బాలకాండమ్ : ॥చతుషష్టితమః సర్గః॥ [64 - విశ్వామిత్ర తపోభంగానికి రంభయత్నము]
- ఉపకరణాలు:
“సురకార్యమిదం రమ్భే
కర్తవ్యం సుమహత్త్వయా ।
లోభనం కౌశికస్యేహ
కామమోహ సమన్వితమ్” ॥
టీకా:
సురః = దేవతలయొక్క; కార్యమ్ = పని; ఇదం = ఈ; రమ్భే = ఓ రంభా; కర్తవ్యం = చేయదగినది; సుమహత్ = చాలా గొప్పది; త్వయా = నీచేత; లోభనం = లోభపెట్టుట; కౌశికస్య = కుశిక వంశపు విశ్వామిత్రుని యొక్క; ఇహ = ఇప్పుడు; కామః = కామము వలన కలుగునట్టి; మోహః = మోహముతో; సమన్వితమ్ = కూడినదిగా.
భావము:
“ఓ రంభా! నీవు ఇప్పుడు చేయవలసినది ఈ చాలా గొప్ప దేవతల కార్యము. ఆ విశ్వామిత్రుని లోభపెట్టి కామము పుట్టించి అతనిలో మోహము కలిగించవలెను.”
- ఉపకరణాలు:
తథోక్తా సాప్సరా రామ!
సహస్రాక్షేణ ధీమతా ।
వ్రీడితా ప్రాంజలిర్భూత్వా
ప్రత్యువాచ సురేశ్వరమ్ ॥
టీకా:
తథా = ఆ విధముగా; ఉక్తా = పలకబడిన; సా = ఆ; అప్సరాః = అప్సరస; రామ = రామా; సహస్రాక్షేణ = వేయికన్నులు గల ఇంద్రునిచేత; ధీమతా = బుద్ధిశాలియైన; వ్రీళితా = సిగ్గు పడుచున్నదై; ప్రాంజలిః = దోసిలి యొగ్గి; వాక్యమ్ = పలుకును; ప్రత్యువాచ = బదులు పలికెను; సురేశ్వరమ్ = ఇంద్రుని గూర్చి.
భావము:
ఓ రామా ఆ బుద్ధిశాలియైన దేవేంద్రుని మాటలకు సిగ్గుపడుచు చేతులు జోడించి అతనితో రంభ ఈ విధముగా బదులు పలికెను.
- ఉపకరణాలు:
“అయం సురపతే ఘోరో
విశ్వామిత్రో మహామునిః ।
క్రోధముత్సృజతే ఘోరమ్
మయి దేవ న సంశయః ॥
టీకా:
అయం = ఈ; సురపతే = దేవతలకు అధిపతి అయిన ఓ ఇంద్రా; ఘోరః = అతి భయంకరుడు; విశ్వామిత్ర్రః = విశ్వామిత్రుడు; మహామునిః = గొప్ప తపస్వి; క్రోధమ్ = కోపమును; ఉత్సృజతే = వెళ్ళగ్రక్కును; ఘోరమ్ = భయంకరమైన; మయి = నా యందు; దేవ = ఓ ప్రభూ; న = లేదు; సంశయః = సందేహము.
భావము:
“ఓ దేవేంద్రా ! ఆ విశ్వామిత్ర మహాముని చాలా భయంకరుడు. ‘ అతడు నాపై తీవ్రకోపము వెళ్ళగ్రక్కును. ఇందులో సందేహము లేదు ప్రభూ !’ అని రంభ దేవేంద్రునితో పలికెను.
- ఉపకరణాలు:
తతో హి మే భయం దేవ
ప్రసాదం కర్తుమర్హసి "।
ఏవముక్తస్తయా రామ!
రమ్భయా భీతయా తదా ॥
టీకా:
తతః = ఆ కారణము వలన; మే = నాకు; భయమ్ = భయము; ప్రసాదమ్ = అనుగ్రహము; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగియున్నావు. ఏవమ్ = ఈ విధముగా; ఉక్తః = పలక బడిన; తయా = ఆ; రామ = ఓ రామా; రమ్భయా = రంభ కొరకు; భీతయా = భయపడిన; తదా = అప్పుడు.
