వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥షట్పంచాశః సర్గః॥ [56 - వసిష్ఠుడు అస్త్రములు వమ్ముచేయుట]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తో వసిష్ఠేన
 విశ్వామిత్రో మహాబలః ।
ఆగ్నేయమస్త్రముత్క్షిప్య
 “తిష్ఠ తిష్ఠేతి” చాబ్రవీత్ ॥

టీకా:

ఏవం = ఈ విధముగా; ఉక్తః = పలుక బడిన వాడైన; వసిష్టేన = వసిష్టుని చేత; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = గొప్ప బలము గలవాడు; ఆగ్నేయమ్ అస్త్రమ్ = ఆగ్నేయాస్త్రమును; ఉత్+క్షిప్య = వేసి; తిష్ట తిష్ట ఇతి = నిలువుము; నిలువుము అని; చ = కూడా; అబ్రవీత్ = పలికెను.

భావము:

ఈ విధముగా పలికిన వశిష్ఠునితో మహాబలుడైన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి ‘నిలువుము, నిలువుము ‘ అని హెచ్చరించెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మదండం సముత్క్షిప్య
 కాలదండ మివాపరమ్ ।
వసిష్ఠో భగవాన్ క్రోధాత్
 ఇదం వచనమబ్రవీత్ ॥

టీకా:

బ్రహ్మదండమ్ = బ్రహ్మదండమును; సముత్క్షిప్య = పైకెత్తి; కాలదండమ్ = యమదండము; ఇవ = వలె; అపరమ్ = రెండవ; వశిష్ఠః = వశిష్ఠుడు; భగవాన్ = పూజ్యుడైన‌; క్రోధాత్ = క్రోధముతో; ఇదం = ఈ; వచనమ్ = వచనమును; అబ్రవీత్ = పలికెను.

భావము:

రెండవ యమదండమా అన్నట్లు ఉన్న తన బ్రహ్మదండమును పైకెత్తి, పూజ్యుడైన వశిష్ఠుడు కోపముగా ఇట్లు పలికెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“క్షత్రబంధో స్థితోఽ స్మ్యేష
 యద్బలం తద్విదర్శయ ।
నాశయామ్యద్య తే దర్పమ్
 శస్త్రస్య తవ గాధిజ ॥

టీకా:

క్షత్రబంధః = ఓ క్షత్రియాధమా; స్థితః అస్మి = నిలచి యున్నాను; ఏషః = ఈ నేను; యత్ = ఏ; బలం = బలము ఉన్నదో; తత్ = దానిని; విదర్శయ = చూపుము; నాశయామి = నశింపచేయుదును; అద్య = ఇప్పుడు; తే = నీ యెక్క; దర్పమ్ = దర్పమును; శస్త్రస్య = శస్త్రము యెక్క; తవ = నీ యెక్క; గాధిజ = గాధి కుమారుడా, విశ్వామిత్ర!

భావము:

”ఓ క్షత్రియాధమా! గాధి పుత్రా! ఇదిగో నేను ఇచ్చటనే నిలిచి యుంటిని. నీకు ఏపాటి బలముందో ప్రదర్శించుకో. ఇప్పుడే నీకు నీ శస్త్రములకు గల దర్పము అంతా, నశింపచేసెదును.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్వ చ తే క్షత్రియబలమ్
 క్వ చ బ్రహ్మబలం మహత్ ।
పశ్య బ్రహ్మబలం దివ్యమ్
 మమ క్షత్రియపాంసన" ॥

టీకా:

క్వ = ఎక్కడ; చ; తే = నీ యెక్క; క్షత్రియబలమ్ = క్షత్రియ బలము; క్వ = ఎక్కడ; చబ్రహ్మబలమ్ = బ్రహ్మ బలము; మహత్ = గొప్పదైన; పశ్య = చూడుము; బ్రహ్మ బలమ్ = బ్రహ్మబలమును; దివ్యమ్ = దివ్యమైన; మమ = నా యొక్క; క్షత్రియపాంసన = ఓ క్షత్రియకులము చెఱచువాడ!

