వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥ఏకపంచాశః సర్గః॥ [51- విశ్వామిత్రుని పూర్వచరిత్ర]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య తద్వచనం శ్రుత్వా
 విశ్వామిత్రస్య ధీమతః ।
హృష్టరోమా మహాతేజాః
 శతానందో మహాతపాః ॥

టీకా:

తస్య = అప్పుడు; తత్ = ఆ; వచనమ్ = వచనమును; శ్రుత్వా = విని; విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క; ధీమతః = బుద్ధిమంతుడైన; హృష్టరోమాః = గగుర్పాటు కలిగినవాడై; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన వారు; శతానందః = శతానందుడు; మహాతపాః = గొప్ప తపస్సు కలిగిన వారు

భావము:

బుద్ధిమంతుడైన విశ్వామిత్రుని మాటలు విని, మహాతేజ శ్శాలియును, తపోధనుడును ఐన శతానందుడు పులకిత గాత్రుడయ్యెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గౌతమస్య సుతో జ్యేష్ఠః
 తపసా ద్యోతితప్రభః ।
రామసందర్శనాదేవ
 పరం విస్మయమాగతః ॥

టీకా:

గౌతమస్య = గౌతమముని యొక్క; సుతః = కుమారుడు; జ్యేష్టః = పెద్ద; తపసా = తపస్సు చేత; ద్యోతితప్రభః = కాంతితో వెలుగొందుచున్న వారు; రామాసందర్శనాత్ = శ్రీరామచందమూర్తి దర్శనము పొందిన; ఏవ = అంతనే; పరమ్ = మిక్కిలి; విస్మయమ్ = ఆశ్చర్యము; ఆగతః = పొందినారు.

భావము:

తపస్సు వలన కలిగిన కాంతితో వెలుగొందుతున్న వాడును, గౌతమముని పెద్దకుమారుడైన శతానందుడు, శ్రీరామచందమూర్తి దర్శనము పొంది చకితుడయ్యెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య
 సుఖాసీనౌ నృపాత్మజౌ ।
శతానందో మునిశ్రేష్ఠమ్
 విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥

టీకా:

సః = ఆ; తౌ = ఆ; నిషణ్ణౌ = సమీపమునందున్నవారిని; సంప్రేక్ష్య = చూచి; సుఖాసీనౌ = సుఖముగా కూర్చున్న; నృపాత్మజౌ = రాజకుమారులు ఇద్దరను; శతానందః = శతానందుడు; మునిశ్రేష్ఠమ్ = మునులలో శ్రేష్ఠుడైన; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; అథ = అటు పిమ్మట; అబ్రవీత్ = పలికెను

భావము:

ఆ శతానందుడు సమీపమునందు ఆసీనులై యున్న ఆ రాజకుమారులు రామ, లక్ష్మణులను చూచిన పిమ్మట, మునీశ్వరుడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను . .

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అపి తే మునిశార్దూల!
 మమ మాతా యశస్వినీ ।
దర్శితా రాజపుత్రాయ
 తపోదీర్ఘ ముపాగతా ॥

టీకా:

అపి = ఏమి; తే = మీచేత; మునిశార్దూల = మునిశ్రేష్ఠా; మమ = నాయొక్క; మాతా = మాతృమూర్తి; యశస్వినీ = కీర్తివంతురాలు; దర్శితా = చూపబడినదా?; రాజపుత్రాయ = రాకుమారునకు; తపః = తపస్సును; దీర్ఘమ్ = ఎంతోకాలం; ఉపాగతా = ఆచరించినటువంటి

భావము:

“మునిశ్రేష్ఠా! విశ్వామిత్రా! ఎంతోకాలముగా తపస్సు ఆచరిస్తున్నకీర్తివంతురాలు, నా మాతృమూర్తి అహల్యా మాతను ఈ రాజకుమారుడు రామునికి చూపించితిరా?

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అపి రామే మహాతేజా
 మమ మాతా యశస్వినీ ।
వన్యైరుపాహర త్పూజామ్
 పూజార్హే సర్వదేహినామ్ ॥

టీకా:

అపి = ఏమ్; రామే = శ్రీరామచంద్ర మూర్తిని; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన వారు; మమ = నాయొక్క; మాతా = మాతృమూర్తి; యశస్వినీ = యశస్సుకలిగిన; వన్యైః = వనములలో లభించు వాటితో; ఉపాహరత్ = చేసినదా?; పూజామ్ = పూజను; పూజార్హే = పూజించుటకు అర్హమయిన; సర్వదేహినామ్ = సకల ప్రాణులచే

భావము:

గొప్ప తేజస్సు, యశస్సు కలిగిన మా మాతృమూర్తి, సకలప్రాణులకు పూజ్యుడైన శ్రీరామచంద్రమూర్తిని వనములో లభించు పూలు, కందమూల ఫలములతో పూజించెనా?

