వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥అష్టషష్టితమః సర్గః॥ [68 - దశరథునికి ఆహ్వానమందుట]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జనకేన సమాదిష్టా
 దూతాస్తే క్లాంతవాహనాః ।
త్రిరాత్రముషితా మార్గే
 తేఽ యోధ్యాం ప్రావిశన్ పురీమ్ ॥

టీకా:

జనకేన = జనకునిచేత; సమః = చక్కగా; ఆదిష్టా = అజ్ఞాపింప బడిన; దూతాః = దూతలు; తే = వారు; క్లాంత = బడలిక చెందిన, మిక్కిలి అలసిపోయిన; వాహనాః = వాహనములైన గుర్రములు కలవారై; త్రిరాత్రమ్ = మూడు రాత్రులు; ఉషితా = ఉన్నవారై; మార్గే = మార్గమునందు; తే = వారు; అయోధ్యామ్ = అయోధ్యను; ప్రావిశన్ = ప్రవేశించిరి; పురీమ్ = పురమును.

భావము:

జనకునిచేత అజ్ఞాపింపబడిన దూతలు మూడు రాత్రులు మార్గములో పయనించి అలసిపోయిన గుర్రములతో, వాహనములతో అయోధ్యానగరము ప్రవేశించిరి.

1-69-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్|
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ||

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యుక్తా ద్వారపాలాస్తే
 రాఘవాయన్యవేదయన్ ।
తే రాజవచనాద్దూతా
 రాజవేశ్మ ప్రవేశితాః ॥

టీకా:

ఇతి = ఇట్లు; ఉక్తాః = పలుకబడిన; ద్వారపాలాః = ద్వారపాలకులు; తే = ఆ; రాఘవాయ = రాఘవునకు; న్యవేదయన్ = తెలిపిరి; తే = ఆ; రాజః = రాజుయొక్క; వచనాత్ = ఆజ్ఞప్రకారము; దూతాః = దూతలు; రాజ = రాజుయొక్క; వేశ్మ = భవంతిలోనికి; ప్రవేశితాః = ప్రవేశపెట్టబడిన వారైరి .

భావము:

ద్వారపాలకులు వారి మాటలు దశరథునికి తెలిపిరి. అటుపిమ్మట దూతలు దశరథుని ఆనతితో రాజాగారి భవంతిలోనికి ప్రవేశించిరి.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దదృశుర్దేవసంకాశం
 వృద్ధం దశరథం నృపమ్ ।
బద్ధాంజలిపుటాః సర్వే
 దూతా విగతసాధ్వసా ॥

టీకా:

దదృశుః = దర్శించిరి; దేవ = దేవతల; సంకాశమ్ = వంటివానిని; వృద్ధమ్ = వృద్ధుని; దశరథమ్ = దశరథుని; నృపమ్ = మహారాజుని; బద్ధాంజలిపుటాః = దోసిళ్ళు మొగిడ్చిన వారై; సర్వే = అందరు; దూతాః = దూతలు; విగత = తొలగిపోయిన; సాధ్వసా = భయము కలవారై

భావము:

పిమ్మట ఆ దూతలు చేతులుజోడించుకొని నమస్కరించి బెదురు తగ్గిన వారై, దేవతలవంటి ప్రకాశవంతుడు, వృద్ధుడు అయిన దశరథ మహారాజును దర్శించిరి.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజానం ప్రయతా వాక్యమ్
 అబ్రువన్ మధురాక్షరమ్ ।
మైథిలో జనకో రాజా
 సాగ్నిహోత్ర పురస్కృతమ్ ॥

టీకా:

రాజానమ్ = రాజునుగూర్చి; ప్రయతాః = పరిశుద్ధమైన; వాక్యమ్ = సందేశమును; అబ్రువన్ = చెప్పిరి; మధురః = మధురమైన; అక్షరమ్ = మాటలు గల; మైథిలః = మిథిలాధిపతి; జనకః = జనకుడు; రాజా = మహారాజు; స = అతను; అగ్నిహోత్రః = అగ్నిహోత్రమును; పురస్కృతమ్ = ఎదురుగా కలవానిని;

భావము:

పిమ్మట ఆ దూతలు చక్కటి పదాలతో దశరథ మహారాజుతో ఇట్లు విన్నవించిరి. “మహారాజా! అగ్నిహోత్రానికి ఎదురుగా ఉన్నట్టి వాడు, మిథిలాధిపతి అయిన జనకమహారాజు.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“కుశలం చావ్యయం చైవ
 సోపాధ్యాయ పురోహితం ।
ముహుర్ముహు ర్మధురయా
 స్నేహ సంయుక్తయా గిరా ॥

టీకా:

కుశలమ్ = కుశలమును; చ = మరియు; అవ్యయం = క్షేమము; చైవ = ఇంకా; స = సహితముగ; ఉపాధ్యాయ = ఉపాధ్యాయులతో; పురోహితమ్ = పురోహితులతో; ముహుర్ముహుః = మరల మరల; మథురయా = మధురమైనది; స్నేహ = స్నేహముతో; సంయుక్తయా = కూడినది; గిరా = వాక్కుతో

భావము:

“జనకమహారాజు! మీ ఉపాధ్యాయుల, మీ పురోహితుల సహితముగా మీ కుశలమును, యోగ క్షేమములను స్నేహ పూర్వకముగా తన మధురమైన వాక్కులతో మరల మరల విచారించుచున్నాడు.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జనకస్త్వాం మహారాజా
 పృచ్ఛతే సపురఃసరమ్ ।
పృష్ట్వా కుశలమవ్యగ్రం
 వైదేహో మిథిలాధిపః ॥

టీకా:

జనకః = జనక మహారాజు; త్వామ్ = నిన్ను; మహారాజా = ఓ దశరథ మహారాజా; పృచ్ఛతే = అడుగుచుండెను; సపురఃసరమ్ = ముందు నడచు పరివారజనముతో ఉన్నవాడవగు; పృష్ట్వా = అడిగి; కుశలమ్ = కుశలమును; అవ్యగ్రమ్ = చిత్త విక్షేపణము లేకుండ; వైదేహః = విదేహదేశాధిపతి; మిథిలాధిపః = మిథిలానగరపు ప్రభువు

భావము:

ఓ దశరథ మహారాజా! సపరివారముతో కూడి యున్న నీ యొక్క కుశల సమాచారమును వైదేహుడు, మిథిలాధిపతియైన జనకమహారాజు చాలా శ్రద్ధగా అడుగుచుండెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కౌశికానుమతే వాక్యం
 భవంతమిదమబ్రవీత్ ।
పూర్వం ప్రతిజ్ఞా విదితా
 వీర్యశుల్కా మమాత్మజా ॥

టీకా:

కౌశికాః = విశ్వామిత్రుని; అనుమతే = అనుమతివలన; వాక్యమ్ = సందేశమును; భవంతమ్ = నిన్నుగూర్చి; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను; పూర్వమ్ = పూర్వము; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; విదితా = తెలిసినదే; వీర్యశుల్కా = పరాక్రమమే కన్యాశుల్కముగా గలది; మమాత్మజా = నా పుత్రిక.

భావము:

ఓ దశరథ మహారాజా! విశ్వామిత్రుని అనుమతి పొంది జనకమహారాజు నీకై ఈ వాక్యమును పలుకుచున్నాడు. "నా పుత్రిక వీర్యశుల్క యని నేను పూర్వము చేసిన ప్రతిజ్ఞ అందఱికిని తెలిసినదే కదా!"

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజానశ్చ కృతామర్షా
 నిర్వీర్యా విముఖీకృతాః ।
సేయం మమ సుతా రాజన్!
 విశ్వామిత్రపురస్సరైః ॥

టీకా:

రాజానః చ = రాజులు; చ = కూడ; కృత = ఒనర్చబడిన; ఆమర్షా = అసూయాపరులు; నిర్వీర్యాః = పరాక్రమము లేనివారు; విముఖీకృతాః = విముఖులుగా చేయబడితిరి; స = ఆ; ఇయమ్ = ఈ; మమ = నా యొక్క; సుతా = కుమార్తె; రాజన్ = ఓ రాజా; విశ్వామిత్ర పురస్సరైః = విశ్వామిత్రుని ముందుగా గల.

