వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥పంచాశః సర్గః॥ [50-రామలక్ష్మణులు మిథిల కేతెంచుట]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః ప్రాగుత్తరాం గత్వా
 రామః సౌమిత్రిణా సహ ।
విశ్వామిత్రం పురస్కృత్య
 యజ్ఞవాట ముపాగమత్ ॥

టీకా:

తతః = పిమ్మట; ప్రాగుత్తరాం = ఈశాన్య దిక్కును గూర్చి; గత్వా = వెళ్లి; రామః = రాముడు; సౌమిత్రిణా = లక్ష్మణునితో; సహ = కూడ; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; పురస్కృత్య = పురస్కరించుకొని; యజ్ఞవాటమ్ = యజ్ఞవాటికను; ఉపాగమత్ = పొందెను ( చేరెను).

భావము:

శ్రీరాముడు లక్ష్మణునితో గూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్యదిశగా ప్రయాణము చేసి జనకమహారాజు యొక్క యజ్ఞవాటికకు చేరెను,

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామస్తు మునిశార్దూలమ్
 ఉవాచ సహలక్ష్మణః ।
“సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి
 జనకస్య మహాత్మనః ॥

టీకా:

రామస్తు = రాముడైతే; మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి; ఉవాచ = పలికెను; సహలక్ష్మణః = లక్ష్మణ సమేతుడై; సాధ్వీ = మంచిది కదా; యజ్ఞసమృద్ధిః = యజ్ఞ సంభారముల సంపద; జనకస్య = జనకునియొక్క; మహాత్మనః = మహాత్ముడైన.

భావము:

రామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి, "మహాత్ము డైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చూడ చక్కగా నున్నవి,

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బహూనీహ సహస్రాణి
 నానాదేశ నివాసినామ్ ।
బ్రాహ్మణానాం మహాభాగ!
 వేదాధ్యయన శాలినామ్ ॥

టీకా:

బహూనీహ = అనేక; సహస్రాణి = వేలగొలది; నానాదేశ = అనేక దేశములందు; నివాసినామ్ = నివసించువారును; బ్రాహ్మణానాం = బ్రాహ్మణులయొక్క; మహాభాగ = పూజ్యుడా; వేదాధ్యయన = వేదాధ్యయనముతో; శాలినామ్ = ప్రకాశించువారు

భావము:

అనేక వేలకొలది నానాదేశవాసులు, వేదపండితులై ప్రకాశిస్తున్న బ్రాహ్మణులు ఇక్కడకు వచ్చి ఉన్నారు,

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషివాటాశ్చ దృశ్యంతే
 శకటీశత సంకులాః ।
దేశో విధీయతాం బ్రహ్మన్
 యత్ర వత్స్యామహే వయమ్" ॥

టీకా:

ఋషివాటః = ఋషుల నివాసస్థలముల తోను; చ = ఇంకను; దృశ్యంతే = చూడబడుచున్నవి; శకటీ = బండ్లు; శత = వందలకొలదికూడిన; సంకులాః = సందోహములు; దేశః = ప్రదేశము; విధీయతాం = నిర్ణయింపబడుగాక; బ్రహ్మన్ = ఓ మహాముని; యత్ర = ఎక్కడ; వత్స్యామహే = నివసించ గలమో; వయమ్ = మనము.

భావము:

వందలకొలది బండ్లసందోహములతో ఋషివాటికలు కనపడుచున్నవి, కావున ఓ మహర్షి మనము నివసించ తగు ప్రదేశము నిర్ణయింపుడు,

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామస్య వచనం శ్రుత్వా
 విశ్వామిత్రో మహామునిః ।
నివేశ మకరోద్దేశే
 వివిక్తే సలిలాయుతే ॥

టీకా:

రామస్య = రామునియొక్క; వచనం = మాటలు; శ్రుత్వా = విని; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; మహాముని = మహాముని అయిన; నివేశమ్ = విడిదిని; అకరోత్ = చేసెను; దేశే = ప్రదేశమునందు; వివిక్తే = జనసమర్ధ రహితము అగు; సలిలః = నీటితో; ఆన్వితే = కూడి నదియును;

భావము:

మహాముని విశ్వామిత్రుడు రాముని మాటలు విని జలసౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు నివాసస్థలముగా నిర్ణయించెను,

