వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

బాలకాండమ్ : ॥దశమః సర్గః॥ [10 ఋశ్యశృంగుని అంగదేశాగమనం]

  •  
  •  
  •  

1-1-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుమంత్ర శ్చోదితో రాజ్ఞా
 ప్రోవాచేదం వచస్తథా ।
“యథర్శ్యశృంగస్త్వానీతః
 శృణు మే మంత్రిభిః స హ ॥

టీకా:

సుమంత్రః = సుమంత్రుడు; చ; చోదితః = ప్రేరేపించబడినవాడై; రాజ్ఞా = రాజు చేత; ప్రోవాచ = పలికెను; ఇదమ్ వచః = ఈ వాక్యమును; తథా = ఆ విధముగ; యథా = ఏ విధముగ; ఋశ్యశృంగః = ఋష్యశృంగః తు = ఋష్యశృంగుడు; అనీతః = రప్పించిన రీతి; శృణు = వినుము; మే = నేను; మంత్రిభిః = మంత్రులు; స = ఆ యొక్క; హ.

భావము:

దశరథ మహారాజు అలా ప్రశ్నింపగా, సుమంత్రుడు ఇట్లు పలికెను.”ఆ మంత్రులు ఋష్యశృంగుని ఎట్లు రప్పించితిరో చెప్పెదను. వినుము.

1-2-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రోమపాదమువాచేదం
 సహామాత్యః పురోహితః ।
ఉపాయో నిరపాయోఽ యమ్
 అస్మాభిరభిచింతితః ॥

టీకా:

రోమపాదమ్ = రోమపాదుని గూర్చి; ఉవాచ = పలికెను; ఇదమ్ = ఈ; సహ = కూడి ఉన్న; ఆమాత్యః = మంత్రులతో; పురోహితః = పురోహితులు; ఉపాయః = ఉపాయము; నిరపాయః = అపాయము లేనిది; అయం = ఈ; అస్మభిః = మా చేత; అభిచింతితః = ఆలోచించబడినది.

భావము:

పురోహితులు మంత్రులతో కలసి రోమపాదునితో ఇట్లు పలికెను. “మేము అపాయము లేని ఈ ఉపాయమును ఆలోచించితిమి.

1-3-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋశ్యశృంగో వనచరః
 తపఃస్వాధ్యాయనే రతః ।
అనభిజ్ఞః స నారీణాం
 విషయాణాం సుఖస్య చ ॥

టీకా:

ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; వనచరః = వనములో తిరుగువాడు; తపః = తపస్సులోను; స్వాధ్యాయనే = స్వాధ్యాయము లందే; రతః = ఆసక్తి కలవాడు; అనభిజ్ఞః = ఎఱుగనివాడు; సః = అతడు; నారీణామ్ = స్త్రీలగురించి; విషయాణామ్ = విషయ భోగముల గురించి; సుఖస్య = స్త్రీ సుఖముల గురించి; చ = కూడా.

భావము:

ఋశ్యశృంగుడు అడవులలో తిరుగువాడు. తపస్సు, స్వాధ్యాయనము లందే ఆసక్తి గలవాడు. స్త్రీల గురించి కాని, విషయసుఖముల గురించి కాని, స్త్రీసౌఖ్యముల గురించి కాని ఎఱుగనివాడు.

1-4-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంద్రియార్థైరభిమతైః
 నరచిత్తప్రమాథిభిః ।
పురమానాయయిష్యామః
 క్షిప్రం చాధ్యవసీయతామ్ ॥

టీకా:

ఇంద్రియార్థైః = ఇంద్రియ భోగములందు; అభిమతైః = ఇచ్చ గల; నర = మనుజుల; చిత్త = చిత్తములను; ప్రమాథిభిః = క్షోభపెట్టు; పురమ్ = పట్టణమునకు; ఆనాయయిష్యామః = రప్పించెదము; క్షిప్రమ్ చ = శీఘ్రముగా; అధ్యవసీయతామ్ = నిశ్చయింపబడుగాక

భావము:

మనుజుల మనస్సులను క్షోభపెట్టు ఇంద్రియసుఖములందలి ఇచ్చతో ప్రలోభపెట్టి, ఋశ్యశృంగుని పట్టణమునకు రప్పించెదము. శీఘ్రముగా నిర్ణయించుము.

