రాకుమారులు; మహాబలాః = మహాబలవంతులు.

భావము:

ఓ మహామునీ! మహా పరాక్రమశాలులైన ఈ నలుగురు రాకుమారులు, ఆ నలుగురు రాకుమార్తెలను ఒకే ముహుర్తమున వివాహమాడుదురుగాక.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉత్తరే దివసే బ్రహ్మన్
 ఫల్గునీభ్యాం మనీషిణః ।
వైవాహికం ప్రశంసంతి
 భగో యత్ర ప్రజాపతిః" ॥

టీకా:

ఉత్తరే = ఉత్తర యందు; దివసే = దినమునందు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా!; ఫల్గునీభ్యాం = ఫల్గునీ నక్షత్రములతో కూడిన దినములలో; మనీషిణః = పండితులు;; వైవాహికం = వివాహ క్రతువును; ప్రశంసంతి = ప్రశంసించుచున్నారు; భగః = భగుడు; యత్ర = ఎప్పుడు; ప్రజాపతిః = ప్రజాపతి అయిన.

భావము:

ఓ బ్రహ్మర్షి! సంతానప్రదుడైన భగ ప్రజాపతి దేవతగాగల ఉత్తర ఫాల్గుని నక్షత్రయుక్త లఘ్నమునందు వివాహము జరిపించుట ప్రశస్తమని పండితులు పేర్కొనెదరు.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా వచస్సౌమ్యం
 ప్రత్యుత్థాయ కృతాంజలిః ।
ఉభౌ మునివరౌ రాజా
 జనకో వాక్యమబ్రవీత్ ॥

టీకా:

ఏవమ్ = ఈవిధముగా; ఉక్త్వా = పలికిన; వచః = వచనమును; సౌమ్యమ్ = సౌమ్యముగా; ప్రత్యుత్థాయ = పైకిలేచి; కృతాఞ్జలిః = అంజలి ఘటించుచున్నవాడై; ఉభౌ = ఇరువురు; మునివరౌ = మునిశ్రేష్ఠుల గూర్చి; రాజా = రాజు; జనకః = జనకుడు; వాక్యమ్ = వాక్యమును; అబ్రవీత్ = నుడివెను.

భావము:

ఇట్లు జనకమహారాజు మృదుమధురముగా పలికి లేచి వినమ్రుడై నిలిచి దోసిలొగ్గి అంజలి ఘటించుచు మఱల వారితో ఇట్లు పలికెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“పరో ధర్మః కృతో మహ్యం
 శిష్యోఽ స్మిభవతోః సదా ।
ఇమాన్యాసనముఖ్యాని
 ఆసాతాం మునిపుంగవౌ ॥

టీకా:

పరః = పరమైన; ధర్మః = ధర్మము; కృతః = చేయబడినది; మహ్యమ్ = నాకు; శిష్యః = శిష్యుడు; అస్మి = అయితిని; భవతోః = మీరిరువురుకు; సదా = ఎల్లప్పుడు; ఇమాని = ఈ; ఆసనముఖ్యాని = సింహాసనములను; ఆసాతాం = అధిష్ఠించెదరు గాక; మునిపుఙ్గవౌ = మునిశ్రేష్ఠులు ఇరువురు.

భావము:

“ఓ మునిపుంగవులారా! మీరు గొప్ప ధర్మకార్యమును ఒనర్చితిరి. నేను మీరిరువురకు ఎల్లప్పుడు శిష్యుడను. మీరు ఈ సింహాసనములను అలంకరింపుడు.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యథా దశరథస్యేయం
 తథాఽ యోధ్యా పురీ మమ ।
ప్రభుత్వే నాస్తి సందేహో
 యథాఽ ర్హం కర్తుమర్హథ" ॥

టీకా:

యథా = ఎటులో; దశరథస్య = దశరథునకు; ఇయమ్ = ఇది; తథా = అటులే; అయోధ్యా = అయోధ్యా; పురీ = పురము; మమ = నాకు; ప్రభుత్వే = ప్రభుత్వమును; నాస్తి = లేదు; సందేహః = సందేహము; యథా+అర్హం = తగువిధముగా; కర్తుమ్ = చేయుటకు; అర్హథ = తగియుంటిరి.

భావము:

ఓ మునీశ్వరులారా! మీరు ఈ మిథిలానగరమును దశరథునియొక్క అయోధ్యానగరమువలె భావింపుడు. ఈ రాజ్యముపై మీకు సర్వాధికారములు కలవు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. సముచితముగా కార్యములు నిర్వహింపుడు."

