బాలకాండమ్ : ॥షట్షష్టితమః సర్గః॥ [66 - సీతాదేవి వివాహానికి నియమం]
- ఉపకరణాలు:
తతః ప్రభాతే విమలే
కృతకర్మా నరాధిపః ।
విశ్వామిత్రం మహాత్మానమ్
ఆజుహావ సరాఘవమ్ ॥
టీకా:
తతః = అటుపిమ్మట; ప్రభాతే = ప్రాతఃకాలమందు; విమలే = వెలుతురులో; కృత = చేయబడిన; కర్మా = అనుష్ఠానకర్మలు కలవాడై; నరాధిపః = రాజు; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; మహాత్మానమ్ = మహాత్ముని; ఆజుహావ = పిలిచెను; స = సహితముగ; రాఘవమ్ = రాఘ వంశులను.
భావము:
మఱునాడు తెల్లవాఱగానే జనకమహారాజు ప్రాతఃకాల కృత్యములు, అనుష్ఠానములు పూర్తిచేసుకొని మహాత్ముడు విశ్వామిత్రుని శ్రీరామ, లక్ష్మణులను కూడా తీసుకురమ్మని ఆహ్వానించెను.
- ఉపకరణాలు:
తమర్చయిత్వా ధర్మాత్మా
శాస్త్రదృష్టేన కర్మణా ।
రాఘవౌ చ మహాత్మానౌ
తదా వాక్యమువాచ హ ॥
టీకా:
తమ్ = వానిని (విశ్వామిత్రుని); అర్చయిత్వా = పూజించి; ధర్మాత్మా = ధర్మాత్ముడు (జనక మహారాజు); శాస్త్రదృష్టేన = శాస్త్రము నిర్దేశించిన ప్రకారము, కర్మణా = సత్కారములచేత; రాఘవౌ = ఇద్దఱు రాఘవులను; చ = మఱియు; మహాత్మానౌ = మహాత్ములను ఇధ్దఱను; తదా = అప్పుడు; వాక్యమ్ = మాటను; ఉవాచ హ = నుడివెను.
భావము:
ధర్మాత్ముడైన జనక మహీపతి విశ్వామిత్రుడిని, శ్రీరామలక్ష్మణులను శాస్త్రవిహిత సత్కారములతో సత్కరించి ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“భగవన్! స్వాగతం తేఽ స్తు
కిం కరోమి తవానఘ? ।
భవానాజ్ఞాపయతు మామ్
ఆజ్ఞాప్యో భవతాప్యహమ్" ॥
టీకా:
భగవన్ = పూజ్యుడ; స్వాగతం = స్వాగతము, కుశలముతోడి రాక; తే = నీకు; అస్తు = అగుగాక; కిం = ఏమి?; కరోమి = చేయగలవాడను; తవ = నీకు; అనఘ = పాపరహితుడా!; భవాన్ = నీవు; ఆజ్ఞాపయతు = ఆజ్ఞాపించండి; మామ్ = నన్ను; ఆజ్ఞాప్యః = ఆజ్ఞను ఆశించుచున్నాను; భవతా = నీచే; అపి = కూడ; అహమ్ = నేను.
భావము:
“భగవత్స్వరూపుడవైన ఓ విశ్వామిత్రా! మీకు స్వాగతము. అనఘా! నేను మీకేమి చేయగలవాడను ? అజ్ఞాపించుడు. నేను మీ ఆజ్ఞను ఆశించుచుంటిని."
- ఉపకరణాలు:
ఏవముక్తస్తు ధర్మాత్మా
జనకేన మహాత్మనా ।
ప్రత్యువాచ మునిర్వీరం
వాక్యం వాక్యవిశారదః ॥
టీకా:
ఏవమ్ = ఈవిధముగా; ఉక్తః = పలుకబడిన; సః = అతడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; జనకేన = జనకునిచే; మహాత్మనా = మహాత్ముడు; ప్రత్యువాచ = ప్రత్యుత్తరమును; మునిః = ముని; వీరమ్ = వీరుని గూర్చి(వీరుడైన జనకునితో) వాక్యం = వాక్యమును; వాక్యవిశారదః = వాక్కునందు నేర్పరి.
