బాలకాండమ్ : ॥ఏకోనపంచాశః సర్గః॥ [49-అహల్యాశాప విముక్తి]
- ఉపకరణాలు:
అఫలస్తు తతః శక్రో
దేవానగ్నిపురోధసః ।
అబ్రవీత్ త్రస్తవదనః
సర్షిసంఘాన్ సచారణాన్ ॥
టీకా:
అఫలః = వృషణములు లేనివాడైన (వావిళ్ళవారి తెలుగు నిఘటువు); తు; తతః = అటు పిమ్మట; శక్రః = ఇంద్రుడు; దేవాన్ = దేవతల గూర్చి; అగ్ని = అగ్నృ; పురోగమాన్ = ముందుండగా; అబ్రవీత్ = నుడివెను; త్రస్త వదనః = దీన వదనుడై; స = కూడా ఉన్న; ఋషి = మహర్షులృ; సంఘాన్ = సంఘములతో; స = కూడా ఉన్న; చారణాన్ = చారణులతో.
భావము:
అటు పిమ్మట, వృషణములు కోల్పోయిన దేవేంద్రుడు దీనవదనుడై అగ్నిదేవుని ముందుంచుకున్న దేవతల తోను, మహర్షుల తోను, చారణులతోను ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“కుర్వతా తపసో విఘ్నం
గౌతమస్య మహాత్మనః ।
క్రోధముత్పాద్య హి మయా
సురకార్యమిదం కృతమ్ ॥
టీకా:
కుర్వతా = చేసితిని; తపసః = తపస్సునకు; విఘ్నం = ఆటంకము; గౌతమస్య = గౌతమ మహామునికి; మహాత్మనః = మహాత్ముడైన; క్రోధమ్ = కోపమును; ఉత్పాద్య హి = తెప్పించి; హి = వలన మాత్రమే; మయా = నాచేత; సురకార్యమ్ = దేవతల పని; ఇదం = ఈ; కృతమ్ = చేయబడినది.
భావము:
“మహాత్ముడైన గౌతమ మహర్షికి క్రోధము కలుగ చేయుట ద్వారా, వారి తపస్సునకు విఘ్నము కలుగజేసితిని. ఈ విధముగా దేవకార్యమును నెఱవేర్చితిని.
- ఉపకరణాలు:
అఫలోఽ స్మి కృతస్తేన
క్రోధాత్ సా చ నిరాకృతా ।
శాపమోక్షేణ మహతా
తపోఽ స్యాపహృతం మయా ॥
టీకా:
అఫలః = వృషణములు లేని వాడు (వావిళ్ళ నిఠంటువు); అస్మి = అయితిని; కృతః = చేయబడిన; తేన = వాని; క్రోధాత్ = కోపముచే; సా = ఆమె (అహల్య); చ = కూడా; నిరాకృతా = నిరాకరింపబడినది; శాపః = శాపములు; ఉక్షేణ = ఇచ్చుటచే; మహతా = గొప్ప; తపః = తపస్సు; అస్య = ఈతని; అపహృతం = అపహరింపబడినది; మయా = నాచే
భావము:
గౌతమముని శాపము కారణముగా నేను (ఇంద్రుడు) వంధ్యుడైతిని / గొడ్డుపోతిని. అహల్య పరిత్యజించబడినది. శాపము లిచ్చుట వలన గౌతమముని తపస్సు హరించినది.
- ఉపకరణాలు:
తస్మాత్సురవరాస్సర్వే సర్షిస్సఙ్ఘాస్సచారణాః! |
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ||
- ఉపకరణాలు:
శతక్రతోర్వచః శ్రుత్వా
దేవాః సాగ్నిపురోగమాః ।
పితృదేంవానుపేత్యాహుః
సర్వే సహ మరుద్గణైః ॥
టీకా:
శతక్రతోః = ఇంద్రుని యొక్క; వచః = మాటలు; శ్రుత్వా = విని; దేవాః = దేవతలు; స = సహితము; అగ్నిః = అగ్నిదేవునితో; పురోగమాః = ముందుంచుకుని; పితృదేవాన్ = పితృదేవతలను; ఉపేత్య = సమీపించి; ఆహుః = వచించిరి; సహ = కూడ; సర్వైః = సమస్త; మరుద్గణైః = మరుద్గణములతో.
