వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

తృతీయప్రకరణమ : ఉద్దాలకోపాఖ్యానము

ఉద్దాలకోపాఖ్యానము

2587
రారఁ బూర్వ ము-ద్దాలకుం డనెడు
మునిపుంగవుఁడు చిత్త-మును గనిపట్టి,

2588
నిఁబూని శిక్షించి -రమందు జెందె;
నిన శ్రీరాముఁ డి ట్లనె మునినాథ!

2589
గొకొని యుద్ధాల-కుఁడు నిజచిత్త
మునుగెల్చి సంతోష-మున ముక్తుఁడైన

2590
తెఱఁగు నా కతికృపఁ -దెలుపవే! యనినఁ
జిఱునవ్వు నవ్వి వ-సిష్ఠుఁ డిట్లనియె

2591
“ ఘాత్మ! యుద్దాల -కాఖ్యచే నొప్పు
మునిగంధమాధన-మున కేఁగి, యచట

2592
తరంబుగ వివే-స్వాంతుఁ డగుచుఁ
లోనఁ దా నిట్లు -లఁచె నంతటికిఁ

2593
మ ప్రధానమై -ప్రాప్తమైనట్టి
సప్రకాశ మె-చ్చట నుండి చూతు?

2594
నేనెన్నటి కి దుఃఖ నీరధిఁ గడచి.
యానంద మొందుదు? నుచుఁ జింతించి,

2595
గ్రక్కున సకల సం ల్పముల్ విడిచి,
క్కడఁ బద్మాస -నాసీనుఁ డగుచు

2596
రినిఁ గుఱించి మ-హానిష్ఠమీఱఁ
జితర తప మొప్పఁ-జేయుచు నుండె

2597
ప్పుడతని చిత్త -మాధ్యానపటిమ
నెప్పుడో విడిచి తా-నేమేమొ తలఁచి,

2598
క్రోఁతికైవడిఁ దిరు-గుచునుండు టెఱిఁగి,
యాతాపసుఁడు రోష -గ్గలింపఁగను

2599
చిత్తమును బట్టి-యంతరంగమున
నాక్రధరుని పా-దాబ్జంబులందు

2600
నిలిపి బంధించిన, -నిగుడి చిత్తంబు
లఁపు లేమో తాను -లఁపుచు, విషయ

2601
వానలను గూడి -ర్తించి మరల
నాసంయమీశ్వరు -చట వంచించి,

2602
క్కక పక్షి చం-మున బాహ్యమున
దిక్కుల నెగురుచుం -దిరుగుచు మించి,

2603
యొవేళ నభమునం -దుదయార్కు పగిదిఁ
పెకఁ జేయుచుఁ -నిపించుచుండు;

2604
నొవేళ గగన మ -ట్లూరక యుండు,
నొవేళ శూన్యమౌ, -నొకవేళ నుఱుకు

2605
నొవేళ స్థిరముగా -నుండిన ట్లుండు;
నొవేళ యోజన -లూరకె చేయు;

2606
నీవిధంబున నిల్వ -కెగురు చిత్తమును
భావించి, యచ్చోటుఁ -బాసి యాతపసి

2607
భూమిఁబరిభ్రమిం -పుచును జరించి,
యామీఁద నొక్క నాఁ -డందొక దిక్కు

2608
తెలు చిత్తంబు ను-ద్దేశించి తాను
రుఁడై వివేకించి -లికె ని ట్లనుచు

2609
“ క్కట చిత్తమా!-రియందు నిలువ
కెక్కడికో తేర -కేగుచున్నావు.

2610
ను మాయా సంప-ల విచారించి,
రఁగి నీవేమి సౌ-ఖ్యముల నొందెదవు?

2611
కామంబు లతిదుఃఖ-రము లటంచు
ధీమంతులగువారు -తెలిసిన వేళ

2612
నీప్రయత్నంబులు -నిరసింతు, రప్పు
డీప్రపంచముతోడ -నేఁగెద వీవు,

2613
ఇంలోన నిటు -హింలను బెట్టినను
నంట నీ కేమి -బ్బె సౌఖ్యంబు?