భావము:
ధర్మాత్ముడు మహాత్ముడు అయిన జనకుని పలుకులు విని, వాక్చతురుడైన విశ్వామిత్రమహాముని ఆ వీరుడు జనకునికి ప్రత్యుత్తరము ఇట్లిచ్చెను.
- ఉపకరణాలు:
“పుత్రౌ దశరథస్యేమౌ
క్షత్రియౌ లోకవిశ్రుతౌ ।
ద్రష్టుకామౌ ధనుఃశ్రేష్ఠం
యదేతత్త్వయి తిష్ఠతి ॥
టీకా:
పుత్రౌ = పుత్రులు; దశరథస్య = దశరథుని యొక్క; ఇమౌ = వీరిరువురు; క్షత్రియౌ = క్షత్రియులు, లోక = లోకములో; విశ్రుతౌ = ప్రసిద్ధులు; ద్రష్టుః = చూడవలెనని; కామౌ = ఇద్దరు కోరుకుంటున్నారు; ధనుః = ధనుస్సు; శ్రేష్ఠమ్ = ప్రశస్తమైనది; యత్ = ఏది; ఏతత్ = దానిని; త్వయి = నీవద్ధ; తిష్ఠతి = ఉన్నది ॥
భావము:
“ఓ జనకమహారాజ! క్షత్రియులు, దశరథమహారాజు పుత్రులు, లోకప్రసిద్దులు అయిన రామలక్ష్మణులు ఇరువురు నీవద్ద నున్న శ్రేష్ఠమైన ధనుస్సును చూచుటుకు ఇచ్చగించుచుంటిరి..
- ఉపకరణాలు:
ఏతద్దర్శయ భద్రం తే
కృతకామౌ నృపాత్మజౌ! ।
దర్శనాదస్య ధనుషో
యథేష్టం ప్రతియాస్యతః" ॥
టీకా:
ఏతత్ = ఆ; దర్శయ = చూపించుము; భద్రం = క్షేమము అగుగాక; తే = నీకు; కృతః = తీరిన; కామౌ = కోరికకలవారై; నృపాత్మజౌ = రాకుమారులు; దర్శనాత్ = దర్శనమువలన; అస్య = ఈ; ధనుషః = ధనుస్సు; యథేష్టం = యథేచ్చగా; ప్రతియాస్యతః = తిరిగి వెళ్లగలరు.
భావము:
ఆ చాపమును చూపించుము, నీకు భద్రమగుగాక. ఈ శ్రీరామ లక్ష్మణులు దానిని చూసి సంతృప్తిచెందినవారై యథేచ్చగా తిరుగు ప్రయాణ మయ్యెదరు."
- ఉపకరణాలు:
ఏవముక్తస్తు జనకః
ప్రత్యువాచ మహామునిమ్ ।
“శ్రూయతామస్య ధనుషో
యదర్థమిహ తిష్ఠతి ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = పలుకబడిన; తు; జనకః = జనకుడు; ప్రత్యువాచ = సమాధానమిచ్చెను; మహామునిమ్ = మహాముని గూర్చి; శ్రూయతామ్ = వినుబడుగాక; అస్య = ఈ; ధనుషః = ధనుస్సు; యదర్థమ్ = ఎందు నిమిత్తము; ఇహ = ఇక్కడ; తిష్ఠతి = ఉన్నదో ॥
భావము:
ఆ విశ్వామిత్రుడు చెప్పినవి వినిన జనకమహారాజు ఆ మహామునికి ఇట్లు సమాధానము చెప్పెను. "ఓ మహామునీ! ఈ ధనుస్సు ఇచ్చట ఉంచుటకు గల వివరములు తెలిపెదను, వినుము.
- ఉపకరణాలు:
దేవరాత ఇతి ఖ్యాతో
నిమేష్షష్ఠో మహీపతిః ।
న్యాసోఽ యం తస్య భగవన్!