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అపి రామాయ కథితమ్
 యథావృత్తం పురాతనమ్ ।
మమ మాతుర్మహాతేజో!
 దైవేన దురనుష్ఠితమ్ ॥

టీకా:

అపి = ఏమి; రామాయ = శ్రీరామునికి; కథితమ్ = చెప్పబడినదా?; యథావృత్తమ్ = యథాతథముగా; పురాతనమ్ = ఎప్పుడో జరిగిన ఘటన; మమ = నాయొక్క; మాతుః = మాతృమూర్తి గురించి; మహాతేజః = గొప్ప తేజస్సు కలిగిన; దైవేన = దైవము చేత; దురనుష్ఠితమ్ = చెడుగా చేయబడిన.

భావము:

ఓ మహాతేజోమూర్తీ విశ్వామిత్రా ! విధివశమున మా మాతృమూర్తికి జరిగిన దుర్ఘటన యథాతథముగా శ్రీరామచంద్రమూర్తికి వివరించితిరా?

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అపి కౌశిక! భద్రం తే
 గురుణా మమ సంగతా ।
మాతా మమ మునిశ్రేష్ఠ
 రామసందర్శ నాదితః ॥

టీకా:

అపి = ఏమి; కౌశిక = విశ్వామిత్రా; భద్రం = శుభమగుగాక; తే = నీకు; గురుణా = తండ్రితో; మమ = నాయొక్క; సఙ్గతా = కలిసినదా?; మాతా = మాతృమూర్తి; మమ = నాయొక్క; మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడైన; రామ = శ్రీరామచంద్రమూర్తి; సందర్శనాదితః = సందర్శనము మొదలగువానిచే

భావము:

మునులలో శ్రేష్ఠుడవైన ఓ విశ్వామిత్రా! నీకు శుభమగుగాక, శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యము వలన, మరియు ఆమె చేసిన అథితి సత్కారముల వలన, మా మాతృమూర్తి మా తండ్రిగారిని చేరుకున్నదా?

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అపి మే గురుణా రామః
 పూజితః కుశికాత్మజ ।
ఇహాగతో మహాతేజాః
 పూజాం ప్రాప్తో మహాత్మనః ॥

టీకా:

అపి = ఏమి; మే = నా; గురుణా = తండ్రిచే; రామః = శ్రీరామచంద్రమూర్తి; పూజితః = పూజింపబడినారా?; కుశికాత్మజ = కుశికనందనా విశ్వామిత్రా; ఇహ = ఇక్కడకు; ఆగతః = వచ్చినటువంటి; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; పూజామ్ = పూజను; ప్రాప్తః = పొందినాడా?; మహాత్మనః = మహాత్ముడైన శ్రీరాముడు.

భావము:

విశ్వామిత్రా! నాతండ్రి తేజోమూర్తి శ్రీరాముచంద్రమూర్తిని పుజించినారా? ఇక్కడకు వచ్చిన ఈ మహాత్ముడు శ్రీరామచంద్రమూర్తి నాతండ్రిని అనుగ్రహించినారా?

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అపి శాంతేన మనసా
 గురుర్మే కుశికాత్మజ ।
ఇహాగతేన రామేణ
 ప్రయతే నాభివాదితః" ॥

టీకా:

అపి = ఏమ్; శాంతేన = శాంతమైన; మనసా = మనస్సుతో; గురుః = తండ్రి; మే = నా యొక్క; కుశికాత్మజ = కుశికనందనా విశ్వామిత్రా; ఇహ = ఇక్కడకు; ఆగతేన = వచ్చిన; రామేణ = శ్రీరామచంద్రమూర్తిచే; ప్రయతేన = పరిశుద్దుడైన, ప్రయత్నశీలుడైవ. అభివాదితః = అభివాదము చేయబడినాడా?

భావము:

విశ్వామిత్రా! ఇక్కడకు వచ్చిన పరిశుద్దుడైన శ్రీరామచంద్రముర్తి ప్రశాంతమైన మనస్సుతో, మా తండ్రికి అభివాదము చేసెనా ?”

