బాలకాండమ్ : ॥ద్వావింశః సర్గః॥ [22 బల అతిబల విద్యలు ఇచ్చుట]
- ఉపకరణాలు:
తథా వసిష్ఠే బ్రువతి
రాజా దశరథః స్వయమ్ ।
ప్రహృష్టవదనో రామం
ఆజుహావ సలక్ష్మణమ్ ॥
టీకా:
తథా = ఆ విధముగా; వసిష్ఠే = వసిష్ఠుడు; బ్రువతి = చెప్పగా; రాజా = రాజు; దశరథః = దశరథుడు; స్వయమ్ = స్వయముగా; ప్రహృష్ట = సంతోషముతో వికసించిన; వదనః = ముఖము కలవాడు; రామమ్ = రాముని; ఆజుహావ = పిలిపించెను; స = సహితంగా; లక్ష్మణమ్ = లక్ష్మణునితో.
భావము:
వసిష్ఠుడు అట్లు పలుకగా, దశరథ మహారాజు సంతోషముతో వికసించిన ముఖము కలవాడై, స్వయముగా తన పుత్రుడు రాముడిని లక్ష్మణ సమేతముగా పిలుచుకువచ్చెను.
- ఉపకరణాలు:
కృతస్వస్త్యయనం మాత్రా
పిత్రా దశరథేన చ ।
పురోధసా వసిష్ఠేన
మంగళైరభిమంత్రితమ్ ॥
టీకా:
కృత = చేసిన; స్వస్త్యయనం = స్వస్తివచనములు పలుకుట; మాత్రా = తల్లి చేత; పిత్రా = తండ్రియైన; దశరథేన చ = దశరథునిచేతను; పురోధసా = పురోహితుడైన; వసిష్ఠేన = వసిష్ఠుని చేత; మంగలైః = మంగళకరములగు మంత్రములుతో; అభిమంత్రితమ్ = అభిమంత్రించబడినవాడై.
భావము:
కౌసల్యా దశరథులు రామునకు స్వస్తివచనములు పలుకులు పలికిరి. పురోహితుడు వసిష్ఠుడు మంగళకరములైన మంత్రములతో రాముని అభిమంత్రించెను.
*గమనిక:-
*- స్వస్త్యనము- శుభము కలుగుటకై చేయు వేదవిహితమైన గ్రహయోగాది కర్మ, ఆశీర్వచనము, వ్యుత్పత్తి. స్వస్తి+ఆయనమ్ (లాభః) - అస్మాత్, బ.వ్రీ., ఆంద్రశబ్దరత్నాకరము
- ఉపకరణాలు:
స పుత్రం మూర్ధ్న్యుపాఘ్రాయ
రాజా దశరథః ప్రియమ్ ।
దదౌ కుశికపుత్రాయ
సుప్రీతేనాంతరాత్మనా ॥
టీకా:
స = ఆ; పుత్రం = పుత్రుని; మూర్ధ్ని = శిరస్సుపై; ఉపాఘ్రాయ = వాసన చూచి; రాజా = మహారాజు; దశరథః = దశరథుడు; ప్రియమ్ = ప్రేమతో; దదౌ = ఇచ్చెను; కుశికపుత్రాయ = కుశికపుత్రుడైన విశ్వమిత్రుని కొరకు; సుప్రీతేన = చాలా సంతోషించిన; ఆంతరాత్మనా = హృదయముతో.
భావము:
దశరథుడు తన పుత్రుడు రాముడిని ప్రేమతో శిరస్సుపై వాసన చూచి, చాలా సంతోషించిన హృదయముతో విశ్వమిత్రునకు ఇచ్చెను.
