బాలకాండమ్ : ॥ఏకషష్టితమః సర్గః॥ [61 - అంబరీషుడు యజ్ఞానికి శునశ్శేపుని తెచ్చుట]
- ఉపకరణాలు:
విశ్వామిత్రో మహాత్మాఽ థ
ప్రస్థితాన్ ప్రేక్ష్య తానృషీన్ ।
అబ్రవీ న్నరశార్దూలః!
సర్వాంస్తాన్ వనవాసినః ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్ర మహర్షి; మహాత్మః = మహానుభావుడు; అథ = మఱియు; ప్రస్థితాన్ = ప్రయాణమైన వారిని; ప్రేక్ష్య = చూసి; తాన్ = తను; ఋషీన్ = ఋషులను; అబ్రవీత్ = పలికెను; నరశార్దూలః = మానవశ్రేష్టుడైన రామ; సర్వాన్ = సమస్తమైన వారు; ఆస్తాన్ = సమావేశమైన; వనవాసినః = వనములందు నివసించువారిని.
భావము:
రామా! మహాత్ముడు విశ్వామిత్రమహర్షి ప్రాయాణానికి సిద్ధంగా వచ్చి సమావేశమై ఉన్న వనాలలో నివసించే ఋషులతో ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
“మహాన్ విఘ్నః ప్రవృత్తోఽ యమ్
దక్షిణా మాస్థితో దిశమ్ ।
దిశమన్యాం ప్రపత్స్యామః
తత్ర తప్స్యామహే తపః ॥
టీకా:
మహాన్ = గొప్ప; విఘ్నః = విఘ్నము; ప్రవృత్తః = కలిగినది; అయమ్ = ఈ; దక్షిణాం = దక్షిణ; ఆస్థితః = ఉన్నట్టి; దిశమ్ = ప్రదేశము; దిశం = ప్రదేశము; అన్యాం = ఇంకొక; ప్రపత్స్యామః = చేరుకుని; తత్ర = అక్కడ; తప్స్యామహే = తపించెదము; తపః = తపస్సు.
భావము:
"ఈ దక్షిణ దిక్కునందు చేస్తున్న తపమునకు గొప్ప విఘ్నము కలిగినది. మఱియొక చోటునకు వెళ్ళి అక్కడ తపములు ఆచరించెదము.
- ఉపకరణాలు:
పశ్చిమాయాం విశాలాయామ్
పుష్కరేషు మహాత్మనః ।
సుఖం తపశ్చరిష్యామః
పరం తద్ధి తపోవనమ్" ॥
టీకా:
పశ్చిమాయాం = పశ్చిమమునందు; విశాలాయామ్ = విశాలమై నటువంటి; పుష్కరేషు = పుష్కర తీర్థమందు; మహాత్మనః = ఓ మహాత్ములారా; సుఖం = సుఖముగా; తపః = తపస్సులు; చరిష్యామః = ఆచరించెదము; పరం = గొప్ప; తత్ హి = అది కదా; తపోవనమ్ = తపోవనము.
భావము:
ఓ మహాత్ములారా! పశ్చమదిక్కుయందు విశాలమైనటువంటి పుష్కర తీర్థము కలదు. ఆ గొప్ప తపోవనమునందు సుఖముగా తపస్సు చేయుదము.
- ఉపకరణాలు:
ఏవముక్త్వా మహాతేజాః
పుష్కరేషు మహామునిః ।
తప ఉగ్రం దురాధర్షమ్
తేపే మూలఫలాశనః ॥
టీకా:
ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కల వాడు; పుష్కరేషు = పుష్కర తీర్థమందు; మహామునిః = మహా ముని; తపః = తపస్సును; ఉగ్రం = ఉగ్రమైన; దురాధర్షమ్ = ఇతరులకు శక్యము కాని; తేపే = తపించెను; మూల = దుంపలు; ఫల = పండ్లు; అశనః = భుజించుచు.
భావము:
ఈ విధముగా పలికి మహా తేజస్సు కలిగిన విశ్వామిత్రుడు అచటకు చేరెను; ఆ పుష్కర తీర్థమందు పండ్లు దుంపలు మాత్రమే ఆహారముగ స్వీకరించుచు ఇతరులకు శక్యముకాని తీవ్రమైన తపమును ఆచరించెను.
