వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥త్రిషష్టితమః సర్గః॥ [63 - విశ్వామిత్రుని తపోభంగం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్ణే వర్షసహస్రే తు
వ్రతస్నాతం మహామునిమ్ ।
అభ్యాగచ్ఛన్ సురాః సర్వే
తపఃఫలచికీర్షవః ॥

టీకా:

పూర్ణే = పూర్తి ఐన తరువాత; వర్షసహస్రే = వేయి సంవత్సరములు; తు; వ్రతస్నాతం = వ్రతాంతమున చేయు స్నానము చేసిన; మహామునిమ్ = గొప్పమునిని; అభ్యాగచ్ఛన్ = సమీపించిరి; సురాః = దేవతలు; సర్వే = అందరు; తపః = తపముయొక్క; ఫల = ఫలమును; చికీర్షవః = ఇచ్చు తలపు కలవారై.

భావము:

వేయి సంవత్సరములు గడచిన పిమ్మట, ఆ మహాముని వ్రతాంతమున చేయు స్నానము చేసి యుండగా, దేవతలందరును అతనికి తపఃఫలమును ప్రసాదించుటకు వచ్చిరి.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అబ్రవీత్ సుమహాతేజా
బ్రహ్మా సురుచిరం వచః ।
“ఋషిస్త్వమసి భద్రం తే
స్వార్జితైః కర్మభిః శుభైః ॥

టీకా:

అబ్రవీత్ = పలికెను; సు = మిక్కిలి; మహాతేజాః = గొప్ప తేజోవంతుడైన; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; సురుచిరం = చాలా మధురమైన; వచః = మాట; ఋషిః = ఋషి; త్వమ్ = నీవు; అసి = ఐనావు; భద్రం = శుభము; తే = నీకు; స్వార్జితైః = స్వయం కృషితో సంపాదించబడిన; కర్మభిః = కర్మలచే; శుభైః = పుణ్యముతో కూడిన.

భావము:

గొప్ప తేజోవంతుడైన బ్రహ్మ, విశ్వామిత్రునితో ""నీవు స్వయముగా చేసిన పుణ్య కర్మలవలన ఋషివైతివి. నీకు శుభమగుగాక"", అని మధురమైన వాక్యమును పలికెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తమేవముక్త్వా దేవేశః
త్రిదివం పునరభ్యగాత్ ।
విశ్వామిత్రో మహాతేజా
భూయస్తేపే మహత్తపః ॥

టీకా:

తమ్ = అతని గురించి; ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; దేవేశః = దేవతలకు ప్రభువైన బ్రహ్మ; త్రిదివమ్ = స్వర్గమునకు; పునః = తిరిగి; అభ్యగాత్ = వెళ్ళెను; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు మహాతేజః = గొప్ప తేజోవంతుడైన; భూయః = మరల; తే పే = చేసెను; మహత్ = గొప్ప; తపః = తపస్సు.

భావము:

బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికి స్వర్గధామమునకు వెడలిపోయెను. గొప్ప తేజోవంతుడైన విశ్వామిత్రుడు తపస్సు మరల ప్రారంభించెను.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః కాలేన మహతా
మేనకా పరమాప్సరాః ।
పుష్కరేషు నరశ్రేష్ఠ!
స్నాతుం సముపచక్రమే ॥

టీకా:

తతః = తరువాత; కాలేన = కాలముతో; మహతా = గొప్ప; మేనకా = మేనక; పరమ = గొప్పదైన; అప్సరాః = అప్సరసలలో; పుష్కరేషు = పుష్కరము నందు; నరశ్రేష్ఠ = మానవ శ్రేష్ఠా; స్నాతుం = స్నానమును; సముపచక్రమే = మొదలిడెను.

భావము:

పురుషశ్రేష్ఠా! రామా! తరువాత చాలా కాలమునకు, మేనక యను గొప్ప అప్సరస పుష్కరతీర్థమునందు స్నానమాడసాగెను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాం దదర్శ మహాతేజా
మేనకాం కుశికాత్మజః ।
రూపేణాప్రతిమాం తత్ర
విద్యుతం జలదే యథా ॥

టీకా:

తాం = ఆమెను; దదర్శ = చూసెను; మహాతేజా = గొప్ప తేజోవంతుడైన; మేనకాం = మేనకను; కుశితాత్మజః = విశ్వామిత్రుడు; రూపేణ = రూపము చేత; అప్రతిమాం = అసమానమైన; తత్ర = అక్కడ; విద్యుతం = మెరుపు; జలదే = మేఘము నందు; యథా = వలె.

