బాలకాండమ్ : ॥పంచపంచాశః సర్గః॥ [55 - విశ్వామిత్రుని అస్త్ర ప్రయోగము]
- ఉపకరణాలు:
తతస్తానాకులాన్ దృష్ట్వా
విశ్వామి త్రాస్త్రమోహితాన్ ।
వసిష్ఠ శ్చోదయామాస
కామధుక్సృజ యోగతః ॥
టీకా:
తతః = అటు పిమ్మట; తాన్ = వారిని; ఆకులాన్ = వ్యాకులపాటుకు గురియయిన; దృష్ట్వా = చూచి; విశ్వామిత్ర = విశ్వామిత్ర; అస్త్ర = అస్త్రములచే; మోహితాన్ = మోహితులయిన; వసిష్ఠః = వసిష్ఠ మహర్షి; చోదయామాస = ప్రోత్సహించెను; కామధుక్ = ఓ కామధేనువా!; సృజ = సృజింపుము; యోగతః = యోగబలముచే
భావము:
అటుపిమ్మట, విశ్వామిత్రుని అస్త్రములచే మోహితులై వ్యాకులతకు గురియయిన వారిని (సైనికులను) చూచి వసిష్ఠ మహర్షి "ఓ కామధేనువా! నీ యోగబలంతో ఇంకను సృష్టించుము" అని ప్రోత్సహించెను.
- ఉపకరణాలు:
తస్యా హుంభారవాజ్జాతాః
కామ్భోజా రవిసన్నిభాః ।
ఊధసస్త్వథ సంజాతాః
పప్లవాః శస్త్రపాణయః ॥
టీకా:
తస్యా = ఆమెయొక్క(ఆ కామధేనువు యొక్క); హుంభారవాత్ = హుంభారవము; జాతాః = పుట్టిరి; కామ్భోజాః = కాంభోజులు; రవిసన్నిభాః = సూర్యతేజస్సు కలిగిన; ఊధసః = పొదుగునుండి; అథ = మరియు; సంజాతాః = పుట్టిరి; పప్లవాః = పప్లవులు; శస్త్రపాణయః = ఆయుధములు ధరించినటువంటి ॥
భావము:
వసిష్ఠమహర్షి ఆదేశానుసారం ఆ కామధేనువు హుంభారావము చేసినది. ఆ హుంభారావము నుండి సూర్యతేజస్సు కలిగిన కాంభోజులు పుట్టిరి, పొదుగు నుండి ఆయుధాలు ధరించిన పప్లవులు పుట్టిరి.
- ఉపకరణాలు:
యోనిదేశాచ్చ యవనాః
శకృ ద్దేశాచ్ఛకాస్తథా ।
రోమకూపేషు చ మ్లేచ్ఛా
హారీతా స్సకిరాతకాః ॥
టీకా:
యోనిదేశాత్ = యోని ప్రాంతం నుండి; చ = మరియు; యవనాః = యవనులు; శకృత్ = గోమయ; దేశాత్ = ప్రదేశము నుండి; చ = మరియు; శకాః = శకులును; తథా = ఆ విదముగా; రోమకూపేషు = రోమ కూపములనుండి; చ = మరియు; మ్లేచ్ఛాః = మ్లేచ్ఛులును; హారీతాః = హారీతులును; స = సహితంగా; కిరాతకాః = కిరాతకులతో.
భావము:
యోని వద్దనుండి యవనులు, పృష్ఠము వద్దనుండి శకులు, రోమకూపముల నుండి మ్లేచ్చులు, హారితులు, కిరాతులు ఉద్భవించిరి.
- ఉపకరణాలు:
తైస్తై ర్నిషూదితం సర్వమ్
విశ్వామిత్రస్య తత్క్షణాత్ ।
సపదాతిగజం సాశ్వమ్
సరథం రఘునందన! ॥
టీకా:
తైస్తైః = వారిచేత; నిషూదితం = నశింపచేయబడినది; సర్వమ్ = సర్వము: విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; తత్ + క్షణాత్ = అప్పటికప్పుడే: స = సహితంగా; పదాతి = కాల్బలము; గజం = గజ బలముతొ; స = సహితంగా; అశ్వమ్ = అశ్వ బలంతో; స = సహితంగా; రథం = రథబలముతో; రఘునందన = శ్రీరామచంద్రా!