- ఉపకరణాలు:
ఏతస్మిన్నేవ కాలే తు
అయోధ్యాధిపతి ర్నృపః ।
అమ్బరీష ఇతి ఖ్యాతో
యష్టుం సముపచక్రమే ॥
టీకా:
ఏతస్మిన్ = అదే; ఏవ; కాలే తు = కాలములోనే; తు; అయోధ్య = అయోధ్యకు; అధిపతిః = రాజు; నృపః = రాజు; అమ్బరీషః = అంబరీషుడు; ఇతి = అని; ఖ్యాతః = పసిద్ధి చెందిన; యష్టుం = యజ్ఞమును చేయుట; సముపచక్రమే = ఆరంభించెను.
భావము:
అదే సమయమునందు అయోధ్యాధిపతిగా ప్రసిద్ధి చెందిన అంబరీషు డనే మహారాజు ఒక యాగమును చేయనారంభించెను.
- ఉపకరణాలు:
తస్య వై యజమానస్య
పశుమింద్రో జహార హ ।
ప్రణష్టే తు పశౌ విప్రో
రాజాన మిదమబ్రవీత్ ॥
టీకా:
తస్య = అతని; వై = యొక్క; యజమానస్య = యాగము చేయుచున్న; పశుం = పశువును; ఇంద్రః = ఇంద్రుడు; జహార హ = అపహరించెను; హ; ప్రణష్టే = కనబడకపోవుటచే; తు; పశౌ = యజ్ఞ పశువు; విప్రః = పురోహితుడు; రాజానమ్ = రాజుతో; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = నుడివెను.
భావము:
ఆ యజ్ఞము జరుగుచుండగా యాగ పశువును దేవేంద్రుడు అపహరించెను. ఆ పశువు కనబడకపోవుటచే వారి పురోహితుడు అంబరీషునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
పశురద్య హృతో రాజన్
ప్రణష్టస్తవ దుర్నయాత్ ।
అరక్షితారం రాజానమ్
ఘ్నంతి దోషా నరేశ్వర! ॥
టీకా:
పశుః = పశువు; అద్య = ఇప్పుడు; హృతః = హరింపబడినది; రాజన్ = ఓ రాజా; ప్రణష్టః = కనబడకుండా పోయింది; తవ = నీయొక్క; దుర్నయాత్ = తప్పిదముచే; అరక్షితారం = రక్షింపలేకపోవటం; రాజానమ్ = రాజును; ఘ్నంతి = చంపుదును; దోషాః = దోషములు; నరేశ్వర = రాజా.
భావము:
ఓ రాజా! ఎవరిచేతనో పశువు అపహరింపబడినది, నీ తప్పిదము వలనే ఇది జరిగినది. యాగపశువును రక్షించుకొనలేకపోవుట మిక్కిలి దోషము. అది నిన్ను హతమార్చును.
- ఉపకరణాలు:
ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతత్
నరం వా పురుషర్షభ ।
ఆనయస్వ పశుం శీఘ్రమ్
యావత్ కర్మ ప్రవర్తతే" ॥
టీకా:
ప్రాయశ్చిత్తం = ప్రాయశ్చిత్తము; మహత్ = గొప్పదైనది; ఏతత్ = ఈ; నరం = మనిషిని; వా = అయినా; పురుషర్షభ = పురుష శ్రేష్ఠుడా; ఆనయస్వ = తీసుకునిరమ్ము; పశుం = నరపశువును; శీఘ్రమ్ = వెంటనే; యావత్ = పూర్తి; కర్మ = కర్మ; ప్రవర్తతే = జరుగగలదు.
భావము:
పురుషశ్రేష్ఠుడా! ప్రాయశ్చిత్తముగా వెంటనే ఈ నరుని లేదా మఱియక నరపశువుని అయినను తీసుకొని రమ్ము. అప్పుడు యాగము జరుగగలదు.
- ఉపకరణాలు:
ఉపాధ్యాయవచః శ్రుత్వా
స రాజా పురుషర్షభ ।
అన్వియేష మహాబుద్ధిః
పశుం గోభిస్సహస్రశః ॥
టీకా:
ఉపాధ్యాయ = ఉపాధ్యాయుని; వచః = వచనములను; శ్రుత్వా = విని; సః = అతడు; రాజా = రాజు; పురుషః = పురుషులలో; ఋషభ = పురుషులలో శ్రేష్ఠుడైన; అన్వియేష = అన్వేషించెను; మహా = గొప్ప; బుద్ధిః = ప్రజ్ఞ కలిగిన; పశుం = పశువును; గోభిః = ఆవులచే; సహస్రశః = వేలాది.