1-52-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః|
ప్రత్యువాచ శతానన్దం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్||

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“నాతిక్రాంతం మునిశ్రేష్ఠ!
 యత్కర్తవ్యం కృతం మయా ।
సంగతా మునినా పత్నీ
 భార్గవేణేవ రేణుకా" ॥

టీకా:

న = లేకుండా; అతిక్రాంతం = కర్తవ్యోల్లంఘనలు; మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడ; యత్ = ఏది; కర్తవ్యమ్ = కర్తవ్యమో; కృతమ్ = చేయబడినది; మయా = నాచేత; సంగతా = కలిసినది/చేరినది; మునినా = ముని గౌతమునితో; పత్నీ = వారి పత్ని అహల్యా; భార్గవేణేవ = జమదగ్నితో వలె; రేణుకా = రేణుకా.

భావము:

“ఓ మునిశ్రేష్ఠ! శతానందా! ఏ మాత్రము కర్తవ్యోల్లంఘన లేకుండా నా కర్తవ్యము నెరవేర్చితిని. రేణుకాదేవి జమదగ్ని మహర్షిని చేరినట్లు, అహల్యాదేవి తన భర్త గౌతమమునిని చేరినది.”

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తచ్ఛ్రుత్వా వచనం తస్య
 విశ్వామిత్రస్య భాషితమ్ ।
శతానందో మహాతేజా
 రామం వచనమబ్రవీత్ ॥

టీకా:

తత్ = ఆ; శ్రుత్వా = విని; వచనమ్ = పలుకులు; తస్య = ఆ; విశ్వామిత్రస్య = విశ్వామిత్రుని యొక్క; భాషితమ్ = పలుకబడిన; శతానందః = శతానందుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; రామమ్ = శ్రీరామునితో; వచనమ్ = మాటలను; అబ్రవీత్ = పలికెను;

భావము:

విశ్వామిత్ర మహర్షి పలికిన ఆ మాటలు విని, మహాతేజస్సు కలిగిన శతానందుడు శ్రీరామునితో ఈ విధముగా పలికెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“స్వాగతం తే నరశ్రేష్ఠ!
 దిష్ట్యా ప్రాప్తోఽ సి రాఘవ! ।
విశ్వామిత్రం పురస్కృత్య
 మహర్షి మపరాజితమ్ ॥

టీకా:

స్వాగతమ్ = స్వాగతము; తే = నీకు; నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడైన; దిష్ట్యా = దైవానుగ్రహంచే; ప్రాప్తః + అసి = వచ్చితివి; రాఘవ = శ్రీరామా; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; పురస్కృత్య = పురస్కరించుకుని; మహర్షిమ్ = మహర్షి అయిన; అపరాజితమ్ = అజేయుడైన

భావము:

శ్రీరామా నీకు స్వాగతము. అజేయుడైన విశ్వామిత్ర మహర్షి వెంట ఇక్కడకు నీ రాక మా అదృష్టము.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అచింత్యకర్మా తపసా
 బ్రహ్మర్షి రతులప్రభః ।
విశ్వామిత్రో మహాతేజా
 వేత్స్యేనం పరమాం గతిమ్ ॥

టీకా:

అచింత్య = చింతింపశక్యము కాని; కర్మా = కర్మలు/పనులు; తపసా = తపస్సు చేత; బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి; అతులప్రభః = సాటిలేని కాంతి కలిగినవారు విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; వేత్సి = ఎఱుగుము; ఏనమ్ = ఈతనిని; పరమామ్ = గొప్ప; గతిమ్ = గతి

భావము:

తపస్సుచే బ్రహ్మర్షి అయి, సాటిలేని కాంతితో ప్రకాశించే ఈ విశ్వామిత్రుడు మహాతేజశ్శాలి. వీరి కార్యములు ఊహింపశక్యము కానివి. వీరిని పరమ గతిగా ఎఱుగుము.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాస్తి ధన్యతరో రామ!
 త్వత్తోఽ న్యో భువి కశ్చన ।
గోప్తా కుశికపుత్రస్తే
 యేన తప్తం మహత్తపః ॥

టీకా:

నాస్తి = లేడు; ధన్యతరః = ధన్యాత్ముడు; రామ = ఓ శ్రీరామ; త్వత్తః = నీకంటే; అన్యః = మఱియొకడు; భువి = ఈ భూమండలములో; కశ్చన = ఒక్కడును గోప్తా = రక్షకుడు; కుశికపుత్రః = కుశిక నందనుడు విశ్వామిత్రుడు; తే = నీకు; యేన = ఎవరి చేత; తప్తమ్ = చేయబడినదో; మహత్ = గొప్ప; తపః = తపస్సు

