వ్యాసములు : విశ్వామిత్ర పదార్థము
విశ్వామిత్ర పదార్థము
1.''విశ్వేషాం మిత్ర:/మిత్రమ్'' అందరకును స్నేహితుడు అని శబ్దార్థం.
2. ఋషిని బోధింపకపోతే విశ్వమిత్రుడు, విశ్వ+మిత్ర,, విశ్వస్య అనే ఉంటుంది. అపుడు దీనికి సజ్జనుడు, విశ్వమిత్రుడనే బ్రహ్మచారి అనే అర్థం చెప్పాలి.
3. విశ్వామిత్రుడు ఒక ఋషి. విశ్వ+మిత్రుడు అనేది బహువ్రీహి సమాసం. ఈ సమాసం లోని పూర్వ శబ్దం ''మిత్రే చర్షౌ '' (మిత్రే-చ-ఋషౌ) అష్టాధ్యాయి 6-3-130) అనే సూత్ర ప్రకారం ఋషిని బోధించే టపుడు 'విశ్వ' శబ్దానికి దీర్ఘం వచ్చి(''మిత్రేచ ఉత్తరపదే ఋషావభిధేయేవిశ్వస్య దీర్ఘో భవతి'') విశ్వామిత్రుడు అనే రూపం వస్తుంది.
4. ఋషిని బోధింపకపోతే విశ్వమిత్రుడు, విశ్వ+మిత్ర,, విశ్వస్య అనే ఉంటుంది. అపుడు దీనికి సజ్జనుడు, విశ్వమిత్రుడనే బ్రహ్మచారి అనే అర్థం చెప్పాలి.
5. విశ్వామిత్రము – విశ్య+అమిత్రము = చెడుపు, మోసము. శబ్ధార్థము
6. సూర్యవంశంలో పూరువు వంశములోని కుశుని కుమారుడు కుశాంబువు. వాని కుమారుడు గాధి. గాధి కుమార్తె ఋచికుని భార్య సత్యవతి మఱియు గాధి పుత్రుడు విశ్వరథుడు. విశ్వరథుడు నామాంతరములు గాధేయుడు, రథః రథముపైనుండి ఒక విలుకానితో యుద్దముచేయగల యోధుడు. మహారథుడు అంటే అనేక యోధులతో యుద్ధముచేయగల యోధుడు. ఈ కౌశికుడు కన్యాకుబ్జము నకు రాజు అని భారతములో ఉన్నది. కౌశికుడు. వశిష్ఠునితో స్పర్థ కారణంగా తీవ్రమైన తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ఋషిత్వము పొందినట్లు నిర్ధారించాడు. అలా విశ్వామిత్రుడు అయ్యాడు