బాలకాండమ్ : ॥సప్తచత్వారింశః సర్గః॥ [47 విశ్వామిత్ర విశాలనగర ప్రవేశము]
- ఉపకరణాలు:
సప్తధా తు కృతే గర్భే
దితిః పరమదుఃఖితా ।
సహస్రాక్షం దురాధర్షమ్
వాక్యం సానునయాబ్రవీత్ ॥
టీకా:
సప్తధా = ఏడు ముక్కలుగా; తు; కృతే = చేయబడుచుండగా; గర్భే = గర్భపిండము; దితిః = దితి; పరమ = మిక్కిలి; దుఃఖితా = దుఃఖించినదై; సహస్రాక్షమ్ = దేవేంద్రుని గురించి; దురాధర్షమ్ = ఎదిరింపశక్యము కాని; వాక్యమ్ = వాక్యమును; స = సహితమైన; అనునయా = అనునయము కలదై; అబ్రవీత్ = పలికెను;
భావము:
ఇట్లు తన గర్భపిండము ఏడు ముక్కలుగా ఖండించబడి నందుకు దుఃఖించుచు దితి, ఎదిరింప శక్యము కాని దేవేంద్రునితో అనునయపూర్వకముగా ఇట్లు పలికెను.
*గమనిక:-
దితి- దైత్యులమాత, నఱకుట, ఖండనము, ఆంధ్రశబ్దరత్నాకరము.
- ఉపకరణాలు:
1.47.2.
“మమాపరాధాద్ గర్భోఽ యమ్
సప్తధా విఫలీకృతః ।
నాపరాధోఽ స్తి దేవేశ!
తవాత్ర బలసూదన! ॥
టీకా:
మమ = నాయొక్క; అపరాధాత్ = అపరాధము వలన; గర్భః = గర్భము; అయమ్ = ఇది; సప్తధా = ఏడు భాగములుగా; విఫలీ = వ్యర్థమైనదిగా; కృతః = చేయబడినది; న = లేదు; అపరాధః = అపరాధము; అస్తి = కలుగుట; దేవేశ = దేవేంద్రా!; తవ = నీయొక్క; అత్ర = ఈ విషయమున; బలసూదన = బలాసురుని సంహరించిన ఇంద్రా!.
భావము:
“బలాసూదన! ఓ దేవేంద్రా! నా అపరాధము వలన నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థమైనది, ఇందు నీ అపరాధ మన్నది లేదు.
*గమనిక:-
మరుత్తః వాతస్కంధః ఆకాశస్య భాగవిశేషః (యత్ర వాయుర్వహతి). 1. భూమి నుండీ మేఘాల వరకూ తిరిగే వాయువు - "ఆవహము". 2. మేఘాలనుండీ సూర్యుని వరకూ - "ప్రవహము". 3. సూర్యుని నుండీ చంద్రుని వరకూ - "సంవహము". 4. చంద్రుడు నుంచీ నక్షత్రాల వరకు - "ఉద్వహము". 5. నక్షత్రాల నుండీ గ్రహ మండలం వరకూ - "వివహము". 6. గ్రహ మండలం నుండీ సప్తర్షుల వరకూ - "పరి వహము". 7. సప్తర్షి మందలం నుంచీ ధ్రువ మండలం వరకు - "పరావహము". అను పేర్లు గల సప్త మరుత్తులు. వీటిని "వాతస్కంధములు" అంటారు. ఈ క్రమముననే ఆంధ్రమహా భాగవతము నందు పోతనామాత్యుల వారు ఇట్లు పేర్కొనిరి. 8-622-శా. ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై। నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై। నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై। నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై॥

వాతస్కన్ధా ఇమే సప్త
చరంతు దివి పుత్రక ।
మారుతా ఇతి విఖ్యాతా
దివ్యరూపా మమాత్మజాః ॥
టీకా:
వాత = వాయు; స్కన్ధాః = విభాగములు (పొరలు, స్థానములు); ఇమే = ఈ; సప్త = ఏడుగురు; దివిః = ఆకసమున (అంతరిక్షమునందు); చరంతు = సంచరించెదరు గాక; పుత్రక = పుత్రా; మారుతాః = మరుత్తులు; ఇతి = అని పిలవబడుచు; విఖ్యాతాః = ప్రసిద్ధులగుదురు; దివ్య = దివ్యమైన; రూపాః = రూపము గలవారు; మమ = నాయొక్క; ఆత్మజాః = కుమారులు.
