బాలకాండమ్ : ॥సప్తపంచాశః సర్గః॥ [57 - విశ్వామిత్రుడు రాజర్షగుట]
- ఉపకరణాలు:
తతః సంతప్తహృదయః
స్మరన్ నిగ్రహమాత్మనః ।
వినిఃశ్వస్య వినిఃశ్వస్య
కృతవైరో మహాత్మనా ॥
టీకా:
తతః = అటు పిమ్మట; సంతప్త = పరితపించుచున్న; హృదయః = మనసు కలవాడై; స్మరన్ = గుర్తు చేసుకొనుచు; నిగ్రహం = నిగ్రహింపబడిన వైనము; ఆత్మనః = తన యొక్క; వినిఃశ్వస్య = నిట్టూర్చుచు; వినిఃశ్వస్య = నిట్టూర్చుచు; కృత = పెట్టుకున్న; వైరః = వైరముగలవాడు; మహాత్మనా = మహాత్మునితో.
భావము:
అటుపిమ్మట, తనకు జరిగిన పరాజయమును తలచుకుని మనసులో మిక్కిలి పరితపించసాగెను. మహాత్ముడైన వసిష్ఠమహర్షితో వైరము పెట్టుకొనిన విశ్వామిత్రుడు పదే పదే నిట్టూర్చుచు చుండెను.
- ఉపకరణాలు:
స దక్షిణాం దిశం గత్వా
మహిష్యా సహ రాఘవ!।
తతాప పరమం ఘోరమ్
విశ్వామిత్రో మహత్తపః।
ఫల మూలాశనో దాంతైః
చకార సుమహత్తపః॥
టీకా:
సః = అతడు; దక్షిణాం = దక్షిణ; దిశం = దిశగా; గత్వా = వెళ్ళి; మహిష్యా = జ్యేష్ఠ భార్యతో; సహ = కూడి; రాఘవ! = ఓ శ్రీరామచంద్ర; తతాప = చేసెను; పరమం = మిక్కిలి; ఘోరమ్ = ఘోరమైన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహత్తపః = గొప్ప తపస్సును; ఫలమూల = ఫలములు, కందమూలములు; అశనః = తినుచున్నవాడై; దాంతైః = ఇంద్రియ నిగ్రహముతో; చకార = చేసెను; సు = చాల; మహత్ = గొప్ప; తపః = తపస్సు.
భావము:
విశ్వామిత్రుడు తన పట్టమహిషిని తీసుకుని దక్షిన దిశగా ప్రయాణించి ఫలములు కంద మూలములు ఆహారముగా స్వీకరిస్తూ, ఇంద్రియ నిగ్రహముతో చాల గొప్ప తపస్సును ఆచరించెను
- ఉపకరణాలు:
అథాస్య జజ్ఞిరే పుత్రాః
సత్యధర్మపరాయణాః।
హవిష్యందో మధుష్యందో
దృఢనేత్రో మహారథః ॥
టీకా:
అథ = అటు పిమ్మట; అస్య = అతనికి; జజ్ఞిరే = జన్మించిరి; పుత్రాః = కుమారులు; సత్య = సత్యమునందు; ధర్మ = ధర్మమునందు; పరాయణాః = అనురక్తి కలిగినవారు; హవిష్యందః = హవిష్యందుడు; మధుష్యందః = మధుష్యందుడు; దృఢనేత్రః = దృడనేత్రుడు; మహారథః = మహారథుడు.
భావము:
పిమ్మట వారికి సత్య ధర్మ పరాయణులైన హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను నలుగురు కుమారులు కలిగిరి.
- ఉపకరణాలు:
పూర్ణే వర్షసహస్రే తు
బ్రహ్మా లోకపితామహః ।
అబ్రవీన్మధురం వాక్యమ్
విశ్వామిత్రం తపోధనమ్ ॥
టీకా:
పూర్ణే = పూర్తి; వర్ష = సంవత్సరములు; సహస్రః = వెయ్యి; తు; బ్రహ్మా = బ్రహ్మదేవుడు; లోక = లోకములన్నిటికి; పితామహః = పితామహుడు; అబ్రవీత్ = పలికెను; మధురం = మధురమైన; వాక్యమ్ = వాక్యములను; విశ్వామిత్రం = విశ్వామిత్రునితో; తపోధనమ్ = తపస్సు అనే ధనము కలిగిన.
