వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥చతుస్త్రింశః సర్గః॥ [34 విశ్వామిత్రుని వృత్తాంతము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృతోద్వాహే గతే తస్మిన్
 బ్రహ్మదత్తే చ రాఘవ! ।
అపుత్రః పుత్రలాభాయ
 పౌత్రీమిష్టి మకల్పయత్ ॥

టీకా:

కృతః = చేసుకున్న; ఉద్వాహే = వివాహము కల వాడు; గతే = వెళ్ళుచుండగ; తస్మిన్ = ఆ; బ్రహ్మదత్తః = బ్రహ్మదత్తుడు; చ; రాఘవ = శ్రీరామచంద్ర; అపుత్రః = పుత్రులు లేనివాడు అయిన కుశనాభుడు; పుత్రలాభాయ = పుత్రులను పొందుటకొఱకు; పౌత్రీమ్+ఇష్టిమ్ = పుత్రకామేష్టి యాగమును; అకల్పయత్ = చేసెను

భావము:

శ్రీరామచంద్ర! బ్రహ్మదత్తుడు వివాహము చేసుకుని వెళ్ళిన తరువాత, అపుత్రకుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమునాచరించెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇష్ట్యాం చ వర్తమానాయాం
 కుశనాభం మహీపతిమ్ ।
ఉవాచ పరమోదారః
 కుశో బ్రహ్మసుతస్తదా ॥

టీకా:

ఇష్ట్యాం = పుత్రకామేష్టి; చ; వర్తమానాయామ్ = జరుగుచుండగ; కుశనాభం = కుశనాభునితో; మహీపతిమ్ = మహారాజు అయిన; ఉవాచ = నుడివెను; పరమ = మిక్కిలి; ఉదారః = ఉదారుడయిన; కుశః = కుశుడు; బ్రహ్మసుతః = బ్రహ్మసుతుడైన; తదా = అప్పుడు.

భావము:

బ్రహ్మమానసపుత్రుడు పరమ ఉదారుడు అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టి యగము చేయుచుండగ ఇట్లు పలికెను.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“పుత్ర తే సదృశః పుత్రో
 భవిష్యతి సుధార్మికః ।
గాధిం ప్రాప్స్యసి తేన త్వం
 కీర్తిం లోకే చ శాశ్వతీమ్" ॥

టీకా:

పుత్ర = కుమారుడా; తే = నీకు; సదృశః = సమానుడు; పుత్రః = కుమారుడు; భవిష్యతి = కలుగును; సు = మంచి; ధార్మికః = ధార్మికుడు అయిన; గాధిం = గాధి అను; ప్రాప్స్యసి = పొందగలవు; తేన = వానిచే; త్వమ్ = నీవు; కీర్తిం = కీర్తిని; లోకే = లోకమునందు; చ; శాశ్వతీమ్ = శాశ్వతమైన.

భావము:

“కుమార! నీతో సమానుడు, మంచి ధార్మికుడు అయిన గాధి అను పుత్రుడు నీకు కలుగును. నీవు వానివలన లోకములో శాశ్వతమైన కీర్తిని పొందగలవు.”

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా కుశో రామ
 కుశనాభం మహీపతిమ్ ।
జగామాకాశమావిశ్య
 బ్రహ్మలోకం సనాతనమ్ ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికిన తరువాత; కుశః = కుశుడు; రామ = శ్రీరామచంద్ర; కుశనాభం = కుశనాభుని గూర్చి; మహీపతిమ్ = భూపాలుడైన; జగామ = వెళ్ళెను; ఆకాశమ్ = ఆకాశము; ఆవిశ్య = ప్రవేశించి; బ్రహ్మలోకం = బ్రహ్మలోకమును గుఱించి; సనాతనమ్ = శాశ్వతమైన.

భావము:

శ్రీరామచంద్ర! కుశుడు తనపుత్రునితో ఇటుల పలికిన పిమ్మట ఆకాశమార్గమున సనాతనమైన సత్యలోకమునకు వెళ్ళెను.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కస్యచిత్త్వథ కాలస్య
 కుశనాభస్య ధీమతః ।
జజ్ఞే పరమధర్మిష్ఠో
 గాధిరిత్యేవ నామతః ॥

టీకా:

కస్యచిత్ = కొంత; అథ = తరువాత; కాలస్య = కాలమునకు; కుశనాభస్య = కుశనాభునకు; ధీమతః = ధీమంతుడైన; జజ్ఞే = జనించెను; పరమ = మిక్కిలి; ధర్మిష్ఠః = ధార్మికుడైన; గాధిః = గాధి; ఇత్యేవ = అనెడు; నామతః = పేరుతో.