భావము:

మహాతేజశ్శాలి ఐన విశ్వామిత్రుడు, మేఘము నందలి మెరుపుతీగ వలె సాటిలేని సౌందర్యవతి ఐన ఆ మేనకను ఆ పుష్కరతీర్థములో గాంచెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దృష్ట్వా కందర్పవశగో
మునిస్తా మిదమబ్రవీత్ ।
“అప్సరః! స్వాగతం తేఽ స్తు
వస చేహ మమాశ్రమే ॥

టీకా:

దృష్ట్వా = చూసి; కందర్ప = మన్మథునకు; వశగః = వశమైనవాడై; మునిః = ముని; తామ్ = ఆమెతో; ఇదమ్ = ఈ; అబ్రవీత్ = పలికెను; అప్సరః = అప్సరా; స్వాగతం = స్వాగతము; తే = నీకు; అస్తు = అగుగాక; వస = నివసింపుము; చ; ఇహ = ఈ; మమ = నా యొక్క; ఆశ్రమే = ఆశ్రమమునందు.

భావము:

మేనకను చూసిన విశ్వామిత్రుడు మన్మథవశుడై, ఆమెతో ""ఓ అప్సరసా! నీకు స్వాగతము. నీవు ఈ నా ఆశ్రమములో నివసింపుము"" అనెను.

1-64-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

1.63.22.
తమువాచ తతో బ్రహ్మా
"న తావత్త్వం జితేంద్రియః ।
యతస్వ మునిశార్దూల”
ఇత్యుక్త్వా త్రిదివం గతః ॥

టీకా:

తమ్ = అతని గూర్చి; ఉవాచ = పలికెను; తతః = తరువాత; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; న = కాదు; తావత్ = అంతవాడవు; త్వం = నీవు; జితేంద్రియః = ఇంద్రియములను జయించినవాడు;; యతస్వ = ఇంకను ప్రయత్నించుము; మునిశార్దూల = ముని శ్రేష్ఠుడా; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; త్రిదివం = స్వర్గమునకు; గతః = వెళ్ళెను.

భావము:

"నీవు ఇంద్రియములను జయించినంతవాడవు మాత్రము కావు. ఇంకను ప్రయత్నింపుము" అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్ళెను
*గమనిక:-   .జితేంద్రియుడు- శ్లో. వికారహేతౌపలి విక్రియంతే। యేషాం న చేతాంసి త ఏవ ధీరా॥ (కాళిదాసు శాకుంతలము); మనో వికారములను గూర్చు (మనస్సును చలింపజేయునట్టి) బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడును చలింపక ఉండువాడు జితేంద్రియుడు.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యాం వసన్త్యాం వర్షాణి
పంచ పంచ చ రాఘవ! ।
విశ్వామిత్రాశ్రమే రామ!
సుఖేన వ్యతిచక్రముః ॥

టీకా:

తస్యాం = ఆమె; వసన్త్యాం = నివసించుచుండగా; వర్షాణి = సంవత్సరములు; పంచ పంచ చ = పది; రాఘవ = రామా; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; ఆశ్రమే = ఆశ్రమమునందు; రామ = రామా; సుఖేన = సుఖముగా; వ్యతిచక్రముః = గడచిపోయినవి.

భావము:

ఆమె విశ్వామిత్రుని ఆశ్రమములో నివసించుచుండ పది సంవత్సరములు సుఖముగా గడిచిపోయినవి.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ కాలే గతే తస్మిన్
విశ్వామిత్రో మహామునిః ।
సవ్రీల ఇవ సంవృత్తః
చింతాశోకపరాయణః ॥

టీకా:

అథ = తరువాత; కాలే = కాలము; గతే = గడచిన తరువాత; తస్మిన్ = ఆ; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని; సవ్రీల = సిగ్గు; ఇవ = వలె; సంవృత్తః = అయ్యెను; చింతా = విచారము; శోక = దుఃఖము; పరాయణః = కూడినవాడై.

