వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : 2.7. - మంథర కన్న అయోధ్య

2.7. సర్గ మంథర కన్న అయోధ్య శోభలు

 యువరాజ పట్టాభిషేకమునకు అయోధ్యానగర శోభలు ఇలా, కైక దాసి మంథర కంటబడెను.. (1) కళ్ళాపి జల్లి, పూలతో అలంకరింపబడియున్న రాజమార్గములు. (2) స్వేచ్ఛగా తిరుగుటకైన విశాలమైన రాచబాటలు. (3) శ్రేష్ఠమైన యోగ్యమైన జెండాలు గల జెండా స్తంభములు. (4) తలస్నానము చేసిన జనులు. (5) రాచమార్గములో చేతులయందు పుష్పమాలలు, మోదకములు ధరించి గట్టిగా మంత్రోచ్చారణచేయుచున్న బ్రాహ్మణోత్తముల, (6) పరిశుభ్రమైన రాచనగరు. (7) పవిత్ర దేవాలయములు. (8) ఆ దేవాలయ ద్వారముల వద్ద మ్రోగుచున్న సకల వాద్యపరికరములు. (9) ఆనందముగా తిరుగుచున్న ప్రజలు కిక్కిరిసి ఉన్న రాజమార్గములు. (10) ఆ మార్గముల యందు మారుమ్రోగుచున్న వేదఘోషలు. (11) రాజ మారగమున ఉత్సాహముగా ఉన్న గజ తురగములు. (12) ఱంకెలు వేయు చున్న ఆంబోతులు రాజమాగ్గమున తిరుగుచున్నవి. (13) ఎంతో ఉల్లాసముగా ఉన్న సకల పౌరులు. (14) ఎత్తైన జెండా స్తంభముల పంక్తులు.