వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥అష్టావింశః సర్గః॥ [28 అస్త్రాల ఉపసంహారాలు ఉపదేశం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతిగృహ్య తతోఽ స్త్రాణి
 ప్రహృష్టవదనః శుచిః ।
గచ్ఛన్నేవ చ కాకుత్స్థో
 విశ్వామిత్రమథాబ్రవీత్ ॥

టీకా:

కాకుత్స్థః = రాముడు; శుచిః = పవిత్రుడై; అస్త్రాణి = అస్త్రములను; ప్రతిగృహ్య = స్వీకరించి; తతః = పిమ్మట; ప్రహృష్ట = సంతోషంతో వికసించిన; వదన = ముఖము కలవాడై; గచ్ఛన్ = నడచివెళ్ళుచు; ఏవ = ఉండి; అథ = ఇంకా; విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునితో; అబ్రవీత్ = పలికెను.

భావము:

రాముడు శుచిగా అస్త్రములను స్వీకరించి సంతోషముతో వికసించిన ముఖముగలవాడై నడచివెళ్తూ; విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“గృహీతాస్త్రోఽ స్మి భగవన్!
 దురాధర్షః సురాసురైః ।
అస్త్రాణాం త్వహమిచ్ఛామి
 సంహారం మునిపుంగవ!" ॥

టీకా:

భగవాన్ = పూజ్యనీయుడా! గృహీత = స్వీకరించిన; అస్త్రః = అస్త్రములు కల నేను; సురైః = దేవతలకు; అపి = ఐనా; దురాధర్షః = ఎదిరింపశక్యము కానివాడనై; అస్మి = ఉన్నాను; మునిపుంగవ = మునివరా; అహమ్ = నేను; అస్త్రాణామ్ = అస్త్రములను; సంహారమ్ తు = ఉపసంహరించుటను కూడా; ఇచ్ఛామి = తెలుసుకొనగోరుచున్నాను.

భావము:

దేవా! అస్త్రములను స్వీకరించిన నేనిపుడు దేవతలకైనా ఎదిరింపశక్యము కానివాడనై ఉన్నాను. మునివర్యా! నేను ఆ అస్త్రములను ఉపసంహరించు విధానమును కూడా తెలిసికొనగోరుచున్నాను. ఉపదేశింపుము."

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం బ్రువతి కాకుత్స్థే
 విశ్వామిత్రో మహాయశాః ।
సంహారం వ్యాజహారాథ
 ధృతిమాన్ సువ్రతః శుచిః ॥

టీకా:

కాకుత్స్థే = రాముడు; ఏవం = ఈ విధముగా; బ్రువతి = పలుకగా; విశ్వామిత్రః = విశ్వామిత్రుడను; మహామునిః = మహర్షి; సంహారమ్ = ఉపసంహరించుట; అథ = పిమ్మట; ధృతిమాన్ = ధైర్యవంతుడు; సువ్రతః = మంచివ్రతము పూనినవాడు; శుచిః = పవిత్రుడు రామునికి; వ్యాజహార = చెప్పెను.

భావము:

రాముని పలుకులు వినిన పిమ్మట విశ్వామిత్రమహర్షి అస్త్రముల ఉపసంహారమును కూడా ధైర్యవంతుడు; సువ్రతుడు; పవిత్రుడు అయిన రామునికి ఉపదేశించెను.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సత్యవంతం సత్యకీర్తిం
 ధృష్టం రభసమేవ చ ।
ప్రతిహారతరం నామ
 పరాంముఖమవాంముఖమ్ ॥

టీకా:

సత్యవంతమ్ = సత్యవంతమును; సత్యకీర్తిమ్ = సత్యకీర్తిని; ధృష్టమ్ = ధృష్టమును; రభసమ్ = రభసమును; ఏవ = ఇంకా; చ; ప్రతిహారతరమ్ = ప్రతిహారతరమును; పరాజ్ముఖమ్ = పరాన్ముఖమును; అవాజ్ముఖమ్ = అవాన్ముఖమును.