భావము:
శ్రీరామచంద్ర! కామధేనువు నుండి సృష్టింపబడిన వారిచే, విశ్వామిత్రుని రథ, గజ, తురగ, పదాతి దళాలు సర్వము ఆ క్షణమే నశించాయి
- ఉపకరణాలు:
దృష్ట్వా నిషూదితం సైన్యమ్
వసిష్ఠేన మహాత్మనా ।
విశ్వామిత్ర సుతానాం తు
శతం నానావిధాయుధమ్ ॥
టీకా:
దృష్ట్వా = చూచి; నిషూదితం = నశించిన; సైన్యమ్ = సైన్యమును; వసిష్ఠేన = వశిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడై నటువంటి; విశ్వామిత్ర సుతానాం = విశ్వామిత్రుని కుమారుల; తు; శతం = శతము; నానావిధ = వివిధమైన; ఆయుధమ్ = ఆయుధములతో;
భావము:
మహాత్ముడైన వసిష్ఠునిచే తమ సైన్యములన్ని నాశనమగుట చూచిన విశ్వామిత్రుని నూర్గురు కుమారులు అనేక విధముల ఆయుధములతో ….
- ఉపకరణాలు:
అభ్యధావ త్సుసంక్రుద్ధమ్
వసిష్ఠం జపతాం వరమ్ ।
హుంకారేణైవ తాన్ సర్వాన్
దదాహ భగవానృషిః ॥
టీకా:
అభ్యధావత్ = వారివైపు వేగంగా వెళ్ళిరి; సుసంక్రుద్ధమ్ = చాలా కోపముతో; వసిష్ఠం = వసిష్టుని గూర్చి; జపతాం = తాపసులలో; వరమ్ = శ్రేష్ఠుడైన; హుఙ్కారేణః = హుంకారము; ఏవ = మాత్రముచేతన్; తాన్ = ఆ; సర్వాన్ = అందరిని; దదాహ = కాల్చివేసెను; భగవాన్ = భగవత్స్వరూపుడైన; ఋషిః = ఋషి.
భావము:
మునులలో శ్రేష్ఠుడు, భగవత్స్వరుపుడైన ఆ వసిష్ఠ మహర్షి మీదకు చాలా కోపముతో దాడి చేసిన ఆ విశ్వామిత్రుని పుత్రులు వందమందిని వసిష్ఠుడు ఒక్క హుంకారముతో కాల్చివేసెను.
- ఉపకరణాలు:
తే సాశ్వరథపాదాతా
వసిష్ఠేన మహాత్మనా ।
భస్మీకృతా ముహూర్తేన
విశ్వామిత్ర సుతాస్తదా ॥
టీకా:
తే = ఆ; స = సర్వసహితంగ; అశ్వ = ఆశ్విక దళములతో; రథః = రథము బలములతో; పాదాతాః = కాల్బముతో; వసిష్ఠేన = వసిష్ఠునిచే; మహాత్మనా = మహాత్ముడైన; భస్మీకృతాః = భస్మము చేయబడినారు; ముహూర్తేన = ముహూర్త కాలములో; విశ్వామిత్ర = విశ్వామిత్రుని; సుతాః = కుమారులు; తదా = అప్పుడు.
భావము:
మహాత్ముడైన వసిష్ఠముని ఆ విశ్వామిత్రుని కుమారులందఱిని అశ్వ, రథ పదాతి దళములతో సహా క్షణములో భస్మము చేసెను.
- ఉపకరణాలు:
దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్
బలం చ సుమహాయశాః ।
సవ్రీడశ్చింతయాఽఽ విష్టో
విశ్వామిత్రోఽ భవత్తదా ॥
టీకా:
దృష్ట్వా = చూచి; వినాశితాన్ = నశించిన; పుత్రాన్ = కుమారులను; బలం చ = బలగమును; = కూడ; సు = మంచి: మహా = గొప్ప: యశాః = యశస్సు కలిగిన: స = తో; వ్రీడః = సిగ్గు; చింతయా = చింతకు; ఆవిష్టః = వశమయినవాడై; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అభవత్ = అయ్యెను; తదా = అప్పుడు.