భావము:
పురుషశ్రేష్ఠుడు ప్రజ్ఞాశాలి అయిన అంబరీష మహారాజు; పురోహితుని మాటలు వినినంతనే వేలాది గోవులను ప్రతిగా ఇచ్చి పశువును పొందుటకు అన్వేషణ ఆరంభించెను.
- ఉపకరణాలు:
దేశాన్ జనపదాంస్తాంస్తాన్
నగరాణి వనాని చ ।
ఆశ్రమాణి చ పుణ్యాని
మార్గమాణో మహీపతిః ॥
టీకా:
దేశాన్ = వివిధ దేశములు; జనపదాన్ = పల్లెలు; తాంస్తాన్ = ఆయా; నగరాణి = నగరములను; వనాని = అడవులను; చ = మరియు; ఆశ్రమాణి = ఆశ్రమములను; చ = మరియు; పుణ్యాని = పుణ్యమై నటువంటి; మార్గమాణః = అన్వేషించెను; మహీపతిః = రాజు.
భావము:
ఆ భూపతి యాగపశువు కొఱకు దేశములు నగరములు పల్లెలు వనములు మఱియు పుణ్యాశ్రమములు అన్ని అన్వేషించెను.
- ఉపకరణాలు:
స పుత్రసహితం తాత!
సభార్యం రఘునందన! ।
భృగుతుంగే సమాసీనం
ఋచీకం సందదర్శ హ ॥
టీకా:
సః = అతడు; పుత్రః = పుత్రులతో; సహితం = కూడియున్న; తాత = ఓ నాయనా; స = కూడి ఉన్న; భార్యం = భార్యాకలవానివి; రఘునందన = రామా; భృగుతుంగే = భృగుతుంగ పీటభూమి యందు; సమాసీనం = సుఖాసీను డైన; ఋచీకం = ఋచీకమహర్షిని; సందదర్శ హ = చూచెను.
భావము:
నాయనా రఘునందనా! ఆ రాజు అట్లు వెదుకుచు; భృగు తుంగ పర్వత మందు భార్యా పుత్రులతో కూడి సుఖాసీనుడైన ఋచీక మహర్షిని దర్శించెను.
- ఉపకరణాలు:
తమువాచ మహాతేజాః
ప్రణ మ్యాభిప్రసాద్య చ ।
బ్రహ్మర్షిం తపసా దీప్తమ్
రాజర్షి రమితప్రభః ॥
టీకా:
తం = ఆ; ఉవాచ = నుడివెను; మహా = గొప్ప; తేజాః = తేజోవంతుడు; ప్రణమ్య = నమస్కరించి; అభిప్రసాద్య చ = ప్రసన్నునిగా చేసుకొని; చ; బ్రహ్మర్షిం = బ్రహ్మర్షిని; తపసా = తపస్సుచే; దీప్తమ్ = ప్రకాశించుచున్న; రాజర్షిః = రాజర్షి; అమితప్రభః = గొప్ప ప్రభావము కలవాడు.
భావము:
మహాతేజశ్శాలి, ప్రభావశాలి, రాజర్షి అయిన అంబరీషుడు తపస్సుచే ప్రకాశించుచున్న ఆ ఋచీకునికి నమస్కరించి ప్రసన్నము చేసుకుని ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“పృష్ట్వా సర్వత్ర కుశలం
ఋచీకం తమిదం వచః ।
“గవాం శతసహస్రేణ
విక్రీణీషే సుతం యది ।
టీకా:
పృష్ట్వా = అడిగి; సర్వత్ర = అన్నిటియందును; కుశలం = కుశలము; ఋచీకం = ఋచీకుని గూర్చి; తం = ఆ; ఇదం = ఈ విధముగా; వచః = వచనము; గవాం = గోవుల యొక్క; శతసహస్రేణ = వందవేలుచేత (లక్ష); విక్రీణీషే = అమ్మినటులైన; సుతం = నీ పుత్రుని; యది = అయితే; పశోః = బలిపశువు; అర్థే = కొఱకు; మహాభాగ = గొప్ప భాగ్యము కలిగిన; కృతకృత్యః = కృతకృత్యుడను; అస్మి = అగుదును; భార్గవ = ఓ భృగవంశ సంజాతుడైన ఋచీక మహర్షీ!.
భావము:
"ఓ భార్గవా! (భృగవంశ సంజాతుడైన ఋచీక మహర్షీ!) నేను దేశములన్నిట వెతికినను యజ్ఞపశువు లభింపలేదు. నీకు లక్ష గోవులను సమర్పించెదను. వాటిని మీరు స్వీకరించి మాఱుగా యజ్ఞపశువుగా నీకుమారులలో ఒకరిని నాకు అమ్మినచో నేను కృతార్థుడను అగుదును.
