వ్యాసములు : వైశాలులు పాఠ్యంతరములు
వైశాలులు పాఠ్యంతరములు
(అ) వాల్మీకి తెలుగు రామాయణము ఇక్ష్వాకునికి అప్సరస అలంబుస యందు కొడుకు విశాల నగర నిర్మాత 1) విశాలుడు.విశాలుని కొడుకు 2) హేయచంద్రుడు, అతని కొడుకు 3) సుచంద్రుడు, అతని కొడుకు 4) ధూమ్రాశ్వుడు, అతని కొడుకు 5) సృంజయుడు, అతని కొడుకు 6) సహదేవుడు, అతని కొడుకు 7) కుశాశ్వుడు, అతని కొడుకు 8) సోమదత్తుడు, అతని కొడుకు 9) కాకుత్స్థుడు, అతని కొడుకు 10) సుమతి
(ఆ) పోతన తెలుగు భాగవతము వైవస్వతమనువు కొడుకులు ఇక్ష్వాకుండును, నృగుండును, శర్యాతియు, దిష్టుండును, ధృష్టుండును, గరూశకుండును, నరిష్యంతుడును, బృషద్ధ్రుండును, నభగుండును, గవియు అందు దిష్టుని వంశంలోని తృణబిందునికి అప్సరస అలంబుస యందు విశాలుడు, శూన్యబంధుడు, ధూమ్రకేతుడు అని ముగ్గురు (3) పుత్రులు పుట్టారు. వారిలో 1) విశాలుడు వంశస్థాపకుడు అయ్యి, వైశాలి అనె పట్టణమును కట్టాడు. అతనికి 2) హేమచంద్రుడు; అతనికి 3) ధూమ్రాక్షుడు; అతనికి 4) సహదేవుడు; ఆ బలవంతునికి 5) కృశాశ్వుడు; అతనికి 6) సోమదత్తుడు; అతనికి 7) సుమతి పుట్టారు. వీరు వైశాలులు అని ప్రసిద్ధులు అయిరి.