భావము:

క్షత్రియకుల నాశక! గొప్పదైన బ్రహ్మ బలము ముందు నీ క్షత్రియ బలము ఎంత. నా దివ్యమైన బ్రహ్మబలమును చూడుము.”

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యాస్త్రం గాధిపుత్రస్య
 ఘోరమాగ్నేయ ముద్యతమ్ ।
బ్రహ్మదండేన తచ్ఛాంతం
 అగ్నేర్వేగ ఇవామ్భసా ॥

టీకా:

తస్య = ఆ; అస్త్రం = అస్త్రము; గాధిపుత్రస్య = గాధి పుత్రుని యొక్క; ఘోరమ్ = భయంకరమైన; ఆగ్నేయమ్ = ఆగ్నేయమను అస్త్రము; ఉద్యతమ్ = ప్రయోగింపబడిన; బ్రహ్మదండేన = బ్రహ్మదండము వలన; తత్ = అది; శాంతం = శాంతించినది; అగ్నేః = అగ్ని యెక్క; వేగః = విస్పోటము; వేగః = వలె; అమ్భసా = నీటి చేత

భావము:

బ్రహ్మదండముచే, అగ్నివిస్పోట మైనా నీటిచే శాంతింప బడినట్లు, ఆ గాధి పుత్రుడైన విశ్వామిత్రుడు ప్రయోగించిన అతంటి భయంకర ఆగ్నేయ అస్త్రము శాంతించినది.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారుణం చైవ రౌద్రం చ
 ఐంద్రం పాశుపతం తథా ।
ఐషీకం చాపి చిక్షేప
 కుపితో గాధినందనః ॥

టీకా:

వారుణమ్ = వారుణాస్త్రమును; చైవ = మరియు; రౌద్రమ్ = రౌద్ర అస్త్రమును; చ; ఐంద్రమ్ = ఐంద్రాస్త్రమును; పాశుపతమ్ = పాశుపత అస్త్రమును; తథా = మరియు; ఐషీకం = ఐషీక అస్త్రమును; చాపి = కూడా; చిక్షేప = ప్రయోగించెను; కుపితో = కోపించిన; గాదినందనః = గాది కుమారుడైన విశ్వామిత్రుడు.

భావము:

అంతట కోపించిన గాధినందనుడైన విశ్వామిత్రుడు వరుసగా వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐషీక అస్త్రములను ప్రయోగించెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానవం మోహనం చైవ
 గాంధర్వం స్వాపనం తథా ।
జృమ్భణం మాదనం చైవ
 సంతాపన విలాపనే ॥

టీకా:

మానవం = మానవాస్త్రమును; మోహనం = మోహమును కలిగించు అస్త్రమును; చైవ = కూడృ; గాంధర్వం = గాంధర్వ అస్త్రమును; స్వాపనం = నిద్ర కలిగించు అస్త్రమును; జృమ్భణం = ఆవులింతలు కలిగించు అస్త్రమును; మాదనం = మత్తును కలిగించు అస్త్రమును; చైవ = కూడా; సంతాపన = తాపమును; విలాపనే = విలాపము కలిగించు అస్త్రములను.

భావము:

మానవ , మోహన, గాంధర్వ అస్త్రములు, స్వాపనం అను నిద్రను కలిగించు, జృంభణము అను ఆవులింతలు కలిగించు, మాదనం అను మత్తును కలిగించు, సంతాపనం అను తాపమును, విలాపనే అను విలాపము కలిగించు అస్త్రమును ఆ విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ప్రయోగించెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శోషణం దారణం చైవ
 వజ్రమస్త్రం సుదుర్జయమ్ ।
బ్రహ్మపాశం కాలపాశమ్
 వారుణం పాశమేవ చ ॥

టీకా:

శోషణం = ఎండింప చేసెడి అస్త్రము; దారణం = చీల్చి వేయు అస్త్రమును; చైవ = కూడా; వజ్రమస్త్రం = వజ్రాస్త్రమును; సుదుర్జయమ్ = జయింప వీలు కానిది; బ్రహ్మపాశమ్ = బ్రహ్మపాశమును; కాలపాశమ్ = కాలపాశమును; వారుణమ్ = వారుణ; పాశమేవ = పాశమును; చ = కూడా.