భావము:

సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాన్ముఖము, అవాన్ముఖము.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లక్షాక్షవిషమౌ చైవ
 దృఢనాభసునాభకౌ ।
దశాక్షశతవక్త్రౌ చ
 దశశీర్షశతోదరౌ ॥

టీకా:

లక్షాక్షః = లక్షాక్షమును; విషమౌ = విషమమును; చ; ఇవ = అనునది; దృఢనాభ = దృఢనాభమును; సునాభకౌ = సునాభమును; దశాక్ష = దశాక్షమును; శతవక్త్రౌచ = శతవక్త్రమును; చ; దశశీర్ష = దశశీర్షమును; శతోదరౌ = శతోదరమును

భావము:

లక్షాక్షము, విషమము, దృఢవాభము, సునాభము అను రెండు; దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శలోదరము అను రెండు.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పద్మనాభమహానాభౌ
 దుందునాభసునాభకౌ ।
జ్యోతిషం కృశనం చైవ
 నైరాశ్యవిమలావుభౌ ॥

టీకా:

పద్మనాభ = పద్మనాభమును; మహానాభౌ = మహానాభమును; దుందునాభ = దుందునాభమును; సునాభకౌ = సునాభము రెండును; జ్యోతిషం = జ్యోతిషమును; కృశనం = కృశనమును; చైవ = ఇంకను; నైరాశ్య = నైరాశ్యము; విమలా = విమలము అనే; నైఉభౌ = జంటలను.

భావము:

పద్మనాభము, మహానాభము అను జంటను, దుందునాభము, సునాభము అను జంటను, జ్యోతిషము, కృశనము, నైరాశ్యము, విమలము అను జంటను,

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోగంధరహరిద్రౌ చ
 దైత్యప్రశమనౌ తథా ।
సార్చిర్మాలీ ధృతిర్మాలీ
 వృత్తిమాన్ రుచిరస్తథా ॥

టీకా:

యోగంధర = యోగంధరమును; హరిద్రౌ = హరిద్రమను జతను; చ; దైత్య = దైత్యమును; ప్రశమనౌ = ప్రశమనముల జతను; సార్చిర్మాలీ = సార్చిర్మాలిని; ధృతిర్మాలీ = ధృతిర్మాలిని; వృత్తిమాన్ = వృత్తిమంతమును; తథా = మఱియు; రుచిరః = రుచిరము అనుదానిని; తథా = ఇంకను.

భావము:

యోగంధర, హరిద్ర యుగళమును, దైత్య, ప్రశమన యుగళమును, సార్చిర్మాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము,

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పితృసౌమనసం చైవ
 విధూతమకరావుభౌ ।
కరవీరకరం చైవ
 ధనధాన్యౌ చ రాఘవ! ॥

టీకా:

పితృసౌమనసం = పితృసౌమనసమును; చైవ; విధూతమకరా = విధూతమకరములను; ఉభౌ = రెండింటిని; కరవీరకరం = కరవీరకరమును; చైవ; ధనృ = ధనము; ధాన్యౌ = ధాన్యములను రెంటిని; చ రాఘవ = రామా.

భావము:

రామా! పితృసౌమనము, విధూత మకరములు రెండు, కరవీరకరము, ధన ధాన్యములు రెండు,

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కామరూపం కామరుచిం
 మోహమావరణం తథా ।
జృమ్భకం సర్వనాభం చ
 సంతానవరణౌ తథా ॥

టీకా:

కామరూపం = కామరూపము; కామరుచిం = కామరుచులను; మోహమ్ = మోహమును; ఆవరణం = ఆవరణమును; తథా = మరియు; జృమ్భకం = జృంభకమును; సర్వనాభం = సర్వనాభమును; చ; తథా = మరియు; సంతాన = సంతానము; వరణౌ = వరణములను రెంటిని; తథా = మరియు

భావము:

కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతాన వరణములు రెండును అను ఉపసంహారక విద్యలను గ్రహింపుము.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భృశాశ్వతనయాన్ రామ!
 భాస్వరాన్కామరూపిణః ।
ప్రతీచ్ఛ మమ భద్రం తే
 పాత్రభూతోఽ సి రాఘవ! ॥

టీకా:

భృశాశ్వ = భృశాశ్వునిచే; తనయాన్ = సృజించబడిన అస్త్రములను; రామ = రామా; భాస్వరాన్ = ప్రకాశవంతమైన వానిని; కామరూపిణః = కామరూపము గలవానిని; ప్రతీచ్ఛ = గ్రహింపుము; మమ = నా నుండి; భద్రమ్ = క్షేమమగు గాక; తే = నీకు; పాత్రభూత = యోగ్యత కలవాడవు; అసి = ఐన; రాఘవ = రామా.

