వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥షట్త్రింశః సర్గః॥ [36 ఉమాదేవి మహిమ]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉక్తవాక్యే మునౌ తస్మిన్
 ఉభౌ రాఘవలక్ష్మణౌ ।
అభినంద్య కథాం వీరౌ
 ఊచతుర్మునిపుంగవమ్ ॥

టీకా:

ఉక్తః = చెప్పబడిన; వాక్యే = వాక్యము కలవారై; మునౌ = ముని; తస్మిన్ = ఆ; ఉభౌ = ఇరువురును; రాఘవ = రాముడు; లక్ష్మణౌ = లక్ష్మణులు; అభినంద్య = అభినందించి; కథాం = కథను; వీరౌ = వీరులైన; ఊచతుః = పలికిరి; మునిః = మునులలో; పుంగవమ్ = శ్రేష్ఠుని గుఱించి.

భావము:

పరాక్రమవంతులు రామలక్ష్మణులు యిరువురు విశ్వామిత్రుని పలుకులు విని ఆ వృత్తాంతమును ప్రశంసించి మునివర్యునితో ఇట్లు అనిరి.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ధర్మయుక్తమిదం బ్రహ్మన్!
 కథితం పరమం త్వయా ।
దుహితుః శైలరాజస్య
 జ్యేష్ఠాయా వక్తుమర్హసి ॥

టీకా:

ధర్మ = ధర్మముతో; యుక్తమ్ = కూడి ఉన్న; ఇదం = ఇది; బ్రహ్మన్ = బ్రాహ్మణా; కథితం = చెప్పబడినది; పరమం = ఉత్తమమైన; త్వయా = నీ చేత; దుహితుః = కుమార్తెయొక్క; శైలరాజస్య = పర్వతరాజు(హిమవంతుని ) యొక్క; జ్యేష్టయా = పెద్ద; వక్తుమ్ = చెప్పుటకు; అర్హసి = తగి ఉన్నావు.

భావము:

"ఓ విశ్వామిత్ర బ్రహ్మర్షీ! ధర్మసంయుక్తమైన కథను చెప్పితివి. హిమవత్పర్వత రాజు పెద్ద కుమార్తె కథ చెప్పవలసినది.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విస్తరం విస్తరజ్ఞోఽ సి
 దివ్యమానుషసమ్భవమ్ ।
త్రీన్ పథో హేతునా కేన
 ప్లావయేల్లోకపావనీ ॥

టీకా:

విస్తరమ్ = విస్తృతముగా; విస్తర = వివరముగా; జ్ఞః = తెలిసినవాడవు; అసి = త్వమర్థకము, నీవు; దివ్య = దేవలోకమునందును; మానుష = మనుష్యలోకమునందును; సంభవమ్ = జరిగినవి; త్రీన్ = మూడు; పథః = త్రోవలను; హేతునా = కారణముచే; కేన = ఎందుకు; ప్లావయేత్ = ప్రవహించుచున్నది; లోక = లోకములను; పావనీ = పవిత్రము చేయునది

భావము:

నీవు దేవ మనుష్య లోకములలో జరిగిన విషయములు వివరముగా తెలిసినవాడవు. లోకములను పవిత్రము చేయు గంగ ఎందుచే త్రిపథయై ముల్లోకములలో ప్రవహించుచున్నది?

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కథం గంగా త్రిపథగా
 విశ్రుతా సరిదుత్తమా?
త్రిషు లోకేషు ధర్మజ్ఞ
 కర్మభిః కైః సమన్వితా?" ॥

టీకా:

కథం = ఏ విధముగ; గంగా = గంగ; త్రిపథ = మూడు త్రోవ / సోకములలో; గా = ప్రవహించు; విశ్రుతా = ప్రసిద్ధమైన; సరిత్ = నది; ఉత్తమా = ఉత్తమమైనది; త్రిషు = .మూడు; లోకేషు = లోకములలో; ధర్మజ్ఞ = ధర్మములను ఎఱిగినవాడా; కర్మభి ః = కర్మలతో; కైః = ఏ; సమన్వితా = కూడుకొన్నది

భావము:

గంగ ఎందుచే మూడు మార్గములలో ప్రవహించుచు ఉత్తమనదియై ప్రసిద్ధి కెక్కినది? ఓ ధర్మజ్ఞుడా! గంగ మూడు జగములలో ఏ కర్మములతో కూడుకొని ఉన్నది?"