భావము:

ఆ విశ్వామిత్రుడు వశిష్ఠునిపై శోషణము అను శుష్కింపచేసెడి అస్త్రమును, దారణం అను చీల్చి వేయగలిగెడి అస్త్రమును, సుదుర్జయము అను జయింప శక్యము గాని అస్త్రమును, వజ్రాస్త్రమును, బ్రహ్మ పాశమును, కాలపాశమును, వారుణపాశమును కూడా ప్రయోగించెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పైనాకాస్త్రం చ దయితమ్
 శుష్కార్ద్రే అశనీ ఉభే ।
దండాస్త్రమథ పైశాచమ్
 క్రౌంచమస్త్రం తథైవ చ ॥

టీకా:

పైనాకాస్త్రమ్ = అంకుశము; చ; దయితమ్ = దయితాస్త్రమును కూడా; శుష్కార్ద్రే = ఎండినది; తడిసినది అను; అశనీ = కొరివి వంటి ఆయుధములు; ఉభే = రెండు; దండాస్త్రమ్ = దండాస్త్రమును; అథ = మరియు; పైశాచమ్ = పైశాచ మను కండరాదులను పీకెడి అస్త్రమును; క్రౌఞ్చమస్త్రం = క్రౌంచ మనెడి వంకరా పోవు అస్త్రమును; చ = కూడా.

భావము:

ఆ విశ్వామిత్రుడు పైనాకాస్త్రము అను అంకుశము, దయితాస్త్రము, శుష్క,ఆర్ద్ర అను రెండు వజ్రాస్త్రము లను, దండాస్త్రమును, పైశాచ అను కండరాదులను పీకు అస్త్రము,క్రౌంచ అను వంకరటింకరగా పోవు అస్త్రమును ప్రయోగించెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధర్మచక్రం కాలచక్రమ్
 విష్ణుచక్రం తథైవ చ ।
వాయవ్యం మథనం చైవ
 అస్త్రం హయశిరస్తథా ॥

టీకా:

ధర్మచక్రం = ధర్మ చక్రమును; కాలచక్రమ్ = కాలచక్రమును; విష్ణుచక్రం = విష్ణుచక్రమును; తథైవ చ = మరియును; వాయవ్యం = వాయవు అస్త్రమును; మథనం చైవ = మథనమును; చైవ; హయశిరః = హయశిరమనెడు అస్త్రమును; తథా = మరియును.

భావము:

ఆ విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ధర్మచక్రము, విష్ణుచక్రము, వాయవ్యము, మథనము, హయశిరము అనెడి అస్త్రములను వరుసగా ప్రయోగించెను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శక్తిద్వయం చ చిక్షేప
 కంకాళం ముసలం తథా ।
వైద్యాధరం మహాస్త్రం చ
 కాలాస్త్రమథ దారుణమ్ ॥

టీకా:

శక్తిద్వయం = రెండు శక్తులను విష్ణుశక్తి శివశక్తి; చ; చిక్షేప = ప్రయోగించెను; కంకాళం = కంకాళము; తథా = అటులనే; ముుసలము = రోకలి; తథా = కూడా; వైద్యాధరం = వైధ్యాధరము అనెడి; మహాస్త్రం చ = గొప్ప అస్త్రమును కూడా; చ; కాలాస్త్రమ్ = కాలాస్త్రము; అథ = ఇంకా; దారుణమ్ = భయంకరమైనది.

భావము:

రెండు గొప్ప శక్తులను, కంకాళము, ముసలము, వైద్యాధరము అనెడి గొప్ప శక్తి వంతమైన అస్త్రములను, కాలాస్త్రము మఱియు దారుణము అను అతి భయంకరమైన అస్త్రములను విశ్వామిత్రుడు వశిష్ఠునిపై ప్రయోగించెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రిశూలమస్త్రం ఘోరం చ
 కాపాలమథ కంకణమ్ ।
ఏతాన్యస్త్రాణి చిక్షేప
 సర్వాణి రఘునందన! ॥

టీకా:

త్రిశూలమ్ అస్త్రమ్ = త్రిశూలము; ఘోరం = అతి భయంకరమైనది; చ = కూడా; కాపాలమ్ = కాపాలమును; అథ = మరియు; కంకణమ్ = కంకణము అనెడి అస్త్రమును; ఏతాని = ఈ; అస్త్రాణి = అస్త్రములను; చిక్షేప = ప్రయోగించెను; సర్వాణి = సమస్తములైన; రఘునందన = ఓ రఘునందనా.

