తృతీయప్రకరణమ : పుణ్యపావనోపాఖ్యానము
పుణ్యపావనోపాఖ్యానము
2333
ధరణిఁ బూర్వము దీర్ధ -తముఁ డను మౌని
వరసుతుల్ పుణ్య, పా -వను లనఁ గలరు;
2334
అందగ్రజుఁడు పుణ్యుఁ -డమల విజ్ఞాని
సందడిం బడక సం -సారంబు విడిచి,
2335
లలితుఁడై విజన స్థ -లమున సమాధి
సలుపుచుండఁగ, వాని -జనకుండు కాల
2336
గతినొంది పడిపోవఁ -గాఁబావనుండు
మతిని దుఃఖించి, బ్రా -హ్మణులతో నందుఁ
2337
దనతండ్రి కటఁజేయఁ -దగు క్రియల్ చేసి,
జనకున కేడ్చి య -చ్చట నిల్వ కరిగి
2338
యన్నను వెదకుచు -నడవిలోఁ దిరుగు
చున్న, నందొక చోట -నుండి పుణ్యుండు
2339
కనఁబడఁగాఁ జూచి, -కనలి పావనుఁడు
తనతండ్రి బేర్కొని -ధరణిపై వ్రాలి,
2340
పొరలి యేడ్వఁగఁ జూచి, -పుణ్యుండు వచ్చి,
కరుణమీఱఁగ రెండు -కరముల వానిఁ
2341
గుదురుగాఁ దా వెత్తి -కూర్చుండఁ బెట్టి
వదనంబు నిమిరి, య -వ్వల నిట్టు లనియె
2342
“ తమ్ముడా! నీ విందుఁ -దండ్రినిఁ దలఁచి,
యిమ్మాడ్కి నేడ్చిన -నిచటికి మరల
2343
వచ్చునే? యమ్మహా -వర తపోధనుఁడు
హెచ్చుబోధస్థితి -నిరవుగాఁ బొందె;
2344
నతని శరీరంబు -నాత్మలోఁ దలఁచి
మతిఁజెడ నీ వేడ్చు -మాత్రమే కాని,
2345
యిందున సుఖము లే -దించు కంతైన,
నెందఱు తలిదండ్రు -లీవఱ దనుకఁ
2346
గలిగేగిరో? వారి -గణుతింపఁదరమె?
తెలివినొం, దేడ్వక -ధీరత్వ మెసఁగ
*టీక:- ఎసగు- అతిశయించు
2347
విను! మహంకృతి చేత -విస్తీర్ణమగుచు
మొనసెడి మోహ -సముద్రంబులోను
*టీక:- మొనయు- కలుగు
2348
సొలయ కెప్పుడు శుభా -శుభ సుఖదుఃఖ
ములుఫేన బుద్భుదం -బులమాడ్కిఁ బొడము,
2349
చెదరెడి మరుమరీ -చికయందు ఇలము
కదలుచున్నటు దోఁచి, కడపట మిథ్య
2350
యగునట్టి భ్రాంతి కి -ట్లగపడి నీవు
పొగుల నేటికి? శాంతిఁ -బొందు రక్తాస్థి
2351
కలితమైనట్టి యీ -ఘటపంజరమున
నిలుచుటె? ట్లని, దాని -నిరసించుకొనుచు,
2352
ననిశంబు నీవు నే -నను భేదబుద్ది
వెనయక, యంతట -నెఱుక పూర్ణముగ
2353
నిండియున్నది, యదే -నీవని తలఁపు
చుండు! వివేకివై -యుపశాంతిఁ బొందు!
