వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : విశ్వామిత్రుని వంశము

విశ్వామిత్రుని వంశము

శోణనదీ తీర ప్రదేశము గురించి అడిగిన శ్రీరామునికి విశ్వామిత్ర మహర్షి చెప్పిన తన వంశ వృత్తాంతము.

32వ సర్గ-
1 విశ్వామిత్ర మహర్షి వంశమునకు మూలపురుషుడు కుశుడు
బ్రహ్మదేవుని మానసపుత్రుడు, అయోనిజుడు కుశుడు- భార్య వైదర్భి. వారికి కుమారులు నలుగురు
కుశ.1/1) కుశాంబుడు, కుశ.1/2) కుశనాభుడు, కుశ.1/3) అదూర్తవర్తనుడు, కుశ.1/4) వసువు
కుశ.1/1) కుశాంబుడు, కౌశంబి అను పురము నిర్మించి పాలించెను
కుశ.1/2) కుశనాభుడు, మహోదయము అను పురము నిర్మించి పాలించెను
కుశ.31/4) అదూర్తరజసుడు, ధర్మారణ్యము అను పురము నిర్మించి పాలించెను
కుశ.1/4) వసువు, గిరివ్రజము అను పురము నిర్మించి పాలించెను
గిరివ్రజము ఐదు ప్రముఖ పర్వతముల నడుమ ఉన్నది. ఇక్కడ మగధ దేశములో ప్రసిద్దమైన శోణ లేదా సుమాగధి అను నదము ప్రవహిస్తున్నది..

33 సర్గ-
కుశ.1/2) కుశనాభునికి అప్సరస ఘృతాచి యందు నూఱుగురు పుత్రికలు
చూళీ మహామునికి, ఊర్మిళ కూతురైన సోమదా అను గంధర్వస్త్రీ యందు కొడుకు బ్రహ్మదత్తుడు, (చూళీ మహాముని మానస పుత్రుడు అని ప్రసిద్దుడు)
కుశనాభుని కుమార్తెలు వందమందికి భర్త ఛూళీ మానస పుత్రుడైన బ్రహ్మదత్తుడు. వీరి నగరం కాపిల్య

1-34వ సర్గ
కుశ.1/2) కుశనాభుని కుమారుడు కుశ.2 గాధి
కుశ.2) గాధి కూతురు విశ్వామిత్రుని అక్క సత్యవతి (కౌశకి) భర్త ఋచీకుడు. సత్యవతీ దేవి పిమ్మట కౌశకీ నది ఆయెను.
కుశ.2) గాధి కుమారుడు కుశ.3) విశ్వామిత్రుడు / కౌశికుడు.
- - - - - - -