వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥షష్ఠ సర్గః॥ [6 దశరథుని రాజ్యపాలన]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యాం పుర్యా మయోధ్యాయాం
 వేదవిత్ సర్వసంగ్రహః ।
దీర్ఘదర్శీ మహాతేజాః
 పౌర జానపద ప్రియః ॥

టీకా:

తస్యాం = ఆ యొక్క; పుర్యామ్ = పట్టణము; అయోధయాయామ్ = అయోధ్యయందు; వేదవిత్ = వేదములు బాగుగా తెలిసిన వారిని; సర్వః = అందరిని; సంగ్రహః = కూడగట్టుకున్నవాడు; దీర్ఘదర్శీ = భావిపరిణామాలు ముందుగా గుర్తించు వాడు; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కలవాడు; పౌర = పురజనులకు; జానపద = గ్రామస్తులకు; ప్రియః = ఇష్టుడు;

భావము:

ఆ అయోధ్యానగరంలో (వసించే ధశరథ మహారాజు) వేదార్థములను బాగుగా తెలిసినవారిని అందరినీ కూడగట్టుకొనువాడు, బాగా భావిపరిణామాలు ముందుగా గుర్తించు వాడు, గొప్ప తేజశ్శాలి, ఆ నగర పౌరులకు, గ్రామస్తులకు ఇష్టుడు,

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇక్ష్వాకూణా మతిరథో
 యజ్వా ధర్మరతో వశీ ।
మహర్షికల్పో రాజర్షిః
 త్రిషు లోకేషు విశ్రుతః ॥

టీకా:

ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశపు రాజులలో; అతిరథః = అతిరథుడు; యజ్వః = యజ్ఞములు చేయువాడు; ధర్మరతః = ధర్మము నందు నిరతుడు; వశీ = జనులను తన అదుపులో ఉంచుకొనువాడు; మహర్షిః = మహర్షుల; కల్పో = వంటివాడు; రాజర్షిః = రాజర్షి; త్రిషు = మూడు; లోకేషు = లోకములందు; విశ్రుతః = సుప్రసిద్ధుడు,

భావము:

ఇక్ష్వాకువంశజులలో అతిరథుడు, యజ్ఞములను చేయువాడు, ధర్మకార్యముల యందు నిరతుడు, జనులను తన అదుపులో ఉంచుకొనువాడు, మహర్షితుల్యుడు, రాజర్షి, ముల్లోకముల యందును సుప్రసిద్ధుడు,
*గమనిక:-   అతిరథి - అనేక ధన్వి యోద్ధా, పెక్కండ్రు రథికులతో పోరెడు యోథుడు. మహారథి - పదునొకండువేలమంది విలుకాండ్రతో, తన్ను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరెడు యోధుఁడు. సమరథి- ఒకరథికునితో పోరెడు యోధుడు, అర్థరథి- సమరథికన్న తక్కువవాడు, రథి- రథమునెక్కి యుద్దము చేయువాడు.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బలవాన్ నిహతామిత్రో
 మిత్రవాన్ విజితేంద్రియః ।
ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః
 శక్ర వైశ్రవ ణోపమః ॥

టీకా:

బలవాన్ = చతురంగబలాన్వితుడు; హత = సంహరించిన; అమిత్రః = శత్రువులు కలవాడు; మిత్వవాన్ = మంచిమిత్రులు కలవాడు; విజిత = జయించిన; ఇంద్రియాన్ = ఇంద్రియములు కలవాడు; ధనైః = సంపదలను; చ = కూడ; సంగ్రహైః = కూడబెట్టినవాడు; చ =; సైన్యైః = సేనలను; శక్ర = ఇంద్రుడు; వైశ్రవణః = కుబేరులతో; ఉపమః = సరిపోలువాడు.

భావము:

చతురంగ బలములు, శత్రుసంహారములు, మంచి మిత్రులు, ఇంద్రియ జయము కలవాడు, ధనకనక వస్తువాహనముల, సేనల సంగ్రహములో ఇంద్రునితో, కుబేరునితో సమానుడు,

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యథా మనుర్మహాతేజా
 లోకస్య పరిరక్షితా ।
తథా దశరథో రాజా
 వసన్ జగదపాలయత్ ॥

టీకా:

యథా = ఎలాగైతే; మనుః = మనువు; మహాతేజా = మహా తేజోవంతుడు; లోకస్య = సకలలోకములను; పరిరక్షితా = చక్కగా కాపాడునో; తథా = ఆలాగుననే; దశరథో = దశర్థుడు అనెడి; రాజా = రాజు; వసన్ = తన నివాసమైన కోసల రాజ్యమను; జగత్ = లోకమును; అపాలయత్ = పరిపాలించెను.