భావము:

భృశాశ్వునిచే సృజింపబడినవి, ప్రకాశవంతమైనవి, కామరూపము కలవియునగు అస్త్రములను అర్హత కల రామా గ్రహింపుము. నీకు భద్రమగు గాక!

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“బాఢమిత్యేవ” కాకుత్స్థః
 ప్రహృష్టేనాంతరాత్మనా ।
దివ్యభాస్వరదేహాశ్చ
 మూర్తిమంతస్సుఖప్రదాః ॥

టీకా:

బాఢమ్ = తప్పక; ఇత్యేవ = అని పలికి (అస్త్రములను స్వీకరించెను); కాకుత్స్థః = కాకుత్స్థ వంశపు రాముడు; ప్రహృష్టేన = సంతసించిన; అంతరాత్మనా = అంతరంగముతో; దివ్య = దివ్యమైన; భాస్వర = తేజస్సుతో కూడిన; దేహాః = దేహములు కలవారు; చ; మూర్తిమంతః = రూపములు ధరించినవారు; సుఖప్రదాః = సౌఖ్యమును కలిగించువారు; ఆహ్లాదకరులు;

భావము:

సంతసించిన అంతరంగముతో రాముడు ‘ తప్పక ‘ అని పలికి అస్త్రములను స్వీకరించెను. అంత దివ్యతేజస్సుతో ఆహ్లాదకరమైన చక్కని విగ్రహస్వరూపులు

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కేచిదంగారసదృశాః
 కేచిద్ధూమోపమాస్తథా ।
చంద్రార్కసదృశాః కేచిత్
 ప్రహ్వాంజలిపుటాస్తథా ॥

టీకా:

కేచిత్ = కొందఱు; అంగార = నిప్పుకణికలను; సదృశాః = పోలిన వారు; కేచిత్ = కొందఱు; ధూమః = పొగ; ఉపమాః = వలె ఉన్నవారు; తథా = ఇంక; కేచిత్ = కొందఱు; చంద్ర = చంద్రుడితోను; అర్క = సూర్యుడి తోను; సదృశాః = సమానులును; ప్రహ్వాంజలి పుటాః = ముకుళించిన దోసిళ్ళతో.

భావము:

కొందఱు నిప్పుకణికలంత తీక్ష్ణణులు, కొందఱు ధూమరూపు లు, కొందఱు సూర్యచంద్రులతో సమానతేజస్కులు ముకిళించిన దోసిళ్ళతో వచ్చి,

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రామం ప్రాంజలయో భూత్వాఽ -
 బ్రువన్ మధురభాషిణః ।
“ఇమే స్మ నరశార్దూల
 శాధి కిం కరవామ తే” ॥

టీకా:

రామమ్ = రామునికి; ప్రాంజలయః భూత్వా = దోసిళ్ళు కట్టి నమస్కరిస్తూ; మధుర = మధురమైన; భాషిణః = మాటలను; అబ్రువన్ = పలికిరి. ఇమే = ఇదిగో ఇచట; స్మ = ఉన్నాము; నరశార్దూల = పురుషోత్తమ; శాధి = ఆజ్ఞాపింపుము; కిమ్ = ఏమి; కరవామ = చేయుదము; తే = నీకు.

భావము:

రామునికి దోసిళ్ళొగ్గి వినయ పూర్వక మధుర వాక్కులతో రాముడితో ఇట్లు పలికిరి “పురుషోత్తమా! మేమిచట ఉన్నాము. నీ కేమి చేయగలమో? ఆజ్ఞాపింపుము.”

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానసా కార్యకాలేషు
 సాహాయ్యం మే కరిష్యథ ।
గమ్యతామితి తానాహ
 యథేష్టం రఘునందనః!" ॥

టీకా:

మనసా = నా మనస్సులో నిలిచి; కార్య = కార్యములు; కాలేషు = చేయవలసిన సమయాలలో; మే = నాకు; సాహాయ్యమ్ = సహాయమును; కరిష్యథ = చేయగలరు; గమ్యమ్ = వెళ్ళుడు; తః = మీరు; ఇతి = అని; యథేష్ఠమ్ = ఇచ్చవచ్చినట్లు; తాన్ = వారికి; ఆహ = పలికెను; రఘునందనః = రఘురాముడు.

