వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥చతుర్దశః సర్గః॥ [14 దశరథుని అశ్వమేధయాగము]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అథ సంవత్సరే పూర్ణే
 తస్మిన్ ప్రాప్తే తురంగమే ।
సరయ్వాశ్చోత్తరే తీరే
 రాజ్ఞో యజ్ఞోఽ భ్యవర్తత ॥

టీకా:

అథ = తరువాత; సంవత్సరే = సంవత్సరము; పూర్ణే = పూర్తి యగుచుండగా; తస్మిన్ = ఆ; ప్రాప్తే = వచ్చిన పిమ్మట; తురంగమే = గుఱ్ఱము; సరయ్వాః = సరయూ నది; చ = యొక్క; ఉత్తరే = ఉత్తరపు; తీరే = తీరమునందు; రాజ్ఞః = రాజు యొక్క; యజ్ఞః = యాగము; అభ్యవర్తత = ప్రారంభమయ్యెను.

భావము:

సంవత్సరము పూర్తి అగుచుండగా యాగాశ్వము తిరిగి వచ్చినది. అప్పుడు సరయూనది యొక్క ఉత్తరతీరము నందు దశరథుడు యజ్ఞమును ప్రారంభించెను.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋశ్యశృంగం పురస్కృత్య
 కర్మ చక్రుర్ద్విజర్షభాః ।
అశ్వమేధే మహాయజ్ఞే
 రాజ్ఞోఽ స్య సుమహాత్మనః ॥

టీకా:

ఋశ్యశృంగమ్ = ఋశ్యశృంగుని; పురస్కృత్య = అనుసరించి / ముందు ఉంచుకొని; కర్మ = కార్యక్రమమును; చక్రుః = చేసిరి; ద్విజః = బ్రాహ్మణులలో; ఋషభాః = ఉత్తములు; అశ్వమేధే = అశ్వమేధమను; మహా = గొప్ప; యజ్ఞే = యాగమునందు; రాజ్ఞః = రాజు యొక్క; అస్య = ఆ; సుమహాత్మనః = పూజనీయుడైన.

భావము:

పూజనీయుడైన ఆ దశరథుని అశ్వమేధ యాగమునందు; బ్రాహ్మణోత్తములు ఋశ్యశృంగుని అనుసరించి యజ్ఞ కార్యక్రమములు నిర్వహించిరి.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కర్మ కుర్వంతి విధివత్
 యాజకా వేదపారగాః ।
యథావిధి యథాన్యాయం
 పరిక్రామంతి శాస్త్రతః ॥

టీకా:

కర్మ = యజ్ఞకర్మలను; కుర్వంతి = నిర్వహించిరి; విధివత్ = శాస్త్ర విధిగా; యాజకాః = ఋత్విక్కులు; వేదపారగాః = వేదపండితులు; యథావిధి = వేదములో చెప్పబడినట్లుగా; యథా న్యాయమ్ = న్యాయబద్ధముగా; పరిక్రామంతి = నడిపించిరి; శాస్త్రతః = శాస్త్రప్రకారము.

భావము:

వేదపండితులైన ఋత్విక్కులు; యజ్ఞ సంబంధమైన కర్మలన్నియు శాస్త్ర యుక్తముగా నిర్వహించిరి. వేదములో చెప్పబడినట్లు న్యాయముగా నడిపించిరి.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా
 తథైవోపసదం ద్విజాః ।
చక్రుశ్చ విధివత్సర్వమ్
 అధికం కర్మ శాస్త్రతః ॥

టీకా:

ప్రవర్గ్యమ్ = ప్రవర్గ్యమును శాస్త్రతః = శాస్త్రానుసారము; కృత్వా = చేసి; తథైవ = అంతేకాక; ఉపసదమ్ = ఉపసదమును కూడ; ద్విజాః = బ్రాహ్మణులు; చక్రుః చ = చేసిరి; చ; విధివత్ = పద్దతిప్రకారముగా; సర్వమ్ = అంతయు; అధికమ్ = తదితర; కర్మ = కర్మలను; శాస్త్రతః = శాస్త్రప్రకారము.

భావము:

బ్రాహ్మణులు అశ్వమేధయాగములోని ప్రవర్గ్యము అను యాగకర్మలను, ఉపసదము అను ఇష్టి కార్యములను మఱియు తదితర యజ్ఞకర్మలను అన్నింటిని పద్ధతిప్రకారముగా శాస్త్ర ప్రకారముగా నిర్వర్తించిరి.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అభిపూజ్య తతో హృష్టాః
 సర్వే చక్రుర్యథావిధి ।
ప్రాతఃసవనపూర్వాణి
 కర్మాణి మునిపుంగవాః ॥

టీకా:

అభిపూజ్య = దేవతలను పూజించి; తతః = తరువాత; హృష్టాః = సంతోషించి; సర్వే = అందరును; చక్రుః = చేసిరి; యథావిధిః = శాస్త్ర విధిగా; ప్రాతః సవన = ఉదయము చేయు యజ్ఞమునకు సంబంధించినవి; పూర్వాణి = మొదలగు; కర్మాణి = కర్మలను; మునిపుఙ్గవాః = మునిశ్రేష్ఠులు.

భావము:

ఆ మునిశ్రేష్ఠులందరును సంతోషించి, ఆయా కర్మాధిష్ఠాన దేవతలను పూజించిరి. యజ్ఞకర్మలు మున్నగు వానిని యథావిధిగా చేసిరి.

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఐంద్రశ్చ విధివద్దత్తో
 రాజా చాఽ భిషుతోఽ నఘః ।
మాధ్యందినం చ సవనం
 ప్రావర్తత యథాక్రమమ్ ॥

టీకా:

ఐంద్రః = ఇంద్రునకు; చ = చెందినది; విధివత్ = యథాశాస్త్రముగా హవిర్భగములు; దత్తః = ఇవ్వబడినని; రాజా = రాజు; చ = మఱియు; అభిషుతః = సోమలతనుండి రసము తీసెను; అనఘః = దోషరహితమైనది; మాధ్యందినం = మధ్యాహ్న; చ = కూడ; సవనం = యజ్ఞకర్మలను; ప్రావర్తత = జరిగెను; యథాక్రమం = యథావిధిగా.

భావము:

రాజా దశరథులవారు ఇంద్రునికి యతావిధిగా హవిస్సులు అర్పించిరి. దోషరహితమైన సోమరసము పిండిరి. పిమ్మట మధ్యాహ్నము చేయవలసిన యజ్ఞ కార్యములు యథావిధిగా ఆచరించిరి.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తృతీయసవనం చైవ
 రాజ్ఞోఽ స్య సుమహాత్మనః ।
చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా
 తథా బ్రాహ్మణపుంగవాః ॥

టీకా:

తృతీయ సవనం చైవ = సాయం సంధ్యా సమయంలో చేసే యజ్ఞ కర్మలను కూడ; రాజ్ఞః = రాజు; అస్య = యొక్క; సుమహాత్మనః = మహాత్ముడైన; చక్రుస్తే = వారు చేసిరి; శాస్త్రతః = శాస్త్రము ననుసరించి; దృష్ట్వా = చూసి; తథా = అదే విధముగనే; బ్రాహ్మణ పుఙ్గవాః = బ్రాహ్మణ శ్రేష్ఠులు.

భావము:

బ్రాహ్మణోత్తములు సాయం సంధ్యా సమయములో చేయు యజ్ఞకార్యములను కూడా శాస్త్ర సమ్మతముగా నిర్వహించిరి.

1-8-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న చాహుతమభూత్తత్ర
 స్ఖలితం వాపి కించన ।
దృశ్యతే బ్రహ్మవత్సర్వం
 క్షేమయుక్తం హి చక్రిరే ॥

టీకా:

న చ = జరుగలేదు; చ; ఆహుతమ్ = హవిస్సులు వ్రేల్చుటలలో; అభూత్ = లోపములు; తత్ర = అక్కడ; స్ఖలితమ్ = పొరపాటున; వా = ఐనా; అపి = కూడ; కించిన = కొంచెము కూడ లేదు; దృశ్యతే = కనబడుచున్నది; బ్రహ్మవత్ = మంత్రయుక్తముగా; సర్వం = అంతయును; క్షేమయుక్తమ్ = శుభకరముగా; హి = మాత్రమే; చక్రిరే = చేసిరి కదా.