2614
శాంతామృతముఁ గ్రోలి -సంతసింపకను
వింవింతలు చూపు -విషయసౌఖ్యముల

2615
గి నీ వరుగు టి-మ్మహిని సంతాన
రువాశ్రయింప, కా -పకాలమందు

2616
రుభూమిలోఁ జైత్ర -ధ్యాహ్నమునను
రియింపు చుండెడి -చందంబుగాదె?

2617
మురియుచుఁ బాతాళ-మున నుండు, మింటఁ
దిరుగుచు నుండు మే-తెఱఁగున నైనఁ

2618
ఱుదైన శమనామృ-తంబు గ్రోలకను
దొకదు నీకు సం -తోష మెందునను,

2619
మొసిన కల్మిలే-ములు దలంపుచును
నిఁబూని సుఖదుఃఖ -రవశత్వమునఁ

2620
జొక్కిస్రుక్కుట మాని -సుస్థిరజ్ఞాన
మొక్కటి సంతోష -మొసఁగు నటంచుఁ

2621
దెలియలే వైతి వింద్రియములకెపుడు
నుగా దాసుని -లె మెలంగుచును,

2622
రువడిగా శ్రోత్ర -భావంబు నొంది,
మురిసి ఘంటా నాద-మును విని చొక్కి

2623
యుడుగక వేఁటకా -డొడ్డిన వలను
డుజింక గతిని లోఁ-డకువే మనస!

2624
ర్మభావము నొంది -సంస్పర్శ సుఖము
ర్మిలిఁ గోరి మ-హాగజేంద్రుండు

2625
ణితో నెరయ న-క్కడఁ బర్వుఁ బాఱి
రిగి యచ్చటి యోద-మందుఁ దాఁగూలు

2626
రిణిని సంసార -హన కూపమునఁ
రువడి నెఱిదప్పి -డకువే మనస!

2627
లక రసనభా-ము నొంది యెఱ్ఱ
దిమి మ్రింగెద నంచు -రిగిఁ గాలమును

*టీక:- ఎఱ్ఱ- ఎర, చేపలు పట్టుటకు గాలము కొసన తగిలించు ఆహారము.

2628
మ్రింగిచచ్చినయట్టి -మీనంబు పగిది!
బొంగుచు రుచిఁ గోరి -పొలయకే మనస!

2629
నేత్రభావము నొంది -నిగుడుచు మీన
నేత్రలు మొదలుగా -నెఱయు దృశ్యముల

2630
యందాసపడి యగ్ని -ణఁగిన మిడుత
చందంబుగా నీవు -చావకే మనస!

2631
నుపడి నాసికా-భావంబు నొంది,
సుగంధముఁ గోరి-మలమధ్యమున

2632
జెయున్న భృంగంబు -చెలువునఁ గర్మ
చివాసనలయందుఁ జిక్కడే మనస!

2633
మెయు జింకయుఁ, గరి, మిడుత, మీనంబు,
యఁగా భృంగ మి-ట్లాశలఁ బొంది,

2634
యొక్కటొక్కటిచేత -నొకటొక టణఁగు
క్కట! యిటువంటి -యైదింద్రియముల

2635
నెసియుండంగ నీ-వెటు తరించెదవు?
చెనఁటుల పొందు వ-ర్జింపవే మనస!

2636
టువంటి వాసన-న్ని బంధకము,
లిటువంటి రీతుల -నెఱిఁగి, వైరాగ్య

2637
చింన సతతంబుఁ జేసిన నీవు
శాంతిఁబొందెదవు ని-శ్చయముగా మనస!

2638
ఱ కేను ని-న్నెఱుఁగక భ్రమసి,
నీవెనే ననుకొని -నీవు గావించు

2639
నులు నేఁ జేసిన-ను లంచుఁ దలఁచి,
నినువేఱుఁగాఁ జూడ-నేరకుండితిని;

2640
తమందున నీవు-శాంతిఁ బొందకను
హిశత్రు పగుచు న-న్నేఁచుచుండితివి.

2641
మాత్మ నంతట భావించి చూచి,
నిరుపమ ప్రజ్ఞతో నిన్ను మ్రింగెదను;

2642
ఱికరి మ్రింగిన -మారేడు పండు
ణి నాలో నీవు -రఁగి పోయెదవు.