భావము:

“మీరు నా స్మృతిపథమున మెదలుచుండుడు. నాకు కావలసిన పనిపడినప్పుడు వచ్చి సాహాయ్యము చేయుడు. ఇపుడు మీరు ఇచ్చవచ్చినచోటికి వెళ్ళుడు.” అని రాముడు ఆ అస్త్రదేవతలతో పలికెను.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ తే రామమామంత్ర్య
 కృత్వా చాపి ప్రదక్షిణమ్ ।
“ఏవమస్త్వితి కాకుత్స్థమ్!”
 ఉక్త్వా జగ్ముర్యథాగతమ్ ॥

టీకా:

అథ = పిమ్మట; తే = ఆ దేవతలు; రామమ్ = రాముని; అమంత్ర్య = సెలవు పుచ్చుకొని; కృత్వా = చేసి; చ; అపి = కూడ; ప్రదక్షిణమ్ = ప్రదక్షిణ నమస్కారము; ఏవమ్ = అటులనే; అస్తు = అగుగాక; ఇతి = అని; కాకుత్స్థమ్ = రామునితో; ఉక్త్వా = పలికి; జగ్ముః = వెళ్ళిరి; యథాగతమ్ = వచ్చిన దారిలో.

భావము:

అప్పుడా దేవతలు “అటులనే చేసెదము” అని పలికి రామునికి ప్రదక్షిణ నమస్కారము చేసి, అతని వద్ద సెలవుతీసుకొని, వచ్చిన దారిని వెళ్ళిరి.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స చ తాన్ రాఘవో జ్ఞాత్వా
 విశ్వామిత్రం మహామునిమ్ ।
గచ్ఛన్నేవాథ మధురం
 శ్లక్ష్ణం వచనమబ్రవీత్ ॥

టీకా:

సః = ఆ; చ; రాఘవః = రాముడు; తాన్ = ఆ ఉపసంహార మంత్రములను; జ్ఞాత్వా = తెలిసికొని; విశ్వామిత్రమ్ = విశ్వామిత్ర; మహామునిమ్ = మహర్షితో; గచ్ఛాన్నేన = నడచుచునే; అథ = పిమ్మట; మధురమ్ = తీయని; శ్లక్ష్ణమ్ = మృదువైన; వచనమ్ = పలుకును; అబ్రవీత్ = అడిగెను.

భావము:

ఉపసంహరమంత్రములను గ్రహించిన పిమ్మట రాముడు; విశ్వామిత్రులవారి కూడా వెళ్తూ తీయని మృధుమధురమైన పలుకులతో ఇలా అడిగాడు.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“కిం న్వేతన్మేఘసంకాశం
 పర్వతస్యావిదూరతః? ।
వృక్షషండమితో భాతి
 పరం కౌతూహలం హి మే ॥

టీకా:

కిం = ఏమిటి; ఏతత్ = ఇది; మేఘ = మేఘములను; సంకాశం = పోలే; పర్వత = పర్వతముల; అస్య = కు; అవిదూరతః = దగ్గఱలో; వృక్ష = చెట్ల; షండమ్ = గుంపు; ఇతః = ఇటుప్రక్క; భాతి = ప్రకాశించుచున్నది; పరమ్ = మిక్కిలి; కౌతూహలమ్ హి = తెలుసుకోవాలని ఉన్నది; మే = నాకు.

భావము:

“ఏమిటివి ఇక్కడ ఈ పర్వతాల సమీపంలో మేఘాలను పోలి ఉన్నాయి. చెట్ల గుంపులు వలె ఉన్నాయి. ఇవి ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దర్శనీయం మృగాకీర్ణం
 మనోహరమతీవ చ ।
నానా ప్రకారైః శకునైః
 వల్గునాదైరలంకృతమ్ ॥

టీకా:

దర్శనీయమ్ = (ఈ వృక్షసముదాయము) చూచుటకు ఆకర్షణీయము; మృగః = మృగములతో; ఆకీర్ణమ్ = నిండి ఉన్నది; అతీవ = మిక్కిలి; మనోహరమ్ = అందముగా ఉన్నది; వల్గు = మధురమైన; నాదైః = ధ్వనులు; నానాప్రకారైః = అనేక రకముల; శకునైః = పక్షులతో; అలంకృతమ్ = అలంకరించబడింది.

