ఆది ప్రకరణము : రచనోద్దేశము
॥రచనోద్దేశము॥
ధరణిమీఁద మదాత్మ -తరియించు కొఱకు
*టీక:- తరియించు- సమసార బంధములు దాటు.
5
సామోదమతిని సు-జ్ఞానవాసిష్ఠ
రామాయణార్థసా-రమును గ్రహించి,
6
వరుసగా ద్విపద కా-వ్యముగా రచించి
యఱలేక మీకు స-మర్పింతు నిపుడు,
అఱలేక- వెనుదీయక, సందేహము లేకుండ
7
శ్రీతారకోల్లాస! -శ్రీ శ్రీనివాస!
శ్రీతరిగొండ నృ-సింహ! ధూతాంహ!
*టీక:- తారకోల్లాసుడు- కష్టాలనుండి తరింపజేయుట యందు ఉల్లాసము కలవాడు, వేంకటేశ్వరుడు.
ధూతాంహ- పాపములను ఎగురగొట్టువాడ, ధూత (ఎగురగొట్టువాడు) అంహ (పాపము)
8
విన్నవించెద నేను -వినుఁ డదె ట్లనిన