భావము:

మహాతేజశ్శాలి ఐన మనువు ఎలాగైతే లోకాలను పరిరక్షస్తాడో, అలాగే తన కోసల రాజ్యమును పరిపాలించెను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేన సత్యాభిసంధేన
 త్రివర్గ మనుతిష్ఠతా ।
పాలితా సా పురీ శ్రేష్ఠా
 ఇంద్రేణే వామరావతీ ॥

టీకా:

తేన = అతడు; సత్య = సత్యమునందు; అభిసంధేన = నిబద్దుడు; త్రివర్గః = ధర్మ అర్థ కామము లను మూడు; అనుతిష్ఠతా = ఆచరించువాడు; పాలితా = పరిపాలించును; సా = ఆయొక్క; పురీః = పట్టణమును; శ్రేష్ఠా = ప్రశస్తముగా; ఇంద్రణాః = ఇంద్రుడు; ఏవాన్ = ఏవిధముగా నైతే; = అమరావతీ = అమరావతీని దేవరాజధానిని.

భావము:

సత్యసంధుడును, ధర్మ అర్థ కామములను మూడింటిని ఆచరించువాడును ఐన దశరథుడు ఇంద్రుడు అమరావతిని పాలించునట్లు అయోధ్యను పాలించెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్మిన్ పురవరే హృష్టా
 ధర్మాత్మానో బహుశ్రుతాః ।
నరాస్తుష్టా ధనైః స్వైః స్వైః
 అలుబ్ధాః సత్యవాదినః ॥

టీకా:

తస్మిన్ = ఆయొక్క; పుర = నగరము; వరే = శ్రేష్ఠమైన దాని యందు; హృష్టా = సంతుష్టులు; ధర్మాత్మానో = ధర్మాత్ములు; బహుః = అనేకరకముల; శ్రుతాః = ప్రసిద్ధులు; నరాః = మానవులు; తుష్టాః = తృప్తిచెంది ఉంటారు; ధనైః = సంపాదనలతో; స్వైఃస్వైః = ఆ యా; అలుబ్ధాః = లోభము లేనివారు; సత్యవాదినః = సత్యమును మాత్రమే మాట్లాడు వారు.

భావము:

శ్రేష్ఠమైన ఆ అయోధ్యానగరమునందలి జనులు సంతోషముగా జీవించుచుండిరి. వారు ధర్మాత్ములు. అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు. తాము కష్టపడి సంపాదించిన ధనముతోడనే తృప్తిగా ఉండువారు, లోభగుణము లేనివారు, సత్యమును పలికెడువారు.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాల్పసన్నిచయః కశ్చిత్
 ఆసీత్తస్మిన్ పురోత్తమే ।
కుటుమ్బీ యో హ్యసిద్ధార్థః -
 గవాశ్వ ధనధాన్యవాన్ ॥

టీకా:

న = లేరు; అల్ప = తక్కువ; సత్ = బాగా; నిచయః = సంపాదించిన వారు; కశ్చిత్ = ఏ ఒక్కరును; నాసీత్ = లేరు; తస్మిన్ = ఆయొక్క; పుర = నగరము; ఉత్తమే = శ్రేష్ఠమైన దాని యందలి; కుటుమ్బీ = గృహస్తులు; యః = ఎవరునూ; అసిద్ధ = స్వచ్ఛము కాని; అర్థః = సంపదలు గలవారు; అ = వ్యతిరేకార్ఠం; గవావాన్ = గోవులు గలవారు; అశ్వలాన్ = గుఱ్ఱములు కలవారు; ధనధాన్యవాన్ = ధనధాన్యములు కలవారు.

భావము:

ఆ మహానగరమునందలి గృహస్థులలో ప్రతి ఒక్కరును (1) సంపన్నులే, తమ సంపదలను ధర్మకార్యములకును, ధర్మబద్ధముగా అర్థ, కామపురుషార్థములను సాధించుటకును వినియోగించెడి వారే; గోవులు, అశ్వములు, ధనధాన్య సమృద్ధియు గలవారే.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కామీ వా న కదర్యో వా
 నృశంసః పురుషః క్వచిత్ ।
ద్రష్టుం శక్య మయోధ్యాయాం
 నావిద్వాన్న చ నాస్తికః ॥"

టీకా:

కామీ = కాముకుడు; వా = కానీ; న = లేరు; కదర్యః = కక్కుర్తి కృపణ = ఏతరి పిసినిగొట్టు పీనుగు; వా = కాని; నృశంసః = క్రూరుడు; పురుష = పురుషులు; క్వచిత్ = ఎక్కడనూ; ద్రష్టుం = చూడగలుగుట; శక్యం = సాధ్యం; అయోధ్యాయామ్ = అయోధ్యలో; న = కాదు; అవిద్వాన్ = పండితుడు కానివాడు; చ = మఱియు; నాసికః = నాస్తికుడు.