భావము:
గొప్ప యశస్సు కలిగిన విశ్వామిత్రుడు, తన వందమంది కుమారులు, సమస్త బలగము నశించుట చూసి సిగ్గుతో మిక్కిలి దిగులుచెందెను.
- ఉపకరణాలు:
తస్యా హుంభారవాజ్జాతాః
కామ్భోజా రవిసన్నిభాః ।
ఊధసస్త్వథ సంజాతాః
పప్లవాః శస్త్రపాణయః ॥
టీకా:
తస్యా = ఆమెయొక్క(ఆ కామధేనువు యొక్క); హుంభారవాత్ = హుంభారవము; జాతాః = పుట్టిరి; కామ్భోజాః = కాంభోజులు; రవిసన్నిభాః = సూర్యతేజస్సు కలిగిన; ఊధసః = పొదుగునుండి; అథ = మరియు; సంజాతాః = పుట్టిరి; పప్లవాః = పప్లవులు; శస్త్రపాణయః = ఆయుధములు ధరించినటువంటి ॥
భావము:
వసిష్ఠమహర్షి ఆదేశానుసారం ఆ కామధేనువు హుంభారావము చేసినది. ఆ హుంభారావము నుండి సూర్యతేజస్సు కలిగిన కాంభోజులు పుట్టిరి, పొదుగు నుండి ఆయుధాలు ధరించిన పప్లవులు పుట్టిరి.
- ఉపకరణాలు:
హతపుత్రబలో దీనో
లూనపక్ష ఇవ ద్విజః ।
హతదర్పో హతోత్సాహో
నిర్వేదం సమపద్యత ॥
టీకా:
హత = చంపబడిన; పుత్ర = కుమారులును; బలః = బలగమును కలవాడై; దీనః = దీనుడై; లూన = కోయబడిన; పక్షః = ఱెక్కలు; ఇవ = వలె; ద్విజః = పక్షి; హత = నశించిన; దర్పః = దర్పము కలవాడై; హత = నశించిన; ఉత్సాహః = ఉత్సాహము కలవాడై; నిర్వేదం = దుఃఖము; సమపద్యత = పొందెను
భావము:
విశ్వామిత్రుడు పుత్రులు, సైన్యబలగము చంపబడుటచే ఆతడు ఱెక్కలు తెగిన పక్షివలె, దీనుడై, దర్పము నశించిన వాడై, ఉత్సాహము నీరుగారినవాడై, దుఃఖపడెను.
- ఉపకరణాలు:
స పుత్రమేకం రాజ్యాయ
పాలయేతి నియుజ్య చ ।
పృథివీం క్షత్రధర్మ్మేణ
వనమేవాన్వ పద్యత ॥
టీకా:
సః = అతడు; పుత్రం = కుమారుడిని; ఏకం = ఒకనిని; రాజ్యాయ = రాజ్యము కొఱకు; పాలయేతి = పాలించమని; నియుజ్య = నియమించి; చ = మరియు; పృథివీం = లోకంలో; క్షత్రధర్మ్మేణ = క్షాత్ర ధర్మమును అనుసరించి; వనమ్ ఏవ = అడవికే; అన్వపద్యత = వెళ్ళెను
భావము:
ఆ విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుటకు ఒక కుమారుని రాజుగ నియమించెను. లోకం లోని క్షాత్ర ధర్మానుసారం అరణ్యమున కేగెను.