1-5-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గణికాస్తత్ర గచ్ఛంతు
 రూపవత్యః స్వలంకృతాః ।
ప్రలోభ్య వివిధోపాయైః
 ఆనేష్యంతీహ సత్కృతాః" ॥

టీకా:

గణికాః = వేశ్యలు; తత్ర = అక్కడకు; గచ్ఛంతు = వెళ్ళెదరు (గాక); రూపవత్యః = సౌందర్యవంతులు; స్వలంకృతాః = బాగుగా అలంకరింపబడినవారు; ప్రలోభ్య = ప్రలోభపెట్టి; వివిధః = అనేక; ఉపాయైః = ఉపాయములచేత; ఆనేష్యంతి = తీసుకొనిరాగలరు; ఇహ = ఇచటకు; సత్కృతాః = సత్కరించబడినవారై

భావము:

చక్కగా అలంకరించుకొన్న రూపవతులైన వేశ్యలను సత్కరించి పంపెదము. వారు ఋశ్యశృంగుని అనేక ఉపాయములతో ప్రలోభపెట్టి ఇక్కడకు తీసుకురాగలరు.”

1-6-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుత్వా తథేతి రాజా చ
 ప్రత్యువాచ పురోహితమ్ ।
పురోహితో మంత్రిణశ్చ
 తథా చక్రుశ్చ తే తదా ॥

టీకా:

శ్రుత్వా = విని; తథా = అటులనే; ఇతి = అని; రాజా = రాజుగారు; చ = కూడ; ప్రత్యువాచ = సమాధానము పలికెను; పురోహితమ్ = పురోహితులతో; పురోహితః = పురోహితులును; మంత్రిణః = మంత్రులును; చ; తథా = అటులనే; చక్రుః = చేసిరి; చ; తే = రప్పించుట; తదా = అప్పుడు.

భావము:

రాజు రోమపాదుడు పురోహితుల ఆలోచనకు అనుమతి ఒసగెను. అపుడు వారు ఆ విధముగ ఋశ్యశృంగుని తెప్పించు ఏర్పాట్లు చేసిరి.

1-7-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారముఖ్యాస్తు తచ్ఛ్రుత్వా
 వనం ప్రవివిశుర్మహత్ ।
ఆశ్రమస్యావిదూరేఽ స్మిన్
 యత్నం కుర్వంతి దర్శనే ॥

టీకా:

వార = వేశ్యలలో; ముఖ్యాః = ప్రముఖులు; తు; తత్ = అది; శ్రుత్వా = విని; వనమ్ = అడవిని; ప్రవివిశుః = ప్రవేశించిరి; మహత్ = గొప్పదైన; ఆశ్రమస్య = ఆశ్రమము యొక్క; అవిదూరే = సమీపమునందు; అస్మిన్ = ఈ; యత్నమ్ = ప్రయత్నమును; కుర్వంతి = చేయుచుండిరి; దర్శనే = చూచుటలో.

భావము:

ఆ వాక్యము విని ప్రముఖ వేశ్యాస్త్రీలు ఆ మహారణ్యములోనికి ప్రవేశించిరి. ఆ ఆశ్రమ సమీపమున ఋష్యశృంగుని కనుగొను ప్రయత్నము చేయసాగిరి.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తా శ్చిత్రవేషాః ప్రమదా
 గాయంత్యో మధురస్వరాః ।
ఋషిపుత్ర ముపాగమ్య
 సర్వా వచన మబ్రువన్ ॥

టీకా:

తాః = వారు; చిత్రః = నానవర్మముల; వేషాః = వస్త్రభూషణాది ధారులు; ప్రమదాః = స్త్రీలు; గాయంత్యః = పాటలు పాడుచున్నవారు; మధుర = మధురమైన; స్వరాః = కంఠస్వరము కలవారు; ఋషిపుత్రమ్ = ఋషికుమారుడైన ఋశ్యశృంగుని; ఉపాగమ్య = దగ్గఱకు వచ్చి; సర్వాః = అందఱును; వచనమ్ = మాట; అబ్రువన్ = పలికిరి.