భావము:

ఆ పురము నందలి జనులలో కామాతురుడుగాని, పిసిని గొట్టువాడు గాని, క్రూరుడుగాని, విద్యా హీనుడుగాని, నాస్తికుడు గాని ఎంతగా వెదికినను కానరాడు.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సర్వే నరాశ్చ నార్యశ్చ
 ధర్మశీలాః సుసంయతాః ।
ఉదితాః శీలవృత్తాభ్యాం
 మహర్షయ ఇవామలాః ॥

టీకా:

సర్వే = అందరు; నరః = పురుషులు; చ =; నారీః = స్త్రీలు; చ =; ధర్మశీలాః = ధర్మబద్దమైన శీలము గలవారు; సుసంయుతాః = చక్కటి ఇంద్రియ నిగ్రహము కలవారు; ఉదితాః = చెప్పదగ్గ; శీల = మంచిస్వభావముతో; వృత్తాభ్యామ్ = మెలిగెడి వారు; మహర్షయా = మహర్షుల; ఇవ = వలె; అమలాః = నిర్మలమైనవారు;

భావము:

అయోధ్య యందలి స్త్రీ పురుషులు ధర్మవర్తనులు, ఇంద్రియనిగ్రహులు, సత్స్వభావులు, చెప్పుకోదగ్గ సచ్ఛీలులు, మహర్షులవలె నిర్మలహృదయులు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాకుండలీ నామకుటీ
 నాస్రగ్వీ నాల్పభోగవాన్ ।
నామృష్టో నానులిప్తాంగో
 నాసుగంధశ్చ విద్యతే ॥

టీకా:

న = లేరు; అకుండలీ = కర్ణకుడలములు / లోలకులు ధరించనివారు; న = కానివారు; అమకుటీ = కిరీటము ధరించనివారు; న = లేరు; అస్రగ్వీ = పూలమాలలు ధరించనివారు; న = లేరు; అల్ప = తక్కువ; భోగవాన్ = భోగములు కలవారు; న = లేరు; అమృష్టః = శుభ్రంగా ఉండనివారు; న = లేరు; అనులిప్తాంగః = ఛందనాదులు అలదుకొననివారు; న = లేరు; అసుగంధః = కస్తూరీ మున్నగు సుగంధములు ధరించనివారు; చ = మాత్రమే; విద్యతే = కనబడతారు.

భావము:

ఆ అయోధ్యలో కర్ణకుండల (లోలకులు) ధారులు, కిరీటధారులు, మహా భోగులు, పరిశుభ్రంగా ఉండువారు, చందనాదికములను అలదుకొనువారు, కస్తూరీ మున్నగు సుగంధములు ధరించువారు మాత్రమే కనబడతారు.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నామృష్టభోజీ నాదాతా
 నాప్యనంగద నిష్కధృక్ ।
నాహస్తాభరణో వాపి
 దృశ్యతే నాప్యనాత్మవాన్ ॥

టీకా:

నా = లేరు; అమృష్ట భోజి = కడుపునిండా శుబ్రమైన తిండిలేనివారు; న = లేరు; అదాతా = దాత కానివారు; న = లేరు; అపి = నిశ్చయంగా; అన = లేనివారు; అంగద = భుజకీర్తులు, వంకీలు వంటి భుజమున ధరించు భూషణములు; నిష్క = మాడలతో కాసులపేరు వంటి కంఠాభరణములు; ధృక్ = ధరించుట; న = లేరు; అహస్తాభరణః = చేతులకు ధరించు గాజులు, కంకణములు, ఉంగరముల వంటివి ధరించని వారు; వా = అలాగే; అపి = నిశ్చయంగా; దృశ్యతే = కనబడుట; న = జరగదు; అనాత్మవాన్ = జితేంద్రియుడు కానివాడు.