భావము:

అట్లు పది సంవత్సరముల కాలము గడువగా, విశ్వామిత్రమహాముని విచారము శోకము కలుగగా సిగ్గుపడజొచ్చెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బుద్ధిర్మునేః సముత్పన్నా
సామర్షా రఘునందన! ।
సర్వం సురాణాం కర్మైతః
తపోఽ పహరణం మహత్ ॥

టీకా:

బుద్ధిః = బుద్ధి; మునేః = మునికి; సముత్పన్నా = పుట్టినది; స = కూడిన; సామర్షా = కోపముతో; రఘునందన = రామా; సర్వం = అంతయు; సురాణాం = దేవతల యొక్క; కర్మ = పని; ఏతః = ఇది; తపః = తపము; అపహరణం = అపహరించుటకు; మహత్ = గొప్ప.

భావము:

రామా! అంతట విశ్వామిత్రునకు ""ఇది అంతయు నా తపస్సును అపహరించుటకు దేవతలు చేసిన పని"" అను ఆలోచన కలిగెను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అహోరాత్రాపదేశేన
గతాః సంవత్సరా దశ ।
కామమో హాభిభూతస్య
విఘ్నోఽ యం ప్రత్యుపస్థితః ॥

టీకా:

అహో = పగలు; రాత్ర = రాత్రి; అపదేశేన = నెపముతో; గతాః = గడచిపోయినవి; సంవత్సరాః = సంవత్సరములు; దశ = పది; కామః = కామము; మోహః = కామమోహములచే; అభిభూతస్య = పీడితునకు; విఘ్నః = విఘ్నము; అయం = ఈ; ప్రత్యుపస్థితః = వచ్చినది.

భావము:

కామమోహములలో రేయింబవళ్ళు చిక్కుకొన్న నాకు పది సంవత్సరములు గడచిపోయినవి. ఈ కారణముచే గొప్ప విఘ్నము వచ్చిపడినది.

1-64-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

1.63.22.
తమువాచ తతో బ్రహ్మా
"న తావత్త్వం జితేంద్రియః ।
యతస్వ మునిశార్దూల”
ఇత్యుక్త్వా త్రిదివం గతః ॥

టీకా:

తమ్ = అతని గూర్చి; ఉవాచ = పలికెను; తతః = తరువాత; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; న = కాదు; తావత్ = అంతవాడవు; త్వం = నీవు; జితేంద్రియః = ఇంద్రియములను జయించినవాడు;; యతస్వ = ఇంకను ప్రయత్నించుము; మునిశార్దూల = ముని శ్రేష్ఠుడా; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; త్రిదివం = స్వర్గమునకు; గతః = వెళ్ళెను.

భావము:

"నీవు ఇంద్రియములను జయించినంతవాడవు మాత్రము కావు. ఇంకను ప్రయత్నింపుము" అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్ళెను
*గమనిక:-   .జితేంద్రియుడు- శ్లో. వికారహేతౌపలి విక్రియంతే। యేషాం న చేతాంసి త ఏవ ధీరా॥ (కాళిదాసు శాకుంతలము); మనో వికారములను గూర్చు (మనస్సును చలింపజేయునట్టి) బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడును చలింపక ఉండువాడు జితేంద్రియుడు.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మేనకాం మధురైర్వాక్యైః
విసృజ్య కుశికాత్మజః ।
ఉత్తరం పర్వతం రామ!
విశ్వామిత్రో జగామ హ ॥

టీకా:

మేనకాం = మేనకను; మధురైః = మధురములైన; వాక్యైః = మాటలతో; విసృజ్య = విడిచి; కుశికాత్మజః = విశ్వామిత్రుడు; ఉత్తరం = ఉత్తర దిక్కున ఉన్న; పర్వతం = పర్వతము గూర్చి; రామ = రామా; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; జగామ హ = వెళ్ళెను.

భావము:

రామా! విశ్వామిత్రుడు మేనకను మధుర వాక్కులతో శాంతింపజేసి పంపించివేసి, తాను ఉత్తరదిశలో ఉన్న హిమవత్పర్వతమునకు వెళ్ళెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స కృత్వా నైష్ఠికీం బుద్ధిమ్
జేతుకామో మహాయశాః ।
కౌశికీతీరమాసాద్య
తపస్తేపే సుదారుణమ్ ॥

టీకా:

సః = అతను; కృత్వా = చేసి; నైష్ఠికీం = నిష్ఠకు సంబంధించిన; బుద్ధిం = బుద్ధిని; జేతుకామః = జయించవలెనను కోరిక గలవాడై; మహాయశాః = గొప్ప కీర్తిమంతుడు; కౌశికీ తీరమ్ = కౌశికీ నది ఒడ్డును; ఆసాద్య = పొంది; తపః = తపస్సును; తేపే = చేసెను; సుదారుణమ్ = మిక్కిలి తీవ్రమైన.

