వ్యాసములు : సగరుని వంశము
సగరుని వంశం
బాల-38-39 సర్గలు
సగరుడు – అయోధ్యాధిపతి.
సగర.0) సగరుని పెద్ద భార్య విదర్భరాజు పుత్రిక “కేశిని” యందు కలిగిన పెద్ద కొడుకు “అసమంజసుడు”, (భృగు మహాముని వరము)
రెండవ భార్య “అరిష్టనేమి” అను పేరుగల “కశ్యపుని” కూతురును, అలా “గరుత్మంతుని” సోదరియును ఐన “సుమతి” యందు అరవైవేలమంది పుత్రులు. (భృగు మహాముని వరము). *గమనిక- సుమతి ఆనపకాయ వంటి పిండము ప్రసవించెను. అది పగిలి అరవైవేలమంది బయల్పడిరి. వారిని నేతి పాత్రలలో ఉంచి దాదిమాతలు వృద్దిచెందించిరి. సుదీర్ఘ కాలమునకు వారు యౌవనులైరి.
వీరికి గరుత్మంతుడు మేనమామ. అసమంజసునికి ఈ అరవైవేలమంది సవితి సోదరులు. వీరు తండ్రి యాగాశ్వమునకు వెళ్ళి కపిలుని కోపాగ్నికి బూడిద రాశులు అయ్యారు.
సగర.1/1 అసమంజసుని కొడుకు అంశుమంతునికి ఆ అరవైవేలమంది. చిన్నాన్నలు. యోగాశ్వాన్ని చినతండ్రులను వెదుకుచు వెళ్ళి. వారి బూడిద ఐరాశులను కనుగొనెను. యోగాశ్వమును వెనుకకు తెచ్చి, తండ్రి యాగము సంఫూర్ణము చేయించెను. చిన్నాన్నల బూడిద రాశులపై జలతర్పణ చేయుటకు జలముకై చూడగా చుట్టుప్రక్కల ఎక్కడా దొరకలేదు. నీటి జాడ గుర్తించుటకు ఆకాశంలో పక్షులకోసం దీర్ఘముగా చూస్తుండగా. తండ్రుల మేనమామ గరుత్మంతుడు వచ్చాడు. అతను “సాధారణ జలము ఇచ్చుట సరికాదు. హిమాలయాలనుండి గంగను తెచ్చి తడిపి జలతర్పణ చేయుము. వారికి ఉన్నతపదాలు అందుతాయి అని చెప్పాడు.” పాఠ్యంతరం పోతన తెలుగు భాగవతం ప్రకారం అంశుమంతుడు కపిలాశ్రమమునకు వెళ్ళి అశ్వమును, చిన్నాన్నల బూడిద కుప్పలు చూసి, ధ్యానంలో ఉన్న ఋషి కోసం నిలబడి ఉన్నాడు. ధ్యానంలోనుంచి బయటకు వచ్చాక ఏమి ప్రశ్నించకుండా నమస్కరించి నిలిచాడు. “గుఱ్ఱము గొనిపో బుద్దుల కుఱ్ఱఢ. . . మిఱ్ఱున గంగాజలంబు మెలగ శుభమగున్”. సగరుడు గంగను తేలేకపోయాడు, కాలంసాడు.
సగర.2/1) అరవైవేలమంది పుత్రులు
సగర.2/2) అంమంతునికి పుత్రుడు దిలీపుడు
సగర.3) దిలీపుడు
సగర.4) దిలీపుని పుత్రుడు భగీరథుడు గంగను సాధించెను