వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : రామావతరణకై దశరథుని యాగము

రామావతరణకై దశరథుని యాగము

 దశరధమహారాజు పుత్ర కామేష్టి యాగం చేయకపోయినా...దశరధమహారాజు కు పుత్రుడు/పుత్రులు కలుగుతారు.ఎందుకంటే ముని శాపం అనుభవించాలి. అనుభవించాలంటే ఖచ్చితంగా పుత్రులు కలుగుతారు.పుత్రవియోగం వలన ధశరధమహారాజు చనిపోతాడు.ఈ శాపం జరిగి తీరుతుంది. అందువలన పుత్రకామేష్టి యాగం చేయకపోయినా పుత్రులు కలుగుతారు (శాపం ఫలించటానికి).మహావిష్ణువు దశరధమహారాజు యొక్క ముగ్గురు భార్యలైన హ్రీ(కౌసల్య,)శ్రీ (కైకేయి)కీర్తి(సుమిత్ర) (15 వ సర్గ,19వ శ్లోకం)వారి ద్వారా అధర్వశిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విధ్యుక్తంగా పుత్రకామేష్టి యాగం చేయటవలన వచ్చిన దివ్యపాయసం ద్వారా మహావిష్ణువు 4 రూపాలుగా జన్మిస్తారు.దశరధమహారాజు పాపం చేసిన వాడైతే మహావిష్ణువు వారికి జన్మించరు.పుత్రప్రాప్తికై ప్రతిబంధకమైన పాపములు తొలగించుటకు,పుత్రలాభము ద్వారా స్వర్గము ప్రాప్తించునదియు, బహు కష్టసాధ్యమైన అశ్వమేధ యజ్ఞం చేసెను.(15 వ సర్గ,55వ శ్లోకం).ఈ శ్లోకం తప్పించి రామాయణం లో ఈ ప్రశ్న లో ఉన్న సందేహ ప్రశ్న ఉండియుండలేదు.తతః ప్రీతిమనా రాజా ప్రాప్య యజ్ఞ యనుత్తమమ్। పాపాపహం స్వర్నయనం దుష్కరం పార్ధివర్షభైః