భావము:

శౌర్యములేని రాజులు పరాజితులై కోపముచే నా పట్ల విముఖులైరి. ఓ దశరథ మహారాజా! అట్టి నా కుమార్తె ఆ విశ్వామిత్రుని వెంట నడచుచున్న

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యదృచ్ఛయాఽఽ గతైర్వీరైః
 నిర్జితా తవ పుత్రకైః ।
తచ్చ రాజన్ ధనుర్దివ్యం
 మధ్యే భగ్నం మహాత్మనా ॥

టీకా:

యదృచ్ఛయా = యాదృచ్ఛికముగా; ఆగతైః = వచ్చినవానిచే; వీరైః = వీరునిచేత; నిర్జితా = జయింపబడినది; తవ = నీ యొక్క; పుత్రకైః = బాలుడైన కుమారుని చేత; తత్ = ఆ; రాజన్ = ఓ రాజా; ధనుః = ధనుస్సు; దివ్యమ్ = దివ్యమైన; మధ్యే = నడుమ; భగ్నమ్ = విరువబడినది; మహాత్మనా = మహాత్ముడైన రాముని చేత.

భావము:

ఓ దశరథ మహారాజా! యాదృచ్ఛికముగా విశ్వామిత్రుని వెంట వచ్చిన బాలుడైన నీ కుమారుడును మహాత్ముడున ఐన రాముడు ఆ దివ్యమైన శివధనుస్సును నట్టనడుమ విరిచెను. అందువలన సీత అతని చేత జయించుకోబడినది.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామేణ హి మహారాజ!
 మహత్యాం జనసంసది ।
అస్మై దేయా మయా సీతా
 వీర్యశుల్కా మహాత్మనే ॥

టీకా:

రామేణ = రాముని; హి = చేతనే; మహారాజ = ఓ మహారాజా; మహత్యామ్ = గొప్పదైన; జనసంసది = జనులతో నిండుగా ఉన్న సభ యందు; అస్మై = ఈ; దేయా = ఈయదగినది; మయా = నాచేత; సీతా = సీత; వీర్యశుల్కా = వీరత్వమే కన్యాశుల్కముగా కలది; మహాత్మనే = మహాత్మునకు.

భావము:

ఓ దశరథమహారాజా ! నిండు మహాసభలో రాముడు శివుని విల్లు విరుచుటచే, నేను పరాక్రమమే కన్యాశుల్కముగా గల సీతను మహాత్ముడగు రామునకు ఈయవలెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతిజ్ఞాం కర్తుమిచ్ఛామి
 తదనుజ్ఞాతుమర్హసి ।
సోపాధ్యాయో మహారాజ!
 పురోహితపురస్సరః ॥

టీకా:

ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను; కర్తుమ్ = నెరవేర్చుటకు; ఇచ్ఛామి = ఇష్టపడుచుంటిని; తత్ = ఆ కారణము వలన; అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞనిచ్చుటకు; అర్హసి = తగిఉన్నావు; సః ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతో కూడి; మహారాజ = ఓ మహారాజా; పురోహితః = పురోహితునలను; పురఃసరః = ముందిడుకుని.

భావము:

ఓ దశరథ మహారాజా! నీవు నా ప్రతిజ్ఞను నిలుపుకొనుటకు అనుజ్ఞనిమ్ము. నీవు పురోహిత ఉపాధ్యాయుల సమేతుడవై రమ్ము.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శీఘ్రమాగచ్ఛ భద్రం తే
 ద్రష్టుమర్హసి రాఘవౌ ।
ప్రీతిం చ మమ రాజేంద్ర!
 నిర్వర్తయితుమర్హసి ॥

టీకా:

శీఘ్రమ్ = శీఘ్రముగా; ఆగచ్ఛ = రమ్ము; భద్రం = క్షేమమగుగాక; తే = నీకు; ద్రష్టుమ్ = చూచుటకు; అర్హసి = అర్హత కలిగియుంటివి; రాఘవౌ = రామలక్ష్మణులను; ప్రీతిమ్ = ఆనందమును; చ = కూడ; మమ = నాకు; రాజేంద్ర = ఓ రాజశ్రేష్ఠుడా; నిర్వర్తయితుమ్ = కలిగించుటకు; అర్హసి = తగియుంటివి.

