వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥ఏకోనసప్తతితమః సర్గః॥ [69 - దశరథుడు మిథిలను చేరుట]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో రాత్ర్యాం వ్యతీతాయాం
  సోపాధ్యాయః సబాంధవః ।
రాజా దశరథో హృష్టః
  సుమంత్రమిదమబ్రవీత్ ॥

టీకా:

తతః = పిమ్మట; రాత్ర్యాం = రాత్రి; వ్యతీతాయాం = గడిచిపోవగ; స+ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతోకూడి; స = కూడా ఉన్న; బాంధవః = బంధువులతో; రాజా = రాజు అయిన; దశరథః = దశరథుడు; హృష్టః = సంతోషించినవాడు; సుమంత్రమ్ = సుమంత్రుని గూర్చి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.

భావము:

ఆ రాత్రి గడిచిన తరువాత దశరథమహారాజు బంధువులతో, గురువులతో కూడి సంతోషముగా సుమంత్రునితో ఇట్లు పలికెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అద్య సర్వే ధనాధ్యక్షా
  ధనమాదాయ పుష్కలమ్ ।
వ్రజంత్వగ్రే సువిహితా
  నానారత్నసమన్వితాః ॥

టీకా:

అద్య = ఇప్పుడు; సర్వే = అందఱు; ధనాధ్యక్షాః = కోశాధికారులు; ధనమ్ = ధనమును; ఆదాయ = తీసుకుని; పుష్కలమ్ = సమృద్దిగా; వ్రజంతు = వెళ్లెదరుగాక; అగ్రే = ముందుగా; సువిహితాః = సర్వ సన్నద్దులై; నానా = వివిధము లగు; రత్న = రత్నములు,ఆభరణములతో; సమన్వితాః = కూడిన వారై.

భావము:

కోశాధికారులు అందఱు సమృద్దిగా ధనమును, వివిధములగు రత్నములు,ఆభరణములు తీసుకుని సర్వసన్నద్దులై ముందుగా వెళ్లెదరుగాక...

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చతురంగం బలం చాపి
  శీఘ్రం నిర్యాతు సర్వశః ।
మమాజ్ఞాసమకాలం చ
  యానయుగ్య మనుత్తమమ్ ॥

టీకా:

చతురంగం = చతురంగ; బలం = బలములు; చ = మఱియు; అపి = కూడ; శీఘ్రం = వెంటనే; నిర్యాతు = బయలుదేఱుగాక; సర్వశః = అందఱుకలిసి; మమ = నాయొక్క; ఆజ్ఞాసమకాలం = ఆజ్ఞాపించిన వెంటనే; చ = మఱియు; యానయుగ్యమ్ = వాహనములు; అనుత్తమమ్ = శ్రేష్ఠమైన.

భావము:

నేను ఆజ్ఞాపించినవెంటనే చతురంగ బలములు, వివిధ వాహనములు, అందఱు కలిసి బయలుదేరవలెను.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వసిష్ఠో వామదేవశ్చ
  జాబాలిరథ కాశ్యపః ।
మార్కండేయః సుదీర్ఘాయుః
  ఋషిః కాత్యాయనస్తథా ॥

టీకా:

వసిష్ఠః = వసిష్ఠుడు; వామదేవః = వామదేవుడు; చ = మఱియు; జాబాలిః = జాబాలి; అథ = మఱియు; కాశ్యపః = కాశ్యపుడు; మార్కండేయః = మార్కండేయుడు; సుదీర్ఘాయుః = సుదీర్ఘామైన ఆయువు కలవాడు; ఋషిః = ఋషులు; కాత్యాయనః = కాత్యాయనుడు; తథా = అట్లే .

భావము:

ఋషులు వసిష్ఠుడు, వామాదేవుడు, జాబాలి, కాశ్యపుడు, చిరంజీవి అగు మార్కండేయుడు మరియు కాత్యాయనుడు

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏతే ద్విజాః ప్రయాంత్వగ్రే
  స్యందనం యోజయస్వ మే ।
యథా కాలాత్యయో న స్యాత్
  దూతా హి త్వరయంతి మామ్” ॥

టీకా:

ఏతే = వారును; ద్విజాః = బ్రాహ్మణులు; ప్రయాంతు = ప్రయాణించెదరు గాక; అగ్రే = ముందు; స్యందనం = రథము; యోజయస్వ = సిద్ధపఱచబడు గాక; మే = నాయొక్క; యథా = ఏ విధముగాను; కాలః = కాలము; ఆత్యయః = గడిచిపోవుట; న స్యాత్ = కాకుండు గాక; దూతా = దూతలు; హి = కూడ; త్వరయంతి = త్వరపెట్టుచున్నారు; మామ్ = మమ్ములను.