భావము:
‘ ఆ కారణముచే నాకు భయము కలుగుచున్నది. నన్ను అనుగ్రహింపుము’ అని బెదురుతూ పలికిన రంభ మాటలు విని ఆమెతో దేవేంద్రుడు.
- ఉపకరణాలు:
తామువాచ సహస్రాక్షో
వేపమానాం కృతాంజలిమ్ ।
మా భైషి రమ్భే భద్రం తే
కురుష్వ మమ శాసనమ్ ॥
టీకా:
తామ్ = ఆమెను గురించి; ఉవాచ = పలికెను; సహస్రాక్షః = దేవేంద్రుడు; వేపమానామ్ = వణకుచున్నదైన; కృతాఞ్జలిమ్ = కట్టబడిన దోసిలి కలిగిన; మా భైషీః = భయపడకుము; రమ్భే = ఓ రంభా; భద్రమ్ = క్షేమము అగు గాక; తే = నీకు; కురుష్వ = చేయుము; మమ = నా యొక్క; శాసనమ్ = ఆజ్ఞను.
భావము:
దోసిలి ఒగ్గి వణకుచు భయపడుచున్న రంభతో దేవేంద్రుడు "ఓ రంభా! భయపడకుము. నీకు క్షేమము అగుగాక. మా ఆజ్ఞను పాటింపుము.” అని పలికెను.
- ఉపకరణాలు:
కోకిలో హృదయగ్రాహీ
మాధవే రుచిరద్రుమే ।
అహం కందర్పసహితః
స్థాస్యామి తవ పార్శ్వతః ॥
టీకా:
కోకిలః = కోకిలగా; హృదయగ్రాహీ = మనసును ఆకర్షించే; మాధవే = వసంత ఋతువునందు; రుచిర = అందమన; ద్రుమే = తరువులు కల; అహమ్ = నేను; కందర్ప = మన్మథునితో; సహితః = కలిసిఉన్నవాడనై; స్థాస్యామి = ఉండెదను; తవ = నీ యొక్క; పార్శ్వతః = ప్రక్కన.
భావము:
అందమైన చెట్లు గల మనసుని మురిపించే వసంత ఋతువునందు నేను కోకిల రూపములో మన్మథ సమేతుడనై నీ ప్రక్కనే ఉండెదను.
- ఉపకరణాలు:
త్వం హి రూపం బహు గుణమ్
కృత్వా పరమభాస్వరమ్ ।
తమృషిం కౌశికం రమ్భే
భేదయస్వ తపస్వినమ్" ॥
టీకా:
త్వమ్ = నీవు; రూపమ్ = సౌందర్యము; బహు = అనేక; గుణమ్ = గుణముల; కృత్వా = చేసికొని; పరమ = మిక్కిలి; భాస్వరమ్ = ప్రకాశించున్న; తమ్ = ఆ; ఋషిమ్ = ఋషిని; కౌశికమ్ = కౌశికుని; రమ్భే = ఓ రంభా; భేదయస్వ = విడదీయుము; తపస్వినమ్ = తపశ్శాలిని
భావము:
రంభా! మిక్కిలి ప్రకాశించెడి నీ సౌందర్యమును అనేక రెట్లు ప్రకాశించునట్లు చేసుకొని విశ్వామిత్రుని తపస్సు విఘ్నమగు నట్లు చేయుము.”
- ఉపకరణాలు:
సా శ్రుత్వా వచనం తస్య
కృత్వా రూపమనుత్తమమ్ ।
లోభయామాస లలితా
విశ్వామిత్రం శుచిస్మితా ॥
టీకా:
సా = ఆమె; శ్రుత్వా = విని; వచనం = మాటను; తస్య = అతని యొక్క; కృత్వా = చేసి; రూపమ్ = ఆకారము; అనుత్తమమ్ = అత్యుత్తమైనదిగా; లోభయామాస = లోభపెట్టెను; లలితా = మనోజ్ఞమైన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; శుచిస్మితా = స్వచ్ఛమైన చిరునవ్వుగలదై.