భావము:

తరువాత కొంత కాలమునకు ధీమంతుడైన కుశనాభునకు గొప్ప ధార్మికుడైన గాధియను పుత్రుడు జన్మించెను.
*గమనిక:-  *- 1. రామాయణంలో 1.34.6.అనుష్టుప్ నందు గాధి కుశనాభుని కొడుకు అని చెప్పబడెను. 2. తెలుగుభాగవతం 9-422-వ. నందు గాధి, కుశనాభుని పుత్రుడు కుశాంబువునకు కలిగెనని చెప్పబడెను.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స పితా మమ కాకుత్స్థ!
 గాధిః పరమధార్మికః ।
కుశవంశప్రసూతోఽ స్మి
 కౌశికో రఘునందన! ॥

టీకా:

సః = అతడు; పితా = జనకుడు; మమ = నాయొక్క; కాకుత్స్థ = శ్రీరామచంద్ర; గాధిః = గాధి; పరమ = గొప్ప; ధార్మికః = ధార్మికుడైన; కుశ = కుశుని; వంశ = వంశములో; ప్రసూతః = జన్మించినవాడనై; అస్మి = అయ్యాను; కౌశికః = కౌశికుడు; రఘునందన = రఘునందన.

భావము:

రఘునందవంశోద్భవ! శ్రీరామచంద్ర! పరమ ధర్మమూర్తి అయిన ఆ గాధియే మా జనకుడు. కుశుని వంశములో జన్మించుటచే నాకు కౌశికుడను నామము వచ్చినది.

1-35-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూర్వజా భగినీ చాపి మమ రాఘవ! సువ్రతా|
నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా||

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సశరీరా గతా స్వర్గం
 భర్తారమనువర్తినీ ।
కౌశికీ పరమోదారా
 ప్రవృత్తా చ మహానదీ ॥

టీకా:

స = సహితంగా; శరీరా = శరీరముతో; గతా = వెళ్ళినది; స్వర్గమ్ = స్వర్గమును గూర్చి; భర్తారమ్ = భర్తను; అనువర్తినీ = అనుసరించినదై; కౌశికీ = కౌశికి అను; పరమ = మిక్కిలి; ఉదారా = విస్తారమైన; ప్రవృత్తా చ = ప్రవహించుచున్నది; మహానదీ = గొప్ప నదిగ.

భావము:

నా సోదరి భర్తను అనుసరించి (సహగమనము చేసి) తన శరీరముతో స్వర్గమునకు వెళ్ళినది. అంతేకాక ఆమె పవిత్రమైన కౌశికి మహానదిగా భూమిమీద ప్రవహించుచున్నది.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివ్యా పుణ్యోదకా రమ్యా
 హిమవంతముపాశ్రితా ।
లోకస్య హితకామార్థం
 ప్రవృత్తా భగినీ మమ ॥

టీకా:

దివ్యా = దివ్యమైన; పుణ్య = పుణ్యమునిచ్చు; ఉదకా = నీరు కలిగిన; రమ్యా = రమ్యమయిన; హిమవంతమ్ = హిమవత్ పర్వతమును; ఉపాశ్రితా = ఆశ్రయించినది; లోకస్య = లోకమునకు; హిత = హితమొనర్చుటకు; కామ = కోరికలు; అర్థమ్ = తీర్చుటకొరకు; ప్రవృత్తా = ప్రవహించుచున్నది; భగినీ = సోదరి; మమ = నాయొక్క.