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వామిత్రమనుప్రాప్తమ్
 శ్రుత్వా స నృపతిస్తదా ।
శతానందం పురస్కృత్య
 పురోహిత మనిందితమ్ ।
ప్రత్యుజ్జగామ సహసా
 వినయేన సమన్వితః ॥

టీకా:

విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; అనుప్రాప్తమ్ = వచ్చినవానిగా; శ్రుత్వా = విని; సః = ఆ; నృపతిః = రాజు; తదా = అప్పుడు; శతానందం = శతానందుని; పురస్కృత్య = ఎదుట ఉంచుకొని; పురోహితమ్ = పురోహితుని; అనిందితమ్ = దోష రహితుడగు; ప్రత్యుజ్జగామ = ఎదురు వెళ్ళెను; సహసా = వెంటనే; వినయేన = వినయముతో; సమన్వితః = కూడినవాడై.

భావము:

అంతట జనక మహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు, పురోహితుడు అయిన శతానంద మహర్షిని ముందిడుకొని వినమ్రముగా ఆముని దగ్గరకు ఏతెంచెను,

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋత్విజోఽ పి మహాత్మానః
 త్వర్ఘ్యమాదాయ సత్వరమ్ ।
విశ్వామిత్రాయ ధర్మేణ
 దదుర్మంత్ర పురస్కృతమ్ ॥

టీకా:

ఋత్విజః = ఋత్విక్తులు; అపి = కూడా; మహాత్మానః = మహాత్ములైన; తు; అర్ఘ్యమ్ = ఆర్ఘ్యము మొదలుగా గల పూజా ద్రవ్యములను; ఆదాయ = గ్రహించి; సత్వరమ్ = శీఘ్రముగా; విశ్వామిత్రాయ = విశ్వామిత్రుని కొఱకు; ధర్మేణ = ధర్మము చేత; దదుః = ఇచ్చిరి; మంత్ర పురస్కృతమ్ = మంత్రపూర్వకముగా.

భావము:

వెనువెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్య పాద్యాదికములను మంత్రపూర్వకము గాను, ధర్మానుసారముగాను ఇచ్చి అతిథి సత్కారములు జరిపిరి,

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతిగృహ్య తు తాం పూజామ్
 జనకస్య మహాత్మనః ।
పప్రచ్ఛ కుశలం రాజ్ఞో
 యజ్ఞస్య చ నిరామయమ్ ॥

టీకా:

ప్రతిగృహ్య = స్వీకరించి; తు; తామ్ = ఆ; పూజామ్ = పూజను; జనకస్య = జనక మహారాజు యొక్క; మహాత్మనః = మహాత్ముడైన; పప్రచ్ఛ = ఆడిగెను; కుశలం = యోగక్షేమమును; రాజ్ఞః = రాజుయొక్క; యజ్ఞస్య = యజ్ఞముయొక్క; నిరామయమ్ = ఎట్టి బాధలు లేకుండుటను

భావము:

మహర్షి విశ్వామిత్రుడు జనక మహారాజు ఒనర్చిన అతిధి మర్యాదలు స్వీకరించి రాజు కుశలమును, యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుచున్న విషయమును గురించి అడిగెను,

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా
 సోపాధ్యాయ పురోధసః ।
యథాన్యాయం తతః సర్వైః
 సమాగచ్ఛత్ ప్రహృష్టవత్ ॥

టీకా:

సః = విశ్వామిత్రుడు; తాం = వారందరితో; చ; అపి = కూడా; మునీన్ = మునులను; పృష్ట్వా = యోగక్షేమములు అడిగి; సః = సమేతముగ; ఉపాధ్యాయః = ఉపాధ్యాయులతో పురోధసః = పురోహితులతో; యథాన్యాయం = న్యాయానుసారముగా; తతః = పిమ్మట; సర్వైః = వారి అందరితోను; సమాగచ్ఛత్ = కలిసి ఉండెను; ప్రహృష్టవత్ = సంతోషించిన వాడై.