- ఉపకరణాలు:
స గత్వా హిమవ త్పార్శ్వమ్
కిన్నరోరగ సేవితమ్ ।
మహాదేవ ప్రసాదార్థమ్
తపస్తేపే మహాతపాః ॥
టీకా:
సః = అతడు; గత్వా = చేరి; హిమవత్ = హిమవత్పర్వత; పార్శ్వమ్ = సమీపమునకు; కిన్నర = కిన్నెరలు; ఉరగ = సర్పములు; సేవితమ్ = సేవించునట్టి; మహాదేవ = పరమ శివుని; ప్రసాద = అనుగ్రహము; అర్థమ్ = కొఱకు; తపః = తపస్సు; తేపే = తపించెను; మహాతపాః = గొప్ప తపస్సుగల ॥
భావము:
మహాతపస్వి ఆ విశ్వామిత్రుడు కిన్నెరులు, నాగులు నివసించు హిమవత్పర్వత ప్రాంతమునకు చేరుకుని, అచట మహాశివుని అనుగ్రహము కొఱకు తపస్సు ఆచరించెను.
- ఉపకరణాలు:
కేనచిత్త్వథ కాలేన
దేవేశో వృషభధ్వజః ।
దర్శయామాస వరదో
విశ్వామిత్రం మహాబలమ్ ॥
టీకా:
కేనచిత్ = కొంత; అథ = పిమ్మట; కాలేన = కాలమునకు; దేవేశః = దేవతలకు ఈశుడైన; వృషభధ్వజః = వృషభము ధ్వజముగా కలిగినవాడు {శివుడు}; దర్శయామాస = దర్శనమును ప్రసాదించెను; వరదః = వరములను ఇచ్చువాడు; విశ్వామిత్రం = విశ్వామిత్రునకు; మహాబలమ్ = గొప్ప బలశాలి అయిన
భావము:
కొంతకాలమునకు దేవాదిదేవుడు, వృషభ ధ్వజుడు అయిన పరమేశ్వరుడు మహాబలశాలియగు విశ్వామిత్రునకు తన దర్శనమును అనుగ్రహించెను.
- ఉపకరణాలు:
“కిమర్థం తప్యసే రాజన్
బ్రూహి యత్తే వివక్షితమ్ ।
వరదోఽ స్మి వరో యస్తే
కాంక్షితః సోఽ భిధీయతామ్" ॥
టీకా:
కిమర్థం = ఎందులకు; తప్యసే = తపస్సుచేయుచున్నావు; రాజన్ = ఓ రాజా; బ్రూహి = చెప్పుము; యత్ = ఏది; తే = నీవు; వివక్షితమ్ = చెప్పదలచితివో; వరదః = వరములను ఇచ్చువాడను; అస్మి = అయ్యి; వరః = వరం; యః = ఏ; తే = నీచేత; కాంక్షితః = కోరబడినదో; సః = అది; అభిధీయతామ్ = చెప్పబడుగాక.
భావము:
“ఓ రాజా! ఎందులకు తపస్సును ఆచరించుచున్నావు? నీ అభిమతమును ప్రకటించుచు, నీవు కోరదలచినది ఏదియో నాకు తెలుపుము, వరమును అనుగ్రహించెదను.”
- ఉపకరణాలు:
తస్యా హుంభారవాజ్జాతాః
కామ్భోజా రవిసన్నిభాః ।
ఊధసస్త్వథ సంజాతాః
పప్లవాః శస్త్రపాణయః ॥
టీకా:
తస్యా = ఆమెయొక్క(ఆ కామధేనువు యొక్క); హుంభారవాత్ = హుంభారవము; జాతాః = పుట్టిరి; కామ్భోజాః = కాంభోజులు; రవిసన్నిభాః = సూర్యతేజస్సు కలిగిన; ఊధసః = పొదుగునుండి; అథ = మరియు; సంజాతాః = పుట్టిరి; పప్లవాః = పప్లవులు; శస్త్రపాణయః = ఆయుధములు ధరించినటువంటి ॥
భావము:
వసిష్ఠమహర్షి ఆదేశానుసారం ఆ కామధేనువు హుంభారావము చేసినది. ఆ హుంభారావము నుండి సూర్యతేజస్సు కలిగిన కాంభోజులు పుట్టిరి, పొదుగు నుండి ఆయుధాలు ధరించిన పప్లవులు పుట్టిరి.
