చతుర్థ ప్రకరణము : బిల్వఫలోపాఖ్యానము
॥బిల్వఫలాఖ్యానము॥
సలలితమైయుండి -సాహస్రసంఖ్య
3389
గలయోజనముల దీ-ర్ఘముగ నొప్పుచును,
చలనమొందక యుగ -సాహస్రములకుఁ
3390
బొలియ కెప్పుడు మహా-భూతమై యెపుడు
వెలుఁగుచు, విమలమై -నిస్ఫుటం బగుచు,
3391
మహిమమీఱఁగ నొక్క -మారేడుపండు
తహపొంది యంతటన్ -దానిండియుండు
3392
నదిపురాతన మయ్యు -నమృతాంశుకరణి
సదమలమై ప్రకా-శంబుగా నుండు
3393
వడివీచు కల్పాంత -వాయువేగమున
కడఁగక, కదలక -యచలమై యుండుఁ;
3394
జాలుగాఁ గోటియో -జనసంఖ్య నమరు
మూలాళితోడ ని-మ్ముగ జగంబులకుఁ
3395
దానెసంతతము నా-ధారమై యుండు
దానిచుట్టు నజాండ -తతు లవేకములు
3396
పొలుపొంద విశ్రమిం-పుచునుండు ననుచుఁ
బలికిన విని రామ-భద్రుఁ డిట్లనియె
3397
వరమునివర్య! బి-ల్వఫలం బటంచు
నిరవొంద మీరు నా-కెఱుఁగఁ జెప్పినది
3398
యాచిన్మయాత్మస -త్తనుచు నామదికి
దోఁచుచున్నది, దాని ,తుద మొదల్ దెలియ
3399
నానతీయుఁ డటంచు -నడుగ, వసిష్ఠ
మౌనిసంతోషాబ్ధి -మగ్నుఁడై రామ!
3400
వినుము చెప్పెద సర్వ -విశ్వంబు చిత్త
మున, నయ్యహంకార -మునఁ గల్గి, చాల
3401
వెలయుచు వేవేళ -వివిధభేధములఁ
జలియించు టది చిత్త -చపలత గాని,
3402
యరయ నన్యంబుగా-దని నీవు దెలియు
కొఱకు బిల్వఫలంబు -గుఱుతుఁ జెప్పితిని;
3403
నిరతంబు పరసత్తు -నిర్వికల్పయును, .
గరమొప్పు నట్టి య- ఖండైకరసయు,
3404
నగణితం బగునట్టి -యర్ధంబు విశద
ముగఁజేయుటకు మది -ముదము రెట్టింప
3405
భాసురంబుగు శిలో-పాఖ్యానసరణి
వాసిగాఁ జెప్పెద -వసుధాతలేంద్ర!
3406
పావనం బతిగోప్య -పద మదే గనుక
సావధానముగాను -జక్కఁగా వినుము!