భావము:

విశ్వామిత్రుడు ఇంద్రియములను నిగ్రహించవలెనను కోరికగలవాడై కడు నిష్ఠతో, కౌశికీనదీ తీరమున తీవ్రమైన తపము ఆచరించెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య వర్షసహస్రం తు
ఘోరం తప ఉపాసతః ।
ఉత్తరే పర్వతే రామ!
దేవతానా మభూద్భయమ్ ॥

టీకా:

తస్య = అతడు; వర్ష సహస్రం తు = వేయి సంవత్సరములు; ఘోరం = ఘోరమైన; తపః = తపమును; ఉపాసతః = ఆచరించుచుండగా; ఉత్తరే పర్వతే = ఉత్తర దిక్కున ఉన్న హిమవత్పర్వతముపై; రామ; రామా; దేవతానామ్ = దేవతలకు; అభూత్ = కలిగెను; భయమ్ = భయము;

భావము:

విశ్వామిత్రుడు వేయి సంవత్సరముల కాలము హిమవత్పర్వతముపై ఘోరమైన తపము ఆచరించుచుండగా దేవతలకు భయము కలిగెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆమంత్రయన్ సమాగమ్య
సర్వే సర్షిగణాః సురాః ।
“మహర్షిశబ్దం లభతామ్
సాధ్వయం కుశికాత్మజః” ॥

టీకా:

ఆమంత్రయన్ = సమాలోచన చేసిరి; సమాగమ్య = కలిసి; సర్వే = సకల; స = కూడిన; ఋషి = ఋషుల; గణాః = సముదాయములు; సురాః = దేవతలు; మహర్షి = మహర్షి; శబ్దం = పలుకును; లభతాం = పొందుగాక; సాధు = బాగుగా; అయం = ఈ; కుశికాత్మజః = విశ్వామిత్రుడు.

భావము:

ఋషులు దేవతలు కలిసి సమాలోచించి ‘ఈ విశ్వామిత్రుడు ""మహర్షి"" బిరుదము పొందుగాక!’ అని నిర్ణయించిరి.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవతానాం వచః శ్రుత్వా
సర్వలోక పితామహః ।
అబ్రవీన్మధురం వాక్యమ్
విశ్వామిత్రం తపోధనమ్ ॥

టీకా:

దేవతానాం = దేవతలయొక్క; వచః = మాట; శ్రుత్వా = విని; సర్వలోకపితామహః = బ్రహ్మదేవుడు; అబ్రవీత్ = పలికెను; మధురం = మధురమైన; వాక్యం = మాటను; విశ్వామిత్రం = విశ్వామిత్రుని గూర్చి; తపోధనమ్ = తపస్సే ధనముగా గల.

భావము:

దేవతల మాట విని, బ్రహ్మదేవుడు తపోనిధి ఐన విశ్వామిత్రునితో తీయనిమాట పలికెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“మహర్షే! స్వాగతం వత్స!
తపసోగ్రేణ తోషితః ।
మహత్త్వ మృషిముఖ్యత్వమ్
దదామి తవ కౌశిక!"" ॥

టీకా:

మహర్షే = మహర్షీ; స్వాగతం = స్వాగతము; వత్స = కుమారా; తపస = తపస్సుచేత; ఉగ్రేణ = తీవ్రమైన; తోషితః = సంతసించబడితిని; మహత్త్వమ్ = గొప్పతనమును; ఋషి = ఋషులలో; ముఖ్యత్వమ్ = ప్రముఖత్వమును; దదామి = ఇచ్చుచున్నాను; తవ = నీకు; కౌశిక = విశ్వామిత్రా.

భావము:

“తనయుడా! విశ్వామిత్రా! నీవు ఆచరించిన ఉగ్రమైన తపస్సునకు సంతోషించి నీకు మహర్షిత్వమును ఇచ్చుచున్నాను. నీవు మహర్షివి.”