భావము:

ఆ యజ్ఞములో హవిస్సులను వేల్చుటలోనూ, యజ్ఞ సంబంధమైన మరి ఏ ఇతర విధములైన కర్మలలోనూ లోపములుగాని పొరపాట్లుగాని ఏమాత్రం జరుగలేదు. ఆ కార్యమంతయు మంత్ర పూర్వకముగా శుభకరముగా ఉండునట్లు చేసిరి.

1-9-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న తేష్వహస్సు శ్రాంతో వా
 క్షుధితో వాపి దృశ్యతే ।
నావిద్వాన్ బ్రాహ్మణస్తత్ర
 నాశతానుచరస్తథా ॥

టీకా:

న = లేదు; తేషు = ఆ; అహస్సు = దినములలో; శ్రాంతః = అలసిన వాడు; క్షుధితః = ఆకలితో ఉన్నవాడు; వా = అయినా; అపి = కూడ; దృశ్యతే = కనబడుట; న = లేడు; అవిద్వాన్ = విద్వాంసుడు కాని; బ్రాహ్మణః = బ్రాహ్మణుడు; తత్ర = అక్కడ; అశతానుచరః = కనీసము నూరుగురు అనుచరులైనను లేని వాడు; తథా = అట్లే.

భావము:

యజ్ఞము చేసిన ఆ దినములలో అలసినవాడు కాని, ఆకలితో ఉన్నవాడు గాని కవబడుటలేదు. విద్వత్తు లేని వాడు గాని, అట్లే కనీసము నూరుగురు శిష్యులైన లేని బ్రాహ్మణుడు గాని కనబడరు.

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రాహ్మణా భుంజతే నిత్యం
 నాథవంతశ్చ భుంజతే ।
తాపసా భుంజతే చాపి
 శ్రమణా భుంజతే తథా ॥

టీకా:

బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; భుఞ్జతే = భోజనములు చేయుచుండిరి; నిత్యమ్ = ప్రతి దినము; నాథవంతః = దాస దాసీ జనము; చ = కూడ; తాపసా = తపసులు; భుఞ్జతే = భోజనములు చేయుచుండిరి; చాపి = కూడ; శ్రమణా = సన్యాసులును; భుఞ్జతే = భోజనములు చేయుచుండిరి; తథా = అలాగే.

భావము:

ఆ యజ్ఞము చేయుచున్నన్ని దినములు బ్రాహ్మణులు, దాస దాసీ జనము, మునులు మఱియు సన్యాసులు అందరు నిత్యము భోజనములు చేయుచుండిరి.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ
 స్త్రియో బాలాస్తథైవ చ ।
అనిశం భుంజమానానాం
 న తృప్తిరుపలభ్యతే ॥

టీకా:

వృద్ధాః = వృద్ధులు; వ్యాధితాశ్చైవ = రోగులు; స్త్రియః = స్త్రీలు; బాలాః = చిన్నపిల్లలు; తథైవచ = మరియు; అనిశమ్ = నిత్యము; భుఞ్జమానానామ్ = భోజనము చేయువారికి; న తృప్తిః ఉపలభ్యతే = తృప్తి కలుగుట లేదు.

భావము:

వృద్ధులు, రోగులు, స్త్రీలు, బాలురు భోజనము ఎల్లపుడు చేయుచున్నను భోజనము చాలా మధురముగా ఉన్నందున ఎంత తిన్నను తృప్తి కలుగక మరింత తినవలెనని అభిలాష వారికి కలుగుచుండెను.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీయతాం దీయతామన్నం
 వాసాంసి వివిధాని చ" ।
ఇతి సంచోదితాస్తత్ర
 తథా చక్రురనేకశః ॥

టీకా:

దీయతాం దీయతామ్ = ఇవ్వబడుగాక; అన్నమ్ = అన్నము; వాసాంసి = వస్త్రములు; వివిధాని చ = అనేక రకములైన; చ = కూడ; ఇతి = ఈ విధముగా; సంచోదితాః = ప్రేరేరింపబడిన వారై; తత్ర = అక్కడ; తథా = అట్లు; చక్రుః = చేసిరి; అనేకశః = అనేక విధములుగ .

భావము:

"భోజనము బాగా వడ్డించండి, రకరకముల వస్త్రములను పంచి పెట్టండి" అని ఆ యాగశాల యందు దశరథుడును, మంత్రులును చెప్పుచుండగా వారు అట్లే చేసిరి.

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అన్నకూటాశ్చ బహవో
 దృశ్యంతే పర్వతోపమాః ।
దివసే దివసే తత్ర
 సిద్ధస్య విధివత్తదా ॥

టీకా:

అన్న = భోజనపదార్థాల; కూటః = రాశులు; చ; బహవః = అనేకములైన; దృశ్యంతే = కనబడుచుండెను; పర్వతః = పర్వతములు; ఉపమాః = వలె; దివసే దివసే = ప్రతి దినము; తత్ర = అక్కడ; సిద్ధః = సిద్ధముగా; అస్య = కూడ ఉన్నాయి; విధివత్ = తగు విధముగా; తదా = అప్పుడు.

భావము:

అక్కడ ప్రతిదినము తగువిధముగా వండిన అన్నము మఱియు భోజన పదార్థముల రాశులు పర్వతముల వలె సిద్ధముగా ఉండెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నానాదేశాదనుప్రాప్తాః
 పురుషాః స్త్రీగణాస్తథా ।
అన్నపానైః సువిహితాః
 తస్మిన్ యజ్ఞే మహాత్మనః ॥

టీకా:

నానా = అనేకానేక; దేశాత్ = దేశములనుండి; అనుప్రాప్తాః = వచ్చిన; పురుషాః = పురుషులు; స్త్రీః = స్త్రీలు; గణాః = సమూహములుగ; తథా = నిశ్చయంగా; అన్నపానైః = అన్నపానములచే; సువిహితాః = బాగుగా తృప్తి చెందిరి; తస్మిన్ = ఆ; యజ్ఞే = యజ్ఞమునందు; మహాత్మనః = మహాత్ముని యొక్క.

భావము:

మహాత్ముడైన దశరథ మహారాజు చేసిన యజ్ఞమునకు అనేక దేశముల నుండి వచ్చిన స్త్రీ పురుషు లందరును అన్నపానాదులతో తృప్తి నొందిరి.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అన్నం హి విధివత్స్వాదు
 ప్రశంసంతి ద్విజర్షభాః ।
అహో తృప్తాః స్మ భద్రం తే
 ఇతి శుశ్రావ రాఘవః ॥

టీకా:

అన్నమ్ = ఆహారము; హి = నిస్సందేహంగా; విధివత్ = రీతిగ; స్వాదు = రుచికరమైనదని; ప్రశంసంతి = ప్రశంసించిరి; ద్విజః = బ్రాహ్మణులలో; ఋషభాః = ఉత్తములు; అహో = ఆహా; తృప్తాః = తృప్తిచెందాము; స్మః = మేము; భద్రం = శుభమగు గాక; తే = మీకు; ఇతి = ఈ విధమైన మాటలను; శుశ్రావ = వినెను; రాఘవః = రఘుకుల వంశీయుడైన దశరథుడు.

భావము:

పద్ధతిగా వండి వడ్డించిన రుచికరమైన భోజనమును ఆరగించిన బ్రాహ్మణోత్తములు "మేము తృప్తి చెందినాము. నీకు మంగళమగు గాక" అని పలుకగా దశరథుడు వినెను.

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వలంకృతాశ్చ పురుషా
 బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ।
ఉపాసతే చ తానన్యే
 సుమృష్టమణికుండలాః ॥

టీకా:

స్వలంకృతాః = బాగుగా అలంకరించుకొనిన; పురుషాః = పురుషులు; బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులకు; పర్యవేషయన్ = వడ్డించిరి; ఉపాసతే = సేవించిరి; తాన్ = వారిని; అన్యే = మరి కొందరు; సు = బాగుగా; మృష్ట = మెరియుచున్న; మణికుండలాః = మణి కుండలములు గల వారు.

