వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥ఏకసప్తతితమః సర్గః ॥ 71- జనకమహారాజు వంశచరిత్ర]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం బ్రువాణం జనకః
 ప్రత్యువాచ కృతాంజలిః ।
“శ్రోతుమర్హసి భద్రం తే
 కులం నః పరికీర్తితమ్ ॥

టీకా:

ఏవమ్ = ఇట్లు; బ్రువాణమ్ = పలుకుచున్నవాని గూర్చి; జనకః = జనకుడు; ప్రత్యువాచ = బదులుపలికెను; కృత = చేయబడిన; అంజలిః = జోడించిన చేతులు కలవాడు; శ్రోతుమ్ = వినుటకు; అర్హసి = తగియుంటివి; భద్రం = క్షేమమగుగాక; తే = నీకు; కులం = కులమును గురించి; నః = మా యొక్క; పరి = బాగుగా; కీర్తితమ్ = కీర్తింపబడినది.

భావము:

ఈ విధముగా దశరథుని వంశవృక్షమును వివరించిన వసిష్ఠునకు జనకమహారాజు నమస్కరించి, ఇట్లు పలికెను. “నీకు శుభమగుగాక. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన మా వంశమును గురించి చెప్పెదను వినుడు.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రదానే హి మునిశ్రేష్ఠ
 కులం నిరవశేషతః ।
వక్తవ్యం కులజాతేన
 తన్నిబోధ మహామునే ॥

టీకా:

ప్రదానే = కన్యాదాన సమయమునందు; హి = తప్పక; మునిశ్రేష్ఠః = మునులలో శ్రేష్ఠుడా; కులం = కులమును గురించి; నిరవశేషతః = సంపూర్ణముగా, ఏదీ వదలకుండా; వక్తవ్యం = చెప్పదగినది; కులజాతేన = సద్వంశజునిచే; తత్ = దానిని గురించి; నిబోధ = తెలుసుకొనుము; మహామునే = మహామునీ.

భావము:

ఓ వసిష్ఠ మహామునీ! కన్యాదానము చేయునపుడు, ఆ వంశములో జన్మించినవారు తమ వంశము గురించి సంపూర్ణముగా తెలియజేయవలెను. మా వంశముగురించి వివరంచెదను. వినుడు.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజాఽ భూత్ త్రిషు లోకేషు
 విశ్రుత స్స్వేన కర్మణా ।
నిమిః పరమధర్మాత్మా
 సర్వసత్త్వవతాం వరః ॥

టీకా:

రాజా = రాజు; అభూత్ = ఉండెను; త్రిషు = మూడు; లోకేషు = లోకములందు; విశ్రుతః = ప్రసిద్ధుడు; స్వేన = తనవైన; కర్మణా = కర్మలచే; నిమిః = నిమి; పరమధర్మాత్మా = పరమధర్మాత్ముడైన; సర్వ = సమస్త; సత్త్వవతాం = బలవంతులలో; వరః = శ్రేష్ఠుడు.

భావము:

తన సత్కర్మలచేత ముల్లోకములలో ప్రసిద్ధుడు, మిక్కిలి ధర్మాత్ముడు, బలవంతులు అందరిలోనూ గొప్పవాడు, అగు నిమి అను చక్రవర్తి ఉండెను.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య పుత్రోమిథిర్నామ
 మిథిలా యేన నిర్మితా ।
ప్రథమో జనకో నామ
 జనకాదప్యుదావసుః ॥

టీకా:

తస్య = అతని యొక్క; పుత్రః = పుత్రుడు; మిథిః = మిథి అని; నామ = ప్రసిద్దుడు; మిథిలా = మిథిల; యేన = ఎవరిచేత; నిర్మితా = నిర్మింపబడెనో; ప్రథమః = మొదటి; జనకః = జనకుడు అని; నామ = ప్రసిద్ధుడు; జనకాత్ = జనకుని నుండి; అపి = కూడ; ఉదావసుః = ఉదావసువు.

భావము:

ఆ నిమి కుమారుడు మిథి. ఆ మిథిచేతనే మిథిలా నగరము నిర్మింపబడినది. అతడే మొదటి జనకుడు. అతని కుమారుడు ఉదావసువు.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉదావసోస్తు ధర్మాత్మా
 జాతో వై నందివర్ధనః ।
నందివర్ధనపుత్రస్తు
 సుకేతుర్నామ నామతః ॥

టీకా:

ఉదావసః = ఉదావసువునకు; తు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; జాతః = జన్మించెను; నందివర్ధనః = నందివర్ధనుడు; నందివర్ధన = నందివర్ధనుని; నందివర్ధన పుత్రః = పుత్రుడు; తు; సుకేతుః = సుకేతువు అని; నామ = ప్రసిద్ధి చెందినవాడు; నామతః = పేరున.

భావము:

ఉదావసువునకు ధర్మాత్ముడైన నందివర్ధనుడను పుత్రుడు కలిగెను. అతని పుత్రుడు ప్రసిద్ధుడైన సుకేతువు.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుకేతోరపి ధర్మాత్మా
 దేవరాతో మహాబలః ।
దేవరాతస్య రాజర్షేః
 బృహద్రథ ఇతి స్మృతః ॥

టీకా:

సుకేతోః = సుకేతువునకు; అపి = కూడ; ధర్మాత్మా = ధర్మాత్ముడు; దేవరాతః = దేవరాతుడు; మహాబలః = మహాబలశాలి; దేవరాతస్య = దేవరాతునకు; రాజర్షేః = రాజర్షికి; బృహద్రథ = బృహద్రథుడు; ఇతి = అని; స్మృతః = చెప్పబడినది.

భావము:

సుకేతువునకు, ధర్మాత్ముడును మహాబలశాలి ఐన దేవరాతుడు జన్మించెను. రాజర్షి ఐన దేవరాతునకు బృహద్రథుడు జన్మించెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బృహద్రథస్య శూరోఽ భూత్
 మహావీరః ప్రతాపవాన్ ।
మహావీరస్య ధృతిమాన్
 సుధృతిస్సత్యవిక్రమః ॥

టీకా:

బృహద్రథస్య = బృహద్రథునకు; శూరః = శూరుడు; అభూత్ = కలిగెను; మహావీరః = మహావీరుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; మహావీరస్య = మహావీరునికి; ధృతిమాన్ = ధైర్యవంతుడు; సుధృతిః = సుధృతి; సత్యవిక్రమః = సత్యమైన పరాక్రమవంతుడు.

భావము:

బృహద్రథునకు శూరుడును ప్రతాపవంతుడైన మహావీరుడు కలిగెను. మహావీరునకు సత్య పరాక్రమవంతుడైన సుధృతి జన్మించెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుధృతేరపి ధర్మాత్మా
 దృష్టకేతుస్సుధార్మికః ।
దృష్టకేతోస్తు రాజర్షేః
 హర్యశ్వ ఇతి విశ్రుతః ॥

టీకా:

సుధృతేః = సుధృతికి; అపి = కూడ; ధర్మాత్మా = ధర్మాత్ముడు; దృష్టకేతుః = దృష్టకేతువు; సుధార్మికః = చాల ధార్మికుడు; దృష్టకేతోః తు = దృష్టకేతువునకు; తు; రాజర్షేః = రాజర్షికి; హర్యశ్వః = హర్యశ్వుడు; ఇతి = అని; విశ్రుతః = ప్రసిద్ధుడైన.

భావము:

సుధృతికి ధర్మపరుడైన దృష్టకేతువు జన్మించెను. రాజర్షి ఐన దృష్టకేతువునకు హర్యశ్వుడు అని ప్రఖ్యాతి గాంచిన కుమారుడు జన్మించెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హర్యశ్వస్య మరుః పుత్రో
 మరోః పుత్రః ప్రతింధకః ।
ప్రతింధకస్య ధర్మాత్మా
 రాజా కీర్తిరథస్సుతః ॥

టీకా:

హర్యశ్వస్య = హర్యశ్వునకు; మరుః = మరువు; పుత్రః = పుత్రుడు; మరోః = మరువునకు; పుత్రః = పుత్రుడు; ప్రతింధకః = ప్రతింధకుడు; ప్రతింధకస్య = ప్రతింధకునకు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; రాజా = రాజు; కీర్తిరథః = కీర్తిరథుడు; సుతః = పుత్రుడు.

భావము:

హర్యశ్వుని పుత్రుడు మరువు. మరుని పుత్రుడు ప్రతింధకుడు. అతని పుత్రుడు ధర్మపరాయణుడైన కీర్తిరథుడు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుత్రః కీర్తిరథస్యాపి
 దేవమీఢ ఇతి స్మృతః ।
దేవమీఢస్య విబుధో
 విబుధస్య మహీధ్రకః ॥

టీకా:

పుత్రః = పుత్రుడు; కీర్తిరథస్య అపి = కీర్తిరథునియొక్క కూడ; దేవమీఢః = దేవమీఢుడు; ఇతి = అని; స్మృతః = చెప్పబడినాడు; దేవమీఢస్య = దేవమీఢునికి; విబుధః = విబుధుడు; విబుధస్య = విబుధునకు; మహీధ్రకః = మహీధ్రకుడు.

భావము:

కీర్తిరథునకు దేవమీఢుడు, దేవమీఢునకు విబుధుడు, విబుధునకు మహీధ్రకుడు జన్మించిరి.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహీధ్రకసుతో రాజా
 కీర్తిరాతో మహాబలః ।
కీర్తిరాతస్య రాజర్షేః
 మహారోమా వ్యజాయత ॥

టీకా:

మహీధ్రక సుతః = మహీద్రకుని కుమారుడు; రాజా = రాజు; కీర్తిరాతః = కీర్తిరాతుడు; మహాబలః = మహాబలశాలి; కీర్తిరాతస్య = కీర్తిరాతునకు; రాజర్షేః = రాజర్షికి; మహారోమః = మహారోముడు; వ్యజాయత = జన్మించెను.

భావము:

మహీధ్రకునకు మహాబలశాలి ఐన కీర్తిరాతుడు జన్మించెను. రాజర్షి అగు కీర్తిరాతునకు మహారోముడు కలిగెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహారోమ్ణస్తు ధర్మాత్మా
 స్వర్ణరోమా వ్యజాయత ।
స్వర్ణరోమ్ణస్తు రాజర్షేః
 హ్రస్వరోమా వ్యజాయత ॥

టీకా:

మహారోమ్ణః తు = మహారోమునకు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; స్వర్ణరోమః = స్వర్ణరోముడు; వ్యజాయత = జన్మించెను; స్వర్ణరోమ్ణః = స్వర్ణరోమునికి; తు; రాజర్షేః = రాజర్షికి; హ్రస్వరోమః = హ్రస్వరోముడు; వ్యజాయత = పుట్టెను.

భావము:

మహారోమునకు ధర్మాత్ముడైన స్వర్ణరోముడు పుట్టెను. స్వర్ణరోమునికి రాజర్షి ఐన హ్రస్వరోముడు పుట్టెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య పుత్రద్వయం జజ్ఞే
 ధర్మజ్ఞస్య మహాత్మనః ।
జ్యేష్ఠోఽ హమనుజో భ్రాతా
 మమ వీరః కుశధ్వజః ॥

టీకా:

తస్య = అతనికి; పుత్రద్వయం = ఇరువురు పుత్రులు; జజ్ఞే = జన్మించిరి; ధర్మజ్ఞస్య = ధర్మము నెరిగిన; మహాత్మనః = మహాత్మునకు; జ్యేష్ఠః = పెద్ద కొడుకు; అహమ్ = నేను; అనుజః = తరవాత పుట్టినవాడు; భ్రాతా = సహోదరుడు; మమ = నా యొక్క; వీరః = వీరుడైన; కుశధ్వజః = కుశధ్వజుడు.

భావము:

ధర్మాత్ముడు మహాత్ముడైన హ్రస్వరోమునకు ఇరువురు కుమారులు జన్మించిరి. నేను (సుమతి) పెద్దవాడను. నా తమ్ముడు వీరుడైన కుశధ్వజుడు.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే
 సోఽ భిషిచ్య నరాధిపః ।
కుశధ్వజం సమావేశ్య
 భారం మయి వనం గతః ॥

టీకా:

మాం తు = నన్ను; జ్యేష్ఠం = పెద్దవానిని; పితా = తండ్రి; రాజ్యే = రాజ్యమునందు; సః = ఆ; అభిషిచ్య = అభిషేకించి; నరాధిపః = రాజు; కుశధ్వజం = కుశధ్వజుని; సమావేశ్య = ఉంచి; భారం = బాధ్యతను; మయి = నా యందు; వనం = వనమును గూర్చి; గతః = వెళ్ళెను.

భావము:

మా తండ్రి హ్రస్వరోమమహారాజు, పెద్దవాడినైన నన్ను రాజుగా నభిషేకించి, కుశధ్వజుని బాధ్యత నాపై ఉంచి, తాను వానప్రస్థాశ్రమము స్వీకరించెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వృద్ధే పితరి స్వర్యాతే
 ధర్మేణ ధురమావహమ్ ।
భ్రాతరం దేవసంకాశమ్
 స్నేహాత్పశ్యన్ కుశధ్వజమ్ ॥

టీకా:

వృద్ధే = వృద్ధుడైన; పితరి = తండ్రి; స్వర్యాతే = స్వర్గమునకు చనగా; ధర్మేణ = ధర్మముతో; ధురమ్ = రాజ్యభారమును; ఆవహమ్ = వహించితిని; భ్రాతరం = సహోదరుడుని; దేవసంకాశమ్ = దైవసమానుడుని; స్నేహాత్ = స్నేహమువలన; పశ్యన్ = చూచుకొనుచు; కుశధ్వజమ్ = కుశధ్వజుని.

భావము:

వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్తుడైన తరువాత, దైవసమానుడైన నా తమ్ముడు కుశధ్వజుని ప్రేమగా చూచుకొనుచు, రాజ్యభారమును ధర్మముగా వహించితిని.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కస్య చిత్త్వథకాలస్య
 సాంకాశ్యాదగమ త్పురాత్ ।
సుధన్వా వీర్యవాన్రాజా
 మిథిలా మవరోధకః ॥

టీకా:

కస్య చిత్ = కొంత; అథ = తరువాత; కాలస్య = కాలమునకు; సాంకాశ్యాత్ = సాంకాశ్యము నుండి; అగమత్ = పొందెను; పురాత్ = పురము నుండి; సుధన్వా = సుధన్వుడను; వీర్యవాన్ = పరాక్రమవంతుడైన; రాజా = రాజు; మిథిలామ్ = మిథిలాపురిని; అవరోధకః = దండెత్తెను.

భావము:

కొంతకాలము తరువాత, సాంకాశ్యనగరమునుండి సుధన్వుడు అను రాజు మిథిలానగరముపై దండెత్తెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స చ మే ప్రేషయామాస
 శైవం ధనురనుత్తమమ్ ।
సీతా కన్యా చ పద్మాక్షీ
 మహ్యం వై దీయతామితి ॥

టీకా:

సః = అతడు; చ = మరియు; మే = నాకు; ప్రేషయామాస = కబురు పంపెను; శైవం = శివుని; ధనుః = ధనుస్సు; అనుత్తమమ్ = సాటిలేని ఉత్తమమైనదానిని; సీతా = సీతయు; కన్యా = కన్య; చ = మరియు; పద్మాక్షీ = పద్మములవంటి కన్నులుగలది; మహ్యం = నాకు; దీయతామ్ = ఈయబడుగాక; ఇతి = అని;

భావము:

అసమానమైన శివధనుస్సును, పద్మపత్రాయతాక్షి ఐన సీతను తనకు ఇమ్మని నాకు వర్తమానము పంపినాడు.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యాప్రదానా ద్బ్రహ్మర్షే
 యుద్ధమాసీన్మయా సహ ।
స హతోఽ భిముఖో రాజా
 సుధన్వా తు మయా రణే ॥

టీకా:

తస్య = అతనికి; అప్రదానాత్ = ఇవ్వకపోవుటవలన; బ్రహ్మర్షే = బ్రహ్మర్షీ; యుద్ధమ్ = యుద్ధము; ఆసీత్ = జరిగెను; మయా = నాతో; సహ = కూడ; సః = అతను; హతః = వధింపబడెను; అభిముఖః = తలపడినవాడు; రాజా = రాజు; సుధన్వా = సుధన్వుడు; మయా = నాచే; రణే = యుద్ధమునందు.

భావము:

నేను శివధనుస్సును, సీతను అతనికి ఇవ్వకపోవుటవలన, మా ఇరువురికి యుద్ధము జరిగెను. బ్రహ్మర్షీ! నేను యుద్ధమునందు నాతో తలపడిన సుధన్వరాజును వధించితిని.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిహత్య తం మునిశ్రేష్ఠ
 సుధన్వానం నరాధిపమ్ ।
సాంకాశ్యే భ్రాతరం వీరం
 అభ్యషించం కుశధ్వజమ్ ॥

టీకా:

నిహత్య = వధించి; తం = ఆ; మునిశ్రేష్ఠ = ముని శ్రేష్ఠుడా; సుధన్వానం = సుధన్వుని; నరాధిపమ్ = రాజుని; సాంకాశ్యే = సాంకాశ్యదేశమునందు; భ్రాతరం = సోదరుని; వీరమ్ = వీరుని; అభ్యషించం = అభిషేకించితిని; కుశధ్వజమ్ = కుశధ్వజుని.

భావము:

ఓ మహామునీ! సుధన్వుని వధించి, ఆ సాంకాశ్యపురమునకు నా సోదరుడు కుశధ్వజుని రాజుగా అభిషిక్తుని చేసితిని.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కనీయానేష మే భ్రాతా
 అహం జ్యేష్ఠో మహామునే ।
దదామి పరమప్రీతో
 వధ్వౌ తే మునిపుంగవ ॥

టీకా:

కనీయాన్ = చిన్నవాడు; ఏషః = ఇతను; మే = నా యొక్క; భ్రాతా = సోదరుడు; అహం = నేను; జ్యేష్ఠః = పెద్ద వాడను; మహామునే = మహామునీ; దదామి = ఇచ్చుచున్నాను; పరమప్రీతః = చాల సంతోషముగా; వధ్వౌ = ఇద్దరు వధువులను; తే = ఆ; మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠా.

భావము:

మునీశ్వరా! మా ఇద్దరిలో నేనుపెద్దవాడను. ఇతను నా తమ్ముడు. కన్యల నిద్దరినీ సంతోషముగా ఇచ్చెదను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సీతాం రామాయ భద్రం తే
 ఊర్మిలా లక్ష్మణాయ చ ।
వీర్యశుల్కాం మమ సుతామ్
 సీతాం సురసుతోపమామ్ ॥

టీకా:

సీతాం = సీతను; రామాయ = రామునికొరకు; భధ్రం = శుభమగు గాక; తే = నీకు; ఊర్మిళాం = ఊర్మిళను; లక్ష్మణాయ చ = లక్ష్మణుని కొఱకు; వీర్యశుల్కాం = వీరత్వము శుల్కముగా గలదానిని; మమ = నా యొక్క; సుతామ్ = కుమార్తెను; సీతాం = సీతను; సురసుత = దేవకన్యలతో; ఉపమామ్ సమానమైనది.

భావము:

మునిశ్రేష్ఠా! నీకు మంగళమగు గాక! సీతను రామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నా కుమార్తె సీత దేవకన్యలతో సమానమైనది. వీరత్వమే శుల్కముగా గలది.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్వితీయామూర్మిలాం చైవ
 త్రిర్దదామి న సంశయః ।
దదామి పరమప్రీతో
 వధ్వౌ తే రఘునందన ॥

టీకా:

ద్వితీయామ్ = రెండవ ఆమెను; ఊర్మిళాం = ఊర్మిళను; చ = మరియు; ఏవ = ఇట్లు; త్రిః = ముమ్మారు; దదామి = ఇచ్చుచున్నాను; న = లేదు; సంశయః = సందేహము; దదామి = ఇచ్చుచున్నాను; పరమప్రీతః = చాల సంతోషముగా; వధ్వౌ = వధువులు ఇద్దరిని; తే = ఆ; రఘునందన = రఘువంశజుడా.

భావము:

దశరథ మహారాజా! నా రెండవ కుమార్తె ఊర్మిళను కూడా ఇచ్చెదనని ముమ్మారు అనగా మనోవాక్కాయక్రమలను త్రికరణ శుద్ధిగా చెప్పుచున్నాను. సందేహింప నవసరము లేదు. ఈ వధువులను సంతోషముగా ఇచ్చుచున్నాను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామలక్ష్మణయో రాజన్
 గోదానం కారయస్వ హ ।
పితృకార్యం చ భద్రం తే
 తతో వైవాహికం కురు ॥

టీకా:

రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు; రాజన్ = రాజా; గోదానం = గోదానము (క్షురకర్మ) అను కార్యమును; కారయస్వ హ = చేయించుము; పితృకార్యం చ = నాందీశ్రాద్ధమును కూడ; భద్రం = శుభమగు గాక; తే = నీకు; తతః = తరువాత; వైవాహికం = వివాహమును; కురు = చేయుము.

భావము:

రాజా! రామలక్ష్మణులకు గోదానము (సమావర్తనము అను క్షురకర్మ) చేయించుము. పితృదేవతలకు నాందీశ్రాద్ధము చేయించిన పిమ్మట వివాహము జరిపించుము.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఘా హ్యద్య మహాబాహో!
 తృతీయే దివసే ప్రభో ।
ఫల్గున్యాముత్తరే రాజన్!
 తస్మిన్వైవాహికం కురు ।
రామలక్ష్మణయో రాజన్
 దానం కార్యం సుఖోదయమ్ ॥

టీకా:

మఘా హి = మఘా నక్షత్రము కదా; హి; అద్య = నేడు; మహాబాహో = గొప్ప బాహువులు గలవాడా; తృతీయే = మూడవ; దివసే = దినమునందు; ప్రభో = రాజా; ఫల్గున్యామ్ ఉత్తరే = ఉత్తరఫల్లుణీ నక్షత్రమునందు; రాజన్ = రాజా; తస్మిన్ = ఆ; వైవాహికమ్ = వివాహమును; కురు = చేయుము; రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు; రాజన్ = రాజా; దానం = దానము; కార్యం = చేయదగిన పని; సుఖోదయమ్ = సుఖము కలిగించునది.

భావము:

దశరథ మహారాజా! నేడు మఘానక్షత్రము కదా. నేటికి మూడవ దినమున ఉత్తరఫల్గునీ నక్షత్రము ఉన్న సమయములో వివాహము జరుపించుము. వివాహమునకు ముందు రామలక్ష్మణులకు శుభము చేకూర్చుటకై గో, భూ, సువర్ణ ఇత్యాది దానములను చేయింపుము..

1-25-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 ఏకసప్తతితమః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకసప్తతితమః [71] = డెబ్బైయొకటవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని డెబ్బైయొకటవ [71] సర్గ సంపూర్ణము