ఆది ప్రకరణము : విశ్వామిత్రుని ఆదరోక్తి
॥విశ్వామిత్రుని ఆదరోక్తి॥
95
“నాతండ్రి! రఘువర! -నాటుగా నిపుడు
నీతండ్రి రాజ్యంబు -నెమ్మదిగాను
96
పాలింప యువరాజ -పట్టభద్రుండ
వైలలితసుఖంబు -లనుభవింపకను
97
ఎలుకలు ద్రవ్విన-యింటి చందమునఁ
గలఁగుచు దిగఁబడఁ -గారణంబేమి?
98
పట్టైన యౌవన-ప్రాయంబునందు
నెట్టన సుఖముల-నేఁబొందవలయు,
99
నట్టిచందము మాని-యార్తిఁ బొందితివి;
ఇట్టిమనోవ్యథ-యేల జనించె? “
100
ననిపెక్కువిధముల-నమ్మునీశ్వరుఁడు
నెనరుతో నడుగగా, -నృపనందనుండు
101
మరల నంజలిఁ జేసి -మౌని నీక్షించి
కరఁగుచు గద్గద-కంఠుఁడై పలికె