భావము:

ఓ రఘునందనా! విశ్వామిత్రుడు వశిష్ఠునిపై త్రిశూలము అనెడి అతి భయంకర మైన అస్త్రమును, కాపాలము,కంకణము వంటి తన వద్ద ఉన్న సమస్త ఆస్త్రములను ప్రయోగించెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వసిష్ఠే జపతాం శ్రేష్ఠే
 తదద్భుతమివాభవత్ ।
తాని సర్వాణి దండేన
 గ్రసతే బ్రహ్మణః సుతః ॥

టీకా:

వసిష్ఠే = వశిష్ఠునిపై; జపతాం = మునులలో; శ్రేష్ఠే = శ్రేష్ఠుడైన; తత్ = అది; అద్భుతమ్ ఇవ = ఆశ్చర్యకరమైనది; అభవత్ = ఆయెను; తాని సర్వాణి = వాని నన్నిటిని; దండేన = దండము చేత; గ్రసతే = మ్రింగివేసెను; బ్రహ్మణః సుతః = బ్రహ్మ కుమారుడైన వశిష్ఠుడు.

భావము:

మునులలో శ్రేష్ఠుడు వశిష్ఠునిపై విశ్వామిత్రుని అస్త్రముల ప్రయోగము ఆద్భుతమే, కానీ ఆ బ్రహ్మ కుమారుడైన వశిష్ఠుడు విశ్వామిత్రుని అస్త్రములన్నింటిని తన దండముతో మ్రింగివేసెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తేషు శాంతేషు బ్రహ్మాస్త్రమ్
 క్షిప్తవాన్ గాధినందనః ।
తదస్త్రముద్యతం దృష్ట్వా
 దేవాః సాగ్నిపురోగమాః ॥

టీకా:

తేషు = ఆ అస్త్రములు; శాంతేషు = శాంతించగా; బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును; క్షిప్తవాన్ = ప్రయోగించెను; గాధినందనః = గాధి కుమారుడైన విశ్వామిత్రుడు; తత్ = ఆ; అస్త్రమ్ = అస్త్రమును; ఉద్యతం = ప్రయోగింపబడిన; దృష్ట్వా = చూచి; దేవాః = దేవతలు; స = సహితముగ; అగ్ని = అగ్నిదేవునితో; పురోగమాః = ముందుకు వచ్చి.

భావము:

ఆ అస్త్రములు అన్నీ శాంతించుట చేత విశ్వామిత్రుడు బ్రహ్మస్త్రమును ప్రయోగించెను. అది చూచి అగ్నితో సహా దేవతలంతా కలత చెందిరి.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవర్షయశ్చ సమ్భ్రాంతా
 గంధర్వాః సమహోరగాః ।
త్రైలోక్యమాసీత్ సంత్రస్తమ్
 బ్రహ్మాస్త్రే సముదీరితే ॥

టీకా:

దేవర్షయః = దేవఋషులు; చ = కూడా; సమ్భ్రాంతా = కలత చెందిరి; గంధర్వాః = గంధర్వులు; సమః = సర్వః; ఉరగాః = సర్పములు; త్రైలోక్యమ్ = మూడు లోకములు; ఆసీత్ = ఆయెను; సంత్రస్తమ్ = వణికి పోయినవి; బ్రహ్మాస్త్రే = బ్రహ్మస్త్రము; సముదీరితే = ప్రయోగింప బడుచుండగా.