హస్తే దత్తో మహాత్మనా ॥
టీకా:
దేవరాతః = దేవరాతుడు; ఇతి = అని; ఖ్యాతః = ఖ్యాతిగాంచిన వాడు; నిమేః = నిమి వంశమందు; షష్ఠః = ఆఱవ వాడు; మహీపతిః = రాజుచే; న్యాసః = ఉంచబడినది; అయం = ఇది; తస్య = అతని యొక్క; భగవన్ = పూజ్యుడా; హస్తే = హస్తమునందు; దత్తః = ఇవ్వబడినది; మహాత్మనా = మహాత్మునిచేత.
భావము:
నిమి తరువాత ఆఱవ (6) వాడు మహీపతి దేవరాతు డనువాడు ప్రఖ్యాతిగాంచెను. పరమశివుడు ఈ ధనుస్సును దేవరాతుని చేతిలో ఇల్లడగా ఉంచెను.
- ఉపకరణాలు:
దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్|
రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్||
- ఉపకరణాలు:
యస్మాద్భాగార్థినో భాగాన్
నాకల్పయత మే సురాః! ।
వరాంగాణి మహార్హాణి
ధనుషా శాతయామి వః ॥
టీకా:
యస్మాత్ = ఎందువలన; భాగాః = హవిర్భాగములందు; అర్థినః = కోరుచున్న; భాగాన్ = భాగములను; న = లేదు; కల్పయత = సమకూర్చుట; మే = నాకు; సురాః = దేవతలారా; వర = శ్రేష్ఠమైన; అంగాణి = అంగములలో; మహార్హాణి = చాల విలువైనవి; ధనుషా = చాపముతో; శాతయామి = ఖండించెదను; వః = మీ యొక్క.
భావము:
ఓ సురలారా! నాకు హావిర్భాగములను ఇవ్వవలసిన మీరు ఆ భాగములను సమకూర్చలేదు, అందుచేత అవయవములలో శ్రేష్ఠమైన మీ శిరస్సులను ధనుస్సుతో ఖండించెదను.
- ఉపకరణాలు:
తతో విమనసః సర్వే
దేవా వై మునిపుంగవ ।!
ప్రసాదయంతి దేవేశమ్
తేషాం ప్రీతోఽ భవద్భవః ॥
టీకా:
తతః = అటుపిమ్మట; విమనసః = వ్యాకులచిత్తులు; సర్వే = అందఱు; దేవాః+వై = దేవతలు; మునిపుఙ్గవ = ఓ ముని పుంగవ; ప్రసాదయంతి = అనుగ్రహింపచేసికొనిరి; దేవేశమ్ = దేవ+ఈశమ్, శివుని; తేషాం = వారియెడల; ప్రీతః = ప్రీతుడు; అభవత్ = అయ్యెను; భవః = భవుడు.
భావము:
ఓ మునిపుంగవ! విశ్వామిత్రా! అటుపిమ్మట అందఱు దేవతలు వ్యాకులచిత్తముతో ఆ దేవేశుడైన శివుని ప్రార్థింప, భవుడు వారియెడల ప్రీతుడాయెను. /
- ఉపకరణాలు:
ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్|
తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః|
న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వ కే విభో||
- ఉపకరణాలు:
అథ మే కృషతః క్షేత్రమ్
లాంగలాదుత్థితా మయా ।
క్షేత్రం శోధయతా లబ్ధా
నామ్నా సీతేతి విశ్రుతా ॥
టీకా:
అథ = తరువాత; మే = నేను; కృషతః = దున్నుచుండగా; క్షేత్రమ్ = స్థలమును; లాంగలాత్ = నాగేటిచాలునుంచి; ఉత్థితా = పుట్టెను, వావిళ్ళ నిఘంటువు. వెలువడెను; మయా = నా చేత; క్షేత్రం = భూమిని; శోధయతా = శుద్ధిచేయుచుండ; లబ్ధా = లభించినది; నామ్నా = పేరు గల; సీత = సీతదేవి {సీత- సీత అనగా నాగటి చాలు అని అర్థము, అందు కలిగినది కనుక సీతాదేవి, జనకుని పుత్రిక}; ఇతి = అను; విశ్రుతా = ప్రసిద్దురాలు.