- ఉపకరణాలు:
తతో వాయుః సుఖస్పర్శో
నీరజస్కో వవౌ తదా ।
విశ్వామిత్రగతం రామం
దృష్ట్వా రాజీవలోచనమ్ ॥
టీకా:
తతః = పిమ్మట; వాయుః = గాలి; సుఖస్పర్శః = సుఖకరమైన స్పర్శగలదై; నీరజస్కః = పరాగములేనిదై; వవౌ = వీచెను; తదా = అప్పుడు; విశ్వామిత్రగతం = విశ్వామిత్రుని అనుసరించినవానినిగా; రామమ్ = రాముని; దృష్ట్వా = చూచి; రాజీవలోచనమ్ = పద్మములవంటి నేత్రములుగల.
భావము:
పద్మములవంటి నేత్రములు గల రాముడు విశ్వామిత్రుని అనుసరించి వెళ్ళుట కని గాలి పరాగములేక, సుఖమునిచ్చు స్పర్శగలదై వీచెను.
- ఉపకరణాలు:
పుష్పవృష్టిర్మహత్యాసీత్
దేవదుందుభి నిస్స్వనైః ।
శంఖదుందుభినిర్ఘోషః
ప్రయాతే తు మహాత్మని ॥
టీకా:
పుష్పవృష్టిః = పూలవానమ; మహతి = గొప్ప; ఆసీత్ = ఆయెను; దేవదుందుభి = దేవదుందుభుల; నిఃస్వనైః = ధ్వనులతో; శంఖః = శంఖములయొక్కయు; దుందుభిః = శంఖములయొక్కయు; నిర్ఘోషః = ధ్వానములతో; ప్రయాతే = బయలుదేరగనే; తు; మహాత్మని = మహాత్ముడైన విశ్వమిత్రుడు.
భావము:
మహాత్ముడైన విశ్వమిత్రుడు బయలుదేరిన వెంటనే గొప్ప పుష్పవృష్టి కురిసెను. దేవతలు దుందుభులు మ్రోగించిరి. దశరథుని ప్రాసాదములో శంఖదుందుభి ధ్వానములు మారుమ్రోగెను.
- ఉపకరణాలు:
విశ్వామిత్రో యయావగ్రే
తతో రామో మహాయశాః ।
కాకపక్షధరో ధన్వీ
తం చ సౌమిత్రిరన్వగాత్ ॥
టీకా:
విశ్వామిత్రః = విశ్వామిత్రుడు; యయౌ = నడచెను; ఆగ్రే = ముందు; తతః = అతని వెనుక; రామః = రాముడు; మహాయశః = గొప్ప కీర్తిమంతుడు; కాకపక్షధరః = జులపములను ధరించినవాడు, యువకుడు; ధన్వీ = ధనుస్సు గలవాడు; తమ్ = ఆతనిని; చ; సౌమిత్రిః = లక్ష్మణుడు; అన్వగాత్ = అనుసరించసాగెను.
భావము:
విశ్వమిత్రుడు ముందు నడచుచుండ, అతని వెనుక మహాకీర్తిమంతుడు, పిల్లజుట్టు నవయువకుడు, ధనుర్ధరుడును అగు రాముడు నడచుచుండ, ఆ రాముని లక్ష్మణుడు అనుసరించెను.
- ఉపకరణాలు:
కలాపినౌ ధనుష్పాణీ
శోభయానౌ దిశో దశ ।
విశ్వామిత్రం మహాత్మానం
త్రిశీర్షావివ పన్నగౌ ॥
టీకా:
కలాపినౌ = రెండు అంబులపొదులను ధరించినవారు; ధనుష్పాణీ = ధనుస్సులు హస్తములందు కలగి; శోభయానౌ = ప్రకాశింపచేయున్నవారు; దిశః = దిక్కులను; దశః = పది; విశ్వామిత్రం = విశ్వామిత్రుని; మహాత్మానమ్ = మహాత్ముని; త్రిశీర్షౌ = మూడు శిరస్సులు గల; ఇవ = వలె; పన్నగౌ = సర్పములు.