భావము:

ఆ స్త్రీలు అందఱు రంగురంగుల వస్త్రభూషణాది ధరించి, మధురమైన స్వరములతో పాటలు పాడుచు ఉన్నారు. వారు ఋశ్యశృంగుని సమీపించి ఇట్లు అడిగిరి.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్!
 జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ ।
ఏకస్త్వం విజనే ఘోరే
 వనే చరసి శంస నః" ॥

టీకా:

కః = ఎవ్వడవు; త్వం = నీవు; కిమ్ = ఎచ్చట; వర్తసే = నివసించెదవు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా!; జ్ఞాతుమ్ = తెలుసుకొనుటకు; ఇచ్ఛామహే = కోరుకొనుచున్నాము; వయమ్ = మేము; ఏకః = ఒంటరిగా; త్వమ్ = నీవు; విజనే = జనశూన్యమైన; ఘోరే = భయంకరమైన; వనే = అటవిలో; చరసి = తిరుగుచున్నావు; శంస = చెప్పుము; నః = మాకు

భావము:

“ఓ బ్రాహ్మణుడా! ఎవరు నీవు? ఎచట నివసించెదవు? నిర్జనమైన ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు సంచరించున్నావు చెప్పు? మేము తెలుసుకొన గోరుచుంటిమి.”

1-10-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతః కదాచిత్తం దేశమ్
 ఆజగామ యదృచ్ఛయా ।
విభండకసుత స్తత్ర
 తాశ్చాపశ్య ద్వరాంగనాః ॥

టీకా:

తతః = అటుపిమ్మట; కదాచిత్ = ఒక దినమున; తం = ఆ; దేశమ్ = ప్రదేశమునకు; అజగామ = వచ్చి; యదృచ్ఛయా = దైవవశమున; విభండకసుతః = విభండకుని కుమారుడైన ఋశ్యశృంగుడు; తత్ర = అచట; తాః = వారిని; చ; అపశ్యత్ = చూచెను; వరాంగనాః = శ్రేష్ఠమైన వేశ్యాస్త్రీలను

భావము:

దైవాధీనముగ అటుపై ఒకదినమున, విభండకసుతుడైన ఋశ్యశృంగుడు ఆ ప్రదేశమునకు వచ్చి ఆ వేశ్యాస్త్రీలను చూచెను.

1-11-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తా శ్చిత్రవేషాః ప్రమదా
 గాయంత్యో మధురస్వరాః ।
ఋషిపుత్ర ముపాగమ్య
 సర్వా వచన మబ్రువన్ ॥

టీకా:

తాః = వారు; చిత్రః = నానవర్మముల; వేషాః = వస్త్రభూషణాది ధారులు; ప్రమదాః = స్త్రీలు; గాయంత్యః = పాటలు పాడుచున్నవారు; మధుర = మధురమైన; స్వరాః = కంఠస్వరము కలవారు; ఋషిపుత్రమ్ = ఋషికుమారుడైన ఋశ్యశృంగుని; ఉపాగమ్య = దగ్గఱకు వచ్చి; సర్వాః = అందఱును; వచనమ్ = మాట; అబ్రువన్ = పలికిరి.

భావము:

ఆ స్త్రీలు అందఱు రంగురంగుల వస్త్రభూషణాది ధరించి, మధురమైన స్వరములతో పాటలు పాడుచు ఉన్నారు. వారు ఋశ్యశృంగుని సమీపించి ఇట్లు అడిగిరి.

1-12-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్!
 జ్ఞాతుమిచ్ఛామహే వయమ్ ।
ఏకస్త్వం విజనే ఘోరే
 వనే చరసి శంస నః" ॥

టీకా:

కః = ఎవ్వడవు; త్వం = నీవు; కిమ్ = ఎచ్చట; వర్తసే = నివసించెదవు; బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా!; జ్ఞాతుమ్ = తెలుసుకొనుటకు; ఇచ్ఛామహే = కోరుకొనుచున్నాము; వయమ్ = మేము; ఏకః = ఒంటరిగా; త్వమ్ = నీవు; విజనే = జనశూన్యమైన; ఘోరే = భయంకరమైన; వనే = అటవిలో; చరసి = తిరుగుచున్నావు; శంస = చెప్పుము; నః = మాకు

భావము:

“ఓ బ్రాహ్మణుడా! ఎవరు నీవు? ఎచట నివసించెదవు? నిర్జనమైన ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు సంచరించున్నావు చెప్పు? మేము తెలుసుకొన గోరుచుంటిమి.”