భావము:
దేవేంద్రుని మాటలు విన్న రంభ తన ఆకృతిని అత్యుత్తమముగు తిద్దుకొని నిర్మలమూ మనోహరమూ ఐన చిరునవ్వులు నవ్వుచు విశ్వామిత్రుని లోభింపజేసెను.
- ఉపకరణాలు:
కోకిలస్య తు శుశ్రావ
వల్గు వ్యాహరతః స్వనమ్ ।
సంప్రహృష్టేన మనసా
తత ఏనాముదైక్షత ॥
టీకా:
కోకిలస్య = కోకిల యొక్క; తు; శుశ్రావ = వినెను; వల్గు = మధురముగా; వ్యాహరతః = కూయుచున్న; స్వనమ్ = ధ్వనిని; సంప్రహృష్టేన = సంతసించినటువంటి; మనసా = మనస్సుతో; తతః = పిమ్మట; ఏనామ్ = ఆమెను; ఉదైక్షత = ఉత్ + ఈక్షత, చూచెను.
భావము:
మధురముగా కూయుచున్న కోకిల ధ్వనికి సంతసించిన మనస్సుతో విశ్వామిత్రుడు రంభను చూచెను.
- ఉపకరణాలు:
అథ తస్య చ శబ్దేన
గీతేనా ప్రతిమేన చ ।
దర్శనేన చ రంభాయా
మునిః సందేహమాగతః ॥
టీకా:
అథ = పిమ్మట; తస్య = దాని(కోకిల) యొక్క; చ = మరియు; శబ్దేన = కూతచేతను; గీతేన = గానము చేతను; అప్రతిమేన = సాటిలేని; చ = మరియు; దర్శనేన = దర్శనము చేతను; చ = మరియు; రంభాయా = రంభ యొక్క; మునిః = ముని; సందేహమ్ = సందేహము; ఆగతః = వచ్చినది.
భావము:
కోకిలకూత సాటిలేని మధురగానము వినబడిన పిమ్మట రంభ కనబడుటచే విశ్వామిత్ర మహామునికి సందేహము కలిగెను..
- ఉపకరణాలు:
సహస్రాక్షస్య తత్కర్మ
విజ్ఞాయ మునిపుంగవః ।
రంభాం క్రోధసమావిష్టః
శశాప కుశికాత్మజః ॥
టీకా:
సహస్రాక్షస్య = వేయికన్నులు కల ఇంద్రునియొక్క; తత్ = దానిని; కర్మ = చేష్ట; విజ్ఞాయ = తెలుసుకొని; మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు; రంభాం = రంభను; క్రోధ = కోపము; సమావిష్టః = పూనినవాడై; శశాప = శపించెను; కుశిక = కౌశికుని; ఆత్మజః = పుత్రుడు.
భావము:
మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు ఇది అంతయు ఇంద్రుని చేష్ట అని తెలుసుకుని కోపము పూనినవాడై రంభను శపించెను.
- ఉపకరణాలు:
“యన్మాం లోభయసే రమ్భే
కామక్రోధ జయైషిణమ్ ।
దశవర్ష సహస్రాణి
శైలీ స్థాస్యసి దుర్భగే ॥
టీకా:
యత్ = ఎందుకొఱకు; మామ్ = నన్ను; లోభయసే = లోభ పెట్టుచున్నావో; రంభే = రంభా; కామః = కామము; క్రోధః = క్రోధములు; జయై = జయింపవలెనను; ఈషిణమ్ = ఇచ్చతో; దశ = పది; వర్ష = సంవత్సరములు; సహస్రాణి = వేలకొలది; శైలీ = శిలయై; స్థాస్యసి = ఉండగలవు; దుర్భగే = దౌర్భాగ్యవంతురాలైన.
భావము:
“దౌర్భాగ్యవంతురాలవైన ఓ రంభా!కామ క్రోధములు జయింపగోరి తపము చేయుచున్న నన్నులోభపెట్టుటకు ప్రయత్నించితివి గాన నీవు పదివేల సంవత్సరములు శిలవై పడి ఉండెదవు గాక!’ అని శపించెను.