భావము:

బ్రహ్మాస్త్రము ప్రయోగింపబడుచుండగా దేవ ఋషులు, గంధర్వులు, నాగులుతో అందరును, ముల్లోకములు కలత చెంది భయముతో వణికి పోయినవి.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదప్యస్త్రం మహాఘోరమ్
 బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా ।
వసిష్ఠో గ్రసతే సర్వమ్
 బ్రహ్మదండేన రాఘవ! ॥

టీకా:

తత్ = ఆ; అపి = కూడా; అస్త్రం = అస్త్రము; మహాఘోరమ్ = చాలా వినాశకరము; బ్రాహ్మం = బ్రహ్మస్త్రము; బ్రాహ్మేణ తేజసా = బ్రహ్మ తేజస్సు గల; వసిష్ఠః = వసిష్ఠుడు; గ్రసతే = మ్రింగివేసెను; సర్వమ్ = సర్వమును; బ్రహ్మదండేన = బ్రహ్మదండముతో; రాఘవ = ఓ రాఘవా!

భావము:

ఓ రామా! వశిష్ఠుడు తన బ్రహ్మతేజ ప్రభావము చేత బ్రహ్మదండముతో ఆ మహాభయంకరమైన బ్రహ్మస్త్రమును కూడా మ్రింగి వేసెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మాస్త్రం గ్రసమానస్య
 వసిష్ఠస్య మహాత్మనః ।
త్రైలోక్యమోహనం రౌద్రమ్
 రూపమాసీత్ సుదారుణమ్ ॥

టీకా:

బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మస్త్రమును; గ్రసమానస్య = మ్రింగుతున్న; వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన; త్రైలోక్యమోహనం = మూడు లోకములను సమ్మోహ పరచగల; రౌద్రమ్ = రౌద్రముతో; రూపమ్ = రూపము; ఆసీత్ = ఆయెను; సుదారుణమ్ = చాలా దారుణముగా.

భావము:

బ్రహ్మస్త్రమును మ్రింగుచున్న సమయములో ఆ మహాత్ముడైన వసిష్ఠుని రూపము త్రిలోకాలకు మూర్ఛ కలిగించు రౌద్రముతో మహాదారుణముగా కనబడెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రోమకూపేషు సర్వేషు
 వసిష్ఠస్య మహాత్మనః ।
మరీచ్య ఇవ నిష్పేతుః
 అగ్నే ర్ధూమాకులా ర్చిషః ॥

టీకా:

రోమకూపేషు = రోమకూపముల యందు; సర్వేషు = సమస్తమైన; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; మరీచ్యః = కిరణములు; ఇవ = వలె; నిష్పేతుః = బయలువెడలెను; అగ్నేః = అగ్ని యొక్క; ధూమ = పొగతో; ఆకుల = నిండిన; అర్చిషః = జ్వాలలు.

భావము:

మహాత్ముడైన ఆ వసిష్ఠుని రోమకూపములనుండి కిరణములు వలె పొగలతో కూడిన జ్వాలలు బయలువెడలెను.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాజ్వల ద్బ్రహ్మదండశ్చ
 వసిష్ఠస్య కరోద్యతః ।
విధూమ ఇవ కాలాగ్నిః
 యమదండ ఇవాపరః ॥

టీకా:

ప్రాజ్వలత్ = మండిపడెను; బ్రహ్మదండశ్చ = బ్రహ్మ దండము; వసిష్ఠస్య = వసిష్ఠుని; కరోద్యతః = చేతితో ఎత్తబడిన; విధూమ = ధూమములేని; ఇవ = వలె; కాలాగ్నిః = కాలాగ్ని; యమదండ = యమదండము; అపరః = మరియొక.

భావము:

వసిష్ఠుని చేతిచే ఎత్తబడిన బ్రహ్మదండము ధూమము లేని కాలాగ్ని వలె, యమదండము వలెప్రజ్వరిల్లెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతోఽ స్తువన్ మునిగణా
 వసిష్ఠం జపతాం వరమ్ ।
అమోఘం తే బలం బ్రహ్మన్
 తేజో ధారయ తేజసా ॥

టీకా:

తతః = అప్పడు; అస్తువన్ = స్తుతించిరి; మునిగణాః = మునిగణములు; వసిష్ఠం = వసిష్ఠుని; జపతాం = మునులలో; వరమ్ = శ్రేష్ఠుడైన; అమోఘం = అత్యంత శ్రేష్ఠమైనది; తే = నీ యొక్క; బలం = బలము; బ్రహ్మన్ = ఓ బ్రహ్మణా!; తేజో = తేజస్సును; ధారయ = ధరింపుము; తేజసా = తేజస్సుచేత;

భావము:

అపుడు మునిగణములు ముని శ్రేష్ఠుడైన వసిష్టుని స్తుతించి ఇట్లు పలికిరి "ఓ బ్రాహ్మణా! నీ బలము ఆమోఘమైనది. దానిని నీ తేజస్సు నందు నీవే నిగ్రహింపుము."