భావము:
రెండేసి అమ్ములపొదులను మూడు తలలు గల సర్పములవలె కలిగి, ధనుస్సును ధరించి పది దిక్కులను ప్రకాశింపజేయుచున్న రామలక్ష్మణులు మహాత్ముడైన విశ్వామిత్రుని వెంట..
- ఉపకరణాలు:
అనుజగ్మతు రక్షుద్రౌ
పితామహ మివాశ్వినౌ ।
తదా కుశికపుత్రం తు
ధనుష్పాణి స్వలంకృతౌ ॥
టీకా:
అనుజగ్మతుః = అనుసరించి వెళ్లిరి; అక్షుద్రౌ = అల్పులు కానివారు, మహనీయులు; పితామహామ్ = బ్రహ్మదేవుని; ఇవ = వలె; అశ్వినౌ = అశ్వినీ దేవతలు; తదా = అప్పుడు; కుశికపుత్రమ్ తు = విశ్వామిత్రుడిని; తు; ధనుష్పాణి = ధనుస్సులు హస్తములందు ధరించినవారు; స్వలంకృతౌ = స్వయంగా అలంకరించుకున్న వారు.
భావము:
విశ్వామిత్రుని వెంట, ధనుస్సులు ధరించి, స్వయముగా అలంకరించుకున్న మహనీయులైన ఆ రామలక్ష్మణులు, అశ్వినీదేవతలు బ్రహ్మదేవుని అనుసరించినట్లు, అనుసరించిరి.
- ఉపకరణాలు:
బద్ధగోధాంగుళి త్రాణౌ
ఖడ్గవంతౌ మహాద్యుతీ ।
కుమారౌ చారువపుషౌ
భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥
టీకా:
బద్ధ = కట్టబడిన; గోధః = ఉడుముతోలుతో చేసిన; అంగళి = వ్రేళ్ళ; త్రాణౌ = తొడుగుల కవచములు కలవారు; ఖడ్గవంతౌ = ఖడ్గములు కలవారు; మహా = గొప్ప; ద్యుతీ = కాంతిమంతులు; కుమారౌ = బాలురు; చారు = అందమైన; వపుషౌ = దేహములు కలవారు; భ్రాతరౌ = అన్నదమ్ములు; రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు.
భావము:
సోదరులైన రామలక్ష్మణులు ఉడుము తోలుతో చేసిన వేళ్ళతొడుగులు కవచములుగా (gloves) ధరించి, ఖడ్గములను పూని, మహాకాంతిమంతులై, అపురూప సుందరులై ఉండిరి.
- ఉపకరణాలు:
అనుయాతౌ శ్రియా దీప్తౌ
శోభయేతామనిందితౌ ।
స్థాణుం దేవమివాచింత్యమ్
కుమారావివ పావకీ ॥
టీకా:
అనుయాతౌ = అనుసరించి వెళ్లుచున్నవారై; శ్రియా = శోభతో; దీప్తౌ = ప్రకాశించుచున్నవారు; శోభయేతామ్ = ప్రకాశింప చేసిరి; అనిందితౌ = దోషములు లేనివారు; స్థాణుం = ఈశ్వరుని; దేవమ్ = దేవుని; ఇవ = దేవుని; అచింత్యమ్ = ఊహింపరాని; కుమారౌ = స్కంద, విశాఖులు; ఇవ = వలె; పావకీ = అగ్నివలన జన్మించిన.
భావము:
అగ్నినుండి జన్మించిన స్కంద, విశాఖులు అచింత్య ప్రభావుడైన ఈశ్వరుని ప్రకాశింపచేసినట్లు, నిష్కళంకులైన రామలక్ష్మణులు శోభతో ప్రకాశించుచు విశ్వామిత్రుని అనుసరించి పోవుచు ప్రకాశింపచేసిరి.
