ప్రాథమిక వ్యాకరణ సూచన
1) లింగములు మూడు (3) - స్త్రీలింగః, పుఃలింగః, నపుంసకలింగః
2) వచనములు మూడు (3) - ఏకవచనః, ద్వివచనః, బహువచనః
3) కాలములు మూడు (3) - భూతకాలః, వర్తమానకాలః, భవిష్యత్ కాలః
4) పురుషలు మూడు (3) ఉత్తమపురుష (అహం, నేను), మధ్యమపురుష (త్వం, నీవు), ప్రథమపురుష (సః, అతడు)
5) పు, స్త్రీ, న లింగ ఏకవచన, వర్తమాన కాల సః, సా, తత్ / తద్
6) యుష్మద్ - త్వం (ఏకవచన, నీవు) / యువాం (ద్వివచన, మీరిద్దరు) / యూయం (బహు వచన, మీరు).
7) అస్మద్ - అహం (ఏకవచన, నేను) / అవాం (ధ్వివచన, మేమిద్దరం) / యువాం (బహువచన, మేము).
8) పై “యుష్మద్” / “అస్మద్” రెండు శబ్దాలకు క్రియారూపం మారుతుంటుంది. వీటికి తప్ప మిగతా అన్ని నామవాచకాలకు క్రియను ప్రథమపురుషనే వాడాలి.
9) లింగం శబ్దాన్ని బట్టి ఉంటుంది తప్ప అర్థాన్ని బట్టికాదు.
10) నామవాచకం ఏ లింగంలో ఉంటే సర్వనామం అదే లింగంలో ఉండాలి
11) అనుస్వారం- అనుస్వారం అంటే మరొక అక్షరముతో చేరి ఉచ్చరించబడేది అని అర్థం. పంక్తికి మొదట, పదానికి చివర సున్నాను వ్రాయటం తప్పు. అదే విధంగా తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
12) సిద్ధానుస్వారము – శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము.
13) సాధ్యానుస్వారము – వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ:
14) విసర్గ – ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.
15) అనుస్వారం (“0”) / “మ్” – అనుస్వారం తరువాత అచ్చు వస్తే “మ్” వాడాలి. హల్లు వస్తే అనుస్వారం (“0”) వాడాలి
16) “వా” / “కిమ్” పదాలు ప్రశ్నార్థకాలు. ఆమ్ (అవును / అంగీకారము), న (లేదు, కాదు, అనంగీకారము / 1. అభావః -2. నిషేధః -3. తద్విరుద్ధః -4. తదన్యః -5. ఈషదర్థః -6. మనోజ్ఞః -7. కాఠిన్యమ్ -8. కామ్యకర్మ)