భావము:

ఓ రాజశ్రేష్ఠుడైన దశరథ మహారాజా! నీవు శీఘ్రముగా వచ్చి రామలక్ష్మణులను చూడుము. నీకు శుభమగుగాక. నీ రాకచే నాకు ఆనందము కలిగింపుము.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుత్రయోరుభయోరేవ
 ప్రీతిం త్వమపి లప్స్యసే" ।
ఏవం విదేహాధిపతిః
 మధురం వాక్యమబ్రవీత్ ॥

టీకా:

పుత్రయోః = పుత్రులయొక్క; ఉభయోః = ఇరువురు; ఇవ = ఈ విధముగా; ప్రీతిమ్ = ఆనందమును; త్వమపి = నీవు కూడా; లప్స్యసే = పొందగలవు; ఏవమ్ = ఇట్లు; విదేహ = విదేహదేశపు; అధిపతిః = రాజు; మధురమ్ = తియ్యనైన; వాక్యమ్ = సందేశమును; అబ్రవీత్ = పలికెను.

భావము:

ఓ దశరథ మహారాజా! ఈ విధముగా నీవు నీ ఇరువురు పుత్రులను కని ఆనందము పొందగలవు “ అని విదేహరాజు జనకుడు తియ్యని వార్తను చెప్పెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః
 శతానందమతే స్థితః” ।
ఇత్యుక్త్వా విరతా దూతా
 రాజగౌరవ శంకితాః ॥

టీకా:

భూతలాత్ = భూతలమునుండి; ఉత్థితాం = పుట్టిన, వావిళ నిఘంటువు; తాం = ఆమెను; తు; వర్ధమానాం = పెరుగుతున్న; మమ = నా; ఆత్మజామ్ = కుమార్తెను; వరయామాసుః = వరించుటకు; ఆగమ్య = వచ్చిరి; రాజానః = రాజులు; మునిపుఙ్గవ = మునిపుంగవ!

భావము:

ఓ మునిపుంగవ! భూతలమునుండి పుట్టిన నా కుమార్తెగా పెరుగుతున్న సీతను వరించుటకు పెక్కుమంది రాజులు విచ్చేసిరి.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దూతవాక్యం తు తచ్ఛ్రుత్వా
 రాజా పరమహర్షితః ।
వసిష్ఠం వామదేవం చ
 మంత్రిణోఽ న్యాంశ్చ సోఽ బ్రవీత్ ॥

టీకా:

దూతవాక్యం = దూతలు చెప్పిన సమాచారము; తు; తత్ = ఆ; శ్రుత్వా = విని; రాజా = రాజు; పరమ = మిక్కిలి; హర్షితః = సంతసించినవాడై; వసిష్ఠం = వసిష్ఠుని; వామదేవం = వామదేవుని; చ = మఱియు; మంత్రిణః = మంత్రులను గూర్చి; అన్యాన్ = ఇతరుల గురించి; సః = అతడు; అబ్రవీత్ = పలికెను.

భావము:

దూతలు తెచ్చిన సమాచారము విన్న దశరథుడు ఎంతో సంతోషించి, వసిష్ఠ వామదేవులతోడను, ఇతరమంత్రుల తోడను ఇట్లు పలికెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజ్ఞో భవనమాసాద్య
 ద్వారస్థానిదమబ్రువన్ ।
శీఘ్రం నివేద్యతాం రాజ్ఞే
 దూతాన్నో జనకస్య చ ॥

టీకా:

రాజ్ఞః = రాజు యొక్క; భవనమ్ = భవనమును; ఆసాద్య = పొంది; ద్వారస్థాన్ = ద్వారపాలకులను గురించి; ఇదమ్ = ఈ విధముగా; అబ్రువన్ = పలికిరి; శీఘ్రమ్ = శీఘ్రముగా; నివేద్యతామ్ = తెలుపబడుగాక; రాజ్ఞే = రాజునకు; దూతాన్ = దూతలను; నః = మమ్ము; జనకస్య = జనకమహారాజుయొక్క; చ = మరియు;

భావము:

వారు రాజభవనమునకు వెళ్ళి అచటి ద్వారాపాలకులతో "జనక మహారాజు దూతలు వచ్చినారని దశరథ మహారాజుతో శీఘ్రముగా విన్నవించుడు." అని పలికిరి.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దృష్టవీర్యస్తు కాకుత్స్థో
 జనకేన మహాత్మనా ।
సంప్రదానం సుతాయాస్తు
 రాఘవే కర్త్తుమిచ్ఛతి ॥

టీకా:

దృష్ట = చూడబడిన; వీర్యః = పరాక్రమము కలవాడు; అస్తు = కలడు; కాకుత్స్థః = రాముడు; జనకేన = జనకుని చేత; మహాత్మనా = మహాత్ముడైన; సంప్రదానం = కన్యాదానమును, ఆంధ్రశబ్దరత్నాకరము; సుతాయాః = కుమార్తెయొక్క; తు; రాఘవే = రామునియందు; కర్త్తుమ్ = చేయుటకు; ఇచ్ఛతి = ఇష్టపడుచుండెను.

