వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥సప్తషష్టితమః సర్గః॥ [67 - శివధనుర్భంగము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జనకస్య వచః శ్రుత్వా
 విశ్వామిత్రో మహామునిః ।
“ధనుర్దర్శయ రామాయ"
 ఇతి హోవాచ పార్థివమ్ ॥

టీకా:

జనకస్య = జనకునియొక్క; వచః = మాటలను; శ్రుత్వా = విని; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు అను; మహామునిః = మహాముని; ధనుః = ధనుస్సు; దర్శయ = చూపుము; రామాయ = రాముని కొరకు; ఇతి = అని; ఉవాచ హ = పలికెను; పార్థివమ్ = రాజును గూర్చి.

భావము:

జనకమహారాజు యొక్క మాటలు విని విశ్వామిత్రమహాముని అతనితో "రామునకు ఆ ధనుస్సును చూపుము" అని పలికెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః స రాజా జనకః
 సామంతాన్ వ్యాదిదేశ హ ।
ధనురానీయతాం దివ్యం
 గంధమాల్య విభూషితమ్ ॥

టీకా:

తతః = తరువాత; సః = ఆ; రాజా = రాజు; జనకః = జనకుడు; సచివాన్ = మంత్రులను; వ్యాదిదేశ హ = ఆజ్ఞాపించెను; ధనుః = ధనుస్సు; ఆనీయతాం = తీసుకొని రాబడుగాక; దివ్యం = దివ్యమైన; గంధః = చందనముతోను; మాల్యః = పుష్పమాలికలచేతను; విభూషితమ్ = అలంకరింపబడినది.

భావము:

విశ్వామిత్రుని మాటను విని జనకమహారాజు "చందనము పుష్పమాలికలచే అలంకరింపబడిన ఆ ధనుస్సును తీసుకొని రండు" అని తన మంత్రులను ఆజ్ఞాపించెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జనకేన సమాదిష్టాః
 సచివాః ప్రావిశన్ పురీమ్ ।
తద్ధనుః పురతః కృత్వా
 నిర్జగ్ముః పార్థివాజ్ఞయా ॥

టీకా:

జనకేన = జనకునిచే; సమాదిష్టాః = ఆజ్ఞాపించబడిన; సచివాః = మంత్రులు; ప్రావిశన్ = ప్రవేశించిరి; పురీమ్ = నగరమును; తత్ = ఆ; ధనుః = ధనుస్సు; పురతః = ఎదురుగా; కృత్వా = ఉంచుకొని; నిర్జగ్ముః = బయలుదేరిరి; పార్థివ = రాజుయొక్క; ఆజ్ఞయః = ఆజ్ఞచే.

భావము:

జనకుని ఆజ్ఞ గైకొని, మంత్రులు నగరమునకు వెళ్ళి, ఆ ధనుస్సును ముందిడుకొని, బయలుదేరి వచ్చిరి.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నృణాం శతాని పంచాశత్
 వ్యాయతానాం మహాత్మనామ్ ।
మంజూషామష్టచక్రాం తాం
 సమూహుస్తే కథంచన ॥

టీకా:

నృణాం = పురుషుల; శతాని = వందలు; పంచాశత్ = యాభై; వ్యాయతానాం = దృఢకాయులు; మహాత్మనామ్ = గొప్పవారు; మంజూషామ్ = పెట్టెను; అష్టచక్రాం = ఎనిమిది చక్రములుగల; తు; తాం = దానిని; సమూహుః = లాగుకొని తీసుకువచ్చిరి; తే = వారు; కథంచన = ఎటులనో కష్టపడి

భావము:

ధృడకాయులు గొప్పబలాఢ్యులు అయిన ఏబది వందల పురుషులు ధనుస్సు ఉన్న ఆ ఎనిమిది చక్రముల పెట్టెను ఎటులనో అతికష్టముగా లాగుకొని తీసుకువచ్చిరి.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తామాదాయ తు మంజూషాం
 ఆయసీం యత్ర తద్ధనుః ।
సురోపమం తే జనకం
 ఊచుర్నృపతిమంత్రిణః ॥

టీకా:

తామ్ = దానిని; ఆదాయతు = తెచ్చి; మంజూషామ్ = పెట్టెను; ఆయసీమ్ = ఇనుపది; యత్ర = ఎక్కడైతే; తత్ = ఆ; ధనుః = ఆ ధనుస్సు; సురోపమమ్ = దైవసమానుడైన; తే = ఆ; జనకమ్ = జనకుని గూర్చి; ఊచుః = పలికిరి; నృపతిమంత్రిణః = రాజుయొక్క మంత్రులు.