భావము:

బాగుగా అలంకరించుకొనిన పురుషులు బ్రాహ్మణులకు వడ్డించుచుండిరి. శ్రేష్ఠమైన మణికుండలములు ధరించిన మరికొందరు వడ్డించెడివారికి సహాయము చేయుచుండిరి.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కర్మాంతరే తదా విప్రా
 హేతువాదాన్ బహూనపి ।
ప్రాహుశ్చ వాగ్మినో ధీరాః
 పరస్పరజిగీషయా ॥

టీకా:

కర్మాః = యజ్ఞకర్మల; అంతరే = విరామ సమయంలో; తదా = అప్పుడు; విప్రాః = బ్రాహ్మణులు; హేతువాదాన్ = తార్కిక వాదములను; బహూనః = అనేకమైనవి; అపి = కూడ; ప్రాహుః = పలికిరి; వాఙ్గ్మినః = వాక్చాతుర్యము గల; ధీరాః = యుక్తిపరులు; పరస్పర = ఒకరి నొకరు; జిగీషియా = జయించ వలెనను కోరిక కలవారు.

భావము:

యజ్ఞకర్మల మధ్య ఉన్న విరామములో వాక్చతురులు యుక్తిపరులు అగు బ్రాహ్మణోత్తములు ఒకరినొకరు జయించ వలెనను ఉత్సాహముతో అనేకానేక శాస్త్ర సంబంధమైన చర్చలు చేయుచుండిరి.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివసే దివసే తత్ర
 సంస్తరే కుశలా ద్విజాః ।
సర్వకర్మాణి చక్రుస్తే
 యథాశాస్త్రం ప్రచోదితాః ॥

టీకా:

దివసే దివసే = ప్రతిదినము; తత్ర = అక్కడ; సంస్తరే = యజ్ఞమునందు; కుశలాః = నేర్పరులైన; ద్విజాః = బ్రాహ్మణులు; సర్వ = అన్ని; కర్మాణి = విధులను; చక్రుః = చేసిరి; యథాశాస్త్రం = శాస్త్రసమ్మతముగా; ప్రచోదితాః = ప్రేరేపింపబడిన వారై.

భావము:

అక్కడ యజ్ఞము చేయుటలో నిష్ణాతులైన బ్రాహ్మణులు, ప్రతిదినము; శాస్త్ర ప్రకారం ఆయా కర్మలను నిర్వహించిరి.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాషడంగవిదత్రాసీత్
 నావ్రతో నాబహుశ్రుతః ।
సదస్యాస్తస్య వై రాజ్ఞో
 నావాదకుశలా ద్విజాః ॥

టీకా:

న = లేదు; న ఆషడఙ్గవిత్ = వేదముల యొక్క ఆరు శాఖలు (వేదాంగములు) తెలియనివాడు; అత్ర = ఇక్కడ; ఆసీత్ = ఉండుట; న = లేడు; అవ్రతః = వ్రతనిష్ఠ లేనివాడు; న = లేడు; అబహుశ్రుతః = బహు శాస్త్రములతో పరిచయము లేనివాడు; సదస్యాః = సదస్యులు; తస్య = ఆ; న = లేకుండిరి; వై = నిశ్చయంగా; రాజ్ఞః = రాజు యొక్క; అవాదకుశలాః = శాస్త్రవాదము చేయలేనివారు; ద్విజాః = బ్రాహ్మణులు.

భావము:

వేదాంగములు తెలియనివారు కాని, బహుశాస్త్ర కోవిదులు కానివారు కాని, శాస్త్ర విషయములయందు వాదన చేయలేనివారు కాని దశరథుని యజ్ఞవాటికలోని సదస్యులలో లేరు.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాప్తే యూపోచ్ఛ్రయే తస్మిన్
 షడ్బైల్వాః ఖాదిరాస్తథా ।
తావంతో బిల్వసహితాః
 పర్ణినశ్చ తథాఽ పరే ॥

టీకా:

ప్రాప్తే = ప్రాప్తించినది; యూపః = యూప స్తంభములను; ఉచ్ఛ్రయే = ఎత్తవలసి వచ్చినపుడు; తస్మిన్ = ఆ యజ్ఞవాటిక యందు; షట్ = ఆరు; బైల్వాః = మారేడు కఱ్ఱతో చేయబడిన; ఖాదిరాః = చండ్ర కఱ్ఱతో చేసిన స్తంభములను; తావంతః = అంతే సంఖ్య గల; బిల్వ సహితాఃపర్ణినః = మాఱేడును పోలిన ఆకులు గలది, మోదుగకఱ్ఱ తో చేయబడిన; చ; తథా = మరియు; ఆపరే = మరి కొన్ని ఇతర స్తంభములు.

భావము:

ఆ యజ్ఞవాటికలో యూపస్తంభములుగా ఆరు బిల్వ;, ఆరు చండ్ర, ఆరు మోదుగ ఇంకా మఱికొన్ని యూపస్తంభములను నాటిరి.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్లేష్మాతకమయస్త్వేకో
 దేవదారుమయస్తథా ।
ద్వావేవ తత్ర విహితౌ
 బాహువ్యస్తపరిగ్రహౌ ॥

టీకా:

శ్లేష్మాతకమయః = విరిగిచెట్టు కఱ్ఱతో చేసిన స్తంభము; దేవదారుమయ = దేవదారువు కఱ్ఱతో చేసిన స్తంభము; ద్వావేవ = రెండు స్తంభములు; విహితౌ = నిర్మింపబడినవి; తత్ర = అక్కడ; బాహువ్యస్తపరిగ్రహౌ = రెండు చేతులు చాపినంత దూరము, బార.

భావము:

శ్లేష్మాతక అనగా విరిగి వృక్షము యొక్క కఱ్ఱతో చేయబడిన ఒక స్తంభము, దేవదారు చెక్కతో చేసిన రెండు స్తంభములు నాటిరి. ప్రతి రెండు స్తంభముల మధ్యన మధ్యన బారెడు దూరము ఉంచిరి.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కారితాః సర్వ ఏవైతే
 శాస్త్రజ్ఞైర్యజ్ఞకోవిదైః ।
శోభార్థం తస్య యజ్ఞస్య
 కాంచనాలంకృతాఽ భవన్ ॥

టీకా:

కారితాః = చేయించబడిన; సర్వ = అన్నియు; ఏవ = ఇవి; తే = వారిచే; శాస్త్రజ్ఞైః = శాస్త్రజ్ఞులు; యజ్ఞ కోవిదైః = యజ్ఞము చేయుటలో ప్రవీణులుచేత; శోభ = అలంకరణ; అర్థం = కొరకు; తస్య = ఆ; యజ్ఞః = యాగముల; అస్య = యొక్క; కాంచనాః = బంగారముతో; అలంకృతాః = అలంకరింప బడినవై; ఆభవన్ = ఐనవి.

భావము:

శాస్త్రజ్ఞులు మరియు యజ్ఞములు చేయుటలో ప్రవీణులైన వారు ఆ యూపస్తంభములను బంగారు తొడుగులతో అలంకరించిరి.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏకవింశతి యూపాస్తే
 ఏకవింశత్యరత్నయః ।
వాసోభిరేకవింశద్భిః
 ఏకైకం సమలంకృతాః ॥

టీకా:

ఏకవింశతి = ఇరవైయొక్క; యూపస్తే = యూపస్తంభములకు; ఏకవింశతి = ఇరవైయొక్క; అరత్నయః = మూరల; వాసోభిః = వస్త్రములచే; ఏకవింశద్భిః = ఇరవైయొక్కింటికి; ఏకైకమ్ = ఒకదానికి ఒకటి చొప్పున; సమ = చక్కగా; అలంకృతాః = అలంకరింప బడినవి.

భావము:

ఇరవైయొక్క స్తంభములకు, ఇరవైయొక్క మూరల, ఇరవైయొక్క వస్త్రములు, ఒకదానికి ఒకటి చొప్పున చుట్టి అలంకరించిరి.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విన్యస్తా విధివత్సర్వే
 శిల్పిభిః సుకృతా దృఢాః ।
అష్టాశ్రయః సర్వ ఏవ
 శ్లక్ష్ణరూపసమన్వితాః ॥

టీకా:

విన్యస్తాః = నాట బడినవి; విధివత్ = యథాశాస్త్రముగా; సర్వే = అన్నియు; శిల్పిభిః = శిల్పులచే; సుకృతాః = చక్కగా చేయబడినవి; దృఢాః = దృఢముగా ఉన్నవి; అష్టాశ్రయః = ఎనిమిది అంచులు గలవి; సర్వ = అన్నియు; ఏవ = అవి; శ్లక్ష్ణ = నున్నటి; రూప = రూపము; సమన్వితాః = కలవి.