*గమనిక:-
*- శ్లో. “తతోఽభవచ్ఛతుర్మూర్తిః, క్షణేన భగవాన్ ప్రభు। స్కంధో విశాఖశ్చ శాకశ్చ, నైగమేషశ్చ పృష్ఠతః॥“, అంత భగవంతుడగు కుమారస్వామి స్కంధుడు, విశాఖుడు, శాకుడు, నైగమేషుడు అను నాలుగు రూపములు ధరించెను. అని భారతములో చెప్పబడెను. అందలి స్కంధుడు, విశాఖులను కుమారౌ అని చెప్పబడెనని గోవిందరాజులు వారి వ్యాఖ్యానము.
- ఉపకరణాలు:
అధ్యర్దయోజనం గత్వా
సరయ్వా దక్షిణే తటే ।
రామేతి మధురాం వాణీమ్
విశ్వామిత్రోఽ భ్యభాషత ॥
టీకా:
అధ్యర్ద = ఒకటిన్నర; యోజనం = యోజనముల దూరము; గత్వా = వెళ్లి; సరయ్వా = సరయూనదియొక్క; దక్షిణే = దక్షిణ; తటే = తీరమునందు; రామ = ఓ రాముడా; ఇతి = అని; మధురాం = మధురమైన; వాణీమ్ = వాక్కును; విశ్వమిత్రః = విశ్వమిత్రుడు; అభ్యభాషత = పలికెను.
భావము:
ఒకటిన్నర యోజనముల దూరము నడచి సరయూనది దక్షిణతీరము చేరిన పిదప విశ్వమిత్రుడు “ఓ రామా!” అని సుమధురముగా పిలిచెను,
- ఉపకరణాలు:
“గృహాణ వత్స! సలిలమ్
మాభూత్ కాలస్య పర్యయః ।
మంత్రగ్రామం గృహాణ త్వమ్
బలామతిబలాం తథా ॥
టీకా:
గృహాణ = గ్రహించుము; వత్స = ఓ బాలకా; సలిలమ్ = ఉదకమును; మాభూత్ = కావలదు; కాలస్య = కాలము యొక్క; పర్యయః = తప్పిపోకుండ; మంత్ర = మంత్రముల; గ్రామం = సముదాయమును; గృహాణ = గ్రహింపుము; త్వమ్ = నీవు; బలామ్ = బలను; అతిబలామ్ = అతి బలను; తథా = మరియు.
భావము:
”వత్సా! ఉదకము గైకొని తొందరగా ఆచమనము చేయుము. మంచి కాలము దాటిపోనీకుము. “బల”, “అతిబల” అనెడు విద్యల మంత్ర సముదాయములను ఇచ్చెదను, గ్రహింపుము.
- ఉపకరణాలు:
న శ్రమో న జ్వరో వా తే
న రూపస్య విపర్యయః ।
న చ సుప్తం ప్రమత్తం వా
ధర్షయిష్యంతి నైఋతాః ॥
టీకా:
న = కలుగదు; శ్రమః = శ్రమ; న = కలుగదు; జ్వరః = రోగతాపము కూడా; వా = లేదా; తే = నీకు; న = కలుగదు; రూపస్య = రూపముయొక్క; విపర్యయః = హాని; న = వీలుకాదు; చ = మరియును; సుప్తం = నిద్రపోవుచున్నను; ప్రమత్తం = ఏమరుపాటుతో ఉన్నవాడవు; వా = ఐనను; ధర్షయిష్యంతి = బాధించుట; నైఋతాః = రాక్షసులు.
భావము:
ఈ విద్యలు గ్రహించినచో, నీకు శ్రమ లేదా రోగతాపము లేదా రూపహాని కాని కలుగవు. నిద్రపోవుచున్నను, ఏమరుపాటుగా ఉన్నను, రాక్షసులు నిన్ను బాధింపజాలరు.