భావము:

వారును బ్రాహ్మణోత్తములందఱు ముందుగా ప్రయాణించెదరు గాక. ఏమాత్రము ఆలస్యము చేయక నా రథము సిద్ధముచేసి తీసుకురండి. జనకుని దూతలు నన్ను తొందరపెట్టుచుంటిరి.”

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచనాత్తు నరేంద్రస్య
  సా సేనా చతురంగిణీ ।
రాజానమృషిభిః సార్దమ్
  వ్రజంతం పృష్ఠతోఽ న్వగాత్ ॥

టీకా:

వచనాత్ = ఆజ్ఞల వలన; తు; నరేంద్రస్య = రాజుయొక్క; సా = ఆ; సేనా = సేనా; చతురంగిణీ = చతురంగములు గలది; రాజానమ్ = రాజును; ఋషిభిః = ఋషులతో; సార్ధమ్ = కలిసి; వ్రజంతం = ప్రయాణిస్తున్న; పృష్ఠతః = వెనుక; అన్వగాత్ = అనుసరించెను.

భావము:

దశరథమహారాజు ఋషులతోకూడి ప్రయాణముచేయుచుండగా, ఆ మహారాజుగారి ఆజ్ఞానువర్తులై చతురంగబలములు వారిని వెనుకనే అనుసరించెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గత్వా చతురహం మార్గమ్
  విదేహా నభ్యుపేయివాన్ ।
రాజా తు జనకః శ్రీమాన్
  శ్రుత్వా పూజామకల్పయత్ ॥

టీకా:

గత్వా = ప్రయాణము చేసి; చతురహం = నాలుగు దినములు; మార్గమ్ = మార్గమును; విదేహాన్ = విదేహను; అభ్యుపేయివాన్ = చేరెను; రాజా = రాజు; తు; జనకః = జనకుడు; శ్రీమాన్ = శ్రీమంతుడు; శ్రుత్వా = విని; పూజామ్ = పూజలను; అకల్పయత్ = ఏర్పాటు చేసెను.

భావము:

దశరథ మహారాజు తన పరివారముతో నాలుగు దినములు ప్రయాణము చేసి మిథిలానగరమునకు చేరెను. అది తెలిసి శ్రీమంతు డైన జనక మహారాజు వారికి ఆయా ప్రాంతములలో అతిథి సత్కారములు ఏర్పాటు చేసెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో రాజానమాసాద్య
  వృద్ధం దశరథం నృపమ్ ।
జనకో ముదితో రాజా
  హర్షం చ పరమం యయౌ ॥

టీకా:

తతః = అటుపిమ్మట; రాజానమ్ = రాజును; ఆసాద్య = సమీపించి; వృద్ధం = వయసులో పెద్దవాడయిన వానిని; దశరథం = దశరథును; నృపమ్ = రాజును; జనకః = జనకుడు; ముదితః = సంతోషించినవాడు; రాజా = రాజు; హర్షం = ఆనందించుమును; చ = మఱియు; పరమం = మిక్కిలి; యయౌ = పొందెను ॥

భావము:

అతిథిసత్కారముల అనంతరము, జనక మహారాజు సంతోషముగా తనకంటె వయసులో పెద్దవాడైన దశరథమహారాజు వద్దకు వెళ్ళి కలుసుకొని మరెంతో ఆనందించెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉవాచ చ నరశ్రేష్ఠో
  నరశ్రేష్ఠం ముదాన్వితః ।
"స్వాగతం తే మహారాజ!
  దిష్ట్యా ప్రాప్తోఽ సి రాఘవ ।
పుత్రయోరుభయోః ప్రీతిమ్।
  లప్స్యసే వీర్యనిర్జితామ్ ॥

టీకా:

ఉవాచ = నుడివెను; చ = మఱియు; నరశ్రేష్ఠః = రాజు, జనకుడు; నరశ్రేష్ఠం = రాజునకు, దశరథునికి; ముదా = ఆనందముతో; అన్వితః = కూడినవాడు; స్వాగతం = స్వాగతము; తే = నీకు; మహారాజ = ఓ మహారాజ!; దిష్ట్యా = అదృష్టఫలముచే; ప్రాప్తః =ప్రాప్తించినది; అసి = రాక; రాఘవ = రఘువంశీయుడవైన; పుత్రయోః = కుమారుల యొక్క; ఉభయోః = ఇరువురి; ప్రీతిమ్ = ప్రీతిని; లప్స్యసే = పొందగలవు; వీర్యనిర్జితామ్ = మహాపరాక్రమముచే జయింపబడినది,

భావము:

    నరోత్తముడైన జనకమహారాజు, మనుజోత్తముడైన దశరథమహారాజుతో ఇట్లు పలికెను, "ఓ మహారాజ మీకు స్వాగతము, మా అదృష్టఫలముచే మీరు ఇచటకు విచ్చేసిరి. మీ కుమారులిరువురి పరాక్రమము మీకు మిక్కిలి ఆనందము కలుగజేయును."