1-13-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదృష్టరూపాః తాస్తేన
 కామ్యరూపా వనే స్త్రియః ।
హార్దాత్తస్య మతిర్జాతా
 వ్యాఖ్యాతుం పితరం స్వకమ్ ॥

టీకా:

అదృష్ట = గతములో చూడబడని; రూపాః = రూపములు కలవారు; తాః = వారు; తేన = అతనిచేత; కామ్యరూపాః = కోరదగిన రూపములు కల; వనే = అడవిలో; స్త్రియః = స్త్రీలు; హార్ధాత్ = స్నేహభావ; తస్య = అతనికి; మతిః = అభిప్రాయము; జాతా = కలిగినది; వ్యాఖ్యాతుమ్ = చెప్పుటకు; పితరమ్ = తండ్రిని గుఱించి; స్వకమ్ = తన యొక్క

భావము:

ఋశ్యశృంగుడు ఇంతకు ముందెప్పుడూ ఆ అడవిలో ఇంత మనోహరమైన, ఆకర్షణీయమైన ఆ అందగత్తెలను చూడలేదు. ఆ సౌందరీమణులపై స్వేహభావము కలిగెను. కనుక వారికి ‘తన తండ్రిని గుఱించి చెప్పవలెను’ అను భావము కలిగెను.

1-14-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“పితా విభండకోఽ స్మాకం
 తస్యాహం సుత ఔరసః ।
ఋశ్యశృంగ ఇతి ఖ్యాతం
 నామ కర్మ చ మే భువి ॥

టీకా:

పితా = తండ్రి; విభండకః = విభండకుడు; అస్మాకమ్ = మా యొక్క; తస్య = అతనికి; అహమ్ = నేను; సుత = కుమారుడను; ఔరసః = ధర్మపత్నికి పుట్టినవాడను; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; ఇతి = అని; ఖ్యాతమ్ = తెలియబడు; నామ = పేరు; కర్మ = కర్మయును; చ; మే = నేను; భువి = భూమియందు

భావము:

“మా తండ్రి విభండకుడు. నేను వారి స్వంత (ఔరస) పుత్రుడను. ఋశ్యశృంగుడను సార్థక నామధేయుడను.
*గమనిక:-  *- ఋశ్య అనగా మనుబోతు అని లేడి జాతి జంతువు. శృంగ అనగా గుఱుతే కాకుండా కామోద్రేకము అను అర్థం కూడ ఉన్నది.

1-15-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇహాశ్రమపదోఽ స్మాకం
 సమీపే శుభదర్శనాః! ।
కరిష్యే వోఽ త్ర పూజాం వై
 సర్వేషాం విధిపూర్వకమ్" ॥

టీకా:

ఇహ = ఇచట; ఆశ్రమ = ఆశ్రమము; పదః = స్థానమున; అస్మాకమ్ = మా యొక్క; సమీపే = సమీపమున గలదు; శుభదర్శనాః = మంగళప్రదలారా; కరిష్యే = చేయగలను; వః = మీ; అత్ర = అచట; పూజామ్ = పూజలను; వై = నిశ్చయముగ; సర్వేషామ్ = అందరికి; విధిపూర్వకమ్ = శాస్త్రములో చెప్పబడినట్లు

భావము:

మంగళప్రదులారా ! మా ఆశ్రమము ఇచటకు సమీపములోనే ఉన్నది. రండి. అక్కడ మీ అందఱికి చక్కటి గౌరవ సత్కారములు చేసెదను.”

1-16-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఋషిపుత్రవచః శ్రుత్వా
 సర్వాసాం మతిరాస వై ।
తదాశ్రమపదం ద్రష్టుం
 జగ్ముః సర్వాశ్చ తేన తాః ॥

టీకా:

ఋషిపుత్ర వచః = ఋషికుమారుని పలుకులు; శ్రుత్వా = వినిన; సర్వాసామ్ = అందఱికీ; మతిః = మనసున; ఆస వై = ఇచ్చ; వై = కలిగినది; తత్ = ఆ; ఆశ్రమపదమ్ = ఆ ఆశ్రమమును; ద్రష్టుమ్ = చూచుటకు; జగ్ముః = వెళ్ళిరి; సర్వాః = వారందఱును; చ; తేన = అతనితో; తాః = వారు

భావము:

ఋశ్యశృంగుని ఆహ్వానము వినిన ఆ స్త్రీలందరికి మనసులో ఆ ఆశ్రమమును చూడవలెనను కోరిక కలిగినది. వారు ఆశ్రమము చూచుటకు అతనితో వెళ్ళిరి.