- ఉపకరణాలు:
దశరథనృపసూనుసత్తమాభ్యాం
తృణశయనేఽ నుచితే సహోషితాభ్యామ్ ।
కుశికసుతవచోఽ నులాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ॥
టీకా:
దశరథ = దశరథుడను; నృప = మహారాజ; సూను = పుత్ర; సత్తమాభ్యాం = శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులకు; తృణ = గడ్డిపై; శయనే = పరుండుట; అనుచితే = అలవాటులేనిది; సహ = కలిసి; ఉషితాభ్యామ్ = వసించుట (నిదురించుట); కుశికసుత = కుశికపుత్రుడైన విశ్వామిత్రుని; వచః = పలుకులతో; అనులాలితాభ్యాం = బుజ్జగింపబడుటచే; సుఖమ్ = సుఖము; ఇవ = వలెనే; సా = ఆ; విబభౌ = తోచినది; విభావరీ = రాత్రి; చ = కూడా.
భావము:
రామలక్ష్మణులు పూర్వము అలవాటు లేనటువంటి గడ్డిపరుపులపై కలసి పరుండినను, విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలవలన వారికి ఆ రాత్రి కూడా సుఖముగనే తోచెను.
- ఉపకరణాలు:
న సౌభాగ్యే న దాక్షిణ్యే
న జ్ఞానే బుద్ధినిశ్చయే ।
నోత్తరే ప్రతివక్తవ్యే
సమో లోకే తవానఘ ॥
టీకా:
న = ఉండడు; సౌభాగ్యే = సౌభాగ్యములో; దాక్షిణ్యే = దక్షత్వము నందు, కృపలోను; జ్ఞానే = జ్ఞానమునందు; బుద్ధినిశ్చయే = నిర్ణయము తీసుకొనుట లోను; ఉత్తరే = ప్రత్యుత్తరము; ప్రతివక్తవ్యే = చెప్పుటలో; సమః = సమానుడు; లోకే = లోకమునందు; తవ = నీకు; అనఘ = ఓ పాపరహితుడా
భావము:
ఓ పుణ్యాత్ముడా ! ఓ రామా! సౌభాగ్యమునందు, సామర్థ్యమునందు కృపలోను, జ్ఞానమునందు, నిర్ణ యములు తీసుకొనుటలోను, ప్రశ్నకు సమాధానము చెప్పుటలోను, నీకు సరివచ్చువాడు ఈ లోకములో ఉండడు.
- ఉపకరణాలు:
దశరథనృపసూనుసత్తమాభ్యాం
తృణశయనేఽ నుచితే సహోషితాభ్యామ్ ।
కుశికసుతవచోఽ నులాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ॥
టీకా:
దశరథ = దశరథుడను; నృప = మహారాజ; సూను = పుత్ర; సత్తమాభ్యాం = శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులకు; తృణ = గడ్డిపై; శయనే = పరుండుట; అనుచితే = అలవాటులేనిది; సహ = కలిసి; ఉషితాభ్యామ్ = వసించుట (నిదురించుట); కుశికసుత = కుశికపుత్రుడైన విశ్వామిత్రుని; వచః = పలుకులతో; అనులాలితాభ్యాం = బుజ్జగింపబడుటచే; సుఖమ్ = సుఖము; ఇవ = వలెనే; సా = ఆ; విబభౌ = తోచినది; విభావరీ = రాత్రి; చ = కూడా.
భావము:
రామలక్ష్మణులు పూర్వము అలవాటు లేనటువంటి గడ్డిపరుపులపై కలసి పరుండినను, విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలవలన వారికి ఆ రాత్రి కూడా సుఖముగనే తోచెను.
- ఉపకరణాలు:
క్షుత్పిపాసే న తే రామ!