భావము:
వేయి సంవత్సరములు ఘోరతపస్సును ఆచరించిన పిమ్మట లోకములన్నిటికి పితామహుడు అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వామిత్రునితో మధురముగా ఇట్లు నుడివెను.
- ఉపకరణాలు:
జితా రాజర్షిలోకాస్తే
తపసా కుశికాత్మజ ।
అనేన తపసా త్వాం తు
రాజర్షిరితి విద్మహే"॥
టీకా:
జితాః = జితపడినవాడవు, స్థిరపడినవాడవు; రాజర్షి = రాజర్షుల; లోకాః = , జనములు (వావిళ్ళవారి నిఘంటువు) అందు; తే = నీయొక్క; తపసా = తపస్సుచేత; కుశికాత్మజ = విశ్వామిత్రా!; అనేన = ఈ; తపసా = తపస్సుచేత; త్వాం తు = నిన్ను; రాజర్షిః = రాజర్షి; ఇతి = అని; విద్మహే = గుర్తించుచున్నాను.
భావము:
ఓ కుశికనందనా ! విశ్వామిత్రా! నీయొక్క తపశ్శక్తిచే రాజర్షులు సమాజములో స్థిరపడితివి. ఈ తపస్సుచే నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను.
- ఉపకరణాలు:
ఏవముక్త్వా మహాతేజా
జగామ సహ దైవతైః ।
త్రివిష్టపం బ్రహ్మలోకమ్
లోకానాం పరమేశ్వరః॥
టీకా:
ఏవం = ఈ విధముగా; ఉక్త్వా = పలికిన పిదప; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కలిగిన; జగామ = వెళ్ళెను; సహ = కూడి; దైవతైః = దేవతలతో; త్రివిష్టపం = వేల్పుల లోకమునకు; బ్రహ్మలోకమ్ = బ్రహ్మ లోకమునకు; లోకానాం = లోకములకు; పరమేశ్వరః = ప్రభువు అయిన.
భావము:
సృష్టికర్త అయిన బ్రహ్మ, ఈ విధముగ పలికిన పిమ్మట తన బ్రహ్మలోకమున కేగెను. దేవతలు వారి స్వర్గధామములకు వెళ్ళిరి.
- ఉపకరణాలు:
విశ్వామిత్రోఽ పి తచ్ఛ్రుత్వా
హ్రియా కించిదవాంముఖః।
దుఃఖేన మహతావిష్టః
సమన్యు రిదమబ్రవీత్॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడ; తత్ = ఆ వచనములను; శ్రుత్వా = విని; హ్రియా = సిగ్గుతో; కిఞ్చిత్ = కొంచెము; అవాఙ్ముఖః = వంచిన తల కలవాడై; దుఃఖేన = దుఃఖముతో; మహతా = గొప్ప; ఆవిష్టః = ఆవేశించబడినవాడై; సమన్యుః = కోపముతో; ఇదం = ఇట్లు; అబ్రవీత్ = పలికెను.
భావము:
ఆ సృష్టికర్త వచనములు విన్న విశ్వామిత్రుడు సిగ్గుతో తలవంచుకొని మిక్కిలి దుఃఖమునకులోనై కోపముతో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
స దక్షిణాం దిశం గత్వా
మహిష్యా సహ రాఘవ!।
తతాప పరమం ఘోరమ్
విశ్వామిత్రో మహత్తపః।
ఫల మూలాశనో దాంతైః
చకార సుమహత్తపః॥
టీకా:
సః = అతడు; దక్షిణాం = దక్షిణ; దిశం = దిశగా; గత్వా = వెళ్ళి; మహిష్యా = జ్యేష్ఠ భార్యతో; సహ = కూడి; రాఘవ! = ఓ శ్రీరామచంద్ర; తతాప = చేసెను; పరమం = మిక్కిలి; ఘోరమ్ = ఘోరమైన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహత్తపః = గొప్ప తపస్సును; ఫలమూల = ఫలములు, కందమూలములు; అశనః = తినుచున్నవాడై; దాంతైః = ఇంద్రియ నిగ్రహముతో; చకార = చేసెను; సు = చాల; మహత్ = గొప్ప; తపః = తపస్సు.
