వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥పంచమః సర్గః॥ [5 - అయోధ్యానగర వర్ణనము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సర్వాపూర్వమియం యేషాం
 ఆసీత్కృత్స్నా వసుంధరా ।
ప్రజాపతిముపాదాయ
 నృపాణాం జయశాలినామ్ ॥

టీకా:

సర్వా = అన్నిటికన్నా; పూర్వమ్ = పూర్వమునుండి; ఇయమ్ = ఈ; ఏషామ్ = ఏ; ఆసీత్ = ఉండెడిదో; కృత్స్నా = సమస్తమైన; వసుంధరా = భూమండలము, వసుధ; ప్రజాపతిమ్ = మను ప్రజాపతి; ఉపాదాయ = మొదలుకొని; నృపాణామ్ = రాజులకు సంబంధించినదిగా; జయశాలినామ్ = విజయశీలురైనవారికి

భావము:

పూర్వమునుండి ఈ భూమండలమంతా, మను ప్రజాపతి మొదలుకొని, విజయశీలురైన ఏ రాజుల ఆధీనములో ఉండెడిదో..v
*గమనిక:-  *(1) వసుంధర- వ్యు. వసు (బంగారము రత్నాలు మొగలగునవి) +ధృ+ఖచ్-ముమ్- టాప్ కృ.ప్ర., బంగారము రత్నాలు మున్నగునవి వసువులు అంటారు, వసువులను ధరించునది గాన వసుంధర. (2) నృప- వ్యు. నరులను పాలించువాడు, రాజు.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యేషాం స సగరో నామ
 సాగరో యేన ఖానితః ।
షష్టిః పుత్రసహస్రాణి
 యం యాంతం పర్యవారయన్ ॥

టీకా:

ఏషామ్ = ఏ రాజులలో; సః = అటువంటి; సగరః = సగరుడు; నామ = అను పేరుగలవాడు; సాగరః = సముద్రము; యేన = ఎవరిచే; ఖానితః = త్రవ్వింపబడినదో; షష్టిః పుత్ర సహస్రాణి = అరవై వేల మంది కొడుకులు; యమ్ = ఎవరిని; యాంతమ్ = యుద్ధమునకు వెళ్ళుచున్నప్పుడు; పర్యవారయన్ = చుట్టూ ఉండెడివారో

భావము:

సగరు డను చక్రవర్తి ఈ సముద్రమును తవ్వించెను. కనుకనే అది సాగరము అనబడును. సగరుడు చేసిన ప్రతి యుద్ధము లోను అతనికి తన అరవై వేల మంది కొడుకులు తోడుగ నుండెడి వారు. అట్టి సగరుడనబడే చక్రవర్తి ఏ రాజులలో ఉండెడి వాడో...

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇక్ష్వాకూణా మిదం తేషాం
 రాజ్ఞాం వంశే మహాత్మనామ్ ।
మహదుత్పన్న మాఖ్యానం
 రామాయణమితి శ్రుతమ్ ॥

టీకా:

ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకు వంశములోని; ఇదమ్ = ఈ; తేషామ్ = అటువంటి; రాజ్ఞామ్ = రాజులయొక్క; వంశే = వంశములలో; మహాత్మానామ్ = మహాత్ములైన; మహత్ = గొప్పగా; ఉత్పన్నమ్ = జన్మించిన; ఆఖ్యానమ్ = ఆఖ్యానము, పూర్వము జరిగినదానిని చెప్పుట; రామాయణమ్ = రామాయణము; ఇతి = అని; శ్రుతమ్ = వినుతికెక్కినది

భావము:

అట్టి మహాత్ములైన రాజులు కల వంశాలలో ఇక్ష్వాకు రాజవంశము కలదు. అందు, రామాయణముగా ప్రసిద్ధి చెందిన ఈ మహాచరిత్ర (ఇతిహాసము) పుట్టినది.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదిదం వర్తయిష్యామి
 సర్వం నిఖిలమాదితః ।
ధర్మకామార్థ సహితం
 శ్రోతవ్య మనసూయయా ॥