- ఉపకరణాలు:
బ్రాహ్మణః సుమహాతేజాః
తపోబల సమన్వితః ।
ఉద్ధరిష్యతి రమ్భే త్వాం
మత్క్రోధ కలుషీకృతామ్" ॥
టీకా:
బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; సుమహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడు; తపోబల = తపశ్శక్తి; సమన్వితః = కలవాడు; ఉద్ధరిష్యతి = ఉద్ధరించగలడు; రమ్భే = ఓరంభా; త్వామ్ = నిన్ను; మత్క్రోధ = నాయొక్క కోపముచే; కలుషీకృతామ్ = కలుషితమైనదానవైన.
భావము:
రంభా! నా కోపమునకు గురైన నిన్నుగొప్ప తేజో సంపన్నుడు, తపోబల సమన్వితుడు అయిన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడుఉద్ధరించును.”
- ఉపకరణాలు:
ఏవముక్త్వా మహాతేజా
విశ్వామిత్రో మహామునిః ।
అశక్నువన్ ధారయితుమ్
క్రోధం సంతాపమాగతః ॥
టీకా:
ఏవమ్ = ఈవిధముగా; ఉక్త్వా = పలికి; మహాతేజః = గొప్ప తేజస్సు కల; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = గొప్పముని; అశక్నువన్ = ఆశక్తుడై; ధారయితుమ్ = నిగ్రహించుటకు; క్రోధమ్ = కోపమును; సంతాపమ్ = విచారము; ఆగతః = పొందెను.
భావము:
గొప్ప తేజశ్శాలియైన విశ్వామిత్ర మహాముని కోపమును నిగ్రహించుకొనలేక రంభను అట్లు శపించి; పిదప చింతాక్రాంతు డయ్యెను.
- ఉపకరణాలు:
తస్య శాపేన మహతా
రంభా శైలీ తదాఽ భవత్ ।
వచః శ్రుత్వా చ కందర్పో
మహర్షేః స చ నిర్గతః ॥
టీకా:
తస్య = అతని యొక్క; శాపేన = శాపము వలన; మహతా = గొప్పదైన; రంభా = రంభ; శైలీ = ఱాయిగా; తదా = అప్పుడు; అభవత్ = ఆయెను; వచః = మాటను; శ్రుత్వా = విని; చ = మరియు; కందర్పః = మన్మథుడును; మహర్షేః = మహర్షి యొక్క; సః = అతడును; చ = కూడా; నిర్గతః = వెడలిపోయిరి.
భావము:
ఆ మహర్షి విశ్వామిత్రుని శాపము వలన రంభ శిలగా మారెను. ఆతని మాటలు విని ఇంద్రుడు మన్మథుడు అచటి నుండి వెడలిపోయిరి.
- ఉపకరణాలు:
కోపేన సుమహాతేజాః
తపోఽ పహరణే కృతే ।
ఇంద్రియై రజితై రామ!
న లేభే శాంతిమాత్మనః ॥
టీకా:
కోపేన = కోపముచేత; సుమహాతేజః = చాలా గొప్ప తేజోవంతమైన; తపః = తపస్సు; అపహరణే = దొంగిలించుట; కృతే = చేయబడుచుండ; ఇంద్రియైః = ఇంద్రియములచేత; అజితైః = జయింపబడని; రామ = ఓ రామా; న లేభే = పొందలేదు; శాంతిమ్ = శాంతిని; ఆత్మనః = మనసు యొక్క.
భావము:
ఓ రామా! ఇట్లు కోపము వలన తన తపస్సు క్షీణించగా మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుడు తన ఇంద్రియములను జయింపలేనందున మనసులో శాంతిని పొందలేకపోయెను.