భావము:

అది ఉన్నచోటునుండి శివధనుస్సు ఉన్న ఆ ఇనుపపెట్టెను తీసుకొనివచ్చి జనకమహారాజు యొక్క మంత్రులు, దైవసమానుడైన ఆ రాజుతో ఇట్లనిరి.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇదం ధనుర్వరం రాజన్
 పూజితం సర్వరాజభిః ।
మిథిలాధిప రాజేంద్ర
 దర్శనీయం యదిచ్ఛసి" ॥

టీకా:

ఇదం = ఇది; ధనుః = కార్ముకము; వరం = శ్రేష్ఠమైనది; రాజన్ = రాజా; పూజితం = పూజించబడిన; సర్వ = అందరు; రాజః = రాజులుచేతనూ; భిః = కూడా; మిథిలాః = మిథిలదేశపు; అధిప = రాజా; రాజేంద్ర = రాజశ్రేష్ఠుడా; దర్శనీయం = చూపదగినదిగా; యత్ = అట్టి; ఇచ్ఛసి = కోరుచున్నావో.

భావము:

“రాజశ్రేష్ఠా! మిథిలాధిపా! నీవు రామునకు చూపదలచినదియును, రాజులందరిచే పూజింపబడినదియును అగు శివధనుస్సు ఇదియే.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేషాం నృపో వచః శ్రుత్వా
 కృతాంజలిరభాషత ।
విశ్వామిత్రం మహాత్మానం
 తౌ చోభౌ రామలక్ష్మణౌ ॥

టీకా:

తేషాం = వారియొక్క; నృపః = రాజు; వచః = మాటను; శ్రుత్వా = విని; కృతాంజలిః = దోసిలి పట్టినవాడై; అభాషత = పలికెను; విశ్వామిత్రం = విశ్వామిత్రుని గురించి; మహాత్మానం = మహాత్ముడైన; తౌ = ఆ; చ = మరియు; ఉభౌ = ఇద్దరు గురించి; రామలక్ష్మణౌ = రామలక్ష్మణుల గురించి.

భావము:

జనకుడు వారి మాటలను విని, విశ్వామిత్రమహామునితోను మఱియు రామలక్ష్మణులు ఇద్దరితోను చేతులు జోడించి ఇట్లు పలికెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇదం ధనుర్వరం బ్రహ్మన్!
 జనకై రభిపూజితమ్ ।
రాజభిశ్చ మహావీర్యైః
 అశక్తైః పూరితుం పురా ॥

టీకా:

ఇదం = ఇది; ధనుః = విల్లు; వరం = శ్రేష్ఠమైనది; బ్రహ్మన్ = బ్రాహ్మణుడా; జనకైః = జనకుని వంశజులచేతను; అభిపూజితమ్ = పూజింపబడినది; రాజఃభిః = రాజులు; భిః = కూడా; చ = మరియు; మహా = గొప్ప; వీర్యైః = వీరులచే; అశక్యం = సాధ్యము కానిది; పూరితుం = ఎక్కు పెట్టుటకు; పురా = పూర్వము.

భావము:

బ్రాహ్మణోత్తమా! విశ్వామిత్రా! మా జనక వంశీయులచేత పూజింప బడిన శ్రేష్ఠమైన ధనుస్సు ఇది. పూర్వము దీనిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించి మహాపరాక్రమవంతులైన రాజులు కూడ విఫలులైరి.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నైతత్ సురగణాః సర్వే
 నాసురా న చ రాక్షసా ।
గంధర్వయక్ష ప్రవరాః
 సకిన్నర మహోరగాః ॥

టీకా:

న = లేదు; ఏతత్ = దీనిని; సురగ = దేవ; గణాః = సమూహము; సర్వే = అందరును; న = లేదు; అసురా = అసురులు; న = లేదు; చ = కూడా; రాక్షసా = రాక్షసులు; గంధర్వః = గంధర్వ; యక్షః = యక్ష; ప్రవరాః = శ్రేష్ఠులు; స = కూడి; కిన్నరః = కిన్నరులు; మహా = గొప్ప; ఉరగాః = నాగులు.