1-17-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆగతానాం తతః పూజామ్
 ఋషిపుత్రశ్చకార హ ।
ఇదమర్ఘ్యమిదం పాద్యమ్
 ఇదం మూలమిదం ఫలమ్" ॥

టీకా:

ఆగతానామ్ = వచ్చినవారికొఱకు; = అటుపిమ్మట; పూజామ్ = సత్కారములను; ఋషిపుత్రః = ఋషికుమారుడు ఋశ్యశృంగుడు; చ; చకార = చేసెను; హ; ఇదమ్ = ఇది; అర్ఘ్యము = పూజాద్రవ్యము {అర్ఘ్యము - అష్టార్ఘ్యములు, పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గఱిక, నువ్వులు, దర్భలు, పుష్పములు అను పూజాద్రవ్యములు}; ఇదమ్ = ఇది; పాద్యమ్ = పాదముల కొఱకు నీరు; ఇదమ్ = ఇది; మూలమ్ = కందమూలము; ఇదమ్ = ఇది; ఫలమ్ = ఫలము

భావము:

*గమనిక :-   అర్ఘ్యము - అష్టార్ఘ్యములు, పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గఱిక, నువ్వులు, దర్భలు, పుష్పములు అను పూజాద్రవ్యములు. పిమ్మట వచ్చిన వారకాంతలకు ఋశ్యశృంగుడు అర్ఘ్య పాద్యములూ, దుంపలూ ఫలములూ అందించి గౌరవ సత్కారములు చేసెను.

1-18-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతిగృహ్య తు తాం పూజాం
 సర్వా ఏవ సముత్సుకాః ।
ఋషేర్భీతాస్తు శీఘ్రం తా
 గమనాయ మతిం దధుః ॥

టీకా:

ప్రతిగృహ్య = స్వీకరించిరి; తు; తాం = ఆ; పూజామ్ = సత్కారములను; సర్వాః = అందఱు; ఏవ = కూడ; సముత్సుకాః = ఉత్సాహము కలవారై; ఋషేః = ఋషి విభండకుని వలన; భీతాః = భయము చెందినవారై; తు; శీఘ్రమ్ = వడిగా; తాః = వారు; గమనాయ = తిరిగి వెళ్ళుటకు; మతిమ్ = భావమును, తలపును; దధుః = ధరించిరి

భావము:

ఆ వేశ్యస్త్రీలు ఉత్సాహముతో ఋష్యశృంగుని సత్కారములన్నీ గైకొనిరి. విభండకఋషికి కనబడతామని భయపడి, వడిగా మఱలి పోవలెనని తలచిరి.

1-19-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“అస్మాకమపి ముఖ్యాని
 ఫలానీమాని వై ద్విజ! ।
గృహాణ ప్రతి భద్రం తే
 భక్షయస్వ చ మా చిరమ్" ॥

టీకా:

అస్మాకమ్ = మావి; అపి = కూడా; ముఖ్యాని = ముఖ్యమైన; ఫలాని = ఫలములను; ఇమాని = క్షేమకరమైనవి; వై = నిశ్చయముగ; ద్విజ = బ్రాహ్మణుడా; గృహాణ = తీసికొనుము; ప్రతి = ప్రతి ఒక్కటి/ అన్నిటిని; భద్రమ్ = క్షేమము అగుగాక; తే = నీకు; భక్షయస్వ = తినుము; చ; మా = వలదు; చిరమ్ = ఆలస్యము.

భావము:

“ఓ విప్రుడా! నీవు ఈ మా మంచి పండ్లను కూడా తీసికొని, అన్నింటిని భుజింపుము. నీకు క్షేమము అగుగాక! జాగు చేయకుము.

1-20-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతస్తాస్తం సమాలింగ్య
 సర్వా హర్షసమన్వితాః ।
మోదకాన్ ప్రదదుస్తస్మై
 భక్షాంశ్చ వివిధాన్ శుభాన్ ॥

టీకా:

తతః = పిమ్మట; తాః = వారు; తమ్ = అతనిని; సమాలింగ్య = కౌగలించుకొని; సర్వాః = అందఱు; హర్ష = సంతోషము; సమన్వితాః = కలవారై; మోదకాన్ = కుడుములు, లడ్డూలు; ప్రదదుః = ఇచ్చిరి; తస్మై = అతనికి; భక్ష్యాంశ్చ = తినుభండారములు; వివిధాన్ = అనేకములను; శుభాన్ = మంగళకరమైనవాటిని.