భవిష్యేతే నరోత్తమ! ।
బలామతిబలాం చైవ
పఠతః పథి రాఘవ! ॥
టీకా:
క్షుత్ = ఆకలి; పిపాసే = దప్పికలు; న = ఉండవు తే = నీకు; రామ = ఓ రామా; భవిష్యేతే = కలుగుట; నరోత్తమ = నరులలో ఉత్తముడా; బలామ్ = బల విద్య; అతిబలామే = అతిబల విద్య; చ; ఏవ = నిశ్చయముగా; పఠతః = చదువుచున్న; పథి = త్రోవలో; రాఘవ = రఘువంశజుడా
భావము:
ఓ నరోత్తమా! రాఘవరామా! ఈ బలాతిబలలను జపించు మార్గములలో నీకు ఆకలిదప్పికలు కలుగవు.
- ఉపకరణాలు:
విద్యాద్వయమధీయానే
యశశ్చాప్యతులం త్వయి ।
పితామహసుతే హ్యేతే
విద్యే తేజః సమన్వితే ।
ప్రదాతుం తవ కాకుత్స్థ!
సదృశస్త్వం హి ధార్మిక ॥
టీకా:
విద్యా = విద్యలను; ద్వయమ్ = రెంటిని; అధీయానే = అధ్యయనము చేసినచో; యశః = కీర్తి; చ; అపి = కూడ; అతులం = సాటిలేనిది; త్వయి = నీయందు; పితామహ = బ్రహ్మదేవుని; సుతే = పుత్రికలు; హి = ఐన; ఏతే = విద్యలు; విద్యే = విద్యలు; తేజః = తేజస్సుతో; సమన్వితే = కూడినవి; ప్రదాతుం = ఇచ్చుటకు; తవ = నీకు; కాకుత్స్థ = కాకుత్స్థవంశమునందు పుట్టినవాడా; సదృశః = తగినవాడు; త్వమ్ = నీవు; హి = మాత్రమే; ధార్మికః = ధార్మికుడ.
భావము:
ఈ బల అతిబల విద్యాద్వయము జపించినచో నీకు సాటిలేని కీర్తి కూడ లభించును. ఓ రామా! తేజోమయములైన ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు. ఓ కాకుత్స్థ ! ధార్మికా ! వీటిని ఇచ్చుటకు నీవే అర్హుడవు.
- ఉపకరణాలు:
కామం బహుగుణాః సర్వే
త్వయ్యేతే నాత్ర సంశయః ।
తపసా సమ్భృతే చైతే
బహురూపే భవిష్యతః" ॥
టీకా:
కామం = ఇచ్చాపూర్వకంగా; బహు = అనేక; గుణాః = సుగుణములు; సర్వే = అన్నియు; త్వయి = నీయందున్నవి; ఏతే = ఈ; న = లేదు; అత్ర = ఇక్కడ; సంశయః = సందేహము; తపసా = తపస్సుచే; సమ్భృతే = పోషింపబడినవై; చ; ఏతే = ఇవి; బహు = అనేక; రూపే = రూపములుగా; భవిష్యతః = కాగలవు.
భావము:
నీయందు సుగుణములన్నియు ఉన్నవి. ఇందులో సందేహము లేదు. ఈ విద్యలను తపస్సుచే పోషించినచో అనేక రూపములుగా పరిణామము చెందగలవు.
- ఉపకరణాలు:
తతో రామో జలం స్పృష్ట్వా
ప్రహృష్టవదనః శుచిః ।
ప్రతిజగ్రాహ తే విద్యే
మహర్షేర్భావితాత్మనః ॥
టీకా:
తతః = పిమ్మట; రామః = రాముడు; జలం = నీటిని; స్పృష్ట్వా = స్పృశించి; ప్రహృష్ట = సంతోషముతో వికసించిన; వదనః = ముఖము కలవాడై; శుచిః = పవిత్రుడై; ప్రతిజగ్రాహ = స్వీకరించెను; తే = ఆ; విద్యే = విద్యలను; మహర్షేః = మహర్షినుండి; భావితాత్మనః = పరిశుద్ధమైన మనస్సుగల.