భావము:

మహాత్ముడు జనకమహారాజు రాముని పరాక్రమము చూచి తన కుమార్తె సీతను అతనికి కన్యాదానము చేయగోరుచున్నాడు.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యది వో రోచతే వృత్తం
 జనకస్య మహాత్మనః ।
పురీం గచ్ఛామహే శీఘ్రం
 మాభూత్కాలస్య పర్యయః ॥

టీకా:

యది = అయినచో; వః = మీకు; రోచతే = ఇష్టమైనది; వృత్తమ్ = చరితము; జనకస్య = జనకమహారాజు యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; పురీమ్ = మిథిలాపట్టణము గూర్చి; గచ్ఛామహే = వెళ్ళెదము; శీఘ్రమ్ = శీఘ్రముగా; మాభూత్ = కాకపోవుగాక; కాలస్య = కాలము యొక్క; పర్యయః = క్షయము, ఆంధ్రశబ్దరత్నాకరము.

భావము:

మహాత్ముడు జనకమహారాజుయొక్క ఆచార సంపత్తి మీకు నచ్చినచో శీఘ్రముగా మిథిలాపురికి వెళ్ళెదము. కాలాతీతము కాకుండా చూడుడు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంత్రిణో “బాఢమి”త్యాహుః
 సహ సర్వైర్మహర్షిభిః ।
సుప్రీత శ్చాబ్రవీద్రాజా
 “శ్వో యాత్రేతి” స మంత్రిణః ॥

టీకా:

మంత్రిణః = మంత్రులు; బాఢమ్ = బాగుబాగు; ఇతి = అని; అహుః = పలికిరి; సహ = కూడ; సర్వైః = సకలురు; మహర్షిభిః = మహర్షులతో; సుప్రీతః = మిక్కిలి సంతసించినవాడై; సః = ఆ; అబ్రవీత్ = పలికెను; రాజా = రాజు; శ్వః = రేపు, మరునాడు; యాత్రా = ప్రయాణము; ఇతి = అని; సః = ఆ; మంత్రిణః = మంత్రులను గూర్చి.

భావము:

మంత్రులు, మహర్షులు అందరు’ బాగు బాగు’ అని తమ అంగీకారము తెలిపిరి. దశరథుడు చాలా సంతోషించి మరునాడే ప్రయాణము అని మంత్రులతో చెప్పెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంత్రిణస్తాం నరేంద్రస్య
 రాత్రిం పరమసత్కృతాః ।
ఊషుస్తే ముదితాః సర్వే
 గుణైః సర్వైస్సమన్వితాః ॥

టీకా:

మంత్రిణః తు = మంత్రులు; తు = కూడ; నరేంద్రస్య = జనకమహారాజు యొక్క; రాత్రిమ్ = రాత్రిని; పరమ = చాల; సత్కృతాః = సత్కరించినబడిన వారై; ఊషుః = నివసించిరి; తే = వారు; ముదితాః = సంతసించినవారు; గుణైః = గుణములతో; సర్వైః = అందరు; సమన్వితాః = కూడినవారు.

భావము:

సకల సద్గుణసంపన్నులగు జనకమహారాజు మంత్రులు చక్కని సత్కారములను పొంది, ఆ రాత్రి అయోధ్యా నగరములో సంతోషముగా గడిపిరి.

1-22-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 అష్టషష్టితమః సర్గః

టీకా:

ఇతి = ఈ విధముగా; ఆర్షే సంప్రదాయే = ఋషి చే; ఆదికావ్యే = ఆది కావ్యమందు; వాల్మీకి = వాల్మీకి; తెలుగు = తెలుగు; రామాయణే = రామాయణము నందు; బాలకాండే = బాలకాండ యందు; అష్టషష్టితమః [68] = ఆరవై ఎనిమిదవ; సర్గః = సర్గ.

భావము:

ఈ విధముగ వాల్మీకిఋషి యొక్క ఆది కావ్యమందు తెలుగు రామాయణములో బాలకాండ యందు అరవై ఎనిమిదవ సర్గ (68) సమాప్తము