భావము:
కుమారా! ఈ ఏడుగురు సప్త వాయు స్కంధములు / సప్త వాయువులుగా ఆకాసమునందు సంచరించెదరు గాక. నా కుమారులు దివ్య రూపములు గలవారై మరుత్తులను పేరుతో పిలువబడుదరు గాక.
- ఉపకరణాలు:
బ్రహ్మలోకం చరత్వేక
ఇంద్రలోకం తథాపరః ।
దివి వాయురితి ఖ్యాతః
తృతీయోఽ పి మహాయశాః ॥
టీకా:
బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకము; చరతు = చరించును; ఏకః = ఒకడు; ఇంద్రలోకమ్ = ఇంద్రలోకమును; తథా = అటులనే; అపరః = మరొకడును; దివి = ఆకసమునందు; వాయుః = వాయువు; ఇతి = అని; ఖ్యాతః = ప్రసిద్ధుడు; తృతీయః = మూడవవాడు; అపి = కూడ; మహాయశాః = గొప్పకీర్తి కలవాడా, ఇంద్రా.
భావము:
దేవేంద్రా! వారిలో నొకడు బ్రహ్మలోకమునందు, మరొకడు ఇంద్రలోకమునందు, మూడవవాడు ఆకసము నందు ప్రసరించెదరు అని ప్రసిద్ధి.
*గమనిక:-
ఆకాశమునందు ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, వివహ, పరివహ, వరావహములనే ఏడు వాయు ప్రకారముల (స్థానములు) ఉన్నవి; - 1; ఆహవ వాయువు: మేఘ మండలానికి; భూమండలానికి మధ్య ప్రసరించునది, ఇది ఆకాసము; 2; ప్రవహ వాయువు: సూర్య మండలానికి; మేఘ మండలానికి మధ్య ప్రసరించునది, ఇది ఇంద్రలోకము; 3; అనువహ వాయువు: చంద్ర మండలానికి; సూర్య మండలానికి మధ్య ప్రసరించునది; 4; సంవహ వాయువు: నక్షత్ర మండలానికి; చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది; 5; వివహ వాయువు: గ్రహ్ర మండలానికి; నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది; 6; పరావహ వాయువు: సప్తర్షి మండలానికి; గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది; 7; పరివహ వాయువు: ధ్రువ మండలానికి; సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది. ఇది బ్రహ్మలోకము.
- ఉపకరణాలు:
1.47.2.
“మమాపరాధాద్ గర్భోఽ యమ్
సప్తధా విఫలీకృతః ।
నాపరాధోఽ స్తి దేవేశ!
తవాత్ర బలసూదన! ॥
టీకా:
మమ = నాయొక్క; అపరాధాత్ = అపరాధము వలన; గర్భః = గర్భము; అయమ్ = ఇది; సప్తధా = ఏడు భాగములుగా; విఫలీ = వ్యర్థమైనదిగా; కృతః = చేయబడినది; న = లేదు; అపరాధః = అపరాధము; అస్తి = కలుగుట; దేవేశ = దేవేంద్రా!; తవ = నీయొక్క; అత్ర = ఈ విషయమున; బలసూదన = బలాసురుని సంహరించిన ఇంద్రా!.
భావము:
“బలాసూదన! ఓ దేవేంద్రా! నా అపరాధము వలన నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థమైనది, ఇందు నీ అపరాధ మన్నది లేదు.