భావము:
విశ్వామిత్రుడు తన పట్టమహిషిని తీసుకుని దక్షిన దిశగా ప్రయాణించి ఫలములు కంద మూలములు ఆహారముగా స్వీకరిస్తూ, ఇంద్రియ నిగ్రహముతో చాల గొప్ప తపస్సును ఆచరించెను
- ఉపకరణాలు:
ఏవం నిశ్చిత్య మనసా
భూయ ఏవ మహాతపాః"।
తపశ్చకార కాకుత్స్థ!
పరమం పరమాత్మవాన్॥
టీకా:
ఏవం = ఇలా; నిశ్చిత్య = నిశ్చయించుకొని; మనసా = మనస్సులో; భూయ = మఱల; ఏవ = మాత్రమే; మహాతపాః = గొప్ప తపస్సు చేసినవాడు।; తపః = తపస్సు; చకార = చేసెను; కాకుత్స్థ = శ్రీరామచంద్ర; పరమం = గొప్ప; పరమాత్మవాన్ = విశిష్ఠ బుద్ధి కలిగిన॥
భావము:
శ్రీరామచంద్ర! మహాతపస్వియును, మఱియు విశిష్ఠమైన బుద్ధి శాలి ఐన విశ్వామిత్రుడు ఈ విధముగా మనస్సులో అనుకొని మఱల తీవ్రతపస్సును చేయనారంభించెను
- ఉపకరణాలు:
ఏతస్మిన్నేవ కాలే తు
సత్యవాదీ జితేంద్రియః ।
త్రిశంకురితి విఖ్యాత
ఇక్ష్వాకు కులవర్ధనః॥
టీకా:
ఏతస్మిన్నేవ = ఇదే; కాలే = కాలమందు; తు; సత్యవాదీ = సత్యవాదియును; జితేంద్రియః = ఇంద్రియములను నిగ్రహించినవాడు అయిన; త్రిశంఖు = త్రిశంకుడు; ఇతి = అను; విఖ్యాత = ప్రసిద్ధిపొందిన; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుల; కుల = వంశమును; వర్ధనః = వృద్ధికి కారణుడు.
భావము:
ఇదే కాలమందు ఇక్ష్వాకువంశ వర్ధనుడు, జితేంద్రియుడు మరియు సత్యవాది అయిన త్రిశంకువు అనే రాజు వర్ధిల్లుచుండెను.
- ఉపకరణాలు:
తస్య బుద్ధిః సముత్పన్నా
యజేయమితి రాఘవ! ।
గచ్ఛేయం సశరీరేణ
దేవానాం పరమాం గతిమ్॥
టీకా:
తస్య = అతనికి; బుద్ధిః = బుద్ధి; సముత్పన్నా = పుట్టినది; యజేయమితి = యాగముచే; రాఘవ! = శ్రీరామచంద్ర!; గచ్ఛేయం = వెళ్ళెదను; సశరీరేణ = తన శరీరముతో; దేవానాం = దేవతలయొక్క; పరమాం = ఉత్కృష్టమైన; గతిమ్ = గతి॥
భావము:
ఆ త్రిశంకువునకు యాగముచేసి తన శరీరముతో దేవతలుండే స్వర్గమునకు వెళ్ళవలెను అనే బుద్ధి పుట్టినది.
- ఉపకరణాలు:
స వసిష్ఠం సమాహూయ
కథయామాస చింతితమ్।
“అశక్యమితి” చాప్యుక్తో
వసిష్ఠేన మహాత్మనా॥
టీకా:
సః = అతడు; వసిష్ఠం = వసిష్ఠుని; సమాహూయ = పిలిపించి; కథయామాస = తెలిపెను; చింతితమ్ = తన ఆలోచనను।; అశక్యం = అసాధ్యమైనది; ఇతి; చ+అపి = అని కూడ; ఉక్తః = పలుకబడెను; వసిష్ఠేన = వసిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడైన.
భావము:
అతడు(త్రిశంకువు) వసిష్ఠమహర్షిని ఆహ్వానించి తన ఆలోచనను తెలిపెను. అంతట మహాత్ముడైన వసిష్ఠమహర్షి ఇది శక్యము కాదు అని చెప్పెను.