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథా బ్రువతి కాకుత్స్థే
 విశ్వామిత్రస్తపోధనః ।
నిఖిలేన కథాం సర్వాం
 ఋషిమధ్యే న్యవేదయత్ ॥

టీకా:

తథా = ఆ విధముగా; బ్రువతి = పలుక; కాకుత్స్థే = రాముడు; విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; తపోధనః = తపస్సు ధనముగా గల; నిఖిలేన = సంపూర్ణముగా; కథాం = కథను; సర్వామ్ = సకలురు; ఋషి = ఋషుల; మధ్యే = నడుమ; న్యవేదయత్ = తెలియచెప్పెను

భావము:

రాముని పలుకులు విని తపోధనుడైన విశ్వామిత్రమహర్షి సకల ఋషుల మధ్య కథను సంపూర్ణముగా చెప్పసాగెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“పురా రామ! కృతోద్వాహో
 నీలకణ్ఠో మహాతపాః ।
దృష్ట్వా చ స్పృహయా దేవీం
 మైథునాయోపచక్రమే ॥

టీకా:

పురా = పూర్వము; రామ = రామా; కృత = చేసుకొన్న; ఉద్వాహః = వివాహము గల వాడు; నీలకంఠః = ఈశ్వరుడు; మహా = గొప్ప; తపః = తపఃశాలియైన; దృష్ట్వా = చూచి; చ = మఱియు; స్పృహయా = ఆసక్తితో; దేవీం = దేవిని; మైథునాయ = మైథునమునకు; ఉపచక్రమే = ఉపక్రమంచెను.

భావము:

ఓ రామా! పూర్వము మహాతపఃశాలియైన పరమేశ్వరుడు వివాహము చేసుకొని దేవిని ఆకాంక్షతో చూచి సంభోగమునకు ఉపక్రమించెను.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శితికణ్ఠస్య దేవస్య
 దివ్యం వర్షశతం గతమ్ ।
న చాపి తనయో రామ!
 తస్యామాసీత్పరంతప ॥

టీకా:

శితికంఠస్య = ఈశ్వరునకు; దేవస్య = దైవమునకు; దివ్యమ్ = దేవతల; వర్షశతం = నూరు సంవత్సరములు; గతమ్ = కడచిన; న = లేదు; చ అపి = అయినను; తనయః = పుత్రుడు; రామ = రామా; తస్యామ్ = ఆమె యందు; ఆసీత్ = పుట్టుట; పరంతపా = శత్రువులను పీడించు

భావము:

శత్రువులను తపింపజేయు ఓ రామా! నీలకంఠుడు తన దేవితో నూరు దివ్యసంవత్సరములు క్రీడించుచుండ నూరు సంవత్సరములు కడచినవి. అయినను ఆ దేవియందు కుమారుడు జన్మించలేదు.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో దేవాః సముద్విగ్నాః
 పితామహపురోగమాః ।
యదిహోత్పద్యతే భూతం
 కస్తత్ప్రతిసహిష్యతే? ॥

టీకా:

తతః = పిమ్మట; దేవాః = దేవతలు; సముత్ విగ్నాః = మిగుల కలత చెందిరి; పితామహ = బ్రహ్మను; పురోగమాః = ముందుంచుకొని వెళ్ళిరి; యత్ = ఏ; ఉత్పద్యతే = జనించునో; భూతం = ప్రాణిని; కః = ఎవడు; ప్రతిసహిష్యతే = సహింపగలడు

భావము:

పిదప బ్రహ్మ మొదలగు దేవతలు ఈమెయందు పుట్టే వానిని ఎవరైనా సహింపగలరా ? అని మిగుల కలత చెందిరి.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభిగమ్య సురాః సర్వే
 ప్రణిపత్యేదమబ్రువన్ ।
దేవదేవ! మహాదేవ!
 లోకస్యాస్య హితే రత! ॥

టీకా:

అభిగమ్య = సమీపించి; సురాః = దేవతలు; సర్వే = అందఱు; ప్రణిపత్య = పాదములకు నమస్కరించి; ఇదమ్ = ఇట్లు; అబ్రువన్ = పలికిరి; దేవదేవ = దేవతలకు దేవుడా; మహాదేవ = మహాదేవుడా; లోకస్య = లోకము యొక్క; అస్య = ఈ; హితే = మేలులో; రత = ఆసక్తి కలవాడా!