- ఉపకరణాలు:
“యది తుష్టో మహాదేవ
ధనుర్వేదో మమానఘ ।
సాంగోపాంగోపనిషదః
సరహస్యః ప్రదీయతామ్ ॥
టీకా:
యది = అయితే; తుష్టః = సంతసిచినట్లు; మహాదేవ = ఓ పరమేశ్వరా!; ధనుః+వేదః = ధనుర్వేదము, విలువిద్య; మమ = నాకు; అనఘ = పాపరహితుడవైన; సాంగోపాంగ = సంపూర్ణంగా; ఉపనిషదః = ఉపనిషత్తులతో; స = కూడిన; రహస్యః = రహస్యములతో; ప్రదీయతామ్ = ప్రసాదించుము;
భావము:
ఓ మహాదేవా ! పరమేశ్వర! నీవు నా తపస్సునకు మెచ్చితివో, నాకు సాంగోపాంగముగ, ఉపనిషత్, రహస్యములతో కూడిన విలువిద్యను ప్రసాదించుము.
- ఉపకరణాలు:
యాని దేవేషు చాస్త్రాణి
దానవేషు మహర్షిషు ।
గంధర్వ యక్ష రక్షస్సు
ప్రతిభాంతు మమానఘ ॥
టీకా:
యాని = ఏ; దేవేషు = దేవతల యందు; చ; అస్త్రాణి = అస్త్రములు; దానవేషు = దానవుల యందు; మహర్షిషు = మహర్షుల యందు: గంధర్వ = గంధర్వుల యందు; యక్ష = యక్షుల యందు; రక్షస్సు = రాక్షసుల యందు; ప్రతిభాంతు = స్ఫురించు గాక; మమ = నాకు; అనఘ = పాపరహితుడా! ॥
భావము:
ఓ పాపరహితుడవైన పరమేశ్వర! సకల దేవతల, దానవుల, మహర్షుల, గంధర్వుల,యక్షుల, రాక్షసులకు తెలిసిన అస్త్ర విద్యను నాకు ప్రసాదించుము.
- ఉపకరణాలు:
తవ ప్రసా దాద్భవతు
దేవదేవ! మమేప్సితమ్" ।
ఏవమస్త్వితి దేవేశో
వాక్యముక్త్వా గతస్తదా ॥
టీకా:
తవ = నీ యొక్క; ప్రసాదాత్ = ప్రసాదముచే; భవతు = అగుగాక; దేవదేవ = దేవతలకు దేవుడవు అయిన ఈశ్వరా!; మమ = నా యొక్క; ఈప్సితమ్ = కోరిక; ఏవం = ఆ విధముగా; అస్తు+ఇతి = అగుగాక; దేవేశః = దేవతలకు ఈశ్వరుడవైన; వాక్యం = వాక్యమును; ఉక్త్వా = పలికి; గతః = వెళ్ళేను; తదా = అప్పుడు.
భావము:
"పరమేశ్వరా! నీ ప్రసాదముచే నా అభీష్టము నెరవేరుగాక". అని పలికిన విని, మహాశివుడు "ఆ విధముగానే అగుగాక" అని దీవించి అంతర్ధానమయ్యెను.
- ఉపకరణాలు:
ప్రాప్య చాస్త్రాణి రాజర్షిః
విశ్వామిత్రో మహాబలః ।
దర్పేణ మహతాయుక్తో
దర్పపూర్ణోఽ భవత్తదా ॥
టీకా:
ప్రాప్య = పొంది; చ = మరియు; అస్త్రాణి = అస్త్రములను; రాజర్షిః = రాజర్షి అయిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = మహా బలశాలి; దర్పేణ = దర్పముతో; మహతా = అధికముగా; యుక్తః = కూడినవాడగు; దర్ప = దర్పము; పూర్ణః = పూర్తిగ కలవాడు; అభవత్ = అయ్యెను; తదా = అప్పుడు ॥
భావము:
రాజర్షి, మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు సహజముగానే దర్పము కలవాడు, ఇప్పుడు పరమేశ్వరానుగ్రహముతో లభించిన అస్త్రములచే పూర్తిగా దర్పముతో నిండిపోయెను.