- ఉపకరణాలు:
సర్వే పరిసృతా దేశా
యాజ్ఞీయం న లభే పశుమ్ ।
దాతుమర్హసి మూల్యేన
సుతమేకమితో మమ" ॥
టీకా:
సర్వే = అన్ని; పరిసృతాః = సంచరించబడెను; దేశాః = దేశములు; యాజ్ఞీయం = యజ్ఞం కొఱకు; న లభే = లభించలేదు; పశుమ్ = బలిపశువు; దాతుం+అర్హసి = దానమిచ్చుటకు అర్హుడవు, దానముగా ఇమ్ము; మూల్యేన = తగు మూల్యముచే; సుతమ్ = పుత్రుడను; ఏకమ్ = ఒకనిని; ఇతః = వీరిలోనుండి; మమ = నాకు.
భావము:
దేశములన్నిట తిరిగితిని యజ్ఞపశువు లభింపలేదు. తగిన మూల్యము తీసుకుని వీరిలో(నీ కుమారులలో) ఒకరిని నాకు ఇమ్ము"
- ఉపకరణాలు:
ఏవముక్తో మహాతేజా
ఋచీక స్త్వబ్రవీద్వచః ॥
టీకా:
ఏవం = ఉక్తః = ఈ విధముగా పలికిన; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; ఋచీకస్తు = ఋచీకునిచే; అబ్రవీత్ = పలుకబడెను; వచః = వచనము.
భావము:
ఇట్లు పలుకగా విన్న మహాతేజశ్వియగు ఋచీక మహర్షి ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ!
విక్రీణీయాం కథంచన" ।
ఋచీకస్య వచః శ్రుత్వా
తేషాం మాతా మహాత్మనామ్ ॥
టీకా:
న = కాదు; అహం = నేను; జ్యేష్ఠం = పెద్ద కుమారుని; నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడైన ఓ మహారాజా; విక్రీణీయాం = అమ్ముట; కథంచన = ఏ విధముగను ఋచీకస్య = ఋచీకుని; వచః = వచనమును; శ్రుత్వా = విని; తేషాం = వారి; మాతా = తల్లి; మహాత్మనామ్ = మహాత్ములైన ఋషికుమారుల.
భావము:
"ఓ నరశ్రేష్ఠ! నేను ఏ విధముగా నైనను నా పెద్దకొడుకును అమ్మజాలను"మహాతపస్విని అయిన ఆ మహత్ముల తల్లి, భర్త ఋచీకుని వచనములను విన్న పిమ్మట
- ఉపకరణాలు:
ఉవాచ నరశార్దూలం
అమ్బరీషం తపస్వినీ ।
అవిక్రేయం సుతం జ్యేష్ఠమ్
భగవానాహ భార్గవః ॥
టీకా:
ఉవాచ = పలికెను; నరశార్దూలం = నరులలో శ్రేష్ఠుడైన; అమ్బరీషం = అంబరీషునితో; తపస్వినీ = తపస్విని; అవిక్రేయం = అమ్మకూడని వాడని; సుతం = కుమారుని; జ్యేష్ఠమ్ = పెద్దవాడైన; భగవాన్ = పూజ్యుడైన; అహ = అనుచున్నారు; భార్గవః = భార్గవుడు (ఋచీక మహర్షి)
భావము:
నరశ్రేష్ఠుడైన అంబరీషునితో తపస్విని అయిన ఆ ఋషికుమారుల తల్లి ఇట్లు పలికెను “పుజ్యుడైన నాభర్త ఋచీకుడు పెద్దకుమారుని అమ్మరాదని అంటున్నారు.
- ఉపకరణాలు:
మమాపి దయితం విద్ధి
కనిష్ఠం శునకం నృప ।
తస్మాత్కనీయసం పుత్రమ్
న దాస్యే తవ పార్థివ ॥
టీకా:
మమ = నాకు; అపి = ఐతే; దయితం = ఇష్టుడిగా; విద్ధి = తెలుసుకొనుము; కనిష్ఠం = చిన్నవాడైన; శునకం = శునకుడు; నృప = ఓ రాజా; తస్మాత్ = అందుచేత; కనీయసం పుత్రమ్ = చిన్న కొడుకును; న+దాస్యే = దానమివ్వను; తవ = నీకు; పార్థివ = రాజ.
భావము:
నాకు చిన్నకుమారుడైన శునకుడు ఇష్టుడు. అందుచేత వానిని ఓ అంబరీష మహారాజా నీకు ఇవ్వలేను.