- ఉపకరణాలు:
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన
స యయౌ దక్షిణాం దిశమ్।
తతస్తత్కర్మసిద్ధ్యర్థమ్
పుత్రాంస్తస్య గతో నృపః॥
టీకా:
ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడిన వాడు; వసిష్ఠేన = వసిష్ఠమహర్షిచే; స = అతడు; యయౌ = వెళ్ళెను; దక్షిణాం = దక్షిణ; దిశమ్ = దిశగా।; తతః = అటు పిమ్మట; తత్ = ఆ; కర్మ = పని; సిద్ధ్యర్థమ్ = సాధించుటకు; పుత్రాన్ = పుత్రుల వద్దకు; తస్య = ఆ వసిష్ఠమహర్షి యొక్క; గతః = వెళ్ళెను; నృపః = రాజు॥
భావము:
వసిష్ఠమహర్షిచే నిరాకరింపబడిన ఆ రాజు త్రిశంకువు ఆ పని సాధించుటకు, దక్షిణదిశగా బయలుదేఱి వసిష్ఠమహర్షి పుత్రులవద్దకు వెళ్ళెను.
- ఉపకరణాలు:
వాసిష్ఠా దీర్ఘతపసః
తపో యత్ర హి తేపిరే।
త్రిశంకుః సుమహాతేజాః
శతం పరమభాస్వరమ్॥
టీకా:
వాసిష్ఠా = వసిష్ఠమహర్షి పుత్రులు; దీర్ఘ = ఎంతో కాలం; తపసః = తపస్సు చేసినవారు; తపః = తపస్సు; యత్ర = ఎక్కడ; హి; తేపిరే = చేసారో అచట; త్రిశంకుః = త్రిశంకువు; సుమహాతేజాః = చాల గొప్ప తేజస్సు కలిగిన; శతం = నూరుగురు; పరమభాస్వరమ్ = చాలా ప్రకాశించుచున్న.
భావము:
గొప్పతేజస్సు కలిగిన త్రిశంకువు ఎంతోకాలముగా తపమాచరించుచున్న వాసిష్ఠులు (వసిష్ఠమహర్షి పుత్రులు)వందమందిఉన్న ప్రదేశమునకు వెళ్ళెను
- ఉపకరణాలు:
వసిష్ఠపుత్రాన్ దదృశే
తప్యమానాన్ యశస్వినః।
సోఽ భిగమ్య మహాత్మానః
సర్వానేవ గురోః సుతాన్॥
టీకా:
వసిష్ఠపుత్రాన్ = వసిష్ఠ పుత్రులను; దదృశే = చూచెను; తప్యమానాన్ = తపస్సు చేయుచున్న; యశస్వినః = యశస్సు కలిగినవారు; సః = అతడు; అభిగమ్య = సమీపించి; మహాత్మానః = మహాత్ములైన; సర్వాన్+ఏవ = సమస్తము అయిన; గురోః సుతాన్ = గురువుగారి పుత్రులను.
భావము:
మిక్కిలి ప్రకాశించుచున్న, యశస్సు కలిగిన తపస్సు చేసుకొంటున్న నూరుగురు వసిష్ఠ కుమారులను కృతాంజలి అయి దర్శించెను.
- ఉపకరణాలు:
అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః|
అబ్రవీత్సుమహాభగాన్సర్వానేవ కృతాఞ్జలిః||
- ఉపకరణాలు:
“శరణం వః ప్రపద్యేఽ హం
శరణ్యాన్ శరణాగతః।
ప్రత్యాఖ్యాతోఽ స్మి భద్రం వో
వసిష్ఠేన మహాత్మనా॥
టీకా:
శరణం = శరణు; వః = మిమ్ములను; ప్రపద్యే = పొందుచున్నాను; అహమ్ = నేను; శరణ్యాన్ = శరణ్యులు; రక్షకులు; శరణాగతః = శరణు కొఱకు వచ్చిన।; ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడినవాడు; అస్మి = నేను భద్రం = క్షేమము; వః = మీకు; వసిష్ఠేన = వసిష్టునిచే; మహాత్మనా = మహాత్ముడైన॥
భావము:
“ఓ వసిష్ఠ కుమారులారా, మీకు క్షేమమగుగాక; మహాత్ముడైన వసిష్ఠ మహర్షిచే నేను నిరాకరింపబడితిని. మీరు అనన్య శరణ్యులు , మిమ్ములను శరణు వేడుకుంటున్నాను.