భావము:

శ్రీరామా, గొప్ప తప్పస్సు చేసిన ఈ కుశికనందనుడు నీకు రక్షకుడుగా ఉండుటచే నీ కంటే ధన్యాత్ముడు ఈ భూలోకంలో వేరొకరు లేరు.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రూయతా మభిధాస్యామి
 కౌశికస్య మహాత్మనః ।
యథా బలం యథా వృత్తమ్
 తన్మే నిగదతః శృణు ॥

టీకా:

శ్రూయతామ్ = వినబడెను; అభిధాస్యామి = చెప్పెదను; కౌశికస్య = విశ్వామిత్రుని యొక్క; మహాత్మనః = మాహాత్ముడైన; యథా = ఏ విధముగా; బలమ్ = బలము; యథా = ఏ విధముగా; వృత్తమ్ = చరిత్రము; తత్ = దానిని; మే = నేను; నిగదతః = చెప్పుచున్న; శృణు = వినుము

భావము:

మహాత్ముడైన విశ్వామిత్రుని చరిత్ర గురించి, నేను విన్న ప్రకారం తెలిపెదను. వినుము.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజాభూదేష ధర్మాత్మా
 దీర్ఘకాల మరిందమః ।
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ
 ప్రజానాం చ హితే రతః ॥

టీకా:

రాజా = రాజుగా; అభూత్ = ఉండెను; ఏషః = ఈతడు; ధర్మాత్మా = ధర్మాత్ముడు; దీర్ఘకాలమ్ = చాలా కాలము; అరిందమః = శత్ర్రువులను అణిచినవాడు; ధర్మజ్ఞః = ధర్మములు తెలిసినవాడు; కృతవిద్యః = సమస్త విద్యాపారంగతుడు; చ = మరియు; ప్రజానామ్ = ప్రజల యొక్క; చ = మరియు; హితే = హితముయందు; రతః = అనురక్తి కలవాడు

భావము:

ఈ విశ్వామిత్రులవారు, ధర్మము తెలిసినవారు మరియు ఎల్లప్పుడు ధర్మాన్ని ఆచరించు వారు, సకల విద్యా పారంగతులు. వీరు గొప్ప మహారాజుగా చాలాకాలము శత్రువులను అణచిన వారై, ఎల్లప్పుడు తన ప్రజల హితములో అనురక్తి కలిగిన వాడు.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజాపతి సుతస్త్వాసీత్
 కుశో నామ మహీపతిః ।
కుశస్య పుత్రో బలవాన్
 కుశనాభః సుధార్మికః ॥

టీకా:

ప్రజాపతి = ప్రజాపతి; సుతః = కుమారుడు; తు; ఆసీత్ = ఉండెను; కుశః = కుశుడను; నామ = పేరు కలిగిన; మహీపతిః = రాజు; కుశస్య = కుశుని యొక్క; పుత్రః = కుమారుడు; బలవాన్ = బలవంతుడైన; కుశనాభః = కుశనాభుడు; సుధార్మికః = మంచి ధార్మికుడు

భావము:

ప్రజాపతి కుమారుడు కుశుడు. కుశుని పుత్రుడైన కుశనాభుడు బలవంతుడు మరియు ధార్మికుడు.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుశనాభ సుతస్త్వాసీత్
 గాధిరిత్యేవ విశ్రుతః ।
గాధేః పుత్రో మహాతేజా
 విశ్వామిత్రో మహామునిః ॥

టీకా:

కుశనాభ = కుశ నాభుడు; సుతః = కుమారుడు; తు; ఆసీత్ = ఉండెను; గాధిః = గాధి; ఇత్యేవ = అని; విశ్రుతః = ప్రసిద్ధిపొందినవాడు; గాధేః = గాధి యొక్క; పుత్రః = కుమారుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహామునిః = మహాముని.