భావము:

పిమ్మట విశ్వామిత్రుడు గురువులు, పురోహితులు, శతానందాది మహాఋషులను పద్దతిగా కుశల ప్రశ్నలు వేయుచు, సంతోషింగా వారందరితో కలిసి ఉండెను,

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ రాజా మునిశ్రేష్ఠమ్
 కృతాంజలి రభాషత ।
ఆసనే భగవన్నాస్తామ్
 సహైభి ర్మునిసత్తమైః ॥

టీకా:

అథ = పిమ్మట; రాజా = రాజు; మునిశ్రేష్ఠమ్ = ముని శ్రేష్ఠుని గూర్చి; కృతాంజలిః = దోసిలి కట్టినవాడై; అభాషత = పలికెను; ఆసనే = అసనమునందు; భగవన్ = పూజ్యుడవైన నీవు; ఆస్తామ్ = కుర్చుందువు గాక; సహ = కూడి; ఏభి = ఈ; మునిసత్తమైః = మునిశ్రేష్ఠులతో.

భావము:

అంతట జనకమహారాజు అంజలి ఘటించి విశ్వామిత్రునితో "మహాత్మా! పూజ్యుడవైన నీవు ఈ మునిశ్రేష్ఠులతో గూడి అసనమును అలంకరింపుము " అని పలికెను,

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జనకస్య వచః శ్రుత్వా
 నిషసాద మహామునిః ।
పురోధా ఋత్విజశ్చైవ
 రాజా చ సహ మంత్రిభిః ॥

టీకా:

జనకస్య = జనకమహారాజు యొక్క; వచః = వాక్కులు (మాటలు); శ్రుత్వా = విని; నిషసాద = కూర్చుండెను; మహామునిః = మహాముని; పురోధా = పురోహితుడును; ఋత్విజః = ఋత్విక్కులును; చ; ఏవ = మున్నగు వారు; రాజా = రాజును; చ; సహ = సహితము; మంత్రిభిః = మంత్రులతో కూడ.

భావము:

విశ్వామిత్రుడు రాజు మాటలు విని ఆసీనుడయ్యెను, పిమ్మట మంత్రిగణంసహితంగా జనకమహారాజు మఱియు పురోహితులు, ఋత్విజులు మున్నగువారును ఆసీనులు లయిరి,

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆసనేషు యథాన్యాయమ్
 ఉపవిష్టాన్ సమంతతః ।
దృష్ట్వా స నృపతిస్తత్ర
 విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥

టీకా:

ఆసనేషు = అసనముల యందు; యథాన్యాయమ్ = పద్దతి ప్రకారం; ఉపవిష్టాన్ = కూర్చున్న; సమంతతః = నలువైపుల; దృష్ట్వా = చూచి; సః = ఆ నృపతిః = రాజు; తత్ర = అచట; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి; అబ్రవీత్ = పలికెను.

భావము:

వారందరు పద్దతి ప్రకారం ఆసీనులైన పిమ్మట, జనకమహారాజు నలువైపుల వీక్షించి విశ్వామిత్ర మహర్షితో ఇట్లనెను,

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అద్య యజ్ఞసమృద్ధిర్మే
 సఫలా దైవతైః కృతా ।
అద్య యజ్ఞఫలం ప్రాప్తం
 భగవద్దర్శనా న్మయా ॥

టీకా:

అద్య = ఈ నాడు; యజ్ఞ = యజ్ఞము యొక్క; సమృద్ధిః = సంపద; మే = నాయొక్క; సఫలా = ఫలముకలదిగా; దైవతైః = దేవతలచేత; కృతా = చేయబడినది; అద్య = ఈ నాడు; యజ్ఞఫలం = యజ్ఞముయొక్క ఫలము; ప్రాప్తమ్ = పొందబడినది; భగవత్ = పూజ్యుడవైన నీ యొక్క; దర్శనాత్ = దర్శనము వలన; మయా = నాచేత.

భావము:

“ఓ మహర్షి ! దైవాను గ్రహముచే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరి సాఫల్యము సిద్ధించినది, నేడు ఋషిసత్తములైన మీ దర్శనము లభించుట నా యజ్ఞఫలముగా భావించెదను, "అని జనక మహారాజు పలికెను,

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధన్యోఽ స్మ్యనుగృహీతోఽ స్మి
 యస్య మే మునిపుంగవ ।
యజ్ఞోపసదనం బ్రహ్మన్!
 ప్రాప్తోఽ సి మునిభిః సహ॥

టీకా:

ధన్యః అస్మి = ధన్యుడనైతిని; అనుగృహీతః అస్మి = అనుగ్రహింప బడినవాడినైతిని; యస్య = ఏ; మే = నాయొక్క; ముని = మునులలో; పుఙ్గవ = శ్రేష్ఠుడ; యజ్ఞః = యజ్ఞముజరుగు; ఉపసదనం = స్థానమును గూర్చి; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా; ప్రాప్తః అసి = వచ్చినావో; మునిభిః = మునులతో; సహ = కూడి.