2354
మొదటి యహంకార -మున మమకార
ముదయింపుచుండుఁ గా -వున నవి నీవు
2355
విడువు” మటన్న వి -వేకంబు లేక
యడలుచు నుండఁగా, -ననుజునిఁ జూచి
2356
పలికె నాపుణ్యుఁ” డో పావన! యిపుడు
గలిగి పోయిన తండ్రి -కాయంబుఁ దలఁచి
2357
మొనసి యేడ్చిన రీతి -మును జన్మ జన్మ
మునఁగని పెంచి నీ -ముచ్చటఁ జూచి
2358
ధరవ్రాలిపోయిన -తల్లిదండ్రులకుఁ
బొరిని నీ వేడ్వు మి -ప్పుడదెట్టు లనిన,
2359
నొకయద్రి శ్రుంగ మం -దొక సింహమునకుఁ
బ్రకటంబుగా నీవు -ప్రభవించినావు,
2360
పొలుపగు దాశార్ణ -భూతలమందుఁ
దెలివి లే కీవు కోఁ -తికిఁ బుట్టినావు,
*టీక:- దశార్ణ- ప్రాచీన భారతదేశంలో ఒక ప్రాంతం, ఇది వింధ్య పర్వతాల ఆగ్నేయ భాగంలో ఉండే మధ్య భారత దేశ భూ భాగం
2361
సరవిఁ దుషార దే -శమున భూపతికి
నరుదుగాఁ బుత్రుండ -వైపుట్టివావు,
*టీక:- తుషారదేశము- ప్రాచీన భారతదేశములోని వాయవ్య (ఉత్తరపశ్చిమ మూల) ప్రాంతములోని మంచు ప్రదేశపు దేశము
2362
అల పౌండ్రదేశంబునం -దటమీఁద
నలువొప్పఁ గాకంబు -నకుఁ బుట్టినావు,
*టీక:- పౌండ్రము- ఓఢ్రదేశమునకును ఆంధ్రదేశమునందలి ఉత్తర భాగమునకును ప్రాచీననామము. దీనికి బలి కొడుకు అయిన పుండ్రుని వలన ఈనామము కలిగెను, పురాణనామచంద్రిక
2363
పొలుపొంద హైహయం -బున మదదంతి
కలరి నీ వేనుఁగు -వైపుట్టినావు,
*టీక:- హైహయ దేశము- నర్మదాతీర ప్రదేశము ప్రాచీన దేశము. పూర్వము కార్తవీర్యార్జునుడు ఏలెను.
2364
కరఁగుచు నవలఁ ద్రి -గర్త దేశమున
నురుఖరగర్భమం -దుదయించినావు,
*టీక:- త్రిగర్త దేశు- ప్రాచీనకాలపు దేశము, ఆర్యావర్తమునకు వాయవ్యభాగమున ఉండునది, జాలంధర దేశము. ఇప్పటి హిమాచల ప్రదేశ్ నందలి కాంగ్రా లోయ ప్రాంతపు పౌరాణికకాలదేశము *టీక:- ఉరు ఖర- పెద్ద గాడిద
2365
సురఘుం డనెడు వాని -సుతుఁడవై పుట్టి,
యిరవొంద సాళ్వ భూ -మేలు చుండితివి.
*టీక:- సాళ్వ భూమి- సాళ్వము- ఒకానొక ప్రాచీన దేశము, ఆర్యావర్తము నందలి మధ్య దేశములలో ఒకటి.
2366
కటకటా! యిట్లనే -కశరీరములను
పటువేగమున నీవు -పక్షిచందమున
2367
సంచరించితి వట్టి -జననీజనకుల
నెంచి, నీ వీతండ్రి -కేడ్చినరీతి
2368
వారికి నేడ్వఁగా -వలదె? యజ్ఞాన
మీరీతి విడువలే -వేమందు నిన్ను?
2369
ధరణిఁ బూరుషునకుఁ -దల్లిదండ్రులును
బొరిననంతంబులు -పొలసి పోవుదురు,
2370
మురువొప్ప వన పత్ర -ములు రాలిపోవు
కరణి వ్రాలుచునుండుఁ -గాయముల్ పెక్కు,
2371
లీతల్లిదండ్రులు, -నీబంధు మిత్రు,
లీతనువులుఁ జూడ -నెపుడు శాశ్వతమె?
2372
నీవుశోకింపకు! -నెమ్మది నొంది
పావన! విను మింక -బరతత్త్య సరణి,
2373
మొనసిన యజ్ఞాన -మునఁ బుట్టు శోక
మునుదత్త్వ విజ్ఞాన -మున నివారించు
2374
మదినహంభావంబు -మానిన, శోక
ముదయింప కణఁగి పో -వుచునుండు, మేను
2375
నేననునది మాని, -నేనను తెలివి
నేనని భావించి, -నిను నీవు చూడు”
2376
మనిపెక్కు విధముల -నాత్మతత్త్వంబుఁ
బనిఁబూని పుణ్యుండు -పట్టి చెప్పినను,
2377
విని, పావనుఁడు తెలి -విని, బొంది, యవలఁ
దనుఁదాను భావించి -తత్త్వ విజ్ఞాన
2378
కలితుఁడై, సకల దుః -ఖంబుల మఱచి,
యలఘు జీవన్ముక్తుఁ -డయ్యె” నటంచు
2379
వరుసగాం బుణ్య పా -వనుల వృత్తాంత
మెఱిఁగించి, క్రమ్మఱ -నిట్లనె మౌని
2380
యోరామ! విను ధర -నొక్క రొక్కరికి
సారసత్పుణ్యాతి -శయమున విషయ
2381
వాసన లణఁగు, స -ర్వవిరక్తి గలుగు;