భావము:

సుప్రసిద్ధుడగు కుశనాభునకు పుత్రుడు గాధి. ఆ గాధి సుతుడే ఈ మహాతేజశ్శాలి మహాముని అయిన విశ్వామిత్రులవారు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రో మహాతేజాః
 పాలయామాస మేదినీమ్ ।
బహువర్ష సహస్రాణి
 రాజా రాజ్య మకారయత్ ॥

టీకా:

విశ్వామిత్రః = విశ్వాముత్రుడు; మహాతేజాః = మహాతేజశ్శాలి; పాలయామాస = పరిపాలించెను; మేదినీమ్ = ఈ భూమండలము; బహు = అనేక; వర్షసహస్రాణి = వేల సంవత్సరాలు; రాజా = రాజుగా; రాజ్యమ్ = రాజ్యమును; అకారయత్ = చేసెను.

భావము:

మహాతేజశ్శాలి అయిన విశ్వామిత్రుడు చాలా వేల సంత్సరములు ఈ భూమండలాన్ని రాజుగా పరిపాలించెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కదాచిత్తు మహాతేజా
 యోజయిత్వా వరూథినీమ్ ।
అక్షౌహిణీ పరివృతః
 పరిచక్రామ మేదినీమ్ ॥

టీకా:

కదాచిత్తు = ఒకానొకప్పుడు; మహాతేజాః = గొప్ప తేజస్సు కలిగిన; యోజయిత్వా = సమకూర్చుకొని; వరూథినీమ్ = సైన్యమును; అక్షౌహిణీ = ఒక అక్షౌహిణి; పరివృతః = తనవెంట రాగా; పరిచక్రామ = చుట్టూ తిరిగెను; మేదినీమ్ = భూమండలమును.

భావము:

మహాతేజశ్శాలి అయిన విశ్వామిత్రుడు, ఒకానొకప్పుడు సైన్యమును సమకూర్చుకొని, ఒక అక్షౌహిణి సైన్యముతో భూమండలము చుట్టివచ్చెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నగరాణి చ రాష్ట్రాణి
 సరితశ్చ తథా గిరీన్ ।
ఆశ్రమాన్ క్రమశో రామ!
 విచరన్నాజగామ హ ॥

టీకా:

నగరాణి = నగరములను; చ = మరియు; రాష్ట్రాణి = రాష్ట్రములను; సరితః = నదులను; చ = మరియు; తథా = మరియు; గిరీన్ = పర్వతములను; ఆశ్రమాన్ = ఆశ్రమములను; క్రమశః = క్రమముగా; రామ = ఓ శ్రీరామచంద్ర; విచరన్ = సంచరించుచు; అజగామ = చేరెను; హ =

భావము:

శ్రీరామచంద్ర, విశ్వామిత్రుడు, నగరములను, నదులను దాటుచు క్రమముగా వశిష్ఠుని ఆశ్రమునకు విచ్చేసెను.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వసిష్ఠ స్యాశ్రమపదమ్
 నానావృక్షసు మాకులమ్ ।
నానామృగ గణాకీర్ణమ్
 సిద్ధచారణ సేవితమ్ ॥

టీకా:

వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రదేశమును; నానా = అనేకమైన; వృక్షః = వృక్షములు; ఆకీర్ణమ్ = నిండినదియును; సిద్ధచారణసేవితమ్ = సిద్ధులు , చారణులు సేవించేది అయిన.

భావము:

ఆ ఆశ్రమము, బహువిధముల వృక్షసంపదతో, పుష్పములతో; వన్యమృగములతో, ప్రశాంతమైన లేళ్ళ సముదాయములతో, పక్షుల గుంపులతో అలరారుచుండెను;

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవదానవ గంధర్వైః
 కిన్నరైరుప శోభితమ్ ।
ప్రశాంత హరిణాకీర్ణమ్
 ద్విజసంఘ నిషేవితమ్ ॥

టీకా:

దేవ = దేవతలు; దానవ = దానవులు; గంధర్వైః = గంధర్వులతో; కిన్నరైః = కిన్నెరలతోను; ఉపశోభితమ్ = శోభిల్లుచున్నటువంటి; ప్రశాంత = ప్రశాంతముగానున్న; హరిణః = లేళ్ళతో; ఆకీర్ణమ్ = నిండి ఉన్ని; ద్విజ = పక్షుల; సంఘ = సముదాయములతో; నిషేవితమ్ = సేవింపబడుతున్నదియు; సంఘనిషేవితమ్ = సముదాయములతో సేవింపబడుతున్నదియు.