భావము:

ఆ అయోధ్య యందు కడుపునిండా తినడానికి లేనివారు కాని. దానబుద్ధి లేనివారు కాని. భుజాలకు భుజకీర్తులు, కంఠానికి కాసుల పేర్లు, చేతులకు కంకణములను, ఉంగరములను వంటి సకలాభరణాలు ధరించనివారు కాని, అంతఃకరణ శుద్ధి లేనివారు కాని చూద్దామన్నా కనబడరు.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నానాహితాగ్నిః నాయజ్వా
 న క్షుద్రో వా న తస్కరః ।
కశ్చిదాసీ దయోధ్యాయాం
 న చ నిర్వృత్తసంకరః ॥

టీకా:

న = లేరు; నహితాగ్ని = అగ్నిచయనము చేయనివారు; నయజ్వా = యాగము చేయనివారు; న = లేరు; క్షుద్రః = నీచులు; న = లేరు; తస్కరః = దొంగలు; కశ్చిత్ = ఒక్కడు కూడా; న+ఆసీత్ = లేకుండెను; అయోధ్యాయామ్ = అయోధ్య యందు; న = లేరు; చ; నిర్వృత్తసంకరః = నిర్వృత్త (నెఱవేరిన)+సంకరః, వర్ణసంకరులు.

భావము:

ఆ అయోధ్యానగరమునందు అగ్నికార్యములను చేయని వారుగాని, యాగము చేయని వారుగాని, నీచులు గాని, దొంగలు కాని. వర్ణసంకరులు అచట లేనేలేరు.
*గమనిక:-  *- అహితాగ్ని , అగ్నిచయనము- అగ్నిని మంత్రపూర్వకముగ నిలుపుట.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వకర్మనిరతా నిత్యం
 బ్రాహ్మణా విజితేంద్రియాః ।
దానాధ్యయన శీలాశ్చ
 సంయతాశ్చ ప్రతిగ్రహే ॥

టీకా:

స్వ = తనయొక్క; కర్మ = ధర్మమునందు; నిరత = లగ్నమైన వారు; బ్రాహ్మణా = బ్రాహ్మణులు; విజితేంద్రియాః = ఇంద్రియనిగ్రహము కలవారు; దాన = దానము చేయు; అధ్యయన = వేదాధ్యయనము చేయు; శీలాః = స్వభావము కలవారు; చ = ఇంకా; సంయతాః = నియమము కలవారు; పరిగ్రహే = దానము స్వీకరించుట యందు.

భావము:

అయోధ్యయందలి బ్రాహ్మణులు సర్వదా విధ్యుక్తములైన స్వధర్మలయందు నిరతులు, ఇంద్రియములను జయించినవారు, దానశీలురు, వేదాధ్యయనము చేసెడి స్వభావముగల వారు, అపరిగ్రహులు.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న నాస్తికో నానృతకో
 న కశ్చి దబహుశ్రుతః ।
నాసూయకో న వాశక్తో
 నావిద్వాన్ విద్యతే తదా ॥

టీకా:

న = లేరు; నాస్తికః = నాస్తికులు; న = లేరు; అనృతకః = అబద్దాలాడు వారు; న = లేడు; కశ్చిత్ = ఒక్కడుకూడా; అబహుశృత = ఎక్కువ చదువుకోనివారు; న = లేరు; అసూయకః = అసూయాపరులు; న = లేరు; వ = కూడా; అశక్తః = శక్తిహీనులు; న = జరగదు; అవిద్వాన్ = పండితులు కానివారు; విద్యతః = కనబడుట; తదా = అక్కడ;

భావము:

దశరథునిపరిపాలనకాలమునందు నాస్తికులు గాని, అసత్యవాదులుగాని, అనేక శాస్త్రములను అభ్యసింపనివారుగాని మఱియు అసూయాపరులుగాని ఒక్కడు కూడా లేరు. పండితులు కాని వారైతే కనబడను కూడా కనబడరు.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాషడంగ విదత్రాసీత్
 నావ్రతో నాసహస్రదః ।
న దీనః క్షిప్తచిత్తో వా
 వ్యథితో వాపి కశ్చన ॥

టీకా:

న = ఉండదు; షఢంంగ = వేదాంగములు ఆరు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము; అవిదథ్ = తెలియనివారు; ఆసీత్ = ఉండుట; న = లేరు; అవ్రతో = చాంద్రాయణాది వ్రతములు చేయనివారు; న = లేరు; అసహస్రదః = వేలకొలది దానములు చేయనివారు; న = లేరు; దీనః = దీనులూ; క్షిప్రచిత్తః = వ్యాకుల మనసు కలవారూ; వా = కాని; వ్యథితః = బాధాతప్తులూ; వా = కాని; అపి = ఇంక; కశ్చన = ఎవరూవారు.

