తృతీయప్రకరణమ : ప్రకరణాంత ద్విపద
ప్రకరణాంతద్విపద
3127
ఇదిసోఘనాథవి -శ్వేశ్వర స్వామి
పదపద్మ భక్త సు -బ్రహ్మణ్యయోగి
3128
చరణాంబుజాత ష -ట్చరణాయ మాన
పరిపూర్ణ నిత్య స -ద్భావ నిమగ్న
*టీక:- షట్చరణము- ఆరు కాళ్ళుగలది, తుమ్మెద.
3129
మానసాంబుజ వెంగ -మాంబికారచిత
మై, నిత్యమై నత్య -మైధన్యమైన
3130
సామార్థసారసు -జ్ఞానవాసిష్ఠ
రామాయణం బను -రమ్యసద్ద్విపద
3131
యందెన్నఁగాఁ దృ -తీయప్రకరణము
నందమై విమల మో -క్షాకరం బగుచు
3132
శ్రీతరిగొండ నృ -సింహుం డనంగ
ఖ్యాతిగా వెలయు వేం -కటరాయ! నీదు
3133
పదయుగళికి సమ -ర్పణమయ్యె, దీని
సదమలులై వ్రాసి -చదివిన, వినిన
3134
నరులు తాపత్రయార్ణవముఁ దరించి
పరమైన నిర్వాణ -పదము నొందుదురు.
3135
భూచక్రమున నిది -పురుషార్ధ మగుచునాచంద్రతారార్క -మైయుండుఁగాత!
-:తృతీయప్రకరణము సమాప్తము:-
ऑ ऑ ऑ