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిష్ట్యా ప్రాప్తో మహాతేజా!
  వసిష్ఠో భగవానృషిః ।
సహ సర్వైర్ద్విజశ్రేష్ఠైః
  దేవైరివ శతక్రతుః ॥

టీకా:

దిష్ట్యా = భాగ్యవశమున; ప్రాప్తః = ప్రాప్తించినది; మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడు; వసిష్ఠః = వసిష్ఠుడు; భగవాన్ = భగవంతుని స్వరూపమైనవాడు; ఋషిః = ఋషి; సహ = కూడి; సర్వైః = అందఱితో; ద్విజ = బ్రాహ్మణులలో; శ్రేష్ఠైః = ఉత్తములతో; దేవైః = దేవతలతో; ఇవ = వలె; శతక్రతుః = ఇంద్రుడు.

భావము:

గొప్ప తేజస్సు కలిగినవారు, భగవత్స్వరూపులు అయిన వసిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కలిసి, సర్వదేవతలతో కూడిన దేవేంద్రునివలె విచ్చేయుట మా భాగ్యము.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిష్ట్యా మే నిర్జితా విఘ్నా
  దిష్ట్యా మే పూజితం కులమ్ ।
రాఘవైః సహ సమ్బంధాత్
  వీర్యశ్రేష్ఠై ర్మహాత్మభిః ॥

టీకా:

దిష్ట్యా = భాగ్యము వలన; మే = నాయొక్క; నిర్జితాః = జయింపబడినవి; విఘ్నా = ఆటంకములు; దిష్ట్యా = భాగ్యము వలన; మే = నాయొక్క; పూజితం = పూజింపబడినది; కులమ్ = కులము; రాఘవైః = రాఘవులతో; సహ = కూడిన; సమ్బంధాత్ = సంబంధము వలన; వీర్య = శౌర్యముచే; శ్రేష్ఠైః = శ్రేష్ఠులును; మహాత్మభిః = మహాత్ములును.

భావము:

ఆటంకములన్నియు అదృష్టవశాత్తు తొలగిపోయినవి. మహాత్ములు, పరాక్రమముచే శ్రేష్ఠులు అయిన రఘువంశీయులతో వియ్యమొందుట మా భాగ్యము. దానితో మా కుల గౌరవము ఇనుమడించినది.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్వః ప్రభాతే నరేంద్రేంద్ర
  నిర్వర్తయితు మర్హసి ।
యజ్ఞస్యాంతే నరశ్రేష్ఠ
  వివాహమృషి సమ్మతమ్" ॥

టీకా:

శ్వః = రేపు; ప్రభాతే = సూర్యోదయ సమయమందు; నర+ఇంద్ర+ఇంద్ర = రాజులలో శ్రేష్ఠుడా, దశరథమహారాజా; నిర్వర్తయితుమ్ = జరిపించుటకు; అర్హసి = అర్హత కలిగి ఉంటివి; యజ్ఞస్య = యాగము యొక్క; అంతే = ముగింపు నందు; నరశ్రేష్ఠ = నరులలో ఉత్తమమైనవాడా; వివాహమ్ = కళ్యాణమును; ఋషి = ఋషి సంప్రదాయములకు; సమ్మతమ్ = అంగీకారయోగ్యమైనది.

భావము:

నరశ్రేష్ఠుడవైన ఓ రాజాధిరాజా! రేపు ప్రభాతసమయములో యాగము పూర్తి అయిన తరువాత ఋషి సంప్రదాయములకు ఆమోదకరమైన వివాహము జరిపించుట.”