2643
కావున నీవు సం-ల్పముల్ విడిచి,
శ్రీవిష్ణురూపంబుఁ -జెందక మించి,

2644
యవకలిత దే-ము నాశ్రయించి,
విరళంబుగ నాత్మ-యందున్న నిన్నుఁ

2645
నిపట్టశక్యంబు-గాదెవరికిని,
నినిక్కుచుంటివా? -రికటాక్షమునఁ

2646
జిక్కితి విపుడు నా చేత, బొంకించి,
యెక్కడఁ బోయెద -వింక మీఁదటను?

2647
లప్రపంచంబు -త్తాస్వరూప,
లంక, మద్వయ -ని నిశ్చయించి,

2648
యాయాత్మ నే నైన -ప్పుడు వేఱె
నీత్నములు సాగు -నేవెఱ్ఱిమనస!

2649
రుచు దేహేంద్రి-ములు నే ననుచుఁ
దెలియుచుండెడి తెల్వి -తేటయై తుదను

2650
రబ్రహ్మమై -యంతట నిండి,
దీపించు నారీతి -తెలియనీయకను

2651
జ్ఞానవైరి ని-న్నలమటఁ బెట్టెఁ;
బ్రజ్ఞచే నటువంటి -పాపాత్ముఁ బట్టి,

2652
తునుమాడి యధిక సం-తోషంబు నొంది,
నిశంబు నీ వాత్మ-యందుండు మనస!

2653
నిన్నునే నెఱుఁగుదు -నిశ్చయంబుగను,
న్నునీ వెఱిఁగిన -నాత్మ విభ్రాంతి

2654
విడువు, మటంచు వి-వేకంబు మదికిఁ
బొకట్టి, బహువిధం-బుల బోధసేసి,

2655
విడువక, యటమీఁద -విషయేంద్రియముల
కెము తానై ప్రేమ -నిట్లని పలికె

2656
“ నెవుగాఁ దనకుఁ దా-నేబంధకంబుఁ
లిగించుకొని, యందుఁ- డపటఁ జిక్కి,

2657
రఁగిచచ్చు పసిండి -కాయలోఁ బురుగు
ణి నాశాపాశ -లితదుఃఖముల

2658
నుభవించితి రింద్రి-ములార! మేలు
వినుఁడు!నేఁ జెప్పెద -విషయవాసనలఁ

2659
బొంక, వైరాగ్య -బుద్ధితోఁ గూడుఁ
డందున్న సుఖము మీ -బ్బు నిక్కముగ”

2660
నుచు నింద్రియముల -కాప్తవాక్యముల
వినిపించి, యటమీఁద -విషయవాసనలఁ

2661
నియిట్టు లనె నింకఁ -రణంబులందుఁ
జుణుఁగుచు మీరింకఁ -జొచ్చి వేధింప

2662
వదు, దృఢముగా -వైరాగ్య బుద్ధి
నిలఁగూడి వర్తింపుఁ -డిందున మీకుఁ

2663
లుగు సౌఖ్యం బని -ట్టిగాఁ జెప్పి,
తొలఁగని యజ్ఞాన -ధూర్తు నీక్షించి

2664
లికె ని ట్లని త్రాటఁ -బామున్నకరణి
ఘు పరబ్రహ్మ -మందుండి నీవు

2665
విరీతములు చూపి -వెఱపింపుచుంటి,
విపుడు నీ మూలంబు -నెఱిఁగితి నిన్ను

2666
గాను, సుజ్ఞాన -డ్గంబు నెత్తి
యీవేళ నినుఁ ద్రుంచి -యిలపై నణంతు”