భావము:
ఇంద్రుని వచనములు వినిన దేవతలు మరుద్గణములతో కలిసి అందరును అగ్నిదేవుని ముందుంచుకొని పితృదేవతల వద్దకు వెళ్ళి ఇట్లు పలికిరి.
- ఉపకరణాలు:
“అయం మేషః సవృషణః
శక్రో హ్యవృషణః కృతః ।
మేషస్య వృషణౌ గృహ్య
శక్రాయాశు ప్రయచ్ఛథ ॥
టీకా:
అయం = ఈ; మేషః = పొట్టేలు; స = కూడి ఉన్నది; వృషణః = వృషణములతో; శక్రః = ఇంద్రుడు; హి = ఏమో; అవృషణః = వృషణములు లేనివాడుగా; కృతః = చేయబడెను; మేషస్య = మేషము యొక్క; వృషణౌ = రెండు వృషణములను; గృహ్య = తీసుకుని; శక్రాయ = ఇంద్రునకు; ఆశు = వెంటనే; ప్రయచ్ఛత = తగిలించండి.
భావము:
“ఇంద్రుడు వృషణములు కోల్పోయినందున, యజ్ఞములో మీకు సమర్పించిన ఈ గొఱ్ఱె పొట్టేలు యొక్క వృషణములు తీసుకుని మహేంద్రునకు వెంటనే అమర్చండి.
- ఉపకరణాలు:
అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి|
భవతాం హర్షణార్థాయ యే చ దాస్యన్తి మానవాః||
- ఉపకరణాలు:
అగ్నేస్తు వచనం శ్రుత్వా
పితృదేవాః సమాగతాః ।
ఉత్పాట్య మేషవృషణౌ
సహస్రాక్షే న్యవేశయన్ ॥
టీకా:
అగ్నేః = అగ్ని యొక్క; తు; వచనం = మాటలను; శ్రుత్వా = విని; పితృదేవాః = పితృదేవతలు; సమాగతాః = వచ్చిన; ఉత్పాట్య = పెకలించి; మేషః = పొట్టేలు యొక్క; వృషణౌ = రెండు వృషణములను; సహస్రాక్షే = ఇంద్రునిలో; న్యవేశయన్ = అమర్చిరి.
భావము:
అక్కడ ఉన్న పితృదేవతలు అగ్ని మాటలను వినిరి. మేష వృషణములు రెంటిని పెకలించి ఇంద్రునికి అమర్చిరి.
- ఉపకరణాలు:
తదాప్రభృతి కాకుత్స్థ!
పితృదేవాః సమాగతాః ।
అఫలాన్ భుంజతే మేషాన్
ఫలైస్తేషామంయోజయన్ ॥
టీకా:
తదా+ప్రభృతి = అప్పటినుండి{తదాప్రభృతి- తదా- అప్పడి ప్రభృతి- మొదలు, అప్పటినుండి}; కాకుత్స్థ = శ్రీరామచంద్ర; పితృదేవాః = పితృదేవతలు; సమాగతాః = కలిసి; అఫలాన్ = వృషణములులేని; భుఞ్జతే = స్వీకరించుచున్నారు; మేషాన్ = మేషములను; ఫలై: = వృషణములను; తేషామ్ = అతనికి, ఇంద్రునికి; అయోజయన్ = అమర్చుటచే;
భావము:
శ్రీరామచంద్ర! నాటి నుండి పితృదేవతలు ఇంద్రునకు మేష వృషణములను అమర్చినందున, వృషణములు లేని గొఱ్ఱె పొట్టేలులను స్వీకరించుచున్నారు,
- ఉపకరణాలు:
ఇంద్రస్తు మేషవృషణః
తదాప్రభృతి రాఘవ ।
గౌతమస్య ప్రభావేన
తపసశ్చ మహాత్మనః ॥
టీకా:
ఇంద్రః = ఇంద్రుడు; తు; మేష = పొట్టేలు; వృషణః = వృషణములు కలవాడు; తదా ప్రభృతి = అప్పటినుండి; రాఘవ = శ్రీరామచంద్ర; గౌతమస్య = గౌతమముని యొక్క; ప్రభావేన = ప్రభావముచేత; తపసః = తపస్సుయొక్క; చ; మహాత్మనః = మహాత్ముడైన.
భావము:
శ్రీరఘురామ! మహాత్ముడైన గౌతమ మహర్షి తపశ్శక్తి ప్రభావముచే ఆనాటినుండి ఇంద్రుడు మేషవృషణుడైనాడు.