భావము:

ఆపైవారందఱు ఋశృశృంగుని అనందంగా కౌగలించుకొనిరి. లడ్డూలు, రకరకముల చక్కని తినుబండారములను భుజించమని ఇచ్చిరి.

1-21-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాని చాస్వాద్య తేజస్వీ
 ఫలానీతి స్మ మన్యతే ।
అనాస్వాదితపూర్వాణి
 వనే నిత్యనివాసినామ్ ॥

టీకా:

తాని = వాటిని; చ; ఆస్వాద్య = తిని; తేజస్వీ = తేజోవంతుడు ఋశ్యశృంగుడు; ఫలాని = ఫలములే; ఇతి = ఇవి; స్మ = సుమా అని; మన్యతే = తలచెను; అనాస్వాదిత = భుజింపబడనివి; పూర్వాణి = గతములో; వనే = అడవిలోనే; నిత్య = ఎప్పుడు; నివాసినామ్ = నివసించువారు.

భావము:

బ్రహ్మతేజస్సుతో ఉట్టిపడు ఋశ్యశృంగుడు ఆ స్త్రీలు ఇచ్చిన ఫలములు తిని ‘వనవాసలమైన మేము ఎన్నడూ తిని ఎఱుగని ఫలము లివి’ అని తలచెను.

1-22-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆపృచ్ఛ్య తు తదా విప్రం
 వ్రతచర్యాం నివేద్య చ ।
గచ్ఛంతి స్మాపదేశాత్తాః
 భీతాస్తస్య పితుః స్త్రియః ॥

టీకా:

అపృచ్ఛ్య = అడిగి; తు; తదా = అప్పుడు; విప్రమ్ = బ్రాహ్మణుని; వ్రతచర్యామ్ = నిత్యకర్మల అనుష్ఠానమును; నివేద్య = తెలుపబడిరి; చ; గచ్ఛంతి = వెడలిపోయిరి; స్మ; అపదేశాత్ = (కర్మానుష్ఠాన మనే) నెపముతో; తాః = వారు; భీతాః = భయపడినవారై; తస్య = అతని; పితుః = తండ్రి వలన; స్త్రియః = స్త్రీలు.

భావము:

అప్పుడు ఆ వేశ్యలు ఋశ్యశృంగుని నిత్యకర్మల అనుష్ఠానము గుఱించి తెలిసికొనిరి. విభండకునికి ఎదురపడతామని బెదిరి. అనుష్టాలని వంకపెట్టి సెలవు తీసుకొని వెళ్ళిపోయిరి.

1-23-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గతాసు తాసు సర్వాసు
 కాశ్యపస్యాత్మజో ద్విజః ।
అస్వస్థ హృదయ శ్చాసీత్
 దుఃఖం స్మ పరివర్తతే ॥

టీకా:

గతాసు = వెళ్ళిపోయిన వారు అగుచుండ; తాసు = వారు; సర్వాసు = అందఱు; కాశ్యపస్య = కశ్యపకుమారుడైన విభండకుని; ఆత్మజః = సుతుడైన; ద్విజః = బ్రాహ్మణుడు/ ఋశ్యశృంగుడు; అస్వస్థ హృదయః = మానసిక ఆరోగ్యము కోల్పోయినవాడు; చ; ఆసీత్ = అయ్యెను; దుఃఖాత్ = దుఃఖము వలన; స్మ; పరివర్తతే = సంచరించుచుండెను.

భావము:

వేశ్యస్త్రీలు అందఱు వెళ్ళిపోయిన పిదప ఋశ్యశృంగుడు మానసిక స్వస్థత కోల్పోయి దుఃఖితుడై సంచరించుచుండెను.

1-24-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తతోఽ పరేద్యుస్తం దేశమ్
 ఆజగామ స వీర్యవాన్ ।
మనోజ్ఞా యత్ర తా దృష్టా
 వారముఖ్యాః స్వలంకృతాః ॥

టీకా:

తతః = పిదప; అపరేద్యుః = మరునాడు; తం = ఆ; దేశమ్ = ప్రదేశమునకు; ఆజగామ = వచ్చెను; సః = అతడు; వీర్యవాన్ = శక్తివంతుడు; మనోజ్ఞాః = మనోహరమైనవారు; యత్ర = ఎచట; తాః = వారు; దృష్టాః = చూడబడిరో; వారముఖ్యాః = వేశ్యామణులు; స్వలంకృతాః = బాగుగా అలంకరించుకొన్నవారు

భావము:

మరునాడు శక్తిశాలి ఆన ఋశ్యశృంగుడు అలంకారలతో మెరిసిపోయే మనోహరమైన వేశ్యామణులను తాను చూసిన ఆ ప్రదేశమునకు వచ్చెను.