టీకా:

తత్ = అటువంటి; ఇదమ్ = దీనిని; వర్తయిష్యామి = ప్రచారము చేసెదను; సర్వమ్ = అంతా; నిఖిలమ్ = పూర్తిగా; ఆదితః = మొదటినుంచి; ధర్మకామార్థ = పురుషార్థములు, ధర్మ అర్థ కామ అనబడే పురుషార్థములు; సహితమ్ = కలిగియున్నదానిని; శ్రోతవ్యమ్ = వినుము; అనసూయయా = అసూయ లేకుండ

భావము:

అటువంటి ఈ రామాయణమును లోకమంతటా ప్రచారము చేసెదను. ధర్మార్థకామము లనెడి పురుషార్థములు కలిగియున్న ఈ రామాయణమును మొదటినుంచి పూర్తిగా అసూయ లేకుండా వినుము.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  



కోసలో నామ ముదితః
 స్ఫీతో జనపదో మహాన్ ।
నివిష్టః సరయూతీరే
 ప్రభూత ధనధాన్యవాన్ ॥

టీకా:

కోసలః = కోసల; నామః = అనబడు; ముదితః = సంతోషభరితమైన; స్ఫీతః = విశాలమైన; జనపదః = దేశము; మహాన్ = శ్రేష్ఠమైనది; నివిష్టః = ఉన్నది; సరయూ = సరయూ నది; తీరే = తీరమునందు; ప్రభూత = సమృద్ధిగా; ధనధాన్యవాన్ = ధనధాన్యములతో.

భావము:

కోసల అను విశాలమైన దేశము సరయూ నదీ తీరములో ఉన్నది. అది ధనధాన్య సమృద్ధితోను, నిత్యసంతుష్టులైన ప్రజలతోను విరాజిల్లుతున్నది.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయోధ్యా నామ నగరీ
 తత్రాసీల్లోక విశ్రుతా ।
మనునా మానవేంద్రేణ
 యా పురీ నిర్మితా స్వయమ్ ॥

టీకా:

అయోధ్యా = అయోధ్య అని; నామ = పిలవబడే; నగరీ = నగరము; తత్ర = అక్కడ; ఆసీత్ = ఉండెడిది; లోక = లోకములో; విశ్రుతా = ప్రసిద్ధిగాంచినది; మనునా = మను చక్రవర్తి అను; మానవేంద్రేణ = రాజశ్రేష్ఠునిచే; యా = ఆ; పురీ = పట్టణము; నిర్మితా = నిర్మింపబడెను; స్వయమ్ = స్వయముగా.

భావము:

ఆ కోసల దేశమందు అయోధ్య అనే నగరము ఉండెడిది. రాజశ్రేష్ఠుడైన మనుచక్రవర్తి స్వయముగా అయోధ్యను నిర్మించెను.
*గమనిక:-  *- అయోధ్య- అ(కానిది) యోద్ధుంశక్యా (యోధ్య), న. త,, యుద్ధంచేసి జయింప శక్యం కానిది, ఇది సరయూ తీరమున గల నగరము, ఇక్ష్వాకుల రాజధాని.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆయతా దశ చ ద్వే చ
 యోజనాని మహాపురీ ।
శ్రీమతీ త్రీణి విస్తీర్ణా
 సువిభక్త మహాపథా ॥

టీకా:

ఆయతా = విశాలమైన; దశ చ ద్వే = పన్నెండు; చ; యోజనాని = యోజనముల; మహాపురీ = మహా నగరము; శ్రీమతీ = శోభాయమానమైన; త్రీణి = మూడు (యోజనములు); విస్తీర్ణా = వెడల్పైనది; సువిభక్త = చక్కగా విభాగింపబడినట్టి; మహాపథా = పెద్ద రాజ మార్గములు కలది.