- ఉపకరణాలు:
ప్రాయేణ హి నరశ్రేష్ఠ!
జ్యేష్ఠాః పితృషు వల్లభాః ।
మాతౄణాం చ కనీయాంసః
తస్మాద్రక్షే కనీయసమ్" ॥
టీకా:
ప్రాయేణ = సాధారణము; హి = ఐనదే; నరశ్రేష్ఠ = నరశ్రేష్ఠుడా; జ్యేష్ఠాః = పెద్దవాడు; పితృషు = తండ్రికి; వల్లభాః = ఇష్టులు; మాతౄణాం = తల్లులకు అయితే; చ; కనీయాంసః = చిన్నవాళ్ళు; తస్మాత్ = అందుచేత; రక్షే = రక్షించెదను; కనీయసమ్ = చిన్నవానిని.
భావము:
ఓ నరశ్రేష్ఠుడైన అంబరీషా! సాధారణముగా పెద్ద కుమారులు తండ్రులకు ఇష్టులు; తల్లులకు చిన్నవాళ్ళు ఇష్టులు. అందుచేత చిన్నవాడిని రక్షించుకొందును.”
- ఉపకరణాలు:
ఉక్తవాక్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథైవ చ|
శునశ్శేఫస్స్వయం రామ! మధ్యమో వాక్యమబ్రవీత్||
- ఉపకరణాలు:
“పితా జ్యేష్ఠమవిక్రేయమ్
మాతా చాహ కనీయసమ్ ।
విక్రీతం మధ్యమం మన్యే
రాజన్! పుత్రం నయస్వ మామ్” ॥
టీకా:
పితా = తండ్రిగారు; జ్యేష్ఠం = పెద్దకుమారుని; అవిక్రేయమ్ = అమ్మకూడని వాడని; మాతా చ = మాతృమూర్తి; అహ = పలికెను; కనీయసమ్ = చిన్నవానిని; విక్రీతం = అమ్మబడే వానిగా; మధ్యమం = మధ్యమ పుత్రుడైన; మన్యే = తలతును; రాజన్ = ఓ రాజా!; పుత్రం = కుమారుడైన; నయస్వ = తీసుకొని వెళ్ళుము; మామ్ = నన్ను.
భావము:
“ఓ రాజా! మా తండ్రి పెద్దకుమారుడిని అమ్మరు; చిన్నవాడిని మా తల్లి అమ్మరు; దీనిని బట్టి మధ్యముడనైన నన్ను అమ్మబడిన వానిగా తలతును. కావున నన్ను తీసుకునిపొమ్ము.”
- ఉపకరణాలు:
గవాం శతసహస్రేణ
శునఃశేపం నరేశ్వరః! ।
గృహీత్వా పరమప్రీతో
జగామ రఘునందన! ॥
టీకా:
గవాం = గోవుల యొక్క; శతసహస్రేణ = లక్షచే; శునఃశేఫం = శునశ్శేఫుని; నరేశ్వరః = రాజు; గృహీత్వా = తీసుకొని; పరమప్రీతః = చాలా సంతోషించినవాడై; జగామ = వెళ్ళెను; రఘునందన = శ్రీరామచంద్ర.
భావము:
శ్రీరామచంద్రా! ఆ రాజు లక్షగోవులతో ఆ శునశ్శేఫుని కొనుక్కొని ఆనందముతో వెళ్ళెను.
- ఉపకరణాలు:
అమ్బరీషస్తు రాజర్షీ
రథమారోప్య సత్వరః ।
శునఃశేపం మహాతేజా
జగామాశు మహాయశాః ॥
టీకా:
అమ్బరీషస్తు = అంబరీషుడు; రాజర్షీ = రాజర్షి అయిన; రథం = రథమును; ఆరోప్య = ఎక్కించి; సత్వరః = వెనువెంటనే; శునఃశేఫం = శునశ్శేఫుని; మహాతేజా = మహాతేజస్సు కలిగిన; జగామ = వెళ్ళెను; ఆశు = శీఘ్రముగా; మహాయశాః = మహా యశస్వి.
భావము:
గొప్ప తేజస్సు; యశస్సు కలిగిన అంబరీష రాజర్షి శునశ్శేఫుడిని వెనువెంటనే రథము ఎక్కించుకొని వేగముగా అక్కడనుంచి బయలుదేరెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకషష్టితమః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకషష్టితమః [61] = అరవై ఒకటవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని అరవైయొకటవ [61] సర్గ సంపూర్ణము.