1-25-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దృష్ట్వైవ తాస్తదా విప్రమ్
 ఆయాంతం హృష్టమానసా ।
ఉపసృత్య తతః సర్వాః
 తాస్తమూచు రిదం వచః ॥

టీకా:

దృష్ట్వా = చూడగనే; ఏవ = అలా; తాః = వారు; తదా = అప్పుడు; విప్రమ్ = బ్రాహ్మణుని; ఆయాంతమ్ = వచ్చుచున్న; హృష్టమానసా = సంతోషించిన మనస్సులు కలవారై; ఉపసృత్య = సమీపించిన; తతః = తరువాత; సర్వాః = అందఱు; తాః = వారు; తమ్ = అతనితో; ఊచుః = పలికిరి; ఇదం = ఈ; వచః = పలుకులు.

భావము:

వచ్చుచున్న ఋశ్యశృంగుని చూడగనే ఆ వేశ్యామణులు అందఱు సంతోషహృదయులైరి. పిమ్మట అతని దర్గఱకు వెళ్ళి ఇట్లు పలికిరి.

1-26-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఏహ్యాశ్రమపదం సౌమ్య
 హ్యస్మాకమితి చాబ్రువన్ ।
తత్రాప్యేష విధిః శ్రీమాన్
 విశేషేణ భవిష్యతి" ॥

టీకా:

ఏహి = రమ్మ; ఆశ్రమ; పదమ్ = ప్రదేశమునకు; సౌమ్య = ఓ సౌమ్యుడా; హ్యః = పాత; అస్మాకమ్ = మా యొక్క; ఇతి = అని; చ; అబ్రువన్ = పలికిరి; తత్ర = అచట; అపి = కూడ; ఏషః = ఈ; విధిః = కార్యక్రమము (అతిథి సత్కారము); శ్రీమాన్ = శోభాయుక్తముగ; విశేషేణ = ఎక్కువగా; భవిష్యతి = జరుగగలదు.

భావము:

“ఓ సౌమ్యుడా! ఋశ్యశృంగా ! నీవు కూడ మా ఆశ్రమ ప్రదేశమునకు రమ్ము. నీకు కూడ ఇటులనే చక్కటి అతిథి సత్కారములు బాగుగా చేసెదము” అని ఆహ్వానించిరి.

1-27-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుత్వా తు వచనం తాసాం
 సర్వాసాం హృదయంగమమ్ ।
గమనాయ మతిం చక్రే
 తం చ నిన్యుస్తదా స్త్రియః ॥

టీకా:

శ్రూత్వా = విని; తు; వచనమ్ = పలుకులను; తాసామ్ = వారి; సర్వాసామ్ = అందఱి; హృదయంగమమ్ = మనోజ్ఞమైన; గమనాయ = వెళ్ళవలెనను; మతిమ్ = ఆలోచన; చక్రే = చేసెను; తమ్ = అతనిని; చ; నిన్యుః = తీసుకొని వెళ్ళిరి; తదా = అప్పుడు; స్త్రియః = స్త్రీలు

భావము:

ఋశ్యశృంగుడు వారి మనోహరమైన ఆహ్వానము మన్నించెను. ఆ స్త్రీలతో వెళ్ళుటకు అంగీకరించెను. అప్పుడు వేశ్యామణులు వానిని తమతో తీసుకొని వెళ్ళిరి.

1-28-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తత్ర చానీయమానే తు
 విప్రే తస్మిన్ మహాత్మని ।
వవర్ష సహసా దేవో
 జగత్ ప్రహ్లాదయం స్తదా ॥

టీకా:

తత్ర = అచటకు; చ; ఆనీయమానే = తీసుకొని రాబడుచుండగా; తు; విప్రే = బ్రాహ్మణుని; తస్మిన్ = ఆ; మహాత్మని = మహాత్ముడైన; వవర్ష = వర్షించిరి; సహసా = వెనువెంటనే; దేవః = దేవతలు; జగత్ = లోకమునకు; ప్రహ్లాదయమ్ = సంతోషింపజేయునది; తదా = అప్పుడు.