భావము:

దృఢమైన ఆ యూపస్తంభములన్నియు ఎనిమిది పలకలగా చిత్రీ పట్టి నున్నగా చేయబడి, శాస్త్రానుసారముగా శిల్పులచే నిర్మించబడి స్థాపించబడినవి.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆచ్ఛాదితాస్తే వాసోభిః
 పుష్పైర్గంధైశ్చ పూజితాః ।
సప్తర్షయో దీప్తిమంతో
 విరాజంతే యథా దివి ॥

టీకా:

ఆచ్ఛాదితాః = కప్పబడినవి; తే = అవి; వాసోభిః = వస్త్రములచే; పుష్పైః = పువ్వులతోను; గంధైశ్చ = గంధముతోను; పూజితాః = పూజింప బడినవి; సప్తర్షయః = సప్త ఋషులవలె; దీప్తిమంతః = కాంతివంతమై; విరాజంతే = ప్రకాశించుచున్నవి; యథా దివి = ఆకాశమునందు వలె.

భావము:

ఆ యూపస్తంభములు వస్త్రములు చుట్టి, పుష్పములు సుగంధములతో అలంకరించిరి. ఆకాశములోని సప్తఋషి మండలము వలె వెలుగుచున్నవి.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇష్టకాశ్చ యథాన్యాయం
 కారితాశ్చ ప్రమాణతః ।
చితోఽ గ్నిర్బ్రాహ్మణైస్తత్ర
 కుశలైః శుల్బకర్మణి ॥

టీకా:

ఇష్టకాః = ఇటుకలు; చ; యథా న్యాయం = శాస్త్ర ప్రకారముగా; కారితాః = చేయించబడినవి; చ; ప్రమాణతః = కొలతల ప్రకారము; చితోఽగ్నిః = ఇటుకలతో కట్టబడిన యజ్ఞగుండములు; బ్రాహ్మణైః = బ్రాహ్మణులచే; తత్ర = అక్కడ; కుశలైః = నిపుణులైన; శుల్బ కర్మణి = శుల్బ (ఒంటి పేట తాడు)తో కర్మణి (కొలతలు వేయు పనిలో).

భావము:

యజ్ఞగుండములు వాస్తు కొలతలను నిర్దేశించు శుల్బశాస్త్ర ప్రకారము కొలతలు వేసి, నిర్మాణము చేయుటలో నిపుణులైన బ్రాహ్మణులు ఇటుకలతో నిర్మించిరి.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స చిత్యో రాజసింహస్య
 సంచితః కుశలైర్ద్విజైః ।
గరుడో రుక్మపక్షో వై
 త్రిగుణోఽ ష్టాదశాత్మకః ॥

టీకా:

స = సహితమైనది; చిత్యః = హోమాగ్ని; రాజసింహ = రాజులలో ఉత్తముడైన దశరథుడు; అస్య = యొక్క; సంచితః = అమర్చబడిన; కుశలైః = నిష్ణాతులు; ద్విజైః = బ్రాహ్మణులు; గరుడః = గరుడాకారమైన అగ్నివేదిక; రుక్మపక్షః = బంగారు రెక్కలు గల; త్రిగుణః = హొమగుండానికి వాడే ఆఱు వరుసలకు మూడు రెట్లు; అష్టాదశాత్మకః = పదునెనిమిది వరుసలుగా.

భావము:

రాజశ్రేష్టుడైన దశరథునికొఱకు నిష్ణాతులైన బ్రాహ్మణులు హోమగుండమును బంగారు రెక్కులుగల గరుడాకారములో శోభిల్లునట్లు పదునెనిమిది వరుసలుగా ఇటుకలు పేర్చి నిర్మించిరి.
*గమనిక:-  1. సాధారణంగా హోమగుండానికి ఆఱు వరుసల ఇటుకలు వాడుతారు. దానికి మూడు రెట్లు అనగా పద్దెనిమిది వరుసలు వాడారు. అశ్వమేధములో హోమగుండా నికి చుట్టూ గరుడాకారములో నిర్మింతురు. ఆ గరుత్మంతుడు తూర్పుముఖముగా ఉండును. రెక్కలు, పుచ్చము (తోక) పూర్తిగా విప్పుకుని తలవంచి క్రిందకు చూచుచున్నట్లు ఉండును. ఇట్లు ఇటుకలు పేర్చుటకు చయనము అని పేరు. అందు వరుసలు వేయుటను ప్రస్తారము అందురు. వాజసనేయ శాఖా శుక్ల యజుర్వేదాది ఇతర యజ్ఞములలో ఆరు ప్రస్తారములు వేయుదురు. అశ్వమేధములో దానికి ఆరు రెట్లు అనగా పద్దెనిమిది (18) ప్రస్తారములు వేయుదురు. చిత్య అనగా చయనము చేసిన గుండములోని అగ్ని. 2. గరుడుని బంగారు వర్ణం ఱెక్కలు వలె ఇవి శోభిల్లుతున్నాయి

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియుక్తాస్తత్ర పశవః
 తత్తదుద్దిశ్య దైవతమ్ ।
ఉరగాః పక్షిణశ్చైవ
 యథాశాస్త్రం ప్రచోదితాః ॥

టీకా:

నియుక్తాః = కట్టబడినవి; తత్ర = అక్కడ; పశవః = పశువులు; తత్తత్ = ఆ యా; ఉద్దిశ్య = ఉద్దేశించి; దైవతమ్ = దేవతలను; ఉరగాః = సర్పములు; పక్షిణః = పక్షులును; చైవ = ఇంకా; యథాశాస్త్రమ్ = శాస్త్ర ప్రకారముగా; ప్రచోదితః = విహితముగా.

భావము:

శాస్త్రములో చెప్పబడినట్లు ఆ యా దేవతలకు తగిన పశువులను; పాములను; పక్షులను సిద్ధముగా ఉంచిరి.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శామిత్రే తు హయస్తత్ర
 తథా జలచరాశ్చ యే ।
ఋత్విగ్భిః సర్వమేవైతత్
 నియుక్తం శాస్త్రతస్తదా ॥

టీకా:

శామిత్రే = శాంతింపజేయు / బలిచ్చు; తు; హయః = గుఱ్ఱములను; తత్ర = అక్కడ; తథా = మరియు; జలచరాః = తాబేలు వంటి జలరాలు; చయే = సమూహములను; ఋత్విగ్భిః = ఋత్విక్కులచే; సర్వమే = అన్నియు; వై = సిద్ధంగా; తత్ = వాటి; నియుక్తమ్ = బంధించబడెను; శాస్త్రతః = శాస్త్రానుసారముగా; తదా = అప్పుడు.

భావము:

పశుబలి చేయవలసిన సమయము వచ్చినప్పుడు, ఋత్విక్కులు శాస్త్రానుసారము గుఱ్ఱములు, తాబేలు, చేపలు వంటి జలచరములు వంటి వాటిని అన్నింటిని యూపస్తంభములకు కట్టిరి.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పశూనాం త్రిశతం తత్ర
 యూపేషు నియతం తదా ।
అశ్వరత్నోత్తమం తత్ర
 రాజ్ఞో దశరథస్య చ ॥

టీకా:

పశూనామ్ = పశువులు; త్రిశతమ్ = మూడువందలు; తత్ర = అక్కడ; యూపేషు = యూపస్తంభములయందు; నియతమ్ = కట్టబడెను; తదా = అప్పుడు; అశ్వ = గుఱ్ఱములలో; రత్నః = రత్నంవంటిది; ఉత్తమమ్ = శ్రేష్ఠమైనది; తత్ర = అక్కడ; రాజ్ఞః = రాజుగారి యొక్క; దశరథ = దశరథులు; అస్య = యొక్క; చ.

భావము:

అప్పుడు అలా మూడు వందల పశువులను; దశరథమహారాజువారి యొక్క ఉత్తమోత్తమమైన గుఱ్ఱమును అక్కడ బంధించిరి.