భావము:

దేవలు కాని, అసురులు గాని, రాక్షసులు గాని, గంధర్వ, యక్ష, కిన్నర, గొప్పగొప్ప నాగులు గాని ఎవరూ ఈ ధనుస్సును ఎక్కుపెట్టలేక పోయిరి.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్వ గతిర్మానుషాణాం చ
 ధనుషోఽ స్య ప్రపూరణే ।
ఆరోపణే సమాయోగే
 వేపనే తోలనేఽ పి వా ॥

టీకా:

క్వ = ఎక్కడ; గతిః = మార్గము; మానుషాణాం = మనుష్యులకు; ధనుషః = ధనుస్సు; అస్య = దీనియొక్క; ప్రపూరణే = వంచుట యందు; ఆరోపణే = నారిని కూర్చుట యందు; సమాయోగే = బాణమును సంధించుట యందు; వేపనే = నారిని లాగుటయందు; తోలన్ = వోయుయందు; అపి = అయినై; వా = కాని.

భావము:

ఈ ధనుస్సును వంచుటకు గాని, నారిని కూర్చుటకు గాని, బాణమును సంధించుటకు గాని, నారిని లాగుటకు గాని, ఆ బాణము వేయుటయినా గాని ఇక మనుష్యులచే అగుటకు అవకాశం ఎక్కడ?

1-68-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదేతద్ధనుషాం శ్రేష్ఠమానీతం మునిపుఙ్గవ!|
దర్శయైతన్మహాభాగ అనయోః రాజపుత్రయోః||

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రస్తు ధర్మాత్మా
 శ్రుత్వా జనకభాషితమ్ ।
"వత్స రామ! ధనుః పశ్య”
 ఇతి రాఘవమబ్రవీత్ ॥

టీకా:

విశ్వామిత్రః = విశ్వామిత్రుడును; తు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; శ్రుత్వా = విని; జనకః = జనకునిచే; భాషితమ్ = చెప్పబడినది; వత్స = కుమారా; రామ = రామా; ధనుః = ధనుస్సు; పశ్య = చూడుము; ఇతి = అని; రాఘవమ్ = రాముని గూర్చి; అబ్రవీత్ = పలికెను.

భావము:

ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకమహారాజు మాటలు విని, "నాయనా! రామా! ఆ ధనుస్సును చూడుము" అని రామునితో పలికెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహర్షే ర్వచనాద్రామో
 యత్ర తిష్ఠతి తద్ధనుః ।
మంజూషాం తామపావృత్య
 దృష్ట్వా ధనురథాబ్రవీత్ ॥

టీకా:

బ్రహ్మర్షేః = బ్రహ్మఋషి యొక్క; వచనాత్ = మాట వలన; రామః = రాముడు; యత్ర = దేనియందు; తిష్ఠతి = ఉన్నదో; తత్ = ఆ; ధనుః = ధనుస్సు; మంజూషాం = పెట్టెను; తామ్ = అటువంటి; అపావృత్య = తెరచి; దృష్ట్వా = చూసి; ధనుః = ధనుస్సు; అథ = తరువాత; అబ్రవీత్ = పలికెను.

భావము:

బ్రహ్మర్షి ఐన విశ్వామిత్రుని మాట విని, ధనుస్సు ఉన్న ఆ పెట్టెను తెరచి, ధనుస్సును చూసి రాముడు ఇట్లు పలికెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇదం ధనుర్వరం బ్రహ్మన్!
 సంస్పృశామీహ పాణినా ।
యత్నవాంశ్చ భవిష్యామి
 తోలనే పూరణేఽ పి వా?" ॥

టీకా:

ఇదం = ఈ; ధనుర్వరం = శ్రేష్ఠమైన ధనుస్సును; బ్రహ్మన్ = బ్రహ్మఋషీ; సంస్పృశామి = తాకెదను; ఇహ = ఇప్పుడు; పాణినా = చేతితో; యత్నవాన్ = ప్రయత్నించువాడను; భవిష్యామి = కాగలను; తోలనే = ప్రారంభించుట; పూరణాః = ఎక్కుపెట్టుట; అపి = కూడ; వా = చేయనా.