భావము:

కౌశికి నది దివ్యమైనది, రమ్యమయినది మరియు పుణ్యప్రదమైన నీరు కలిగినది. లోకమునకు హితమొనర్చుటకు, కోరికలు తీర్చుటకొరకు హిమవత్పర్వముపై ప్రవహించుచున్నది.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతోఽహం హిమవత్పార్శ్వే
 వసామి నిరతః సుఖమ్ ।
భగిన్యాం స్నేహసంయుక్తః
 కౌశిక్యాం రఘునందన! ॥

టీకా:

తతః = అందువలన; అహం = నేను; హిమవత్ = హిమాలయ; పార్శ్వే = సమీపమునందు; వసామి = నివసించుచున్నాను; నిరతః = ఆసక్తితో; సుఖమ్ = సుఖముగా; భగిన్యాం = సోదరిపై; స్నేహసంయుక్తః = స్నేహముతో కూడిన; కౌశిక్యాం = కౌశికీ నదియందు; రఘునందన = శ్రీరామచంద్ర;

భావము:

ఓ రఘునందన! అందుచేత, నా సోదరియగు కౌశికిపై స్నేహముచే నేను హిమాలయ ప్రాంతమునందు సుఖముగా నివసించుచున్నాను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సా తు సత్యవతీ పుణ్యా
 సత్యే ధర్మే ప్రతిష్ఠితా ।
పతివ్రతా మహాభాగా
 కౌశికీ సరితాం వరా ॥

టీకా:

సా = ఆమె; తు; సత్యవతీ = సత్యవతి; పుణ్యా = పునీతురాలు; సత్యే = సత్య్తమునందు; ధర్మే = ధర్మమునందు; ప్రతిష్ఠితా = స్థిరముగానున్నది; పతివ్రతా = పతివ్రత; మహాభాగా = మహాత్మురాలు; కౌశికీ = కౌశికి; సరితాం = నదులలో; వరా = శ్రేష్ఠమైనది.

భావము:

ఆ ఋచీక పత్ని సత్యవతి పునీతురాలు, సత్యమునందు మరియు ధర్మమునందు స్థిరముగా ఉన్నది, పతివ్రత, మాహాత్మురాలు తాను నదులలో శ్రేష్ఠమైన ఆ కౌశికీ నదియై ఉన్నది..

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అహం హి నియమాద్రామ
 హిత్వా తాం సముపాగతః ।
సిద్ధాశ్రమమనుప్రాప్య
 సిద్ధోఽ స్మి తవ తేజసా ॥

టీకా:

అహం = నేను; హి; నియమాత్ = యాగనియమముచే; రామ = శ్రీరామచంద్ర; హిత్వా = విడిచి; తాం = ఆమెను; సముపాగతః = వచ్చితిని; సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమును; అనుప్రాప్య = పొంది, చేరి; సిద్ధః = కార్యముసిద్ధమైన వాడను; అస్మి = అయితిని; తవ = నీయొక్క; తేజసా = తేజస్సుచే.

భావము:

రామచంద్ర! నేనైతే యాగనియమాలు కోసం ఆమెను విడిచి వచ్చితిని. నీ పరాక్రమమువలన సిద్ధాశ్రమము చేరగలిగాను.కృతకృత్యుడను అయితిని.

1-35-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏషా రామ! మమోత్పత్తిస్స్వస్య వంశస్య కీర్తితా|
దేశస్య చ మహాబాహో! యన్మాం త్వం పరిపృచ్ఛసి||

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గతోఽ ర్దరాత్రః కాకుత్స్థ!
 కథాః కథయతో మమ ।
నిద్రామభ్యేహి భద్రం తే
 మా భూద్విఘ్నోఽ ధ్వనీహ నః ॥

టీకా:

గతః = గడిచినది; అర్ధరాత్రః = అర్ధరాత్రి; కాకుత్స్థ = శ్రీరామచంద్ర; కథాః = కథల; కథయతః = ప్రసంగముచే; మమ = నాయొక్క; నిద్రామ్ = నిద్రను; అభ్యేహి = పొందుము; భద్రం = క్షేమమగు గాక; తే = నీకు; మా = లేక; భూత్ = ఉండుగాక; విఘ్నః = విఘ్నములు; అధ్వని = మార్గము; ఇహ = ఇక్కడ; నః = మనకు.

భావము:

శ్రీరామచంద్ర! నా కథాప్రసంగముచే సగమురాత్రి గడచిపోయినది. నీవు ఇంక నిద్రకు ఉపక్రమించుము. నీకు శుభమగుగాక, ఈ మార్గమందు విఘ్నములేవి కలుగకుండుగాక.