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కౌసల్యా తం హయం తత్ర
 పరిచర్య సమంతతః ।
కృపాణైర్విశశాసైనం
 త్రిభిః పరమయా ముదా ॥

టీకా:

కౌసల్యా = కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురు; తమ్ = ఆ; హయమ్ = గుఱ్ఱమును; తత్ర = అక్కడ; పరిచర్య = పూజాది ఉపచారములు చేసి; సమంతతః = అంతటికి; కృపాణైః = బంగారు సూదులతో; విశశాసైనమ్ = బలిచేయుటకైన గుర్తులు పెట్టిరి; త్రిభిః = మూడు; పరమయా = పరమ; ముదా = సంతోషముతో.

భావము:

యజమాని భార్యలు కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురూ ఆ యజ్ఞాశ్వమునకు పూజాది ఉపచారములు ప్రదక్షిణలు చేసిరి. మిక్కిలి సంతోషముగా దానికి మూడుసూదులతో బలిచేయుటకైన గుర్తులు పెట్టిరి.

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పతత్రిణా తదా సార్దం
 సుస్థితేన చ చేతసా ।
అవసద్రజనీమేకాం
 కౌసల్యా ధర్మకామ్యయా ॥

టీకా:

పతత్రిణా = గుఱ్ఱముతో; తదా = అప్పుడు; సార్థమ్ = కలసి; సుస్థితేన = స్థిరమైన; చేతసా = చిత్తముతో; అవసత్ = నివసించెను; రజనీమ్ = రాత్రి; ఏకామ్ = ఒక; కౌసల్యా = కౌసల్యాదేవి; ధర్మకామ్యయా = ధర్మబద్ధముగా.

భావము:

ఆ విశశాసైనం పిమ్మట, ధర్మబద్ధముగా దృఢచిత్తముతో కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురూ ఒక రాత్రి ఆ యజ్ఞాశ్వముతో కలిసి నివసించిరి.
*గమనిక:-   *- పతత్రిణ - పక్షివలె వడిగా పోవునది, గుఱ్ఱము

1-33-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హోతాధ్వర్యుస్తథోద్గాతా
 హస్తేన సమయోజయన్ ।
మహిష్యా పరివృత్త్యా చ
 వావాతామపరాం తథా ॥

టీకా:

హోతా = ఋగ్వేద తంత్రము నడుపువాడు; అధ్వర్యుః = యజుర్వేద తంత్రము నడుపువాడు; తథా = మరియు; ఉద్గాతా = సామవేద తంత్రము నడుపువాడు; హస్తేన = చేతితో; సమయోజయన్ = చక్కగా సంధానము చేసిరి, గ్రహించిరి; మహిష్యాః = పట్టపురాణులతో; పరివృత్యా = ఉపేక్షితల తోను; చ; వావాతాం = భోగినల తోను; ఆపరామ్ = ఇతరులను; తథా = అటులనే.

భావము:

దశరథునిచే వివాహమాడిన భార్యలలో పట్టాభిషేకము పొందిన పట్టపురాణులను; వివాహమాడినను పట్టాభిషేకము పొందని భార్య ఉపేక్షితలను; (తన) ఉంపుడుకత్తె వావాతలను; అలాగా మఱి ఇతరస్త్రీలను యజ్ఞములో పాల్గొను హోత; అధ్వర్యుడు; ఉద్గాత ఋత్విక్కులు చేపట్టిరి అనగా స్వీకరించిరి.
*గమనిక:-  మహిషిఅంటే రాజుతోపాటు పట్టాభిషేకము పొందిన భార్య, పరివృత్య అంటే ఉపేక్షింపబడిన భార్య, వావాత అంటే భోగినీ స్త్రీ / ఉంపుడుగత్తె, పాలాకలి అంటే పాత్ర అందించునది. (కృతాభిషేకా మహిషీ, పరివృత్యరుపేక్షితా, వావాతా భోగినీ, పాత్రాప్రదా పాలాకలీ - వైజయంతి). అశ్వమేధ యాగములో యజమాని ఈ నలుగురు స్త్రీలను నలుగురు స్త్రీలకు దక్షిణగా ఇవ్వవలె నట. వారు వాళ్ళను గ్రహించి, వారికి బదులుగా మరొక వస్తువు తీసుకుని, తిరిగి యజమానికి ఇచ్చివేయుదు రట. ఈ శ్లోకములో బ్రహ్మ అనే ఋత్విక్కును పాలాకలిని చెప్పకపోయినను చెప్పినట్లే గ్రహించవలయును అని గోవింజరాజులు వారు వ్రాసిరి. సౌజన్యము పుల్లెల శ్రీరామ చంద్రుడు వారి శ్రీమద్రామాయణము

1-34-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పతత్రిణస్తస్య వపాం
 ఉద్ధృత్య నియతేంద్రియః ।
ఋత్విక్ పరమసంపన్నః
 శ్రపయామాస శాస్త్రతః ॥

టీకా:

పతత్త్రిణః = అశ్వము యొక్క; తస్య = ఆ; వపామ్ = వపను; ఉద్ధృత్య = తీసి; నియతేంద్రియః = ఇంద్రియ నిగ్రహము కలవాడు; ఋత్విక్ = ఋత్విక్కు; పరమసంపన్నః = శాస్త్రజ్ఞానము బాగుగా తెలిసియున్నవాడు; శ్రపయామాస = వండెను; శాస్త్రతః = శాస్త్రవిధముగా.

భావము:

ఇంద్రియనిగ్రహము, శాస్త్రజ్ఞానము మెండుగా కలవాడు ఐన ఋత్విక్కు ఆ అశ్వము యొక్క వపను (బొడ్డుక్రింద ఉండు కొవ్వుపొరను) శాస్త్రప్రకారముగా తీసి వండెను.

1-35-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధూమగంధం వపాయాస్తు
 జిఘ్రతి స్మ నరాధిపః ।
యథాకాలం యథాన్యాయం
 నిర్ణుదన్ పాపమాత్మనః ॥

టీకా:

ధూమ = పొగ యొక్క; గంధమ్ = వాసన; వపాయాః = వప యొక్క; జిఘ్రతి = వాసన చూచుట; స్మ = చేసెను; నరాధిపః = రాజు; యథాకాలమ్ = కాలానుగుణముగా; యథాన్యాయమ్ = పద్ధతి ప్రకారము; నిర్ణుదన్ = తొలగించుకొనుచు; పాపమ్ = పాపమును; ఆత్మనః = తన యొక్క.

భావము:

కాలానుగుణంగా, పద్ధతి ప్రకారము దశరథుడు తన పాపమును తొలగించుకొనుటకు వపను వండుచుండగా వచ్చెడు పొగను వాసన చూచెను.

1-36-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హయస్య యాని చాంగాని
 తాని సర్వాణి బ్రాహ్మణాః ।
అగ్నౌ ప్రాస్యంతి విధివత్
 సమంత్రాః షోడశర్త్విజః ॥

టీకా:

హయస్య = గుఱ్ఱము యొక్క; యాని = ఏ; అఙ్గాని = అవయవములను; తాని = వాటిని; సర్వాణి = అన్నింటిని; బ్రాహ్మణాః = బ్రాహ్మణులు; అగ్నౌ = అగ్నియందు; ప్రాస్యంతి = హోమము చేసిరి; విధివత్ = యథావిధిగా; స = సహితముగా; మంత్రాః = వేదమంత్రములతో; షోడశ = పదహారుగురు; ఋత్విజః = ఋత్విక్కులు / యజమాని నుండి ధనము పుచ్చుకుని యజ్ఞము చేయించువాడు.

భావము:

ఋత్విక్కులైన పదహారుగురు యాజికులు; యజ్ఞాశ్వము యొక్క వివిధ అవయవములను; వేదమంత్రోచ్చారణ చేయుచు అగ్నిలో వేసిరి.
*గమనిక:-   1. బ్రహ్మ, సహాయకులు,2. బ్రాహ్మణాచ్ఛంసుడు, 3. పోతుడు, 4. అగ్నీధ్రుడు; 5. ఉద్గాత, సహాయకులు, 6. ప్రస్తోతుడు, 7. ప్రతిహర్తుడు, 8. సుబ్రహ్మణ్యుడు; 9. హోత రూపాంతరం హోత్రి సహాయకులు,10. మైత్రావరుడు, 11. అచ్చావాకుడు, 12. గ్రావస్తుడు; 13.అధర్వుడు, సహాయకులు, 14. ప్రతిప్రస్థాతుడ, 15. నేష్టుడు, 16. ఉన్నేత,.

