వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : సహస్రాక్ష

సహస్రాక్ష

1.46.9.అనుష్టుప్
ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చుకుంటాడు. అదే సమయానికి గౌతముడు తిరిగి వచ్చి ఆమెని ఇంద్రుడిని శపిస్తాడు. అలాగ గౌతముడు ఇంద్రుణ్ణి శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. (వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించబడునట్లు చేసుకుంటాడు) అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు.