వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥సప్తతితమః సర్గః॥ [70 - ఇక్ష్వాకు వంశ చరిత్ర]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః ప్రభాతే జనకః
 కృతకర్మా మహర్షిభిః ।
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః
 శతానందం పురోహితమ్ ॥

టీకా:

తతః = తరువాత; ప్రభాతే = ప్రాతఃకాలమున; జనకః = జనక మహారాజు; కృత = చేయబడిన; కర్మా = కర్మలు కలవాడు; మహర్షిభిః = మహర్షులచే; ఉవాచ = పలికెను; వాక్యం = మాటను; వాక్యజ్ఞః = వాక్చతురుడు; శతానందం = శతానందుని గుఱించి; పురోహితమ్ = పురోహితుడు.

భావము:

ప్రాతఃకాలమున చేయించవలసిన కర్మలు మహర్షులచే చేయించిన తరువాత, వాక్చతురుడైన జనకమహారాజు తమ పురోహితుడైన శతానందునితో ఇట్లు చెప్పెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“భ్రాతా మమ మహాతేజా
 యవీయానతిధార్మికః ।
కుశధ్వజ ఇతి ఖ్యాతః
 పురీమధ్యవస చ్ఛుభామ్ ॥

టీకా:

భ్రాతాః = సహోదరుడు; మమ = నా యొక్క; మహా = గొప్ప; తేజా = తేజశ్శాలి; యవీయాన్ = చిన్న; అతిధార్మికః = గొప్ప ధర్మాత్ముడు; కుశధ్వజః = కుశధ్వజుడు; ఇతి = అను; ఖ్యాతః = పేరు గల; పురీమ్ = పట్టణములో; అధ్యవసత్ = నివసించుచున్నాడు; శుభామ్ = శుభమైన.

భావము:

“గొప్ప తేజశ్శాలియు, మహాధర్మాత్ముడును, కుశధ్వజుడు అను పేరు గల నా తమ్ముడు, ఒక శుభకరమైన పట్టణమునందు నివసించుచున్నాడు.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  



వార్యాఫలక పర్యంతామ్
 పిబన్నిక్షుమతీం నదీమ్।
సాంకాశ్యాం పుణ్యసంకాశామ్
 విమానమివ పుష్పకమ్॥

టీకా:

వార్యా = నీటితో ఏర్పడ్డ; ఫలకః = డాలులు; పర్యంతాం = శేషసీమః, సరిహద్దులు కలది; పిబన్ = త్రాగు; ఇక్షుమతీం = ఇక్షుమతి యను; నదీమ్ = నది నీటిని; సాంకాశ్యామ్ = సాంకాశా అను పేరు గల; పుణ్య = పుణ్యముతో; సంకాశాం = సమానమైన; విమానమ్ = విమానము; ఇవ = వంటి; పుష్పకమ్ = పుష్పకము అను పేరు గల.

భావము:

సాంకాశ నగరమునకు నీటితో సరిహద్దులును వలెను, శత్రుదాడికి అడ్డుకొను డాలులు వలెను, త్రాగునీరు వనరుగానూ చూట్టూ ఇక్షుమతి నది ఉన్నది. శుభప్రదమైనదియు, కుశధ్వజుడు పుష్పక విమానము వంటిది ఐన ఆ సాంకాశి పట్టణమున నివసిస్తున్నాడు. (చూ. క్రింది చిత్రం.)

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తమహం ద్రష్టుమిచ్ఛామి
 యజ్ఞగోప్తా స మే మతః ।
ప్రీతిం సోఽ పి మహాతేజా!
 ఇమాం భోక్తా మయా సహ" ॥

టీకా:

తమ్ = అతనిని; అహం = నేను; ద్రష్టుమ్ = చూచుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; యజ్ఞః = యజ్ఞమును; గోప్తా = రక్షించువానిగా; సః = అతడు; మే = నా యొక్క; మతః = అంగీకరింపబడినవాడు; ప్రీతిమ్ = ఆనందమును; సః = అతడు; అపి = కూడ; మహా = గొప్ప; తేజా = తేజస్సుగల; ఇమాం = ఈ; భోక్తా = అనుభవించును; మయా = నాతో; మయా = కలసి.

భావము:

అతను నాకు యజ్ఞ సంరక్షణ చేసినవాడు. అతనిని నేను చూడగోరు చున్నాను. ఆ మహాతేజస్వి కూడా నాతో పాటుగా ఈ ఆనందమును అనుభవించును గాక."