భావము:

దేవతలంతా శివుని సమీపించి పాదములకు ప్రణామములు చేసి ఇట్లు పలికిరి. ఓ దేవదేవుడా! మహాదేవా! సకలలోకాల హితము కోరువాడవు నీవు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురాణాం ప్రణిపాతేన
 ప్రసాదం కర్తుమర్హసి ।
న లోకా ధారయిష్యంతి
 తవ తేజః సురోత్తమ" ॥

టీకా:

సురాణాం = దేవతల యొక్క; ప్రణిపాతేన = సాష్టాంగ నమస్కారముల చేత; ప్రసాదం = అనుగ్రహమును; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగియుంటివి; న = చాలవు; లోకాః = లోకములు; ధారయిష్యంతి = ధరించుటకు; తవ = నీ యొక్క; తేజస్ = తేజస్సును; సురోత్తమ = దేవతలలో శ్రేష్ఠుడా!

భావము:

ఓ మహేశ్వరా! దేవతలము మేము నీకు పాదప్రణామములు చేసితిమి. ప్రసన్నుడవు కమ్ము! లోకములు నీ తేజస్సును ధరింపజాలవు.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రాహ్మేణ తపసా యుక్తో
 దేవ్యా సహ తపశ్చర ।
త్రైలోక్యహితకామార్థం
 తేజస్తేజసి ధారయ" ॥

టీకా:

బ్రాహ్మేణ = వేదోక్తముగా; తపసా = తపస్సుతో; యుక్తః = కూడి; దేవ్యాసహ = పార్వతీదేవితో కూడ; తపః = తపస్సు; చర = చేయుము; త్రైలోక్య = ముల్లోకముల యొక్క; హితకామార్థమ్ = మేలు కోరుటకై; తేజస్ = తేజస్సు; తేజసి = తేజస్సులో; ధారయ = ధరింపుము

భావము:

నీవు పార్వతితో కూడి వేదోక్తముగా తపము చేయుము. ముల్లోకముల హితమునకై తేజస్సును నీ తేజస్సునందే ( నీ శరీరము లోనే ) నిలుపుము."

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవతానాం వచః శ్రుత్వా
 సర్వలోకమహేశ్వరః ।
బాఢమిత్యబ్రవీత్ సర్వాన్
 పునశ్చేదమువాచ హ ॥

టీకా:

దేవతానామ్ = దేవతల యొక్క; వచః = వచనమును; శ్రుత్వా = విని; సర్వలోక = సకల లోకములకు; మహేశ్వరః = మహాప్రభువు; బాఢమ్ = నిశ్చయముగ; ఇతి = అని; అబ్రవీత్ = పలికెను; సర్వాన్ = అంతటిని; పునశ్చ = మరల; ఏవమ్ = ఇట్లు; ఉవాచ హ = పలికెను.

భావము:

సకల లోకములకు ప్రభువైన మహేశ్వరుడు దేవతల పలుకులు విని ‘“నిశ్చయముగ అటులనే అగును “ అని పలికి మరల ఇట్లనెను.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధారయిష్యామ్యహం తేజః
 తేజస్యేవ సహోమయా ।
త్రిదశాః పృథివీ చైవ
 నిర్వాణమధిగచ్ఛతు ॥

టీకా:

ధారయిష్యామి = ధరించెదను; అహమ్ = నేను; తేజః = తేజస్సును; తేజస్య ఇవ = తేజస్సు వలె; సహ ఉమయా = ఉమాదేవితో కలసి; త్రిదశాః = దేవతలును; పృథివీ చైవ = పుడమియును; నిర్వాణమ్ = సుఖమును; అధిగచ్ఛతు = పొందుదురు

భావము:

నేను ఉమాదేవితో కలసి నా తేజస్సును నా దేహములోనే నిలిపెదను. దేవతలు; మనుజులు సుఖములు పొందుదురు గాక!