1-37-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్లక్షశాఖాసు యజ్ఞానాం
 అన్యేషాం క్రియతే హవిః ।
అశ్వమేధస్య యజ్ఞస్య
 వైతసో భాగ ఇష్యతే ॥

టీకా:

ప్లక్ష = జువ్వి చెట్టు యొక్క; శాఖాసు = కొమ్మలయందు; యజ్ఞానామ్ = యజ్ఞములయొక్క; అన్యేషామ్ = ఇతరములైన; క్రియతే హవిః = హవిస్సు ఉంచబడును; అశ్వమేధ = అశ్వమేధము; అస్య = అను; యజ్ఞ = యజ్ఞము; అస్య = నకు చెందిన; వైతసః = ప్రబ్బలి తీగలతో సంస్కరించబడునదిగ; భాగః = హవిర్భాగము; ఇష్యతే = విధింపబడుచున్నది.

భావము:

అశ్వమేధ యజ్ఞమునందు మాత్రము హవిస్సును ప్రబ్బలి తీగలపై ఉంచి సంస్కరింపవలెను. ఇతర యజ్ఞములందు హవిస్సును జువ్వి కొమ్మలపై ఉంచి సంస్కరించవలెను.

1-38-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్ర్యహోఽ శ్వమేధః సంఖ్యాతః
 కల్పసూత్రేణ బ్రాహ్మణైః ।
చతుష్టోమమహస్తస్య
 ప్రథమం పరికల్పితమ్ ॥

టీకా:

త్రిః = మూడు; అహః = దినములు; అశ్వమేధః = అశ్వమేధ యజ్ఞము; సంఖ్యాతః = సూచింపబడినది; కల్పసూత్రేణ = కల్పసూత్రములందు; బ్రాహ్మణైః = వేదవిభాగులైన బ్రాహ్మణములలోని; చతుష్టోమః = చతుష్టోమము ; అహః = దినము; తస్య = దానియొక్క; ప్రథమమ్ = మొదటి; పరికల్పితమ్ = సమకూర్చబడినది.

భావము:

వేదవిభాగమైన ‘బ్రాహ్మణములలోని కల్పసూత్రము’లందు ‘అశ్వమేధ యాగము’ మూడు దినములలో చేయ వలసినదిగ సూచింపబడినది. ‘మొదటి దినము’ చేయు క్రతువు ‘చతుష్టోమము’.
*గమనిక:-  *- చతుష్టోమము, ఉక్థ్యము, అతిరాత్రము అను యాగములు : సోమయాగ విశేషములు.

1-39-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉక్థ్యం ద్వితీయం సంఖ్యాతం
 అతిరాత్రం తథోత్తరమ్ ।
కారితాస్తత్ర బహవో
 విహితాః శాస్త్రదర్శనాత్ ॥

టీకా:

ఉక్థ్యమ్ = ఉక్థ్యమని పేరుగల యాగము; ద్వితీయమ్ = రెండవది; సఙ్ఖ్యాతమ్ = సూచింప బడినది; అతిరాత్రమ్ = అతిరాత్రమను యాగము; తత్ = దాని; ఉత్తరమ్ = తరువాతది; కారితాః = చేయింపబడినవి; తత్ర = అక్కడ; బహవః = అనేక క్రతువులు; విహితాః = విధింపబడిన విధముగ; శాస్త్ర = శాస్త్రములు; దర్శనాత్ = సూచింపబడిన.

భావము:

రెండవ దినమున చేయునది “ఉక్థ్యము”, మూడవ దినమున చేయునది “అతిరాత్రము”. శాస్త్రములందు శాస్త పరిశీలన చేసి ఆయా క్రతువులకు సూచింపబడిన విధముగా అనేక ఇతర క్రతువులను కూడ దశరథుడు నిర్వహించెను.

1-40-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్యోతిష్టోమాయుషీ చైవమ్
 అతిరాత్రౌ వినిర్మితౌ ।
అభిజిద్విశ్వజిచ్చైవమ్
 ఆప్తోర్యామో మహాక్రతుః ॥

టీకా:

జ్యోతిష్టోమః = జ్యోతిష్టోమ యాగము; ఆయుషీః : అయుష్ కర్మము; చ; ఏవమ్ = మరియు; అతిరాత్రౌ = అతిరాత్ర యాగములను; వినిర్మితౌ = నిర్వహింపబడినవి; అభిజిత్ = అభిజిత్ అను యాగము; విశ్వజిత్ = విశ్వజిత్ అను యాగము; ఆప్తోర్యామః = ఆప్తోర్యామము అనబడు యాగము; మహాక్రతుః = మహాక్రతువులు.

భావము:

జ్యోతిష్టోమ యాగము. ఆయుష్ హోమము, అతిరాత్ర యాగము, అభిజిత్, విశ్వజిత్ యాగములు, ఆప్తోర్యామ యాగము అను మహాక్రతువులు కూడా చేయబడినవి.
*గమనిక:-  *-1) జ్యోతిష్టోమము - 1. స్వర్గ కాముడు చేయవలసిన ఒక యజ్ఞము, 2. సోమయాగము. వ్యుత్పత్తి. జ్యోతీస్ = త్రివృదాదయః - స్తోమాః అస్య - జ్యోతిస్ + స్తోమ - షత్వమ్ బ.వ్రీ.,విశే. జ్యోతిస్సులనగా సామవేదము నందలి స్తోత్రరూపములైన సామలు. అట్టి స్తోత్రములు విశేషముగా కలది కావున ఈ యజ్ఞమును జ్యోతిష్టోమము అని పేరు, ఆంధ్రశబ్దరత్నాకరము., ఇది 16 ఋత్విక్కులు వుండు యజ్ఞము. 2) ఆయుషీ - ఆయుర్వృద్ధి కరమగు హోమకార్యము, ఆంధ్రశబ్దరత్నాకరము. 3) అభిజిద్యాగము - సోమయాగ విశేషము. 4) విశ్వజిద్యాగము - సమస్త సంపదలను దక్షిణగా ఇచ్చే ఒక యాగం. (ఈ యాగానికి ఫలం స్వర్గం). 5) ఆప్తోర్యామి - దినమును యామములు గా విభజించి చేయు కర్మములు.

1-41-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాచీం హోత్రే దదౌ రాజా
 దిశం స్వకులవర్దనః ।
అధ్వర్యవే ప్రతీచీం తు
 బ్రహ్మణే దక్షిణాం దిశమ్ ॥

టీకా:

ప్రాచీమ్ = తూర్పు; హోత్రే = హోతకు; దదౌ = ఇచ్చెను; రాజా = రాజు; దిశమ్ = దిక్కును; స్వకుల వర్ధనః = తన వంశమునకు అభివృద్ధి కలుగుటకు; అధ్వర్యవే = అధ్వర్యునకు; ప్రతీచీం తు = పశ్చిమ దిక్కును; బ్రహ్మణే = బ్రహ్మకు; దక్షిణాం దిశమ్ = దక్షిణ దిక్కును.

భావము:

తన వంశము అభివృద్ధి పొందుటకై దశరథ మహారాజు తూర్పుదేశమును హోతకు, పశ్చిమదేశమును అధ్వర్యునకు, దక్షిణ దేశమును బ్రహ్మకును దానము చేసెను.

1-42-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఉద్గాత్రే వై తథోదీచీం
 దక్షిణైషా వినిర్మితా ।
హయమేధే మహాయజ్ఞే
 స్వయమ్భూవిహితే పురా ॥

టీకా:

ఉద్గాత్రే = ఉద్గాతకు; వై = తప్పక; తథ్ = ఆ యొక్క; ఉదీచీమ్ = ఉత్తర దిక్కును; దక్షిణామ్ = దక్షిణగా; ఏషా = ఈ; వినిర్మితా = నిర్మింపబడినది; హయమేధే మహాయజ్ఞే = అశ్వమేధ మహాయజ్ఞమునందు; స్వయమ్భూవిహితే = బ్రహ్మచే నిర్ణయింపబడిన; పురా = పూర్వము.