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తే తు వచనే శతానన్దస్య సన్నిధౌ|
ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్ సమాదిశత్||

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శాసనాత్తు నరేంద్రస్య
 ప్రయయుః శీఘ్రవాజిభిః ।
సమానేతుం నరవ్యాఘ్రమ్
 విష్ణుమింద్రాజ్ఞయా యథా ॥

టీకా:

శాసనాత్ = ఆజ్ఞవలన; నరేంద్రస్య = మహారాజు యొక్క; ప్రయయుః = వెళ్ళిరి; శీఘ్ర = వేగము కలవి; వాజిభిః = గుఱ్ఱములచే; సమానేతుం = తీసుకొని వచ్చుటకు; నరవ్యాఘ్రం = నరశ్రేష్ఠుడైన, కుశధ్వజుని; విష్ణుమ్ = విష్ణువు; ఇంద్ర = ఇంద్రుని; ఆజ్ఞయా = ఆజ్ఞకై; యథా = వలె.

భావము:

జనకమహారాజు యొక్క ఆజ్ఞను గైకొనిన అనుచరులు, ఇంద్రుని ఆజ్ఞచే ఉపేంద్రుని తీసుకువచ్చువారి వలె, వేగవంతమైన గుఱ్ఱములనెక్కి, కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు వెళ్ళిరి.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాంకాశ్యాం తే సమాగమ్య
 దదృశుశ్చ కుశధ్వజమ్ ।
న్యవేదయన్ యథావృత్తం
 జనకస్య చ చింతితమ్ ॥

టీకా:

సాంకాశ్యాం = సాంకాశ్య నగరమును; తే = వారు; సమాగత్య = చేరుకుని; దదృశుః = చూసిరి; చ = మరియు; కుశధ్వజమ్ = కుశధ్వజుని; న్యవేదయన్ = తెలిపిరి; యథా వృత్తం = జరిగిన విషయమును; జనకస్య = జనకుని యొక్క; చింతితమ్ = ఆలోచనను.

భావము:

వారు సాంకాశ్యనగరమునకు చేరుకొని, కుశధ్వజుని గాంచి, జరిగిన విషయమును యథాతథముగాను మరియు జనకమహారాజు యొక్క ఆలోచనను తెలియజేసిరి.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తద్వృత్తం నృపతిః శ్రుత్వా
 దూతశ్రేష్ఠైర్మహాజవైః ।
ఆజ్ఞయాథ నరేంద్రస్య
 ఆజగామ కుశధ్వజః ॥

టీకా:

తద్వృత్తం = ఆ విషయమును; నృపతిః = రాజు; శ్రుత్వా = విని; దూత = దూతలు; శ్రేష్ఠైః = శ్రేష్ఠులు; మహాబలైః = మహాబలులు; ఆజ్ఞయ = ఆజ్ఞకై; అథ = తరువాత; నరేంద్రస్య = రాజు యొక్క; ఆజగామ; వచ్చెను; కుశధ్వజః = కుశధ్వజుడు.

భావము:

శ్రేష్ఠులు మహాబలశాలులు ఐన ఆ దూతల మాటలను కుశధ్వజుడు వినిన తరువాత, జనకమహారాజు యొక్క ఆజ్ఞ మేరకు మిథిలానగరమునకు వచ్చెను.

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్|
సో౭భివాద్య శతానన్దం రాజానం చాపి ధార్మికమ్||

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజార్హం పరమం దివ్యమాసనం చా౭ధ్యరోహత|
ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావతితేజసౌ||

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రేషయామాసతుర్వీరౌ
 మంత్రిశ్రేష్ఠం సుదామనమ్ ।
”గచ్ఛ మంత్రిపతే శీఘ్రం
 ఇక్ష్వాకమమితప్రభమ్ ॥

టీకా:

ప్రేషయామాస = పంపిరి; తుః; వీరౌ = వీరులైన; మంత్రిశ్రేష్ఠం = మంత్రులలో ఉత్తముడైన; సుదామనమ్ = సుదామనుని; గచ్ఛ = వెళ్ళుము; మంత్రివతే = మంత్రివర్యా; శీఘ్రమ్ = శీఘ్రముగా; ఇక్ష్వాకుమ్ = ఇక్ష్వాకువంశజుని గూర్చి; అమితప్రభమ్ = గొప్ప తేజస్సు గల.

భావము:

వీరులును తేజోవంతులును ఐన ఆ రాజసహోదరులు జనకుడు, కుశధ్వజుడు మంత్రివర్యుడు సుదామనుని ఇలా చెప్పి పంపిరి. ”మిక్కిలి తేజోవంతుడు, ఇక్షాకువంశజుడైన దశరథుని యొద్దకు వెళ్ళుము

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆత్మజైః సహ దుర్దర్షమ్
 ఆనయస్వ సమంత్రిణమ్।
ఔపకార్య్యం స గత్వా తు
 రఘూణాం కులవర్ధనమ్”॥

టీకా:

ఆత్మజైః = కుమారులతో; సహ = కూడి; దుర్ధర్షమ్ = ఎదుర్కొనబడలేని వాడిని; ఆనయస్వ = తీసుకొని రమ్ము; స = సహా; మంత్రిణమ్ = మంత్రులతో; ఔపకార్యం = విడిదికి; సః = అతడు; గత్వా = వెళ్ళి; రఘూణాం = రఘువంశజుల; కులవర్ధనమ్ = వంశమును వృద్ధి పొందించు.

భావము:

మహామంత్రీ! నీవు అచ్చటి విడిదికి పోయి, ఎదిరింప శక్యము గాని మహావీరుని, రఘువంశమును వృద్ధిపొందించు దశరథమహారాజును అతని కుమారులతోడను, మంత్రుల తోడను తీసుకొని రమ్ము”. అని పలుకెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దదర్శ శిరసాచైనం
 అభివాద్యేదమబ్రవీత్ ।
అయోధ్యాధిపతే వీర!
 వైదేహో మిథిలాధిపః ॥

టీకా:

దదర్శ = చూసెను; శిరసా = శిరస్సుచే; ఏనమ్ = ఈతనిని; అభివాద్య = నమస్కారము చేసి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను; అయోధ్యాధిపతే = అయోధ్యకు రాజా; వీర = వీరుడవైన; వైదేహః = జనకమహారాజు; మిథిలాధిపః = మిథిల దేశమునకు రాజైన.

భావము:

మంత్రి సుదామనుడు విడిదికి చని, రఘువంశ కులవర్ధనుడు నైన దశరథుని దర్శించి, తలవంచి నమస్కరించి, వీరుడైన దశరథునితో మిథిలానగరాధీశుడైన జనకుని మాటగా ఇట్లు పలికెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“స త్వాం ద్రష్టుం వ్యవసితః
 సోపాధ్యాయ పురోహితమ్" ।
మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా
 రాజా సర్షిగణస్తదా ॥

టీకా:

సః = అతడు; త్వాం = నిన్ను; ద్రష్టుమ్ = చూడవలెనని; వ్యవసితః = అనుష్టానము చేసుకున్నవాడు, ఆంధ్రవాచస్పతము; స = కూడి; ఉపాధ్యాయ = ఉపాధ్యాయులతోను; పురోహితమ్ = పురోహితులతోను; మంత్రిశ్రేష్ఠవచః = మంత్రివర్యుని మాట; శ్రుత్వా = విని; రాజా = దశరథుడు; స = కూడి; ఋషి = ఋషులు; గణః = అందరితో; తదా = అప్పుడు.

భావము:

"దశరథమహారాజా! అనుష్ఠానానంతరము జనకమహారాజు ఉపాధ్యాయ పురోహితులతో కలిసి కూర్చుండి ఉన్నాడప. నిన్ను చూడగోరుచున్నాడు". ఆ మహామంత్రి సుదామనుడు చెప్పిన విషయము విని దశరథమహారాజు అందఱు ఋషులతో కలిసి.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సబంధురగమ త్తత్ర
 జనకో యత్ర వర్తతే ।
స రాజా మంత్రిసహితః
 సోపాధ్యాయః సబాంధవః ॥

టీకా:

సబంధుః = బఃధువులతో కూడి; అగమత్ = వెళ్ళెను; తత్ర = అచటికి; జనకః = జనకుడు; యత్ర = ఎచట; వర్తతే = ఉండెనో; సః = ఆ; రాజా = రాజు; మంత్రి = మంత్రి; సహితః = కూడి; స; ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతో కూడి; సబాంధవః = బంధువులతో కూడి.

భావము:

మంత్రి సుదామనుని మాటలువిని, దశరథ మహారాజు, జనకమహారాజు యొద్దకు మంత్రులతోడను, ఉపాధ్యాయుల తోడను, బంధువుల తోడను కూడి వెళ్ళెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో
 వైదేహ మిదమబ్రవీత్ ।
“విదితం తే మహారాజ
 ఇక్ష్వాకు కులదైవతమ్ ॥

టీకా:

వాక్యం = మాటను; వాక్యవిదాం = మాట్లాడుట యందు నేర్పరులైన వారిలో; శ్రేష్ఠః = శ్రేష్ఠుడు; వైదేహమ్ = విదేహాధిపటి, జనకమహారాజు గురించి; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను; విదితం = తెలిసును; తే = నీకు; మహారాజ = మహారాజా; ఇక్ష్వాకు కుల దైవతమ్ = ఇక్ష్వాకు వంశమునకు దైవము అని.

భావము:

మాటలలోను, వాక్చతురలయందును శ్రేష్ఠుడైన దశరథుడు జనకమహారాజుతో ఇట్లనెను. "ఇతను మా ఇక్ష్వాకు వంశమునకు దైవమని నీకు తెలియును కదా.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వక్తా సర్వేషు కృత్యేషు
 వసిష్ఠో భగవానృషిః ।
విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః
 సహ సర్వైర్మహర్షిభిః ॥

టీకా:

వక్తా = మాటలాడువాడు; సర్వేషు = అన్ని; కృత్యేషు = కార్యములందు; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = పూజనీయుడు; ఋషిః = మహాఋషి; విశ్వామిత్రాభిః = విశ్వామిత్రునిచే; అనుజ్ఞాతః = అనుమతింపబడినవాడై; సహ = కూడి; సర్వైః = అందరు; మహర్షిభిః = మహర్షులతో.

భావము:

వసిష్ఠమహర్షి, విశ్వామిత్రుని అనుమతి తోడను, సకల మహర్షుల అనుమతి తోడను మా సకల విషయములయందు మమ్ములను గురించి మాటలాడును.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏష వక్ష్యతి ధర్మాత్మా
 వసిష్ఠో మే యథాక్రమమ్" ।
ఏవముక్త్వా నరశ్రేష్ఠే
 రాజ్ఞాం మధ్యే మహాత్మనామ్ ॥

టీకా:

ఏషః = ఈ; వక్ష్యతి = చెప్ప గలడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; వసిష్ఠః = వసిష్ఠుడు; మే = నా గురించి; యథా క్రమమ్ = వరుసగా; ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; నరశ్రేష్ఠే = మానవోత్తముడు; రాజ్ఞాం = రాజులయొక్క; మధ్యే = మధ్యన; మహాత్మానామ్ = మహాత్ములైన.

భావము:

ఈ ధర్మాత్ముడైన వసిష్ఠమహర్షి మా వంశములోని పూర్వీకుల గురించి వరుసగా చెప్ప గలడు" అని మానవోత్తముడైన దశరథమహారాజు మహాత్ములైన రాజుల మధ్య పలికెను.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తూష్ణీమ్భూతే దశరథే
 వసిష్ఠో భగవానృషిః ।
ఉవాచ వాక్యం వాక్యజ్ఞో
 వైదేహం సపురోధసమ్ ॥

టీకా:

తూష్ణీంభూతే = మౌనముగా ఉండెను; దశరథే = దశరథుడు; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = పూజనీయుడు; ఋషిః = ఋషి; ఉవాచ = పలికెను; వాక్యం = మాటను; వాక్యజ్ఞః = వాక్చతురుడు; వైదేహం = జనకమహారాజుని గూర్చి; సపురోధసమ్ = పురోహితులతో కూడి యున్న.

భావము:

దశరథుడు అట్లు పలికి మౌనముగా నుండగా, పూజనీయుడైన వసిష్ఠమహర్షి, వాక్చతురుడైన జనకమహారాజుతో ఇట్లు పలికెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అవ్యక్తప్రభవో బ్రహ్మా!
 శాశ్వతో నిత్య అవ్యయః ।
తస్మాన్మరీచిః సంజజ్ఞే
 మరీచేః కాశ్యపః సుతః ॥

టీకా:

అవ్యక్త = శూన్యము; ప్రభవః = ఉద్భవించినవాడు; బ్రహ్మా = బ్రహ్మ; శాశ్వతః = సనాతనుడు; నిత్యః = ఎప్పుడును ఉండువాడు; అవ్యయః = మార్పుచెందనివాడు; తస్మాత్ = అతనినుండి; మరీచిః = మరీచి మహర్షి; సంజజ్ఞే = జన్మించెను; మరీచేః = మరీచి నుండి; కాశ్యపః = కాశ్యపుడు; సుతః = కుమారుడు.

భావము:

"అవ్యక్తమగు శూన్యమునుండి, శాశ్వతుడు, నిత్యుడు, అవికారుడు ఐన బ్రహ్మ ఉద్భవించెను. అతనినుండి మరీచి మహర్షియు, మరీచి నుండి కాశ్యపుడును జన్మించిరి.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే
 మనుర్వైవస్వతః స్మృతః ।
మనుః ప్రజాపతిః పూర్వమ్
 ఇక్ష్వాకుస్తు మనోః సుతః ॥

టీకా:

వివస్వాన్ = సూర్యుడు; కాశ్యపాత్ = కాశ్యపుని నుండి; జజ్ఞే = జన్మించెను; మనుః = మనువు; వైవస్వతః = సూర్యుని కుమారుడైన వైవస్వతుడు; స్మృతః = తెలుపబడెను; మనుః = మనువు; ప్రజాపతిః = ప్రజాపతిగా ఉండెను; పూర్వమ్ = పూర్వము; ఇక్ష్వాకుః = ఇక్ష్వాకువు; మనోః = మనువు యొక్క; సుతః = కుమారుడు.

భావము:

కాశ్యపునకు సూర్యుడు జన్మించెను. సూర్యుని పుత్రుడు వైవస్వత మనువు. పూర్వము ప్రజాపతిగా ఉండిన మనువునకు ఇక్ష్వాకుడు అను కుమారుడు జన్మించెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తమిక్ష్వాకు మయోధ్యాయాం
 రాజానం విద్ధి పూర్వకమ్ ।
ఇక్ష్వాకోస్తు సుతః శ్రీమాన్
 కుక్షిరిత్యేవ విశ్రుతః ॥

టీకా:

తమ్ = ఆ; ఇక్ష్వాకుమ్ = ఇక్ష్వాకువును; అయోధ్యాయాం = అయోధ్యయందు; రాజానం = రాజునుగా; విద్ధి = ఎరుగుము; పూర్వకమ్ = మొదటివాడు; ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువు యొక్క; అస్తు = ఉండెను; సుతః = కుమారుడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; కుక్షిః = కుక్షి; ఇతి= అని; ఏవ = అనబడు; విశ్రుతః = ప్రసిద్ధుడు.

భావము:

ఆ ఇక్ష్వాకువు అయోధ్యా నగరమునకు మొదటి రాజుగా నుండెను. ఇక్ష్వాకుని యొక్క కుమారుడు శ్రీమంతుడు, ప్రసిద్ధి నొందిన వాడును అగు కుక్షి.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుక్షేరథాత్మజః శ్రీమాన్
 వికుక్షిరుదపద్యత ।
వికుక్షేస్తు మహాతేజా
 బాణః పుత్రః ప్రతాపవాన్ ॥

టీకా:

కుక్షేః = కుక్షికి; అథ = తరువాత; ఆత్మజః = కుమారుడు; శ్రీమాన్ = శ్రీమంతుడైన; వికుక్షిః = వికుక్షి; ఉదపద్యత = జన్మించెను; వికుక్షేః తు = వికుక్షి యొక్క; మహా = గొప్ప; తేజః = తేజోవంతుడు; బాణః = బాణుడు; పుత్రః = పుత్రునిగా; ప్రతాపవాన్ = గొప్ప ప్రతాపము గలవాడు.

భావము:

తరువాత కుక్షికి, శ్రీమంతుడైన వికుక్షి జన్మించెను. వికుక్షికి కుమారునిగా గొప్ప తేజశ్శాలియు, ప్రతాపవంతుడును ఐన బాణుడు జన్మించెను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాణస్య తు మహాతేజా
 అనరణ్యః ప్రతాపవాన్ ।
అనరణ్యా త్పృథుర్జజ్ఞే
 త్రిశంకుస్తు పృథోః సుతః ॥

టీకా:

బాణస్య తు = బాణుని యొక్క; మహాతేజాః = మహాతేజశ్శాలి; అనరణ్యః = అనరణ్యుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు; అనరణ్యాత్ = అనరణ్యుని నుండి; పృథుః = పృథువు; జజ్ఞే = జన్మించెను; త్రిశఙ్కః తు = త్రిశంకువు; తు; పృథోః = పృథువు యొక్క; సుతః = కుమారుడు.

భావము:

బాణుని కుమారుడు మహాతేజశ్శాలియు, ప్రతాపవంతుడును ఐన అనరణ్యుడు. అనరణ్యునికి పృథువు జన్మించెను. పృథువు యొక్క కుమారుడు త్రిశంకువు.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిశంకోరభవత్ పుత్రో
 దుంధుమారో మహాయశాః ।
యువనాశ్వసుత స్త్వాసీత్
 మాంధాతా పృథివీపతిః ॥

టీకా:

త్రిశఙ్కః = త్రిశంకువునకు; అభవత్ = పుట్టెను; పుత్రః = పుత్రుడు; దుందుమారః = దుందుమారుడు; మహా = గొప్ప; యశాః = గొప్ప యశస్సు కల వాడు; యువనాశ్వః = యువనాశ్వుని; సుతః తు = కుమారుడు; తు; ఆసీత్ = పుట్టెను; మాంధాతా = మాంధాత; పృథివీపతిః = రాజు.

భావము:

త్రిశంకువునకు మహాయశస్సుగల దుందుమారుడు అను పుత్రుడు కలిగెను. అతనికి యువనాశ్వుడను పేరు కూడా కలదు. యువనాశ్వునికి మాంధాత అను కుమారుడు కలిగెను. మాంధాత గొప్ప రాజు.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాంధాతుస్తు సుతః శ్రీమాన్
 సుసంధిరుదపద్యత ।
సుసంధేరపి పుత్రౌ ద్వౌ
 ధ్రువసంధిః ప్రసేనజిత్ ॥

టీకా:

మాంధాతుః తు = మాంధాతునకు; సుతః = పుత్రుడు; శ్రీమాన్ = శ్రీమంతుడైన; సుసంధిః = సుసంధి అను పేరు గల; ఉదపద్యత = పుట్టెను; సుసంధేః = సుసంధికి; అపి = కూడ; పుత్రౌ = పుత్రులు కలిగిరి; ద్వౌ = ఇద్దరు; ధ్రువసంధిః = ధ్రువసంధి; ప్రసేనజిత్ = ప్రసేనజిత్తు.

భావము:

మాంధాతకు శ్రీమంతుడైన సుసంధి అను పుత్రుడు కలిగెను. సుసంధికి, ధ్రువసంధి, ప్రసేనజిత్తు అను ఇద్దరు కుమారులు కలిగిరి.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యశస్వీ ధ్రువసంధేస్తు
 భరతో నామ నామతః ।
భరతాత్తు మహాతేజా
 అసితో నామ జాతవాన్ ॥

టీకా:

యశస్వీ = గొప్ప కీర్తిమంతుడైన; ధ్రువసంధేః = ధ్రువసంధికి; తు; అస్తు = కలిగెను; భరతః నామ = భరతుడను; నామతః = పేరుగల; భరతాత్ = భరతుని వలన; తు; మహాతేజాః = మహాతేజశ్శాలి ఐన; అసితః = అసితుడు; నామః = పేరు గల; జాతవాన్ = పుట్టెను.

భావము:

ధ్రువసంధికి భరతుడు అను కీర్తిమంతుడైన పుత్రుడు జన్మించెను. భరతుని వలన మహాతేజోవంతుడైన అసితుడు అను పుత్రుడు జన్మించెను.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యస్యైతే ప్రతిరాజాన
 ఉదపద్యంత శత్రవః ।
హైహయా స్తాలజంఘాశ్చ
 శూరాశ్చ శశిబిందవః ॥

టీకా:

యస్య = ఈతనికి; ఏతే = ఈ; ప్రతిరాజనః = ఎదిరించెడు రాజులు; ఉదపద్యంత = అయ్యిరి; శత్రవః = శత్రువులు; హైహయాః = హైహయ వంశీయులు; తాలజంఘాః చ = తాలజంఘీయ వంశజులు; చ = మఱియు; శూరాః = శూరులు; శశిబిందవః = శశిబిందు వంశమువారు.

భావము:

ఈ అసితునకు, శూరులైన, హైహయ, తాలజంఘ, శశిబిందు వంశపు రాజులు శత్రువు లైరి.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాంస్తు స ప్రతియుద్ధ్యన్ వై
 యుద్ధే రాజా ప్రవాసితః ।
హిమవంత ముపాగమ్య
 భృగుప్రస్రవణేఽ వసత్ ॥

టీకా:

తాంస్తు = వారిని; సః = అతడు; ప్రతియుధ్యన్ = ఎదిరించి యుద్ధము చేయుచు; యుద్ధే = యుద్ధమునందు; రాజా = రాజు; ప్రవాసితః = బహిష్కృతుడు అయ్యెను, దూరదేశానికి పోయెను; హిమవంతమ్ = హిమవత్పర్వతమును; ఉపాగమ్య = చేరి; భృగుప్రస్రవణే = భృగుప్రస్రవణము అను ప్రదేశమున; అవసత్ = నివసించెను.

భావము:

ఆ శత్రురాజులకు అసితమహారాజు యుద్ధములో ఓడి, బహిష్కరింప బడెను. అతడు దూర ప్రాంతమైన హిమాలయపర్వతము వద్ద ఉన్న భృగుప్రస్రవణం అను ప్రదేశమున నివసించెను.

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అసితో౭ల్పబలో రాజా మన్త్రిభిస్సహితస్తదా|
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్||

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏకా గర్భవినాశాయ
 సపత్న్యై సగరం దదౌ ।
తతః శైలవరం రమ్యం
 బభూవాభిరతో మునిః ॥

టీకా:

ఏకా = ఒకతె; గర్భః = గర్భమును; వినాశాయ = నశింపజేయుటకై; సపత్న్యై = సవతి భార్యకు; స = కలిపి; గరమ్ = విషమును; దదౌ = ఇచ్చెను; తతః = తరువాత; శైలవరం = పర్వతములలో గొప్పదైనటువంటిదాని గూర్చి; రమ్యం = రమ్యమైన; బభూవ = ఉండుటకు; అభిరతః = కోరిక గల; మునిః = ముని.

భావము:

అసితుని ఒక భార్య, గర్భవతికి విషాహారము పెట్టెను. ఆ సమయంలో, పర్వతములలో శ్రేష్ఠమైనదియు, రమ్యమైనదియు ఐన ఆ పర్వతము యొద్ద నివసించుటకు కోరిక గల ఒకముని వచ్చెను.

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భార్గవశ్చ్యవనో నామ
 హిమవంతముపాశ్రితః ।
తత్రైకా తు మహాభాగా
 భార్గవం దేవవర్చసమ్ ॥

టీకా:

భార్గవః = భృగు వంశమునకు చెందినవాడు; చ్యవనః = చ్యవనుడు; నామః = పేరుగల; హిమవంతమ్ = హిమాలయ పర్వతమును; ఉపాశ్రితః = ఆశ్రయించెను; తత్ర = అచట; ఏకా = ఒకతె; మహాభాగా = గొప్ప భాగ్యవంతురాలైన; భార్గవమ్ = భృగువంశజుని (చ్యవనుని); దేవ వర్చసమ్ = దేవతల వంటి కాంతి గలవానిని;

భావము:

భృగు వంశపు చ్యవనుడు అను ఆ ముని, హిమవత్పర్వతమునకు వచ్చెను. అసితుని భార్యలలో భాగ్యవంతురాలైన ఒక భార్య, దేవ వర్చస్సు గల చ్యవనుని చూసెను.

1-33-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వవందే పద్మపత్రాక్షీ
 కాంక్షంతీం సుతమాత్మనః ।
తమృషిం సాఽ భ్యుపాగమ్య
 కాలిందీ చాభ్యవాదయత్ ॥

టీకా:

వవందే = నమస్కరించెను; పద్మపత్రా = తామర రేకుల; అక్షీ = కన్నులు గలది; కాఙ్క్షంతీ = కోరిక గలది; సుతమ్ = పుత్రుని; ఆత్మనః = తనకు; తమ్ = ఆ; ఋషిం = ఋషిని; సా = ఆ; అభ్యుపాగమ్య = చేరవచ్చి; కాలిందీ చ = కాళింది =; చ = కూడ; అభ్యవాదయత్ = అభివాదము చేసెను.

భావము:

తామర రేకుల వంటి కన్నులు గల ఆమె తనకు పుత్రుడు కావలెనను కోరికతో దేవతల వంటి తేజస్సు గల చ్యవనమునికి నమస్కరించెను. సవతికి విషము పెట్టిన కాళింది అను నామె కూడ చ్యవనునికి నమస్కరించెను.

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స తామభ్యవదద్విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని|
తవ కుక్షౌ మహాభాగే సుపుత్రస్సుమహాబలః||

1-35-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహావీర్యో మహాతేజా
 అచిరాత్ సంజనిష్యతి ।
గరేణ సహితః శ్రీమాన్
 మా శుచః కమలేక్షణే” ॥

టీకా:

మహా = మిక్కిలి; వీర్యః = వీరుడు; మహృ = గొప్ప; తేజః = గొప్ప తేజోవంతుడు; అచిరాత్ = కొద్ది కాలములో; సఞ్జనిష్యతి = జన్మించును; గరేణ = విషముతో; సహితః = కూడి; శ్రీమాన్ = శ్రీమంతుడైన; మా = వలదు; శుచః = దుఃఖించుట; కమల = కమలముల వంటి; ఈక్షణ = కన్నులు కలదాన.

భావము:

గొప్పవీరుడు, గొప్ప తేజోవంతుడు ఐన పుత్రుడు, విషముతో కూడినవాడై కొద్ది కాలములోనే జన్మించును. దుఃఖింపకుము.”

1-36-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్యవనం తు నమస్కృత్య
 రాజపుత్రీ పతివ్రతా ।
పతిశోకాతురా తస్మాత్
 పుత్రం దేవీ వ్యజాయత ॥

టీకా:

చ్యవనం = చ్యవనునుని; తు; నమస్కృత్య = నమస్కరించి; రాజపుత్రీ = రాజపుత్రి; పతివ్రతా = పతివ్రత; పతిశోకాతురా = పతీవియోగముచే బాధపడుచున్నది; తస్మాత్ = అందువలన; పుత్రం = పుత్రుని; దేవీ = పట్టమహిషి; వ్యజాయత = కనెను.

భావము:

చ్యవనునికి నమస్కరించిన ఆ రాజపుత్రియు పతివ్రతయు పతీవియోగముచే దుఃఖితురాలై ఉన్న ఆ పట్టమహిషి, పుత్రుని కనెను.

1-37-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సపత్న్యా తు గరస్తస్యై
 దత్తో గర్భజిఘాంసయా ।
సహ తేన గరేణైవ
 జాతః స సగరోఽ భవత్ ॥

టీకా:

సపత్న్యా = సవతి భార్యచే; గరః = విషము; తస్యై = ఆమెకు; దత్తః = ఈయ బడినది; గర్భజిఘాంసయా = గర్భమును హింసించు కోరికకై; సః = అతడు; తేన = ఆ; గరేణ = విషము; ఏవ = తోడనే; జాతః = జన్మించిన; సః = అతడు; సగరః = సగరుడు; అభవత్ = అయ్యెను.

భావము:

గర్భమును పోగొట్ట వలెననెడి కోరికతో సవతి భార్య ఇచ్చిన విషముతో జన్మించినందున అతడు సగరుడు అయ్యెను.

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సగరస్యాసమఞ్జస్తు అసమఞ్జాత్తథాం౭శుమాన్|
దిలీపోం౭శుమతః పుత్రో దిలీపస్య భగీరథః||

1-71-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భగీరథాత్కకుత్స్థశ్చ కకుత్స్థస్య రఘుస్సుతః|
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః||

1-40-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కల్మాషపాదో హ్యభవత్
 తస్మాజ్జాతశ్చ శంఖణః ।
సుదర్శనః శంఖణస్య
 అగ్నివర్ణః సుదర్శనాత్ ॥

టీకా:

కల్మాషపాదః = కల్మాషపాదుడు; అభవత్ = అయ్యెను; తస్మాత్ = అతని నుండి; జాతస్తు = జన్మించెను; శంఖణః = శంఖణుడు; సుదర్శనః = సుదర్శనుడు; శఙ్ఖణస్య = శంఖణునకు; అగ్నివర్ణః = అగ్నివర్ణుడు; సుదర్శనాత్ = సుదర్శునుని వలన.

భావము:

కల్మాషపాదునికి శంఖణుడు పుట్టెను. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు.

1-41-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శీఘ్రగస్త్వగ్ని వర్ణస్య
 శీఘ్రగస్య మరుః సుతః ।
మరోః ప్రశుశ్రుకస్త్వాసీత్
 అమ్బరీషః ప్రశుశ్రుకాత్ ॥

టీకా:

శీఘ్రగః = శీఘ్రగుడు; అగ్నివర్ణస్య = అగ్నివర్ణునకు; శీఘ్రగస్య = శీఘ్రగునకు; మరుః = మరువు; సుతః = కుమారుడు; మరోః = మరువునకు; ప్రశుశ్రుకః తు = ప్రశుశ్రుకుడు; ఆసీత్ = జన్మించెను; అమ్బరీషః = అంబరీషుడు; ప్రశుశ్రుకాత్ = ప్రశుశ్రుకుని.

భావము:

అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుని కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుని వలన అంబరీషుడు జన్మించెను.

1-42-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అమ్బరీషస్య పుత్రోఽ భూత్
 నహుషః పృథివీపతిః ।
నహుషస్య యయాతిశ్చ
 నాభాగస్తు యయాతిజః ॥

టీకా:

అమ్బరీషస్య = అంబరీషుని యొక్క; పుత్రః = పుత్రుడు; అభూత్ = అయ్యెను; నహుషః = నహుషుడు; పృథివీపతిః = రాజు; నహుషస్య = నహుషునికి; యయాతిః = యయాతి; నాభాగః = నాభాగుడు; యయాతిజః = యయాతికి జన్మించినవాడు.

భావము:

అంబరీషుని యొక్క పుత్రుడు రాజైన నహుషుడు. నహుషుని కుమారుడు యయాతి. నాభాగుడు యయాతి వలన జన్మించెను.

1-43-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాభాగస్య బభూవాజ
 అజాద్దశరథోఽ భవత్ ।
అస్మా ద్దశరథాజ్జాతౌ
 భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥

టీకా:

నాభాగస్య = నాభాగునికి; బభూవ = జన్మించెను; అజః = అజుడు; అజాత్ = అజుని వలన; దశరథః = దశరథుడు; అభవత్ = పుట్టెను; అస్మాత్ = ఈ; దశరథాత్ = దశరథుని వలన; జాతౌ = జన్మించిరి; భ్రాతరౌ = అన్నదమ్ములు; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు.

భావము:

నాభాగునికి అజుడు జన్మించెను. అజునికి దశరథుడు పుట్టెను. ఈ రామలక్ష్మణులు ఈ దశరథుని కుమారులు.

1-44-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆదివంశ విశుద్ధానామ్
 రాజ్ఞాం పరమధర్మిణామ్ ।
ఇక్ష్వాకు కులజాతానామ్
 వీరాణాం సత్యవాదినామ్ ॥

టీకా:

ఆదివంశ = వంశములో మొదటి నుండి; విశుద్ధానాం = పరిశుద్ధులు; రాజ్ఞాం = రాజులకు సంబంధించిన; పరమ = మిక్కిలి; ధార్మిణామ్ = ధర్మనిరతులు; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; కుల = వంశములో; జాతానాం = జన్మించిన; వీరాణాం = వీరులు; సత్యః = సత్యమును మాత్రమే; వాదినమ్ = పలుకువారు.

భావము:

వంశాది నుండి కూడ ఇక్ష్వాకువంశపు రాజులు పరిశుద్ధులు, పరమ ధార్మికులు, వీరులును, సత్యమునే పలుకువారు.

1-45-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామలక్ష్మణయో రర్థే
 త్వత్సుతే వరయే నృప ।
సదృశాభ్యాం నరశ్రేష్ఠ!
 సదృశే దాతుమర్హసి" ॥

టీకా:

రామలక్ష్మణయోః = రామలక్ష్మణుల; అర్థే = కొరకు; త్వత్ = నీయొక్క; సుతే = కుమార్తెలను; వరయే = వరించుచున్నాను; నృప = రాజా; సదృశాభ్యాం = తగిన వీరి కొఱకు; నృపః = రాజులలో; శ్రేష్ఠ = శ్రేష్ఠుడా; సదృశే = తగిన వారిని; దాతుమ్ = ఇచ్చుటకు; అర్హసి = తగియున్నావు.

భావము:

రాజోత్తమా! జనకమహారాజా! రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు. నీ కుమార్తెలు రామలక్ష్మణులకు తగిన వధువులు. నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చుట నీకు తగును.

1-46-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 సప్తతితమః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తతితమః [70] = డెబ్బైయవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథములోని డెబ్బైయవ [70] సర్గ సంపూర్ణము.