- ఉపకరణాలు:
వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి|
హతమేవ తదా మేనే వసిష్ఠమృషిసత్తమమ్||
- ఉపకరణాలు:
తతో గత్వాఽఽ శ్రమపదమ్
ముమోచాస్త్రాణి పార్థివః ।
యైస్తత్తపోవనం సర్వమ్
నిర్దగ్ధం చాస్త్రతేజసా ॥
టీకా:
తతః = అటు పిమ్మట; గత్వా = వెళ్ళి; ఆశ్రమపదమ్ = వసిష్ఠాశ్రమమునకు; ముమోచ = వదిలెను; అస్త్రాణి = అస్త్రములను; పార్థివః = రాజు; యైః = వాటి; తత్ = ఆ; తపోవనం = ఆశ్రమము వనము; సర్వం = మొత్తం; నిర్దగ్ధమ్ = కాల్టివేయబడెను; చ; అస్త్రః = అస్త్రముల; తేజసా = తేజస్సుచేత.
భావము:
విశ్వామిత్రుడు వెంటనే బయలుదేరి వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. తన అస్త్రములు అక్కడ ప్రయోగించుటచే , ఆ తపోవననం మొత్తం కాలిపోయెను.
- ఉపకరణాలు:
ఉదీర్యమాణమస్త్రం తత్
విశ్వామిత్రస్య ధీమతః ।
దృష్ట్వా విప్రద్రుతా భీతా
మునయః శతశో దిశః ॥
టీకా:
ఉదీర్యమాణం = విజృభించుచున్న; అస్త్రం = అస్త్రమును; తత్ = ఆ; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; ధీమతః = బుద్ధిశాలు డైన; దృష్ట్వా = చూచి; విప్రద్రుతాః = పరుగుతీసిరి; భీతా = భయముచే; మునయః = మునులు; శతశః = వందలాది; దిశః = అన్ని దిక్కులకు.
భావము:
బుద్ధిశాలియైన విశ్వామిత్రుని విజృభించుచున్న అస్త్రములను చూచి వందలాది మునులు అన్ని దిక్కులకు భయముతో పరుగుతీసిరి.
- ఉపకరణాలు:
వసిష్ఠస్య చ యే శిష్యాః
తథైవ మృగపక్షిణః ।
విద్రవంతి భయాద్భీతా
నానాదిగ్భ్యః సహస్రశః ॥
టీకా:
వసిష్ఠస్య = వసిష్ఠ ముని యొక్క; చ = మరియు; యే = ఏ; శిష్యాః = శిష్యులును; తథైవ = ఇంకా; మృగపక్షిణః = మృగములును; పక్షులును; విద్రవంతి = పారిపోయిరి; భయాత్ = భయము వలన; భీతాః = భీతిచెంది; నానాదిగ్భ్యః = అన్ని దిక్కులకును; సహస్రశః = వేలాది.
భావము:
వసిష్ఠుని శిష్యులు, ఇంకా వేలాది మృగములు, పక్షులు భయముతో అన్ని దిక్కులకు పారిపోయెను
- ఉపకరణాలు:
వసిష్ఠ స్యాశ్రమపదమ్
శూన్యమాసీ న్మహాత్మనః ।
ముహూర్తమివ నిఃశబ్దమ్
ఆసీదిరిణ సన్నిభమ్ ॥
టీకా:
వసిష్ఠస్య = వసిష్టుని యొక్క; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రాంతము; శూన్యం = శూన్యముగా; ఆసీత్ = ఆయెను; మహాత్మనః = మహాత్ముడైన; ముహూర్తం = ముహూర్త కాలము; ఇవ = అందే; నిఃశబ్దమ్ = నిశ్శబ్దము; ఆసీత్ = ఆయెను; ఇరిణ = ఎడారిప్రాంతము; సన్నిభమ్ = వలె.
భావము:
మహాత్ముడైన వసిష్ఠుని ఆశ్రమప్రాంతము అంతయు మూహూర్తకాలములో ఎడారి వలె సర్వము ధ్వంసమయి శున్యమయ్యెను. అక్కడ నిశ్శబ్దము ఆవరించెను.