భావము:

ఆ నగరమున వేదాంగములు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము ఆరు తెలియనివాడు గాని, వ్రతములను ఆచరింపనివాడుగాని లేడు. వేలకొలది ద్రవ్యములను దానము చేయనివాడుగాని, దీనుడుగాని, వ్యాకులచిత్తుడుగాని, బాధాతప్తులు కాని ఇంకా అలాంటి వారెవరూకూడ లేరు.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కశ్చిన్నరో వా నారీ వా
 నాశ్రీమాన్ నాప్యరూపవాన్ ।
ద్రష్టుం శక్య మయోధ్యాయా
 నాపి రాజన్యభక్తిమాన్ ॥

టీకా:

కశ్చిన = అందరు; నరః = పురుషులు; వా = కాని; నారీ = స్త్రీలు; వా = కాని; న = లేరు; అశ్రీమాన్ = సంపదహీనులు; అపి = మఱియు; అరూపవాన్ = సౌందర్యవిహీనులు; ద్రష్టుం = కనుగొనుట; శక్యమ్ = సాధ్యము; అయోధ్యాయామ్ = అయోధ్యానగరంలో; న = కాదు; అపి = అంతేకాకుండా; రాజని = రాజు యందు; అభక్తిమాన్ = భక్తిలేనివారు;

భావము:

అచటి స్త్రీలలో కాని పురుషులలో కాని ఐశ్వర్యహీనులు కానీ, సౌందర్యహీనులు కాని, రాజభక్తివిహీనులు గాని మచ్చుకైనను కనబడరు.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర్ణేష్వగ్ర్య చతుర్థేషు
 దేవతాతిథి పూజకాః ।
కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ
 శూరా విక్రమసంయుతాః ॥

టీకా:

వర్ణేషు = వర్ణస్తులు; అగ్ర్యః = ముఖ్యంగా; చతుర్దేషు = నలుగురునూ; దేవతా = దేవతలను; అతిథి = అతిథులును; పూజకాః = పూజించువారు; కృతజ్ఞాః = చేసినమేలుమరువనివారు; వదాన్యాః = దాతలు; చ = ఇంకా; శూరాః = పండితులు; విక్రమ = పరాక్రమము; సంయుతాః = కలవారు;

భావము:

ఆ నగరమునందలి చాతుర్వర్ణములవారు దేవతలను, అతిథులను పూజించువారే. వారు చేసిన మేలు మఱువనివారు, దానములను చేసెడివారు, శూరులు, పరాక్రమవంతులు.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీర్ఘాయుషో నరాః సర్వే
 ధర్మం సత్యం చ సంశ్రితాః ।
సహితాః పుత్రపౌత్రైశ్చ
 నిత్యం స్త్రీభిః పురోత్తమే ॥

టీకా:

దీర్ఘాయుషో = దీర్ఘాయుష్మంతులు; నరాః = మానవులు; సర్వే = అందరు; ధర్మం = ధర్మమును; సత్యం = సత్యమును; సంశ్రితాః = లేరు; సహితాః = కలిగిఉన్న; పుత్రపౌత్రః = పుత్రపౌత్రులు కలవారు; చ; నిత్యం = ఎల్లప్పుడు; స్త్రీభిః = స్త్రీలు కూడా; పురః = నగరములలో; ఉత్తమే = శ్రేష్టమైనది, అయోధ్య;

భావము:

అయోధ్యాపురిలోని పురుషులు, స్త్రీలు అందరు నిత్యం దీర్ఘాయుష్మంతులు, ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించి ఉండువారు. పుత్రపౌత్రులు కలవారు.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షత్రం బ్రహ్మముఖం చాసీత్
 వైశ్యాః క్షత్రమనువ్రతాః ।
శూద్రాః స్వధర్మనిరతాః
 త్రీన్వర్ణా నుపచారిణః ॥

టీకా:

క్షత్రం = క్షత్రియులు; బ్రహ్మ = బ్రాహ్మణులను; ముఖం = అనుసరించుచు; చ; ఆసీత్ = ఉందురు; వైశ్యాః = వైశ్యులు; క్షత్రం = క్షత్రియులను; అనువ్రతాః = అనుసరించువారు; శూద్రాః = శూద్రులు; స్వధర్మ = వారి ధర్మమునందు, స్వీయ వృత్తి ధర్మములు; నిరతాః = లగ్నమై ఉండువారు; త్రీన్ = మూడు; వర్ణాః = వర్ణములను వారిని; ఉపచారిణః = సేవించుచుండిరి;