- ఉపకరణాలు:
తదాగచ్ఛ మహాతేజ
ఆశ్రమం పుణ్యకర్మణః ।
తారయైనాం మహాభాగాం
అహల్యాం దేవరూపిణీమ్" ॥
టీకా:
తత్ = అందుచే; ఆగచ్ఛ = రమ్ము; మహా = గొప్ప; తేజ = తేజస్సు కలవాడా; ఆశ్రమం = ఆశ్రమము గూర్చి; పుణ్యకర్మణః = పుణ్యకర్మలు గలవాని; తారయ = తరింపజేయుము; ఏనాం = ఈ; మహాభాగామ్ = మహాభాగ్యము కలిగినది; అహల్యాం = అహల్యను; దేవ రూపిణీమ్ = దేవతల రూపము కలిగినది.
భావము:
గొప్ప తేజస్సు కలిగిన శ్రీరామచంద్రా! పుణ్యకర్ముడైన గౌతమ ముని ఆశ్రమమునకు విచ్చేసి, దివ్యసౌందర్యము కలిగిన మహాభాగ్యవంతురాలు ఈ అహల్యను తరింపజేయుము.
- ఉపకరణాలు:
విశ్వామిత్రవచః శ్రుత్వా
రాఘవః సహలక్ష్మణః ।
విశ్వామిత్రం పురస్కృత్య
తమాశ్రమంమథావిశత్ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుని; వచః = మాటలను; శ్రుత్వా = విని; రాఘవః = శ్రీరామచంద్రుడు; సహ = సమేతుడై; లక్ష్మణః = లక్ష్మణుడు కలవాడు; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; పురస్కృత్య = ముందుంచుకొని; ఆశ్రమం = గౌతమముని ఆశ్రమమును; ప్రవివేశ = ప్రవేశించెను; హ.
భావము:
విశ్వామిత్రుని మాటలను విన్న శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై, ఆ మహర్షి వెంట గౌతమముని ఆశ్రమము లోనికి ప్రవేశించెను.
- ఉపకరణాలు:
దదర్శ చ మహాభాగాం
తపసా ద్యోతితప్రభామ్ ।
లోకైరపి సమాగమ్య
దుర్నిరీక్ష్యాం సురాసురైః ॥
టీకా:
దదర్శ = చూచెను; చ; మహాభాగాం = గొప్ప అదృష్టము కలదియు; తపసా = తపస్సుచే; ద్యోతిత = ప్రకాశించబడిన; ప్రభామ్ = తేజస్సు కలిగినదియు; లోకై: = లోకులకు (మానవులకు); అపి = కూడా; సమాగమ్య = సమీపించిన; దుర్నిరీక్ష్యాం = చూడశక్యము కానిదియును; సురాః = దేవతలకైన; అసురైః = రాక్షసులకైన.
భావము:
శ్రీరామచంద్రుడు తపస్సుచే ప్రకాశించుచున్న కాంతితో కూడిన ఆ మహాబాగ్యవంతురాలిని అహల్యను చూచెను. ఆమెను మానవులుకాని, దేవతలుకాని, అసురులుకాని సమీపించినను చూడజాలరు.
- ఉపకరణాలు:
ప్రయత్నాన్నిర్మితాం ధాత్రా
దివ్యాం మాయామయీమివ ।
సతుషారావృతాం సాభ్రాం
పూర్ణచంద్ర ప్రభామివ ॥
టీకా:
ప్రయత్నాత్ = ప్రయత్నపూర్వకముగా; నిర్మితాం = సృష్టింపబడినదియును; ధాత్రా = బ్రహ్మచే; దివ్యాం = దివ్యమైనదియును; మాయామయీమ్ = మాయా స్వరూపిణి; ఇవ = వలె; స = కూడిన; తుషార = మంచుచే; ఆవృతాం = కప్పబడిన; స = కూడిన; అభ్రాం = మేఘములతో; పూర్ణ = నిండు; చంద్ర = చంద్రుని; ప్రభామ్ = కాంతి; ఇవ = వలె నున్నది
భావము:
ఆమె సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడుచేత కోరి దివ్యరూపివలెను, మాయాస్వరూపిణి వలెను సృష్టించబడినట్లు ఉండెను. పొగమంచు కప్పివేసిన నిండుపున్నమి కాంతి వంటి ప్రకాశవంతమైన దేహము కలిగి ఉండెను.