2667
నిప్రతాపింపుచు -జ్ఞానధూర్తు
ఘుఁడై ఖండించి, -చలాత్ముఁ డగుచు

2668
శుచి స్థలినిఁ బ-ద్మాసనమందు
టికుఁడై కూర్చుండి -నుఁగవ మోడ్చి,

2669
ధారాళముగ మారు-మును రేచించి,
పూరించి కుంభకం-బున నిల్పి, మదిని

2670
నెఱిఁగి ప్రాణములతో -నింపొందఁ గూర్చి,
రఁగ హృదగ్నినిఁ -బ్రబలింపఁ జేసి,

2671
కామా యగ్ని క-క్కడ సమర్పించి,
మానడంచి ని-ర్మల భావుఁ డగుచు,

2672
వి నాధారాది -క్రషట్కంబుఁ
మొప్ప దాఁటి, శృం-గాటకమందుఁ

*టీక:- షట్‌-చక్రములు – 1. మూలాధారము (పృథ్వీచక్రము), 2. స్వాధిష్ఠానము (ఆపశ్చక్రము), 3. మణిపూరము (అగ్నిచక్రము), 4. అనాహతము (వాయుచక్రము), 5. విశుద్ధి చక్రము (ఆకాశచక్రము), 6. ఆజ్ఞాచక్రము (మనశ్చక్రము). [ఇవి మానవ దేహమున కాధారమైన చక్రములు] *టీక:- శృంగాటకము- నాలుగు త్రోవలు కలిసిన దారి

2673
లక నాసికా -గ్రంబు పై దృష్టిఁ
దియించి నడిమి మా-ర్గంబునఁ బోయి,

2674
మర్థితో దీర్ఘ -ఘంటారవంబు
మొయు సహస్రార -మునఁ జేరి, యవల

2675
మున నూరక -శ్రమ నొందు ప్రాణ
ములుచేతనామృత-మున శాంతికొఱకుఁ

2676
బొందితదాకాశ-మున దోఁగి చాల
నందుసంపన్నంబు -య్యె నయ్యెడను;

2677
ము నంతర్బాహ్య -ధ్యంబులందు
ఘమై, పరిపూర్ణ-మైనిండియున్నఁ

2678
తత్త్వమునఁ బొంది -రమసంతోష
రితమై వెలి చలిం-క నిల్చియుండె.

2679
సియు హృదయాగ్ని -గ్ధ దేహంబు
పుడు బోధామృత -మందుంచి, శాంతిఁ

2680
బొందించి, చక్రిరూ-పుధరించి, శమము
నొందికొన్నాళ్లట్ల -యుండి, పిమ్మటను

2681
గ్రమొప్పఁగా నిర్వి-ల్పసమాధి
రఁగా సాధింప, నంతరంగమునఁ

2682
రఁగఁ దోఁచిన ప్రతి -భాసల నాత్మ
వాలమున వేగ -ఖండించి వైచి,

2683
భ్రపెట్టు తద్వి క-ల్పనముల నెల్లఁ
బ్రదంబుతో నెడఁ బాసి, యామీఁద

2684
లమై నట్టి హృదాకాశమందుఁ
లాప్త చంద్ర ప్ర-కాశముల్ గప్ప

2685
రు నజ్ఞాన గాఢాంధకారమును
యించి, మీఁది తే-జంబును గాంచి.

2686
తరమైనట్టి -మలాకరమున
మొసి చొచ్చిన గజం-బువిధంబుగాను

2687
మొసూపు తత్తేజ-మును దునుమాడి.
నువొందఁ దేజో, మ-హాంధకారంబు

2688
నుమోహ, నిద్రల-టు దాఁటి, యోగి
వినుత మైనటువంటి -విశ్రాంతి! బొంది.

2689
సత ధ్యానాను -సంధానపటిమ
ఱిముఱి ధన్యమై, -చలమై. మఱియు

2690
విలమై, యాత్మ సం-విత్పరిస్పంద
ముచేతఁ గనకంబు-వ్యభూషణము

2691
తానైవెలుంగు చం -దంబున విశ్వ
మైనిరుపమ చిన్మ -త్వంబు దాల్చి,

2692
యక యాత్మ చి -త్తమున నైల్యంబు
విడిచి, చిత్తంబును -విడనాడి, శుద్ధ

2693
చిత్తస్వభావ మం-చితముగాఁబొందె
త్తాపసుండు బో-ధానురక్తినను

2694
నుగా వాసనా -ర్ణితుఁ డగుచు
చిదంబర రూప-మైప్రకాశించి,

2695
నుపమపరమామృ -తార్ణవ మందు
మునిఁగి, తద్రూప మి -మ్ముగ విడనాడి,

2696
రుదుగా నిదమిత్థ -నరానిచోట
ఱియును సత్తా స -మానత నొంది.