1-35-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిష్పన్దాస్తరవస్సర్వే నిలీనమృగపక్షిణః|
నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునన్దన||

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శనైర్వియుజ్యతే సంధ్యా
 నభో నేత్రైరివావృతమ్ ।
నక్షత్రతారాగహనం
 జ్యోతిర్భిరవభాసతే ॥

టీకా:

శనైః = నెమ్మదిగా; వియుజ్యతే = గతించినది; సంధ్యా = సంధ్యాసమయము; నభః = ఆకాశము; నేత్రైః = నేత్రములచే; ఆవావృతమ్ = కప్పబడినది; నక్షత్ర = నక్షత్రములు; తారాః = తారలతో; గహనమ్ = దట్టముగా నిండినదై; జ్యోతిర్భిః = జ్యోతిర్మయము లైన; అవభాసతే = ప్రకాశించుచున్నది.

భావము:

సంధ్యాసమయము నెమ్మదిగా గతించినది. అశ్విని మొదలగు నక్షక్రములు, తారలు తోడను దట్టముగా నిండిన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండినట్లు ప్రకాశించుచున్నది.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉత్తిష్ఠతి చ శీతాంశుః
 శశీ లోకతమోనుదః ।
హ్లాదయన్ ప్రాణినాం లోకే
 మనాంసి ప్రభయా విభో ॥

టీకా:

ఉత్తిష్ఠతి = పైకి వచ్చుచున్నాడు; చ; శీతాః = చల్లని; అంశుః = కిరణములు గల; శశీ = చంద్రుడు; లోకః = లోకములో; తమః = చీకటిను; అనుదః = పాఱద్రోలుచు; హ్లాదయన్ = ఆహ్లాదపఱుచుచు; ప్రాణినాం = పాణుల; లోకే = లోకము లోని; మనాంసి = మనస్సులను; ప్రభయా = కాంతులతో; విభో = విభుడవైన శ్రీరామచంద్ర.

భావము:

శ్రీరామచంద్ర! చల్లని కిరణములు గల చంద్రుడు లోకమందలి చీకట్లను పాఱద్రోలుచు, తన కాంతిచే సకల ప్రాణుల మనస్సు లను ఆహ్లాదపఱుచుచు ఉదయించుచున్నాడు.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నైశాని సర్వభూతాని
 ప్రచరంతి తతస్తతః ।
యక్షరాక్షససంఘాశ్చ
 రౌద్రాశ్చ పిశితాశనాః”॥

టీకా:

నైశాని = రాత్రి సంచరించు; సర్వ = సకల; భూతాని = ప్రాణులు; ప్రచరంతి = తిరుగుచున్నవి; తతః+తతః = అక్కడక్కడ; యక్షః = యక్షులు; రాక్షసః = రాక్షసులు; సంఘాః = సమూహములు; చ; రౌద్రాః = భీకరమైన; చ; పిశితాశనాః = నరమాంస భక్షకులు.

భావము:

నిశాచర ప్రాణులు, యక్షులు, రాక్షసులు భీకరమైన నరమాంస భక్షకులు అక్కడక్కడ తిరుగుచున్నారు.”

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవముక్త్వా మహాతేజా!
 విరరామ మహామునిః ।
సాధు సాధ్వితి తం సర్వే
 ఋషయో హ్యభ్యపూజయన్ ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; ఉక్త్వా = పలికి; మహా = గొప్ప; తేజాః = తేజస్సు కలిగిన; విరరామ = విరమించెను; మహా = గొప్ప; మునిః = ముని; సాధు+సాధు = బాగు బాగు; ఇతి = అని; తం = ఆయనను; సర్వే = అందరు; ఋషయః = ఋషులు; అభ్యపూజయన్ = ప్రస్తుతించిరి.

భావము:

మహాతేజశ్శాలియైన విశ్వామిత్రుడు ఇట్లు పలికి విరమించెను. ఋషులందరు “బాగుబాగు” యని ఆయనను ఇటుల ప్రస్తుతించిరి.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“కుశికానామయం వంశో
 మహాన్ ధర్మపరః సదా ।
బ్రహ్మోపమా మహాత్మానః
 కుశవంశ్యా నరోత్తమాః ॥

టీకా:

కుశికాః = కుశిక; నామః = పెరుగల; అయం = ఈ; వంశః = వంశము; మహాన్ = గొప్పది; ధర్మపరః = ధర్మపరులు; సదా = ఎల్లప్పుడు; బ్రహ్మః = బ్రహ్మదేవునితో; ఉపమాః = సరిపోలెడివారు; మహాత్మానః = మహాత్ములు; కుశవంశ్యాః = కుశుని వంశమునకు చెందిన వారు; నరోత్తమాః = మానవశ్రేష్ఠులు.