- ఉపకరణాలు:
మధ్యేఽ మ్భసో దురాధర్షాం
దీప్తాం సూర్యప్రభామివ ।
సా హి గౌతమవాక్యేన
దుర్నిరీక్ష్యా బభూవ హ ॥
టీకా:
మధ్యే = మధ్యమున; అమ్భసః = నీటిలో; దురాధర్షాం = ఎదురింప శక్యము కాని; దీప్తాం = ప్రకాశించుచున్న; సూర్య = సూర్యుని; ప్రభామ్ = కాంతి; ఇవ = వలె; సా = ఆమె; హి; గౌతమ = గౌతమముని యొక్క; వాక్యేన = మాట ప్రభావమువలన; దుర్నిరీక్ష్యా = చూడశక్యము కానిది; బభూవ = అయ్యెను; హ.
భావము:
ఆమె నీటిమధ్యలో ప్రతిబింబించు సూర్యకాంతివలె ఎదురింప శక్యముకాని తేజస్సుతో ప్రకాశించుచుండెను. ఆ అహల్య, గౌతమముని మాట ప్రభావము వలన ఎవ్వరికిని కనబడకుండా ఉండెను.
- ఉపకరణాలు:
త్రయాణామపి లోకానాం
యావద్రామస్య దర్శనమ్ ।
శాపస్యాంతముపాగమ్య
తేషాం దర్శనమాగతా ॥
టీకా:
త్రయాణామ్ = మూడు; అపి = కూడ; లోకానాం = లోకములకు; యావత్ = అంతవరకు; రామస్య = శ్రీరామచంద్రుని; దర్శనమ్ = దర్శనము; శాపస్య = శాపము యొక్క; అంతమ్ = అంతమును; ఉపాగమ్య = పొంది; తేషాం = వారి; దర్శనమ్ = దర్శనము, కనబడుటను; ఆగతా = పొందినది.
భావము:
గౌతముని శాపప్రభావముచే అహల్యమాతకు శ్రీరాముని దర్శనము కలిగినంతవరకు ఆమెను ముల్లోకములలో ఎవరు చూడలేక పోయిరి. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి దర్శనభాగ్యము పొందినంతనే ఆమెకు శాపవిముక్తి కలిగెను, అందరు అహల్యమాతను చూడగలిగిరి.
- ఉపకరణాలు:
రాఘవౌ తు తత స్తస్యాః
పాదౌ జగృహతుస్తదా ।
స్మరంతీ గౌతమవచః
ప్రతిజగ్రాహ సా చ తౌ ॥
టీకా:
రాఘవౌ = రాఘవులు ఇద్దరు (రామ, లక్ష్మణులు); తు; తతః = అటుపిమ్మట; తస్యాః = ఆమెయొక్క; పాదౌ = రెండు పాదములను; జగృహతుః = సేవించిరి; తదా = అప్పుడు; స్మరంతీ = స్మరించుచు; గౌతమ = గౌతమముని; వచః = చెప్పిన మాటలు; ప్రతిజగ్రాహ = మాఱు సేవించెను; సా = ఆమె; చ = కూడా; తౌ = వారిరువురను.
భావము:
అప్పుడు శ్రీరామలక్ష్మణులు ఇరువురును అహల్యమాత పాదద్వయము సేవించిరి. అటుపిమ్మట గౌతమముని వచనములు స్మరించుచు ఆమెకూడ రామలక్ష్మణుల పాదములను సేవించెను.
- ఉపకరణాలు:
పాద్యమర్ఘ్యం తథాఽఽ తిథ్యం
చకార సుసమాహితా ।
ప్రతిజగ్రాహ కాకుత్స్థో!
విధిదృష్టేన కర్మణా ॥
టీకా:
పాద్యమ్ = పాద్యమును; అర్ఘ్యం = అర్ఘ్యమును; తథా = మరియు; ఆతిథ్యం = ఆతిథ్యమును; చకార = చేసెను; సుసమాహితా = సావధాన చిత్తముతో; ప్రతిజగ్రాహ = స్వీకరించెను; కాకుత్స్థః = శ్రీరాముడు; విధి దృష్టేన = శాస్త్రవిహితమైన; కర్మణా = విధానముగా
భావము:
శ్రీరామ లక్ష్మణులను సావధానచిత్తముతో ఆదరించుచు శాస్త్రోక్తమైన అర్ఘ్యము,పాద్యములతో అతిథి సత్కారము లను ఆచరించెను. శ్రీరామచంద్రుడు ఆ మర్యాదలను స్వీకరించెను.
