వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : 1.65.29-బ్రాహ్మణోత్తముడు

బ్రాహ్మణోత్తముడు

 విశ్వామిత్రుడు గురించి, బ్రాహ్మణోత్తముడు గురించి గీతాప్రెస్ వారి రామాయణం 1.65.29లో ఇలా వివరిస్తున్నది. విశ్వామిత్రుని వృత్తాంతము వలన వెల్లడియగుచున్న విశేషములు. శతానందుడు తనతల్లయైన అహల్యాదేవికి శాపవిముక్తి లభించినందులకు ఎంతయు సంతసించెను. ఆ శాపవిముక్తిని కల్గించిన పుణ్యమూర్తి శ్రీరాముడు. దానికి ప్రేరణగూర్చిన మహాత్ముడు విశ్వామిత్రుడు. ఆ యిరువురును శతానందునకు పరమపూజ్యులు. ఆ పూజ్యభావముతోడనే శతానందుడు తనకు ఉపకారముచేసిన విశ్వామిత్రుని పవిత్రవైభవమును ప్రాసంగికముగా తెలిపెను. తమకు మేలుచేసినవారిని విస్మరింపకయుండుట సత్పురుషుల లక్షణము.

 (1) కామక్రోధములను జయించుట మిక్కిలి కష్టసాధ్యము.

  (2) కామక్రోధములను జయించినవాడే బ్రాహ్మణోత్తముడు (బ్రహ్మజ్ఞాని).

  (3) బ్రహ్మజ్ఞానము అబ్బుట అంత సులభము కాదు. (బ్రహ్మ పదము ముందు నిలిచిన అది అత్యంత అధికతమమైనది అని సూచన). (4) బ్రహ్మవేత్తకు అపచారము చేయువాని ప్రయత్నము లన్నింటికిని విఘ్నములు ఎదురగుచుచేయుయుండును. బ్రహ్మజ్ఞానియైన వసిష్ఠునియెడల అపచారము చేయుటవలననే విశ్వామిత్రుని తపస్సునకు పరంపరగా తీవ్రవిఘ్నములు ఏర్పడినివి.