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిగృహీతస్త్వయా బ్రహ్మన్
 విశ్వామిత్రో మహాతపాః ।
ప్రసీద జపతాం శ్రేష్ఠ
 లోకాః సంతు గతవ్యథాః ॥

టీకా:

నిగృహీతః = నిగ్రహింపబడెను; త్వయా = నీచేత; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా; విశ్వామిత్ర్రః = విశ్వామిత్రుడు; మహాతపాః = గొప్ప తపస్సంపన్నుడైన; ప్రసీదః = అనుగ్రహింపుము; జపతాం = మునులలో; శ్రేష్ఠః = శ్రేష్ఠుడా; లోకాః = లోకములు; సంతు = అగుగాక; గతవ్యథాః = వ్యధలు తొలగినవి.

భావము:

"ఓ బ్రాహ్మణా! నీవు గొప్ప తపశ్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ మునిశ్రేష్ఠుడా నీ వనుగ్రహించి లోకముల బాధలు తొలగఁజేయుము.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తో మహాతేజాః
 శమం చక్రే మహాతపాః ।
విశ్వామిత్రోఽ పి నికృతో
 వినిఃశ్వస్యే దమబ్రవీత్ ॥

టీకా:

ఏవమ్ = ఈవిధముగా; ఉక్తః = పలుకబడిన; మహాతేజాః = గొప్ప తేజోవంతుడు; శమమ్ చక్రే = శమించిన వాడు ఆయెను; మహాతపాః = గొప్ప తపశ్శాలి; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అపి = కూడా; నికృతః = అవమానింపబడినవాడై; వినిఃశ్వస్య = నిట్టూర్చి; ఇదమ్ = ఈ విధముగా; అబ్రవీత్ = పలికెను.

భావము:

వారి మాటలకు మహాతేజోవంతుడు, తపశ్శాలి అయిన వశిష్ఠుడు శాంతించెను. భంగపాటుకు గురియైన విశ్వామిత్రుడు అవమానముతో నిట్టూర్చి ఈ విధముగా పలికెను.

1-57-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజో బలం బలమ్|
ఏకేన బ్రహ్మదణ్డేన సర్వాస్త్రాణి హతాని మే||

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదేతత్ సమవేక్ష్యాహమ్
 ప్రసన్నే ంద్రియమానసః ।
తపో మహత్ సమాస్థాస్యే
 యద్వై బ్రహ్మత్వకారణమ్" ॥

టీకా:

తత్ = ఆ కారణముగా; ఏతత్ = ఈ విషయమును; సమవేక్ష్య = చూచి; అహమ్ = నేను; ప్రసన్న = ప్రసన్నములైన; ఇంద్రియ = ఇంద్రియములు; మానసః = మనస్సు కలిగినవాడనై; తపః = తపమును; మహత్ = గొప్పదైన; సమాస్థాస్యే = అవలంబించెదను; యత్ = ఏది; వై = అయితే; బ్రహ్మత్వ = బ్రాహ్మణత్వమునకు; కారణమ్ = కారణము అగునో అట్టి.

భావము:

అంతట విశ్వమిత్రుడు"ఈ విషయమును చూచిన పిమ్మట గ్రహించితిని. ఇకపై నేను ప్రసన్నములైన ఇంద్రియములు, మనసు కలిగిన వాడనై ఏది బ్రాహ్మణత్వ కారణమో అటువంటి గొప్పదైన తపమును ఆచరించెదను." అని తలచెను.

1-25-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 షట్పంచాశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్పంచాశః సర్గః = యాభైయారవ [56]; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఆరవ సర్గ [56] సంపూర్ణము.