భావము:
*గమనిక- క్షేత్రమునకు పొలము, స్థలము, పుణ్యస్థలము, స్థానము, గృహము, బృందము అను అర్థములు కలవు అని ఆంధ్ర వాచస్పతము, ఆంధ్ర శబ్ధరత్నాకరము.
- ఉపకరణాలు:
భూతలాదుత్థితా సా తు
వ్యవర్దత మమాత్మజా ।
వీర్యశుల్కేతి మే కన్యా
స్థాపితేయ మయోనిజా ॥
టీకా:
భూతలాత్ = భూతలమునుండి; ఉత్థితా = పుట్టిన; సా = ఆమె; తు; వ్యవర్ధత = పెరిగినది; మమ = నా యొక్క; ఆత్మజా = కుమార్తెగా వీర్యశుల్క = వీరత్వమే శుల్కముగా కలది; ఇతి = అని; మే = నా చేత; కన్యా = కన్య; స్థాపితా = స్థాపింపబడినది; ఇయమ్ = ఈ; అయోనిజా = అయోనిజ (మాతృగర్భము నుండి జనించనిది).
భావము:
భూమినుండి పుట్టిన ఈమె నాకూతురుగా పెరిగినది. అయోనిజ అయిన ఈమెను స్వీకరించుటకు, వీరుని వీరత్వమే శుల్కముగా నేను నిర్ణయించితిని.
- ఉపకరణాలు:
భూతలాదుత్థితాం తాం తు
వర్దమానాం మమాత్మజామ్ ।
వరయామా సురాగమ్య
రాజానో మునిపుంగవ! ॥
టీకా:
భూతలాత్ = భూతలమునుండి; ఉత్థితాం = పుట్టిన, వావిళ నిఘంటువు; తాం = ఆమెను; తు; వర్ధమానాం = పెరుగుతున్న; మమ = నా; ఆత్మజామ్ = కుమార్తెను; వరయామాసుః = వరించుటకు; ఆగమ్య = వచ్చిరి; రాజానః = రాజులు; మునిపుఙ్గవ = మునిపుంగవ!
భావము:
ఓ మునిపుంగవ! భూతలమునుండి పుట్టిన నా కుమార్తెగా పెరుగుతున్న సీతను వరించుటకు పెక్కుమంది రాజులు విచ్చేసిరి.
- ఉపకరణాలు:
తేషాం వరయతాం కన్యామ్
సర్వేషాం పృథివీక్షితామ్ ।
వీర్యశుల్కేతి భగవన్!
న దదామి సుతామహమ్ ॥
టీకా:
తేషాం = వారియుక్క; వరయతాం = వరించుటకు; కన్యామ్ = కన్యను; సర్వేషాం = అందఱు; పృథివీక్షితామ్ = రాజులు; వీర్యశుల్కః = వీర్యశుల్క; ఇతి = అని; భగవన్ = ఓ భగవత్ స్వరుపుడా!; న = లేదు; దదామి = ఇచ్చుట; సుతామ్ = కూతురుని; అహమ్ = నేను.
భావము:
భగవత్ స్వరూపుడవైన ఓ విశ్వామిత్ర! ఆ మహీపతులందరు విచ్చేసి కన్యను కోరగ, ఆమె వీర్యశుల్క యని (వారు తగిన వారు కానందున) వారికి నాకుమార్తెను ఇవ్వలేదు.
- ఉపకరణాలు:
తతః సర్వే నృపతయః
సమేత్య మునిపుంగవ! ।
మిథిలా మభ్యుపాగమ్య
వీర్యజిజ్ఞాసవ స్తదా ॥
టీకా:
తతః = పిమ్మట; సర్వే = అందఱు; నృపతయః = రాజులు; సమేత్య = కలసి; మునిపుఙ్గవ = ఓ మునిపుంగవ!; మిథిలామ్ = మిథిలానగరము గూర్చి; అభ్యుపాగమ్య = వచ్చిరి; వీర్యజిజ్ఞాసవః = తవ వీర్యస్య జిజ్ఞాసవః, పరాక్రమము పరీక్షించుకొనుటకు ఆసక్తులు; తదా = అప్పుడు.