2697
పరమానంద వార్థి తా నగుచుఁ,
రఁగ నిర్వాత దీ-ము భంగి నిలిచి.

2698
భాసురచిత్ర రూము మాడ్కిఁ జేష్ట
బాసిచలింపక -బ్రాహ్మణోత్తముఁడు

2699
ఘనానంద ప-ద్మాకర మందె
ఘుచిన్మయ హంస-మైయొప్పుచుండె.

2700
రీతిఁ జిరకాల -మందున్నఁ జూచి,
యోరుపు చాలక -యురువిచిత్రములఁ

2701
దొరి చూపుచు దేవ దూతలు మించి,
డువడి యోగ వి-ఘ్నములు సేయఁగను,

2702
నాతిశాంతుఁడై-చ్చోటు విడిచి,
పోయియొక్కకదినం-బొక్కొక చోట,

2703
నొచోట నొకమాస, -మొకవత్సరంబు,
నొచోటఁ బెక్కేండ్లు -నుండి పోవుచును,

2704
శాంతుఁడై తాపసా-శ్రమములయందు
వింవింతల నొప్పు -విపినంబులందు

2705
నొప్ప విమలజీ -న్ముక్తుఁ డగుచు,
లుఁగక యిచ్ఛావి-హారియై తిరిగి,

2706
ఘు చిత్తత్వ ఘ-నాభ్యాసములను
బొలుచు నా చిత్తును -బొంది యా మీఁదఁ

2707
జెలఁగు చిత్సామాన్య -చిదనుభవంబు
న నుద్దాలక -రయోగివరుఁడు

2708
లిని సత్తాసమా-తఁ బొందె ననఁగ
రి రాఘవుఁ డిట్టు -నియెఁ గ్రమ్మఱను

2709 “ మౌనీంద్ర! సత్తాస-మానత యెట్టి ?
దాతీయు “డటన్న మ్ముని పలికె.

2710
ఘాత్మ! తన కన్య -మైనది మిథ్య
నుభావనను జిత్త -ణఁగఁగా నపుడు

2711
జమైనట్టి చి -త్సామాన్యమునకు
నీయ సత్తా స-మానత గలుగు,

2712
మొటి సంశయ భయం-బులణంగునట్టి
మందుఁ జెంది ప్ర-పంచగేహమున

2713
లితుఁడై కొంతకా-లంబు వర్తించి,
ఘు శాంతినిఁ -బొంది. చలసమాధి

2714
యందుండి, తద్దేహ -ట విసర్జించి,
యెందులఁ గొదువ లే-కిరవైన బ్రహ్మ

2715
మందుఁ బొందె నా-బ్రాహ్మణోత్తముఁడు;
కొదుక కీ యుద్దాల -కుని చరిత్రంబు

2716
వినిన మానవు లతి -విమలాత్ము లగుచు
ముక్తి మార్గంబుఁ-ని సుఖింపుదురు.

2717
ణీశ! నీవు ను-ద్దాలక మౌని
ణి నిన్నే నీవు -నుచు, విశ్రాంతి

2718
నొందియుత్తమమైన యున్నతపదము
నందువర్తింపుచు నానంద మొందు”

2719
నిన మౌనికి మ్రొక్కి, యారాఘవుండు
మున నూహించి -రల నిట్లనియె

2720
మునినాథ సంసార -మున నుండి యొక్కఁ
ఘుఁడై సుజ్ఞాని -గుచు విశ్రాంతిఁ

2721
బొందిసంసార మొప్పుగఁ జేయుచుండు,
మంతన్ విడచి స -మాధిఁ గావించు;

2722
టుగాక మఱి యొక్కఁ డారణ్యములను
టువిరాగమునఁ బ్ర పంచధర్మముల

2723
చి యే వేళ సమాధిఁ గావించు
య నయ్యిద్దఱి-యందధికుండు

2724
వఁడన్న నవ్వి ము-నీంద్రుఁ డిట్లనియె
457 “ నీశ! చెప్పెద -నారెండు గతుల

2725
వినుమెట్టు లనిన వివేకాత్ముఁ డగుచు
గొమొదల్ గని, సర్వ గుణ సముహంబు

2726
మంచు, నాత్మ య డమంచుఁ దెలిసి,
రఁ దదాత్మ తా ని నిశ్చయించి,

2727
యాంరంగిక దృష్టి నవరతంబు
శాంతుఁడై చిత్త విశ్రాంతి వహించి,

2728
నుపడు దృశ్య ప్ర-పంచంబు మిథ్య
నితాను ధ్యానించు-టువంటివాఁడు

2729
హాయిగా సంసారి -యైయున్న నేమి?
పోయితపోవనం-బున నున్ననేమి?

