బాలకాండమ్ : ॥ఏకచత్వారింశః సర్గః॥ [41 అంశుమంతుడు యజ్ఞాశ్వము తెచ్చుట]
- ఉపకరణాలు:
పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా
సగరో రఘునందన! ।
నప్తారమబ్రవీద్రాజా
దీప్యమానం స్వతేజసా ॥
టీకా:
పుత్రాన్ = పుత్రులను; చిరగతాన్ = చాలా కాలము క్రితము వెళ్లినవారినిగా; జ్ఞాత్వా = తెలుసుకొని; సగరః = సగరుడు; రఘునందన = రఘువంశజుడవైన ఓ రామా; నప్తారమ్ = పౌత్రుని (తన మనుమడిని) తో; అబ్రవీత్ = పలికెను; రాజా = రాజు దీప్యమానమ్ = దీపములా ప్రకాశించుచున్న; స్వ = సొంత; తేజసా = తేజస్సుతో.
భావము:
రఘునందనా; ఓ రామా ! తన కుమారులు వెళ్లి చాలా కాలమైనదని గుర్తించిన సగర చక్రవర్తి; దీపమువలె తేజస్సుతో ప్రకాశించుచున్న మనుమడు అంశుమంతునితో ఇట్లు పలికెను.
- ఉపకరణాలు:
“శూరశ్చ కృతవిద్యశ్చ
పూర్వైస్తుల్యోఽ సి తేజసా ।
పితౄణాం గతిమన్విచ్ఛ
యేన చాశ్వోఽ పవాహితః ॥
టీకా:
శూరః = శూరుడవును; చ = ఇంకను; కృత = నేర్చిన; విద్య = విద్యలు కలవాడవును; చ; పూర్వైః = మీ పూర్వీకులతో; తుల్యః = సమానుడవుగా; ఆసి = అయి ఉన్నావు; తేజసా = తేజస్సుచేత; పిత్రూణామ్ = తండ్రులు; గతిమ్ = త్రోవను; అన్విచ్ఛ = వెదుకుము; యేన = ఎవరైతే; చ; అశ్వ = అశ్వమును; అపవాహితః = దొంగిలించిరో
భావము:
నీవు శూరుడవు; వివిధ విద్యలను అభ్యసించినవాడవు; మీ పూర్వికులతో సమానమైన తేజస్సుగల వాడివి. నీ పిన తండ్రుల జాడను, అశ్వము దొంగిలించిన వానిని తెలుసుకొని రమ్ము.
- ఉపకరణాలు:
“శూరశ్చ కృతవిద్యశ్చ
పూర్వైస్తుల్యోఽ సి తేజసా ।
పితౄణాం గతిమన్విచ్ఛ
యేన చాశ్వోఽ పవాహితః ॥
టీకా:
శూరః = శూరుడవును; చ = ఇంకను; కృత = నేర్చిన; విద్య = విద్యలు కలవాడవును; చ; పూర్వైః = మీ పూర్వీకులతో; తుల్యః = సమానుడవుగా; ఆసి = అయి ఉన్నావు; తేజసా = తేజస్సుచేత; పిత్రూణామ్ = తండ్రులు; గతిమ్ = త్రోవను; అన్విచ్ఛ = వెదుకుము; యేన = ఎవరైతే; చ; అశ్వ = అశ్వమును; అపవాహితః = దొంగిలించిరో
భావము:
నీవు శూరుడవు; వివిధ విద్యలను అభ్యసించినవాడవు; మీ పూర్వికులతో సమానమైన తేజస్సుగల వాడివి. నీ పిన తండ్రుల జాడను, అశ్వము దొంగిలించిన వానిని తెలుసుకొని రమ్ము.
- ఉపకరణాలు:
అభివాద్యాభివాద్యాంస్త్వం
హత్వా విఘ్నకరానపి ।
సిద్ధార్థః స్సన్నివర్తస్వ
మమ యజ్ఞస్య పారగః" ॥
టీకా:
అభివాద్యా = నమస్కరింప తగినవారిని; అభివాద్యామ్ = నమస్కరించి; త్వమ్ = నీవు; హత్వా = చంపి; విఘ్నః = విఘ్నములు; కరాన్ = కలుగ చేయువారు; అపి = ఐతే; సిద్ధార్థః = కృతార్థుడవై; సన్నివర్తస్వ = వెనుకకు తిరిగి రమ్ము; మమ = నాయొక్క; యజ్ఞస్య = యజ్ఞమును; పారగః = - పూర్తి అగునట్లు
భావము:
నీవు నమస్కరింప తగిన వారికి నమస్కరించుము. విఘ్నము కలిగించు వారిని సంహరించుము. చేపట్టినపని నెరవేర్చినవాడవై వెనుకకు తిరిగి రమ్ము. నా యజ్ఞము సమాప్తి కానిమ్ము.”