భావము:

ఈ కౌశిక వంశము చాలా గొప్పది. ఈ వంశమునకు చెందిన వారు సర్వదా ధర్మపరాయణులు. కుశవంశపు వారు మహాత్ములు, బ్రహ్మదేవ తుల్యులు, మానవులలో శ్రేష్ఠులు.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశేషేణ భవానేవ
 విశ్వామిత్రో మహాయశాః ।
కౌశికీ చ సరిచ్ఛ్రేష్ఠా
 కులోద్యోతకరీ తవ”॥

టీకా:

విశేషేణ = విశేషించి; భవాన్ = నీవును; ఏవ = నిజంగా; విశ్వామిత్రః = విశ్వామిత్ర; మహా = గొప్ప; యశాః = యశస్వి; కౌశికీ = కౌశికీ; చ; సరిత్ = నది; శ్రేష్ఠా = శ్రేష్ఠమైనది; కులః = వంశమును; ఉద్యోత = ప్రకాశించునట్లు; కరీ = చేయునది; తవ = నీయొక్క.

భావము:

విశ్వామిత్రా! మీ కుశవంశమునందు విశేషించి నీవు గొప్ప కీర్తివంతుడవు. మీ వంశమునకువన్నె తెచ్చిన కౌశికీనది నదులలోకెల్ల శ్రేష్ఠమైనది.”
*గమనిక:-  *- సరిత్ + శ్రేష్ఠా = సరిత్+ ఛ్రేష్ఠా (ఛత్వ సంధి), సరిత్+ ఛ్రేష్ఠా = సరిచ్ఛ్రేష్ఠా (శ్చుత్వ సంధి) లేక సరితామ్ = నదులలో శ్రేష్ఠ అని చెప్పుకోవచ్చును `

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి తైర్మునిశార్దూలైః
 ప్రశస్తః కుశికాత్మజః ।
నిద్రాముపాగమచ్ఛ్రీమాన్
 అస్తంగత ఇవాంశుమాన్ ॥

టీకా:

ఇతి = ఈ విధముగా; తైః = ఆ; మునిశార్దూలైః = ముని శ్రేష్ఠుల చేత; ప్రశస్తః = ప్రస్తుతించబడిన; కుశికాత్మజః = విశ్వామిత్రుడు; నిద్రామ్ = నిద్రకు; ఉపాగమత్ = ఉపక్రమించెను; శ్రీమాన్ = తేజస్సు కలిగిన; అస్తంగత = అస్తమించిన; ఇవ = వలె; అంశుమాన్ = సూర్యుని.

భావము:

ఈ విధముగా మునిశ్రేష్ఠులు ప్రస్తుతించిన పిమ్మట, విశ్వామిత్ర మహర్షి అస్తమించిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమించెను.
*గమనిక:-  *- కుశికాత్మ- కుశిక (కుశుని వంశమున) ఆత్మః- జన్మించిన వాడు, విశ్వామిత్రుడు

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామోఽ పి సహసౌమిత్రిః
 కించిదాగతవిస్మయః ।
ప్రశస్య మునిశార్దూలం
 నిద్రాం సముపసేవతే ॥

టీకా:

రామః = శ్రీరామచంద్రుడు; అపి = కూడ {రామః+అపి = రామాపి}; సహ = సహితుడు అయిన; సౌమిత్రిః = లక్ష్మణుడు {సౌమిత్రి- సుమిత్రాదేవి పుత్రుడు, లక్ష్మణుడు}; కిఞ్చిత్ = కొంచెము; ఆగత = పొందబడిన; విస్మయః = ఆశ్చర్యము కలవాడై; ప్రశస్య = ప్రశంసించి; మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని; నిద్రాం = నిద్రను; సముపసేవతే = సేవించెను.

భావము:

లక్ష్మణ సమేతుడగు శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రమహర్షి చెప్పిన కథకు కొంచెము ఆశ్చర్యపడి ఆ మునిశ్రేష్ఠుడిని ప్రశంసించి నిద్రించెను.

1-24-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 చతుర్త్రింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్త్రింశః [33] = ముప్పైనాలుగవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [34] ముప్పైనాలుగవ సర్గ సుసంపూర్ణము