భావము:

విశాలమైన అయోధ్యా నగరము పన్నెండు యోజనముల పొడవైనది, మూడు యోజనముల వెడల్పైనది, వాహనాది ప్రకారం చక్కగా విభాగించిన దారులు రాజమార్గములు కలవి అయి ఉండెను.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజమార్గేణ మహతా
 సువిభక్తేన శోభితా ।
ముక్తపు ష్పావకీర్ణేన
 జలసిక్తేన నిత్యశః ॥

టీకా:

రాజమార్గేణ = రాజమార్గములు; మహతా = సువిశాలమైనవి; సువిభక్తేన = చక్కగా వాహనములను బట్టి విభాగించబడి; శోభితా = శోభాయమానమైనది; ముక్తా = తొలగించిన; పుష్పా = పుష్పములు; అవకీర్ణేన = పాడైనవి; జలసిక్తేన = నీటితో తడుపబడినది; నిత్యశః = నిత్యమూ.

భావము:

అయోధ్యా నగరములోని రాజమార్గములు విశాలమైనవి. బాటసారి, వాహానాదులను బట్టి దారులు విభాగించబడి తీరుగా ఉండునవి. నిత్యము రాలి ఎండిన పువ్వులు తొలగించబడి, కళ్లాపితో తడుపబడినవి.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాం తు రాజా దశరథో
 మహారాష్ట్ర వివర్దనః ।
పురీ మావాసయామాస
 దివం దేవపతిర్యథా ॥

టీకా:

తాం = ఆ; తు = యొక్క; రాజా దశరథః = దశరథ మహారాజు; మహా = గొప్ప; రాష్ట్ర = దేశమును; వివర్ధనః = వృద్ధి చేసెను; పురీమ్ = నగరమును; ఆవాసయామాస = నివసించుటకు వీలుగా; దివం = స్వర్గమును; దేవపతి = దేవేంద్రుడు; యథా = వలె.

భావము:

దశరథ మహారాజు సువిశాలమైన ఆ రాజ్యమును నివసించుటకు వీలుగా, దేవేంద్రుడు స్వర్గమును వృద్ధిచేసినట్లు అభివృద్ధి చేసెను.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కవాట తోరణవతీం
 సువిభ క్తాంతరాపణామ్ ।
సర్వ యంత్రాయుధవతీం
 ఉపేతాం సర్వశిల్పిభిః ॥

టీకా:

కవాట = ద్వారములు; తోరణ = తోరణములు; వతీమ్ = కలది; సువిభక్తా = చక్కగా విభాగించిన; అంతర = మధ్యలోని ప్రదేశములు; ఆపణామ్ = అంగడులకు; సర్వ = వివిధ; యంత్రా = యంత్రములు; ఆయుధ = ఆయుధములు; వతీమ్ = కలది; ఉపేతామ్ = కూడియున్నది; సర్వ = వివిధ; శిల్పిభిః = శిల్పులు (స్థపతులు) కూడ.

భావము:

అయోధ్యా నగరము ద్వారములు తోరణాలు కలది. అంగళ్ళు మధ్య ప్రదేశములతో చక్కగా విభాగములు చేయబడినది. సమస్తమైన యంత్రములు, ఆయుధములు కలది. అన్ని రకముల శిల్పులు, స్థపతులు కలది.
*గమనిక:-  *- (1) యంత్రము- పనిభారము తగ్గించు తైలయంత్రాది సాధనము. (2) ఆయుధము- వ్యు. ఆ+యుధ్+ఘఞ్ (కరణే) ఆయుధ్యతే అనేన,

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సూతమాగధ సంబాధాం
 శ్రీమతీ మతులప్రభామ్ ।
ఉచ్చాట్టాల ధ్వజవతీం
 శతఘ్నీశత సంకులామ్ ॥

టీకా:

సూత = రథములు తోలు వారు, శౌర్యపరాక్రమములు వర్ణించువారు; మాగధ = రాజవంశావళి ప్రశంసించెడి వారు; సంబాధామ్ = క్రిక్కిరిసి యున్నది; శ్రీమతీమ్ = సమృద్ధి; అతుల = అసమానమైన; ప్రభామ్ = వెలుగుచున్న; ఉత్ = ఉన్నతమైన; అట్టాల = కోటబురుజులు; ధ్వజ = పతాకములు; వతీమ్ = కలది; శతఘ్నీ = వందల మందిని పడగొట్టు ఆయుధములు, ఫిరంగి, నాలుగు మూరల ఇనుప ముండ్ర కఱ్ఱ, శబ్దరత్నాకరము; శత = వందలు; సంకులామ్ = కలిగియున్నది.

భావము:

అయోధ్యా నగరము స్తోత్రములు చేయు సారథుల చేతను, రాజ వంశ ప్రశస్తిని కీర్తించు వారి చేతను, అసమానమైన సమృద్ధితో శోభిల్లునది. ఉన్నతమైన బురుజులును, పతాకములును కలది. వందల కొలది శతఘ్నులు ఉన్నది.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వధూనాటక సంఘైశ్చ
 సంయుక్తాం సర్వతః పురీమ్ ।
ఉద్యానా మ్రవనోపేతాం
 మహతీం సాలమేఖలామ్ ॥

టీకా:

వధూః = స్త్రీలు; నాటక = నటీనటులు; సంఘైః = సంఘములతో; చ; సంయుక్తామ్ = కూడియున్నది; సర్వతః = నలువైపుల; పురీమ్ = నగరము; ఉద్యాన = ఉద్యాన వనములు; ఆమ్ర = మామిడి; వన = తోటలతో; ఉపేతామ్ = కూడినది; మహతీమ్ = గొప్పది; సాల = చావళ్ళు; మేఖలామ్ = చుట్టూ కలది.

భావము:

అయోధ్యా నగరము ఎందరో స్త్రీలు నటీనటులు కలది. నగరము నలువైపుల ఉద్యానవనములు, మామిడి తోటలు కలది. చుట్టూ గొప్ప సావిళ్ళు కలది.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుర్గగంభీర పరిఘాం
 దుర్గామన్యై ర్దురాసదామ్ ।
వాజివారణ సంపూర్ణాం
 గోభిరుష్ట్రైః ఖరైస్తథా ॥

టీకా:

దుర్గ = ప్రవేశించడానికి వీలుకాని; గంభీర = భయంకరమైన; పరిఘామ్ = అగడ్తలు కలది; దుర్గామ్ = కోటలు; అన్యైః = శత్రువుల వలన; దురాసదామ్ = ఆక్రమించుటకు వీలుకానివి; వాజి = గుఱ్ఱములు; వారణ = ఏనుగులు; సంపూర్ణామ్ = నిండియున్నది; తథా = మరియు; గోభిః = ఆవులతో; ఉష్ట్రైః = ఒంటెలతో; ఖరైః = గాడిదలతో

భావము:

ఆ నగరము చుట్టూ కల లోతైన అగడ్తలతో ప్రవేశించడానికి వీలుకానివి. కోటలు శత్రువులు దండెత్తుటకు వీలు పడనివి. గుఱ్ఱములు, ఏనుగులు, ఆవులు, ఒంటెలు, గాడిదలతో నిండి ఉన్నవి.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సామంతరాజ సంఘైశ్చ
 బలికర్మభి రావృతామ్ ।
నానాదేశ నివాసైశ్చ
 వణిగ్భి రుపశోభితామ్ ॥

టీకా:

సామంతరాజ = సామంత రాజుల; సంఘైః చ = సమూహములతో; బలికర్మభిః = కప్పము, సుంకము ఇత్యాది చెల్లించునట్టి; ఆవృతామ్ = నిండియున్నది; నానాదేశ = పెక్కు దేశముల; నివాసైః చ = నివసించు; వణిగ్భిః = వ్యాపారులచే; ఉపశోభితామ్ = విరాజిల్లుతున్నది.