- ఉపకరణాలు:
పుష్పవృష్టి ర్మహత్యాసీత్
దేవదుందుభిః నిఃస్వనైః ।
గంధర్వాప్సరసాం చాపి
మహానాసీ త్సమాగమః ॥
టీకా:
పుష్పవృష్టిః = పూలవాన; మహత్ = గొప్పగ; ఆసీత్ = అయ్యెను; దేవదుందుభినిస్స్వనైః = దేవదుందుభుల ధ్వనులతో కూడా; గంధర్వ = గంధర్వులు; అప్సరసాం = అప్సరసలు; చ; అపి = కూడా; మహాన్ = గొప్పగ; ఆసీత్ = అయ్యెను; సమాగమః = కలయుట.
భావము:
దేవతలు దుందుభులు మ్రోగించి పూలవాన కురిపించిరి. గంధర్వులు గానమొనర్చగా, అప్సరసలు నాట్యము చేసిరి.
- ఉపకరణాలు:
“సాధు సాధ్వితి” దేవాస్తాం
అహల్యాం సమపూజయన్ ।
తపోబల విశుద్ధాంగీం
గౌతమస్య వశానుగామ్ ॥
టీకా:
సాధు సాధు = బాగు బాగు; ఇతి = అని; దేవాః = దేవతలు; తామ్ = ఆ; అహల్యాం = అహల్యామాతను; సమపూజయన్ = పూజించిరి; తపోబల = తపోబలముచే; విశుద్ధ = విశుద్ధమైన; అంగీం = శరీరము కలిగినది; గౌతమస్య = గౌతమముని యొక్క; వశః = ఇచ్చానుసారము; అనుగామ్ = అనుసరించి.
భావము:
గౌతమముని ఆజ్ఞానుసారము మహాతపస్సు ఆచరించడముచేత పరిశుద్ధమైన శరీరము కలిగిన అహల్యను దేవతలు “బాగు బాగు” అని మెచ్చుకుని కొనియాడిరి.
- ఉపకరణాలు:
గౌతమో హి మహాతేజా
అహల్యాసహితః సుఖీ ।
రామం సంపూజ్య విధివత్
తపస్తేపే మహాతపాః ॥
టీకా:
గౌతమః = గౌతమముని కూడా; అపి = కూడా; మహాతేజాః = మహాతేజస్సు కల; అహల్యా = అహాల్యతో; సహితః = కూడి; సుఖీ = సుఖవంతుడై; రామం = శ్రీరామచంద్రుని; సంపూజ్య = బాగుగా పూజించి; విధివత్ = శాస్త్రప్రోక్తముగా; తపః+తేపే = తపస్సు చేయసాగెను; మహాతపాః = మహాతపస్వి.
భావము:
మహాతపస్వి, గొప్ప తేజస్సు గల గౌతమ మని అచటకు చేరి అహల్యను స్వీకరించి, ఇద్దరును శ్రీరామచంద్రుని శాస్త్రోక్తముగ పూజించి సుఖముగ ఉండిరి. పిమ్మట వారిరువురు అచటనే తపము ఆచరింపసాగెను.
- ఉపకరణాలు:
రామోఽ పి పరమాం పూజాం
గౌతమస్య మహామునేః ।
సకాశా ద్విధివత్ ప్రాప్య
జగామ మిథిలాం తతః ॥
టీకా:
రామః = శ్రీరామచంద్రుడుకూడ; అపి = కూడ; పరమాం = గొప్ప; పూజాం = పూజను; గౌతమస్య = గౌతమునియొక్క; మహామునేః = మహామునియైన; సకాశాత్ = వద్దనుండి; విధివత్ = యథావిధిగా; ప్రాప్య = పొంది; జగామ = వెళ్ళెను; మిథిలాం = మిథిలానగరము గూర్చి; తతః = పిమ్మట.
భావము:
గౌతమముని వద్దనుండు పూజలను యథావిధిగా స్వీకరించిన శ్రీరామచంద్రుడు అచటనుండి మిథిలానగరమునకు వెళ్ళెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకోనపంచాశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకోనపంచాశ = నలభైతొమ్మిదవ [49]; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచిత తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని నలభైతొమ్మిదవ సర్గః [49] సమాప్తము.