భావము:

"ఓ మునీశ్వరా! ఓ విశ్వామిత్ర బ్రహ్మర్షీ ! మీరు నన్ను అనుగ్రహించి మునీశ్వరులతో కలిసి ఈ యజ్ఞవాటికకు విచ్చేయుట వలన నేను ధన్యుడనైతిని, అనుగ్రహ పాత్రుడనైతిని.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్వాదశాహం తు బ్రహ్మర్షే
 శేషమాహు ర్మనీషిణః ।
తతో భాగార్థినో దేవాన్
 ద్రష్టుమర్హసి కౌశిక!” ॥

టీకా:

ద్వాదశాహం = పన్నెండు రోజులు; తు = మాత్రమే; బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ; శేషమ్ = మిగిలిన దానినిగా; అహుః = చెప్పుచున్నారు; మనీషిణః = విద్వాంసులు; తతః = అటు పిమ్మట; భాగార్థినః = భాగములను కోరుచున్న; దేవాన్ = దేవతలను; ద్రష్టుమ్ = చూచుటకు; అర్హసి = తగియున్నావు; కౌశిక = విశ్వామిత్రా {కౌశికు- కుశికుని వంశమున పుట్టినవాడు, గాధికి విశ్వామిత్రుడు జన్మించి తపోబలమున బ్రహ్మర్షి ఆయెను, విశ్వామిత్రుడు}.

భావము:

ఓ బ్రహ్మర్షీ ! యజ్ఞము పరిసమాప్తి నొందుటకు పన్నెండు దినములు మాత్రమే యున్నవి, అటుపిమ్మట యజ్ఞ హావిస్సుల కొరకు విచ్చేయు దేవతలను మీరు కూడా చూడవచ్చును”.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యుక్త్వా మునిశార్దూలం
 ప్రహృష్టవదన స్తదా ।
పునస్తం పరిపప్రచ్ఛ
 ప్రాంజలిః ప్రణతో నృపః ॥

టీకా:

ఇతి = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; ముని = మునుల యందు; శార్దూలమ్ = శ్రేష్ఠుని గుఱించి; ప్రహృష్టః = మిక్కిలి సంతసించిన; వదనః = ముఖము కలవాడై; తదా = అప్పుడు; పునః = మరల; తమ్ = అతనిని; పరిపప్రచ్ఛ = అడిగెను; ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై; ప్రణతః = నమస్కరించుచు; నృపః = రాజు.

భావము:

జనక మహారాజు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికిన పిమ్మట, మరల దోసిలొగ్గి వినమ్రముగా నమస్కరించుచు, సంతోషముతో వికసించిన ముఖముతో మరల ఈ విధముగా ప్రశ్నించెను,

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఇమౌ కుమారౌ భద్రం తే
 దేవతుల్య పరాక్రమౌ ।
గజసింహగతీ వీరౌ
 శార్దూల వృషభోపమౌ ॥

టీకా:

ఇమౌ = ఈ; కుమారౌ = బాలురు ఇద్దరకు; భద్రం = మంగళ మగుగాక; తే = నీకు; దేవః = దేవతలతో; తుల్య = సమాన మైన; పరాక్రమౌ = పరాక్రమము కలవారును; గజ = ఏనుగుల వంటి; సింహః = సింహముల వంటి; గతీ = గమనము కలవారును. వీరౌ = వీరులును; శార్దూల = పెద్దపులి తోడను; వృషభః = ఎద్దులతోడను. ఉపమౌ = సరితూగువారు.