- ఉపకరణాలు:
వదతో వై వసిష్ఠస్య
“మాభైరితి ముహుర్ముహుః ।
నాశయామ్యద్య గాధేయమ్
నీహారమివ భాస్కరః" ॥
టీకా:
వదతః = పలుకుచున్నను; వై =; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; మా = వద్దు; భైః = భయము; ఇతి = అని; ముహుః+ముహుః = మాటికి మాటికి; నాశయామి = నశింపచేసెదను; అద్య = ఇప్పుడే; గాధేయమ్ = విశ్వామిత్రుని; నీహారం = మంచు; ఇవ = వలె; భాస్కరః = సూర్యుడు;
భావము:
ఆ సమయంలో "భయపడకండి, భయపడకండి, సూర్యుడు మంచును నశింపచేయునట్లు ఈ గాధినందనుడిని ఇప్పుడే అంతమొందించెదను" అని వసిష్ఠ మహర్షి మాటిమాటికి పలుకుచున్నను వారందఱు పాఱిపోవుచుండిరి.
- ఉపకరణాలు:
ఏవముక్త్వా మహాతేజా
వసిష్ఠో జపతాం వరః ।
విశ్వామిత్రం తదా వాక్యమ్
సరోషమిద మబ్రవీత్ ॥
టీకా:
ఏవం = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; వసిష్ఠః = వసిష్ఠమహర్షి; జపతాం = మునులలో {జపించువారిలో}; వరః = శ్రేష్ఠుడు; విశ్వామిత్రం = విశ్వామిత్రునితో; తదా = అప్పుడు; వాక్యమ్ = వాక్యమును; స = తో; రోషం = రోషము; ఇదం = ఈ; అబ్రవీత్ = పలికెను.
భావము:
జపతపస్సంపన్నుడు మహాతేజశ్శాలి అయిన వసిష్ఠ మహర్షి (ఆశ్రమవాసులతో) ఈ విధముగా పలికిన పిమ్మట, మిక్కిలి క్రోధముతో విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“ఆశ్రమం చిరసంవృద్ధమ్
యద్వినాశిత వానసి ।
దురాచారోఽ సి తన్మూఢ
తస్మాత్త్వం న భవిష్యసి" ॥
టీకా:
ఆశ్రమం = ఆశ్రమము; చిర = ఎంతోకాలముగా; సంవృద్ధమ్ = వృద్ధి పొందినటువంటి; యత్ = ఎందుకు; వినాశితవాన్ = నాశనము చేసినవాడవు; అసి = అయితివో; దురాచారః = దురాచారుడవు; అసి = అయితివో; తత్ = ఆ కారణముచే; మూఢ = మూర్ఖుడా; తస్మాత్ = అందువలన; త్వం = నీవు; న = లేదు; భవిష్యసి = జీవించుట.
భావము:
“ఓ ముర్ఖుడా! దురాచారుడవై ఎంతోకాలము నుండి పెంచిన ఈ ఆశ్రమమును నాశనము చేసినందువలన ఇంక నీవు జీవించవు.”
- ఉపకరణాలు:
ఇత్యుక్త్వా పరమక్రుద్ధో
దండముద్యమ్య సత్వరః ।
విధూమమివ కాలాగ్నిమ్
యమదండ మివాపరమ్ ॥
టీకా:
ఇతి = అని; ఉక్త్వా = పలికి; పరమ = మిక్కిలి; క్రుద్ధః = కోపించినవాడై; దండం = తన దండమును; ఉద్యమ్య = పైకెత్తి; సత్వరః = తొందర కలిగినవాడై; వి = లేని; ధూమం = ధూమము; ఇవ = వలె; కాల+అగ్నిమ్ = కాలాగ్నివంటి; యమదండం = యమదండము; ఇవ = వలె; అపరమ్ = ఇంకొక.
భావము:
అని పలికి, మిక్కిలి క్రోధముతో పొగలేని కాలాగ్ని వలె, ఇంకొక యమదండమా అని తలపించు తన దండమును చేతితో పైకెత్తి నిలిచెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
పంచపంచాశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచపంచాశః = ఏభైయైదవ [55]; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని యాభైఐదవ సర్గ [55] సంపూర్ణము