వ్యాసములు : 2.13.1.- యయాతి
2.13.1. యయాతి
యయాతి- వ్యుత్పత్తి. య+యాతి, యస్య వాయురివ యాతి సర్వత్ర, వాయువు వలె అంతట సంచరించువాడు. చంద్రవంశపు చక్రవర్తి. ప్రియంవద నహుషుల కుమారుడు. నహుషునికి అనంతరము మహాఖ్యాతితో రాజ్యము ఏలెను. అతిఘోర తపముచేసి, బ్రహ్మలోకము మొదలుగాఁగల దేవలోకములు అన్ని తిరిగి ఇంద్రలోకమునకు పోయి ఇంద్రునితో తన తపోమాహాత్మ్యమును పొగుడుకొనెను. అందులకు ఇంద్రుఁడు సహింపక ఆత్మస్తుతి చేసికొనువారు ఈలోకమున ఉండను అర్హులు కారు అని అతనిని అధోలోకమున పడత్రోసెను. అంత యయాతి ఖిన్నుఁడు అయి ఇంతకాలము తపముచేసి ఈలోకమునకు వచ్చి మరల భూలోకమునకు పోలేను. నన్ను మన్నించి సద్భువనమున (నక్షత్రలోకమున) ఉండునట్లు అనుగ్రహింపుము అని వేఁడఁగా అతఁడు అట్లె అనుగ్రహించెను. పాఠ్యంతరము. పిదప ఇంద్రుని అనుద్రహముతో యయాతి సాధువుల మధ్య పడెను. వారి సాంగత్యమువలన అతడు దుఃఖవిమిక్తుడయ్యెను. గీతా ప్రెస్సు వారి రామాయణము.