భావము:
ఓ మునిపుంగవ! విశ్వామిత్రా! పిమ్మట ఆ రాజులందరు కలిసి వారి బలపరాక్రమములు పరీక్షించుకొనుటకు ఆసక్తులై మిథిలానగరమునకు వచ్చిరి.
- ఉపకరణాలు:
తేషాం జిజ్ఞాసమానానామ్
వీర్యం ధనురుపాహృతమ్ ।
న శేకుర్గ్రహణే తస్య
ధనుషస్తోలనేఽ పి వా ॥
టీకా:
తేషాం = వారికి; జిజ్ఞాస = తెలుసుకొనుటకు; సమానానామ్ = ఆసక్తులై ఉన్న; వీర్యం = వీరత్వమును; ధనుః = ధనుస్సు; ఉపాహృతమ్ = తీసుకురాబడినది; న = కారు; శేకుః = సమర్థులు; గ్రహణే = పట్టుకొనుట యందు, గ్రహించుట యందు; తస్య = ఆ; ధనుషః = ధనుస్సు యొక్క; తోలనే = కదల్చుట యందు; అపి వా = కాని.
భావము:
తమ వీరత్వమును పరీక్షించుకొనుటకై జిజ్ఞాసతో ఉన్న ఆ రాజుల కొఱకు ధనుస్సు కొనిరాబడినది. వారిలో ఎవ్వరును ఆ విల్లును ఎత్తి పట్టుకొనటయే కాదు, కనీసం కదుల్చుటకు ఐనా సమర్థులు కాలేకపోయిరి.
- ఉపకరణాలు:
తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే |
ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన!||
- ఉపకరణాలు:
తతః పరమకోపేన
రాజానో నృపపుంగవ ।
న్యరుంధన్ మిథిలాం సర్వే
వీర్యసందేహమాగతాః ॥
టీకా:
తతః = పిమ్మట; పరమ = చాలా; కోపేన = కోపముతో; రాజానః = రాజులు; మునిపుఙ్గవ = ఓ మునిపుంగవ!; న్యరుంధన్ = ముట్టడించిరి; మిథిలాం = మిథిలానగరమును; సర్వే = అందఱు; వీర్యః = తమ బలము గుఱించి; సందేహమ్ = సంశయము; ఆగతాః = కలిగినవారై.
భావము:
ఓ మునిపుంగవ! అటుపిమ్మట ఆ రాజులు అందఱు తమ పరాక్రమముపై సంశయము కలుగగా మిక్కిలి కోపముతో మిథిలానగరమును ముట్టడించిరి.
- ఉపకరణాలు:
ఆత్మానమవధూతం తే
విజ్ఞాయ నృపపుంగవాః ।
రోషేణ మహతాఽఽ విష్టాః
పీడయన్ మిథిలాం పురీమ్ ॥
టీకా:
ఆత్మానమ్ = తమను; అవధూతం = తిరస్కరింపబడినవారిగ; తే = వారు; విజ్ఞాయ = తెలుసుకుని; నృపపుఙ్గవాః = రాజులు; రోషేణ = కోపముతో; మహతా = మిక్కిలి; ఆవిష్టాః = కూడినవారై; పీడయన్ = బాధించిరి; మిథిలాం = మిథిల అను; పురీమ్ = పురమును.
భావము:
ఆ రాజులు తమను అవమానించినట్లు భావించి మిక్కిలి కోపముతో మిథిలాపురమును బాధించిరి.
- ఉపకరణాలు:
తమర్చయిత్వా ధర్మాత్మా
శాస్త్రదృష్టేన కర్మణా ।
రాఘవౌ చ మహాత్మానౌ
తదా వాక్యమువాచ హ ॥
టీకా:
తమ్ = వానిని (విశ్వామిత్రుని); అర్చయిత్వా = పూజించి; ధర్మాత్మా = ధర్మాత్ముడు (జనక మహారాజు); శాస్త్రదృష్టేన = శాస్త్రము నిర్దేశించిన ప్రకారము, కర్మణా = సత్కారములచేత; రాఘవౌ = ఇద్దఱు రాఘవులను; చ = మఱియు; మహాత్మానౌ = మహాత్ములను ఇధ్దఱను; తదా = అప్పుడు; వాక్యమ్ = మాటను; ఉవాచ హ = నుడివెను.