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మణస్స వచః శ్రుత్వా
సర్వ లోకేశ్వరస్య హ ।
న విషణ్ణో న సంతుష్టో
విశ్వామిత్ర స్తపోధనః ॥

టీకా:

బ్రహ్మణః = బ్రహ్మయొక్క; సః = ఆ; వచః = మాట; శ్రుత్వా = విని; సర్వ = సకల; లోకః = లోకములకు; ఈశ్వరస్య = ఈశుడైన; న = లేదు; విషణ్ణః = విచారించనూ; న = లేదు; సంతుష్టః = సంతోషించనూ; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; తపోధనః = తపోధనుడైన.

భావము:

సర్వలోకాధిపతి బ్రహ్మ యొక్క మాటలు విని తపోధనుడైన విశ్వామిత్రుడు చింతించనూ లేదు, సంతోషించనూ లేదు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాంజలిః ప్రణతో భూత్వా
సర్వలోక పితామహమ్ ।
ప్రత్యువాచ తతో వాచమ్
విశ్వామిత్రో మహామునిః ॥

టీకా:

ప్రాంజలిః = చేతులు మొగిచి; ప్రణతః = నమ్రుడు; భూత్వా = అయి; సర్వలోకపితామహమ్ = బ్రహ్మదేవుని గూర్చి; ప్రత్యువాచ = బదులు పలికెను; తతః = తరువాత; వాచమ్ = మాటను; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని.

భావము:

తరువాత విశ్వామిత్రమహాముని నమస్కరించుచు నమ్రతతో బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను.

1-21-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“మహర్షిశబ్ద మతులమ్
 స్వార్జితైః కర్మభిః శుభైః ।
యది మే భగవానాహ
 తతోఽ హం విజితేంద్రియః" ॥

టీకా:

మహర్షి శబ్దమ్ = "మహర్షి" అనుపేరు; అతులం = అసమానమైనది; స్వార్జితైః = నాచే చేయబడిన; కర్మభిః = కర్మల చేత; శుభైః = శుభములైన; యది = ఐతే; మే = నాకు; భగవాన్ = పూజనీయుడవైన; ఆహ = తెలియజేసినది; తతః = అందువలన; అహం = నేను; విజిత = జయించబడిన; ఇంద్రియః = ఇంద్రియములు కలవాడను.

భావము:

“నేను ఒనరించిన శుభకర్మల వలన నాకు మహర్షిత్వము లభించినదని భగవంతుడవైన నీవు తెలియజేసినావు. కావున నేను జితేంద్రియుడను.”

1-64-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

1.63.22.
తమువాచ తతో బ్రహ్మా
"న తావత్త్వం జితేంద్రియః ।
యతస్వ మునిశార్దూల”
ఇత్యుక్త్వా త్రిదివం గతః ॥

టీకా:

తమ్ = అతని గూర్చి; ఉవాచ = పలికెను; తతః = తరువాత; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; న = కాదు; తావత్ = అంతవాడవు; త్వం = నీవు; జితేంద్రియః = ఇంద్రియములను జయించినవాడు;; యతస్వ = ఇంకను ప్రయత్నించుము; మునిశార్దూల = ముని శ్రేష్ఠుడా; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; త్రిదివం = స్వర్గమునకు; గతః = వెళ్ళెను.

భావము:

"నీవు ఇంద్రియములను జయించినంతవాడవు మాత్రము కావు. ఇంకను ప్రయత్నింపుము" అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్ళెను
*గమనిక:-   .జితేంద్రియుడు- శ్లో. వికారహేతౌపలి విక్రియంతే। యేషాం న చేతాంసి త ఏవ ధీరా॥ (కాళిదాసు శాకుంతలము); మనో వికారములను గూర్చు (మనస్సును చలింపజేయునట్టి) బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడును చలింపక ఉండువాడు జితేంద్రియుడు.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విప్రస్థితేషు దేవేషు
విశ్వామిత్రో మహామునిః ।
ఊర్ద్ధ్వబాహు ర్నిరాలమ్బో
వాయుభక్షస్త పశ్చరన్ ॥

టీకా:

విప్రస్థితేషు = బయలుదేరుచుండగా; దేవేషు = దేవతలు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని; ఊర్ధ్వబాహుః = ఎత్తబడిన చేతులు కలవాడై; నిరాలమ్బః = నిరాధారుడై; వాయుభక్షః = గాలి తినువాడై; తపః = తపము; చరన్ = చేయుచుండెను.