భావము:

“ఓ బ్రహ్మర్షీ! ఇప్పుడు ఈ శ్రేష్ఠమైన ధనుస్సును, చేతితో తాకి, దానిని కదల్చుటకు గాని, ఎక్కుపెట్టుటకు గాని ప్రయత్నించెనా?

1-68-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత|
లీలయా స ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునేః||

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పశ్యతాం నృసహస్రాణాం
 బహూనాం రఘునందనః ।
ఆరోపయత్స ధర్మాత్మా
 స లీలమివ తత్ధనుః ॥

టీకా:

పశ్యతాం = చూచుచుండగా; నృసహస్రాణాం = వేల కొలది జనులు; బహూనాం = అనేక; రఘునందనః = రాముడు; ఆరోపయత్ = ఎక్కుపెట్టెను; సః = అతడు; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; సలీలమ్ = అవలీలగా; ఇవ = వలె; తత్ = ఆ; ధనుః = ధనుస్సు,

భావము:

వేలకొలది జనులు చూచుచుండగా, ధర్మాత్ముడైన రాముడు ఆ ధనుస్సు అవలీలగా ఎక్కుపెట్టెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆరోపయిత్వా ధర్మాత్మా
 పూరయామాస తద్ధనుః ।
తద్బభంజ ధనుర్మధ్యే
 నరశ్రేష్ఠో మహాయశాః ॥

టీకా:

ఆరోపయిత్వా = ఎక్కుపెట్టి; మౌర్వీం = ధనుస్సు యొక్క అల్లెత్రాడును; చ = ఇంకనూ; పూరయామాస = పూర్తిగా లాగెను; వీర్యవాన్ = వీరుడైన; తత్ = అంతట; బభంజ = విరిగెను; ధనుః = ధనువు; మధ్యే = మధ్యలో; నరశ్రేష్ఠః = మానవశ్రేష్ఠుడు; మహాయశాః = గొప్ప యశస్సు గలవాడు.

భావము:

ధర్మాత్ముడును వీరుడును ఐన రాముడు, ఆ ధనువును ఎక్కుపెట్టి, వింటినారిని ఆకర్ణాంతము లాగెను. అంత ఆ విల్లు మధ్యకు విరిగెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య శబ్దో మహానాసీత్
 నిర్ఘాతసమనిస్వనః ।
భూమికంపశ్చ సుమహాన్
 పర్వతస్యేవ దీర్యతః ॥

టీకా:

తస్య = దాని యొక్క; శబ్దః = శబ్దమును; మహాన్ = గొప్ప; ఆసీత్ = అయ్యెను; నిర్ఘాత = పిడుగు; సమ = సమానమైన; నిస్స్వనః = ధ్వని; భూమిః = భూమి; కంపః = కంపించెను; చ = మరియు; సుమహాన్ = చాల పెద్ద; పర్వతస్య = పర్వతము యొక్క; ఇవ = వలె; దీర్యతః = బ్రద్దలగుట.

భావము:

ఆ ధనుస్సును విరిగినపుడు పిడుగుపడినట్లుగా పెద్ద ధ్వని వినిపించెను. ఒక మహాపర్వతము బ్రద్దలైనప్పటి వలె భూమి కంపించెను.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిపేతుశ్చ నరాః సర్వే
 తేన శబ్దేన మోహితాః ।
వర్జయిత్వా మునవిరం
 రాజానం తౌ చ రాఘవౌ ॥

టీకా:

నిపేతుః = పడిపోయిరి; చ = మరియు; నరాః = ప్రజలు; సర్వే = సకల; తేన = ఆ; శబ్దేన = శబ్దముచేత; మోహితాః = మూర్ఛ వచ్చి; వర్జయిత్వా = విడిచి; మునివరం = మహామునిని; రాజానాం = మహారాజుని; తౌ = ఆ; చ = మరియు; రాఘవౌ = రఘువంశీయులిద్దరును.

భావము:

ఆ భయంకర శబ్దముచేత, విశ్వామిత్రుడు, జనకమహారాజు రామలక్ష్మణులు తప్ప తదితరులందరును మూర్ఛిల్లిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్
 రాజా విగతసాధ్వసః ।
ఉవాచ ప్రాంజలిర్వాక్యం
 వాక్యజ్ఞో మునిపుంగవమ్ ॥

టీకా:

ప్రతి ఆశ్వస్తః = మూర్ఛ నుండి తేరుకొని; జనే = జనులు; తస్మిన్ = ఆ; రాజా = రాజు; విగత = తొలగిన సాధ్వసః = భీతి; ఉవాచ = పలికెను; ప్రాంజలిః = జోడించిన చేతులు కలవాడై; వాక్యం = మాటను; వాక్యజ్ఞః = మాటలాడుటలో నేర్పరి; మునిపుఙ్గవమ్ = మహాముని గురించి.

భావము:

జనులందరు మూర్ఛనుండి తేరుకొనిన పిమ్మట, వాక్చతురుడైన జనకమహారాజు భయములేని వాడై నమస్కరించుచు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భగవన్! దృష్టవీర్యో మే
 రామో దశరథాత్మజః ।
అత్యద్భుతమచింత్యం చ
 న తర్కితమిదం మయా ॥

టీకా:

భగవన్ = పూజనీయా; దృష్ట = చూడబడిన; వీర్యః = పరాక్రమము గలవాడు; మే = నాచేత; రామః = రాముడు; దశరథాత్మజః = దశరథుని యొక్క కుమారుడు; అత్యద్భుతమ్ = మిక్కిలి అద్భుతము; అచింత్యం = ఊహించలేనటువంటిది; చ = మరియు; అతర్కికమ్ = అనుకొననిది; ఇదం = ఇది; మయా = నాచేత.

భావము:

పూజనీయుడవైన ఓ మహామునీ! దశరథుని కుమారుడైన రాముని యొక్క పరాక్రమమును ప్రత్యక్షముగ చూచితిని. అత్యంతద్భుతమును, ఊహాతీతమును ఐన ఈ సంఘటన ఇట్లగునని నేను అనుకొనలేదు.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జనకానాం కులే కీర్తిమ్
 ఆహరిష్యతి మే సుతా ।
సీతా భర్తారమాసాద్య
 రామం దశరథాత్మజమ్ ॥

టీకా:

జనకానాం = జనక మహారాజు యొక్క; కులే = వంశమునందు; కీర్తిమ్ = కీర్తిని; ఆహరిష్యతి = తీసుకురాగలదు; మే = నా; సుతా = కుమార్తె; సీతా = సీత; భర్తారమ్ = భర్తగా; ఆసాద్య = పొంది; రామం = రాముని; దశరథాః = దశరథుని; ఆత్మజమ్ = కుమారుడిని.

భావము:

నా కుమార్తె ఐన సీత, దశరథుని కుమారుడైన రాముని భర్తగా పొంది, మా వంశమునకు కీర్తిని తేగలదు.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మమ సత్యా ప్రతిజ్ఞా చ
 వీర్యశుల్కేతి కౌశిక! ।
సీతా ప్రాణైర్బహుమతా
 దేయా రామాయ మే సుతా ॥

టీకా:

మమ = నాయొక్క; సత్యా = నిజమైన; ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ; చ = కూడ; వీర్య శుల్కః = పరాక్రమము అను శుల్కము; ఇతి = ఇది; కౌశిక = విశ్వామిత్రా; సీతా = సీత; ప్రాణైః = ప్రాణములతో సమముగా; బహుమతా = ఆదరింపబడిన; దేయా = ఇవ్వ తగినది; రామాయ = రాముని కొరకు; మే = నా యొక్క; సుతా = కుమార్తె.

భావము:

విశ్వామిత్రా! "నా కుమార్తెను పెండ్లియాడుటకు పరాక్రమమే శుల్కము" అని నేను చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు నిరూపించబడినది. నాకు ప్రాణసమానమైన సీతను రామునకు ఇచ్చెదను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భవతోఽ నుమతే బ్రహ్మన్!
 శీఘ్రం గచ్ఛంతు మంత్రిణః ।
మమ కౌశిక! భద్రం తే
 అయోధ్యాం త్వరితా రథైః" ॥

టీకా:

భవతః = నీ యొక్క; అనుమతే = అనుజ్ఞయందు; బ్రహ్మన్ = బ్రహ్మర్షీ; శీఘ్రం = వేగముగా; గచ్ఛంతు = వెళ్ళెదరు; మంత్రిణః = మంత్రులు; మమ = నా యొక్క; కౌశిక = విశ్వామిత్రా; భద్రం = శుభము; తే = నీకు; అయోధ్యాం = అయోధ్య గూర్చి; త్వరితా = త్వరగా; రథైః = రథములతో.