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యదిదం క్షుభితం స్థానాన్
 మమ తేజో హ్యనుత్తమమ్ ।
ధారయిష్యతి కస్తన్మే?
 బ్రువంతు సురసత్తమాః!" ॥

టీకా:

యత్ = ఏ; ఇదం = ఇది; క్షుభితమ్ = క్షోభింపబడిన; స్థానాత్ = చోటు నుంచి; మమ = నా యొక్క; తేజహి = తేజస్సును; అనుత్తమమ్ = శ్రేష్ఠమైనది; ధారయిష్యతి = ధరించగలడు; కః = ఎవరు; తత్ = వానిని; మే = నాకు; బ్రువంతు = చెప్పుదురు గాక; సురసత్తమాః = దేవతా శ్రేష్ఠులారా

భావము:

దేవతలారా. స్థానచలనం జరిగిపోవుటచే క్షోభించిన నా ఈమిక్కిలి శ్రేష్టమైన మహా తేజస్సును ఎవరు ధరించగలరు చెప్పండి.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తాస్తతో దేవాః
 ప్రత్యూచుర్వృషభధ్వజమ్ ।
యత్తేజః క్షుభితం హ్యేతత్
 తద్ధరా ధారయిష్యతి" ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; ఉక్తాః = పలుకబడిన; సురాః = దేవతలు; సర్వే = సకలురు; ప్రత్యూచుః = ప్రతివచనము పలికిరి; వృషభధ్వజమ్ = పరమేశ్వరుని గురించి! యః = ఏ; తేజః = తేజస్సు; క్షుభితం హి = చలించునో; ఏతత్ = దానిని; ధరా = భూమి; ధారయిష్యతి = ధరించగలదు

భావము:

పరమేశ్వరుని పలుకులు విని దేవతలందఱు అతనితో ‘ చలించే నీ తేజస్సును భూమి ధరించగలదు’అని ప్రత్యుత్తరము ఇచ్చిరి.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్తః సురపతిః
 ప్రముమోచ మహీతలే ।
తేజసా పృథివీ యేన
 వ్యాప్తా సగిరికాననా ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; ఉక్తాః = పలుకబడిన; సురపతిః = పరమేశ్వరుడు; ప్రముమోచ = విడిచెను; మహీతలే = భూతలమునందు; తేజసా = తేజస్సుచేత; పృథివీ = భూమి; యేన = ఏదైతే; వ్యాప్తా = వ్యాపించబడినదో; స = కూడియున్న; గిరి = పర్వతముల తోడను; కాననా = అడవులతోడను.

భావము:

దేవతల ప్రత్యుత్తరపు పలుకులు వినిన శంకరుడు తన తేజస్సును పుడమిపై విడిచిపెట్టెను. అది పర్వతములు; అరణ్యములతో కూడిఉన్న భూతలముపై వ్యాపించెను.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతో దేవాః పునరిదం
 ఊచుశ్చాథ హుతాశనమ్ ।
ప్రవిశ త్వం మహాతేజో
 రౌద్రం వాయుసమన్వితః" ॥

టీకా:

తతః = తరువాత; దేవాః = దేవతలు; పునః = మరల; ఇదమ్ = ఇట్లు; ఊచుః చ = పలికిరి; అథ = పిమ్మట; హుతాశనమ్ = అగ్నిని; ప్రవిశ = ప్రవేశింపుము; త్వం = నీవు; మహాతేజః = గొప్ప తేజస్సును; రౌద్రమ్ = రుద్రుని; వాయు సమన్వితః = వాయువుతో కూడి;

భావము:

పిదప దేవతలు అగ్నితో “ నీవు వాయువుతో కలసి ఈశ్వరుని తేజస్సులోనికి ప్రవేశింపుము “ అని పలికిరి.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదగ్నినా పునర్వ్యాప్తం
 సంజాతః శ్వేతపర్వతః ।
దివ్యం శరవణం చైవ
 పావకాదిత్యసన్నిభమ్ ।
యత్ర జాతో మహాతేజాః
 కార్తికేయోఽ గ్నిసమ్భవః ॥

టీకా:

తత్ = ఆ అగ్నినా = అగ్నిచే; పునః = మరల; వ్యాప్తమ్ = వ్యాప్తమయి; సంజాతః = అయినది; శ్వేతపర్వతః = తెల్లని పర్వతము; దివ్యమ్ = దివ్యమయిన; శరవణమ్ చైవ = రెల్లుగడ్డివనముగాను; పావక ఆదిత్య సన్నిభమ్ = అగ్ని ఆదిత్యులతో సమానమైన; యత్ర = ఎచట; జాతః = పుట్టెను; మహాతేజాః = మిగుల తేజోవంతుడు; కార్తికేయః = కృత్తికల కుమారుడైన కార్తికేయుడు; అగ్నిసంభవః = అగ్ని నుంచి పుట్టినవాడు.

భావము:

ఎక్కడ ఐతే అగ్నిసంభవుడు, కృత్తికల కుమైరుడును ఐన కుమారస్వామి పుట్టాడో, అక్కడ ఈశ్వరుని తేజస్సు అగ్నివాయువులచే వ్యాపించబడి శ్వేతపర్వతమయినది అగ్ని ఆదిత్యులతో సమానమైన దివ్యశరవణముగా అయినది.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథోమాం చ శివం చైవ
 దేవాః సర్షిగణాస్తదా ।
పూజయామాసురత్యర్థం
 సుప్రీతమనసస్తతః ।।

టీకా:

అథ = పిదప; ఉమాం చ = ఉమాదేవిని; చ; శివం చైవ = ఈశ్వరుని; చైవ; దేవాః = దేవతలు; స = సహితముగ; ఋషి = ఋషి కూడి; గణాః = సమూహములతో కూడి; తదా = అప్పుడు; పూజయామసు = పూజించిరి; అత్యర్థం = ఎక్కువగా; సుప్రీత = చాలా సంతసించిన; మనసః = మనస్సులు; తతః = అచటనుండి

భావము:

పిమ్మట దేవతలు, మహర్షులు మిక్కిల సంతోషించినవారైరి. ఉమాదేవిని పరమేశ్వరుని పూజించిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూజయామాసురత్యర్థం
 సుప్రీతమనసస్తతః ।
అథ శైలసుతా రామ
 త్రిదశానిదమబ్రవీత్ ॥

టీకా:

అథ = పిమ్మట; శైలసుతా = ఉమాదేవి; రామ = ఓ రామా! త్రిదశాన్ = దేవతలను గురించి; ఇదమ్ = ఇట్లు; అబ్రవీత్ = పలికెను,

భావము:

ఓ రామా! ఆపై ఉమాదేవి కోపము బూని ఎఱ్ఱబారిన కన్నులు గలదై దేవతలను అందఱినీ ఇట్లు అనెను.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సమన్యురశపత్సర్వాన్
 క్రోధసంరక్తలోచనా ।
యస్మాన్నివారితా చైవ
 సంగతిః పుత్రకామ్యయా ॥

టీకా:

సమన్యుః = కోపముతో; అశపత్ = శపించెను; సర్వాన్ = అందఱినీ; క్రోధ సంరక్తలోచనా = కోపముతో ఎఱ్ఱబారిన కన్నులతో; యస్మాత్ = ఎందువలన; నివారితా = నివారింపబడినదో; చ; ఏవ = ఇట్లు; సంగతిః = సంగమము; పుత్రకామ్యయా = పుత్రుని కొఱకు కోరికతో.

భావము:

కోపముతో ఎఱ్ఱబారిన కన్నులతో దేవతలను అందరినీ ఇట్లు శపించెను “పుత్రవాంఛతో చేయుచున్న మా సంగమము నివారించబడిన కారణము వలన

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అపత్యం స్వేషు దారేషు
 తస్మాన్నోత్పాదయిష్యథ ।
అద్యప్రభృతి యుష్మాకం
 అప్రజాః సంతు పత్నయః" ॥

టీకా:

అపత్యమ్ = సంతానము; స్వ ఏషు = వారి యందు; దారేషు = భార్యలయందు; తస్మాత్ = ఆ కారణముచే; న = లేకుండుగాక; ఉత్పాదయిష్యథ = పుట్టింపబడుట; అద్యప్రభృతి = నేటినుంచి; యుష్మాకమ్ = మీ యొక్క; అప్రజాః = సంతానము లేనివారు; సంతు = అగుదురు గాక; పత్నయః = భార్యలు.

భావము:

మీ మీ భార్యలయందు మీకు సంతానము కలుగకుండును గాక. నేటి నుంచి మీ భార్యలకు సంతానము కలుగకుండును గాక”

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా సురాన్ సర్వాన్
 శశాప పృథివీమపి ।
అవనే నైకరూపా త్వం
 బహుభార్యా భవిష్యసి ॥

టీకా:

ఏవమ్ = ఇట్లు; ఉక్త్వా = పలికి; సురాన్ = దేవతలను; సర్వాన్ = సకల; శశాప = శపించెను; పృథివీమ్ అపి = భూమిని కూడా; అవనే = ఓ భూమీ; న ఏకరూపా = అనేక రూపములు కలదానివై; త్వమ్ = నీవు; బహుభార్యా = అనేకులకు భార్యవు; భవిష్యసి = అగుదువు గాక

భావము:

ఇట్లు దేవతలందరితో పలికి పార్వతి పుడమిని కూడా శపించింది; “ ఓ అవనీ! నీవు అనేక రూపములు కలిగి అనేకులకు భార్యవగుదువు గాక!

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న చ పుత్రకృతాం ప్రీతిం
 మత్క్రోధకలుషీకృతా ।
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే
 మమ పుత్రమనిచ్ఛతీ" ॥

టీకా:

న చ = కూడా ఉండదు; పుత్రకృతాం = పుత్రులు కలిగించు; ప్రీతిమ్ = సంతోషము; మత్ = నా యొక్క; క్రోధకలుషీకృతా = కోపమను దోషము కలిగించు; ప్రాప్యసి = పొందుటను కూడా; త్వమ్ = నీవు; సుదుర్మేధే = చాలా చెడ్డబుద్ధి కలదానా; మమ = నాకు; పుత్రమ్ = కొడుకుని; అనిచ్ఛతీ = ఇష్టపడక

భావము:

ఓ భూమీ! నీవు చాలా దుర్బుద్ధి కలదానవు. నాకు కుమారుడు కలుగుట ఇష్టపడని నీకు నా కోప ఫలముచే పుత్రుల సంతోషము కలుగకుండును గాక!”

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా
 సురాన్ సురపతిస్తదా ।
గమనాయోపచక్రామ
 దిశం వరుణపాలితామ్ ॥

టీకా:

తాన్ = ఆ; సర్వాన్ = సకల; వ్రీడితాన్ = లజ్జించు; దృష్వా = చూచి; సురాన్ = దేవతలను; సురపతిః = పరమేశ్వరుడు; తదా = అప్పుడు; గమనాయ = వెళ్ళుటకు; ఉపచక్రామ = ఉపక్రమించెను; దిశం = దిక్కుకు; వరుణపాలితమ్ = వరుణునిచే పాలించబడు;

భావము:

మహేశ్వరుడు సిగ్గుపడుచున్న సకల దేవతలను చూచి వరుణుడు పరిపాలించు పశ్చిమదిశకు పయనము సమకట్టెను.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స గత్వా తప ఆతిష్ఠత్
 పార్శ్వే తస్యోత్తరే గిరేః ।
హిమవత్ప్రభవే శృంగే
 సహ దేవ్యా మహేశ్వరః ॥

టీకా:

స = ఆ; గత్వా = వెళ్ళి; ఆతిష్ఠత్ = వసించెను; పార్శ్వే = ప్రక్కన; తస్య = ఆ; ఉత్తరే = ఉత్తరము నందవి; గిరౌ = కొండలో; హిమవత్ = హిమవత్పర్వతము నందు; ప్రభవే = పుట్టిన; శృంగే = శిఖరమునందు; సహ = కలసి; దేవ్యా = దేవితో; మహేశ్వరః = పరమేశ్వరుడు

భావము:

శంకరుడు హిమవత్పర్వతములో పడమటి దిక్కులో వెళ్ళి ఉత్తరము వైపు ఉన్న శిఖరముపై ఉమాదేవీ సమేతుడై తపస్సు చేసెను.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏష తే విస్తరో రామ!
 శైలపుత్ర్యా నివేదితః ।
గంగాయాః ప్రభవం చైవ
 శృణు మే సహలక్ష్మణః" ॥

టీకా:

ఏష = ఈ; తే = నీకు; విస్తరః = వివరమైన; రామ = ఓ రామా; శైలపుత్ర్యా = పర్వత పుత్రిక; నివేదితః = చెప్పబడినది; గంగాయాః = గంగయొక్క; ప్రభవం = పుట్టుక; చైవ = కూడా; శృణు = వినుము; మే = నా నుండి; సహలక్ష్మణః = లక్ష్మణునితో కూడి

భావము:

ఓ రామా! పార్వతీదేవి వృత్తాంతమును వివరముగా చెప్పితిని. గంగాదేవి పుట్టుక గుఱించి కూడా చెప్పెదను. లక్ష్మణునితో కూడి ఆలకింపుము.

1-28-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 షట్త్రింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; షట్త్రింశః [36] = ముప్పై ఆరవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [36] ముప్పైఆరవ సర్గ సుసంపూర్ణము