భావము:

క్షత్రియులు బ్రాహ్మణులయెడ గౌరవముగలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు, వైశ్యులు క్షత్రియుల గౌరవిము కలిగి తమ వ్యవసాయ వ్యాపారాలు చేసుకొనెడివారు, శూద్రులు తమతమ వృత్తి ధర్మముల నాచరించుచు ఈ మూడు వర్ణములవారిని సేవించుచుండెడివారు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సా తేనేక్ష్వాకునాథేన
 పురీ సుపరిరక్షితా ।
యథా పురస్తాన్మనునా
 మానవేంద్రేణ ధీమతా ॥

టీకా:

సా = ఆయొక్క; తేన = అతను; ఇక్ష్వాకేనా = ఇక్ష్వాకు వంశపు; నాధేన = మహారాజు; పూరీ = పట్టణం అయోధ్యను; సు = చక్కగా; పరిరక్షితా = పరిపాలించెను; యథా = ఎలాగంటే అలా; పురాః = పూర్వకాలంలో; తాన్ = తను; మనునా = మనువుచేత వలె; మానవేంద్రణ = మానవులకు ప్రభువు; ధీమతా = ప్రతిభామూర్తి.

భావము:

ఇక్ష్వాకువంశజుడైన దశరథమహారాజు ఆ అయోధ్యా నగరమును పూర్వము ప్రతిభామూర్తియు, మానవేంద్రుడును ఐన మనువువలె చక్కగా రక్షించుచుండెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోధానా మగ్నికల్పానాం
 పేశలానా మమర్షిణామ్ ।
సంపూర్ణా కృతవిద్యానాం
 గుహా కేసరిణామివ ॥

టీకా:

యోధానామ్ = యోధులు అందరూ; అగ్నికల్పానామ్ = అగ్ని దేవుని సమానులు; పేశలానామ్ = శరీరము దాచుకోని బంట్లు; అమర్షిణామ్ = రోషము కలవారు; సమపూర్ణా = నిండి ఉంది; కృత = నేర్చిన; విద్యానామ్ = విద్యలు కలవారు; గుహా = గుహయందలి; కేసరిణామ్ = సింహాల; ఇవ = వలె.

భావము:

అగ్నిదేవతుల్యులు, శరీరము దాచుకోకుండా పరాక్రమం చూపే వారు. పౌరుషవంతులు, విద్యలు నేర్చినవారు, అయినట్టి యోధులచే నిండి, ఆ నగరము సింహములతో నిండిన గుహవలె దుర్భేద్యమై యుండెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామ్భోజవిషయే జాతైః
 బాహ్లీకైశ్చ హయోత్తమైః ।
వనాయుజై ర్నదీజైశ్చ
 పూర్ణా హరిహయోత్తమైః ॥

టీకా:

కామ్భోజ = కాంభోజ; విషయే = దేశానికి చెందిన; జాతై = జాతికి చెందినవి; బాహ్లీకైః = బాహ్లీక దేశపు; చ; హయః = అశ్వములు; ఉత్తమై = ఉత్తమమైనవి; వనాయు = పారశీక దేశమున; జైః = పుట్టినవి; చ = ఇంకా; నదీః = సింధుదేశమున; జై = పుట్టినవి; పూర్ణా = నిండి ఉండెను; హరి = ఇంద్రుని; హయ = గుఱ్ఱము ఉచ్ఛైశ్రవము వలె; ఉత్తమై = ఉత్తమమైనవి.

భావము:

ఉచ్ఛైశ్రవము వలె ఉత్తమైనవి అయిన కాంభోజ, బాహ్లిక, పారశీక, సింధూ దేశములలో పుట్టిన జాతులకు చెందిన ఉత్తమాశ్వాశములు ఆ అయోధ్య నిండా తిరుగుచు ఉండెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వింధ్యపర్వతజై ర్మత్తైః
 పూర్ణా హైమవతైరపి ।
మదాన్వితై రతిబలైః
 మాతంగైః పర్వతోపమైః ॥

టీకా:

వింధ్యపర్వత = వింధ్యపర్వతప్రాంతమున; జైః = పుట్టినవి; మత్తైః = మదించినవి; పూర్ణా = నిండి ఉండెను; హైమవతైః = హిమాలయ పర్వతాలలో పుట్టినవి; అపి = ఇంకా; మద = మదముతో; ఆన్వితైః = కూడి ఉన్నవి; అతి = మిక్కిలి; బలైః = బలముకలవి; మాతంగైః = ఏనుగులు; పర్వతోపమైః = పర్వతముల వంటివి;

భావము:

వింధ్యపర్వతములలో పుట్టిన మదపుటేనుగులు, హిమాలయాలలో జన్మించిన మహాగజములు, బాగా బలిష్ఠమైని, మిక్కిలి మదించి, పర్వతముల వలెనున్న మాతంగములు అయోధ్య నిండా ఉండెను,

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఐరావత కులీనైశ్చ
 మహాపద్మ కులైస్తథా ।
అంజనాదపి నిష్పన్నైః
 వామనాదపి చ ద్విపైః ॥

టీకా:

ఐరావత = తూర్పు దిగ్గజమైన ఐరావతము యొక్క; కులీనైః = వంశానికి చెందినవి; చ = ఇంకా; మహాపద్మ = ఈశాన్య దిగ్గజమైన పుడరీకము యొక్క; కులైః = కులమున వుట్టినవి; తథా = మఱియును; అంజనాత్ = పడమర దిగ్గజమైన అంజనావతి నుండి; నిష్పన్నైః = ఉద్భవించినవి; వామనాత్ = దక్షిణ దిగ్గజమైన వామనము నుండి; అపి = అట్టిది; చ = కూడా; ద్విపైః = ఏనుగులు {ద్విప - నీటిని రెండుసార్లు త్రాగునది, ఏనుగు}

భావము:

ఇంద్రుని గజమూ తూర్పు దిగ్గజమూ నైన ఐరావత వంశమున జన్మించి నట్టివియు, అగ్నిదేవుని గజమూ, ఆగ్నేయ దిగ్గజమూ నైన పుండరీకమను పేరుగల మహాపద్మజాతికి చెందినవియు, వరుణ దిగ్గజమూ పడమర దిగ్గజమూ నైన అంజనవతి జాతికి చెందినవియు, యముని గజమూ దక్షిణ దిగ్గజమూ నైన వామనము జాతిలో ఉద్భవించినవియు అగు అనేక గజములు ఆ పురము నిండా ఉండెను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భద్రైః మంద్రైర్మృగైశ్చైవ
 భద్రమంద్రమృగై స్తథా ।
భద్రమంద్రైః భద్రమృగైః
 మృగమంద్రైశ్చ సా పురీ ।
నిత్యమత్తైః సదా పూర్ణా
 నాగై రచలసన్నిభైః ॥

టీకా:

భద్రైః = భద్రమను జాతి గజము; మంద్రైః = మంద్రమను గజము; మృగైః = మృగమనుగజము; చ; ఇవ = ఇంకా; భద్రమంద్రమృగైః = భద్రమంద్రమృగము; తథా = అలాగే; భద్రమంద్రైః = భద్రమంద్రము; భద్రమృగైః = భద్రమృగము; మృగమంద్రైః = మృగమంద్రము; చ; సా = ఆ యొక్క; పురీ = అయోధ్య నగరములో; నిత్యమత్తైః = నిత్యము మదించి ఉండునవి; సదా = ఎల్లప్పుడు; పూర్ణా = నిండియుండును; నాగః = ఏనుగులు / గజములు; అచల = పర్వతములతో; సన్నిభైః = సదృశమైనవి.

భావము:

ఆ యొక్క అయోధ్య నగరము నిండా భద్ర జాతిగజము; మంద్ర జాతిగజము; మృగ జాతిగజము; భద్రమంద్రమృగము; భద్రమంద్రము; భద్రమృగము; మృగమంద్రము వంటి సకల జాతుల ఏనుగులు పర్వతములతో సదృశమైనవి నిత్యము మదించి ఉండును.
*గమనిక:-   చతుర్విధ గజములు- (అ) 1. భద్రములు, రాజు ఎక్కుటకు, ఉత్సవములకు యోగ్యము, 2. మంద(ద్ర) ములు, యుద్దమున వాడుటకు యోగ్యము, 3. మృగములు అడవిలో తిరుగునవి, 4. మిశ్రమములు. (ఆ) దమ్యములు (శిక్షణను పొందుచున్నట్టివి), 2. సాన్నాహ్యములు (యుద్ధమునందుపయోగింపబడునవి), 3. ఔపవాహ్యమలు (స్వారికి ఉపయోగింపబడునవి), 4. వ్యాలములు (క్రూరస్వభావము గలవి). (కౌటిలీయార్థశాస్త్రము)