భావము:

విశ్వామిత్రా! నీ అనుజ్ఞ ప్రకారము నా మంత్రులు రథములలో అయోధ్యకు వేగముగా వెళ్ళెదరు. నీకు శుభమగు గాక.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజానం ప్రశ్రితైర్వాక్యైః
 ఆనయంతు పురం మమ ।
ప్రదానం వీర్యశుల్కాయాః
 కథయంతు చ సర్వశః ॥

టీకా:

రాజానాం = దశరథ మహారాజును; ప్రశ్రితైః = సవినయముగా; వాక్యైః = మాటలతో; ఆనయంతు = తోడ్కొని వచ్చెదరు; పురం = నగరము గూర్చి; మమ = నా యొక్క; ప్రదానం = ఇచ్చుట; వీర్య శుల్కయా = వీర్య శుల్క యైన సీత యొక్క; కథయంతు = చెప్పెదరు; సర్వశః = అంతయు.

భావము:

వీర్య శుల్క యైన సీతను రామునకు ఇచ్చుటకు గల వృత్తాంత మంతయును, మంత్రులు దశరథునికి సవినయముగా వివరించి నా నగరమునకు తోడ్కొని వత్తురు గాక.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిగుప్తౌ చ కాకుత్స్థౌ
 కథయంతు నృపాయ వై ।
ప్రీయమాణం తు రాజానం
 ఆనయంతు సుశీఘ్రగాః ॥

టీకా:

మునిః = విశ్వామిత్రమహామునిచే; గుప్తౌ = రక్షింప బడెడి వారినిగా; కాకుత్థ్సౌ = రామలక్ష్మణులను; కథయంతు = తెలిపెదరు గాక; నృపాయ వై = దశరథుని కొరకు; ప్రీయమాణం = సంతోషమానసుడైన; రాజానమ్ = రాజును; ఆనయంతు = తోడ్కొని వచ్చెదరు గాక; సు = చాలా; శీఘ్రః = వేగముగా; గాః = వెళ్ళినవారై.

భావము:

మంత్రులు త్వరగా వెళ్ళి, విశ్వామిత్రుని రక్షణలో రామలక్ష్మణు లున్నా రని తెలియజేసి, సంతోషమానసుడైన దశరథుని తోడ్కొని వచ్చెదరు గాక.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కౌశికశ్చ “తథే”త్యాహ
 రాజా చాభాష్య మంత్రిణః ।
అయోధ్యాం ప్రేషయామాస
 ధర్మాత్మా కృతశాసనాన్ ।
యథావృత్తం సమాఖ్యాతుం
     ఆనేతుం చ నృపం తదా ॥

టీకా:

కౌశికః = విశ్వామిత్రుడు; చ = కూడ; తథా ఇతి = అట్లే అగు గాక; ఆహ = పలికెను; రాజా = జనక మహారాజు; చ = కూడ; ఆభాష్య = సంప్రదించెను; మంత్రిణః = మంత్రులతో; అయోధ్యాం = అయోధ్య గూర్చి; ప్రేషయామాస = పంపించెను; ధర్మాత్మా = ధర్మాత్ముడైన; కృతశాసనాత్ = అనుచరులను; యథావృత్తం = జరిగిన విషయమును యథాతథముగా; సమాఖ్యాతుమ్ = చెప్పుటకును; ఆనేతుం = తోడ్కొని వచ్చుటకు; నృపం = రాజును; తదా = అప్పుడు.

భావము:

"అట్లే యగు గాక" అని విశ్వామిత్రుడు పలుకగా, జనకమహారాజు తన మంత్రులతో సంప్రదించెను. జరిగినది యథాతథముగా దశరథునకు తెలియజేసి, ఆతనిని తోడ్కొని వచ్చుటకై జనకమహారాజు తన అనుచరులను అయోధ్యకు పంపెను.

1-28-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 సప్తషష్టితమః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తషష్టితమః [67] = అరవైఏడవ; సర్గః = సర్గ

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవైఏడవ [67] సర్గ సంపూర్ణము.

1-29-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యార్షే వాల్మీకి తెలుగు రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తషష్టితమస్సర్గః||