భావము:

దేవతలు వెడలిపోయిన తరువాత, విశ్వామిత్ర మహాముని, రెండు చేతులు పైకి ఎత్తి ఉంచి, ఏ ఆధారము లేకుండగ నిలబడి, కేవలము వాయుభక్షణతో తపమొనరించుచుండెను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘర్మే పంచతపా భూత్వా
వర్షాస్వాకాశ సంశ్రయః ।
శిశిరే సలిలస్థాయీ
రాత్ర్యహాని తపోధనః ।
ఏవం వర్షసహస్రం హి
తపో ఘోరముపాగమత్ ॥

టీకా:

ఘర్మే = గ్రీష్మ ఋతువునందు; పంచతపాః = పంచాగ్నుల మధ్య; భూత్వా = అయి; వర్షాసు = వర్షములందు; ఆకాశ = ఆకాశమును; సంశ్రయః = ఆశ్రయించినవాడై; శిశిరే = శిశిర ఋతువులో; సలిల స్థాయీ = నీటిలో నిలబడినవాడై; రాత్ర్యహాని = రేయింబవళ్ళు; తపోధనః = తపము ధనముగా కలవాడు; ఏవం = ఇట్లు; వర్ష సహస్రః = వేయి సంవత్సరములు; తపః = తపస్సు; ఘోరమ్ = భయంకరమైన; ఉపాగమత్ = పొందెను.

భావము:

గ్రీష్మ ఋతువులో పంచాగ్నుల (తీవ్రమైన వేసవి కాలములో నలుదిక్కులా పేర్చిన అగ్నుల వేడిమి, పైనుండి కలుగు సూర్యుని వేడిమి) మధ్యన, వర్షాకాలములో ఆరుబయట నిలబడియు, చలి అధికమగు శిశిర ఋతువు నందు చల్లని నీటియందు ఉండియు విశ్వామిత్రుడు వేయి సంవత్సరముల పాటు రేయింబవళ్ళు ఘోరమైన తపము ఆచరించెను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్మిన్ సంతప్యమానే తు
విశ్వామిత్రే మహామునౌ ।
సంభ్రమః సుమహానాసీత్
సురాణాం వాసవస్య చ ॥

టీకా:

తస్మిన్ = ఆ; సంతప్యమానే = తపస్సు చేయుచుండగా; విశ్వామిత్రే = విశ్వామిత్రుడు; మహామునౌ = మహాముని; సంభ్రమః = భయము; సుమహాన్ = చాలాగొప్ప; ఆసీత్ = కలిగెను; సురాణాం = దేవతలకు; వాసవస్య = దేవేంద్రునకు; చ = మఱియు.

భావము:

విశ్వామిత్ర మహాముని ఇట్లు తపమాచరించుచుండగా, దేవతలకును, దేవేంద్రునకు కూడ చాలా భయము కలిగెను.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రంభామప్సరసం శక్రః
సహ సర్వైర్మరుద్గణైః ।
ఉవాచాత్మహితం వాక్యం
అహితం కౌశికస్య చ ॥

టీకా:

రంభామ్ = రంభ యనెడి; అప్సరసమ్ = అప్సరస గురించి; శక్రః = ఇంద్రుడు; సహ = కూడినవాడై; సర్వైః = సకల; మరుద్గణైః = దేవగణములతో; ఉవాచ = పలికెను; ఆత్మహితం = తనకు మేలైనది; వాక్యం = వాక్యమును; అహితం = మేలు కానిదియును; కౌశికస్య = విశ్వామిత్రునకు; చ = మఱియు

భావము:

దేవతలందరితో కూడియున్న దేవేంద్రుడు, తనకు మేలైనదియు, విశ్వామిత్రునకు మేలు కానిదియును అగు మాటను రంభ యను అప్సరసతో పలికెను.

1-27-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే బాలకాండే త్రిషష్టితమః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; త్రిషష్టితమః [63] = అరవై మూడవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిసంప్రదాయమూ మొట్టమొదటికావ్యమూ ఐన వాల్మీకి విరచితమూ తెలుగు వారి రామాయణ మహా ఇతిహాసాంతర్గత, బాలకాండలోని అరవైమూడవ [63] సర్గ సంపూర్ణము.