వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥చతుష్పంచాశః సర్గః॥ [54- కామధేనువుకై విశ్వామిత్రుని యత్నం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామధేనుం వసిష్ఠోఽ పి
 యదా న త్యజతే మునిః ।
తదాస్య శబలాం రామ
 విశ్వామిత్రోఽ న్వకర్షత ॥

టీకా:

కామధేనుమ్ = కోరికలను నెరవేర్చు ఆవును, కామధేనువును; వశిష్ఠః = వశిష్ఠ మహర్షి; అపి = కూడా; యదా = ఎప్పుడు; న = లేదో; త్యజ్యతే = విడిచిపెట్టుట; మునిః = ముని ఐన; తదా = అప్పుడు; అస్య = అతని; శబలామ్ = శబలను; రామ = ఓ రామా!; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; అన్వకర్షత = బలవంతముగా లాగెను.

భావము:

ఓ రామచంద్రా! వశిష్ఠ మహర్షి కామధేనువును ఇచ్చుటకు నిరాకరించగా, విశ్వామిత్రుడు ఆ శబలను బలవంతముగా లాగుకొనెను.

1-55-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీయమానా తు శబలా రామ రాజ్ఞా మహాత్మనా|
దుఃఖితా చిన్తయామాస రుదన్తీ శోకకర్శితా||

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పరిత్యక్తా వసిష్ఠేన
 కిమహం సుమహాత్మనా ।
యాఽ హం రాజభటైర్దీనా
 హ్రియేయం భృశదుఃఖితా ॥

టీకా:

పరిత్యక్తా = విడువబడితినా; వసిష్ఠేన = వసిష్ఠునిచేత; కిమ్ = ఏమి; అహం = నేను; సుమహాత్మనా = గొప్ప మహాత్మునిచే; యా = ఏ; అహం = నేను; రాజభటైః = రాజభటుల చేత; దీనా = దీనురాలను; హ్రీయేయ = దొంగిలించబడుచున్న; భృశ = మిక్కిలి; దుఃఖితా = దుఃఖితురాలను.

భావము:

రాజభటులు నన్ను బలవంతముగా కొనిపోవుచున్నారు. దుఃఖితురాలను, దీనురాలను అగు నన్ను మహాత్ముడు వసిష్ఠ మహర్షి విడిచిపెట్టెనా, ఏమి ?

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కిం మయాఽ పకృతం తస్య
 మహర్షే ర్భావితాత్మనః ।
యన్మామనాగసం భక్తామ్
 ఇష్టాం త్యజతి ధార్మికః ॥

టీకా:

కిమ్ = ఏమి; మయా = నాచే; అపకృతం = అపకారము; తస్య = అతనికి; మహర్షేః = మహర్షికి; భావిత = పవిత్రమైన; ఆత్మనః = మనస్సు కలవాడు; యత్ = అది; అనాగసమ్ = నిరపరాధురాలను; భక్తామ్‌ = భక్తురాలను; ఇష్టామ్‌ = ఇష్టురాలను; త్యజతి = విడిచిపెట్టుచుండెను; ధార్మిక = ధర్మమార్గములో నడిచెడు

భావము:

పవిత్ర మనస్కుడైన ఆ మహర్షికి నా వలన ఎట్టి అపకారము కలిగెను? ఆతడు నన్ను ఎందులకు విడిచిపెట్టెను? నేను నిరపరాధురాలను, అతనికి ఇష్టురాలను, భక్తురాలను కదా !

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి సా చింతయిత్వా తు
 వినిశ్శ్వస్య పునఃపునః ।
నిర్ధూయ తాంస్తదా భృత్యాన్
 శతశః శత్రుసూదన ।
జగామానిల వేగేన
 పాదమూలం మహాత్మనః ॥

టీకా:

ఇతి = ఈ విధముగా; సా = ఆ ధేనువు; చింతయిత్వా = ఆలోచిస్తూ; తు; వినిశ్శ్వస్య = నిట్టూర్చుచు; పునః పునః = మరల, మరల; నిర్ధూయ = విదిలించుకొని; తాం = వారిని; తదా = ఆ సమయములో; భృత్యాన్ = సేవకులను; శతశః = వందల సంఖ్యలో; శత్రుసూదన = శత్రువులను సంహరించువాడా!; జగామ = వెళ్ళెను; అనిల వేగేన = వాయు వేగముతో; పాదమూలం = పాదముల సమీపము గూర్చి; మహాత్మనః = మహాత్ముని యొక్క.