భావము:
రాముడు నీటిని స్పృశించి, ఆచమనము చేసి, శుచియై, ఆనందముతో వికసించిన ముఖముకలవాడై, పరిశుద్ధమనస్కు డైన విశ్వామిత్రమహర్షి నుండి బల అతిబల విద్యలు స్వీకరించెను.
- ఉపకరణాలు:
విద్యాసముదితో రామః
శుశుభే భూరివిక్రమః ।
సహస్రరశ్మిర్భగవాన్
శరదీవ దివాకరః ॥
టీకా:
విద్యాసముదితః = విద్యలతో; సముదితః = సంతోషించిన వాడై; రామః = రాముడు; శుశుభే = బాగుగా ప్రకాశించెను; భూరివిక్రమః = గొప్ప పరాక్రమవంతుడు; సహస్రరశ్మిః = వేయి కిరణములు గలవాడు; భగవాన్ = భగవంతుడు; శరత్ = శరత్కాలమునందు; ఇవ = వలె; దివాకరః = సూర్యుడు
భావము:
మహా పరాక్రమవంతుడైన రాముడు బల అతిబల విద్యలు పొంది, శరత్కాలములో వేయికిరణముల దైవముసూర్యభగవానుడి వలె ప్రకాశించెను.
- ఉపకరణాలు:
గురుకార్యాణి సర్వాణి
నియుజ్య కుశికాత్మజే ।
ఊషుస్తాం రజనీం తత్ర
సరయ్వాం సుసుఖః త్రయః ॥
టీకా:
గురు = గురువుగార్కి; కార్యాణి = చేయవలసిన కార్యములను; సర్వాణి = అన్నియును; నియుజ్య = చేసి; కుశికాత్మజే = విశ్వామిత్రుని విషయములో; ఊషుః = ఉండిరి; తాం = ఆ; రజనీం = రాత్రి; తత్ర = అచట; సరయ్వాం = సరయూ తీరమునందు; సుసుఖః = చాలా సుఖముగా; త్రయః = ముగ్గురును.
భావము:
రాముడు, విశ్వామిత్రుని విషయములో మంత్రాచార్యుని విషయములో ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించి అన్నిబాధ్యతలను నిర్వర్తించెను. వారు ముగ్గురు సరయూ తీరమునందు ఆ రాత్రి సుఖముగా గడిపిరి..
- ఉపకరణాలు:
దశరథనృపసూనుసత్తమాభ్యాం
తృణశయనేఽ నుచితే సహోషితాభ్యామ్ ।
కుశికసుతవచోఽ నులాలితాభ్యాం
సుఖమివ సా విబభౌ విభావరీ చ ॥
టీకా:
దశరథ = దశరథుడను; నృప = మహారాజ; సూను = పుత్ర; సత్తమాభ్యాం = శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులకు; తృణ = గడ్డిపై; శయనే = పరుండుట; అనుచితే = అలవాటులేనిది; సహ = కలిసి; ఉషితాభ్యామ్ = వసించుట (నిదురించుట); కుశికసుత = కుశికపుత్రుడైన విశ్వామిత్రుని; వచః = పలుకులతో; అనులాలితాభ్యాం = బుజ్జగింపబడుటచే; సుఖమ్ = సుఖము; ఇవ = వలెనే; సా = ఆ; విబభౌ = తోచినది; విభావరీ = రాత్రి; చ = కూడా.
భావము:
రామలక్ష్మణులు పూర్వము అలవాటు లేనటువంటి గడ్డిపరుపులపై కలసి పరుండినను, విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలవలన వారికి ఆ రాత్రి కూడా సుఖముగనే తోచెను.
- ఉపకరణాలు:
ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
ద్వావింశః సర్గః
టీకా:
ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; ద్వావింశః [22] = ఇరవైరెండవ; సర్గః = సర్గ.
భావము:
ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [22] ఇరవై రెండవ సర్గ సుసంపూర్ణము.