భావము:

ఉత్తరము వైపు దేశమును ఉద్గాతకు దానము చేసెను. పూర్వము అశ్వమేధ యాగములో ఈ విధముగా దక్షిణగా ఈయ వలెనని బ్రహ్మచే నిర్ణయింపబడెను.

1-43-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రతుం సమాప్య తు తథా
 న్యాయతః పురుషర్షభః ।
ఋత్విగ్భ్యో హి దదౌ రాజా
 ధరాం తాం క్రతువర్దనః ॥

టీకా:

క్రతుమ్ = క్రతువును; సమాప్య = పూర్తి చేసి; తథా = ఆ విధముగా; న్యాయతః = శాస్త్రానుసారముగా; పురుషర్షభః = పురుషశ్రేష్టుడైన; ఋత్విగ్భ్యః = ఋత్విక్కులకు; దదౌ = దానము చేసెను; రాజా = రాజు; ధరాం = భూమిని; తాం = దానిని; క్రతువర్ధనః = క్రతువును పరిపూర్ణము చేయుటకు.

భావము:

పురుషశ్రేష్ఠుడైన దశరథ మహారాజు ఆ అశ్వమేధయాగమును పూర్తి చేసి, దాని ఫలము పరిపూర్ణముగా లభించుటకు తన రాజ్యమునంతను ఋత్విక్కులకు దానము చేసెను.

1-44-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋత్విజశ్చాబ్రువన్ సర్వే
 రాజానం గతకల్మషమ్ ।
భవానేవ మహీం కృత్స్నామ్
 ఏకో రక్షితుమర్హతి ॥

టీకా:

ఋత్విజః తు = ఋత్విక్కులైతే; తు; అబ్రువన్ = పలికిరి; సర్వే = అందరు; రాజానమ్ = రాజుతో; గతకల్మషమ్ = పాపరహితుడైన; భవాన్ = నీవు; ఏవ = మాత్రమే; మహీమ్ = భూమిని; కృత్స్నామ్ = సమస్తమైన; ఏకః = ఒక్కడివి; రక్షితుమ్ = రక్షించుటకు; అర్హతి = యోగ్యుడవు.

భావము:

అంతట ఆ ఋత్విక్కులందరును పాపరహితుడైన దశరథునితో "ఈ భూమి నంతటినీ రక్షించుటకు నీవు మాత్రమే యోగ్యుడవు"అని పలికిరి.

1-45-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న భూమ్యా కార్యమస్మాకం
 న హి శక్తాః స్మ పాలనే ।
రతాః స్వాధ్యాయకరణే
 వయం నిత్యం హి భూమిప ॥

టీకా:

న = లేదు; భూమ్యా = భూమిచే; కార్యమ్ = పని; అస్మాకమ్ = మాకు; న = కాము; హి = తప్పక; శక్తాఃస్మ = సమర్థులము; పాలనే = పాలించుటకు; రతాః = ఆసక్తులము; స్వాధ్యాయ = స్వాధ్యాయము; కరణే = చేయుటయందు; వయమ్ = మేము; నిత్యమ్ = ఎల్లవేళల; భూమిప = రాజా.

భావము:

"ఓ దశరథ మహారాజా! మాకు ఈ భూమితో పనిలేదు. భూపాలన చేయుటలో మేము అశక్తులము. మేము నిత్యము స్వాధ్యాయము చేయుటయందు మాత్రమే ఆసక్తి కలవారము."

1-46-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిష్క్రయం కించిదేవేహ
 ప్రయచ్ఛతు భవానితి ।
మణిరత్నం సువర్ణం వా
 గావో యద్వా సముద్యతమ్ ॥

టీకా:

నిష్క్రయమ్ = మాఱు మూల్యము; కిఞ్చిత్ = ఇంచుక; ఏవ = మాత్రము; ఇహ = ఈ విషయమున; ప్రయచ్ఛతు = ఒసగుము; భవాన్ = నీవు; ఇతి = ఇది; మణిరత్నమ్ = శ్రేష్ఠమైన మణులు; సువర్ణమ్ = బంగారము; వా = గానీ; గావః = ఆవులు; యద్వా = ఏది; సముద్యతమ్ = సిద్ధముగా నున్నదో.

భావము:

రాజా! నీవు మాకు దానము చేసిన ఈ భూమికి బదులుగా దీనికి సమానమైన జాతి రత్నములుగాని, మణులు గాని, బంగారముగాని, ఆవులుగాని సిద్ధముగా ఉన్నవి ఏవైనా ఇమ్ము.

1-47-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తత్ప్రయచ్ఛ నరశ్రేష్ఠ
 ధరణ్యా న ప్రయోజనమ్" ।
ఏవముక్తో నరపతిః
 బ్రాహ్మణైర్వేదపారగైః ॥

టీకా:

తత్ = అది; ప్రయచ్ఛ = ఇమ్ము; నరశ్రేష్ఠ = మానవోత్తమా; ధరణ్యా = భూమితో; న = లేదు; ప్రయోజనమ్ = ప్రయోజనము; ఏవమ్ = ఈ విధముగా; ఉక్తమ్ = పలికి; నరపతిః = రాజు; బ్రాహ్మణైః = బ్రాహ్మణులచే; వేదపారగైః = వేదపారంగతులైన.

భావము:

"రాజా మాకు ఈ భూమితో ప్రయోజనము లేదు" అని వేదపారంగతులైన ఆ బ్రాహ్మణులు దశరథునితో పలికిరి.

1-48-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గవాం శతసహస్రాణి
 దశ తేభ్యో దదౌ నృపః ।
శతకోటీః సువర్ణస్య
 రజతస్య చతుర్గుణమ్ ॥

టీకా:

గవామ్ = గోవులను; శతసహస్రాణి దశ = పది లక్షలు; తేభ్యః = వారికి; దదౌ = ఇచ్చెను; నృపః = రాజు; శతకోటిః = వంద కోట్లు; సువర్ణస్య = బంగారపు; రజతస్య = వెండివి; చతుర్గుణమ్ = నాలుగు రెట్లు.

భావము:

వారి మాటలు విని పది లక్షల ఆవులను, వంద కోట్ల బంగారు నాణెములను, నాలుగు వందల కోట్ల వెండి నాణెములను, ఆ ఋత్విక్కులకు దశరథుడు ఇచ్చెను.

1-49-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋత్విజస్తు తతః సర్వే
 ప్రదదుః సహితా వసు ।
ఋశ్యశృంగాయ మునయే
 వసిష్ఠాయ చ ధీమతే ॥

టీకా:

ఋత్విజః = ఋత్విక్కులును; తు; తతః = తరువాత; సర్వే = అందరును; ప్రదదుః = ఇచ్చిరి; సహితాః = కలిసి; వసు = ధనమును; ఋశ్యశృఙ్గాయ = ఋశ్యశృంగ; మునయే = మునికి; వసిష్ఠాయ = వసిష్ఠునకు; చ; ధీమతే = బుద్ధిమంతుడైన.

భావము:

ఆ ఋత్విక్కులందరు కలిసి దశరథుని నుండి స్వీకరించిన ఆ మొత్తము ధనమును ఋశ్యశృంగునికి, వసిష్ఠునికి ఇచ్చివేసిరి.

1-50-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతస్తే న్యాయతః కృత్వా
 ప్రవిభాగం ద్విజోత్తమాః ।
సుప్రీతమనసస్సర్వే
 ప్రత్యూచుర్ముదితా భృశమ్ ॥

టీకా:

తతః = తరువాత; తే = ఆ; న్యాయతః = న్యాయముగా; కృత్వా = చేసి; ప్రవిభాగమ్ = పంపకమును; ద్విజోత్తమాః = బ్రాహ్మణోత్తములు; సుప్రీత మనసః = సంతుష్టాంతరంగులై; సర్వే = అందరు; ప్రత్యూచుః = తిరిగి పలికిరి; ముదితాః = సంతోషించినాము; భృశమ్ = మిక్కిలి.

భావము:

తరువాత సంతోషాంతరంగులైన ఆ బ్రాహ్మణోత్తము లందరును ఆ ధనమునంతటిని న్యాయముగా పంచుకొని "చాల ఆనందించినాము" అని పలికిరి.