భావము:

శత్రుసంహారకుడైన ఓ రామా! ఆ ధేనువు ఆ విధముగా ఆలోచించుచు, పదే పదే నిట్టూర్చుచు, వందల సంఖ్యలో ఉన్న ఆ సేవకులను విదిలించుకొని, వాయువేగముతో వశిష్ఠుని పాదముల దరికి చేరెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శబలా సా రుదంతీ చ
 క్రోశంతీ చేదమబ్రవీత్ ।
వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా
 మేఘ దుందుభిరావిణీ ॥

టీకా:

శబలా = శబల; సా = ఆ; రుదంతీ = గోలుగోలున విలపించుచు; చ = మరియు; క్రోశంతీ = అరచుచు; చ = మరియు; ఇదమ్ = ఈ వచనమును; అబ్రవీత్ = పలికెను; వసిష్ఠస్య = వసిష్ఠుని యొక్క; అగ్రతః = ఎదుట; స్థిత్వా = నిలచి; మేఘః = మేఘముల వంటి; దుందుభిః = దుందుభుల వంటి; రావిణీ = ధ్వనితో.

భావము:

శత్రుసంహారకుడైన ఓ రామా! ఆ ధేనువు ఆ విధముగా ఆలోచించుచు, పదే పదే నిట్టూర్చుచు, వందల సంఖ్యలో ఉన్న ఆ సేవకులను విదిలించుకొని, వాయువేగముతో వశిష్ఠుని పాదముల దరికి చేరెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“భగవన్! కిం పరిత్యక్తా
 త్వయాఽ హం బ్రహ్మణః సుత ।
యస్మాద్రాజభృతా మాం హి
 నయంతే త్వత్సకాశతః" ॥

టీకా:

భగవన్‌ = ఓ భగవానుడా; కిం = ఎందులకు; పరిత్యక్తా = విడిచివేయబడితిని?; త్వయా = నీచేత; అహం = నేను; బ్రహ్మణః = బ్రహ్మయొక్క; సుతః = కుమారుడా; యస్మాత్‌ = ఎందువలన; రాజః = రాజు యొక్క; భృతాః = సేవకులు; మాం = నన్ను; హి; నయంతే = కొనిపోవుచుంటిరి; త్వత్ = నీయొక్క; సకాశతః = దగ్గరనుంచి

భావము:

“ఓ బ్రహ్మకుమారా ! వసిష్ఠా! భగవానుడా! నీవు నన్ను ఎందులకు విడిచిపెట్టితివి? ఏ కారణముచే ఈ రాజు యొక్క సేవకులు నన్ను నీ సమీపమునుండి తీసుకుపోవుచుంటిరి?”

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తస్తు బ్రహ్మర్షిః
 ఇదం వచనమబ్రవీత్ ।
శోకసంతప్త హృదయాం
 స్వసారమివ దుఃఖితామ్ ॥

టీకా:

ఏవమ్‌ = ఈ విధముగా; ఉక్తః తు = పలుకబడిన; తు; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి; ఇదమ్ = ఈ; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను; శోకః = బాధతో; సంతప్త = తపించబడిన; హృదయాం = హృదయము గలదానిగురించి; స్వసారమ్ = సహోదరి గురించి; ఇవ = వలె; దుఃఖితామ్‌ = దుఃఖించుచున్న

భావము:

శోకముతో తపించుచున్న హృదయము గల శబలతో బ్రహ్మర్షి వసిష్ఠుడు దుఃఖితయైన తన సహోదరికి చెప్తున్నట్లు ఇట్లు చెప్పెను.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“న త్వాం త్యజామి శబలే
 నాపి మేఽ పకృతం త్వయా ।
ఏష త్వాం నయతే రాజా
 బలాన్మత్తో మహాబలః ॥

టీకా:

న = లేదు; త్వామ్ = నిన్ను; త్యజామి = నేను విడిచిపెట్టుట; శబలే = ఓ శబలా! న = లేదు; అపి = కూడ; అపకృతం = కీడు; త్వయా = నీ చేత; ఏషః = ఈ; త్వామ్ = నిన్ను; నయతే = తీసుకొనిపోవుచున్నాడు; రాజా = రాజు; బలాత్ = బలవంతముగా; మత్తః = నానుండి; మహాబలః = అత్యంత బలవంతుడు

భావము:

ఓ శబలా! నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీవు నాకు ఎట్టి అపకారము చేయలేదు. మిక్కిలి బలవంతుడైన ఈ రాజు నానుంచి నిన్ను బలవంతముగా కొనిపోవుచున్నాడు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న హి తుల్యం బలం మహ్యం
 రాజా త్వద్య విశేషతః ।
బలీ రాజా క్షత్రియశ్చ
 పృథివ్యాః పతిరేవ చ ॥

