వ్యాసములు : 2.14.- పట్టాభిషేక సామగ్రి
2.14.సర్గ- పట్టాభిషేక సామగ్రి
గంగాజలము నింపినవి, సముద్ర జలాలతో నింపినవి అగు బంగారు కలశములు, మేడికఱ్ఱతో చేసిన భద్రపీఠము, అన్ని రకముల ధాన్యములు, అనేక రకములైన గంధములు, రత్నములు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు, అందమైన ఎనమండుగురు కన్యలు, శ్రేష్ఠమైన మదపుటేనుగులు, నాలుగు గుఱ్ఱాల గొప్ప రథము, ఖడ్గము, ఉత్తమమైన ధనుస్సు, బోయలతో కూడిన పల్లకీ, చంద్రసదృశమైన ఛత్రమూ. తెల్లని వింజామరలు, బంగారు పాత్రలు, బంగారు పగ్గాలతో కట్టబడిన పెద్ద మూపురము కల తెల్లని ఎద్దు. అందమైన జూలు కల సింహము, నాలుగు పెద్ద దంతములు కల ఏనుగు, మంచి బలమైనది అగు శ్రేష్ఠమైన గుఱ్ఱము, సింహాసనము, వ్యాఘ్రచర్మము, ప్రకాశవంతమైన అగ్ని, సకలవాద్య సమూహాలు, అలంకరించుకున్న వేశ్యలు, స్త్రీలు, ఆచార్యులు, బ్రాహ్మణులు, పవిత్రమైన గోవులు, మృగాలు, పక్షులు, శ్రేష్ఠులైన పురజనులు, గ్రామీణులూ, వర్తకులు, ఇంకను ఎంతోమంది ఇష్టులు. రాజులు