భావము:

“ఓ విశ్వామిత్రా1 నీకు క్షేమ మగుగాక, ఈ బాలురు ఇరువురు దేవతలతో సమానమగు పరాక్రమము కలవారు, వీరలు గజ సింహముల వంటి. వీరులు, ఇంకను, పెద్దపులులతోను, ఎద్దులతోను సాటువచ్చు వా,

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పద్మపత్ర విశాలాక్షౌ!
 ఖడ్గతూణీ ధనుర్ధరౌ ।
అశ్వినావివ రూపేణ
 సముపస్థిత యౌవనౌ ॥

టీకా:

పద్మపత్ర = తామరరేకుల వలె; విశాలః = విశాలమైన; అక్షౌ = కనులు కలవారిద్దరును; ఖడ్గః = ఖడ్గములను; తూణీ = అంబుల పొదులను; ధనుః = ధనుస్సులను; ధరౌ = ధరించిన వారు; అశ్వినాః = అశ్వినీ దేవతలు; ఇవ = వలె; రూపేణ = అందమైన వారును; సముపస్థిత = సమీపించిన; యౌవనౌ = యవ్వన దశలో ఉన్నవారిరువురును.

భావము:

తామర రేకుల వలె విశాలమైన కన్నులు కలవారును, ఖడ్గములను అంబులపొదులను ధనస్సులను ధరించిన వారును, అశ్వనీదేవతలంత అందగాళ్ళును యవ్వన దశను చేరుతున్నవారును,

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ
 దేవలోకాది వామరౌ ।
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ
 కిమర్థం కస్య వా మునే ॥

టీకా:

యదృచ్ఛయా = స్వేచ్ఛానుసారముగా; గామ్ = భూమిని; ప్రాప్తౌ = చేరిన; దేవలోకాత్ = దేవలోకము నుండి; అమరౌ ఇవ = దేవతలవలె; కథమ్ = ఎట్లు; పద్భ్యామ్ = పాదముల చేత; ఇహ = ఇచటకు; ఇమౌ = ఈ; ప్రాప్తౌ = చేరిన ఇద్దరు; కిమర్థం = ఎందుకు; కస్య వా = ఎవరికి సంబంధించిన వారు; మునే = ఓ మునీశ్వరా.

భావము:

మునీశ్వరా ! దేవలోకము నుండి భూలోకమునకు దిగివచ్చిన దేవతల వలె ఉన్న ఈ బాలురు ఎవరివారు? ఇచ్చటికి కాలినడకను వచ్చినారేమి ? ఎందులకు వచ్చినారు?

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరాయుధధరౌ వీరౌ!
 కస్య పుత్రౌ మహామునే ।
భూషయంతావిమం దేశమ్
 చంద్రసూర్యా వివామ్బరమ్ ॥

టీకా:

వర = శ్రేష్ఠమైన; ఆయుధః = ఆయుధములను; ధరౌ = ధరించిన ఇద్దరు; వీరౌ = ఈ వీరులు; కస్య = ఎవరియొక్క; పుత్రౌ = పుత్రులు; మహామునే = ఓ మహాముని; భూషయంతౌ = అలంకరించుకొన్నవారును; ఇమం = ఈ; దేశమ్ = ప్రదేశమును; చంద్రసూర్యామ్ = చంద్రడు సూర్యుడు; ఇవా = వలె; అమ్బరమ్ = ఆకాశమున.

భావము:

ఓ మహామునీ! శ్రేష్ఠమైన ఆయుధములను ధరించిన ఈ వీరులు, ఈ ప్రదేశమును అలంకరింపజేయుచున్నారు, చంద్ర సూర్యులు ఆకాశమును ప్రకాశింప చేయునట్లు ఈ ప్రదేశమును ప్రకాశింపచేయుచున్న ఈ వీరులు ఇద్దరు ఎవరి పుత్రులో తెలియజేయ గోరుచున్నాను,

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పరస్పరస్య సదృశౌ
 ప్రమాణేంగిత చేష్టితైః ।
కాకపక్షధరౌ వీరౌ
 శ్రోతుమిచ్ఛామి తత్త్వతః" ॥

టీకా:

పరస్పరస్య = ఒకరికొకరు; సదృశౌ = పొలికగల వారును; ప్రమాణః = వయో రూప పరిమాణముచేతను; ఇంగిత = బొమముడి మున్నగు అభిప్రాయ సూచనల చేతనg; చేష్టితైః = చేష్టల చేతను; కాకపక్షధరౌ = జులపములను ధరించిన వారగు; వీరౌ = ఈ వీరులిద్దరను గూర్చి; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచున్నాను; తత్త్వతః = యదార్థముగా.