*గమనిక:-
మరుత్తః వాతస్కంధః ఆకాశస్య భాగవిశేషః (యత్ర వాయుర్వహతి). 1. భూమి నుండీ మేఘాల వరకూ తిరిగే వాయువు - "ఆవహము". 2. మేఘాలనుండీ సూర్యుని వరకూ - "ప్రవహము". 3. సూర్యుని నుండీ చంద్రుని వరకూ - "సంవహము". 4. చంద్రుడు నుంచీ నక్షత్రాల వరకు - "ఉద్వహము". 5. నక్షత్రాల నుండీ గ్రహ మండలం వరకూ - "వివహము". 6. గ్రహ మండలం నుండీ సప్తర్షుల వరకూ - "పరి వహము". 7. సప్తర్షి మందలం నుంచీ ధ్రువ మండలం వరకు - "పరావహము". అను పేర్లు గల సప్త మరుత్తులు. వీటిని "వాతస్కంధములు" అంటారు. ఈ క్రమముననే ఆంధ్రమహా భాగవతము నందు పోతనామాత్యుల వారు ఇట్లు పేర్కొనిరి. 8-622-శా. ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై। నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై। నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై। నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై॥
- ఉపకరణాలు:
త్వత్కృతేనైవ నామ్నా చ
మారుతా ఇతి విశ్రుతాః"" ।
తస్యా స్తద్వచనం శ్రుత్వా
సహస్రాక్షః! పురందరః! ॥
టీకా:
త్వత్ = నీవు; కృతేన = చేసిన కార్యము చేతనే; ఏవ = మాత్రమే; నామ్నా = పేరుతో; చ; మారుతాః = మారుతులు; ఇతి = అని; విశ్రుతాః = ప్రసిద్ధి పొందెదరు; తస్యాః = ఆమె (దితి) యొక్క; తత్ = ఆ; వచనమ్ = మాటలను; శ్రుత్వా = వినిన వెంటనే; సహస్రాక్షః = వేయి కన్నులు కలవాడు; పురందరః = ఇంద్రుడు;
భావము:
వీరిని ఖండించు సమయమున నీవు వీరిని మా రుదః (ఏడ్వకుము) అని పిలిచితివి. ఆవిధముగనే వీరు అలా మారుతులు అను పేరుతో లోకములో ప్రసిద్ధి పొందెదరు గాక.” దితి యొక్క ఆ కోరిక వినిన వెంటనే , సహస్రాక్షుడు, పురందరుడు అయిన ఇంద్రుడు. .
- ఉపకరణాలు:
ఉవాచ ప్రాంజలిర్వాక్యమ్
దితిం బలనిషూదనః ।
“సర్వమేత ద్యథోక్తం తే
భవిష్యతి న సంశయః ॥
టీకా:
ఉవాచ = పలికెను; ప్రాంజలిః = చేతులు జోడించి; వాక్యమ్ = పలుకులు; దితిమ్ = దితిగురించి; బలనిషూదనః = బల అనే రాక్షసుడిని చంపిన వాడు, ఇంద్రుడు; సర్వమ్ = సమస్తము; ఏతత్ = ఏదైతే; యథా = అదే విధముగానే; ఉక్తమ్ = చెప్పినట్టి; తే = నీవు; భవిష్యతి = జరుగు గాక; న = లేనేలేదు; సంశయః = సందేహము.
భావము:
దితి మాటలు విని చేతులు జోడించి ఆమెతో ఇట్లు చెప్పెను. “నిస్సందేహముగా నీవు చెప్పినట్లుగనే సమస్తము జరుగును.
- ఉపకరణాలు:
విచరిష్యంతి భద్రం తే
దేవరూపా స్తవాత్మజాః” ।
ఏవం తౌ నిశ్చయం కృత్వా
మాతాపుత్రౌ తపోవనే ॥
టీకా:
విచరిష్యంతి = సంచరించెదరు; భద్రం = జయమగుగాక; తే = నీకు; దేవః = దేవతల; రూపాః = రూపములతో; తవ = నీ; ఆత్మజాః = (49 మంది) కుమారులు; ఏవమ్ = ఈ విధముగా; తౌ = వారిరువురు (ఇంద్రుడు, దితి); నిశ్చయం = నిశ్చయము; కృత్వా = చేసుకుని; మాతా పుత్రౌ = తల్లీ కొడుకులు ఇరువురూ; తపోవనే = తపోవనమునందు.
భావము:
నీ ఏడుగురు కుమారులు దేవతా రూపములతోనే సంచరించెదరు గాక. నీకు జయము అగుగాక.” పిమ్మట ఆ తల్లీకొడుకులు దితి, ఇంద్రుడ ఇద్దరూ తపోవనమునందు ఈ విధముగా నిశ్చయము చేసికొని.