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథా బ్రువతి వైదేహే
 జనకే రఘునందనః ।
రాజా దశరథో హృష్టః
 ప్రత్యువాచ మహీపతిమ్ ॥

టీకా:

తథా = ఆ విధముగా; బ్రువతి = పలుకుచుండ; వైదేహే = విదేహరాజు అయిన; జనకే = జనకుడు; రఘునందనః = రఘునందనుడైన; రాజా = రాజు; దశరథః = దశరథుడు; హృష్టః = సంతోషించినవాడై; ప్రత్యువాచ = తిరిగి పలికెను; మహీపతిమ్ = రాజు గూర్చి (జనకునితో).

భావము:

విదేహప్రభువైన జనకుడు పలికిన వచనములను విన్న దశరథమహారాజు సంతోషించి అతనితో ఇట్లు పలికెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“యువామ సంఖ్యేయగుణౌ
 భ్రాతరౌ మిథిలేశ్వరౌ! ।
ఋషయో రాజసంఘాశ్చ
 భవద్భ్యా మభిపూజితాః ॥

టీకా:

యువామ్ = మీరిరువురు; అసఙ్ఖ్యేయ = అసంఖ్యాకమైన అపరిమితమైన; గుణౌ = సద్గుణములు కలిగినవారు; భ్రాతరౌ = ఇద్దరు సోదరులు; మిథిల+ఈశ్వరౌ = మిథిలకు ప్రభువులైన; ఋషయః = ఋషులు; రాజసంఘాః = రాజుల సంఘములు; చ = మఱియు; భవద్భ్యామ్ = మీరిరువురిచే; అభిపూజితాః = అన్నివిధముల పూజింపబడినారు.

భావము:

"మిథిలానగర ప్రభువులైన మీరిరువురు సోదరులు బహుమిక్కిలి సద్గుణములు కలిగినవారు. మీరు ఎందరో ఋషులను, రాజులను చక్కగా పూజించితిరి.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే
 గమిష్యామి స్వమాలయమ్ ।
శ్రాద్ధకర్మాణి సర్వాణి
 విధాస్యా"మీతి చాబ్రవీత్ ॥

టీకా:

స్వస్తి = శుభము; ప్రాప్నుహి = పొందగలరు; భద్రం = భద్రమగుగాక; తే = మీకు; గమిష్యామి = వెళ్ళెదను; స్వమ్ = నా; ఆలయమ్ = నివాసము గూర్చి; శ్రాద్ధకర్మాణి = శ్రాద్ధకర్మలను; సర్వాణి = అన్నియు; విధాస్యామి = చేసెదను; ఇతి = అని; చ = మఱియు; అబ్రవీత్ = పలికెను.

భావము:

"మీకు శుభమగుగాక, భద్రమగుగాక. నేను మా విడిదికి చెరెదను. నాందీదేవతాహ్వానములు మొదలగు వివాహప్రారంభ శుభకార్యములను చేసెదను" అని పలికెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తమాపృష్ట్వా నరపతిమ్
 రాజా దశరథస్తదా ।
మునీంద్రౌ తౌ పురస్కృత్య
 జగామాశు మహాయశాః ॥

టీకా:

తమ్ = ఆ; ఆపృష్ట్వా = అడిగి; నరపతిమ్ = రాజును; రాజా = రాజు; దశరథః = దశరథుడు; తదా = అంతట; మునీంద్రౌ = ఇరువురు మునీంద్రులను; తౌ = వారిరువురు; పురస్కృత్య = ముందిడుకొని; జగామ = వెళ్లెను; ఆశు = వేగముగా; మహాయశాః = గొప్ప యశస్సు కలిగినవారు.

భావము:

అంతట గొప్ప యశస్సు కలిగిన దశరథమహారాజు జనకుని దగ్గర సెలవు తీసుకొని వసిష్ఠ, విశ్వామిత్రులతో కూడి తన విడిదికి శీఘ్రముగా వెళ్ళెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స గత్వా నిలయం రాజా!
 శ్రాద్ధం కృత్వా విధానతః ।
ప్రభాతే కాల్యముత్థాయ
 చక్రే గోదానముత్తమమ్ ॥

టీకా:

సః = అతడు; గత్వా = వెళ్ళి; నిలయం = నివాసము గూర్చి; రాజా = రాజు; శ్రాద్ధం = శ్రాద్ధమును; కృత్వా = చేసి; విధానతః = విధివిధానముగా; ప్రభాతే = ప్రాతఃకాలమున; కాల్యమ్ = కాలోచితమైన; ఉత్థాయ = లేచి; చక్రే = చేసెను; గోదానమ్ = గోదానపూర్వక "సమావర్తన" క్రతువు ఉత్తమమ్ = ఉత్తమమైన.