భావము:

ఆ నగరము కప్పము, సుంకము వంటి చెల్లింపులు చేయుటకు వచ్చిన సామంతరాజులతో నిండి ఉన్నది. వివిధదేశాలకు చెందిన ఎందరో వ్యాపారులతో విరాజిల్లుచున్నది.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాసాదై రత్నవికృతైః
 పర్వతైరివ శోభితామ్ ।
కూటాగారైశ్చ సంపూర్ణాం
 ఇంద్రస్యే వామరావతీమ్ ॥

టీకా:

ప్రసాదైః = మిద్దెలతో; రత్న = రత్నములు; వికృతైః = అలంకరింపబడిన; పర్వతైః = క్రీడా పర్వతములతో; ఉపశోభితామ్ = చక్కగా అలంకరింపబడినవి; కూటాగారైః చ = బహుళ అంతస్తుల మేడలతో; సంపూర్ణామ్ = నిండియున్నది; ఇంద్రస్య = ఇంద్రుని యొక్క; ఇవ = వలె; అమరావతీ = అమరావతి (ఇంద్రుని యొక్క ముఖ్యపట్టణము).

భావము:

ఆ నగరము రత్నములు పొదిగిన మిద్దెలతోనూ, ఆహ్లాదకరమైన పర్వతములతోనూ, బహుళ అంతస్తుల మేడలతోను నిండి ఉండి, ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిల్లుచుండెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్రామ ష్టాపదాకారాం
 వరనారీగణై ర్యుతామ్ ।
సర్వరత్న సమాకీర్ణాం
 విమాన గృహ శోభితామ్ ॥

టీకా:

చిత్రామ్ = అచ్చెరువొందించు; అష్టాపద = పాచికలతో (అష్టాచమ్మా) ఆడు గడియలున్న పీట వంటిది, బంగారపు; ఆకారమ్ = ఆకారము గలది; వర = శ్రేష్ఠమైన; నారీ = స్త్రీల; గణైః = సమూహము; యుతామ్ = కలిగియున్నది; సర్వ = అన్ని రకముల; రత్న = రత్నములతో; సమాకీర్ణాం = నిండి ఉన్నది; విమాన = రాజసౌధముల వంటి; గృహ = మేడలతో; శోభితామ్ = ప్రకాశిస్తున్నది.

భావము:

ఆ నగరము పాచికలాడు పీట వంటి ఆకారముతో / బంగారపు రూపుతో ఆశ్చర్యకరముగా ఉన్నది. శ్రేష్ఠమైన స్త్రీలతో నిండి ఉన్నది. అన్ని రకముల రత్నములు సమృద్ధిగా కలది. రాజసౌధాలవంటి మేడలతో శోభిల్లుచున్నది.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గృహగాఢా మవిచ్ఛిద్రాం
 సమభూమౌ నివేశితామ్ ।
శాలితండుల సంపూర్ణామ్
 ఇక్షుకాండ రసోదకామ్ ॥

టీకా:

గృహ = గృహములు; గాఢామ్ = దట్టముగా కలది; అవిచ్ఛిద్రామ్ = లోపములు లేనిది; సమభూమౌ = ఎత్తు పల్లములుగా కాకుండా సమతలమైన నేల కలది; నివేశితామ్ = జన నివాసము బాగా కలది; శాలి = వరి; తండుల = ధాన్యముతో; సంపూర్ణామ్ = నిండియున్నది; ఇక్షుకాండ = చెఱుకు రసము వంటి; రసోదకామ్ = తియ్యనైన త్రాగునీరు కలది.