భావము:

మహాత్ముడు ఋశ్యశృంగుడు అంగదేశమునకు తీసుకొని రాగానే వర్షాధిదేవత యైన పర్జన్యుడు అచట అందరికీ ఆనందకరమైన వర్షమును కురిపించెను.

1-29-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర్షేణైవాగతం విప్రం
 విషయం స్వం నరాధిపః ।
ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః
 శిరసా చ మహీం గతః ॥

టీకా:

వర్షేణ = వర్షముతో; ఏవ = కూడ; ఆగతమ్ = చేరిన; విప్రమ్ = బ్రాహ్మణునికి; విషయమ్ = విషయమును; స్వం = స్వయంగా; నరాధిపః = రాజు; ప్రత్యుద్గమ్య = ఎదురు వెళ్ళి; మునిమ్ = మునికి; ప్రహ్వః = వంగినవాడై; శిరసా చ = శిరస్సుతో; మహీమ్ = భూమిని; గతః = పొందెను.

భావము:

వర్షముతో పాటు తన దేశమునకు వచ్చిన ఋశ్యశృంగునికి రోమపాద మహారాజు ఎదురువెళ్ళెను. శిరసు వంచి నమస్కరించెను.

1-30-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై
 న్యాయతః సుసమాహితః ।
వవ్రే ప్రసాదం విప్రేంద్రాత్
 మా విప్రం మన్యురావిశత్ ॥

టీకా:

అర్ఘ్యమ్ = అర్ఘ్యమును; చ; ప్రదదౌ = ఇచ్చెను; తస్మై = అతనికి; న్యాయతః = శాస్త్రోక్తముగ; సుసమాహితః = ఏకాగ్రచిత్తుడై; వవ్రే = కోరెను; ప్రసాదమ్ = అనుగ్రహమును; విప్రేంద్రాత్ = బ్రాహ్మణునినుండి; మా = వలదు; విప్రమ్ = బ్రాహ్మణుని; మన్యుః = కోపము; ఆవిశత్ = ప్రవేశము

భావము:

రోమపాదుడు శాస్త్రోక్తముగా శ్రద్ధగా ఋశ్యశృంగునకు అర్ఘ్యము సమర్పించెను. ఇలా తీసుకువచ్చి నందులకు కోపించక అనుగ్రహించమని కోరెను.

1-31-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతఃపురం ప్రవిశ్యాస్మై
 కన్యాం దత్త్వా యథావిధి ।
శాంతాం శాంతేన మనసా
 రాజా హర్షమవాప సః ॥

టీకా:

అంతఃపురమ్ = అంతఃపురమును; ప్రవిశ్య = ప్రవేశించి అస్మై = తన యొక్క; కన్యామ్ = కన్యను; దత్వా = ఇచ్చి; యథావిధి = శాస్త్రోక్తముగా; శాంతామ్ = శాంతను; శాంతేన = ప్రశాంతమైన; మనసా = మనస్సుతో; రాజా = రాజు; హర్షమ్ = ఆనందమును; అవాప = పొందెను; సః = అతడు

భావము:

రోమపాద మహారాజు అంతఃపురములోనికి ఋశ్యశృంగుని తీసుకెళ్ళి అతనికి తన కుమార్తె శాంతను ఇచ్చి యథావిధిగా వివాహము చేసి ప్రశాంతమైన మనస్సుతో ఆహ్లాదము పొందెను.

1-32-అనుష్టుప్.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఏవం స న్యవసత్తత్ర
 సర్వకామైః సుపూజితః ।
ఋశ్యశృంగో మహాతేజాః
 శాంతయా సహ భార్యయా" ॥

టీకా:

ఏవమ్ = ఈ విధముగా; సః = అతడు; న్యవసత్ = నివసించెను; తత్ర = అచట; సర్వకామైః = సకల భోగములచే; సుపూజితః = బాగుగా సత్కరింపబడెను; ఋశ్యశృంగః = ఋశ్యశృంగుడు; మహాతేజాః = మిక్కిలి తేజోవంతుడు; శాంతయా = శాంతతో; సహ = కూడ; భార్యయా = భార్యతో

భావము:

ఈ విధముగా మహాతేజోవంతుడైన ఋశ్యశృంగుడు తన భార్య శాంతతో సకలభోగములను అనుభవించుచు, బాగుగా గౌరవ సత్కారములను అందుకొనుచు అంగరాజ్యములో నివసించెను.