- ఉపకరణాలు:
జగ్మతు స్త్రిదివం రామ!
కృతార్థావితి నః శ్రుతమ్ ।
ఏష దేశస్స కాకుత్స్థ!
మహేన్ద్రాధ్యుషితః పురా ॥
టీకా:
జగ్మతుః = వెళ్లిరి; త్రిదివమ్ = స్వర్గమునకు; రామ = రామా!; కృతార్ధౌ = కృతార్థులై; ఇతి = అని; నః = మాకు; శ్రుతమ్ = వినబడినది (తెలిసినది); ఏష = ఇది; దేశః = దేశము; స = ఆ; కాకుత్స్థ = రామా!; మహేంద్ర = మహేంద్రుడు; అధ్యుషితః = అధిష్టించిన; పురా = పూర్వము.
భావము:
శ్రీరామా! కృతార్థులై స్వర్గమునకు వెళ్లిరి అని వింటిమి. ఓ రామా! ఇది పూర్వము మహేంద్రుడు అధిష్టించిన దేశము.
- ఉపకరణాలు:
దితిం యత్ర తపస్సిద్ధామ్
ఏవం పరిచచార సః ।
ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర!
పుత్రః పరమధార్మికః ॥
టీకా:
దితిమ్ = దితి; యత్ర = ఎక్కడైతే; తపః = తపస్సు చేయుటకు; సిద్ధామ్ = సిద్ధపడెనో; ఏవమ్ = ఈ విధముగా; పరిచచార = ఉపచారములు చేసెను; సః = అతడు; ఇక్ష్వాకః = ఇక్ష్వాకునకు; అస్తు = కలిగెనో, ఉండెనో; నరవ్యాఘ్ర = పురుష శ్రేష్ఠుడవైన రామా; పుత్రః = కుమారుడు; పరమధార్మికః = మిక్కిలి ధార్మికుడు
భావము:
ఇచటనే దితి తపస్సు చేయుచుండ ఆమెకు మహేంద్రుడు ఉపచారములు చేసెను. రామా! ఇక్ష్వాకునకు జనించిన పరమధార్మికుడైన కుమారుడు. .
- ఉపకరణాలు:
1.47.2.
“మమాపరాధాద్ గర్భోఽ యమ్
సప్తధా విఫలీకృతః ।
నాపరాధోఽ స్తి దేవేశ!
తవాత్ర బలసూదన! ॥
టీకా:
మమ = నాయొక్క; అపరాధాత్ = అపరాధము వలన; గర్భః = గర్భము; అయమ్ = ఇది; సప్తధా = ఏడు భాగములుగా; విఫలీ = వ్యర్థమైనదిగా; కృతః = చేయబడినది; న = లేదు; అపరాధః = అపరాధము; అస్తి = కలుగుట; దేవేశ = దేవేంద్రా!; తవ = నీయొక్క; అత్ర = ఈ విషయమున; బలసూదన = బలాసురుని సంహరించిన ఇంద్రా!.
భావము:
“బలాసూదన! ఓ దేవేంద్రా! నా అపరాధము వలన నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థమైనది, ఇందు నీ అపరాధ మన్నది లేదు.
*గమనిక:-
మరుత్తః వాతస్కంధః ఆకాశస్య భాగవిశేషః (యత్ర వాయుర్వహతి). 1. భూమి నుండీ మేఘాల వరకూ తిరిగే వాయువు - "ఆవహము". 2. మేఘాలనుండీ సూర్యుని వరకూ - "ప్రవహము". 3. సూర్యుని నుండీ చంద్రుని వరకూ - "సంవహము". 4. చంద్రుడు నుంచీ నక్షత్రాల వరకు - "ఉద్వహము". 5. నక్షత్రాల నుండీ గ్రహ మండలం వరకూ - "వివహము". 6. గ్రహ మండలం నుండీ సప్తర్షుల వరకూ - "పరి వహము". 7. సప్తర్షి మందలం నుంచీ ధ్రువ మండలం వరకు - "పరావహము". అను పేర్లు గల సప్త మరుత్తులు. వీటిని "వాతస్కంధములు" అంటారు. ఈ క్రమముననే ఆంధ్రమహా భాగవతము నందు పోతనామాత్యుల వారు ఇట్లు పేర్కొనిరి. 8-622-శా. ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై। నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై। నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై। నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై॥
- ఉపకరణాలు:
విశాలస్య సుతో రామ!