భావము:

ఆ ఆశ్రమమునందు దేవ దానవ గంధర్వ కిన్నెరలు సిద్ధులు చారణులు సేవించుచుండెడివారు.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మర్షిగణ సంకీర్ణమ్
 దేవర్షిగణ సేవితమ్ ।
తపశ్చరణ సంసిద్ధైః
 అగ్నికల్పై ర్మహాత్మభిః ॥

టీకా:

బ్రహ్మర్షి = బ్రహ్మర్షుల; గణ = గణములతో; సఙ్కీర్ణమ్ = కూడినదియును; దేవర్షి = దేవర్షుల; గణ = గణములు; సేవితమ్ = సేవించుచుండెడి; తపః = తపస్సును; చరణ = చేయుచు; సంసిద్ధైః = సిద్ధి పొందిన వారును; అగ్నికల్పైః = అగ్నివలె; మహాత్మభిః = మహాత్ములును.

భావము:

ఆ ఆశ్రమము, బ్రహ్మర్షుల గణములతో, దేవర్షుల సమూహములతో, తపస్సుచే సిద్ధిపొందినవారితో, అగ్నివంటి తేజస్సు కలిగిన మహాత్ములతో కూడి ఉన్నది.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అబ్భక్షై ర్వాయుభక్షైశ్చ
 శీర్ణపర్ణాశనై స్తథా ।
ఫలమూలాశ నైర్దాంతైః
 జితరోషైర్జి తేంద్రియైః ॥

టీకా:

అప్ = నీరు; భక్షైః = భక్షించెడివారును; వాయు = వాయువును; భక్షైః = భక్షించెడివారును; చ = మరియు; శీర్ణ = పండిరాలిన; పర్ణ = ఆకులను; అశనైః = తినేవారు; తథా = మరియు; ఫలమూల = ఫలములను, దుంపలను; అశనైః = తినేవారు; దాంతైః = మనోనిగ్రహము కలవారు; జిత = జయింపబడిన; రోషైః = కోపము; జితేంద్రియైః = జయింపబడిన ఇంద్రియములు కలవారును.

భావము:

ఆ ఆశ్రమములో, కొందరు నీటినే ఆహారముగా స్వీకరించుట / జలభక్షణము చేయువారు, కొందరు వాయుభక్షణ, ఇంకొందరు రాలిన ఆకులను, కొంతమంది ఫలములు కందమూలములు ఆహారముగా గొనువారు ఉండిరి. కొందరు మనోనిగ్రహ సంపన్నులును, జితక్రోధులు, జితేంద్రియులు అక్కడ నివసించేవారు.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషిభిర్వా లఖిల్యైశ్చ
 జపహోమ పరాయణైః ।
అన్యై ర్వైఖానసైశ్చైవ
 సమంతా దుపశోభితమ్ ॥

టీకా:

ఋషిభిః = ఋషులతోను; వాలఖిల్యైః = వాలఖిల్యులతోను; చ = మరియు; జపహోమపరాయణైః = జపము, హోమములయందు ఆసక్తి కలిగిన వారితోను; అన్యైః = ఇతరులైన; వైఖానసైః = వైఖానసులతోను; చ = మరియు; ఏవ = మాత్రమే; సమంతాత్ = అంతటా; ఉపశోభితమ్ = శోభిల్లుచుండెను.

భావము:

ఎల్లప్పుడు జపము, హోమముల యందు ఆసక్తి కలిగిన ఋషు లతోను మఱియు వాలఖిల్యులు, వైఖానసులు అగు వానప్రస్థు లతోను ఆశ్రమము అంతటా శోభిల్లుతుండెను.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వసిష్ఠ స్యాశ్రమపదమ్
 బ్రహ్మలోక మివాపరమ్ ।
దదర్శ జయతాం శ్రేష్ఠో
 విశ్వామిత్రో మహాబలః ॥

టీకా:

వశిష్ఠస్య = వశిష్టులవారియొక్క; ఆశ్రమపదమ్ = ఆశ్రమ ప్రదేశము; బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకము; ఇవ = వలె; అపరమ్ = ఇంకొక; దదర్శ = దర్శించెను; జయతామ్ = జయశీలురలో; శ్రేష్ఠః = శ్రేష్టుడైన; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాబలః = మహా బలము కలిగిన.

భావము:

ఇంకొక బ్రహ్మలోకము వలె విరాజిల్లుతున్నటువంటి ఆ వశిష్ఠ ముని ఆశ్రమమును విజేతలలో శ్రేష్ఠుడును, మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు దర్శించెను.

1-29-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 ఏకపంచాశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకపంచాశ [51] = ఏభై ఒకటవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైఒకటవ [51] సర్గ సుసంపూర్ణము