భావము:

దశరథమహీపతి తన విడిది గృహమునకేగి విధివిధానముగా నాందీకార్యక్రమములను ఆచరించెను. మఱునాడు ప్రాతఃకాలమున లేచి సకాలములో ఉత్తమమైన గోదానపూర్వక "సమావర్తన" క్రతువును ఆచరించెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గవాం శతసహస్రాణి
 బ్రాహ్మణేభ్యో నరాధిపః ।
ఏకైకశో దదౌ రాజా!
 పుత్రానుద్దిశ్య ధర్మతః ॥

టీకా:

గవాం = గోవులను; శతసహస్రాణి = వందవేలు (ఒక లక్ష); బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణుల కొఱకు; నరాధిపః = రాజు; ఏకైకశః = ఒక్కొక్కరిని; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; పుత్రాన్ = కుమారులను; ఉద్దిశ్య = ఉద్దేశించి; ధర్మతః = ధర్మబద్ధముగా.

భావము:

దశరథ మహీపతి తన ఒక్కొక్క కుమారుని పేరుమీదుగా ఒక్కొక్క లక్ష గోవులను ధర్మబద్ధముగా బ్రాహ్మణోత్తములకు దానముచేసెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సువర్ణశ్రుంగా స్సంపన్నా
 స్సవత్సాః కాంస్యదోహనాః ।
గవాం శతసహస్రాణి
 చత్వారి పురుషర్షభః ॥

టీకా:

సువర్ణశ్రుంగాః = బంగారు కొమ్ములు కలిగినవి; సంపన్నాః = సమృద్ధిగా పాలిచ్చునవి; సవత్సాః = లేగలు కలిగినవి; కాంస్యదోహనాః = పాలు పితుకుటకు కంచుపాత్రలు కూడినవి; గవాం = గోవులను; శతసహస్రాణి = వందవేలు(లక్ష); చత్వారి = నాలుగు; పురుషర్షభః = పురుషశ్రేష్ఠుడు.

భావము:

పుత్రులపై అధికమైన ప్రేమకలిగిన రఘునందనుడు దశరథుడు బంగారు కొమ్ము తొడుగులు కలిగినవి, సమృద్ధిగా పాలిచ్చునవి,లేగలతో కూడినవి అయిన నాలుగు లక్షల ఆవులను పాలు పితుకుటకు అవసరమైన కంచు పాత్రలతో కూడ దానముగా ఇచ్చెను,

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విత్తమన్యచ్చ సుబహు
 ద్విజేభ్యో రఘునందనః ।
దదౌ గోదానముద్దిశ్య
 పుత్రాణాం పుత్రవత్సలః ॥

టీకా:

విత్తమ్ = ధనమును; అన్యత్ = ఇతరమైన; చ = మఱియు; సుబహు = పుష్కలమైన; ద్విజేభ్యః = ద్విజులకొఱకు (బ్రాహ్మణులకొఱకు); రఘునందనః = రఘునందనుడు; దదౌ = ఇచ్చెను; గోదానమ్ = గోదానము; ఉద్దిశ్య = ఉద్దేశించి; పుత్రాణాం = కుమారుల యొక్క; పుత్రవత్సలః = పుత్రులపై అధిక ప్రేమకలిగినవాడు.

భావము:

పుష్కలముగా ధనమును పుత్రులపై కల ప్రేమకొలది, గోదాన వ్రత సమయమునందు బ్రాహ్మణులకు దానము చేసెను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స సుతైః కృతగోదానైః
 వృతస్తు నృపతిస్తదా ।
లోకపాలైరివాభాతి
 వృతః స్సౌమ్యః ప్రజాపతిః" ॥

టీకా:

సః = అతడు; సుతైః = సుతులతో; కృతగోదానైః = గోదానములు చేసినవాడై; వృతః = కూడినవాడై; తు; నృపతిః = రాజు; తదా = అప్పుడు; లోకపాలైః = లోకపాలురు; ఇవ = వలె; ఆభాతి = ప్రకాశించుచుండెను; వృతః = కూడినవాడై; సౌమ్యః = సౌమ్యమైన; ప్రజాపతిః = ప్రజాపతి.

భావము:

గోదానములను ఒనర్చి పుత్రులతో కూడియున్న దశరథుడు లోకపాలుర మధ్యనుండి ప్రసన్నచిత్తుడైన ప్రజాపతివలె ప్రకాశించుచుండెను.

1-26-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 ద్విసప్తతితమః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్విసప్తతితమః [72] = డెబ్బైరెండవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథములోని డెబ్బైరెండవ [72] సర్గ సంపూర్ణము.