- ఉపకరణాలు:
యష్టుకామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హథ|
గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదయే||
- ఉపకరణాలు:
శిరసా ప్రణతో యాచే
బ్రాహ్మణాంస్తపసి స్థితాన్।
తే మాం భవంతః సిద్ధ్యర్థం
యాజయంతు సమాహితాః॥
టీకా:
శిరసా = శిరముచే; ప్రణతః = ప్రణమిల్లుచున్న వాడినై; యాచే = కోరుచున్నాను; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులైన మిమ్ము; తపసి = తపము; స్థితాన్ = ఆచరించుచున్న; తే = అట్టి; మాం = నన్ను; భవంతః = మీరు; సిద్ధ్యర్థమ్ = సిద్ధించుటకు; యాజయంతు = యాగము చేయించగలరు; సమాహితాః = సావధానచిత్తులై.
భావము:
తపస్సు ఆచరించుచున్న గొప్ప బ్రాహ్మణోత్తములయిన మీకు తలవంచి నమస్కరించి వేడుకుంటున్నాను. నా అభీష్టము సిద్ధించుటకు మీరు యజ్ఞమును చేయించగలరు.
- ఉపకరణాలు:
సశరీరో యథాఽ హం హి
దేవలోకమవాప్నుయామ్।
ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన
గతిమన్యాం తపోధనాః॥
టీకా:
సశరీరః = సశరీరుడనై; యథా = ఏవిధముగా; అహం = నేను; హి; దేవలోకం = స్వర్గమును; అవాప్నుయామ్ = పొందగలనో।; ప్రత్యాఖ్యాతః = తిరస్కరింపబడిన; వసిష్ఠేన = వసిష్ఠ మహర్షిచే; గతిం = గతి; అన్యాం = వేఱొక; తపోధనాః = తపోధనులారా!.
భావము:
ఓ తపోధనులారా! నేను సశరీరముగా స్వర్గమునకు వెళ్ళగోరు చున్నాను. వసిష్ఠ మహర్షిచే తిరస్కరించబడిన నాకు ఇతర దారిలేదు,
- ఉపకరణాలు:
గురుపుత్రానృతే సర్వాన్
నాహం పశ్యామి కాంచన।
ఇక్ష్వాకూణాం హి సర్వేషాం
పురోధాః పరమా గతిః॥
టీకా:
గురు = గురుపు; పుత్రాన్ = పుత్రులైన మీరు; అనృతే = తప్ప ఇతరులు; సర్వాన్ = అందరు; న = లేదు; అహం = నేను; పశ్యామి = చూడగలను; కాంచన = దేనిని; ఇక్ష్వాకూణాం = ఇక్ష్వాకు వంశీయులకు; హి; సర్వేషామ్ = సమస్తమైన; పురోధాః = పురోహితుడు; పరమా = గొప్ప; గతిః = గతి.
భావము:
గురుపుత్రులైన మీరు తప్ప వేఱే మార్గము కనబడుటలేదు. సమస్త ఇక్ష్వాకువంశ రాజులకు పురోహితుడైన వసిష్ఠ మహర్షే పరమగతి.
- ఉపకరణాలు:
పురోధసస్తు విద్వాంసః
తారయంతి సదా నృపాన్ ।
తస్మాదనంతరం సర్వే
భవంతో దైవతం మమ" ॥
టీకా:
పురోధసః = పురోహితులు; తు; విద్వాంసః = విద్వాంసులైన; తారయంతి = తరింపజేయుదురు; సదా = ఎల్లప్పుడు; నృపాన్ = రాజులను; తస్మాత్ = అందుచేత; అనంతరం = తరువాత; సర్వే = అందరు; భవంతః = మీరు; దైవతం = దేవతలు; మమ = నాకు.
భావము:
విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడు రాజులను తరింప జేయుదురు. వసిష్ఠుని తరువాత మీరే నాకు దేవతలు.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
సప్తపంచాశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తపంచాశః [57] = యాభై ఏడవవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఏడవ సర్గ [57] సంపూర్ణము..