టీకా:

న = కాను; హి; తుల్యమ్‌ = సమానుడను; బలమ్ = బలములో; మహ్యమ్ = నా యొక్క; రాజా తు = రాజు కూడను; అద్య = ఈ దినము; విశేషతః = విశేషముగ; బలీ = శక్తివంతుడు; రాజా = రాజు; క్షత్రియః = క్షత్రియుడు; చ = మరియు; పృథివ్యాః = ఈ భూమికి; పతిః = ప్రభువు; ఏవ చ = మరియును

భావము:

శక్తిసామర్థ్యములలో నేను అతనికి సరికాను. అతడు బలవంతుడు, రాజై యున్నాడు. ఈ పృథివిని పరిపాలించు ప్రభువు కూడ.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇయమక్షౌహిణీ పూర్ణా
 సవాజిరథసంకులా ।
హస్తిధ్వజసమాకీర్ణా
 తేనాసౌ బలవత్తరః" ॥

టీకా:

ఇయమ్‌ = ఈ; అక్షౌహిణీ = అక్షౌహిణీ సంఖ్యలో; పూర్ణా = సంపూర్ణముగా; స = సహితముగా; వాజిః = గుఱ్ఱములతో; రథః = రథములతో; సంకులా = సమ్మర్థమై ఉన్నది; హస్తి = ఏనుగులు; ధ్వజ = ధ్వజములు; సమ = అధికముగా; ఆకీర్ణ = కిక్కిఱిసినది; తేన = ఆ కారణముచే; అసౌ = అతడు; బలవత్తరః = మిక్కిలి శక్తివంతుడు

భావము:

ఈ రాజునకు నిండు అక్షౌహిణీ సంఖ్యలో సేన గలదు. గుఱ్ఱములు, రథములు, ఏనుగులు, ధ్వజములు పదాతిదళములతో కిక్కిరిసి సమ్మర్ధమై ఉన్నది. అందువలన ఇతడు మిక్కిలి శక్తివంతుడు.”

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తా వసిష్ఠేన
 ప్రత్యువాచ వినీతవత్ ।
వచనం వచనజ్ఞా సా
 బ్రహ్మర్షిమతులప్రభమ్ ॥

టీకా:

ఏవమ్‌ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడిన; వసిష్ఠేన = వసిష్ఠునిచే; ప్రత్యువాచ = బదులు చెప్పెను; వినీతవత్ = వినయవంతురాలు; వచనమ్ = మాటను; వచనజ్ఞా = జ్ఞానముతో నిండిన పలుకులు తెలిసిన; సా = ఆమె; బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షి గూర్చి; అతులప్రభమ్‌ = సాటిలేని కాంతివంతుని గూర్చి

భావము:

సాటిలేని తేజస్సు గల బ్రహ్మర్షి వసిష్ఠుని మాటలు విని, మాటలు నేర్పుగా వాడుట తెలిసిన శబల సవినయముగా అతనికి ఇట్లు బదులు చెప్పెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“న బలం క్షత్రియస్యాహుః
 బ్రాహ్మణో బలవత్తరః ।
బ్రహ్మన్! బ్రహ్మబలం దివ్యం
 క్షత్రాత్తు బలవత్తరమ్ ॥

టీకా:

న = తగదు; బలమ్ = బలమును; క్షత్రియస్య = క్షత్రియుని యొక్క; ఆహుః = పలుకుట; బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; బలవత్తరః = ఎక్కువ బలవంతుడు; బ్రహ్మన్‌ = ఓ బ్రాహ్మణుడా !; బ్రహ్మబలమ్‌ = బ్రాహ్మణ బలము; దివ్యమ్‌ = దివ్యమైనది; క్షత్రాత్ తు = క్షత్రియుని కంటె; బలవత్తరమ్‌ = ఎక్కువ బలమైనది.