1-51-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః ప్రసర్పకేభ్యస్తు
 హిరణ్యం సుసమాహితః ।
జామ్బూనదం కోటిసంఖ్యం
 బ్రాహ్మణేభ్యో దదౌ తదా ॥

టీకా:

తతః = తరువాత; ప్రసర్పకేభ్యః = చూచుటకై వచ్చిన; హిరణ్యమ్ = బంగారము; సుసమాహితః = శ్రద్ధ; గౌరవములతో; జమ్బూనదమ్ = బంగారమును; కోటి సఙ్ఖ్యమ్ = కోటి సంఖ్య గల; బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకు; దదౌ = ఇచ్చెను; తదా = అప్పుడు.

భావము:

తరువాత అశ్వమేధ యాగమును చూచుటకు వచ్చిన బ్రాహ్మణులకు దశరథుడు గౌరవమర్యాదలతో కోటి బంగారు నాణెములను దానము చేసెను.

1-52-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దరిద్రాయ ద్విజాయాథ
 హస్తాభరణముత్తమమ్ ।
కస్మైచిద్యాచమానాయ
 దదౌ రాఘవనందనః ॥

టీకా:

దరిద్రాయ = బీదవాడైన; ద్విజాయ = బ్రాహ్మణునకు; అథ = ఆ తరువాత; హస్తాభరణమ్ = కంకణము; ఉత్తమమ్ = ఉత్తమమైన; కస్మై చిత్ = ఒకానొక; యాచమానాయ = యాచించుచున్న; దదౌ = ఇచ్చెను; రాఘవ నందనః = దశరథుడు.

భావము:

తరువాత ఒక బ్రాహ్మణ యాచకుడు అక్కడికి రాగా దశరథుడు గొప్పదైన తన ముంజేతి కంకణము నొక దానిని దానము చేసెను.

1-53-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః ప్రీతేషు నృపతిః
 ద్విజేషు ద్విజవత్సలః ।
ప్రణామమకరోత్తేషామ్
 హర్షపర్యాకులేక్షణః ॥

టీకా:

తతః = తరువాత; ప్రీతేషు = సంతోషించిన; నృపతిః = రాజు; ద్విజేషు = బ్రాహ్మణులను; ద్విజ = బ్రాహ్మణులయందు; వత్సలః = వాత్సల్యము గల; ప్రణామమ్ = నమస్కారము; అకరోత్ = చేసెను; తేషామ్ = వారికి; హర్ష = ఆనందముతో; పర్యాకుల = నిండిన; ఈక్షణః = చూపులతో.

భావము:

బ్రాహ్మణులయందు దయాగుణము కలవాడైన దశరథుడు వారందరు సంతృప్తి చెందినారని తెలిసి, బ్రాహ్మణులను సంతోషకరముగా చూచుచు నమస్కరించెను.

1-54-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తస్యాశిషోఽ థ విధివత్
 బ్రాహ్మణైః సముదాహృతాః ।
ఉదారస్య నృవీరస్య
 ధరణ్యాం ప్రణతస్య చ ॥

టీకా:

తస్య = అతనికి; ఆశిషః = ఆశీర్వచనములు; అథ = తరువాత; విధివత్ = యథాశాస్త్రముగా; బ్రాహ్మణైః = బ్రాహ్మణులచే; సముదాహృతాః = వచింపబడినవి; ఉదార = దానగుణశీలుడు; అస్య = ఐనవాడు; నృవీర = మానవవీరుడు; అస్య = ఐనవాడు; ధరణ్యామ్ = భూమిపై; ప్రణత = వంగి నమస్కారము చేసిన; అస్య = ఐనవాడు; చ.

భావము:

దానగుణశీలుడు వీరుడు ఐన దశరథమహారాజు వారందరికీ సాష్టాంగ ప్రణామములు చేయుచుండగా వారు ఆ మహారాజును శాస్త్రానుసారముగా ఆశీర్వదించిరి.

1-55-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః ప్రీతమనా రాజా
 ప్రాప్య యజ్ఞమనుత్తమమ్ ।
పాపాపహం స్వర్నయనం
 దుష్కరం పార్థివర్షభైః ॥

టీకా:

తతః = తరువాత; ప్రీతః = సంతోషించిన; మనాః = మనసు కలవాడై; రాజా = రాజు; ప్రాప్య = పొంది; యజ్ఞమ్ = యజ్ఞము; అనుత్తమమ్ = అసమానమైన; పాప = పాపములను; అపహమ్ = పోగొట్టునది; స్వర్గః = స్వర్గమును; నయనమ్ = పొందించునది; దుష్కరమ్ = సులభముగా పొందలేనిది; పార్థివర్షభైః = శ్రేష్ఠులైన రాజులచేత కూడ.

భావము:

అశ్వమేధయాగము సకల పాపములను తొలగించును. స్వర్గప్రాప్తిని కలుగజేయును. గొప్ప రాజులుకూడ చేయలేనటువంటి అసమానమైన అశ్వమేధయాగమును దశరథుడు సంపూర్ణముగా నిర్వహించి సంతోషించెను.

1-56-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతోఽ బ్రవీదృశ్యశృంగం
 రాజా దశరథస్తదా ।
కులస్య వర్దనం త్వం తు
 కర్తుమర్హసి సువ్రత!" ॥

టీకా:

తతః = తరువాత; అబ్రవీత్ = పలికెను; ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగునితో; రాజా = రాజు; దశరథః = దశరథుడు; తదా = అప్పుడు; కులస్య = కులమును; వర్ధనమ్ = వృద్ధి చేయు కార్యమును; త్వమ్ = నీవు; కర్తుమ్ = చేయుటకు; అర్హసి = తగిన వాడవు; సువ్రత = మంచి వ్రతములు చేసిన వాడా.

భావము:

తరువాత; "ఓ మహామునీ! మా వంశాభివృద్ధికై తగిన కార్యము చేయగల సమర్థుడవు నీవు. కావున నీవు అట్టి కార్యమును చేయుము" అని ఋశ్యశృంగుని దశరథుడు వేడెను.

1-57-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథేతి చ స రాజానం
 ఉవాచ ద్విజసత్తమః ।
భవిష్యంతి సుతా రాజన్!
 చత్వారస్తే కులోద్వహాః" ॥

టీకా:

తథేతి = అటులనే అని; చ; రాజానమ్ = రాజు గురించి; ఉవాచ = పలికెను; ద్విజసత్తమః = బ్రాహ్మణోత్తముడు; భవిష్యంతి = పుట్టగలరు; సుతాః = కుమారులు; రాజన్ = రాజా; చత్వారః = నలుగురు; తే = నీకు; కులోద్వహాః = కులమును ఉద్ధరించు.

భావము:

"ఓ దశరథ మహారాజా! అటులనే చేయించెదను. నీకు కులమును ఉద్ధరించు నలుగురు కుమారులు పుట్టగలరు" అని ఋశ్యశృంగుడు పలికెను.

1-58-గద్యం.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతి ఆర్షసంప్రదాయే ఆదికావ్యే
 వాల్మీకి తెలుగు రామాయణే
బాలకాండే
 చతుర్దశః సర్గః

టీకా:

ఇతి = ఇది సమాప్తము; ఆర్షే సంప్రదాయే = ఋషిప్రోక్తమైనదీ; ఆదికావ్యే = మొట్టమొదటి కావ్యమూ; వాల్మీకి = వాల్మీకీ విరచిత; తెలుగు = తెలుగు వారి కొఱకైన; రామాయణే = రామాయణములోని; బాలకాండే = బాలకాండ లోని; చతుర్దశః [14] = పదునాల్గవ; సర్గః = సర్గ.

భావము:

ఋషిప్రోక్తమూ మొట్టమొదటి కావ్యమూ వాల్మీకి మహర్షి విరచితమూ ఐన తెలుగు వారి రామాయణ మహా గ్రంథము, బాలకాండలోని [14] పద్నాలుగవ సర్గ సుసంపూర్ణము

1-59-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తథేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః|
భవిష్యన్తి సుతా రాజంశ్చత్వారస్తే కులోద్వహాః||

1-60-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇత్యార్షే వాల్మీకి తెలుగు రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుర్దశస్సర్గః||