బాలకాండమ్ : ॥చత్వారంశః సర్గః॥ [40 సగరపుత్రుల దహనం]
- ఉపకరణాలు:
దేవతానాం వచః శ్రుత్వా
భగవాన్ వై పితామహః ।
ప్రత్యువాచ సుసంత్రస్తాన్
కృతాంతబలమోహితాన్ ॥
టీకా:
దేవతానాం = దేవతల యొక్క; వచః = మాటలను; శ్రుత్వా = విని; భగవాన్ = భగవంతుడు; వై = ఐన; పితామహః = బ్రహ్మదేవుడు; ప్రత్యువాచ = బదులు పలికెను; సు = మిక్కిలి; సంత్రస్తాన్ = సంత్రస్తులైన, బెదిరిపోయిన; కృతాంతః = దూర్త, అశనిపాత, విపత్తు చేత; బల = మిక్కిలి; మోహితాన్ = కలత చెందినవారి గుఱించి.
భావము:
వారి విన్నపాలు విని, బ్రహ్మదేవుడు ఆ విపత్తువలన మిక్కిలి కలతచెంది, బాగా బెదిరిపోయిన ఆ దేవతలతో ఇట్లనెను.
- ఉపకరణాలు:
"యస్యేయం వసుధా కృత్స్నా
వాసుదేవస్య ధీమతః ।
కాపిలం రూపమాస్థాయ
ధారయత్యనిశం ధరామ్ ॥
టీకా:
యస్య = ఏదైతే; ఇయం = ఈ; వసుధా = భూమి; కృత్స్నా = సమస్తమైన; వాసుదేవస్య = వాసుదేవునికి చెందిన; ధీమతః = ధీమంతుడైన; కాపిలం = కపిలుని; రూపమ్ = రూపమును; ఆస్థాయ = స్థిరముగా నుండువాడై; ధారయతి = ధరించుచున్నాడు; అనిశం = నిత్యము; ధరామ్ = భూమిని.
భావము:
“ఈ భూమండలమంతయు ఏ వాసుదేవునకు చెందినదో ఆ వాసుదేవుడు, కపిల మహర్షిగా అవతరించి ఈ భూమిని నిత్యము స్థిరుడై ధరించుచున్నాడు.
- ఉపకరణాలు:
తస్య కోపాగ్నినా దగ్ధా
భవిష్యంతి నృపాత్మజాః ।
పృథివ్యాశ్చాపి నిర్భేదో
దృష్ట ఏవ సనాతనః ॥
టీకా:
తస్య = అతని యొక్క; కోపాగ్నినా = కోపాగ్ని వలన; దగ్ధా = దహింపబడినవారు; భవిష్యంతి = కాగలరు; నృపాత్మజాః = రాకుమారులు; పృథివ్యాః = భూమియొక్క; చ; అపి = కూడ; నిర్భేదః = తవ్వకము; దృష్ట = చూడబడెను; ఏవ = నిశ్చయముగ; సనాతనః = పూర్వమే.
భావము:
భూమి సగర కుమారులచే త్రవ్వబడుననియు, కపిల మహర్షి క్రోధాగ్నిచే సగర రాకు మారులు భస్మము అగుదురనియు పూర్వమే వాసుదేవునిచే నిర్ణయింపబడినది.
- ఉపకరణాలు:
సగరస్య చ పుత్రాణామ్
వినాశోఽదీర్ఘజీవినామ్" ।
పితామహవచః శ్రుత్వా
త్రయస్త్రింశదరిందమ ॥
టీకా:
సగరస్య = సగరుని; చ; పుత్రాణాం = పుత్రులు; వినాశః = నశించెదరు; అదీర్ఘ జీవినామ్ = అల్పాయుష్కులు; పితామహ = బ్రహ్మదేవుని; వచః = అభయపు మాటలు; శ్రుత్వా = విని; త్రయస్త్రింశత్ = ముప్పది ముగ్గురు, దేవతలు; అరిం = శత్రువులను; దమ = సంహరించువాడా.
భావము:
శత్రువులను సంహరించు ఓ రామా ! అష్టవసువులు; ఏకాదశ రుద్రులు; ద్వాదశాదిత్యులు; అశ్వినీద్వయము కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు "సగర పుత్రులు అల్పాయుష్కులై నశించెదరు" అని బ్రహ్మదేవుడు పలుకగా విని.
*గమనిక:-
*- త్రయస్త్రింశద్దేవతలు- అష్టవసువులు (8 మంది), ఏకాదశ రుద్రులు (11 మంది), ద్వాదశాదిత్యులు (12 మంది), అశ్వినీద్వయము (2 ద్దరు) కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు.
- ఉపకరణాలు:
దేవాః పరమసంహృష్టాః
పునర్జగ్ముర్యథాగతమ్ ।
సగరస్య చ పుత్రాణామ్
ప్రాదురాసీన్మహాత్మనామ్ ॥
టీకా:
దేవాః = దేవతలు; పరమ సంహృష్టాః = చాలా సంతోషించి; పునః జగ్ముః = మరలి వెళ్ళిరి; యథా గతమ్ = వచ్చిన విధముగా; సగరస్య = సగరుని; చ; పుత్రాణామ్ = కుమారులకు; ప్రాదుః = గునపము మొన నుండి; ఆసీత్ = కలిగినది (వినిపించెను) మహాత్మానామ్ = మహాత్ములైన.
భావము:
బ్రహ్మదేవుని మాటలకు దేవతలు చాల సంతోషించి వచ్చిన త్రోవలో వెళ్ళిపోయిరి. మహాత్ములైన సగర కుమారుల గునపముమొనల నుండి, పుట్టి.
- ఉపకరణాలు:
పృథివ్యాం భిద్యమానాయామ్
నిర్ఘాతసమనిఃస్వనః ।
తతో భిత్త్వా మహీం సర్వే
కృత్వా చాపి ప్రదక్షిణమ్ ॥
టీకా:
పృథివ్యాం = భూమి; భిధ్యమానాయాం = త్రవ్వబడుచుండగా; నిర్ఘాత = పిడుగు పాటు; సమ = వంటి; నిస్వనః = ధ్వని; తతః = తరువాత; భిత్త్వా = త్రవ్వి, విభాగముచేయుట; మహీం = భూమిని; సర్వే = అందరును; కృత్వా = చేసి; అభిప్రదక్షిణమ్ = ప్రదక్షిణము.
భావము:
సగరకుమారులకు ఆ ధ్వని పిడుగుపాటు వలె వినిపించెను. అంతట వారు భూమిని త్రవ్వి జల్లెడపట్టినట్లు వెతుకుతు ఒక పర్యాయము భూప్రదక్షిణము చేసిరి.
- ఉపకరణాలు:
సహితాః సగరాః సర్వే
పితరం వాక్యమబ్రువన్।
"పరిక్రాంతా మహీ సర్వా
సత్త్వవంతశ్చ సూదితాః ॥
టీకా:
సహితాః = కలసి; సగరాః = సగర కుమారులు; సర్వే = అందరును; పితరం = తండ్రిని గుఱించి; వాక్యమ్ = మాటను; అబ్రువన్ = పలికిరి; పరిక్రాంతా = చుట్టబడినది; మహీ = భూ మండలము; సర్వా = అంతయు; సత్త్వవంతః = బలాఢ్యులైనవారు; చ = ఇంకా; సూదితాః = చంపబడినారు.
భావము:
ఆ సగర కుమారులందరు కలసి వెళ్ళి తమ తండ్రితో "భూమండల మంతయు తిరిగితిమి. బలాఢ్యులైన వీరిని పరిమార్చితిమి.
- ఉపకరణాలు:
దేవదానవరక్షాంసి
పిశాచోరగకిన్నరాః ।
న చ పశ్యామహేఽశ్వం తం
అశ్వహర్తారమేవ చ ॥
టీకా:
దేవః = దేవతలు; దానవః = దానవులు; రక్షాంసి = రాక్షసులు; పిశాచః = పిశాచములు; ఉరగః = సర్పములు; కిన్నరాః = కిన్నరులు; న = లేదు; చ = కూడ; పశ్యామహే = చూడగలుగుట; అశ్వం = గుఱ్ఱము; అశ్వ = గుఱ్ఱమును; హర్తారమ్ = దొంగిలించిన వానిని; ఏవ = అయినను; చ = కూడ.
భావము:
దేవతలను, దానవులను, రాక్షసులను, పిశాచములను, సర్పములను, కిన్నరులను పరిమార్చినాము. అశ్వము గాని, అశ్వమును దొంగిలించిన వారు గాని కనుగొనలేకపోతిమి.
- ఉపకరణాలు:
సగరస్య చ పుత్రాణామ్
వినాశోఽదీర్ఘజీవినామ్" ।
పితామహవచః శ్రుత్వా
త్రయస్త్రింశదరిందమ ॥
టీకా:
సగరస్య = సగరుని; చ; పుత్రాణాం = పుత్రులు; వినాశః = నశించెదరు; అదీర్ఘ జీవినామ్ = అల్పాయుష్కులు; పితామహ = బ్రహ్మదేవుని; వచః = అభయపు మాటలు; శ్రుత్వా = విని; త్రయస్త్రింశత్ = ముప్పది ముగ్గురు, దేవతలు; అరిం = శత్రువులను; దమ = సంహరించువాడా.
భావము:
శత్రువులను సంహరించు ఓ రామా ! అష్టవసువులు; ఏకాదశ రుద్రులు; ద్వాదశాదిత్యులు; అశ్వినీద్వయము కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు "సగర పుత్రులు అల్పాయుష్కులై నశించెదరు" అని బ్రహ్మదేవుడు పలుకగా విని.
*గమనిక:-
*- త్రయస్త్రింశద్దేవతలు- అష్టవసువులు (8 మంది), ఏకాదశ రుద్రులు (11 మంది), ద్వాదశాదిత్యులు (12 మంది), అశ్వినీద్వయము (2 ద్దరు) కలిసిన మొత్తము ముప్పది ముగ్గురు దేవతలు.
- ఉపకరణాలు:
సమన్యురబ్రవీద్వాక్యమ్
సగరో రఘునందన! ।
"భూయః ఖనత భద్రం వో
నిర్భిద్య వసుధాతలమ్ ॥
టీకా:
సమన్యుః = కోపోద్రిక్తుడై; అబ్రవీత్ = పలికెను; వాక్యం = మాటను; సగరః = సగరుడు; రఘునందన = రామా; భూయః = మరల; ఖనత = త్రవ్విపోసి వెదకుడు; భద్రం = శుభమగుగాక; వః = మీకు; నిర్భిద్య = భేదించి, విడదీసి; వసుధాతలమ్ = భూతలమును.
భావము:
రామా! సగరుడు పుత్రుల మాటలు విని; కోపోద్రిక్తుడై; "భూమండలము మొత్తం తిరిగి త్రవ్వి సకలం విడదీసి వెదకుడు. మీకు శుభమగుగాక.
- ఉపకరణాలు:
అశ్వహర్తారమాసాద్య
కృతార్థాశ్చ నివర్తథ" ।
పితుర్వచనమాసాద్య
సగరస్య మహాత్మనః ॥
టీకా:
అశ్వహర్తారమ్ = గుఱ్ఱము దొంగిలించిన వానిని; ఆసాద్య = పట్టుకొని; కృతార్థాః = కార్యమును సాధించిన వారై; చ = తప్పక; నివర్తథ = తిరిగి రండు; పితుర్వచనమ్ = తండ్రి మాటను; ఆసాద్య = గైకొని; సగరస్య = సగరుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన.
భావము:
“ తప్పక గుఱ్ఱము దొంగిలించిన వానిని పట్టుకొని కార్యమును సాధించిన వారై మాత్రమే తిరిగి రండు" అనెను. మహాత్ముడైన సగరుని మాటను వారు విని.
- ఉపకరణాలు:
షష్టిః పుత్రసహస్రాణి
రసాతలమభిద్రవన్ ।
ఖన్యమానే తతస్తస్మిన్
దదృశుః పర్వతోపమమ్ ॥
టీకా:
షష్టిః = అరవై; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేల మంది; రసాతలమ్ = పాతాళము గూర్చి; అభిద్రవన్ = వేగముగ వెళ్ళి; ఖన్యమానే = త్రవ్వబడుచుండగా; తతః = తరువాత; తస్మిన్ = ఆ ప్రదేశము; దదృశుః = చూసిరి; పర్వతోపమమ్ = పర్వతము వలె యున్న.
భావము:
ఆ అరువదివేల మంది సగరకుమారులు వేగముగా పాతాళమునకు త్రవ్వుచూ పోయిరి. అక్కడ వారు పర్వతమంత పెద్ద దానిని చూసిరి.
- ఉపకరణాలు:
దిశాగజం విరూపాక్షమ్
ధారయంతం మహీతలమ్ ।
సపర్వతవనాం కృత్స్నామ్
పృథివీం రఘునందన ॥
టీకా:
దిశాగజం = దిగ్గజమును; విరూపాక్షం = విరూపాక్షము అను పేరు గలది; ధారయంతం = ధరించుచున్నది; మహీతలమ్ = ధరణీతలమును; స = కలిగి యున్న; పర్వతః = పర్వతములు; వనాం = వనములు కల దానిని; కృత్స్నాం = సమస్తమైన; పృథివీం = భూమిని; రఘునందన = రామా.
భావము:
ఓ రామా ! అది నాలుగు దిక్కులలో ఒక దిక్కున పర్వతములతోను వనములతోను నిండియున్న భూమిని మ్రోయు చున్న విరూపాక్ష అను పేరు గల ఏనుగు.
*గమనిక:-
*- వాల్మీకం 1.40.13. అనుష్టుప్. నుండి 1.40.22.అనుష్టుప్ వరకు శ్లోకములు ప్రకారం దిగ్గజములు- నాలుగుదిక్కుల నుండి భూమిని మ్రోయు ఏనుగులు ఉంటాయి. వాటి పేర్లు తూర్పు దిగ్గజము విరూపాక్షము, దక్షిణ మహాపద్మము, పడమర సౌమననము, ఉత్తర భద్రము. పాఠ్యంతరము- పోతన తెలుగు భాగవతములోని 5.2-73-వ, బ్రహ్మచేతఁ జతుర్దిశల యందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలుగల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు;
- ఉపకరణాలు:
శిరసా ధారయామాస
విరూపాక్షో మహాగజః ।
యదా పర్వణి కాకుత్స్థ!
విశ్రమార్థం మహాగజః ॥
టీకా:
శిరసా = శిరస్సుతో; ధారయామాస = ధరించెను; విరూపాక్షః = విరూపాక్షము; మహా = మిక్కిలి పెద్ద; గజః = ఏనుగు; యదా = ఎప్పుడు; పర్వణి = పర్వకాలము నందు; కాకుత్స్థ = రామా; విశ్రమార్థం = అలసట తీర్చుకొనుటకై; మహాగజః = పెద్ద ఏనుగు.
భావము:
రామా! “విరూపాక్షము” అను ఆ పెద్ద ఏనుగు తన శిరస్సుతో ఒక దిక్కున భూమిని మ్రోయుచుండెను. పర్వకాలములందు విశ్రాంతి కొరకై తన తలను విదుల్చుకొనును.
- ఉపకరణాలు:
ఖేదాచ్చాలయతే శీర్షమ్
భూమికంపస్తదా భవేత్ ।
తం తే ప్రదక్షిణం కృత్వా
దిశాపాలం మహాగజమ్ ॥
టీకా:
ఖేదాత్ = అలసట వలన; చాలయతే = విదుల్చునో; శీర్షమ్ = శిరస్సును; భూమికంపః = భూకంపము; తదా = అప్పుడు; భవేత్ = అగును; తం = ఆ; తే = వారు; ప్రదక్షిణం = ప్రదక్షిణము; కృత్వా = చేసి; దిశాః = ఆ దిక్కును; పాలం = పాలించు; మహా = మిక్కిలి పెద్ద; గజః = ఏనుగు.
భావము:
అలసట తీర్చుకొనుటకొఱకు దిగ్గజము తన తలను విదుల్చునప్పుడు భూకంపము సంభవించును. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసిరి.
- ఉపకరణాలు:
మానయంతో హి తే రామ!
జగ్ముర్భిత్త్వా రసాతలమ్ ।
తతః పూర్వాం దిశం భిత్త్వా
దక్షిణాం బిభిదుః పునః ॥
టీకా:
మానయంతః = పూజించుచు; తే = వారు; రామ = రామా; జగ్ముః = వెళ్ళిరి; భిత్వా = త్రవ్వుచు; రసాతలమ్ = పాతాళముగూర్చి; తతః = తరువాత; పూర్వాం దిశం = తూర్పు దిక్కును; భిత్వా = త్రవ్వి; దక్షిణాం = దక్షిణ దిక్కును; బిభిదుః = త్రవ్విరి; పునః = మరల.
భావము:
రామా! వారు ఆ దిగ్గజమును పూజించి, భూమిని త్రవ్వి పాతాళమునకు వెళ్ళిరి. ముందుగా తూర్పు దిక్కును త్రవ్వి తరువాత దక్షిణ దిక్కులో భూమిని త్రవ్విరి.
- ఉపకరణాలు:
దక్షిణస్యామపి దిశి
దదృశుస్తే మహాగజమ్ ।
మహాపద్మం మహాత్మానమ్
సుమహత్పర్వతోపమమ్ ॥
టీకా:
దక్షిణస్యామ్ = దక్షిణవైపు; అపి = కూడ; దిశి = దిశ యందు; దదృశుః = చూసిరి; తే = వారు; మహా = మిక్కిలి పెద్ద; గజః = ఏనుగు; మహాపద్మం = మహాపద్మము అను పేరు గలదానిని; మహాత్మానమ్ = ఇత్తమమైనది; సు = మిక్కిలి; మహత్ = పెద్ద; పర్వతః = పర్వతములతో; ఉపమమ్ = సరిపోల్చదగ్గది.
భావము:
దక్షిణ దిక్కునందు కూడ వారు పెద్ద పర్వతమును బోలు అత్యుత్తమైన “మహాపద్మము” అను పేరు గల మహా గజమును చూసిరి.
- ఉపకరణాలు:
శిరసా ధారయంతం తే
విస్మయం జగ్మురుత్తమమ్ ।
తతః ప్రదక్షిణం కృత్వా
సగరస్య మహాత్మనః ॥
టీకా:
శిరసా = శిరస్సున; ధారయంతం = ధరించుచున్నది; తే = వారు; విస్మయం = ఆశ్చర్యమును; జగ్ముః = పొందిరి; ఉత్తమమ్ = గొప్ప; తతః = తరువాత; ప్రదక్షిణం = ప్రదక్షిణము; కృత్వా = చేసి; సగరస్య = సగరుని యొక్క; మహాత్మనః = మహాత్ముడైన.
భావము:
ఆ దిగ్గజము కూడ తన శిరస్సుపై భూమిని మ్రోయుచుండుట చూసి; సగర కుమారులు చాలా ఆశ్చర్యము నొంది, దానికి ప్రదక్షిణము చేసిరి.
- ఉపకరణాలు:
షష్టిః పుత్రసహస్రాణి
పశ్చిమాం బిభిదుర్దిశమ్ ।
పశ్చిమాయామపి దిశి
మహాంతమచలోపమమ్ ॥
టీకా:
షష్టిః = అరువది; పుత్ర = పుత్రులు; సహస్రాణి = వేల మంది; పశ్చిమాం = పడమర; బిభిదుః = త్రవ్వి నిశితంగా వెదకిరి; దిశమ్ = దిక్కును; పశ్చిమాయాం = పశ్చిమవైపు; అపి = కూడ; దిశి = దిక్కున; మహాంతమ్ = గొప్పదైన; అచలః = పర్వతముతో; ఉపమమ్ = పోల్చదగ్గది.
భావము:
సగరుని అరువది వేల మంది కుమారులు; పశ్చిమ దిక్కున భూమిని నిశితంగా వెదకి. ఆ దిశ యందు కూడ వారు గొప్ప పర్వతము వంటి ఒక దానిని చూసిరి.
- ఉపకరణాలు:
దిశాగజం సౌమనసమ్
దదృశుస్తే మహాబలాః! ।
తం తే ప్రదక్షిణం కృత్వా
పృష్ట్వా చాపి నిరామయమ్ ॥
టీకా:
దిశాగజం = దిగ్గజమును; సౌమనసమ్ = సౌమనసు అను పేరు గల; దదృశుః = చూసిరి; తే = వారు; మహా = గొప్ప; బలాః = బలమైన; తం = దానిని; తే = వారు; ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము; కృత్వా = చేసి; పృష్ట్వా = అడిగి; నిరామయమ్ = కుశలము
భావము:
పశ్చిమమున “సౌమనసము” అను పేరు గల పెద్ద పర్వతము వంటి మహాగజమును చూసిరి. దానికి కూడ ప్రదక్షిణముచేసి దాని కుశలప్రశ్నలు వేసిరి.
- ఉపకరణాలు:
ఖనంతః సముపక్రాంతా
దిశం హైమవతీం తతః ।
ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ!
దదృశుర్హిమపాండరమ్ ॥
టీకా:
ఖనంతః = వెదకుచు, త్రవ్వుచు; సముపక్రాంతా = వెళ్ళిరి; దిశం = దిక్కుగూర్చి; హైమవతీం = హిమవత్పర్వతము వైపునకు; తతః = తరువాత; ఉత్తరస్యాం = ఉత్తర దిక్కునందు; రఘుశ్రేష్ఠ = రామా; దదృశుః = చూసిరి; హిమ = మంచు వలె; పాండురమ్ = తెల్లగా.
భావము:
రామా! అక్కడనుండి వారు హిమవత్పర్వతము వైపునకు ఉత్తర దిశగా వెళ్ళిరి. అక్కడ మంచువలె తెల్లనైన ఒక దానిని చూసిరి.
- ఉపకరణాలు:
భద్రం భద్రేణ వపుషా
ధారయంతం మహీమిమామ్ ।
సమాలభ్య తతః సర్వే
కృత్వా చైనం ప్రదక్షిణమ్ ॥
టీకా:
భద్రం = భద్రమను పేరు గల; భద్రేణ = శుభప్రదమైన; వపుషా = చక్కని రూపము కలిగి యున్న; ధారయంతం = ధరించుచున్నది; మహీమ్ = భూమిని; ఇమామ్ = ఈ; సమాలభ్య = ముట్టుకొని; తతః = తరువాత; సర్వే = సమస్తమైన; కృత్వా = చేసి; ఏనం = దీనిని; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణము.
భావము:
ఆ చక్కని రూపుతోనున్న శుభప్రదమైన ”భద్రము” అను పేరు గల దిగ్గజమును తాకి ప్రదక్షిణము చేసిరి.
- ఉపకరణాలు:
షష్టిః పుత్రసహస్రాణి
బిభిదుర్వసుధాతలమ్ ।
తతః ప్రాగుత్తరాం గత్వా
సాగరాః ప్రథితాం దిశమ్ ॥
టీకా:
షష్టిః = అరువది; పుత్రః = పుత్రులు; సహస్రాణి = వేల మంది; బిభిదుః = సూక్ష్మగా వెదకుటకు త్రవ్విరి; వసుధాతలమ్ = భూమిని; తతః = తరువాత; ప్రాక్ +ఉత్తరాం = ఈశాన్య వైపు; గత్వా = వెళ్ళి; సాగరాః = సగరుని కుమారులు; ప్రథితాం = ప్రసిద్ధమైన; దిశమ్ = దిక్కును గూర్చి.
భావము:
తరువాత సగరుని అరువది వేల మంది కుమారులు భూమిని దీర్ఘంగా వెదకుచు త్రవ్వుచు, ప్రసిద్ధమైన ఈశాన్యంవైపు దిక్కునకు వెళ్ళిరి.
- ఉపకరణాలు:
రోషాదభ్యఖనన్ సర్వే
పృథివీం సగరాత్మజాః ।
తే తు సర్వే మహాత్మానో
భీమవేగా మహాబలాః ॥
టీకా:
రోషాత్ = కినుకతో; అభ్య ఖనన్ = త్రవ్విరి; సర్వే పృథివీం = భూమి నంతటిని; సగరాత్మజాః = సగరుని కుమారులు; తే = వారు; తు; సర్వే = అందరును; మహాత్మనః = మహాత్ములైన; భీమ = భయంకరమైన; వేగాః = వేగము గల వారు; మహా = గొప్ప; బలాః = బలాఢ్యులు.
భావము:
మహాత్ములు; గొప్ప బలాఢ్యులు ఐన సగర కుమారు లందరు కృతకృత్యులు కాలేకపోతున్న కినుకతో, మహా వేగముగా భూమిని త్రవ్వసాగిరి.
- ఉపకరణాలు:
దదృశుః కపిలం తత్ర
వాసుదేవం సనాతనమ్ ।
హయం చ తస్య దేవస్య
చరంతమవిదూరతః ॥
టీకా:
దదృశుః = చూసిరి; కపిలం = కపిలావతారములో నున్న; తత్ర = అక్కడ; వాసుదేవం = వాసుదేవుని; సనాతనమ్ = పురాణపురుషుడైన; హయం = గుఱ్ఱమును; చ = కూడ; తస్య = ఆ; దేవస్య = దేవునకు; చరంతమ్ = తిరుగుచున్న; అవిదూరతః = దగ్గరలో.
భావము:
అక్కడ కపిలుని అవతారములో నున్న వాసుదేవుని, మఱియు ఆ సమీపమున తిరుగుచున్న గుఱ్ఱమును చూసిరి.
- ఉపకరణాలు:
ప్రహర్షమతులం ప్రాప్తాః
సర్వే తే రఘునందన! ।
తే తం హయహరం జ్ఞాత్వా
క్రోధపర్యాకులేక్షణాః ॥
టీకా:
ప్రహర్షమ్ = సంతోషమును; అతులం = సాటిలేని; ప్రాప్తాః = పొందిరి; సర్వే = అందరును; తే = వారు; రఘునందన = రామా; తే = ఆ; తం = వారు; హయవరం = శ్రేష్ఠాశ్వమును; జ్ఞాత్వా = గుర్తించి; క్రోధః = క్రోధముచే; పరి = మిక్కిలి; వ్యాకులః = కలత చెందిన; ఈక్షణాః = కన్నులు కలవారై.
భావము:
శ్రేష్ఠమైన ఆ గుఱ్ఱమును చూసి వారు సాటిలేని ఆనందము పొందిరి. ఓ రామా ! ఆ గుఱ్ఱమును గుర్తించిన పిదప వారి కన్నులు క్రోధముతో కలత చెందినవి..
- ఉపకరణాలు:
ఖనిత్రలాంగలధరా
నానావృక్షశిలాధరాః ।
అభ్యధావంత సఙ్క్రుద్ధాః
తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్ ॥
టీకా:
ఖనిత్రః = గునపములను; లాంగలః = నాగళ్ళను; ధరాః = ధరించిన వారై; నానా = అనేకమైన; వృక్షః = చెట్లను; శిలాః = రాళ్ళను; ధరాః = పట్టినవారై; అభ్యదావంత = అతని మీదకు పరుగుపెట్టిరి; సంకృద్ధాః = కోపోద్రిక్తులై; తిష్ఠ తిష్ఠ = ఆగుము ఆగుము; ఇతి = అని; చ = కూడ; ఆబ్రువన్ = పలికిరి కూడ.
భావము:
వారందరు గునపములు, నాగళ్ళు, చెట్లు, రాళ్ళు ధరించి, ఆ కపిలమహామునిపై "ఆగుము ఆగుము" అనుచు మీదకు దూకిరి.
- ఉపకరణాలు:
"అస్మాకం త్వం హి తురగమ్
యజ్ఞీయం హృతవానసి ।
దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్
విద్ధి నః సగరాత్మజాన్" ॥
టీకా:
అస్మాకం = మా యొక్క; త్వం = నీవు; హి = మాత్రమే కదా; తురగం = గుఱ్ఱమును; యజ్ఞీయం = యజ్ఞమునకు సంబంధించిన; హృతవాన్ = దొంగిలించిన; అసి = అల్పుడవు; దుర్మేధః = దుష్ట బుద్ది గల; త్వం = నీవు; సంప్రాప్తాన్ = ఇక్కడ దొరికిపోతివి; విద్ధి = తెలుసుకొనుము; నః = మమ్ములను; సగరాత్మజాన్ = సగరుని కుమారులుగా.
భావము:
దుష్టబుద్ధీ! నీవు మా యజ్ఞాశ్వమును దొంగిలించినావు. ఇచట దొరికిపోతివి. మమ్ము సగరకుమారులుగా తెలుసుకొనుము.
- ఉపకరణాలు:
శ్రుత్వా తు వచనం తేషామ్
కపిలో రఘునందన! ।
రోషేణ మహతాఽఽవిష్టో
హుంకారమకరోత్తదా ॥
టీకా:
శ్రుత్వా = విని; వచనం = మాటను; తేషాం = వారి యొక్క; కపిలః = కపిల మహాముని; రఘునందన = రామా; రోషేణ = కోపముతో; మహతా = గొప్ప; ఆవిష్టః = కూడిన; హుంకారమ్ = హుంకారమును; అకరోత్ = చేసెను; తదా = అప్పుడు.
భావము:
రామా! కపిల మహాముని వారి మాటలు విని, మిక్కిలి కోపోద్రిక్తుడై హుంకరించెను.
- ఉపకరణాలు:
"యస్యేయం వసుధా కృత్స్నా
వాసుదేవస్య ధీమతః ।
కాపిలం రూపమాస్థాయ
ధారయత్యనిశం ధరామ్ ॥
టీకా:
యస్య = ఏదైతే; ఇయం = ఈ; వసుధా = భూమి; కృత్స్నా = సమస్తమైన; వాసుదేవస్య = వాసుదేవునికి చెందిన; ధీమతః = ధీమంతుడైన; కాపిలం = కపిలుని; రూపమ్ = రూపమును; ఆస్థాయ = స్థిరముగా నుండువాడై; ధారయతి = ధరించుచున్నాడు; అనిశం = నిత్యము; ధరామ్ = భూమిని.
భావము:
“ఈ భూమండలమంతయు ఏ వాసుదేవునకు చెందినదో ఆ వాసుదేవుడు, కపిల మహర్షిగా అవతరించి ఈ భూమిని నిత్యము స్థిరుడై ధరించుచున్నాడు.
- ఉపకరణాలు:
ఇత్యార్షే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
చత్వారింశః సర్గః॥
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చత్వారింశః [40] = నలభైయవ; సర్గః = సర్గ-
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [40] నలభైయ వ సర్గ.