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సా యోజనే చ ద్వే భూయః
 సత్యనామా ప్రకాశతే ।
యస్యాం దశరథో రాజా
 వసన్ జగదపాలయత్ ॥

టీకా:

సా = అది; యోజనః = యోజనములు; ద్వే = రెండు; భూయః = వ్యాపించి ఉండును; సత్యనామః = తగిన పేరుతో, సార్థకమైన నామముతో, (యోద్ధుం అశక్యా, జయించుటకు సాధ్యముగానిది, అయోధ్య); ప్రకాశతే = మిక్కిలి ప్రసిద్ధమైనది; యస్యాం = దానిలో; దశరథః = దశరథు డను; రాజా = రాజు; వసన్ = నివసిస్తూ; జగత్ = రాజ్యమును; ఆపాలయత్ = పరిపాలించెను;

భావము:

ఆ నగరము రెండుయోజనముల మేరకు వ్యాపించియుండెను. సార్థకనామధేయము గల ఆ అయోధ్యలో (యోద్ధుం అశక్యా అయోధ్యాః, జయించుటకు సాధ్యముగానిది అయోధ్య) నివసిస్తూ దశరథమహారాజు తన కోసల దేశమును పరిపాలించుచుండెను.
*గమనిక:-  *- యోజనము - రకరకములుగా చెప్తారు ఉదా. 1) 4 క్రోసుల దూరము, 2) ఆమడ, 3) సుమారు 8/9/10 మైళ్ళు. ప్రాంతీయ బేధములతో అటుల ఉండి ఉండవచ్చును.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాం పురీం స మహాతేజా
 రాజా దశరథో మహాన్ ।
శశాస శమితామిత్రో
 నక్షత్రాణీవ చంద్రమాః ॥

టీకా:

తాం = ఆ; పురీం = ఆ నగరమును; స = కలిగిన; మహా = గొప్ప; తేజా = తేజశ్శాలి ఐన; రాజా = రాజు; దశరథః = దశరథుడు; మహాన్ = గొప్పవాడు; శశాస = పరిపాలించెను; శమిత = శాంతింపజేసిన; అమితః = శత్రువులు కలవాడు; నక్షత్రాణి = నక్షత్రములను; ఇవ = వలె; చంద్రమాః = చందమామ.

భావము:

మహాతేజశ్శాలి ఐన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములనువలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను.

1-28-జగతి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాం సత్యనామాం దృఢతోరణార్గలాం
 గృహైర్విచిత్రై రుపశోభితాం శివామ్ ।
పురీ మయోధ్యాం నృసహస్ర సంకులాం
 శశాస వై శక్రసమో మహీపతిః ॥

టీకా:

తాః = ఆయొక్క; సత్యనామాం = సార్థక నామధేయము కలది {అయోధ్య అనగా యుద్దముచేయ పోరానిది, యోద్ధాం అశక్తః, అను అర్థమునకు తగినది అయోధ్యానగరము}; దృఢ = దృఢమైన, బలమైన; తోరణ = తోరణములు; అర్గళాం = తలుపుల అడ్డగడియలు; గృహైః = ఇళ్ళు; విచిత్ర = చిత్రములు రచించిన గోడలతో; ఉపశోభితాం = ప్రాశించుచుండెను; శివామ్ = మంగళప్రద మైనది; పురీం = ఆ నగరము; అయోధ్యాం = అయోధ్య; నృ = నరులు, ప్రజలు; సహస్ర = వేలకొలది; సంకులం = సమ్మర్ధమైనది; శశాస = పరిపాలించెను; వై ; శక్రసమో = ఇంద్రునితో సాటివచ్చువాడు; మహీపతిః = మహారాజు దశరథుడు.

భావము:

దేవేంద్రుని వంటి మహారాజు దశరథుడు పాలించెడి పుట్టడింప శక్యము కాని ఆ అయోధ్య, సార్థకనామధేయము కలది. దృఢమైన తోరణములు, తలుపులకు అడ్డగడియలు కల ఇళ్ళతో, వేల సంఖ్యలో జనసమ్మర్ధమై, కళకళలాడుతూ అద్భుతముగా శోభిల్లుతూ ఉన్నది.

1-29-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 షష్ఠః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్ష సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షష్ఠ [6] = ఆరవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [6] ఆరవ సర్గ సుసంపూర్ణము..