- ఉపకరణాలు:
బభూవాస్య మనశ్చింతా
తపోపహరణే కృతే ।
“నైవ క్రోధం గమిష్యామి
న చ వక్ష్యే కథంచన ॥
టీకా:
బభూవ = ఆయెను; అస్య = ఈతనికి; మనః = మనస్సు నందు; చింతా = ఆలోచన; తపః = తపస్సు; అపహరణే = చౌర్యము; కృతే = చేయబడుచుండ; క్రోధమ్ = కోపమును; న ఏవ గమిష్యామి = పొందను; న = లేదు; చ; వక్ష్యే = మాటలాడను కూడా; కథఞ్చన = ఎట్లైన.
భావము:
క్రోధము కారణముగా తన తపస్సు హరింపబడుట చేత చింతిత మనస్కుడైన విశ్వామిత్రుడు "నేను కోపము పొందను. ఏమైనను మాట కూడా పలుకను.
- ఉపకరణాలు:
అథవా నోచ్ఛ్వసిష్యామి
సంవత్సరశతాన్యపి ।
అహం విశోషయిష్యామి
హ్యాత్మానం విజితేంద్రియః ॥
టీకా:
అథవా = లేనిచో; న = చేయను; ఉచ్ఛ్వసిష్యామి = విడుచుట; సంవత్సరః = సంవత్సరములు; శతాని = వందకైనను; అపి = కూడ; అహమ్ = నేను; విశోషయిష్యామి = ఎండింప చేసెదను; ఆత్మానం = దేహమును; విజితేంద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడనై.
భావము:
లేనిచో నేను వందల సంవత్సరములు ఊపిరి విడువక ఉండి, జితేంద్రియుడనై నా శరీరమును శుష్కింపచేసెదను.
- ఉపకరణాలు:
తావద్యావద్ధి మే ప్రాప్తమ్
బ్రాహ్మణ్యం తపసాఽఽ ర్జితమ్ ।
అనుచ్ఛ్వసన్నభుంజానః
తిష్ఠేయం శాశ్వతీః సమాః ।
అనుచ్ఛ్వసన్నభుంజానః
క్షయం యాస్యంతి మూర్తయః” ॥
టీకా:
తావత్ = అంతవరకు; యావత్ = ఎప్పటికి; మే = నాకు; ప్రాప్తమ్ = ప్రాప్తమగునో; బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వము; తపసా = తపస్సు చేత; ఆర్జితమ్ = సంపాదించబడిన; అనుచ్ఛ్వసన్ = ఊపిరి విడిచిపెట్టనివాడనై; అభుంజానః = భుజించనివాడనై; తిష్ఠేయమ్ = ఉండెదను; శాశ్వతీః సమాః = శాశ్వతమైన సంవత్సరములు; న = కాదు; హి = ఏమాత్రము; మే = నాకు; తప్యమానస్య = తపముచేయుచున్న; క్షయం = క్షయమును; యాస్యంతి = పొందుట; మూర్తయః = అవయవములకు.
భావము:
తపస్సు వలన నాకు బ్రాహ్మణ్యము లభించువరకు ఎన్ని సంవత్సరములైనను ఊపిరి విడువక, ఆహారము భుజించక ఉండెదను. తపము చేయుచున్నంత వరకు నా అవయవములు క్షీణింపవు.”
- ఉపకరణాలు:
ఏవం వర్షసహస్రస్య
దీక్షాం స మునిపుంగవః ।
చకారాప్రతిమాం లోకే
ప్రతిజ్ఞాం రఘునందన! ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; వర్ష = సంవత్సరముల; సహస్రస్య = వేయింటిని; దీక్షామ్ = దీక్ష గురించి; సః = ఆ; మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు; చకార = చేసెను; అప్రతిమామ్ = అసమాన మైన; లోకే = లోకమునందు; ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను; రఘునందన = ఓ రామా.
భావము:
ఓ రామా! ఈవిధముగా ఆ విశ్వామిత్ర మహాముని లోకములో వేయి సంవత్సరములు తపోదీక్షలో ఉండెదనని అసమానమైన ప్రతిజ్ఞ చేసెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చతుష్షష్టితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుష్షష్టితమః [64] = అరవై నాలుగవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత మైన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవైనాలుగవ [64] సర్గ సంపూర్ణము