భావము:

ఈ వృక్షసముదాయము చూడచక్కగా ఉన్నది. ఎంతో అందముగా ఉన్నది; అనేక జంతువులతో నిండి ఉన్నది. మధురనాదములు ఆలపించు పలురకముల పక్షులతో అలరారుతున్నది.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిస్సృతాః స్మ మునిశ్రేష్ఠ!
 కాంతారాద్రోమహర్షణాత్ ।
అనయా త్వవగచ్ఛామి
 దేశస్య సుఖవత్తయా ॥

టీకా:

నిస్పృతాః = స్థిమితపడ్డామని; స్మ = తలచెదను; మునిశ్రేష్ఠ = మునివర్యా; కాంతారాత్ = అడవినుండి; రోమహర్షణాత్ = గగుర్పాటు కొలిపేది; అనయాత్ = తీసురాబడి; అవగచ్ఛామి = వచ్చామని; దేశస్య = ప్రదేశము; సుఖవత్తయా = సుఖవంతమైనది.

భావము:

విశ్వామిత్ర మునిశ్రేష్ఠా! గగుర్పాటు కొలిపే భయంకరమైన అడవి నుండి బయటకు తీసుకురాబడి సుఖవంతమైన ప్రదేశమునకు వచ్చామని అనుకొనుచున్నాను.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సర్వం మే శంస భగవన్!
 కస్యాశ్రమపదం త్విదమ్ ।
సంప్రాప్తా యత్ర తే పాపా
 బ్రహ్మఘ్నా దుష్టచారిణః ॥

టీకా:

సర్వం = అంతయును; మే = నాకు; శంస = చెప్పుము; భగవన్ = పూజ్యనీయుడా; కస్య = ఎవరి; ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానము; ఇతి = ఈ; విదమ్ = విధముగా; సంప్రాప్తాః = వచ్చినారు; యత్ర = ఎచటినుండి; తే = ఆ; పాపాః = పాపులు; బ్రహ్మాఘ్నాః = బ్రహ్మహత్య చేయువారు; దుష్టచారిణః = దుర్మార్గులు

భావము:

అనఘా! విశ్వామిత్రా! ఇది ఎవరి ఆశ్రమప్రదేశము ? నాకంతయు ఎఱిగింపుము. ఆ పాపులు బ్రహ్మహత్యాపాతకులు, దుర్మార్గులు ఎచటనుంచి వచ్చారు ?

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తవ యజ్ఞస్య విఘ్నాయ
 దురాత్మానో మహామతే! ।
భగవంస్తస్య కో దేశః
 సా యత్ర తవ యాజ్ఞికీ ॥

టీకా:

తవ = మీ యొక్క; యజ్ఞ = యజ్ఞమును; అస్య = యొక్క; విఘ్నాయ = ఆటంకపఱచుటకు; ఎచట నుంచి వచ్చారు; దురాత్మానః = దుష్టచింతనలు కలవారు; మహామతే = మహానుభావ; భగవాన్ = పూజ్యనీయుడా; తః = ఆ; అస్య = యొక్క; కః = ఏది; దేశః = ప్రదేశము; సః = అది; యత్ర = ఎక్కడ: తవ = మీ యొక్క యాజ్ఞికీ = యజ్ఞవేదిక;

భావము:

మహర్షీ! నీ యాగమును భగ్నపఱచుటకు ఆ దుష్టస్వభావులు ఎచట నుంచి వచ్చారు? నీ యజ్ఞప్రదేశము ఎచ్చట ఉన్నది?

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రక్షితవ్యా క్రియా బ్రహ్మన్!
 మమ వధ్యాశ్చ రాక్షసా ।
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ!
 శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో" ॥

టీకా:

రక్షితవ్యా = రక్షింపదగియున్న; క్రియా = పని; బ్రహ్మన్ = బ్రహ్మర్షీ; మమ = నా చేత; వధ్యాః = చంపదగియున్న; చ; రాక్షసా = రాక్షసులను; ఏతత్ = ఇది; సర్వం = అంతయు; మునిశ్రేష్ఠః = మునివర్యా; శ్రోతుమ్ = వినుటకు; ఇచ్ఛామి = కోరుచుంటిని; (తస్య దేశః కః = ఆ ప్రదేశము ఎచ్చట); అహం = నేను; ప్రభో = ప్రభువా.

భావము:

బ్రహ్మర్షీ! నేను రక్షింపవలసిన యజ్ఞవాటిక; రక్కసులను వధింపవలసిన స్థలము ఎచ్చట ? మునిశ్రేష్ఠా! నేను ఇది అంతయు వినగోరెదను”

1-23-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 అష్టావింశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; అష్టవింశ [28] = ఇరవై ఎనిమిదవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [28] ఇరవై ఎనిమిదవ సర్గ సుసంపూర్ణము