భావము:

ఓ బ్రాహ్మణోత్తమా! క్షత్రియుని బలమును గొప్పదిగా చెప్పరు. బ్రాహ్మణుడే ఎక్కువ బలవంతుడు. అతని బలము దివ్యమైనది. బ్రాహ్మణబలము క్షత్రియశక్తి కంటె అధికమైనది.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అప్రమేయబలం తుభ్యం
 న త్వయా బలవత్తరః ।
విశ్వామిత్రో మహావీర్యః
 తేజస్తవ దురాసదమ్ ॥

టీకా:

అప్రమేయబలమ్‌ = అంతులేని శక్తి; తుభ్యమ్ = నీకు; న = కాదు; త్వయా = నీ కంటె; బలవత్తరః = ఎక్కువ బలవంతుడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహావీర్యః = గొప్ప పరాక్రమవంతుడు; తేజః = తేజస్సు; తవ = నీ యొక్క; దురాసదమ్‌ = పొందరానిది

భావము:

నీవు అత్యంత శక్తిమంతుడివి. ఎంతో పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు నీ కంటె బలవంతుడు కాడు. నీ తేజస్సు ఇతరులకు పొందరానిది.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియుంక్ష్వ మాం మహాతేజః!
 త్వద్బ్రహ్మబల సమ్భృతామ్ ।
తస్య దర్పబలం యత్తన్
 నాశయామి దురాత్మనః" ॥

టీకా:

నియుఙ్‌క్ష్వ = నియమించుము; మామ్ = నన్ను; మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా; త్వత్ = నీ యొక్క; బ్రహ్మబల = బ్రాహ్మణబలము; సమ్భృతామ్ = నిండియున్న; తస్య = అతని యొక్క; దర్పబలమ్‌ = గర్వముతో కూడిన బలము; యత్ = ఏదియో; తత్‌ = దానిని; నాశయామి = నాశనము చేసెదను; దురాత్మనః = చెడు బుద్ధి కలవాడు

భావము:

మహాతేజోవంతుడా! నీ నిండైన బ్రాహ్మణశక్తితో నన్ను ఆదేశించుము. నేను ఆ దురాత్ముని గర్వము నణచి ఆతని బలమును నశింపజేసెదను.”

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యుక్తస్తు తయా రామ!
 వసిష్ఠస్తు మహాయశాః ।
“సృజస్వేతి” తదోవాచ
 ”బలం పరబలారుజమ్” ॥

టీకా:

ఇతి = ఇట్లు; ఉక్తః తు = పలుకబడి; తయా = ఆమెచేత; రామ = ఓ రామా; వసిష్ఠః తు = వసిష్ఠుడు; మహాయశాః = గొప్ప కీర్తివంతుడు; సృజస్వ = సృష్టించుము; ఇతి = అని; తదా = అప్పుడు; ఉవాచ = పలికెను; బలమ్ = సైన్యమును; పరబలారుజమ్ = శత్రుసైన్యమును పీడించెడు

భావము:

ఓ రామా ! ఆమె పలుకులు విని మహాయశస్వి వసిష్ఠ మహర్షి శబలతో ‘‘శత్రువులను పీడించెడు సైన్యమును సృష్టించుము” అని పలికెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య తద్వచనం శ్రుత్వా
 సురభిః సాఽ సృజత్తదా ।
తస్యా హుంభారవోత్సృష్టాః
 పప్లవాః శతశో నృప ॥

టీకా:

తస్య = అతని యొక్క; తత్‌ వచనమ్‌ = ఆ మాటను; శ్రుత్వా = విని; సురభిః = ఆ కామధేనువు; సా = ఆ; అసృజత్‌ = సృష్టించెను; తదా = అప్పుడు; తస్యా = ఆమెయొక్క; హుంభారవ = హుంభా అను శబ్దమునుండి; ఉత్సృష్టాః = విడువబడి; పప్లవాః = పప్లవులు; శతశః = వందల సంఖ్యలో; నృప = రాజా;

భావము:

అపుడు వసిష్ఠుని మాటలు వినిన కామధేనువు, సైన్యము సృష్టించెను. ఓ రామా! ఆ ధేనువు అంభారవములనుంచి, వందలకొలది పప్లవులు వెలువడి,

1-55-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యా హుమ్భారవోత్సృష్టాః పప్లవాశ్శతశో నృప|
నాశయన్తి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః||

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స రాజా పరమక్రుద్ధః
 క్రోధవిస్ఫారి తేక్షణః ।
పప్లవాన్ నాశయామాస
 శస్త్రై రుచ్చావచైరపి ॥

టీకా:

సః = ఆ; రాజా = ఆ రాజు; పరమక్రుద్ధః = మిక్కిలి కోపోద్రిక్తుడయిన; రోష = కోపముతో; విస్ఫారిత = విప్పారిన; ఈక్షణః = కన్నులతో; పప్లవాః = పప్లవులను; నాశయామాస = నశింపజేసెను; శస్త్రైః = శస్త్రములచే; ఉచ్చావచైః = బహుప్రకారము లైన; అపి = సహితముగ.