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య తద్వచనం శ్రుత్యా
  ఋషిమధ్యే నరాధిపః ।
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠః
  ప్రత్యువాచ మహీపతిమ్ ॥

టీకా:

తస్య = వానియొక్క; తత్ = ఆ; వచనం = వచనమును; శ్రుత్యా = విని; ఋషిమధ్యే = ఋషుల మధ్యలో; నరాధిపః = నరులకు అధిపతి, రాజు ।వాక్యం = వాక్యమును; వాక్యవిదాం = వాక్యములను పలుకుటలో; శ్రేష్ఠః = శ్రేష్ఠుడు; ప్రత్యువాచ = తిరిగి పలికెను; మహీపతిమ్ = ఆ భూపాలునితో ॥

భావము:

వాక్చతురుడైన దశరథమహారాజు జనకమహారాజు మాటలు విని, ఋషుల సమక్షములో ఉన్న ఆ భూపాలునితో ఇట్లు నుడివెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ప్రతిగ్రహో దాతృవశః
  శ్రుతమేతన్మయా పురా ।
యథా వక్ష్యసి ధర్మజ్ఞ
  తత్కరిష్యామహే వయమ్" ॥

టీకా:

ప్రతిగ్రహః = దానము స్వీకరించువాడు; దాతృ = దానమిచ్చువాని; వశః = వశములోనుండును; శ్రుతమ్ = వినబడినది; ఏతత్ = ఇలా అని; మయా = నాచే; పురా = ఇంతకు ముందు; యథా = ఏవిధముగా; వక్ష్యసి = చెప్పితివో; ధర్మజ్ఞ = ధర్మములను తెలిసినవాడా!; తత్ = అట్లే; కరిష్యామహే = చేయగలము; వయమ్ = మేము ॥

భావము:

“ధర్మజ్ఞుడవైన ఓ జనకమహారాజా! ‘దానము స్వీకరించువాడు దాత నిర్ణయముపై ఆధారపడి ఉండును’ అని ఇంతకుముందు వినియుంటిని. కావున మీరు చెప్పునటులేమేముకావించెదము."

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధర్మిష్ఠం చ యశస్యం చ
  వచనం సత్యవాదినః ।
శ్రుత్వా విదేహాధిపతిః
  పరం విస్మయమాగతః ॥

టీకా:

ధర్మిష్ఠం = ధర్మసమ్మతము; చ = మఱియు; యశస్యం = యశస్కరము; చ = అయిన; వచనం = వాక్యమును; సత్యవాదినః = సత్యవచనుని యొక్క; శ్రుత్వా = విని; విదేహాధిపతిః = విదేహరాజ్యాధిపతి; పరం = మిక్కిలి; విస్మయమ్ = అబ్బురుపాటు; ఆగతః = పొందెను.

భావము:

సత్యవచనుడైన దశరథమహారాజు నుడివిన ధర్మయుక్తములు, యశస్కరములైన వచనములు వినిన జనకమహారాజునకు చాలా ఆబ్బురము అనిపించెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః సర్వే మునిగణాః
  పరస్పరసమాగమే ।
హర్షేణ మహతా యుక్తాః
  తాం నిశామవసన్ సుఖమ్ ॥

టీకా:

తతః = అటుపిమ్మట; సర్వే = అందఱు; మునిః = మునుల; గణాః = సమీహములు; పరస్పర = ఒకరినొకరు; సమాగమే = కలియుటలో; హర్షేణ = సంతోషముతో; మహతా = గొప్ప; యుక్తాః = కూడి; తాం = ఆ; నిశామ్ = రాత్రిని; అవసన్ = గడిపెను; సుఖమ్ = సుఖముగా.

భావము:

అంతట అక్కడయున్న మునీశ్వరు లందఱు పరస్పరము కలసికు న్నందులకు మిక్కిలి సంతుష్టులై ఆ రాత్రి సుఖముగా గడిపిరి.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ రామో మహాతేజా
  లక్ష్మణేన సమం యయౌ ।
విశ్వామిత్రం పురస్కృత్య
  పితుః పాదావుపస్పృశన్॥

టీకా:

అథ = పిమ్మట; రామః = శ్రీరాముడు; మహా = గొప్ప; తేజా = తేజశ్శాలి అయిన; లక్ష్మణేన = లక్ష్మణునితో; సమం = కలిసి; యయౌ = విచ్చేసెను; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్య = పూజించెను; పితుః = తండ్రికి; పాదావుపస్పృశన్ = పాదాభివందనము.

భావము:

పిమ్మట మహాపరాక్రమశాలియైన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి కలిసి వచ్చి విశ్వామిత్రునికి తన తండ్రియగు దశరథమహారాజునకు పాదాభివందనము ఒనర్చి పూజించెను.

1-18-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ రామో మహాతేజా
  లక్ష్మణేన సమం యయౌ ।
విశ్వామిత్రం పురస్కృత్య
  పితుః పాదావుపస్పృశన్॥

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనప్తతమ [69] = అరవై తొమ్మిదవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [69] అరవై తొమ్మిదవ సర్గ సుసంపూర్ణము

1-19-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యార్షే వాల్మీకి తెలుగు రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనసప్తతితమస్సర్గః||