హేమచంద్రో మహాబలః ।
సుచంద్ర ఇతి విఖ్యాతో
హేమచన్ద్రా దనంతరః ॥
టీకా:
విశాలస్య = విశాలుని యొక్క; సుతః = కుమారుడు; రామ = రామా!; హేమచంద్రః = హేమచంద్రుడు; మహా = మిక్కిలి; బలః = బలవంతుడు; సుచంద్ర = సుచంద్రుడు; ఇతి = అను పేరుతో; విఖ్యాతః = ప్రసిద్ధుడయ్యెను; హేమచన్ద్రాత్ = హేమచంద్రుని; అనంతరః = తరువాతివాడు.
భావము:
రామా! విశాలుని కుమారుడు మహా బలవంతు డైన హేమచంద్రుడు. అతను తరువాత సుచంద్రుడు అనుపేర ప్రసిద్ధిగాంచెను.
- ఉపకరణాలు:
సుచంద్రతనయో రామ!
ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః ।
ధూమ్రాశ్వ తనయశ్చాపి
సృంజయః సమపద్యత ॥
టీకా:
సుచంద్రః = సుచంద్రుని; తనయః = కుమారుడు; రామ = రామ!; ధూమ్రాశ్వ = ధూమ్రాశ్వడు; ఇతి = అని; విశ్రుతః = పేరుపొందెను; ధూమ్రాశ్వః = ధూమ్రాశ్వుని; తనయః = కుమారుడు; చ; అపి; సృంజయః = సృంజయుడు; సమపద్యత = జన్మించెను
భావము:
రామా! సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడుగా ప్రసిద్ధి గాంచెను, అతని కుమారుడు సృంజయుడు.
- ఉపకరణాలు:
సృంజయస్య సుతః శ్రీమాన్!
సహదేవః ప్రతాపవాన్ ।
కుశాశ్వః సహదేవస్య
పుత్రః పరమధార్మికః ॥
టీకా:
సృంజయస్య = సృంజయుని యొక్క; సుతః = కుమారుడు; శ్రీమాన్ = పురుషుల బిరుదు, రామ!; సహదేవః = సహదేవుడు; ప్రతాపవాన్ = ప్రతాపవంతుడు అయిన; కుశాశ్వః = కుశాశ్వుడు; సహదేవస్య = సహదేవుని యొక్క; పుత్రః = కుమారుడు; పరమ = మిక్కిలి; ధార్మికః = ధార్మికుడైన;
భావము:
రామ! సృంజయుని కుమారుడు సహదేవుడు ప్రతాపవంతుడు. అతని కుమారుడు పరమధార్మికుడైన కుశాశ్వుడు.
- ఉపకరణాలు:
కుశాశ్వస్య మహాతేజా
సోమదత్తః ప్రతాపవాన్ ।
సోమదత్తస్య పుత్రస్తు
కాకుత్స్థ! ఇతి విశ్రుతః ॥
టీకా:
కుశాశ్వస్య = కుశాశ్వుని యొక్క (పుత్రుడు); మహా = గొప్ప; తేజాః = తేజశ్శాలి; ప్రతాపవాన్ = సోమదత్తః = సోమదత్తుడు; ప్రతాపవంతుడు; సోమదత్తస్య = సోమదత్తునియొక్క; పుత్రస్తు = కుమారుడు; కాకుత్స్థః = కాకుత్స్థుడు; ఇతి = అని; విశ్రుతః = ప్రఖ్యాతి గాంచెను;
భావము:
కుశాశ్వుని కుమారుడు మహాతేజశ్శాలి, ప్రతాపవంతుడు ఐన సోమదత్తుడు. ఆతని కుమారుడు కాకుత్స్థుడనే పేరుతో ప్రఖ్యాతిగాంచెను.