భావము:

విశ్వామిత్రమహారాజు తన సైన్యము నశింపబడుట చూచి చాలా కుపితుడై, కోపముతో విప్పారిన కన్నులు కలవాడై, వివిధరకముల ఆయుధములతో పప్లవులను నాశనము చేసెను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రార్దితాన్ దృష్ట్వా
 పప్లవాన్ శతశస్తదా ।
భూయ ఏవాసృజత్కోపాత్
 శకాన్ యవనమిశ్రితాన్ ॥

టీకా:

విశ్వామిత్రాః = విశ్వామిత్రునిచే; అర్థితాన్‌ = పీడింపబడిన, నాశనం కాబడిన; దృష్ట్వా = చూచి; పప్లవాన్ = పప్లవులను; శతశః = వందల కొలది; తదా = అప్పుడు; భూయ = మరల; ఏవ; అసృజత్ = సృష్టించెను; కోపాత్ = కోపమువలన; శకాన్ = శకులను; యవన = యవనులతో; మిశ్రితాన్‌ = కలపి.

భావము:

విశ్వామిత్రుని చేతిలో నాశనమయిన పప్లవులను చూచి, శబల మరల క్రోధముతో వందలకొలది పప్లవులను,శకులను యవనులతో కలసి సృష్టించెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తైరాసీత్సంవృతా భూమిః
 శకైర్య వనమిశ్రితైః ।
ప్రభావద్భి ర్మహావీర్యైః
 హేమ కింజల్క సన్నిభైః ॥

టీకా:

తైః = వారిచే; ఆసీత్ = అయ్యెను; సంవృతా = కప్పబడినది; భూమిః = భూమి; శకైః = శకులచే; యవనమిశ్రితైః = యవనులతో కలసిన వారిచే; ప్రభావద్భిః = కాంతిమంతులు; మహావీర్యైః = మహావీరులు; హేమకిఞ్ఙల్క సన్నిభైః = బంగారు తీగలను పోలినవారిచే;

భావము:

బంగారు తీగలవలె మిక్కిలి కాంతిమంతులు మహావీరులైన యవనులు శకులు, భూమిని పూర్తిగా కప్పివేసిరి.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీర్ఘాసి పట్టిశధరైః
 హేమవర్ణామ్బ రావృతైః ।
నిర్దగ్ధం తద్బలం సర్వమ్
 ప్రదీప్తైరివ పావకైః ॥

టీకా:

దీర్ఘాసి = పొడవైన కత్తులు; పట్టిశ = అడ్డకత్తులు; ధరైః = ధరించినవారిచే; హేమ = బంగారు; వర్ణః = రంగు; అమ్బరః = వస్త్రములచే; ఆవృతైః = ఆచ్ఛాదింపబడినవారిచే; నిర్దగ్ధమ్‌ = కాల్చబడినది; తత్ = ఆ; బలమ్ = సైన్యము; సర్వమ్ = సకలము; ప్రదీప్తైః = మండుచున్న; ఇవ = వలె; పావకైః = అగ్నులచేత;

భావము:

శకులు, యవనులు పొడవైన కత్తులు, పట్టిసములు మొదలగు ఆయుధములు ధరించి, బంగారురంగు పట్టు వస్త్రములు ధరించినవారై, మండుచున్న అగ్నులువలె మొత్తము సైన్యమును దహింపజేసిరి.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతోఽ స్త్రాణి మహాతేజా
 విశ్వామిత్రో ముమోచ హ ।
తైస్తైర్యవన కామ్భోజాః
 పప్లవా శ్చాకులీకృతాః ॥

టీకా:

తతః = ఆ తరువాత; అస్త్రాణి = అస్త్రములను; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; ముమోచ హ = విడిచిపెట్టెను; తైః తైః = వాటిచే; యవనః = యవనులు; కామ్భోజాః = కాంభోజులు; పప్లవాః = పప్లవులు; చ = కూడ; అకులీకృతాః = చెదిరినదిగా చేయబడెను.

భావము:

త తరువాత గొప్ప తేజస్సు కలిగిన విశ్వామిత్రుడు అస్త్రములను ప్రయోగించెను. ఆ ఆయుధములచే యవనులు, కాంభోజులు, పప్లవులు కూడా చెల్లాచెదురు అయిరి.

1-24-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 చతుష్పంచాశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుష్పంచాశ [54] = ఏభై నాలుగవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైనాలుగవసర్గ [54] సంపూర్ణం