- ఉపకరణాలు:
ఏవముక్తోంఽశుమాన్ సమ్యక్
సగరేణ మహాత్మనా ।
ధనురాదాయ ఖడ్గం చ
జగా మలఘువిక్రమః ॥
టీకా:
ఏవమ్ = ఈ విధముగా; ఉక్తా = పలుకబడినవాడై; అంశుమాన్ = అంశుమంతుడు; సమ్యక్ = బాగుగా; సగరేణ = సగరునిచేత; మహాత్మనా = మహాత్ముడైన; ధను: = ధనస్సును; ఆదాయ = ధరించి; ఖడ్గం = ఖడ్గమును; చ = కూడ; జగామ = వెళ్ళెను; అలఘు = అధికమైన; విక్రమః = అడుగులు (వేగము) కలవాడై.
భావము:
మహాత్ముడైన సగర చక్రవర్తి చెప్పిన విధముగా, అంశుమంతుడు చక్కగా ధనుస్సు ఖడ్గము మొదలగు అస్త్రశస్త్రములను తీసుకుని బహు శీఘ్రముగా బయలుదేరెను.
- ఉపకరణాలు:
స ఖాతం పితృభిర్మార్గం
అంతర్భౌమం మహాత్మభిః ।
ప్రాపద్యత నరశ్రేష్ఠః!
తేన రాజ్ఞాఽ భిచోదితః ॥
టీకా:
సః - అతను; ఖాతమ్ = తవ్వబడిన; పితృభి: = తండ్రులచేత; మార్గమ్ = మార్గమును; అంతర్ = లోపల; భూమమ్ = భూమికి; మహాత్మభిః = మహాత్ములైన; ప్రాపద్యత = పొందెను; నరశ్రేష్ఠ = మానవులలో శ్రేష్ఠుడైన; రాజ్ఞా = రాజుచేత; అభిచోదిత: = ప్రేరేపింపబడినవాడై.
భావము:
సగరుని ఆజ్ఞచే ప్రేరేపింపబడినవాడై మానవులలో శ్రేష్ఠుడైన అంశుమంతుడు తండ్రులచే భూమి క్రిందకు తవ్వబడిన మార్గమును అనుసరించెను.
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
స తం ప్రదక్షిణం కృత్వా
పృష్ట్వా చైవ నిరామయమ్ ।
పితౄన్ స పరిపప్రచ్ఛ
వాజిహర్తారమేవ చ ॥
టీకా:
సః = అతడు; తం = దానికి; ప్రదక్షిణం = ప్రదక్షిణము; కృత్వా = చేసి; పృష్ట్వా = విచారించి; చ; అపి = కూడ; నిరామయమ్ = కుశలములు; పితఽన్ = తండ్రులగురించి; సః = అతడు; పరిపప్రచ్ఛ = ప్రశ్నించెను; వాజి = అశ్వమును; హర్తారమ్ = అపహరించినవాని; ఏవ = గురించి; చ = కూడ.
భావము:
అతడు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ నమస్కారము చేసి, కుశలములు, తన తండ్రుల గురించి మఱియు అశ్వమును అపహరించిన వానిని గురించి విచారించెను.
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
తస్య తద్వచనం శ్రుత్వా
సర్వానేవ దిశాగజాన్ ।
యథాక్రమం యథాన్యాయం
ప్రష్టుం సముపచక్రమే ॥
టీకా:
తస్య = దానియొక్క; తత్ = ఆ; వచనం = పలుకును; శ్రుత్వా = విని; సర్వానేవ = సమస్తమైన; దిశాగజాన్ = దిగ్గజములను; యథాక్రమం = క్రమానుసారముగా; యథాన్యాయం = న్యాయానుసారముగా; ప్రష్టుం = అడుగుటకు; సముపచక్రమే = ఉపక్రమించెను
భావము:
అంశుమంతుడు ఆ దిగ్గజము మాట విని, మిగిలిన దిగ్గజములను ఒక్కొక్క దానిని న్యాయానుసారముగా ప్రశ్నించుట ప్రారంభించెను.
- ఉపకరణాలు:
తైశ్చ సర్వైర్దిశాపాలైః
వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః ।
పూజితః "సహయశ్చైవ
గంతాఽసీత్యభిచోదితః" ॥
టీకా:
తైః = ఆ; చ; సర్వైః = సమస్తమైన; దిశాపాలైః = దిగ్గజముల చేత; వాక్యః = మాట్లాడు విధము; జ్ఞః = ఎరిగిన; వాక్యః = మాట్లాడు టందు; కోవిదైః = నేర్పుకలవి; పూజితః = పూజింపబడినవాడై; సహ = సహితముగ; హయః = అశ్వముతో; గంతాఽసీ = వెళ్లగలవు; ఇతి = అని; అభిచోదితః = ప్రేరేపింపబడెను, ప్రోత్సాహింపబడెను.
భావము:
ఆ దిగ్గజములన్నియు మాటల సారమును గ్రహింపగలిగి, మాట్లాడుట యందు బాగా నేర్పుకలవి. ఆ దిగ్గజములు అతనిని ఆదరించి; “అశ్వముతో తిరిగి వెళ్ళెదవు” అని ఆశీర్వదించి ప్రోత్సహించెను.
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
స దుఃఖవశమాపన్నః
స్త్వసమంజసుతస్తదా ।
చుక్రోశ పరమార్తస్తు
వధాత్తేషాం సుదుఃఖితః ॥
టీకా:
సః = ఆ; దుఃఖ = దుఃఖమునకు; వశమ్ = లోనగుట; ఆపన్నః = పొందినవాడై; తు; అసమంజసుత = అసమంజసుని కుమారుడు, అంశుమంతుడు; తదా = అప్పుడు; చుక్రోశ = ఏడ్చెను; పరమార్తః = చాలా పీడితుడై; వధాత్ = వధ వలన; తేషాం = వారియొక్క; సుదుఃఖితః = చాల దుఃఖితుడై.
భావము:
అప్పుడా అసమంజసుని కొడుకు అంశుమంతుడు దుఃఖపరవశుడై, తన పినతండ్రుల మరణమునకు మిక్కిలి దుఃఖముతో బాధపడుచు ఏడ్చెను.
- ఉపకరణాలు:
యజ్ఞీయం చ హయం తత్ర
చరంతమవిదూరతః ।
దదర్శ పురుషవ్యాఘ్రో
దుఃఖశోకసమన్వితః ॥
టీకా:
యజ్ఞీయం = యజ్ఞము యొక్క; చ; హయం = అశ్వమును; తత్ర = అక్కడ; చరంతమ్ = తిరుగుచున్న; అవిదూరతః = సమీపమునందు; దదర్శ = చూచెను; పురుష = పురుషులలో; వ్యాఘ్రః = శ్రేష్ఠుడు; దుఃఖః = దుఃఖముతో; శోకః = ఏడుపుతో; సమన్వితః = కూడిన.
భావము:
దుఃఖముతో ఏడ్చుచుచున్న ఆ అంశుమంతుడు అచట దగ్గరలోనే మేయుచు తిరుగుచున్న యాగాశ్వమును చూచెను.
- ఉపకరణాలు:
స తేషాం రాజపుత్రాణాం
కర్తుకామో జలక్రియామ్ ।
సలిలార్థీ మహాతేజా
న చాపశ్యజ్జలాశయమ్ ॥
టీకా:
సః = అతడు; తేషాం = ఆ; రాజపుత్రాణాం = రాకుమారులకు; కర్తుః = చేయవలెనని; కామః = కోరిక గలవాడై; జలక్రియామ్ = జలతర్పణములు; సలిలాః = ఉదకమును; అర్థీ = కోరుచు; మహా = గొప్ప; తేజాః = తేజస్సు గలవాడు; న = లేదు; చ; అపశ్యత్ = కనబడుట; జలాశయమ్ = చెరువును.
భావము:
ఆ అంశుమంతుడు సగరపుత్రులకు జలతర్పణము ఇవ్వవలెనని తలచెను. కాని జలము కొఱకు అన్వేషించగా అక్కడ జలాశయములు ఏవియు కనబడలేదు.
- ఉపకరణాలు:
విసార్య నిపుణాం దృష్టిం
తతోఽ పశ్యత్ ఖగాధిపమ్ ।
పితౄణాం మాతులం రామ!
సుపర్ణమనిలోపమమ్ ॥
టీకా:
విసార్య = ప్రసరించి; నిపుణాం = సమర్థమైన, నైపుణ్యమైన; దృష్టిం = దృష్టిని; తతః = పిమ్మట; అపశ్యత్ = చూచెను; ఖగాధిపమ్ = గరుత్మంతుని; పితఽణాం = పినతండ్రులయొక్క; మాతులం = మేనమామను; రామ = రామా; సుపర్ణమ్ = గరుత్మంతుడు; అనిలః = వాయుదేవునితో; ఉపమమ్ = సమానుడు.
భావము:
పిమ్మట అతడు తన ప్రయత్న పూర్వక చూపుతో పరికించి చూడగా, పినతండ్రుల మేనమామయు వాయుసమానుడును పక్షిరాజును అగు గరుత్మంతుడిని చూచెను.
*గమనిక:-
*- 1. నీటి జాడ వెతుకు వాడు ముందు నేలపై చూస్తాడు. కనబడకపోతే, నీరున్న చోట పక్షులు ఉంటాయి కనుక, నీటి జాడకై పక్షుల కోసం పైకి చూస్తాడు. గరుత్మంతుడు ఎంతో ఎత్తులో అమిత వేగంతో ఎగురుతుంటాడు. ఎంతో దీర్ఘంగా చూస్తేనే గరుత్మండు కనబడతాడు. అందుకని చూడడంలోని సమర్థత అంతటితో అంశుమంతుడు చూసాడు అన్నమాట. సగరుని పెద్ద భార్య “కేశిని” యందు కలిగిన పెద్ద కొడుకు “అసమంజసుడు”, మఱియు రెండవ భార్య “అరిష్టనేమి” అను పేరుగల “కశ్యపుని” కూతురును, అలా “గరుత్మంతుని” సోదరియును ఐన “సుమతి” యందు అరవైవేలమంది పుత్రులు. కనుక వీరికి గరుత్మంతుడు మేనమామ. అసమంజసునికి ఈ అరవైవేలమంది సవితి సోదరులు. అసమంజసుని కొడుకు అంశుమంతునికి చిన్నాన్నలు. 2. ఖగాధిపతి- ఖగాః (పక్షులకు) అధిపతి (ప్రభువు), గరుత్మంతుడు. 3. సుపర్ణుడు- మంచి రెక్కలు గలవాడు, గరుత్మంతుడు.
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
గంగా హిమవతో జ్యేష్ఠా
దుహితా పురుషర్షభ! ।
తస్యాం కురు మహాబాహో
పితౄణాం తు జలక్రియామ్ ॥
టీకా:
గంగా = గంగ; హిమవతః = హిమవంతునియొక్క; జ్యేష్ఠా = పెద్ద; దుహితా = కుమార్తె; పురుషర్షభ = పురుషులలో శ్రేష్ఠుడా; తస్యాం = దానియందు, గంగ యందు; కురు = చేయుము; మహా = గొప్ప; బాహో = భుజబలం కలవాడు; పితఽణాం = పినతండ్రులకు; తు; జలక్రియామ్ = జలతర్పణమును
భావము:
ఓ పురుషశ్రేష్ఠా! హిమవంతునియొక్క పెద్ద కుమార్తె గంగ. ఆ గంగాజలంతో నీ పినతండ్రులకు జలతర్పణము చేయుము.
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
షష్టిం పుత్రసహస్రాణి
స్వర్గలోకం నయిష్యతి ।
గచ్ఛ చాశ్వం మహాభాగ!
తం గృహ్య పురుషర్షభ! ॥
టీకా:
షష్టిం పుత్రసహస్రాణి = అరవైవేలమంది పుత్రులను; స్వర్గలోకం = స్వర్గలోకమునకు; చ; నయిష్యతి = పొందించగలదు; గచ్ఛ = వెళ్లుము; చ; మహాభాగ = మహాత్ముడా; తం = నీవు; గృహ్య = తీసుకుని; పురుషర్షభ = శ్రేష్ఠుడా.
భావము:
ఈ అరవైవేలమంది సగరపుత్రులను స్వర్గోలోకము పొందించ గలదు. ఓ మహాబలవంతుడా ! పురుషులలో శ్రేష్ఠుడా! ఈ అశ్వమును తీసుకొని వెళ్లుము.
- ఉపకరణాలు:
యజ్ఞం పైతామహం వీర!
సంవర్తయితుమర్హసి" ।
సుపర్ణవచనం శ్రుత్వా
సోంఽ శుమానతివీర్యవాన్ ॥
టీకా:
యజ్ఞం = యజ్ఞమును; పైతామహం = మీ పితామహుని, సగరుని సంబంధమైన; వీర = వీరుడా; సంవర్తయితుమ్ = జరిపించుటకు; అర్హసి = తగియున్నావు; సుపర్ణ = గరుత్మంతుని; వచనం = ఉపదేశము; శ్రుత్వా = విని; సః = ఆ; అంశుమాన్ = అంశుమంతుడు; అతివీర్యవాన్ = మహా వీరుడు.
భావము:
ఓ మహావీర! గుఱ్ఱమును తీసుకొని మీ పితామహులు, సగరుని యజ్ఞమును పూర్తి చేయించుము” అని గరుత్మంతుడు అంశుమంతునికి చెప్పెను. గరుత్మంతుని ఆ ఉపదేశము ఆలకించిన మహావీరుడైన అంశుమంతుడు.
- ఉపకరణాలు:
స చైవమబ్రవీద్వాక్యం
వైనతేయో మహాబలః ।
మా శుచః పురుషవ్యాఘ్ర!
వధోఽ యం లోకసమ్మతః ॥
- ఉపకరణాలు:
న్యవేదయద్యథావృత్తం
సుపర్ణవచనం తథా ।
తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం
వాక్యమంశుమతో నృపః ॥
టీకా:
న్యవేదయత్ = నివేదించెను, తెలిపెను; యథా = ఎట్లు; ఆవృత్తం = జరిగినదో; సుపర్ణ = గరుత్మంతుని; వచనం = ఉపదేశమును; తథా = అట్లు; తత్ = దానిని; శ్రుత్వా = విని; ఘోరసంకాశం = ఘోరమైన, సమీపించిన ఘోరం వంటి; వాక్యమ్ = వార్తను; అంశుమంతః = అంశుమంతునియొక్క; నృపః = రాజు.
భావము:
అంశుమంతుడు గరుత్మంతుడు చెప్పిన విషయములను సగరమహారాజునకు జరిగినది జరిగినట్లు నివేదించెను. అంశుమంతుడు చెప్పిన ఘోరమైన వార్త సగరచక్రవర్తి వినెను.
- ఉపకరణాలు:
యజ్ఞం నిర్వర్తయామాస
యథాకల్పం యథావిధి ।
స్వపురం చాగమచ్ఛ్రీమాన్
ఇష్టయజ్ఞో మహీపతిః ॥
టీకా:
యజ్ఞం = యజ్ఞమును; నివర్తయామాస = జరిపించెను; యథాకల్పం = పద్ధతికారముగా; యథావిధి = శాస్త్రప్రకారముగా; స్వపురం చ = తన పురమును; ఆగమత్ = చేరెను; శ్రీమాన్ = శ్రీమంతుడైన; ఇష్టయజ్ఞః = యజింవడిన యాగము కలవాడై; మహీపతిః = రాజు.
భావము:
సగరచక్రవర్తి యజ్ఞమును శాస్త్రప్రకారము, చెయ్యవలసిన పద్దతిలో పూర్తి చేసి, నగరములో ప్రవేశించెను.
- ఉపకరణాలు:
గంగాయాశ్చాగమే రాజా
నిశ్చయం నాధ్యగచ్ఛత ।
అకృత్వా నిశ్చయం రాజా
కాలేన మహతా మహాన్।
త్రింశద్వర్షసహస్రాణి
రాజ్యం కృత్వా దివం గతః ॥
టీకా:
గంగయాః = గంగయొక్క; ఆగమే = రాక విషయములో; రాజా = రాజు; నిశ్చయమ్ = నిర్ణయమునకు; న అధిగచ్ఛత = పొందలేదు; అకృత్వా = చేయకయే; నిశ్చయం = నిశ్చయమును; రాజా = రాజు; మహతా కాలేన = చాలా కాలముచేత; మహాన్ = గొప్పవాడైన; త్రింశత్ = ముప్పది; వర్షసహస్రాణి = వేల సంవత్సరములు; రాజ్యం = రాజ్యము; కృత్వా = చేసి; దివమ్ = స్వర్గమును గూర్చి; గతః = వెళ్ళెను.
భావము:
గంగను తీసుకొనివచ్చే ఉపాయమేదియు అతడు కనుగొనలేకపోయెను. మహనీయుడైన ఆ రాజు చాలాకాలమునకు కూడా గంగను తీసుకువచ్చే ఉపాయము కనుగొనలేక, ముప్పదివేల సంవత్సరములు రాజ్యము చేసి స్వర్గలోకమునకు వెళ్లెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ఏకచత్వారింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ఏకచత్వారింశ [41] = నలభై ఒకటవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని లోని [41] నలభైఒకటవ సర్గ సుసంపూర్ణము