భావము:

ఆ నగరములో నేలంతా ఎత్తుపల్లములు లేని సమస్థలమ, ఏ లోపములు లేని చాలా గృహములు, మంచి జన సాంద్రత, వరిబియ్యము సమృద్ధిగా పండుట మఱియు చెఱుకు రసము వలె తియ్యటి త్రాగునీరు కలిగి ఉండెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుందుభీభి ర్మృదంగైశ్చ
 వీణాభిః పణవైస్తథా ।
నాదితాం భృశమత్యర్థం
 పృథివ్యాం తామనుత్తమామ్ ॥

టీకా:

దుందుభీభిః = భేరీలతోను; మృదంగైః చ = మృదంగములతోను; వీణాభిః = వీణలతోను; పణవైః = తప్పెటలతోను; తథా = మరియు; నాదితామ్ = వాద్యవాయింపులు కలది; భృశమ్ = మిక్కిలి; అత్యర్థమ్ = అధికముగా; పృథీవ్యామ్ = భూమిపై; తామ్ = ఆ నగరము; అనుత్తమామ్ = శ్రేష్ఠమైనది.

భావము:

అత్యుత్తమమైన ఆ అయోధ్యానగరములో భేరీలు, మృదంగములు, వీణలు, తప్పెట్లు మొదలైన వాయిద్యములొ అధికముగా వినిపించును.
*గమనిక:-  *- (1) దుందుభి- దుం దుం అను శబ్దముతో శోభించు బాగా పెద్ద ఢంకా, భేరీ,
Dundubh.
(2) మృదంగము- వ్యు. మృద్+అంగచి, మృజతే ఆహన్యతే అసౌ, వాయించబడునది, మద్దెలలో విశేషము,
Mridangam .
(3) పణవము- చిన్న తప్పెట, ఉడుక,

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విమానమివ సిద్ధానాం
 తపసాధిగతం దివి ।
సునివేశిత వేశ్మాంతాం
 నరోత్తమ సమావృతామ్ ॥

టీకా:

విమానమ్ = విమానము; ఇవ = వలె; సిద్ధానామ్ = సిద్ధులయొక్క; తపసా = తపస్సుచే; అధిగతమ్ = పొందబడిన; దివి = స్వర్గము; సునివేశిత = చక్కగా నివసించుటకు; వేశ్మాంతామ్ = గృహ వసతి కలది; నరోత్తమ = ఉత్తమ జనులతో; సమావృతామ్ = నిండియుండెడిది.

భావము:

ఆ నగరము, సిద్ధులు తమ తపోబలముతో స్వర్గమునుండి పొందబడిన విమానములవంటి చక్కటి నివాస గృహ సముదాయములు కలిగి, ఉత్తములైన జనవాసముతో నిండి యున్నది.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యే చ బాణై ర్నవిధ్యంతి
 వివిక్త మపరాపరమ్ ।
శబ్దవేధ్యం చ వితతం
 లఘుహస్తా విశారదాః ॥

టీకా:

ఏ = ఎవరును; బాణైః = బాణములతో; నవిద్యంతి = కొట్టరో; వివిక్తమ్ = ఒంటరిగా ఉన్నవానిని; అపరాపరమ్ = ముందు వెనుక తోడులేని వానిని; శబ్ద వేధ్యమ్ చ = శబ్దమును బట్టి కొట్టుటకు వీలుగానున్న వానిని; చ; వితతమ్ = వెనుతిరిగి పారిపోతున్న వానిని; లఘుహస్తాః = నేర్పరులైన విలుకాండ్రు; విశారదాః = నైపుణ్యము గలవారు;

భావము:

ఒంటరివానిని, అనాథలను, శబ్దము వలన గ్రహించి కొట్టుటకు వీలున్న వానిని, పారిపోవుచున్న వానిని, అక్కడి మహారథులు నేర్పరులైన విలుకాండ్రు మంచి నైపుణ్యము కలవారు ఐనను, ఎవరూ బాణములతో కొట్టరు.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సింహ వ్యాఘ్ర వరాహాణాం
 మత్తానాం నర్దతాం వనే ।
హంతారో నిశితైః శస్త్రైః
 బలా ద్బాహుబలై రపి ॥

టీకా:

సింహ = సింహములు; వ్యాఘ్ర = పులులు; వరాహాణాం = పందులు; మత్తానాం = మదించిన; నర్దతామ్ = గర్జిస్తున్న; వనే = అడవిలో; హంతారః = చంపువారు; నిశితైః = వాడియైన; శస్త్రైః = ఆయుధములచే; బలాత్ = బలమైన; బాహుబలైః = భుజబలముచే; అపి = ఐనను.

భావము:

సింహములు, పులులు, అడవి పందులు మొదలైన క్రూర మృగములను ఆ నగర మహారథులు నిశితమైన అస్త్రాలతో లేదా తమ భుజ బలముతో చంపుదరు.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాదృశానాం సహస్రైస్తాం
 అభిపూర్ణాం మహారథైః ।
పురీ మావాసయామాస
 రాజా దశరథస్తదా ॥

టీకా:

తాదృశానామ్ = అటువంటివారు; సహస్రైః = వేలకొలది; తామ్ = తాము; అభిపూర్ణామ్ = నిండియున్న; మహారథైః = మహారథులతో; పురీమ్ = ఆ నగరమును; ఆవాసయామాస = నివాసముగా; రాజా దశరథః = దశరథ మహారాజు; తదా = అప్పుడు.

భావము:

అటువంటి మహారథులు వేలకొలది ఉండెడి ఆ మహానగరమును దశరథ మహారాజు తన రాజధానిగా చేసుకుని అక్కడ నివసించెడివాడు.
*గమనిక:-   మహారథి - పదునొకండువేలమంది విలుకాండ్రతో, తన్ను సారథిని గుఱ్ఱములను కాపాడుకొనుచు పోరెడు యోధుఁడు.

1-23-జగతి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తామగ్ని మద్భిర్గుణ వద్భిరావృతాం
 ద్విజోత్తమై ర్వేదషడంగ పారగైః ।
సహస్రదైః సత్యరతై ర్మహాత్మభిః
 మహర్షి కల్పైర్ ఋషిభిశ్చ కేవలైః ॥

టీకా:

తామ్ = దానిని; అగ్నిమద్భిః = అహితాగ్నులును; గుణవద్భిః = సుగుణవంతులును; ఆవృతాం = నిండియున్న; ద్విజోత్తమైః = బ్రాహ్మణ శ్రేష్ఠులచేత; వేద = ఋగ్యజుస్సామాథర్వ వేదముల యందు; షడంగ = వేదాంగములైన శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పముల సహితముగా; పారగైః = సంపూర్ణ పాండిత్యము కలవారును; సహస్ర = వేలకొలది; దైః = దానము చేయువారును; సత్యరతైః = సత్య నిరతులును; మహాత్మభిః = గొప్ప మనసు కలవారును; మహర్షి = మహర్షులతో; కల్పై = సమానులును; ఋషిభిః = ఋషులును; చ; కేవలైః = కేవలము.

భావము:

అయోధ్యానగరములోని ద్విజులు అందరును అహితాగ్నులు, సద్గుణవంతులు, వేదవేదాంగ ఉద్దండులు, వేలకొలది దానము చేయువారు, సత్యనిరతులు, మహామనస్కులు, మహర్షుల వంటివారు, కేవలము ఋషులు. ఆ నగరమును దశరథుడు నివాసముగా చేసుకొని పరిపాలించెను.

1-24-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 పంచమః సర్గః

టీకా:

ప్రతిపదార్థము : ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; పంచమ [5] = ఐదవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [5] ఐదవ సర్గ సుసంపూర్ణము..