- ఉపకరణాలు:
తస్య పుత్రో మహాతేజాః
సంప్రత్యేష పురీమిమామ్ ।
ఆవసత్య మరప్రఖ్యః
సుమతిర్నామ దుర్జయః ॥
టీకా:
తస్య = అతని (కాకుత్స్థుని); పుత్రః = కుమారుడు; మహా = గొప్ప; తేజాః = మహాతేజోవంతుడు; సంప్రతి = ప్రస్తుతము; ఏష = ప్రస్థితుడై; పురీమ్ = నగరము; ఇమామ్ = దీనియందు; ఆవసతిః = నివసించుచున్నాడు; అమరః = దేవతలను; ప్రఖ్యః = పోలువాడు; సుమతిః = సుమతి అను; నామ = పేరుకలవాడు; దుర్జయః = జయింపశక్యము కానివాడు.
భావము:
గొప్ప తేజస్సు కల కాకుత్స్థుని కుమారుడు ప్రస్తుతము ఈ పట్టణములోనే ఉన్నాడు. అతను సుమతి అను పేరుతో దేవతా సమానుడు, జయింప శక్యము కానివాడు ఇక్కడ నివసిస్తున్నాడు.
- ఉపకరణాలు:
ఇక్ష్వాకోస్తు ప్రసాదేన
సర్వే వైశాలికా నృపాః ।
దీర్ఘాయుషో మహాత్మానో
వీర్యవంత సుధార్మికాః ॥
టీకా:
ఇక్ష్వాకోః = ఇక్ష్వాకుని యొక్క; తు; ప్రసాదేన = అనుగ్రహముతో; సర్వే = అందరును; వైశాలికాః = విశాల నగరపు; నృపాః = రాజులు; దీర్ఘాయుషః = దీర్ఘ ఆయుష్షు గలవారు; మహాత్మానః = మహాత్ములు; వీర్యవంత = పరాక్రమవంతులు; సుధార్మికాః = మంచి ధర్మనిష్ఠ కలవారు;
భావము:
ఈ వంశ మూలపుషుడైన ఇక్ష్వాకు మహారాజు అనుగ్రహంచేత, విశాల నగరపు రాజులందరు కూడ దీర్ఘ ఆయుష్మంతులు, మహాత్ములు, పరాక్రమవంతులు, మంచి ధర్మనిష్ఠ కలవారు.
*గమనిక:-
ఇక్ష్వాకునికి అప్సరస అలంబుస యందు కొడుకు విశాల నగర నిర్మాత 1) విశాలుడు.విశాలుని కొడుకు 2) హేయచంద్రుడు అతని తరువాత 3)సుచంద్రుడు, అతని కొడుకు 4) ధూమ్రాశ్వుడు, అతని కొడుకు 5) సృంజయుడు, అతని కొడుకు 6) సహదేవుడు, అతని కొడుకు 7) కుశాశ్వుడు, అతని కొడుకు. 8) సోమదత్తుడు, అతని కొడుకు 9) కాకుత్స్థుడు, అతని కొడుకు 10) సుమతి. వీరిని వైశాలులు అందురు.
- ఉపకరణాలు:
ఇహాద్య రజనీం రామ!
సుఖం వస్త్యమహే వయమ్ ।
శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ!
జనకం ద్రష్టుమర్హసి ॥
టీకా:
ఇహ = ఇచటనే; అద్య = నేడు; రజనీమ్ = రాత్రి; రామ = రామా!; సుఖమ్ = సుఖముగా; వస్త్యామహే = నివసించెదము; వయమ్ = మనము; శ్వః = రేపు; ప్రభాతే = ఉదయమున; నరశ్రేష్ఠః = ఓ నరశ్రేష్ఠుడా, రామ; జనకమ్ = జనక మహారాజును; ద్రష్టుమర్హసి = చూడవచ్చును.
భావము:
రామా! ఈ రాత్రి మనము ఇచటనే వసించెదము. రేపు సూర్యోదయము మనము జనక మహారాజును చూచెదము.