భావము:
ధర్మాత్ముడైన జనక మహీపతి విశ్వామిత్రుడిని, శ్రీరామలక్ష్మణులను శాస్త్రవిహిత సత్కారములతో సత్కరించి ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
తతో దేవగణాన్ సర్వాన్ తపసా౭హం ప్రసాదయమ్|
దదుశ్చ పరమప్రీతా శ్చతురఙ్గబలం సురాః||
- ఉపకరణాలు:
తతో భగ్నా నృపతయో
హన్యమానా దిశో యయుః ।
అవీర్యా వీర్యసందిగ్ధాః
సామాత్యాః పాపకర్మణః ॥
టీకా:
తతః = అనంతరము; భగ్నాః = ఓడిపోయినవారు; నృపతయః = రాజులు; హన్యమానాః = దెబ్బలు తిన్నవారై; దిశః = దిక్కులకు; యయుః = పాఱిపోయిరి; అవీర్యాః = బలహీనులు; వీర్యః = వారి బలములపై; సందిగ్ధాః = నమ్మకములేనివారై; స = కలిసినవారై; అమాత్యాః = మంత్రులతో; పాపకర్మణః = పాప కర్మలను ఆచరించినవారు.
భావము:
అల్పపరాక్రమవంతులు, తమ బలముపై నమ్మకము లేనివారు, పాపాత్ములు అయిన ఆ రాజులందరు దేవతలు నాకు అనుగ్రహించిన చతురంగసైన్యముచే దెబ్బలు తిని మంత్రులతో కూడి నలుదిక్కులకు పాఱిపోయిరి.
- ఉపకరణాలు:
తదేతన్మునిశార్దూల!
ధనుః పరమభాస్వరమ్ ।
రామలక్ష్మణయో శ్చాపి
దర్శయిష్యామి సువ్రత ॥
టీకా:
తత్ = ఆ; ఏతత్ = ఈ; మునిశార్దూల = మునిశ్రేష్ఠా! ధనుః = ధనుస్సు; పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న । రామలక్ష్మణయోః = శ్రీరామ లక్ష్మణులకు; చ = మఱియు; అపి = కూడ; దర్శయిష్యామి = చూపగలను; సువ్రత = మంచివ్రతము గల.
భావము:
మంచి వ్రతములుచేసిన ఓ విశ్వామునిశ్రేష్ఠా! మిక్కిలి ప్రకాశించుచున్న ఆ శివధనువును శ్రీరామ లక్ష్మణులకు కూడ చూపించెదను.
- ఉపకరణాలు:
యద్యస్య ధనుషో రామః
కుర్యాదారోపణం మునే ।
సుతామయోనిజాం సీతామ్
దద్యాం దాశరథేరహమ్!" ॥
టీకా:
యత్ = ఆ; అస్య = యొక్క; ధనుషః = ధనుస్సు; రామః = శ్రీరామచంద్రుడు; కుర్యాత్ = చేయుటవలన; ఆరోపణం = ఎక్కుపెట్టుటను; మునే = ఓ ముని!; సుతామ్ = కుమార్తెను; అయోనిజాం = అయోనిజను; సీతామ్ = సీతను; దద్యాం = ఇచ్చెదను; దాశరథేః = దాశరథికి; అహమ్ = నేను.
భావము:
ఓ మునీశ్వర! శ్రీరాముడు ఈ శివధనువును ఎక్కుపెట్టినట్లయితే అయోనిజ అయిన నా పుత్రిక సీతను ఈతనికి ఇచ్చెదను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
షట్షష్టితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్షష్టితమః [66] = అరవైఆరవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవై ఆరవ [66] సర్గ సంపూర్ణం.