2730
కొఱఁత లే, దతఁడు ము-క్తుండెచ్చ టున్న,
రుదుగా సంసారి గు యోగి కెపుడు

2731
నిరుపాధి చే-శ్శీతలత్వ
మివగుటం జేసి యెపు డరణ్యమున

2732
తరవైరాగ్య -లితుఁడై, యోగ
మొరించి, విమలుఁడై-యుపశాంతుఁడైన

2733
నికి, నతనికి -రసి చూచినను
తియొక్కటే, రెండు -తులు గా వనఘ!

2734
లినిఁ జేతశ్శీత -త్వంబు మదిని
నిలువక చలియించె -నేని, యేమఱక

2735
ఱిహఠయోగ స-మాధిఁ గావించి,
పొరినిఁ దచ్ఛాంతినే -పొందఁగావలయు,

2736
రి యనంతుబు-గు చిత్తతాండ
ములెల్ల నుపశాంతి -లననే కాని,

2737
ఱివేఱె గతి నవి -మాన్పఁగా రాదు,
వి నందున శాంతి -సాధింపవలయుఁ;

2738
మిడినట్టి శాం గుణంబు చేత
ఱిమఱి చిత్త స-మాధాన మొదవు.

2739
అంటి యోగికి -ఖిలవాసనలు
శాంతంబులగు; సర్వ -ముఁ డగు నతని

2740
దిబాహ్య మందే క్ర-మంబున నున్న
దిచిన్మయంబై స-దానంద మొందు.

2741
సందేహరహితుఁడై, -శాంతుఁడై, మమత
యందంటి, యంటక -చలాత్ముఁడైన

2742
నుఁడింటిలో నున్న -హనమందున్నఁ
నుఁగొన నా రెండు తు లొక్క సమమెఁ

2743
నుగా నిట్టి స-ద్వాసన నొంది.
చెలఁగు చిత్తం బేమి -చేసినఁ గాని,

2744
సేనిదే యగు. -సిద్ధ మీవాక్య
మీర్థమున సంశ-యింపకు మీవు,

2745
ల రోసి ని-రాసక్తి నొందు
భాసురజ్ఞానాను-వముచే స్వల్ప

2746
వానఁ గలిగిన -రచిత్త మన్ని
చేసిచేయనిదియై చిత్తులో నణఁగు

2747
మానసము దూర -రిగి యం దొకటి
రఁగా ధ్యానించు-ట్టి కాలమునఁ

2748
నువందు వెల్గు నా-త్మసుఖంబు, దుఃఖ
మొర నెఱుంగక -యూరక యుండుఁ

2749
గావున, సకలవి కారముల్ మదిని
నావిమల చిదాత్మ- కంట దెద్దియును;

2750
నావిధ మెట్లన్న -మర స్వప్నమున
బావిలోఁబడి లేచి, - బాగ మేల్కొనిన

2751
వానియంగములకు -చ్చునే హాని?
మావేశ్వర! దాని -ర్మ మె ట్లనిన

2752
మున నెద్ది స-మ్మతముగాఁ జేయ
కునికి సమాధాన -మూహించి చూడఁ

2753
జెలువొప్ప నిరతంబు -చిత్తశాంతంబు
లుగు ధన్యునకు జ-గంబు భావింప

2754
తంబు చల్లనౌ, -శాంతంబు లేని
నికి దావాగ్ని-యైతోఁచు జగము;

2755
కావున శాంతమే -గావలె నరున,
కేవిధంబుననైన- నిది నిశ్చయంబు.

2756
య్యర్థమున నిపు -డితిహాస మొకటి
నెయ్యంబుతో విను -నేను చెప్పెదను.