భావము:

జునపములను ధరించిన ఈ వీరులు రూప వయో పరిమాణములందు, బొమముడి మున్నగు అభిప్రాయ సూచన లందు, చేష్ఠ లందును ఒకరినొకరు బాగుగా పోలి యున్నారు, ఈ వీరు లిద్దరను గురించి తెలుసుకొన గోరు చున్నాను,

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్య తద్వచనం శ్రుత్వా
 జనకస్య మహాత్మనః ।
న్యవేదయ “న్మహాత్మానౌ
 పుత్రౌ దశరథస్య తౌ ॥

టీకా:

తస్య = ఆ; తత్ = ఆ; వచనం = మాటలను; శ్రుత్వా; = విని; జనకస్య = జనక మహారాజు యొక్క; మహాత్మనః = మహాత్ములగు. న్యవేదయత్ = తెలిపెను; మహాత్మానౌ = మహాత్ములగు వీరిద్దరు; పుత్రౌ = పుత్రులు; దశరథస్య = దశరథ మహారాజు యొక్క; తౌ = వారిరువురు.

భావము:

మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు మహాత్ముడైన జనకమహారాజు మాటలు విని అతనితో రామ లక్ష్మణుల గూర్చి ఇట్లనెను, “రాజా ఈ బాలురు ఇరువురు దశరథ మహారాజు కుమారులు,

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధాశ్రమ నివాసం చ
 రాక్షసానాం వధం తథా ।
తచ్చాగమన మవ్యగ్రమ్
 విశాలాయాశ్చ దర్శనమ్ ॥

టీకా:

సిద్ధాశ్రమ = సిద్ధాశ్రమము నందు; నివాసం = నివాసమును; చ = మఱియు; రాక్షసానాం = రాక్షసులయొక్క; వధం = సంహారమును; తథా = మరియు; తత్ = ఆ; ఆగమనమ్ = వచ్చుటను; అవ్యగ్రమ్ = నిర్భయముగా; విశాలాయాః = విశాల నగరము యొక్క; దర్శనమ్ = దర్శనమును.

భావము:

మహాతేజోశాలి అయిన విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు సిద్ధాశ్రమానికి వచ్చుట, రాక్షసులను వధించుట, నిర్భయముగా విశాలనగరమునకు వచ్చి చూచుట,

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అహల్యాదర్శనం చైవ
 గౌతమేన సమాగమమ్ ।
మహాధనుషి జిజ్ఞాసామ్
 కర్తుమాగమనం తథా" ॥

టీకా:

అహల్యా = అహల్య; దర్శనం చైవ = దర్శనమును; చైవ = ఇంకను; గౌతమేన = గౌతమునితో; సమాగమమ్ = కలయుట; మహాధనుషి = గొప్పదైన శివధనస్సునందు; జిజ్ఞాసామ్ = తెలిసికొనగోరి; కర్తుమ్ = చేయుట; ఆగమనం = వచ్చుటను; తథా = సమస్తము.

భావము:

అహల్యను చూచుట, గౌతమమునితో సమాగమమును, శివధనస్సును గుఱించి తెలుసుకొనగోరి మిథిలకు వచ్చుట మొదలగు విషయములు సమస్తము జనక మహారాజునకు ఎఱింగించెను,

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏతత్సర్వం మహాతేజా
 జనకాయ మహాత్మనే ।
నివేద్య విరరామాథ
 విశ్వామిత్రో మహామునిః ॥

టీకా:

ఏతత్ = వాటిని; సర్వం = అన్నింటిని; మహాతేజాః = మహాతేజస్వి అయిన; జనకాయ = జనక మహారాజునకు; మహాత్మనే = మహాత్ముడైన; నివేద్య = తెలిపి; విరరామ = విరమించెను; అథ = పిమ్మట; విశ్వామిత్రః = విశ్వామిత్ర; మహామునిః = మహాముని.

భావము:

ఆ విషయములను అన్నింటిని మహాత్ముడైన మహాతేజస్వి అగు జనకమహారాజునకు విశ్వామిత్ర మహాముని వివరముగా తెలిపెను,

1-26-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 పంచాశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచాశ = ఏభైయవ [50]; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని ఏభైవ [50] సర్గ సుసంపూర్ణము