వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : విశ్వామిత్ర-పరివర్తనలు

విశ్వామిత్రుని పరివర్తనలు

1) 56వ సర్గ వరకు రాజు

57వ సర్గ
బ్రహ్మర్షి వసిష్ఠులవారి అనుగ్రహంతో జనించిన వైర భావ పూరిత గర్వము. తత్భంగము. దిశానిర్దేశము చేసాయి. బ్రహ్మర్షి కావలెననను సంకల్పము, దృఢ సంకల్పము, బ్రహ్మ సంకల్పము పొందెను
బహిర్దృష్టి విజయములకన్నా ఆంతర్దృష్టి సంయమనం అత్యున్నతమైనవి అని అవగాహన
-----------------------------------------------------

2) రాజర్షి అగుట
తపస్సు చేసిన దిక్కు దక్షిణము
శీతోష్టాది సంయమనం
బ్రహ్మదేవ ఉవాచ

1.57.5.అనుష్టుప్.
జితా రాజర్షిలోకాస్తే
తపసా కుశికాత్మజ।
అనేన తపసా త్వాం తు
రాజర్షిరితి విద్మహే"॥

తా.:- ఓ కుశికనందనా ! విశ్వామిత్రా! నీయొక్క తపశ్శక్తిచే రాజర్షులు సమాజములో స్థిరపడితివి. ఈ తపస్సుచే నిన్ను రాజర్షిగా గుర్తించుచున్నాను. త్రిశంకు, శునశ్శేపుల వృత్తాంతములు.
----------------------------------------------------- 

3) విశ్వామిత్రుడు ఋషి అగుట
తపస్సు చేసిన దిక్కు పశ్చిమము, పుష్కర తీరము
అహంకారం వలన అపకారం తెలియుట
బ్రహ్మదేవ ఉవాచ

1.63.2.అనుష్టుప్.
అబ్రవీత్ సుమహాతేజా
బ్రహ్మా సురుచిరం వచః।
“ఋషిస్త్వమసి భద్రం తే
స్వార్జితైః కర్మభిః శుభైః ॥

తా.:- గొప్ప తేజోవంతుడైన బ్రహ్మ, విశ్వామిత్రునితో "నీవు స్వయముగా చేసిన పుణ్య కర్మలవలన ఋషివైతివి. నీకు శుభమగుగాక", అని మధురమైన వాక్యమును పలికెను.
-----------------------------------------------------

మేనక రూప విఘ్నము
4) మహర్షిత్వము పొందుట
తపస్సు చేసిన దిక్కు ఉత్తరము
కామ మోహముల విసర్జన
బ్రహ్మదేవ ఉవాచ

1.63.18.అనుష్టుప్.
“మహర్షే! స్వాగతం వత్స!
తపసోగ్రేణ తోషితః ।
మహత్త్వ మృషిముఖ్యత్వమ్
దదామి తవ కౌశిక!" ॥

తా.:- “తనయుడా! విశ్వామిత్రా! నీవు ఆచరించిన ఉగ్రమైన తపస్సునకు సంతోషించి నీకు మహర్షిత్వమును ఇచ్చుచున్నాను. నీవు మహర్షివి.”
-----------------------------------------------------

రంభయత్నం కోప ప్రదర్శన
మౌన వ్రతము ఇంద్రియ జయం సాధించుట

  5) బ్రహ్మర్షిత్వము పొందుట
తపస్సు చేసిన దిక్కు ఉత్తరము, హిమవత్పర్వతముపై

1.65.18.అనుష్టుప్.
తతః సురగణాః సర్వే
పితామహ పురోగమాః ।
విశ్వామిత్రం మహాత్మానమ్
వాక్యం మధురమబ్రువన్ ॥

తా.:- పిమ్మట దేవత లందరు బ్రహ్మదేవుని ముందుంచుకుని వచ్చి మహాత్ముడైన విశ్వామిత్రునితో తీయని మాటలుతో ఇలా చెప్పిరి.

1.65.19.అనుష్టుప్.
“బ్రహ్మర్షే! స్వాగతం తేఽ స్తుbr> తపసా స్మ సుతోషితాః ।
బ్రాహ్మణ్యం తపసోగ్రేణ
ప్రాప్తవానసి కౌశిక! ॥

తా.:- “ఓ బ్రహ్మర్షీ! నీకు స్వాగత మగుగాక. నీ తపస్సునకు మిగుల సంతోషించితిమి. నీవు ఉగ్రతపస్సుచేత బ్రాహ్మణత్వమును పొందితివి.

1.65.20.అనుష్టుప్.
దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్
దదామి సమరుద్గణః ।
స్వస్తి ప్రాప్నుహి భద్రం తే
గచ్ఛ సౌమ్య యథాసుఖమ్" ॥

తా.:- ఓ బ్రాహ్మణా! ఈ మరుత్తులను దేవగణములతో కూడి యున్న నేను నీకు దీర్గాయుర్దాయమును ఇచ్చుచున్నాను. క్షేమము పొందుము. నీకు భద్ర మగును. ఓ సౌమ్యుడా! నీకు సుఖమగు విధముగా సంచరించుము.”
- గమనిక- అనేక వేల సంవత్సరముల తపోఫలము రజోగుణాన్విత క్షత్రియ వర్ణము నుండి సత్త్వగుణాన్విత బ్రాహ్మర్షిత్వము.
-----------------------------------------------------