- ఉపకరణాలు:
సుమతిస్తు మహాతేజా
విశ్వామిత్ర ముపాగతమ్ ।
శ్రుత్వా నరవరశ్రేష్ఠః
ప్రత్యుద్గచ్ఛ న్మహాయశాః ॥
టీకా:
సుమతిః = సుమతి; తు = కూడా; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కల; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని; ఉపాగతమ్ = ఆగమనమును; శ్రుత్వా = విని; నరవరశ్రేష్ఠః = రాజులలో శ్రేష్ఠుడు; ప్రత్యుత్ గచ్ఛత్ = స్వాగతము చెప్పుటకు ఎదురుగా వెళ్లెను; మహాయశాః = గొప్పకీర్తిమంతుడు.
భావము:
మహాతేజోవంతుడు, మహాయశస్వి, రాజశ్రేష్ఠుడు అయిన సుమతి విశ్వామిత్రుని ఆగమన వార్త విని స్వాగతము చెప్పుటకు ఎదురువెళ్లెను.
*గమనిక:-
నరవర- నర(మానవులకు) వరుడు(ఱేడు, శ్రేష్ఠుడు), లేదా నరులకు వరించదగ్గవాడు, రాజు.
- ఉపకరణాలు:
పూజాం చ పరమాం కృత్వా
సోపాధ్యాయః సబాంధవః ।
ప్రాంజలిః కుశలం పృష్ట్వా
విశ్వామిత్ర మథాబ్రవీత్ ॥
టీకా:
పూజామ్ = గౌరవమర్యాదలు; చ; పరమామ్ = గొప్పగా; కృత్వా = చేసి; స = సహితముగ; ఉపాధ్యాయః = ఆచార్యులు; స = సహితముగ; బాంధవః = బంధు మిత్ర పరివారముతోను; ప్రాంజలిః = దొసిలొగ్గి; కుశలమ్ = క్షేమసమాచారాములు; పృష్ట్వా = అడిగి; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; అథ = తరువాత; అబ్రవీత్ = ఇట్లు పలికెను;
భావము:
ఆచార్యులతోడను బంధుమిత్ర పరివారముతోడను కూడి గొప్పగా గౌరవమర్యాదలు చేసి, దోసిలి ఒగ్గి కుశల ప్రశ్నలు అడిగి విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.
*గమనిక:-
ప్రాంజలి- చేమోడ్పు, వివరణ. మోడ్చిన కేలు గలవాడు, వ్యుత్పత్తి. ప్రబద్దః అంజలి యేన, బ.వ్రీ., అంజలి- బొటనవ్రేలు వంచి చూపుడువ్రేలు మొదట కూర్చి తక్కిన వ్రేళ్ళు చాచిన రెండుచేతులను కూర్చి పట్టినది, గౌరవసూచకము.
- ఉపకరణాలు:
ధన్యోఽ స్మ్యనుగృహీతోఽ స్మి
యస్య మే విషయం మునిః ।
సమ్ప్రాప్తో దర్శనం చైవ
నాస్తి ధన్యతరో మయా ॥
టీకా:
ధన్యః = ధన్యుడనైతిని; అస్మి = నేను; అనుగృహీతః = అనుగ్రహింపబడిన వాడనయితిని; అస్మి = నేను; యస్య = ఏ; మే = నాయొక్క; విషయమ్ = దేశమునకు; మునిః = మునీంద్రా!; సంప్రాప్తః = వచ్చితివో; దర్శనమ్ = దర్శనము కలుగుట; చ; ఏవ = కూడా; నాస్తి = లేడు; ధన్యతరః = మిక్కిలి ధన్యుడు; మయా = నాకంటె.
భావము:
మునీంద్రా! నీవు మా దేశమునకు విచ్చేసి, దర్శనభాగ్యము కలిగించినందున నేను ధన్యుడనయితిని. అనుగ్రహింపబడిన వాడినయితిని. నాకంటె గొప్ప ధన్యులు వేరొకరు లేరు.
*గమనిక:-
ధన్యము- ధన్యతరము, ధన్యతమము.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే వాల్మీకి తెలుగు రామాయణే బాలకాండే సప్తచత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; సప్తచత్వారింశ [47] = నలభై ఏడవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిసంప్రదాయమూ మొట్టమొదటికావ్యమూ ఐన వాల్మీకి విరచితమూ తెలుగు వారి రామాయణ మహా ఇతిహాసాంతర్గత, బాలకాండలోని నలభై ఏడవ సర్గ [47] సంపూర్ణము